అమెరికా సంయుక్త రాష్ట్రములు/పీఠిక

పీఠిక

ఎంతయో కష్టపడి గ్రంథకర్తలు గ్రంథములు వ్రాయుటయు, ఏమియుకష్టపడని కొందరు వీరి గంధము లకు పీఠికలు వ్రాయుటయు లోకములో ఆచారమైనది. ఇది కేవలము పడమట దేశపు ఆచారము. అక్కడజనులు ఒకరి నొకరు తెలుపుకొనరు. మూటలు కలుపుకొనరు. మధ్యస్థులెవరో వీరిని కలుపవలెను. గ్రంధరచనలోనికికూడ ఈఆచార మే కొంత వరకు పాకినది. ఆ దేశపు ఆచారములన్నిటిని మనము అను కరించుచున్నట్లే దీనినికూడా అనుకరించుచున్నాము. అను కరించుట తప్పు అని ఒప్పుకొనెదము, కాని తప్పు అని తెలిసిన దానినుండి తప్పించుకొనలేక పోవడము రెండవ తప్పు. ఇందులో పీఠిక వ్రాయవలసినదని కాళేశ్వరరావు గారు అడగడము ఆయనది తప్పు. అదితప్పు అని తెలసికూడా నేను వ్రాయుటకు పూసుకొనుట నాదితప్పు. ఈ ఉపోద్ఘాతములో ఏమి వ్రాయ వలెనోకూడా నిర్ణయించుట కష్టము. కాని గ్రంధకర్తను మన ఆంధ్ర దేశముకు ఎరింగించుట ఇటువంటి ఉపోద్ఘాతములలో మొదటి కర్తవ్యము. ఆంధ్ర దేశములో కాళేశ్వరరావుగారిని ఎరుగని వారెవరును ఉండరు, కారా గృహముల కెళ్ళి దేశాభిమానులు గ్రంథములు వ్రాయుచుండగా వెళ్ళనివారు ఉపోద్ఘాతములైనా వ్రాసి తమ కర్తవ్యమును నెరవేర్చవలసియున్నది. అందుచేత జగ మెరిగిన కాళేశ్వర రావుగారికి ఈ జంధ్యపు పోగు వేయవలసి వచ్చినది.

16 వ శతాబ్దమునందు ఆంగ్లేయులంత సోమరిపోతులు

ఎవరు లేరనియు "స్పెయిను దేశస్తులకంటే వీరు ఎక్కువ పనికి మొండి వేయువారనియు మెటిరన్ అను చరిత్రకారుడు , వ్రాసి యున్నాడు. అటువంటి వారు మత స్వాతంత్ర్యముకొరకు అమెరికా దేశమున కేగి అక్కడవలసలను స్థాపించి ఆవలసల యందుకూడ తల్లిదశ పుష్ప్రజలును, ప్రభువులును పెట్టు ధల కోర్వజాలక చివరకు బ్రిటీషు వస్తు బహిష్కార మాచరించి బ్రిటీషు పన్నుల నియ్యమని నిరాకరించి, ఇంగ్లండు వారితో యుద్ధము చేసి, స్వరాజ్యమును స్థాపించుకొనినారు. అమెరికనులన్న ఒక్క జతివారు కారు. 16 భాషలు మాట్లాడువాడును అంతకంటే ఎక్కువజాతులవారును అమేరికా సంయుక్త రాష్ట్రమందు నివసించుచున్నారు. వీరు 1778 లో స్వాతంత్ర్యము సంపాదించిరి. 18వ శతాబ్దాంత ముందు ప్రాస్సువారుకూడా రాజును చంపి వేసి అమెరికా వారు స్వాతంత్ర్యమును స్థాపించుకొనిన ఇరువది సంవత్సరములకు తమ దేశ మందు ప్రజాస్వామ్యమును నెలకొల్పుకొనగలిగినారు, కాని 18వ శతాబ్దపు భావములున్నూ అదర్శములన్నూ "స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము" అను భావముల నాశ్రయించి మాత్రమే నిర్ణయింపబడి యుండెను. ఇవన్నియు వ్యక్తి నత్త్వములుగాని, వ్యక్తులను సమ్మేళనము చేయు ధర్మములు కావు. సౌభ్రాతృత్వమున్న భావములో కూడ సమ్మేళనభావముకంటే సమానభావమే ఆకాలపు చరిత్రము నడిపినదైయుండెను. 19వ శతాబ్దమునందు అయిరోపాలోని భావములు మార్పు జెందినవి. బ్రిటీషు వారితో యుద్ధము సల్పకయే కనడా దేశస్థులు 1861 సంవత్సరములో తమ జాతి

యతను స్థాపించుకొనిరి. 1664లో కొన్ని యుద్ధములు జరిగిన పిమ్మట ఇటలీ దేశ వాస్తవ్యులు ఆస్ట్రియా దేశపు దాస్య మును తప్పించుకొని, స్వజాతీయతను నిర్మిందుకొనిరి. ఫ్రెంచి వారు సయితము తమ ప్రజా స్వామ్యుమును రెండుసార్లు నిరంకుశప్రభువుల బాహుబలముచే పోగొట్టుకొని, తిరిగి రెండు సార్లు స్థాపించుకొనిరి. గ్రీకు దేశపువాస్తవ్యులు శతాబ్దమధ్య మున తమ జాతీయ వ్యక్త తను తిరిగి సంపాదించు కొనగలిగి అయోనియన్ దీవులను ఒక రాజ్యముగ నిర్మాణించు కొనిరి.


