అమెరికా సంయుక్త రాష్ట్రములు/పన్నెండవ అధ్యాయము


పన్నెండవ అధ్యాయము.

అమెరికాలో నీగోల పస్తుత స్తితి.

(1) యుద్దము ముగిసినది. నీగ్రోలకు బాసత్యము రద్దు పర్చబడినది. కానీ దక్షిణ రాష్ట్రములలోని తెల్లవారు బుద్ధిపూర్వకముగా నీగ్రోలకు స్వేచ్చని వ్వలేదు. సంయుక్త ప్రభుత్వములో నుత్తర రాష్ట్రములహం కక్షి యగు రిపబ్లికను కక్షి యే కొంత కాలము పలుకుబడి గలిగి ముండెను దక్షిణ రాష్ట్రములలో, తెల్లవారిలో తోట, యజ మానులకును పెద్ద భూఖామందులకును బానిసలకు 'స్వేచ్ఛనిచ్చుటవలన చాల నష్టముకలిగెను. వారిభూములు తోటలు పాడుబడినవి. తమకి కిందవున్న బానిసలు స్వచ్ఛమంది లేచిపోవుటయు సొమ్మచ్చి కూలీలను పెట్టుకొని లోటలలోను భూములలోను పనిచే చేయించు కొనవలసి వచ్చుటయు తటస్తిచెను. ఈతోటల యజమూసులు నీగ్రోలకు స్వేచ్చనివ్వక ప్రతిఘటించిరి. సంయుక్త ప్రభుత్వము తోటల యజమానులకు దయా


దాక్షిణ్యములు చూపగ, బానిసలను పోగొట్టుకొనినందుకు . భూఖాముందులకెట్టి నష్టపరిహారమును ఇవ్వక, సైనికులను బంపి దక్షిణ రాష్ట్రములలోని బాసిసలకందరికిని బలవంతముగా సేచ్ఛనిచ్చిం. దక్షిణాది భూకామందులు తమతము. రాష్ట్రప్రతినిధి సభలలో విశేషముగ పలుకుబడి గలిగియుండి నందున దానినంతయు వినియోగించి సేచ్ఛనొందిన నీగ్రోలపై నిర్బంధములు ప్రయోగించి వారిని బానిసత్వమునకు తుల్య మగు స్తితికి తెచ్చుటకు సర్వప్రయత్నములను చేసిరి. నీగ్రోలకు స్వేచ్ఛవచ్చేనేగాని వారికి తినుటకు తిండి లేదు. కట్టు కొనుటకు బట్టలు లేవు. నిలచుటకు నీడ లేదు. ఈ అవకాశము తీసుకొని దక్షిణ రాష్ట్రములవారు. పెక్కు నిర్బంధ శాసనములను చేసిరి. అయిదుగురు నీగ్రోలు కలిసి మాట్లాడిన, నేరమని చట్టము చేసిరి. నీగ్రోలు స్వేచ్చమొందినప్పటికి తెల్లవారితో సమానులు కారనియు గావున ఎట్టిపౌరస్వత్వములు లేవనియు శాసించిరి. పదునెనిమిది సంవత్సరములలోపున సున్న నీగ్రోలకు నిర్బంధముగా పని నేర్పవలెననియు వెనుకటి యజమానుల క్రిందనే పని నేర్చుకొనవలెననియు శాసించిరి. నీగ్రోలు తెల్లవారి క్రింద కఠిన షరతులకు లోబడి నౌకరీచేయునట్లు నిర్బంధించిరి. తెల్లవారికి నీగ్రోలెప్పుడును ఋణపడునట్లు ఏర్పాటు చేసి ఋణపడిన నీగ్రో తనఖాకీ దారుడగు తెల్లవాని కింద నిర్బంధముగా పనిచేయునటుల శాసించిరి. ప్రతి స్వల్ప నేరమువకను నీగ్రోలకు ఖైదు వేయుటయు ఖైదు వేసినవారిచేత తెల్ల వారికింద పనిచేయించుటయు జరిగెను. నీగ్రోలు సాధారణముగా పనిలేక నేరములుచేయు ద్రిమ్మరు


లగు జాతులని పరిగణించు శాసనములను చేసిరి. నీగ్రోలు మీద తలపన్ను విధించిరి. పన్ను ఇవ్వనిచో ఖయిదువేసిరి. తెల్ల వారికింద పనిచేయించి, కొంచెమించుగా వెనుకటి బానిసత్వపు స్తితికే నీగ్రో తేబడెను.


