అమ్మనుడి/సంపుటి 5/జూన్ 2019/1951 నుండి దేశంలో వయోజన విద్య-ఒక సమీక్ష

వయోజన విద్య

వై. ఇంద్రాణి 9246245909

1951 నుండి దేశంలో వయోజన విద్య-ఒక సమీక్ష

మనిషి సర్వతోముఖాభివృద్ధి సాధనలో విద్యది అత్యంత కీలక పాత్ర. ఒక దేశపు అభివృద్ధి, అభివృద్ధిని స్థిరపరచడంలో విద్యది ప్రధాన పాత్ర. ఒక్కమాటలో భవ్య భవిష్యత్తుకు తిరుగులేని పెట్టుబడి విద్య. అభివృద్ది చెందిన దేశాలు అక్షరాస్యతలో ముందున్నాయి, వెనుకబడిన దేశాల్లో నిరక్షరాస్యత ఎక్కువ కాబట్టి ఐక్యరాజ్యసమితి కూడా అభివృద్ధి ప్రమాణాలలో అక్షరాస్యతను చేర్చింది. 15 దాటిన పెద్దలకు అందించే విద్యను వయోజనవిద్య అంటున్నాం. వయోజన విద్యకు అనేక నిర్వచనాలు.

చదువుకునే వయసులో అవకాశాలు పొందలేకపోయినవారు, ఇప్పుడు చదువుకోడానికి కల్పించే అవకాశం వయోజన విద్య అని చెప్పుకోవాలి. అక్షరనైపుణ్యాలనే కాక, వెనుకబాటుకు కారణాలు తెలుసుకుని, ఎదగడానికి ప్రయత్నించే సామాజికసృహను, అవసరమైన వారికి వృత్తినైపుణ్యాలు, జాతీయ విలువల పరిజ్ఞానాన్ని అందించేది వయోజన విద్య. వయోజన విద్య కేవలం అక్షరాస్యతమాత్రమే కాదు కాబట్టి దానిని అక్షరాస్యతంగా చెప్పవచ్చు. అండులో జీవన పర్యంత విద్య, నిరంతర విద్య, బడి బయటి పిల్లల విద్య, వెనుకబడిన వర్ధాల వారికి కావలసిన విద్య, వీధిబాలలకు విద్య, కార్మికులు మొదలైనవారికి చెప్పే విద్య, అన్ని కూడా భాగాలే. జాతిపిత నిరక్షరాస్యత దేశానికి కళంకం, నిర్మూలించి తీరాల్సిందే అని ఆనాడే పిలుపిచ్చారు.

మన దేశంలో 1951 నుండి వయోజన విద్య - చారిత్రక నేపథ్యం :

ప్రారంభంలో (1948) వయోజన విద్యను సామాజిక విద్య (సోషల్‌ ఎడ్యుకేషన్‌) లో భాగంగా భావించారు. తొలి కేంద్ర విద్యామంత్రి మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ వయోజనులకు అందించే విద్య, వారిని విద్యావంతులను చేయడం మాత్రమే కాదు, సమగ్ర, సామాజిక అభివృద్ధి దిశగా చేసే ప్రయత్నం అన్నారు. జనబాహుళ్యంలో ఉత్పాదకశక్తిని పెంచే ఆలోచనను రేకెత్తింపచేసేది వయోజన విద్య అన్నారు. సెంట్రల్‌ అడ్వయిజరీ బోర్ట్డు ఆఫ్‌ ఎడ్యుకేషన్‌? వారు సామాజిక విద్య భావనను ఆమోదించి, 1949 ఫిబ్రవరిలో జరిగిన కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ప్రొవెన్నియల్‌ ఎడ్యుకేషన్‌ మినిస్టర్స్‌: లో చర్చించారు. 1949లో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలన్న సూచనలు జారీ అయ్యాయి. సామాజికవిద్య మొదటి మూడు పంచవర్ష ప్రణాళికలకాలంలో (1951-56, 1956-61, 1961-66) మంచి ఫలితాలనే సాధించింది. 3, 4 ప్రణాళికల కాలంలో చర్చల్లొకి

