అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/చరితార్థుడు స్వామీ కేశవానంద భారతి
పెండ్యాల సత్యనారాయణ 95664 42034
చరితార్థుడు స్వామీ కేశవానంద భారతి
ఆయన ఒక సన్యాసి. సర్వసంగ పరిత్యాగి. తన కోసం ఏదీ కోరుకోదు. తన గురించి అలోచించడు. ఆయన ఆలోచించేది తాను నమ్మిన సిద్ధాంతం గురించి, ఆ సిద్ధాంతాన్ని విశ్వసించే ప్రజలను గురించి. ఒక చిన్న అశ్రమమే అయన స్‌వాసం. అయితేనేం, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో, భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డ ప్రాథమిక హక్కులను సంబంధిత ప్రజా ప్రభుత్వమే హరించివేయటాన్ని సహించలేని ఆ సన్యాసి, ప్రభుత్వంపైనే యుద్దాన్ని ప్రకటించాడు. ప్రాథమిక హక్కుల సంరక్షకుడిగా భారత రాజ్యాంగ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. చరితార్భుడైనాదు. ఆయనే, సెప్టెంబరు ఆరవ తేదీన తుది ఊపిరి విడిచిన స్వామీ కేశవానంద భారతి.
కేరళలోని ఎడనీర్ మఠానికి అధిపతి కేశవానంద భారతి. భూసంస్కరణలలో భాగంగా, ఎడనీర్ మఠానికి చెందిన ఆస్తులను అప్పటి కేరళ రాష్ట్ర ప్రభుత్వం జాతీయం చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ, కేశవానంద భారతి, కేరళ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ అప్పీలులో స్వామీజీకి పాక్షికంగానే ఉపశమనం లభించటంతో, సుప్రీం కోర్టును ఆయించారు. ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది నానీ ఫాల్మీవాలా, ఆ అప్పీలును దాఖలు చేశారు. ఆ క్రమంలో ఫాల్మీవాలా ఒక సాహసం చేశారు. అప్పటికే ఇందిరాగాంధీ ప్రభుత్వం, ప్రాథమిక హక్కులకు కోత పెడుతూ, పార్లమెంటు చేసే రాజ్యాంగ సవరణలపై సుప్రీంకోర్చ సమీక్ష జరిపే అవకాశంలేని విధంగా రాజ్యాంగంలోని 24, 25, 26, 29 అధికరణాలను నవరించింది. ఆ సవరణల ద్వారా పార్లమెంటుకు మ్రర్తి అధికారాలు నంక్రమించబడ్డాయి. ఈ వరిన్ఫితిని ఫాల్కీవాలా జీర్ణించుకోలేకపోయారు.. కేరళ భూసంన్మరణల చట్టాన్ని, ప్రాథమిక హక్కులతో ముడిపెట్టారు. కేరళ భూసంస్మరణల చట్టంతోబాటు, 24, 25, 26 29 రాజ్యాంగ సవరణలను కూడా ప్రశ్నిస్తూ కేశవానంద భారతి తరఫున అప్పీలు దాఖలు చేశారు ఫాల్మీవాలా.
కేశవానంద భారతి తరఫున దాఖలైన ఈ అప్పీలును విచారించి, రాజ్యాంగ ధర్మసంకటాన్ని తీర్చటానికి 18 మంది సువ్రీంకోర్మ న్యాయమూర్తులతో విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. సుప్రీంకోర్టు చరిత్రలో ఇంత పెద్ద ధర్మాసనం అంతకు పూర్వంగాని, ఆ తర్వాతగాని ఇప్పటివరకు ఏర్పడలేదు. ప్రాథమిక హక్కులు, భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం, పార్లమెంటుకు గల రాజ్యాంగ సవరణాధికారం, ఆ క్రమంలో సాధారణ సవరణలకు, ప్రాథమిక హక్కులకు సంబంధించిన రాజ్యాంగ సవరణలకు మధ్యగల తేదా, పార్లమెంటు చేసే రాజ్యాంగ సవరణలను సుప్రీంకోర్టు సమీక్షించవచ్చా, సుప్రీంకోర్టుకుగల న్యాయసమీక్షాధికార పరిమితులు తదితర ఎన్నో అంశాలపై ధర్మాసనం సుదీర్ధంగా విచారణ జరిపింది. చివరకు 703 పేజీలతో సమగ్రమైన తీర్పును వెలువరించింది. (కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఎఐఆర్ 1973, సుప్రీంకోర్టు, పేజీ 1461).