1861 వరకు అంతఃకలహములచే పీడింపబడుచున్న జర్మనీ రాష్ట్రములు 1872వ సంవత్సరములో ప్రెంచివారిని ఓడించి పరిపూర్ణ సౌష్ట్రవమును ఆధునిక జాతీయతయు గలిగిన రాష్ట్రముగ మారిపోయెను. ఈ అమెరికా వలసలే ఉత్తరపు ప్రాంతముల కొన్నియు దక్షిణమున మరికొన్నియురెండు శాఖలుగ ఏర్పడి (Federlists), ఫెడరలిస్టు ఆను ఉత్తర ప్రాంతము వారికిని (Confederates) కాన్ఫిడరేట్సు అను దక్షణ ప్రాంతము వారికిని బానిసల నుంచుకొన వచ్చునా లేదా అను విషయమును గూర్చి 1860 మొదలు 1865 వరకు ఘోర యుద్ధము జరిగినపిమ్మట ఉభయులును కలసి అమెరికను రిపబ్లికు అనుప్రజాస్వామ్యమును స్థాపించిరి. ఇంక 20వ శతాబ్దమునకు వచ్చినచో 19 వ శతాబ్దపు చరిత్రలోని సశేషము ఇచ్చట పూర్తి అయినది. అయిరోపా మహాసంగ్రాకామానంతరము 6 శతాబ్దముల క్రింద స్వాతంత్ర్యమును గోల్పోయిన పోలెండుకు జాతీయతావ్య క్తత ఒసంగ బడినది. ఇట్లు యీ


దేశము, జర్మనీ, ఆస్ట్రియా, రష్యా, దేశముల దాస్యమునుండి తప్పించుకొనినవి. ఇటులనే జెకోస్లావులును జూగోస్లావులును ప్రత్యేక రాష్ట్రములను స్థాపించుకొనినవి.

ఇంక మిగిలినని అయిర్లాండు, ఈజిప్టు, ఇండియూ దేశములు. అయిర్లాండు 7 శతాబ్దములనుండి తన స్వాతంత్ర్యముకొరకు పోరాడుచు కడపటకు రక్తపాతపూర్వక మగు నొక విప్లవముచే నొక విధమగు స్వరాజ్యమును స్థాపించుకొనినది, ఇంక ఈజిప్టు ప్రాక్పాశ్చాత్య దేశముల మధ్యనుండి రక్తపాత మగుపద్ధతులకున్నూ దౌర్జన్య రాహిత్యమగు పద్ధతులకున్నూ మధ్యస్థ మగుపద్ధతుల నవలంబించి తన స్వాతంత్ర్యము కొరకు పోరాడియున్నది. ఇండియాదేశము కేవలము ప్రాగ్దృశమై యుండి అహింసా సత్య ములను ధర్మముల ననుసరించియే స్వరాజ్యమును స్థాపింప యత్నించుచున్నది. కాని కడచిన నాలుగు సంవత్సరములనుండియు గావింప బడిన యత్నములయొక్క జయాపజయములను గూర్చి చర్చించుట కిది సమయము కాదు, స్థలమును కాదు. ఇట్లు ప్రతి దినమును ప్రపంచమునందలి భావములను ఆదర్శములును మారుచున్నవి. ఈనాటికి మన దేశమునందు ప్రబలియున్న అహింసాతత్వము నూతనముగ పుట్టినది కాదు. వెనుకటిశతాబ్దములందు ప్రబలి యున్న భావజాలములను బట్టి ఉత్పత్తియైన తత్వమే. కాలప్రవాహమునందు వర్తమానము, భూతము, భవిష్యత్తు అను మూడు వేరు వేరు శాఖలు ప్రవహించుట లేదు. ఇవన్నియు ఒక ప్రవాహము యొక్క వివిధభాగములే కావున ఇప్పుడు ప్రబలుచున్న భావములను క్రమముగమ ఇది సంపూర్ణముగను ఆపగాహన చేసుకొసవలెనన్న పూర్వచరిత్రను మనము సంపూర్ణముగ చదువుకొనవలెను. అట్టిచరిత్రను తెలుగు గ్రంథములు మన ఆంధ్రమునందు విశేషముగ లేవు. శ్రీ కాళేశ్వరరావుగారు అమెరికా దేశచరిత్రమును వ్రాసి ఆంధ్రదేశమునందు ఇట్టి లోపమును కొంతవరకు తీర్చినారు. ఇందుకు వారికి మనము కృతజ్ఞులము.