వచ్చిన వయోజన కార్యనిర్వాహక విద్యా భావన, 4వ ప్రణాళికలో బలపడింది. 1969లో నేషనల్‌ బోర్జ్‌ ఆఫ్‌ అడల్ట్ ఎడ్యుకేషన్‌, 1971లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ ఏర్పాటు, నాన్ఫార్మల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం ప్రారంభాలతో, ప్రోగ్రాం ఆఫ్‌ రూరల్‌ ఫంక్షనల్‌ లిటరసీ అసోసియేట్‌ అయ్యింది. దేశ సమగ్రాభివృద్ధికి అత్యంత కీలకంగా భావించి 1978 అక్టోబర్‌ 2న ప్రాధాన్యతా కార్యక్రమంగా నేషనల్‌ అడల్డ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం (ఎన్‌ ఏఇపి)ని ప్రారంభించారు. ఆర్థిక, సామాజిక, స్త్రీ పురుష అంతరాలను తగ్గించడంలో వయోజన విద్య చెప్పుకోదగ్గ పాత్ర పోషించగలదని, 1986లో నేషనల్‌ పాలిసీ ఆన్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌ పిఇ) అవసరాన్ని నొక్కి చెప్పింది. 1992లో ప్రోగ్రాం ఆఫ్‌ యాక్షన్‌ (పి.ఒ.ఏ) లో నేషనల్‌ ప్రోగ్రాం ఆఫ్‌ అడల్డ్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌ పి ఎ ఇ) ని ప్రకటించారు. దాని లక్ష్యమైన వంద మిలియన్లలో 1990 కల్లా 15-35 వయసుగల 40 మిలియన్లు, 1995 కల్లా మరో 60 మిలియన్ల నిరక్షరాస్యులను చదివించడానికి కాలపరిమితిగల అంచెలవారి వయోజన విద్యా కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ ఎన్‌ పి ఎ ఇ ప్రకారం రూరల్‌ ఫంక్షనల్‌ లిటరసీ ప్రోగ్రాం, స్టేట్‌ అడల్డ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం (ఎస్‌.ఎ.ఇ.పి), ప్రోగ్రాం ఆఫ్‌ అసిస్టెన్స్‌ టు వాలంటరీ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని భావించారు.

నేషనల్‌ లిటరసీ మిషన్‌ 1988 :

సాక్షరత సాధనకు, 1988 మే 5న నినేషనల్‌ లిటరసీ మిషన్‌ (ఎన్‌. ఎల్‌ ఎం.) ను ప్రారంభించారు. దీనిని నేషనల్‌ పాలసీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ 1986, నేషనల్‌ అడల్డ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాంల లోటు పాట్లను పరిశీలించి, దిద్దుబాట్లతో రూపొందించారు. ఈ కార్యక్రమంలో 100 మిలియన్ల పూర్వ లక్ష్యాన్ని 80 మిలియన్లకు కుదించారు. 1990 నాటికి 30 మిలియన్ల, మిగిలిన 50 మిలియన్ల నిరక్షరాస్యులను 1995 కల్లా అక్షరాస్యులను చేయాలి. లక్ష్య సాధనకు, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖలోని డిపార్టమెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్లో, స్వయం ప్రతిపత్తితోని నేషనల్‌ లిటరసీ మిషన్‌ అధారిటీ (ఎన్‌ఎల్‌ఎంఏ) ని 1988 జూన్‌ లో ప్రారంభించారు. మాస్‌ ప్రోగ్రాం ఆఫ్‌ ఫంక్షనల్‌ లిటరసీ (ఎంపిఎఫ్‌ఎల్‌), రూరల్‌ ఫంక్షనల్‌ లిటరసీ ప్రోగ్రాం, (ఆర్‌.ఎఫ్‌.ఎల్‌ పి), స్టేట్‌ అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను ఎన్‌ఎల్‌ ఎం చేపట్టింది.

అభ్యసన బోధనాసామగ్రి, విధివిధానాల రూపకల్పన, సిబ్బందికి శిక్షణ, అధ్యయన మూల్యాంకనలు, ప్రయోగాలు, పరిశోధన, సాంకేతిక, విద్యా వనరుల సహకారాన్ని అందించదంకోసం స్టేట్‌ రిసోర్స్‌ సెంటర్స్‌ (ఎస్‌.అర్‌.సి.) లు ఏర్పడ్డాయి.

1988-89 సంపపలో టోటల్‌ లిటరసీ క్యాంపేన్‌ (టిఎల్‌సి) ను, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల నేషనల్‌ సర్వీస్‌ స్మీమ్‌