ఉత్తర రాష్ట్రములవారు దీనిని సహించ లేదు. యుద్దముయొక్క ఫలితములు నాశనమగుటకు సమ్మతించ లేదు. వీరి రిపబ్లికసు కక్షిలో దక్షిణ రాష్ట్రములలోని తోటల యజమానుల గాక సామాన్యలగు తెల్లవారు చాలామంది చేరిరి. కొంతకాలము రిపబ్లికను కక్షివారేసంయుక్త ప్రభుత్వమునందు ఎక్కుప సంఖ్యాకులుగనుండి దక్షణ రాష్ట్రముల వారిని ప్రతిఘటించిరి. సంయుక్త రాష్ట్రములలో నెచటను కూడ జాతివలనగాని, రంగుకారణమునగాని, లేక వెనుక బానిస గానుండిన కారణముచేతగా, ఎవరికిని పౌరస్వత్యములు పోగూడదని సంయుక్త రాష్ట్ర ప్రభుత్వము వారు సంయుక్త రాష్ట్ర రాజ్యాంగ విధానములో సవరణగావించిరి. సుయుక్త ప్రభుత్వము వారు దక్షణ రాష్ట్రములలో స్వేచ్ఛను పొందిన నీగ్రోల సంరక్షణకై యొక యుద్యోగుల యుప సంఘము నేర్పరచివి. ఇదివరకు బానిసత్వముస కాపాడుటకై యుద్ధములో పనిచేసిన వారందరును రాజ్యాంగములో పాల్గొనకుండ చట్టములను చేసిరి. దక్షిణరాష్ట్రములలో సంయుక్తప్రభుత్వము వారు సైనికుల నుంచిరి. నీగ్రోలకు పెద్దయుద్వోగములివ్వబడెను. వీరి శాసనసభ్యత్వముకూడ లభించెను తెల్ల వారునూటికి ఎనుబది చొప్పున పన్నులిచ్చుచున్న ప్పటికిని చాలచోటుల నీగ్రోలే పన్నులువేయునధీ కారమును పొందిరి. లోని నీగ్రోలు అధికారగర్వమువలన అక్కడక్కడ తెల్ల వారి నవమాస పరచుట తటస్థించెను. తెల్లవారు రహస్య సంఘములుగా నేర్పడి దుండగులుగా వర్తించిన నీ, గ్రోలను తామే క్రూర హింసలు గావించిరి.


ఈవిధముగా ఉత్తర రాష్ట్రముల కక్షివారికిని దక్షిణ రాష్ట్రములలోని ముఖ్యులగు తెల్ల వారికిని 1870 వ సంవత్సరము పరకును పోరాటములు కలిగెను. 1870 వ సంషత్సరమున నీగ్రోలను సంరక్షించుట కేర్పడిన ఉద్యోగీయుల ఉపసంఘము రద్దుపరచబడెను. " యుద్ధములో పాల్గొనిన తెల్ల వారిమీద సుపయోగించబడిన నిర్బంధములన్నియు తీసి వేయబడెను. ప్రభుత్వపు సైనికులను తీసి వేసిరి. నీగ్రోలకు చేయబడిన ప్రత్యేక సహాయమంతయు మాని వేసిరి.

(2)

నీగ్రోల హక్కులు
తీసివేయబడెను.

ఉత్తరాదివారును దక్షణాది వారుసు రాజీపడిరి. తెల్లవారందరును ఏక మైరి. దక్షిణరాష్ట్రముల లోని తెల్లవారికందరికిని వోట్లువచ్చెను. యుద్ధమమునకు పూర్వమువలెనే రాజ్యాంగ వ్యవహారములను, తెల్లవారు చెలాయించిరి. నీగ్రోలకు వోట్లను పౌరహక్కులును లేకుండా చేయు ప్రయత్నములు తిరిగి బాగుగాగా సాగెను. ఇప్పుడు బానిసత్వపుయుద్దమువకు పూర్వము లెనే దక్షణరాష్ట్రములోని నీగ్రోలు గాచకీయ " హక్కులు సంపూర్ణముగ కోల్పోయియున్నారు. నీగ్రోల ప్రస్తుతము రాచకీయ స్థితిని గూర్చి పాలు వేలండ హావర్తు అను అమరికను గంధకర్త.- .