అయితే ఎవరూ ఊహించని విధంగా సుప్రీంకోర్టు ధర్మాసనం అటూ ఇటూకాని ఒక విచిత్రమైన తీర్పును వెలువరించింది. సరి కొత్త గందరగోళానికి తెరతీసింది. ఆ క్రమంలో ధర్మాసనంలోని న్యాయమూర్తులు రెండు నగాలుగా చీలిపోయారు. హెగ్దే, జగన్మోహన రెడ్డి, ముఖర్జి, సిక్రి, (గ్రోవర్, షెలలు (ఆరుగురు న్యాయమూర్తులు), రాజ్యాంగ సవరణలపై పార్లమెంటుకు గల అధికారాలపై రాజ్యాంగంలోనే అంతర్లీనంగా పరిమితులున్నాయని, అందువలన రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చే విధంగా రాజ్యాంగాన్ని నవరించే అధికారం పార్శవెంటుకు లేదని అభిప్రాయపడ్డారు. అయితే, చంద్రచూడ్, బేగ్, మాథ్యూ, ఎ.ఎన్.రే. ద్వివేది, పాలేకర్సు (ఆరుగురు న్యాయమూర్తులు) మాత్రం, రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు పూర్తిగా ఉన్నదని అభిప్రాయపడ్డారు. చివరగా, మిగిలిన పదమూడవ న్యాయమూర్తి జస్టిన్ ఖన్నా అభిప్రాయం నిర్ణయాత్మకంగా మారింది.
చాలా అంశాలపై గోడ మీది పిల్లివాటంలాగా ఊగినలాడిన ఖన్నా చివరకు, రాజ్యాంగాన్ని నవరించే సంవూర్జాదికారం పార్లమెంటుకు ఉన్నదంటూనే, ఆ పేరుతో రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించరాదంటూ, హెడ్లే తదితరులతో ఏకీభవించారు. దీనితో, 7-6 తేడాతో కేశవానంద భారతి కేసులో తీర్పు వెలువడింది. పర్యవసానంగా, రాజ్యాంగ మౌలిక స్వభావానికి విరుద్ధం కాని విధంగా, ప్రాథమిక వాక్కులకు సంబంధించిన అధికరణాలతో సహా రాజ్యాంగంలోని ఏ అధికరణాన్ని అయినా నవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుందన్న వాదనకు ఆమోదముద్ర వేయ బడింది.
కేశవానంద భారతి కేనులో సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పు సారాంశం ఏమిటంటే, రాజ్యాంగం ఉన్నతమైనది. అందువలన రాజ్యాంగం యొక్క మౌలిక లక్ష్యాలకు విరుద్ధంగా రాజ్యాంగాన్ని సవరించరాదు. ఆ విధంగా నవరించినట్లయితే, అటువంటి రాజ్యాంగ సవరణలపై ఉన్నత న్యాయస్థానం న్యాయ సమీక్ష చేయవచ్చు. ప్రాథమికహక్కులు అనేవి ఒకరు ఇచ్చేవి కావు. రాజ్యాంగం యెఐక్క మౌలిక లక్ష్యంలో ప్రాథమిళకవాక్కులు అంతర్భాగం. ఈ విధంగా ప్రాథమికహక్కులకు ఒక విధమైన రాజ్యాంగ భద్రతను కల్పించిన వ్యక్తి కేశవానంద భారతి. నిజానికి ఈ తీర్పువలన కేశవానంద భారతికిగాని ఆయన మఠానికి గాని ప్రత్యేకంగా ఒరిగింది ఏమీ లేదు. కానీ ఈ తీర్పు ద్వారా పరోక్షంగా, ప్రజల ప్రాధమిక హక్కుల పరిరక్షణకు దోహదపడ్డ మహనీయుడు కేశవానంద భారతి.