(ఎన్‌ఎస్‌ఎస్‌) విద్యార్థులు, స్వచ్చంద సేవా సంస్థలపై ఆధారపడి, కేరళలోని ఎర్నాకులం జిల్లాలో, కొట్టాయం పట్టణంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఇంతలో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 1990వ సంవత్సరాన్ని అంతర్జాతీయ అక్షరాన్యతా సంవత్సరం (ఐఎల్‌ వై) గా ప్రకటించగా, దేశంలో 1990 జనవరి 22న ఐఎల్‌వైని ప్రారంభించారు. అప్పటికే సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమం కొనసాగుతున్న ఎర్నాకులం జిల్లాను 1990 ఫిబ్రవరి 4న మొట్టమొదటి సంపూర్ణ అక్షరాస్యతా జిల్లాగా ప్రకటించారు. ఎర్నాకులం జిల్లా, కొట్టాయంల విజయస్స్ఫూర్తితో కేరళలోని అన్ని జిల్లాలలో అమలు చేసి, 1991 ఏప్రిల్లో సంపూర్ణ అక్షరాస్యతా రాష్ట్రంగా ప్రకటించారు. ఆ విజయాలతో ఎన్‌. ఎల్‌ ఎం. తన 80 మిలియన్లకు లక్ష్యాన్ని తిరిగి 100కు పెంచి, 1999కల్లా దేశంలో అన్ని జిల్లాలలో అమలు చేసి, 100 మిలియన్ల నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేయాలన్న లక్ష్యాన్ని ప్రకటించింది. టి.ఎల్‌ సి. విజయాలు దేశంలో జీవన పర్యంత విద్యా కార్యక్రమాల ఏర్పాటుకు బాటలు వేశాయి. వయోజనవిద్యలో 1. సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమం (టిఎల్స్‌), 2. అక్షరాస్యతానంతర కార్యక్రమం (టిఎల్ష్ ), 3. నిరంతర విద్యా కార్యక్రమం (సిఇపి) లు భాగాలు. జీవన పర్యంత విద్యా కార్యక్రమం, 9వ పంచవర్ష ప్రణాళికా కాలంలో (1997-2002) ప్రారంభమై 11వ పంచవర్ష ప్రణాళికా కాలంలో (2007-12) సెప్టెంబర్‌ 2009 వరకు కొనసాగింది.

సాక్షరభారత్‌ కార్యక్రమం(ఎస్‌.బి.పి) - 2009:

ఎన్‌ఎల్‌ ఎం ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరక్షరాస్యత పెను సమస్యగా ఉండి పోయింది. 2001 జనాభాలెక్కల ప్రకారం, 15 సం॥లు దాటిన నిరక్షరాస్యులు 259. 52 మిలియన్లు (సుమారు 26కోట్లు). అదే సమయంలో భారత ప్రభుత్వం అక్షరాస్యురాలైన మహిళ - ఒక నీర్ణయాత్మక శక్తిగా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించ గలదని మహిళా సాధికారత, అక్క్షరాస్యతలు కీలక ప్రాధాన్యతలుగా ప్రకటించింది. 11వ పంచవర్ష ప్రణాళికలో పేర్శొనగా భాగస్వామ్య అభివృద్ది నినాదం స్ఫూర్తి... స్త్రీ పురుష అక్షరాస్యతా తేడాను తగ్గించకుండా సాధ్యపడదు కాబట్టి, మహిళా సాధికారతకు ప్రాధాన్యమిచ్చారు. సామాజిక, ఆర్థిక అఖివృద్ది.. అక్షరాస్యత ముఖ్యంగా మహిళా అక్షరాస్యతతోనే సాధ్యమని భావించిన ఎన్‌ఎల్‌ఎం మహిళా అక్షరాస్వతకు ప్రాధాన్యత నిస్తూ దిద్దుబాట్లతో సాక్షరభారత్‌ కార్యక్రమాన్ని ప్రకటించారు. కార్యక్రమాన్ని అప్పటి ప్రధాని డా.మన్నోహన్‌ సింగ్‌ 2009 సెప్టెంబర్‌ 8న అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని లాంఛనంగా ప్రారంభించారు. 2009 అక్టోబర్‌ 1 నుండి అమల్లోకి వచ్చింది. చదువుకునే అవకాశం పొందని, వయసు దాటిపోయి, ప్రస్తుతం అక్షరాస్యత, ప్రాథమిక విద్య, వృత్తి విద్య భౌతిక, మానసిక అభివృద్దులకు సంబందించిన విద్య, కళలు, శాస్తాయ పరిజ్ఞానం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇట్లా ఏ అంశంలోనైనా నైపుణ్యాలు పెంచుకోవాలనుకుంటున్న వారికి అవకాశాలను అందించే ఏర్పాట్లు జరిగాయి. సరికొత్త సాక్షరభారత్‌ కార్యక్రమ ప్రాథమిక లక్ష్యం 80% జుతీయ అక్షరాస్యత. స్త్రీ పురుష అక్షరాస్యతా తేడాను 10%నికి తగ్గించడం, వివిధ ప్రాంతాలు, సామాజిక వర్గాల మథ్య తేడాలను కనిష్టం చేయడానికిగాను మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఇంకా ఇతర వెనుకబడినవర్గాలపై దృష్టిని కేంద్రీకరించారు. 11వ ప్రణాళిక అంతానికి లక్ష్యాలను సాధించలేక పోవడంతో 12వ పంచవర్ష ప్రణాళికకు కొనసాగించారు. ఆపైన మరో సంవత్సరం కొనసాగించారు.