"జూతి, వర్ణ , వెనుక బానిసగా నుండుట, ఈకారణములలో దేనిచేతనుకూడ పౌరునికిని పౌరస్వత్యములు తీసి చేయుటకు వీలు లేదని సంయుక్త ప్రభుత్వము వారు చేసిన చట్టమువలన నీగ్రోలకు రాజకీయస్వత్వములు పోవుటకు వీలు లేదని కొందరు తలచ వచ్చును. కాని ఈనిబంధనను తప్పించుకొనుట అనేక మార్గములు తెల్లవారిచే పన్న బడినది. 1871 సంవత్స రఘు తరువాత బలవంతమువలననో ఘోసమువలననో దక్షిణ రాష్ట్రములలో నీగ్రోలకు రాజకీయ హక్కులు తీసివేయబడినవి. ప్రతి ఓటకునకు ఆస్తి విద్య యుండవలెనను నిబంధిన క్రింద విశేషసంఖ్యాకులగు నీగ్రోలకు ఓట్లు లేకుండ చేసిరి. ఇట్టి నిబంధనలక్రింది కేవచ్చు బీదలయినట్టియు విద్య లేనట్టియు తెల్ల వారికి , తాతలు గొప్పవారనియో" , తగినంత జ్ఞానముక కలదనియో' మినహాయింపులు చేసి ఓట్లు ఇవ్వబడును. ఈ నిబంధనలను వర్తింపచేయుటలో తెల్ల ఉద్యోగస్తులు తెల్ల ఓటర్లకుమిగుల తేలికగను సల్లఓటర్లకు మిగుల కఠినముగను వర్తింపచేయు చున్నారు. దీనికంతకు కారణము నీగ్రోలను ఎటులైన రాజకీయ రంగమునుండి వెళ్ళగొట్టవలెనని తెల్లవారికిగల ప్రబలముగు ఇచ్చయే....... ప్రస్తుతము దేశములో ప్రబలియున్న పరిస్తితులను బట్టి నీగ్రోలకు రాజకీయ హక్కులు ప్రసాదింపబడునని తలచుటకు వీలు లేదు.”

నీగ్రోలు
తెల్ల స్స్త్రీలను
వివాహమాడరాదు.

ఇంతటితో ఆగలేదు, నీగ్రోలకు ఓట్లు లేకుండ చేసి వారిని రాచకీయముగ నీచమగుస్తితిలో తెచ్చుట యేగాక వారివిషయములో సనేక పాక్షిక మగు చట్టములును చేయబడెను. 1910 వ


సంవత్సరములో 48 రాష్ట్ర ములలో 26 రాష్ట్రములవారు నీగ్రోలు తెల్లజారితో వివాహమాడరాదని శాసించిరి. అట్టివిహములు చెల్లవని శాసించుటయేగాక అట్టివివాహములు చేసు కొనిన వారికి శిక్షలువిధించు నట్లు చట్టములు చేసిరి. కొన్ని రాష్ట్రములలో 700, రూప్య ముల జుల్మానా మొదలు మరికొన్ని రాష్ట్రములలో పదిసంవత్సరముల ఖైదువరకును శిక్షలు నిర్నయించబడెను. ఇటులనే నీగ్రో పురుషులకును తెల్ల స్త్రీల కును వ్యభిచార సంబంధ మున్న చోటులగూడ నీగ్రో పురుషు లకు శిక్షలు విధించు చట్టములను చేసిరి.

నీగ్రోలు తెల్ల
వారెక్కు రైలు
డబ్బాలలో
ఎక్కగూడదు.


ఇంతేగాక దక్షణ రాష్ట్రములలో తెల్లవారెక్కు రైలు బండి డబ్బాలలో నల్లవారెక్కకుండ నిర్భంధములుచేసి నల్లవారెక్కుటకు "వేరుడబ్బాలు ఏర్పాటుచేయబడెను. కొన్ని రాష్ట్రములలో స్టీమరులలోను ట్రాంబండ్లలోసు కూడ 'తెల్లవారెక్కుటకు వేరు ప్రదేశములును నీగ్రోలెక్కుటకు వేరుప్రదేశములును ఏర్పాటు చేయబడెను. సాధారణముగ వేరు వేరు ట్రాంబండ్లు ఏర్పడియున్నవి. కానికొన్ని చోటుల ట్రాంబండ్లలో ముందుబల్ల లన్నియు తెల్లవారికిని వెనుక బల్లలు నల్ల వారికిని నిర్ణయించబడినవి. సాధారణముగా ఎంత భాగ్యవంతుడైనను నీగ్రో, బాటసారికి రైలుబండిలో నిద్రించుటకు స్థానమివ్వబడదు. కొన్ని రాష్ట్రముల లోనికి రైలురాగానే నిద్రించుట కేర్పడిన స్థానమును వదలి నీగ్రోబాటసారి మామూలుగా కూర్చొను స్థానము మునకువెళ్ళి తీరపలెను. ఒకేమొత్తమును పుచ్చుకొనియు అతి

తరుచుగా రైలు వేలలో తెల్లవారికి మంచి సదుపాయములను నల్లవారికి తక్కువవీళ్ళును చేయబడుచున్నవి.

తెల్లవారు
నల్లవారు కలిసి
చదువుకొనరాదు.

దక్షిణ రాష్ట్రములలో తెల్లవారి పిల్లలును సల్లవారి పిల్లలును ఒకే పాఠశాలలో చదువుకొన గూడదు. కొన్ని రాష్ట్రములలో నీగ్రోలకు తెల్ల వారును తెల్లపిల్లలకు నీగ్రోలును ఉపాధ్యాయులగ నుండగూడదని చట్టములను చేసిరి.