ఈ నేపథ్యంలో (ప్రాథమిక హక్కులు, పార్లమెంటుకుగల రాజ్యాంగ సవరణాధికారాలు, ఉన్నత న్యాయస్థానానికి గల న్యాయ సమీక్షాధికారం గురించి నంక్షిప్తంగానైనా తెలునుకోవటం అవసరం. ఎందుకంటే, ఈ రగడ కేశవానంద భారతితో మొదలు కాలేదు, కేశవానంద భారతితో ముగిసిపోలేదు. రావణ కాష్ట్రంలా 1951 నుండి (రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటినుండి) ఇప్పటిదాకా కాలుతూనే ఉన్నది, ఇక ముందూ కాలుతూనే ఉంటుంది.
భారత రాజ్యాంగంలోని మూడవ విభాగంలో [ప్రాథమిక హక్కులు పొందుపరచబడ్డాయి. ఐక్యరాజ్య సమితిచే ఆమోదించబడ్డ మానవహక్కులే మన రాజ్యాంగంలోని (ప్రాథమిక వాక్కులని భావించుకోవచ్చు. మానవుని పరిపూర్ణ వ్యక్తిత్వానికి ప్రతిరూపమే మానవవాక్కులు. జీవించే వాక్కు భావప్రకటనా వాక్కు మొదలైనవన్నీ మానవ హక్షులే. ఈ మానవహక్కులు ఎవరో ఇచ్చేవి కావు. ప్రకృతి పరంగా సహజసిద్ధమైనవి. అందువలన ఇటువంటి హక్కులను ఎవరో ఇవ్వటం, హరించివేయటం అనేది అసంబద్దం. ఈ మానవ హక్కులకు ప్రభుత్వాలు సంరక్షకులు మాత్రమే. ఈ మానవ హక్కులను సంరక్షించి, ప్రజలందరూ అనుభవించే అవకాశాన్ని పరిస్థితులను కల్పించటమే ప్రభుత్వాల విధి, బాధ్యత. ఈ సూత్రీకరణ పైనే మానవ హక్కుల నిద్ధాంతం ఆవిష్కరింప బడింది. ఇవన్నీ నీతి నూత్రాలలాగానే వినటానికి బాగానే ఉంటాయి. కానీ, ప్రపంచంలో ఎక్కడా ఈ సూత్రం ఆచరణలో లేదు. ప్రపంచ వ్యాపితంగా అన్ని దేశాలలో, అన్ని ప్రభుత్వాలూ మానవహక్కుల ఉల్లవునకు పాల్పడుతున్నాయి. ఇది గతం, వర్తమానం, భవిష్యత్తు కూడా. ఇది ఒక పెద్ద వివాదాస్పదమైన అంశం. అందువలన ఆ అంశాన్ని ప్రక్కకుబెట్టి, మన దేశంలో (పాథమికవాక్కులపై కేశవానంద భారతి తీర్చు ప్రభావాన్ని పర్యవపానాన్ని విశ్లేషించుకుందాం.
ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా, నిజానికి కేశవానంద భారతి కేసులో తీర్పు ద్వారా పార్లమెంటుదే సర్వాధికారం అన్నది నిర్ధారణ అయింది.
కాన్సీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన రాజ్యాంగ సవరణలపై న్యాయసమీక్ష చేసే అధికారం ఉన్నతన్యాయస్థానాలకు ఉంటుందన్న అంశాన్ని మాత్రం పెట్టుబడిదారీ అనుకూల రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు జీర్ణించుకోలేక పోయాయి.
