అమ్మనుడి/సంపుటి 5/మే 2019/ఎప్పటిలాగే

అందిస్తున్నాయి. ఐతే, యథాతథ అనువాదం లేకపోతే యథాతథ ఆంగ్లం! అన్నింటికీ తెలుగు పదాలున్నాయి - వాడరు. “తెలుగు కాపాడుకుందాం” అని రాతలు!

టీవీలో మధ్యమధ్య “మనం తెలుగువాళ్ళం. తెలుగులోనే మాట్లాడుకుందాం” అని వస్తూ వుంటుంది. వెంటనే, ఆ 'యాంకర్‌ ' “హై వ్యూయర్స్‌... అని ఆంగ్లంలో అంటుంది. ఎగతాళా? అవహేళనా? టీవీల వార్తల భాషా అలాగే వుంటుంది. తెలుగు వార్తలు చదువుతున్న అమ్మడు - “ఏదో ఇరగదీస్తుందనుకున్న సానియా...” అని చదివింది. ఇది వార్తల భాషా?... హతోస్మి వార్తలు చదివే వాళ్ళు ఒత్తులు పలకరు. ద్విత్వాక్షరాలు సరిగా ఉచ్చరించరు. కొన్ని లక్షల మంది తెలుగువారు వార్తలు వింటారు కదా - అన్న ఆలోచన వుండదు.

ఇంగ్లీషులో 'దీ' లేదు గనక, దానికి 'డి ' అక్షరం వాడతారు. హైదరాబాద్‌ - అన్నట్టుగా. తెలుగువాళ్ళం 'డి 'ని 'డి 'గా పలుకుతాం - హద్రాబాద్‌ - అని. అలాగే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ని 'గొడావరి ' అనీ రాజమండ్రి ని “రాజమండ్రీ ' అని పలుకుతున్నాం.

ఏమైనా, తెలుగుభాష మాట-ఇంటి నుంచే ఆరంభం కావాలి. ఇంట్లో వున్న తల్లిదండ్రులు పిల్లలతో తెలుగు మాట్లాడాలి. పొద్దున్నే “బుక్స్‌ అన్నీ బ్యాగ్‌లో పెట్టుకున్నావా?” అని తల్లి అగడదానికి బదులు “పుస్తకాలు సంచిలో సర్దుకున్నావా?” అనొచ్చు గదా. “వాటర్‌ బాటిల్‌ (నీళ్ళసీసా) ఫుల్‌ ( నిండుగా ) గా వుందా” “సాక్స్‌ (మేజోడు) షూ (జోడు) దగ్గర పెట్టుకో...” “లంచ్‌ బాక్స్‌ (అన్నం డబ్బా) పెట్టుకున్నావా? బయల్టేరు...బై జాగ్రత్తగా వెళ్ళిరా) అంటే వాడూ 'బై ' 'బై ' అంటాడు. లేదా “బై మమ్మీ” (అలాగే అమ్మా) అంటాడు. అంతా ఇంగిలీషే. ఇల్లంతా “ఎంగిలీషే!” - ఇంక తెలుగేంబతుకుతుంది?.... స్కూల్లో పిల్లలు తెలుగులో మాట్లాడుకుంటే, శిక్షట... తెలుసా? ఇంగ్లీషులోనే మాట్లాడాలట!!... చేతులు రెండూ జోడించి - ఉపాధ్యాయులకి “నమస్కారం” చెప్పడం నిషిద్ధం! “గుడ్‌ మార్నింగ్‌ టీచర్‌” అనాలి. చదువులు, సంస్మారాలూ చట్టుబందలై చచ్చాయి! ఆడపిల్లలు జడవేసుకుని, తలలో పువ్వులు పెట్టుకుని లక్షణంగా స్కూలుకి వెళితే, లోపలికి రానివ్వని బడులు కూదా వున్నాయి! జడ, పువ్వులూ నిషిద్ధం!!

ఇంటి దగ్గర ఆరంభమై, స్మూళ్ళు కాలేజీలు, ఆఫీసులు తెలుగుతో శోభించాలి. అదీ తెలుగు వాళ్ళ లక్షణం! ఏదో ఒక ఇంగ్లీష్‌ మాట పట్టుకుని, దానికి తెలుగేమిటి - అని ఆలోచించకండి. ఉన్న తెలుగు పదాలని రోజూ వాడండి. బల్ల (టేబుల్ ) కుర్చీ (చైర్‌) పుస్తకం (బుక్‌) మంచినీళ్ళు (వాటర్‌) కూర (కర్రీ) చెంచా (స్పూన్‌) నెయ్యి(ఘీ) అన్నం (రైస్‌ )ఉప్పు (సాల్ట్‌ ) వంటి చక్కని తెలుగు పదాలని పలకండి. బ్రాకెట్లలో వున్న ఆంగ్ల పదాలే వాడుకలో వున్నాయి. పిల్లల చేత అమ్మా, నాన్న అక్క తాత అనిపించండి. ఆంటీ, అంకుల్‌, మమ్మీ, డాడీ, గ్రాంచ్‌మా లాంటి మాటలు మానిపించండి. తెలుగుని తెలుగులా బతకనివ్వండి “ఐడి పలుకుల తెలుగు కాదు మనకి కావలసింది; పలుకు బడుల తెలుగు కావాలి” అన్నారు కాళోజి. సముద్రం అంత తెలుగు భాష్య పురిషెడయినా పట్టుకుందాం!

- వ్వాస రచయిత - ప్రముఖ సినీనటులు


ఎప్పటిలాగే



గేటు చప్పుడైంది
కవిత్వం తోసుకొస్తుందేమో!
కొబ్బరాకులు కదుల్తున్నాయి,
వాటి పైకెక్కి
జారిపడిందేమో!
కింద పడి లేవటం
దానికలవాటే.

సూర్యకిరణాలు
వంకర్లు బోతున్నాయి
అక్షరాలుగా మారే
ప్రయత్నం కాబోలు.
అనాడు
ఎక్కడికో ఎగిరిపోయిన పక్షి
మళ్లీ కనపడలేదు.
దాని రెక్కల కదలిక
ఇప్పటికీ మనస్సులో వుండిపోయింది.

రాత్రంతా నిద్ర లేదు
'ఆగిపోరాత్రీ అంటే
ఆగిపోయేదేమో.
నిద్రను ఆపొచ్చునేమోగాని
గడియారం ఆగదు.
తెల్లరగట్ల
దుప్పటి మీది పూల డిజైన్లు
పరిమళిస్తున్నాయి.

ఫ్యాన్‌ల నీడలో
ఏసీల శీలత భాహువుల్లో
పులిసిపోయిన దేహంతో
ఎండలో
కుర్చీ వేసుకొని కూర్చున్నాను
కవిత్వం
'డి ' విటమిన్‌లా విస్తరిస్తుంది.

డా॥ ఎన్‌.గోపి 93910 28496