నీగ్రోలు అమెరికాలో
మాల మాదిగెల కన్న
హీనముగ చూడబడుదురు.


(3) ఉత్తర రాష్ట్రములలో కూడ కొంత కాలముకు నీగ్రోలయం దసహ్యము కలిగెను. బానిసత్వపు యుద్ధపు కాలమున నీగ్రోల యభివృద్ధి కొరకు ఉత్తరాది తెల్లవారు చేయుచుండిన సహాయముసు క్రమ క్రమముగా మాని వేసిరి, నీగ్రోలు తమకన్న తక్కువ జాతీయసంభావము ఆమెరికాలోని తెల్లవారందరిలోను తీవ్రముగ వ్యాపించినది. ఎవరో కొద్దిమంది 'నీగ్రోలకొరకు పనిచేయు క్రైస్తవమత బోధకులు లిప్ప మిగిలిన తెల్ల వారందరును నీగ్రోలను హిందూ దేశములోని మాల సూది గెలకన్న హీనముగ చూతురు. తెల్లవారి పూటకూళ్ళ యిండ్లలోనికిని, క్రైస్తవ యువజన సంఘములకుసు, క్రైస్తవ యుపతీజన సంఘములకును , నాటక శాలలకును నల్లవారిని రానివ్వరు. తెల్లవారిని పాతి పెట్టు చోట నల్లవారిని పాతి పెట్టనివ్వరు.

నల్లవారి సాంఘిక
బహిష్కారము.

తెల్లవారిని నల్ల వారికిని అందరును క్రైస్తవులే నెల్లగా సాంఘిక యైనను ప్రార్ధనామందిరములు వేరుగనున్నవి. తెల్ల వారి పూటకూండ్లయిండ్లు వేరు. నల్ల. వారి పూటకూలిబసలు వేరు. పట్టణములలో వల్లెలలోను తెల్లవారు కాపురముండు ప్రదేశములలో నల్లవారు కాపురముండుటకు వీలు లేదు. నల్లవారు కాపుర ముండుటకై ప్రత్యేక ప్రదేశములు ఏర్పాటు చేయబడినవి. న్యాయస్థానములలో తెల్ల వారికిని సల్ల వారికిని తగాదాలు కలిగినపుడు తెల్లవారికి పక్షపాతమును నల్ల వారికి అన్యాయమును చేయ బడుచున్నది. ఒకేనేరములకు తెల్లవారికి తేలికగుళిక్షలును, నీగ్రోలకు కఠినశిక్షలును తెల్లని న్యాయధి పతులచేత వేయబడుచున్నవి. నీగ్రోన్యాయాధిపతులు లేనే లేరు.


నీగ్రోలను చిత్ర
వదలు చేయుదురు


నీగ్రోలయందు తెల్లవారు చూపుచున్న అసహ్యమునకు ఘోర నిదర్శనము నీగ్రోలను విచారణ లేకుండా తేల్లవారు చేయచున్న చిత్రవధలే అమెరికాలోని నీగ్రోలు తెల్లవారి కపచార మొనర్చిరని నమ్ముటతోడనే తెల్ల ప్రజలు గుంపులు గుంపులంగా బయలుదేరి నేరముచేసినట్లు తలచిన నీగ్రోలను తమంతట తామే పట్టుకొని వచ్చి చిత్రవధలను గావింతురు. ఇందుకీ తెల్లవారు శిక్షింపబడరు. విచారణతోసు న్యాయాధిపతుల తీర్పులతోను పనిలేకుండ ఉద్రేక వూరితులగు తెల్లప్రజలే నీగ్రోలను చిత్రవధలు చేయుటయు యిందుకు తెల్లవారి కెట్టి, శిక్షలును లేకుండుటయు ప్రపంచములో కెల్ల మిగుల నాగరీ కుల

మని చెప్పుకొనుచున్న అమెరికాలో నేటికిని జరుగుచున్న పద్ధతి. 1885 సంవత్సరము మొదలు 1914 సంవత్సరము వరకు షుమారు మూడు వేల మంది నీగ్రోలిట్టి చిత్రవధలకు లోనైరని అఖ్కలవలన తేలుచున్నది. 1911 వ సంవత్సరమున సూరుమంది నీగ్రోలు చిత్రవధలు గావింపబడిరని క్రైసిను అనుపత్రిక వ్రాసినది. శ్రీయుత లాలా లజపతిరాయిగారి అమెరికా సంయుక్త రాష్ట్రములను గ్రంధము 1916 వ సంపత్సరములో రచించుట చేత 1914 వరకు మాష్ట్రమే వారంకెలానిచ్చినారు. కాని ఈ ఘోరమగు ఆచారము నేటికిని అమెరికాలో జరుగుచున్నది.