అనలు ప్రాథవిక హక్కులపై ఇంత రగడ ఎందుకు? ఎందుకంటే, ప్రాథమిక హక్కులపట్ల రాజ్యాంగ నిర్మాతలకే గౌరవం లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు. రాజ్యాంగ నిర్మాతలు, రాజ్యాంగాన్ని రచించిన వారంతా భారతదేశంలో అత్యల్ప శాతంగా ఉన్న థధనికవర్గానికి, దోపిడీ వర్షానికి ప్రతినిధులే, ఆ వర్షానికి సంబంధించినవారే. అందువలన దేశంలో అత్యధిక శాతంగా ఉన్న కార్మికులకు, కర్షకులకు, పేదలకు, బడుగు, బలహీన వర్గాల వారికి (ప్రాథమిక హక్కులను కల్పించటం రాజ్యాంగ నిర్మాతలకు ఇష్టం లేదు.
కానీ ఆ విషయం బహిరంగంగా చెబితే, ఇబ్బంది కనుక, ప్రాధమిక వాక్కులను రాజ్యాంగంలో పొందు పరున్తూనే, హేతుబద్ధమైన పరిమితులు, ఆంక్షలు పేరుతో ప్రాథమిక హక్కులకు సంకెళ్ళు వేశారు. ఇది ఒక రకంగా ఒక చేత్తో ఇచ్చి, మరొక చేత్తో వెనుకకు తీసుకోవటంగా ఉంటుంది. నిశితంగా పరిశీలిస్తే అసలు భారత రాజ్యాంగంలోని ప్రజాస్వామ్యం అనేదే అంతా ఒక మాయ, కనికట్టు. ఈ అభిప్రాయంతో చాలామంది పాఠకులు విభేదించవచ్చు.
కానీ ఇది వాస్తవం. ఒక చిన్న ఉదాహరణ. వయోజన ఓటు హక్కు అంటూ, 21 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కును కల్పించింది మన రాజ్యాంగం. 1951 నాటికి భారత దేశంలో ఎక్కువ శాతం [ప్రజలు అజ్ఞానులు, నిరక్షరాళ్యులు. రాజకీయ పరిణత శూన్యం. (ఇప్పటికీ మన దేశంలో నిరక్షరాశ్యుల సంఖ్య కొన్ని కోట్లలో ఉన్నది). అటువంటి ప్రజలు తమ ఓటు హక్కును సక్రమంగా ఎలా వినియోగించగలరు? ఆ హక్కును సక్రమంగా వినియోగించలేకపోయినప్పుడు ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ప్రజాస్వామ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ వాస్తవం రాజ్యాంగ నిర్మాతలకు తెలియదా. తెలుసు. అయినా తెలిసి ఈ విధమైన ఓటు హక్కును ఎందుకు కల్పించారు? నిజాయితీతో ఆలోచిస్తే సమాధానం సులభంగానే దొరుకుతుంది. ఈ దేశంలో (వజాస్వామ్యం ఒక మాయ. కనికట్టు. ఉన్నది లేనట్లుగా (భ్రమింపచేయటం. రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నది ఇదే.