ఇప్పటివరకు మన కార్యక్రమాల ప్రాధాన్యతలు -లోపాలు:

1.సామాజిక విద్యా కార్యక్రమాల అవగాహన, సామాజిక భాగస్వామ్యం, సామాజిక కార్యకర్తలు, వయోజన విద్యా శాఖ శిక్షణ, ఇతర కార్యక్రమాలకు ఉద్దేశించిన జనతా కాలేజీలు 3వ పంచవర్ష ప్రణాళిక తరువాత ఏమయ్యాయో తెలియదు.

2. మొదటి ౩ పంచవర్ష ప్రణాళికలలో సహకారోద్యమం, విస్తరణ ప్రాజెక్టులతో నడిపించిన సామాజికాఖివృద్ది (కమ్యూనిటి డెవలప్ మెంట్ కార్యక్రమాలు ఆ తరువాత లక్ష్యాలనుంది దారి మళ్లాయి.

3. సర్వతోముఖ అభివృద్ధికి ఉద్దేశించిన సోషల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం మూడు ప్రణాళికల్లో రేకెత్తించిన ఉత్సాహం చల్లబడి చివరికి వయోజన విద్యకు పరిమితం అయిపోయింది.

4 మొదటి మూడు ప్రణాళికల కాలంలో అనుకున్న ఎన్‌. జీ. ఓలు, పంచాయితీరాజ్‌ వ్యవస్థలు, ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యం స్థిరంగా నిలవలేదు.

5. నేషనల్‌ ప్రోగ్రామ్ ఫర్‌ అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ - ఎన్‌.వి.ఎ.ఇ. ఒక అనియత విద్యా కార్యక్రమం, ప్రయోగాలు,అధ్యయనాల తరువాత రూపొందిన మొదటి వ్యవస్థీకృత కార్యక్రమం. విశ్వవిద్యాలయాలలో వయోజన విద్యా విభాగాలను ప్రారంభించాయి. ఫలితాల నివేదికలు అందలేదు. యు.జి.సి. పట్టికల్లో కోర్సులు ప్రారంభించి నట్లుగా మాత్రమే తెలుస్తోంది.

6. ఫార్మల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఫంక్షనల్‌ లిటరసీ (ఎఫ్‌.ఇ. ఎఫ్‌.ఎల్‌. పి.) కార్యక్రమం ఆహారోత్పత్తి, హరిత విష్ణవాలలో కొంత సాధించగలిగినా, దేశం వ్యవసాయోత్పత్తులలో అనుకున్న స్వయం సమృద్ది సాధించలేకపోయింది. గోధుమ, చెరుకు, వరి, పప్పుధాన్యాల ఉత్పత్తి విషయంలో చాలా దేశాల కన్నా వెనుకే ఉండిపోయింది. 100 జిల్లాల (తరువాత 146 జిల్లాలను విస్తరించారు) లో కార్యక్రమాన్ని అమలు చేయాలన్న లక్ష్యం అమలయ్యాక ఈ కార్యక్రమాన్ని నిలిపేశారు.

7. వ్యవస్టీకృత నిర్మాణంతో ప్రారంభించిన నేషనల్‌ ప్రోగ్రాం ఫర్‌ అడల్డ్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌.పి.ఎ.ఇ) 10 ఏండ్లపాటు కొనసాగాక అప్పటివరకు ఉన్న వ్యవస్థను మధ్యంతరంగా 1988 లో మార్చేశారు.

8. వయోజన విద్యా కార్యక్రమాలను వేగవంతం చేసేలా పరిశోధన, మూల్యాంకనం, సాంతేతికాది సహకారం అందించేందుకు -1991, జనవరిలో ఏర్పాటు చేసిన నేషనల్‌ ఇన్ స్టట్యూట్‌ ఆఫ్‌

భాష లేకపోతే భావంలేదు;నీ భావాల్ని నీ భాషలో చెప్పడమే సరైనది

అడల్డ్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌ఐఏఇ) అ అతీగతీ లేదు.

9. విద్యార్థులు, స్వచ్చంద సంస్థలు చురుకుగా పాల్గొన్న కేరళ విజయ స్ఫూర్తితో 14 రాష్త్రాలకు సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమాన్ని విస్తరించి, 30 లక్షల స్వచ్చంద బోధకులతో, 3 కోట్ల మందికి చదువు చెప్పించారు కాని ఆస్థాయి ఫలితాలు రాలేదు.