ఈచిత్రవధల యొక్క కొన్ని యుదాహరణములూ లాలాజీగారి గ్రంధములో అమెగా పత్రికలనుండి ఎత్తి.. (వ్రాయబడినవి. కొన్నిటిని మాత్రమిచట యుదహరించెదము.


1911 అక్టోబరు 20 -- జెర్రివలాసు అను నీగ్రో ఒక తెల్ల వానిని గడచిన రాత్రి కొట్టుచున్నందున పట్టుకొని వచ్చి జైలులోనుంచిరి. ఈయదయము 2 గంటక వేళ ముప్పదిమంది తెల్లవారు వానిని జైలులో నుంచి బయటకు లాగుకోని వచ్చి చిత్రవధగాగించిరి. మేనెల 26వ తేదీ" ఒక నీగ్రో స్త్రీ యొక షెరీఫుమీద తుపాకి కాల్చినది. ఒక తెల్ల ప్రజలగుంపు అమెను ఆమెయొక్క పదునాలుగు సంవత్సరముల ఈడుగల కుమారునితోకూడ యురితీసిరి. ఆఏను ఉతీయకముందు.. బలవంతముగా చెరిచిరిరి. *[1]

మేనెల 20వ తేది - ఒక ప్రముఖుడగు పౌరుని - - హత్యకు సంబంధించినటుల ఆరుగురు నీగోలు వైదులో సంచబడిరి. కొంతమంది తెల్లవారు మోటారు కారులో వచ్చి యొక ఫోజరీ టెలిగ్రామును జై లరు కుమారునికి చూపి జెలులోనుంచి వారి యూరుగురిని తీసికొనిపోయి చిత్రవధలను గావించిరి. వారిలో నొకడు మాత్రమే హత్యకు సంబంధించిన నేరము మోపబడినటుల తేలినది,

. - ఆగస్టు 18 -- ఒక నీగ్రో తాగి యొక తెల్లవానిని తుపాకితో కాల్చిచంపెను. ఆనీగ్రో ఆనుపత్రిలో పడుకొని యుండగా కొందరు తెల్లవారు వానిని తిసుకొనిపోయి మంటల లోపడ వేసి చంపిరి. మంటలలోనుంచి లేచి బయటకు రాప్రయత్నించగ వానిశరీరమును కర్రలతో గుచ్చి తిరిగి మంటలోకి తోసి, " ఈ వినోదము " ను సల్పినందుకు వీరివి పట్టుకొని విచారించి కేసుకొట్టి వేసిరి.


జులై - లారెన్సు వెల్లీలో న్యాయాధిపతిగ నున్న చార్లెసు బ్రాండుగారివద్దకు యిద్దరు నీగ్రోలు విచారణకు తేబడిరి. ఒకని పై ఒక తెల్ల స్త్రీని అవమాన పరచినందుకును మరియొకడు అనుమానముగా తిరుగుచున్నాడనియు నేరమాపాదించిరి. వీరిలో నొకడు యిద్దరు పోలీసువారి 'హావాలాలో రైలులో పోవుచుండగ చాలమంది తెల్లవారు వానిని లాగు కొనిపోయి చిత్రవధ గావించిరి. ఆ చిత్రవధ జరిగినపుడు రైలు ఆగెను. రైలలోని ప్రయాణీకులు వినోదమును చూచు చుండిరి. రెండడవాడు జైలులో నుండగ అనేక వందల మంది తెల్లవారు వచ్చి వానిని లాగుకొనిపోయి చిత్రవధ గావించిరి. పటాలములను పిలిపించి, గుంపులను చెదరగొట్టి ఈ యిద్దరు

ఖైదీలను యేల సంరక్షించలేదని ప్రశ్నించగా న్యాయాధిపతి యగు బాండు యిటుల చెప్పెను.

" దేశములోని యిట్టి నీగ్రో నేరస్తు లందరికొరకునుయే తెల్లవాని జీవితమునైన బలి యిచ్చుటకు నేను ఒప్పుకోన జూలను. ......... నా మనస్సాక్షి కివి నా భగవంతునికి... నేమ చేసినపని న్యాయముగా నున్నది. ఇట్టి నూరుమంది నీగ్రోల , ప్రాణములను కాపాడుటకై యొక్క తెల్లవాని ప్రాణముసకైన అపాయకరమగు కార్యమును నేను చేయజాలను, ”


