అమ్మనుడి/సంపుటి 5/మే 2019/బుర్రకథ ఈరమ్మ-సంచారి ఆత్మకథ
కన్నడతోటలో విరిసిన తెలుగుపాట
బుర్రకథ ఈరమ్మ-సంచారి ఆత్మకథ
కన్నడ మూలం
అనువాదం
డా. నింగప్ప ముదేనూరు
రంగనాథ రామచంద్రరావు 9059779289
(ఏప్రిల్ సంచిక తరువాయి...)
చివరి రొజులు
( రెందు రోజులు చీకటి - రెండు రోజులు వెలుతురు)
ఈరమ్మది ఎన్నడూ ఇంకిపోనీ ఉత్సాహం.
వయన్సుకు తగినట్టు ముసలితనం ఆవరిన్తున్నప్పటికీ కావ్యగానంలో ఆమె ఇంకా యవ్వనవంతురాలు.
ముడుతలు పడ్డ చర్మం, కాంతివంతమైన ముఖం, చేతిలో తంబూర, చేతులకు మట్టి గాజులు, నుదురు నిందా విభూతి, వెండిలా తెల్లబడిన జుత్తు, సదా మెరుస్తున్న వెన్నెలలాంటి నవ్వు నోటిలో ఎర్రగా మెరుస్తున్న తాంబూలపు గుర్తులు చూస్తే భూమికి దిగిన అల్లమప్రభు అనుభావలోకమే దిగివచ్చినట్టుంది. 'నడిచినంతగా నాడు, పొందినంతగా భాగ్యం” అన్నది ఆమె అభి[ప్రాయం.
ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగానే ఉండేది.
ఆరోగ్యం కాపాడుకోవటం కోసం తానే స్వయంగా దివ్య బెషధాన్ని కనుక్కుని దాన్ని సేవిస్తున్నప్పటికీ ఎందుకో చివరి రోజుల్లో కృశించసాగింది.
గొంతుకు సున్నం పూసుకుని, నిరంతరం స్వరాలను, కథలను ధ్యానం చేస్తున్నట్టు ఉండేది.
ఈరమ్మకు గొంతులో ఏదో సమస్య తలెత్తింది.
దాంతో విచారంలో మునిగిపోయింది.
అయినప్పటికీ బుర్రకథా గానాన్ని ఆమె మానలేదు.
ఊరూరు తిరిగటం మానలేదు.
కథలు చెప్పటం ఆపలేదు.
చివరివరకూ కుమార రాముడి కావ్యాన్ని స్వాసి చిన్నమ్మ, బాలనాగమ్మ మహా కావ్యాలను గానం చేస్తూ జీవితాన్ని సాగించింది.
ఈరమ్మలోని ఆశు కవిత్వ ప్రతిభ అద్భుతమైంది.
కథలోని ఒక సంఘటన దొరికితే చాలు.
ఆ సంఘటనలోని ఒక పోగు పట్టుకునినా కథను ఇట్టే అల్లుకునిపోగల సామర్థ్యం ఆమె సొంతం.
ఊహల్లో అల్లుకున్న కథనాన్ని చక్కగా అఖివ్యక్తపరచగలిగే కళ ఆమెలో ఉంది.
కథావస్తువును గ్రహించి, దానికి మనస్సులోనే మెరుగులు దిద్దుకుని, తన సృజనాత్మకమైన కల్పనా చాతుర్యంతో శ్రొతలను మంత్రముగ్దులను చేసే శక్తి ఆమెలో ఉంది.
బు(ర్రకథలను పాడేటప్పుడు నృత్యం, అభినయం, కథలలో ఉపకథలను చెప్పటం, అలా చెబుతూ అందులో హాస్యం, వినోదం- ఇలా అనేక వైవిధ్యతలను అలవరుచుకుని కథను ఆసక్తికరంగా చెప్పటంలో ఆమె సిద్ధహస్తురాలు.
మితిమీరి ఆకువక్క్మలు నమలటం వల్లనే గొంతు నొప్పి వచ్చిందని నలుగురూ చెప్పినా ఈరమ్మ మానలేదు.
ఆత్మీయులు హెచ్చరించినా అలవాటు వదులుకోలేదు.
బుర్రకథలు చెప్పే తన కాయకానికి దూరం కాలేదు.
ఇలాంటి జానవద కళాకారులు పెదవులకు లిప్‌స్టిక్ పూయకపోతే ఏమిటి?
నోట నిరంతరం వెలిగే సూర్యుడి ఎరుపురంగుతో కూడిన తాంబూలం ఉండనే ఉంటుందికదా!