10. నూతన అక్షరాస్యులకు వృత్తి నైపుణ్యాలు గడపడానికి ప్రారంభించిన 32000 జనశిక్షణ నిలయాల గతి తెలియరాలేదు. ఆ తరువాత వచ్చిన శ్రామిక విద్యా పీఠాల పేరును జనశిక్షణ సంస్టానాలు (జెఎస్‌ఎస్‌)గా మార్చారు. వీటిలో కొన్ని రద్దుకాగా 250 జె.ఎస్‌.ఎస్‌.లను 2018 మార్చి తరువాత నైపుణ్యాల అఖివృద్ధి మంత్రిత్వశాఖకు బదిలీ చేశారు.

11. సాక్షర్‌ భారత్‌ కార్యక్రమంలో 70 మిలియన్ల నిరక్షరాస్యులను (60 మిలియన్ల మహిళలు) అక్షరాస్యులను చేయాలన్నది లక్ష్యం కాగా, ఆయా జనాభా ప్రాతిపదికన 14 మిలియన్లు ఎస్‌సిలు, 8 మిలియన్లు ఎస్టీలు, 12 మిలియన్లు బిసిలు, 36 మిలియన్లు ఇతరులు ఉండాలని నిర్దేశించుకున్నారు. అయితే ఇది ఆయా వర్గాలలో ఉన్న వాస్తవ నిరక్షరాస్యుల సంఖ్య ఆధారంగా చేసుకున్న లక్ష్యం కాదు. 410 జిల్లాలలోని కేవలం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కార్యక్రమాన్ని అమలు చేయడం వల్ల పట్టణాల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న మురికివాడలు, వెనుకబడిన ప్రాంతాలను వదిలేయడం జరిగింది. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో పట్టణ ప్రాంత మురికి వాడల్లో మొత్తం 50 మిలియన్ల నిరక్షరాస్యులు ఉన్నారు. పైగా 11 ప్రణాళికాంతం, 2012 మార్చినాటికి 70 మిలియన్ల మందిని అక్షరాస్యులను చేయాలన్న లక్ష్యం .12 వ పంచవర్ష ప్రణాళికలో కూడా కొనసాగింది. ఎన్‌ఐఓఎస్‌ పరీక్షల లెక్కల ప్రకారం 2010 ఆగస్టు నుండి 2018 మార్చ వరకు మొత్తం 16 విడతల్లో పరీక్ష రాసిన 101 మిలియన్ల మందిలో 76.1 మిలియన్లు ఉత్తీరులయ్యారు. ఆ రకంగా ఆరేళ్లు ఆలస్యంగానైనా సాక్షరభారత్‌ లక్ష్యం 70 మిలియన్లను సాధించినట్లే. కానీ ఈ లెక్క వాస్తవాతీతంగా అనిపిస్తున్నది.

13. 2011 జనాభా లెక్కల్లో తేలిన 285 మిలియన్ల నిరక్షరాస్యుల్లో, పట్టణాల్లోని 1.08 లక్షల మురికివాడల్లో 47.85 మిలియన్లు ఉన్నారు. సాక్షరభారత్లో పట్టించుకోని వీరిని ఇండియా యట్‌ 75 లేదా రోటరీ ఇండియా లిటరసీ మిషన్ల ద్వారా పబ్లిక్‌ ప్రయివేట్‌ పార్టనర్‌ షిప్‌ కింద అక్షరాస్యులను చేసే ప్రయత్నం, ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. వీటన్నటిని చక్కదిద్దడానికి 2018 మార్చి తరువాత కార్యక్రమాన్ని నిలిపివేయడం జరిగింది. సాక్షరభారత్‌ కార్యక్రమాన్ని దిద్దుబాటుతో పునరుద్ధరించడానికి సమయం పడుతుంది. ప్రస్తుత పరిస్థితిలో మౌలానా ఆజాద్‌ తాలీం ఎ-బాలిఘన్‌, ఎలక్టోరల్‌ లిటరసి, ఫైనాన్సియల్‌ లిటరసీ, డిజిటల్‌ లిటరసీ, లీగల్‌ లిటరసీ, ఈక్వవలెన్సీ వంటి సృజనాత్మక కార్యక్రమాలను అమలు చేయడం కష్టం.