అమెరికాలోని తెల్ల వారిలో నీగ్రో లను గూర్చి మూడువిధములైన యప్రాయములు గలవు. కొద్ది మంది యుత్తములు భగవంతుని యెదుట తెల్లవారును నీగ్రోలును సమానులు గావున యభయుల మధ్యను ఎట్టి భేదములు సుఁండగూడదని తలచు చున్నారు. మరికొందరు నీగ్రో లయం దసహ్యము చూపుట చెడు పని యేగాని నీగ్రో లకును తెల్ల వారిని నాగరికతలో చాల భేదమున్నది గావున సాధారణముగా నీగ్రో లను తెల్ల వారితో సమానముగా చూడుట అసంభవమనియు వారిలో విద్యాధికులడు, యెక్కువ నాగరీకులను తెల్లవారితో సమానముగ చూచుటకెట్టి యభ్యంతర ముండగూడదనియు చెప్పుదురు. మూడవ రగమువారు నీగ్రో యేప్పటికిని తెల్లవాడు కానేరడనియు స్వభావముగా సల్లవారికిని తెల్ల వారికిని గల భేదము విద్యవలవసు పైమెరుగులవలనను పోవునది కాదనియు గావున నీగ్రో ను తెల్లవారితో సమాసముగయెన్నటికి చూడగూడదనియు నమ్ముచున్నారు. వీరే అధిక సంఖ్యాకులుగనున్నారు. (4)

నీగ్రోల
స్థితి


అమరికా సంయుక్త రాష్ట్రముల జనసంఖ్య పదికోట్ల తొంబది అయిదు లక్షలు గలదు. వీరిలో ఒకకోటి పదిలక్షలు నీగ్రో లున్నారు. ఈ నీగ్రోలలో విద్య బాగుగా వ్యాపించినది. 'ఆనేకులు భాగ్యపంతులును గొప్ప విద్యావంతులును గలరు. నీగ్రో యగు డాక్టరు ద్యూబాయిగారికంటే గొప్ప గ్రంధకర్త అమెరికాలో పుట్టలేదు. బుకరు వాషింగ్డను కంటె మానవ సేవా ధురంధరుడు ఏదేశములోను పుట్టలేదు. ఇట్టివారినికన్నందుకు నీగ్రో జాతియే గాక ఏజాతియైనను గర్వపడదగియున్నది. అనేక మందినీగ్రోలు సర్వకళాశాలలలో ప్రతిసంవత్సరము చేరుచున్నారు. అనేక ముది నీగ్రోలలో తెల్లవారెరక్తము ప్రవహించుచున్నది. తెల్లపురుషులకు నీగో స్త్రీలకు పుట్టిన వారనేకమంది యున్నారు. నీగ్రోలలో అనేకులు తెల్లవారితోపాటు తెల్లగా నున్న వారున్నారు. అయినను నీగ్రో తమతో బాటు తెల్లవారు భోజనమునకు కూర్చొననివ్వరు. తమ పూటకూండ్లయిండ్ల లోను ప్రార్థనామందిరములలోను చేర్చుకొనరు. నీగ్రో కేవలము కారునలు పైనను మిగుల తెల్లగానున్నను ఒకేవిధముగ తెల్ల చారిచే బహిష్కరింప బడుచున్నాడు. స్వయం సహాయము కొరకును తమ అభివృద్దికొరరను నీగ్రో లనేక సంఘములు పెట్టుకొనియున్నారు. వారి తాలూకు ఒక్క క్రైసిసుపత్రికతకు ముప్పది వేలమంది నీగ్రో చందాదారు లున్నారు. దీని వలన నీగ్రో లెంత నాగరికులుగ నున్నారో తెలియగలదు. నీగ్రోలలో దావాపుగా అందురును క్రైస్తవులే. అయినను

తెల్ల వారు వీరిని నౌకర్లుగస , కావలివాండుగను, వంటవాం డ్లుగను పెట్టుకొనుటకు ఎట్టి ఆభ్యంతరము లేదుగాని తమతో సమానముగ కూర్చొని భోజనము చేయుట కుము తముతోకలసి విద్య నేర్చుకొనుటకును తమతో సమాసముగ రాచకీడు హక్కులు పొందుటకును అభ్యంతరపర్చుచున్నారు. నీతో ఆకు నీచమగు ఉద్యోగములు తప్ప న్యాయాధిపతులు మొద లగు గౌరవమగు ఉద్యోగములు లేకుండా చేసినారు. న్యాయ పానములలో వీరికి న్యాయము లేకుండ చేసినారు. తరుచుగా న్యాయసానము లతో పని లేకుఁడ నేరస్తులని భావించిన సీరోలను తెలప్రజాసమూహము లే చి తవధలు గావించుటయు ఉరిదీయటయు మంటలలో పడవేసి చంపుటయు, ఘోర హత్యలకు పాలేగు టయు జరుగుచున్నది. ఎట్టి నేరములకు నీగోల నిట్టి హత్యలు గాలించుచున్నారో, అటి నేరమలకు' తెల్ల వారికి ఖైదును * జుల్మానాయు విధించబడును.

ఆసియా
ఖండ వాసుల
బహిష్కారము.


అమెరికాలో అందులో ముఖ్యముగ పసిఫిక్ సముద్ర తీరమున ఆసియా ఖండ వాసులతో గూడ తెల్లవారు కలసి భోజనముచేయరు. ఆసియా బహిష్కారము. ఖండవాసులను కూడ బహిష్క రించు చున్నారు.