భోజనం అయిన తరువాత ఆకువక్కలతోపాటు కాచు వేసుకోవటం జానపదుల రోజువారీ అలవాటు.
అలాగే ఈరమ్మకూ ఆ అలవాటు ఉంది !
ఊరూరు పాడుతూ వెళ్ళేటప్పుడు ఇలాంటి గాయకులకు తాంబూలం ఇచ్చే ఉత్సాహం కావాలి.
పైగా ఈర్ష్య, అసనూయలతో ఎవరైనా మందుమాకులు పెదతారేమోనని ఆమె తల్లితండ్రులకు భయముండేది.
ఆ కారణంగా మందుమాకులకు విరుగుడుగా అమాయకురాలైన ఈరమ్మ ఎప్పుడూ తన దగ్గర యాలకులు ఉంచుకునేది.
తాంబూలంలో యాలకుల ఫొడి కలుపుకుని ఆకువక్మలు వేసుకునేది.
అలాంటి ఈరమ్మకు ఇలా అయింది కదా !
అలాంటి మహాకావ్యాల గనీ మూగబోతుందని తెలిస్తే ఆమె అభిమానులు ఎలా భరించగలరు?
నిజానికి ఈరమ్మవ్వకు ముందరి తరాల వరకూ జానపద కళ సజీవంగా ఉండాలనే కోరిక తీవ్రంగా ఉంది.
నిజానికి ఈరమ్మకు ఈ పురస్కారాల మీద, అవార్డుల మీద కోరిక లేదు.
గ్రామీణుల పిల్లలకు ఈ కథలు నేర్పించే ఒక పాఠశాల ఉంటే బాగుంటుందని అమె ఆలోచన.
ఆ ఆలోచన ఆమె జీవితానుభవంలోంచి మొలకెత్తింది.
ప్రభుత్వం తనకు ఇస్తున్న పింఛన్ సొమ్మును గ్రామీణ పిల్లల కోసమే ఉపయోగించాలని నిర్ణయించుకుంది.
అమాయకమైన పిల్లలలో తన గానసౌందర్వాన్ని చూడటానికి ఈరమ్మవ్వ తపించేది.
“ఈ ముసలితనంలో ఇదంతా నీకు ఎందుకమ్మా?” అంటే-
వెంటనే ఆమె నోటి నుంచి వచ్చే మాట-ోఅవ్వా, నీవు పాడుతున్న పాట నీతోటే వెళ్ళిపోకూడదు. అది రాబోయే తరాల వారినీ పెంచాలి. వాళ్ళు నీ కథ నేర్చుకోవాలి అని పెద్దపెద్ద సమావేశాలలో అందరూ చెప్పేవారే. అందుకే రోజూ నేను సాయంత్రం పిల్లలను కూర్చోబెట్టుకుని ఈ బుర్రకథలను ఎలా పాడాలో నేర్పిస్తున్నాను. ఈ తంబూర, డుముకి, గగ్గరి వాయించటం చూస్తే పిల్లలు, యువకులు సంతోషంతో పొంగిపోతారు. వారి సంతోషం చూస్తే నాకు సంతోషం. అదే ఉత్సాహంతో పాఠం చెబుతూ ఆనందం పొందుతున్నాను. నేను పాడుకున్నట్టు పాటలు పాడేవారిని చూడాలనే కోరిక నాకుంది. అదీ నేను బతికి ఉండగానే ఇదంతా చూడాలి” అని ముత్యాలు కూర్చినట్టు మాట్లాడుతుంది.
ఈరమ్మవ్వ ప్రజల మనసులో నిలిచిపోయేటటువంటి, సమాజ సముదాయంలో సంస్కృతి కలను నాటే కాయకాన్ని చాలా సంవత్సరాలుగా చేస్తూనే ఉంది.
ఏడు వేల పుటల, రెండులక్షల పంక్తుల ఈ కథన కావ్యాలను గానం చేయడమంటే సామాన్యమైన సాథననా?
ఈరమ్మ సంగీతసాథన లోకమే ఆశ్చర్యపోయేటటువంటిది!
ఆమె జీవితంలో వెనుతిరిగి చూసే మనిషి కాదు.
మొండిగా మునుముందుకు సాగే మనిషి
అలా వున్నందువల్లే ఈ రోజు కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారం, నాడోజ పురస్కారం, జానపదశ్రీ పురస్కారం -ఇలా వందలాది పురస్కారాలు, సన్మానాలు, పతకాలు, గౌరవ చిహ్నాలు తన సరస్వతి కొప్పులో ముడిచిందామె.