ఇక్కడ మరొక దేవ రహస్యం కూడా ఉన్నది. అక్షరాశ్యత వేరు, రాజకీయ పరిణతవేరు. ఇప్పటికీ అక్షరాశ్యులు, ఉన్నత విద్యావంతులలో ఎంత మందికి స్పష్టమైన రాజకీయ అవగాహన ఉన్నది? ఓటు వేస్తున్న ఉన్నత విద్యావంతుల వద్దకు వెళ్ళి వివిధ రాజకీయ పార్టీల సిద్ధాంతాలను గురించి వారికున్న అవగాహనను చెప్పమనండి. చెప్పరు, చేప్పలేరు. ఎందుకంటే ఆ విషయంలో వారికి రాజకీయ పరిణత శూన్యం కనుక. అందుకే ఇటువంటి ప్రయత్నాన్ని ఏ ప్రసార మాధ్యమాలూ ఇప్పటివరకు చేయలేదు, ఇక ముందూ చేయవు. ఎందుకంటే ఆ విధంగా చేస్తే అసలు బండారం బయట వడుతుంది. నడువలేని స్థితిలో ఉన్న వయో వృద్ధులు, ఎవరి సహాయంతోనో పోలింగ్ బూత్ వద్దకు ఓటు వేయటానికి వస్తారు. ఇది మన దేశంలో వ్రజాస్వామ్యం వర్టిల్లిందనటానికి నిదర్శనమంటూ (వ్రసార మాధ్యమాలు శ్లాఘిస్తాయి. ఆ వయో వృద్ధుడి క్లిప్పింగును టీవీ ఛానళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రదర్శిస్తుంటాయి. అంతే తప్ప, ఏ విలేఖరీ ఆ వృద్ధుడి వద్దకు వెళ్ళి, తాతా, ఈ దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాటి సిద్ధాంతాలను గురించి నీకు తెలుసా అని ప్రశ్నించవు. ఎందుకని? ప్రశ్చిస్తే, అసలు బండారం బయట వడుతుంది. ఇక నిరక్షరాశ్యుల మాట చెప్పేదేముంది. (భారత రాజ్యాంగ నిర్మాతలను గురించి, వయోజన ఓటు హక్కు గురించి, భారతదేశంలో (ప్రజాస్వామ్యం గురించి నేను వ్యక్తీకరించిన అభిప్రాయాలతో కొందరు పాఠకులు ఏకీభవించకపోవచ్చు. అయితే, ఓటర్లలో రాజకీయ పరిణత ఉండి, సరైన రాజకీయ అవగాహనతో ఓటు హక్కును వినియోగించినట్లయితే, మన దేశంలో (ప్రజాస్వామ్యం ఇటువంటి దయనీయ స్థితిలో ఉండేది కాదని, రౌడీలు, గూండాలు, ఐడా పారిశ్రామిక వేత్తలు, ఆర్ధిక నేరగాళ్ళు, మానభంగం, హత్య తదితర నేరాలకు పాల్పడ్డ నేరస్తులు చట్ట సభలకు ఎన్నికయ్యే దుస్థితి దాపురించేది కాదన్న వాస్తవంతో పాఠకులు ఏకీభవిస్తారన్న నమ్మకం నాకున్నది).
ఈ దేశంలో ప్రజాస్వామ్యం మాయ అయినప్పటికి, ఆ రహస్యం బయటకు కనిపించకుండా చేసే ప్రయత్నంలో భాగమే రాజ్యాంగం మూడవ విభాగంలోని ప్రాథమికహక్కులు. అదే క్రమంలో ప్రాథమికహక్కులకు విరుద్ధమైన చట్టాలపై న్యాయసమీక్ష జరిపే అధికారాన్ని న్యాయస్థానాలకు నంక్రమింప చేయటం జరిగింది. ఈ అంశానికి నంబంధించి. రాజ్యాంగ నిర్మాతల ఆలోచన ఏవిధంగా ఉన్నప్పటికి, ఆచరణలో, ఈ ఏర్పాటు, పాలక వర్గాలకు తలనొప్పిగా మారింది. ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ప్రభుత్వాలు తీసుకున్న అనేక చర్యలు, చట్టాలకు న్యాయస్థానాల నుండి ఎదురు దెబ్బలు తగలటం ప్రారంభం అయింది. ఈ పరిస్థితిని జీర్ణించుకోలేని పాలకవర్గాలు, న్యాయస్థానాలకున్న న్యాయ నమీక్షాధికారాలను కుదించివేయటానికి, వారించివేయటానికి ప్రయత్నాలు చేయటం ప్రారంభించాయి. ప్రజాతంత్ర వాదులు ఇందుకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ పోరాటంలో ఒక భాగమే, కేశవానంద భారతి కేసు.