భారతీయుల
స్థితి.


హీఁదూదేశీ యులగు సిక్కులు, హిందువులు, ముసల్మానులు కొన్ని వేల మంది అమెరికాలో నున్నారు. వీరిలో కొద్దిమంది విద్యార్తులు. చాలమంది కూలిపని చేసికొనుటకు పోయి సొమ్ము సంపాదించు కొను చుండు వారు. ఆ చటికి పోయినను ముఖ్యముగా సిక్కులు

తము పగ్రీలను కృపాణములను విడిచి పెట్టలేదు. వీరిని. చూడగానే సిక్కులని తెలియును. హిందూ దేశీయులు నల్లవారను హేతువుచేత నీగ్రోలను చూచినంత హీనముగను అస హ్యముగ చూడకపోయినను సాధారణముగ అమెరికావారు పూటకూండ్ల యిండ్లలో కి రానివ్వరు. సమానముగ కూర్చొమట కంగీకరించరు, యూరపు ఖండమునుండి వచ్చు బీదవాంరు ఆజ్ఞానములోను అశుభ్రతను హైందవ కూలీల కంటే మించినను వారిని అమెరికనులు తమతో సమానులుగ చూచెదరు. తురుష్క ముసల్మానులను, పర్షియనియా ముల్మానులను జపామవారిని హైందవులకన్న బాగుగా చూచె దరు. ఎందువల్లవనగా హిందూదేశము స్వతంత్ర దేశము కాదు. స్వతంత్ర దేశములవారు నల్లవారయినను వారివి గొంతవరకై నను గౌరవించక తప్పదు. దక్షిణ రాష్ట్రము లలో "హైందవులు "తెల్లవారు పెట్టుకొను టోపీలు ధరించి నచో వీరిని నీగ్రోలని భావించి మిగుల హీనముగా చూచి నానాభాధలు పెట్టెదరు. అచ్చట తలగడ్డలు పెట్టుకున్న చో నీగ్రోలకన్న యెక్కువ గౌరవముగా చూచెదరు. తరచుగా హైందవులకు అమెరికను మంగలులు క్షౌరము చేయ టకు నిరాకరించెదరు. అమెరికాలోని పశ్చిమ ప్రాంతముల భార తీయులు తెల్లవారి టోపీలు ధరించి పోయినచో అమెరికసుల పూటకూండ్ల యిండ్లలోనికి రానిచ్చెదరు. భారతీయ కూలీలు తెల్లవారికంటే చౌకగా కూలికి పోవుదురనియు యెక్కువ కష్టపడి పనిచేసి మితవ్యయము కలిగి సొమ్ము మిగుల్చుకొన గలుగుదురనియు వర్తకపు పోటీలో తెల్లవారి నోడించుచున్నా

రనియు భావముతో అమెరికాకు అసలే రాకుండా చట్టములు చేయబడు చున్నది. అమెరికాలో యెంతకాల మున్నసు. ఆసియాఖండ వాసులకు పౌరహక్కులుండగూడదని చట్ట ములు చేయుచున్నారు. అమెరికనుల హృదయములలో తెల్ల నల్ల భేదము సంపూర్ణముగా నిండియున్నది. మొత్తము మీద వల్ల జాతులవా రందరును తమకన్న తక్కువ పొరని వారి యభిప్రాయము.


ఈ " నల్ల, తెల్ల, " సమస్యను న్యాయముగా పరిష్క గించనిది అమేరిక'నులు నాగరికత కలవారని చెప్పుటకు వీలు లేదు. అమెరికానుండి వచ్చెడి క్రైస్తవ మత బోధకులకు హిందూదేశములోని కుల భేదములను గూర్చి వెక్కిరించుటకు హక్కు లేదు, “నీ పొరుగువాని కంటిలోని నలును తీసి వేయ ప్రయత్నించుటకు ముందు నీ కంటిలో దూలమును తీసి వేసికొనుము ” అని బైబిలు చెప్పుచున్నది

అమెరికనుల
యాందోళనము.