71 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో విద్యకు సంబంధించి రెండు నేషనల్‌ పాలసీలను, 12 పంచ వర్ష ప్రణాళికలను, ౩ వ వార్షిక ప్రణాళికలను (పంచవర్ష ప్రణాళికలకు సెలవు ప్రకటించినప్పటి) వచ్చాయి. 14 ఆర్థిక కమీషన్లను, 2 ఎద్యుకేషన్‌ కమిషన్లను , కేంద్ర సలహా సంఘం వారి విద్యపై 65 సమావేశాలను (1947 తరువాత 53 సమావేశాలు), వయోజన విద్యకు సంబంధిందచిన 5 ప్రధాన ప్రణాళికలు / కార్యక్రమాలు అమలయ్యాయి. ఇప్పటికీ దేశంలో 7 సంవత్సరాలకు పైబడిన నిరక్షరాస్యులు 250 మిలియన్లు ఉన్నారు. కాబట్టి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి. కేంద్ర స్థాయినుంచి రాష్ట్రాలు, జిల్లా, మండలం, గ్రామ మరియు నగర స్థాయివరకు ఒక శాస్వత వ్యవస్థ ఏర్పడాలి. అందులో నిరక్షరాస్యులే కాదు, నూతన అక్షరాస్యులకు నేర్చిన నైపుణ్యాలను మరిచి, తిరిగి నిరక్షరాస్యులుగా మారకుండా, నిరంతరం విద్య మరియు జీవన పర్యంత విద్యా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది.

కొన్ని ప్రత్యేక లక్ష్యాలేర్చరుచుకుని ఆ తరువాత ఆయా కార్యక్రమాలను సరైనవిధంగా విశ్లేషించకుండానే నిలిపివేయడం వల్ల ఖర్చుచేసినట్టి మౌలిక, మానవ వనరులు వృథా అవుతాయి. ఆయా కార్యక్రమాల ఫలాలు ప్రజలకందవు. తీవ్ర సామాజిక ఆర్థిక నష్టాన్ని భరించాల్సి వస్తున్నది. ఇప్పుడు కూడా అట్లా జరక్కుండా కొత్త కార్యక్రమాన్ని జాగ్రత్తగా రూపొందించుకోవాల్సి ఉంది.

2022 కు అనేక ప్రత్యేకతలు...వాయువేగాన సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి

2022 కల్లా దేశ జనాభా పట్టికలో వయసు, అర్హతలను బట్టి ఉద్యోగార్జులు అత్యధికంగా ఉంటారని అంచనా. పెద్ద సంఖ్య లోని ఉద్యోగార్జుల ఉత్పాదక శక్తిని అభివృద్ధి మార్గంలోకి తేలేకపోతే, దేశం తీవ్రవిపత్మర పరిస్థితిలోకి పడిపోయే ప్రమాదముంది. ఆ శక్తినీ సరైనరీతిన ఉపయోగించుకుంటే మంచి ఫలితాలను పొందుతాం. 75వ స్వాతంత్ర్య దినోత్సం కూడా 2022లోనే రానుంది. అప్పటికి సంపూర్ణ అక్షరాస్యతను సాధిస్తే, అక్షరసమాజాన్ని కోరుకున్న జాతిపిత మహాత్నాగాంధీకు, గొప్ప నివాళి అవుతుంది.

2014 ఎన్‌ఎస్‌ఎస్‌ వారి 71వ విడత లెక్కల ప్రకారం మనం 75.4% అక్షరాస్యతను సాధించాం. ఇప్పటికది ఏడాదికి ఒక శాతం చొప్పున పెరిగి 78.0% నికి చేరి ఉంటుంది. అంటే మనం రాబోయే మూడున్నర యేళ్ళల్లో (2022 ఆగస్టు నాటికి) సుమారు 22% మందిని అక్షరాస్యులను చేయాలి. అనారోగ్యం మొదలైన కారణాలుగా కొందరిని వదిలేయాలి కాబట్టి సంపూర్ణ అక్షరాస్యతంటే 100% అక్షరాస్యత అని కాదు. వదిలేయాల్సిన వారిని 2%గా పరిగణిస్తే, మన జనాభాలో ఏడేండ్లు దాటిన సుమారు 20% మందిని అక్షరాస్యులను చేయాలి. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఏడాదికి 1% చొప్పున అక్షరాస్యతలో అభివృద్ది కనిపిస్తోంది. ఆ ప్రకారం సంపూర్ణ అక్షరాస్యత సాధనకు మనకు 20 ఏళ్లు పట్టవచ్చు. కానీ అత్యంత ఫలవంతమైన

గుండె లోతుల్లోంచి వచ్చేదీ, మనసు విప్పి చెప్పగలిగేదీ'అమ్మనుడి 'లోనే

పథకాలతో వేగాన్ని పెంచుకోవాలి. అనేక మార్గాల్లో ప్రయత్నించాలి. అనేక కార్యక్రమాలను సమన్వయపర్చుకోవాలి. అందుకుగాను:

1. పెద్దెత్తున యువతను వాడుకోవడం. :ఃఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌/ టెన్‌ ఒకరు ఒక్కొక్షరికి/ పదిమందికి బోధించాలిః అన్న పథకంతో, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో విద్యార్థులు పదేసి మందికి చదువు చెప్పాలన్న నిర్దేశం ఉండాలి. సబ్జెక్టుగా దీనికి మార్కులు కేటాయించాలి. ఇట్లా మూడేళ్లపాటు విద్యార్థులు చదువు చెపితే 2022 కల్లా లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటాం.