న్యాయ సమీక్షాధికారానికి సంబంధించి, న్యాయవ్యవస్థకు, పాలక వర్గాలకు (ప్రభుత్వానికి) మధ్య పోరాటం నిజానికి 1950లోనే ప్రముఖ పార్లమెంటేరియన్, కమ్యునిస్టు పార్టీకి చెందిన ఎ.కె. గోపాలన్ అక్రమ నిర్బంధంతోనే ప్రారంభం అయింది. ప్రాథమిక హక్కులను హరించే విధంగా చట్టాలను చేసే అధికారం పార్లమెంటుకు లేదని ఆ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. వెంటనే ప్రభుత్వం, రాజ్యాంగాన్ని సవరించింది. తొమ్మిదవ షెడ్యూలును అదనంగా చేర్చటం జరిగింది. తొమ్మిదవ షెడ్యూలులో చేర్చబడిన చట్టాలపై న్యాయస్థానాలకు న్యాయసమీక్షాధికారం లేకుండా చేయబడింది. ఈ రాజ్యాంగసవరణ యొక్క జెచిత్యాన్ని ప్రశ్నించటం జరిగింది. శంకరీవ్రసాద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, రాజ్యాంగాన్ని సవరించే సంపూర్ణాధికారం పార్లమెంటుకు ఉన్నదన్న సుప్రీం కోర్టు, గతంలో, ఎ.కె. గోపాలన్ కేసులో ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. మరికొంత కాలం గడిచింది. 17వ రాజ్యాంగ సవరణ ద్వారా మరికొన్ని శాననాలను తొమ్మిదవ షెడ్యూలులో చేర్చటం వివాదగ్రస్తం అయింది. సుప్రీం కోర్టు మళ్ళీ జోక్యం చేసుకున్నది. 'పాథమిక వాక్కులను వారించే విధంగా చట్టాలను చేసే అధికారంగాని, రాజ్యాంగాన్ని సవరించే అదికారంగాని పార్లమెంటుకు లేదన్నది సుప్రీం కోర్టు. (గోలక్‌నాథ్ కేసు, 1971). దీనితో పాలకవర్గాలు ఖంగుతిన్నాయి. 24వ రాజ్యాంగ సవరణ ద్వారా సుప్రీంకోర్టుకుగల న్యాయ సమీక్షాధికారాలను కుదించటం జరిగింది. ఈ 24వ రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తూ దాఖలు చేయబడిన కేసే కేశవానంద భారతి కేసు. రాజ్యాంగం యొక్క మౌలిక లక్ష్యాలకు చట్టాలను రూపొందించే హక్కు పాలక వర్గాలకు లేదన్న సుప్రీం కోర్టు ఒక రకంగా పాలక వర్గాల నిరంకుశాధికారాలను పరిమితం చేసింది.