ఈరమ్మ గొంతు అలా ఎందుకు అయ్యిందని, మందులు వేసుకోలేదా? చికిత్స చేయించుకోలేదా? అని అశ్వ రామును అడిగితే -*ఆమె ఎన్నడూ ఇంగ్లీషు మందులుకానీ, ఆయుక్వేద మందులు కానీ సేవించలేదు. చేప ఆకుల రసాన్నే తాగి జీవించింది. అలాంటి ఆమెకు ఏ రోగం వచ్చిందని అనుకుంటాం సార్? చనిపోయిన ఓ వృద్ద ఆత్మ ఆమె దేహంలో చేరుకోవటంతో అలా అయ్యిందని అనాలా సార్?” అని అతనన్నాడు.
తన ఇంటి పెద్దలు మాట్లాడుకునే రీతిలోనే అశ్వ రాము మాట్లాడి వుండొచ్చని అనుకున్నాను.
పెద్దల ఆత్మ ఆమెలో చేరటం అంటే ఏమిటి?
ఈ మాటల అర్ధాన్ని గ్రహిస్తే మహాకావ్యాల్లో కూర్చుని బయటికి రావటానికి ఎదురుచూసి లోలోపలే సతమతమ వుతున్నట్టుంది.
ఏమైనా కానీ, వయస్సుకు సహజమైన కొన్ని బలహీనతలు మనుష్యులందరికి వచ్చినట్టే ఈరమ్మకూ వచ్చాయి.
ఏదో జబ్బు అంటూ బళ్ళారి ఆస్పత్రి చేరిన తరువాత కూడా ఈరమ్మ వార్డులోని మంచం మీదే పాడటానికి తపించింది.
డాక్టర్లకు ఎక్కడలేని ఆశ్చర్యం !
“నేను పాడాలయ్యా మా ఊరికి వెళ్ళాలి అని పరితపించే ఈ మనిషిని చూస్తే, ఈ కావ్యపు బతుకుకు ఆమె ఎంతగా హత్తుకుని వుండాలి.
చివరి ఊపిరివరకూ ఆమె పాడే స్వరానికి ఊపిరైంది.
ఇప్పుడు లోకం దృష్టిలో కళాదేవత అయింది.
హళెదరోజికి వెళితే అందరూ ఈరమ్మ జ్ఞాపకాలను గుర్తు చేసుకునేవారే.
నేను ఈ తంబూర పట్టుకున్నాను. పాడుతున్నప్పుడు ఎక్కడైనా స్వరం తప్పితే ఈ నా తండ్రి సరిదిద్దుతాడు” అని అంటుంది ఈరమ్మ తంబూరను ప్రేమగా తడుముతూ.
ఆమె ఇంటికి వెళ్ళినపుడు-
“మీకు ఏమి పెట్టాలి స్వామి, ఈ అడవిలో ఏమీ దొరకదు స్వామి, కొంచెం అన్నం, చట్నీ ఇంతే మాఇంటి భోజనం. ఇదే తిందురు రండి” అని ఆహ్వానిస్తుంది.
తల్లివిద్ణలు వేరయ్యే కావ్యభాగాలను గానం చేసేటప్పుడు (బాలనాగమ్మ మహాకావ్యం) కన్నీరయ్యే ఈరమ్మ ఇప్పుడు మనకు జ్ఞాపకం మాత్రమే.
అయితే ఆమె వెలిగించిన కావ్యపు ప్రమిదలు వెలుగుతూనే ఉన్నాయి. ఒకటా? రెండా?
అనేక మహాకావ్యాలను పాడిన ఈరమ్మ అనేక తరాలను కలిపింది.
కన్నడ మహా విశ్వవిద్యాలయాలను, లోకపు జ్ఞాన పరంపరలను తన కావ్యం, కథల ద్వారా వెలిగించింది.
అందువల్లనే ఆమె గౌరవనీయమ్లైన నాడొజ పదవిని పొందింది.
జానపదశ్రీగా మెరిసింది.
అనుభవాలగనిలా ఉన్న ఈరమ్మ జీవితమే ఒక మహా కావ్యకథనపు దారి. ఈ దారిలో నడిచే సౌభాగ్యం కన్నడిగులది. తల్లినాడు తెలుగువాళ్ళది కూడా. ఈ రెండు సంస్కృతుల కలయికగా భావసేతువుగా ఈరమ్మ బతికింది. (అయిపోయింది)