2. విద్యార్థులను ఆకట్టుకోడానికి పిల్లల మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు తదితరాల్లో పోటీలు పెట్టవచ్చు. టీచ్‌ ఇండియా/ప్రీత్‌ ఇండియా పోటీలు ఉపయోగపడతాయి.

3. 20-20 క్రికెట్‌ పోటీల్లా 20-20 లిటరసీ పోటీలు పెట్టవచ్చు. 20 మంది బృందంగా నిరక్షరాస్యులున్న ప్రాంతాల్లో 20మందికి చొప్పున చదువు చెపితే అక్కడ ఏడాదికి 400 మంది అక్షరాస్యులవుతారు.

4 సుదూర ప్రాంతాలకు ప్రత్యేక సాక్షరతా రైళ్లు, సాక్షరతా బస్సులు నడిపి చదువు చెప్పడానికి యువతను పంపవచ్చు.

5.కంప్యూటర్లు, స్మార్ట్‌ ఫోనులను పెద్దెత్తున ఉపయోగించుకోవచ్చు. గ్రామాలలో కంప్యూటర్‌ కియోస్సును ఉంచి, ఒక టెళ్నిషియన్ను, బోధకుడిని నియమించాలి. అభ్యాసకులు వారి వీలును బట్టి వెళ్లి స్వయంగా నేర్చుకునే అవకాశాన్ని కల్పించవచ్చు.

6. చదువుకున్న గృహిణికి జీతం లేదా గౌరవభ్బతి కల్పించడం ద్వారా తోటి నిరక్షర మహిళలకు చదువు చెప్పించవచ్చు.

7. టీచర్‌ ట్రైనింగ్‌ విద్యార్జులకు మార్కులతో కూడిన నిర్బంథ ప్రాజెక్టులను అప్పగించి, చదువు చెప్పించవచ్చు.

8. జిల్లా కలెక్టర్లందరికి లక్ష్యాలను నిర్దేశించాలి. అన్ని కార్బోరేట్స్‌ ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు సామాజిక బాధ్యతగా అక్షరాస్యతా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలన్న నిర్భంధం ఉండాలి. జాతీయ నియంత్రణా వ్యవస్థను ఒక నేషనల్‌ లిటరసీ కన్సార్టియం:గా ఏర్పరుచుకోవడం వల్ల కార్యక్రమాల్లో లోటుపాట్లను ఎప్పటికప్పుడు సవరించుకోవచ్చు. కన్నార్దియం అంతర్జాతీయ సంస్థల అనుసంధా నంతో కూడా ఉండవచ్చు.

మనం మూడేళ్లల్లో లక్ష్యాన్ని చేరగలమన్న అశకు మూడు బలమైన అంశాలు ఊపిరి పోస్తున్నాయి. 1.సమాచార సాంకేతిక పరిజ్ఞానపు అందుబాటు పెరిగి దేశంలోని ఏ మూలకైనా విషయాన్ని క్షణాల్లో చేరవేయగలిగిన సాంజేక పరిజ్ఞానం ద్వారా అక్షరాస్యతా కార్యక్రమాలను నిర్వహించగలగడం, 2. 35 %నికి పైగా జనాభా నగరాలకు తరలి పోతారన్న అంచనా, అంటే అక్షరాస్యత విలువను తెలుసుకోగలుగుతారు, 3. సాధించాలన్న తీవ్ర రాజకీయ నిర్ణయం ప్రస్తుతం మనకు అందుబాట్లో ఉన్నాయి కాబట్టి మనం అందరం, అన్నిటా కలిసి నడిస్తే 2022 కల్లా సాక్షరసమాజాన్ని సాధించుకోగలం.