ఈ తీర్పుతో ఇందిరాగాంధీ, న్యాయవ్యవస్థపై తీవ్రంగా మండి వడింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని తెరపైకి తీసుకువచ్చిన ఆరుగురు న్యాయమూర్తులలో ఒకరైన ను్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన సిక్రీ, ఆ తీర్పు వెలువడిన మర్నాడే పదవీ విరమణ చేశారు. క్రొత్త ప్రధాన న్యాయమూర్తి నియామకంలో అవ్పటి వరకు నంవ్రదాయంగా వస్తున్న నీనియారిటీ సంప్రదాయాన్ని కాదని, తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన ఏ.ఎన్.రే ను సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమించింది ఇందిరాగాంధి. ఇందుకు నిరసనగా ఏ.ఎన్.రే ఖన్నా సీనియర్లయిన న్యాయ మూర్తులు షెలాత్, హెస్టే, (గ్రోవర్లు తమ వదవులకు రాజీనామా చేశారు. ఇందిరాగాంధీ అంతటితో శాంతించలేదు. రాజ్యాంగాన్ని మరింతగా సవరించింది. ప్రాథమిక హక్కులకు, న్యాయస్థానాల న్యాయనమీక్షాధికారానికి వ్యతిరేకంగా అనేక రాజ్యాంగ సవరణలు జరిగాయి. వాటిలో 1977లో జరిగిన 42వ రాజ్యాంగ నవరణ ముఖ్యమైనది. రాజ్యాంగంలోని చాలా అధికరణాలు ఆ సవరణ ద్వారా నవరించబడ్డాయి. (సుప్రీం కోర్చుకుగల న్యాయ నమీక్షాధికారాలకు కత్తెరవేన్తూ 368 అధికరణంలో (4), (5) క్లాజులను అదనంగా చేర్చటం, ఆ రాజ్యాంగ సవరణలలో అతి ముఖ్యమైనది). ఇది జరిగిన కొద్ది కాలానికే, రాయబరెల్లీ నుంచి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ తీర్పురావటం, ఎమర్జెన్సీ విధింపు, తదనంతర ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం, జనతాపార్టీ అధికారంలోకి రావటం, ఇందిరాగాంధీ కాలంలో తీనుకువచ్చిన అనేక రాజ్యాంగ సవరణలను, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేయటం తదితర పరిణామాలు సంభవించాయి.
కానీ విచిత్రం ఏమిటంటే, ఇందిరాగాంధీ పరిపాలనా కాలంలో జరిగిన చాలా రాజ్యాంగ సవరణలను రద్దు చేసిన జనతాపార్టీ (ప్రభుత్వం, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, సుప్రీం కోర్టుకుగల న్యాయసమీక్షాధికారాలకు కత్తెరవేస్తూ, 368 అధికరణంలో అదనంగా చేర్చబడ్డ (4), (5) క్లాజులను మాత్రం తొలగించలేదు. అంటే న్యాయవ్యవన్ళకు ఉన్న న్యాయన మీక్షాధికారాలను తొలగించటంలో అన్ని పార్టీలది, పాలకవర్గాలది, ఒకటే దారి నియంతృత్వ దారి. పౌరహక్కుల విధ్వంసక దారి.
(ప్రజాస్వామ్యం పేరుతో దోపిడీని కొనసాగించాలన్నది, పాలక వర్గాల ఏకైక మనోరథం. అది నెరవేరాలంటే, న్యాయస్థానాల అడ్డు తొలగాలి. న్యాయస్థానాలకు ఎటువంటి న్యాయ సమీక్షాధికారాలు ఉండరాదు. ఇందుకు సంబంధించిన పోరాటం కేశవానంద భారతి 'కేసుకన్నా ముందే ప్రారంభం అయింది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ఇక ముందూ కొనసాగుతుంది. ఈ పోరాటంలో తీర్పులు అటూ ఉంటాయి, ఇటూ ఉంటాయి. ఇందుకు కారణాలు ఏమిటన్నది మరొక (వ్రత్యేకమైన అంశం. ఆ అంళంలోకి పోవటానికి ఇది సందర్భం కాదు. ఏది ఏమైనప్పటికి, ఈ దేశంలో అత్యధికులైన కార్మిక, కర్షక, ఐదుగు, బలహీనవర్గాల ప్రాథమిక హక్కులకు సంబంధించిన అవిశ్రాంత పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉన్నదన్నది వాస్తవం. వారికి ప్రాథమిక హక్కులు నిరాకరింపబడుతున్నాయన్న విషయం వాస్తవం. ఆ విధంగా ప్రాథమిక హక్కులు నిరాకరింపబదు తున్నంతకాలం పోరాటం తప్పదు. ఆ పోరాటం కొనసాగినంతకాలం, భౌతికంగా మన మధ్య లేకపోయినా, స్వామీ కేశవానంద భారతి చిరంజీవిగా మన మధ్యే ఉంటాడు. అవిధంగా ఆయన ధన్యజీవి. తన జీవితాన్ని చరితార్థకం చేసుకున్న సర్వసంగ పరిత్యాగి.