మూలం : ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ అడల్డ్‌ ఎడ్యుకేషన్‌

రచయితలు : ఆర్‌.పి.సింగ్‌, జగదీష్‌ సింగ్‌


(20 వ పుట తరువాయి)

ఇక రాత సాహిత్య సంప్రదాయ విమర్శనా పద్దతులను మాత్రం, అటు ఆంగ్లం, తెలుగు రచయితలు, ఉపాధ్యాయులు ఎడాపెడా ప్రచారం చేయసాగారు. అస్తిత్సవాదం దీనికి ఊతమి చ్చింది. (మానవ స్వభావం ఇదీ అని కొన్ని లక్షణాలను మానవులందరూ ఒక అంగీకారంతో ఉంటారు కాబట్టి, లక్షణాలను మార్చటం ద్వారా మానవ స్వభావాన్ని సమాజాన్ని మార్చటం సాధ్యమే అనేది అస్తిత్వవాదుల భావన. ఇలాంటి మార్పులన్నీ మనీషి తనలోంచి తనే చేసుకోవాలన్నది వారి అభిప్రాయం. 23. సాహిత్య విమర్శ పదాల డిక్షనరీ. నళిని. 1999)

ఇలా సాంస్కృతిక రంగంలో “ఉపరి తలానికి చెందిన రచయితల కళాకారుల ప్రాబల్యం పెరుగుతుంటే, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ రాష్త్రాల వారిగా జానపద సంస్కృతి మీద ప్రచురణలు తెచ్చింది. సాహిత్య అకాడమి అటువంటి పని ప్రారంభించింది కానీ వాటికి బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణలకున్న సమగ్రత రావటంలేదు. తెగల వారీగా సాహిత్యం పై తెస్తున్న ప్రచురణలు తగినంత పరిచయం చేరిస్తే తప్ప జనానికి అర్ధం కావు. విశాఖలో గిరిజనసంప్రదాయ సాహిత్య సదస్సు, విజయవాడలో గిరిజన రచయితల సదస్సు అకాడమి జరిపించింది.

నేడు పరిశోధక విద్యార్దులు క్షేత్ర కృషి తగ్గించి, రాత సాహిత్యానికే పరిమితమౌతున్నాా గిరిజనులైన పల్లాల బొర్రంరెడ్డి, దాసరి చిన మూగన్న, తోకల గురవయ్య వగైరాలు సంప్రదాయ సాహిత్యం సేకరిస్తున్నారు. రాత సాహిత్వం, నుడికారాలను కొంత వాడుకుంటున్నా ఆ ప్రక్రియలకు ఒక పరిమితి ఉంటుంది. రచనలు విజ్ఞాన సర్వస్వాలు కావు. రచనలలో సమాజాన్ని చూడటం చూరులోంచి వెన్నెలను చూడటం వంటిదే.

అచ్చతెలుగు అభిమానులు, ఇటువంటి సంప్రదాయ సాహిత్యం సేకరణ, పునర్ముద్రణ పర్యావరణం, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పాతపంటల మీద ఆసక్తి పెరుగుతున్నందున, అందుకు సంబంధించిన సామెతలు నుడికారాలను గుర్తు చేయడం, వాటిని శాస్త్ర పరిశోధనలకు, సాహిత్య రచనలకు ముడిసరుకుగా అందించటం, జీవవైవిధ్యం, అడవులు, సముద్రం, బీళ్ళు - ఈ ఉమ్మడి వనరులను వాటిమీద ఆధార పడిన జాతుల తెగల పరం చేయటంలో ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు, సిద్దాంతాలు వల్లిస్తూ, అమలును పక్కదారి పట్టిస్తున్న “ప్రగతిశీల” రాజకీయాలను చర్చించటం, మాండలికంలో వస్తున్న రచనలను - సంప్రదాయ సాహిత్యం నేపధ్యంలో సమీక్షించటం, వాటిలో జారిపోయిన, లోపించిన విషయాలను గుర్తుచేయటం పంపిణి పెంచుకోటానికి ఈ పంటల, రుచుల ప్రచారానికి, ప్రామాణిక భాషలో చేస్తున్న రచనలలో లోపిస్తున్న మూలాలు, తెలుగుతనం ఎత్తిచూపటం ఇలా ఎన్నో విధాల తన్నుకొస్తున్న జనం వారసత్వం తెలియచేయటం మీద దృష్టి పెట్టాలి.

“గేర్లు ఎలాగా మార్చాలో ఎవరైనా ఒకసారి చెప్పేస్తే, హెలికాష్టరు కాదు, దాని అమ్మ బాబు నైనా నడిపేవచ్చునండి' 'అప్పన్న సర్దార్‌ ' లో రచయిత పతంజలి చెప్పిన మాటల్లో మర్మం గ్రహించి భాషాభిమానులు గేరు మార్చాలి.

“జడలు విచ్చిన సుడులు రెచ్చిన కడలి నృత్యం శమిస్తుందా నడుమ తడబడి, సడలి మునుగక - పడవ తీరం క్రమిస్తుందా ... నిజంగానే...నిజంగానే...శ్రీ శ్రీ.