అమెరికాలోని నీగ్రోలు తమ యభివృద్ధికై సంఘములు పెట్టుకోని ఆందోళనము నము చేయుచున్నారు. నాకు కోరునవి.మూడు (1) ఓట్లు (2) పౌరశ్వశ్వపు సమానత్వము (1) యువకుల విద్యా సంపాదనకు సంపూర్ణమగు అవకాశములు,


" ఓట్లు సమీ సమనుష్య క్వమునకు ముఖ్య మనియు, రం గును బట్టి నీచముగా చూచుట నాగరిక - విరుద్దమనియా, తెల్లపిల్లల కేశవిద్య యవశ్యకమో నల్లకల్లలకుకూడ నంత


విద్యయే కావలెననియు నీగ్రోలు సంతతము పట్టుదలతో ఆందోసము చేయవలెను. "

" ప్రతిదినమును అమెరికాలోనిగ్రోలు నీచత్వము నకును బాధలకును అన్యాయము లకును లోబర్చబడుచున్నారు. వారికి రాచకీయ, ఆర్థిక, సాంఘిక అభివృద్ధికి అవకాశములు తీసి వేయబడినవి. మనము ఈపరిస్థితులలో పోరాడవలసి యున్నది. ప్రజాభిప్రాయమును మార్పుటకు మనము సంతతము కృషి సల్పవలెను. తెల్ల వారు మసతో సామాను లేగాని అధికలుగారని మాకు తెలియును. పోరాటములో మస ఆయుధము గొప్ప ఆదర్శములు కలిగియుండుటయే గాక నూతన పకృతి శాస్త్ర పద్దతులుకూడ ఆయ్యున్న వి” అని వారు చెప్పు చున్నారు.

నీగ్రోలు కోరు
హక్కులు.

డాక్టరు ద్యూబాయి నీగ్రోలకు మూడు బంధనములుతెగిపోవలెనని కోదుచున్నాడు (1) రాజకీయముగా తెల్లవారి వత్తిడి నుండి నీగ్రోలు విముక్తి కావలెను. నీగ్రోలకు ఓట్లు కావలెను. (2) నూతనముగా దేశము చెందుచున్న ఆర్థికాభి వృద్ధిలో నీగ్రోలకును భాగము రావలెను. (3) సాంఘికముగా నీగ్రోలు తెల్లవారితో సమానులుగ భావింపబడవలెను.


ఆయన యిటుల వాసినాడు:-----


"దక్షిణాదివారిటుల చెప్పుచున్నారు.- నీగ్రో నీచుడు గనుక వానిని నీచముగా మేము చూచెదము. వాడిని నీచత్వములోనుంచి పైకివచ్చుటకు మేము వప్పుకొనము, వాడు తెలివి నొందుటకు మాకిష్టము లేదు గావున వానికి చదువు చెప్పము.


- వాడుమాతో పోటీవచ్చును గనుకను ద్రవ్యమును సంపాదిం చును కనుక వాడు పరిశ్రమలలో ప్రవేశించుటను మేము సహించము, వాడు స్వతంత్రుడై మా పక్కన కాపురముండును గనుక వానిని ఆస్తికొననియ్యము. వాడికూలిమాకు కావలసియున్నది గావున దానిని మేము విడిచి పెట్టము. వానిని దూరముగా ప్రత్యేక ప్రదేశములలో కాపురముంచెదము. వానికి రాజకీయ హక్కులిస్వము.”


" దక్షిణాదివారు మాత్రమే నిందకర్హులుగారు. మొదట నీగ్రోలకు విద్యాభివృద్ధిలో తోడ్పడి ఓట్లనిచ్చి ఆర్ధికముగా సహాయము చేసిన ఉత్త రాది వారు కూడ దీనినంతయు వదలి దక్షిణాది వారిలో చేరినారు. నీగ్రోల పాఠశాలలను పాడు చేసినాడు. కూలిని తగ్గించినారు. సాంఘికముగా వెలివేసి నారు, రాచకీయముగా మాల వానిగ చేసినారు. నీగ్రోలు చెమటకార్చి సంపాదించిన ఆస్తు లను అపహరించవలెనని కూడ ఇప్పుడు ప్రయత్నము చేయుచున్నారు. ”


"అపహరించుట కాక ఏమిటి ? నీగ్రోలందరును ప్రత్యేక ప్రదేశములలో 'కాపురముండవలెననియు వారు సేవ్యము చేసుకొను భూములు ఒకేవైపున ఒకే ఖుడముగా నుండవలెననియు చట్టములు చేయుటలో నీగ్రోల కిదివరకున్న మంచి ఆస్తులను తెల్లవారు అపహరించుటకాక మరేమున్నది ? ఎర్రయిండియసుల విషయములో తెల్లవారెంత లజ్జాకరఘుగా ప్రవర్తించిరో మనకు తెలియదా?


' మనము హక్కులు పొందుటకును మన గమ్యస్థానము

చేరుటకును మనము నిర్మాణ కార్యమును బాగుగ జరిగించుకొన వలెను. ఇదివరకే అనేక సంఘములు పెట్టుకొనియున్నాము. ఇంకను వారిసంఘములు శాఖోపశాఖలుగ స్థాపించు కొనవలసి యున్నది. నిర్మాణ కార్యక్రమ మనగా ఆత్మ త్యాగము. అనేకులు తమ కాలమును, పనిని, లాభములను ద్రవ్యమును త్యాగము చేయవలసియున్నది. ఇంతకును అమూల్య మగు హక్కులును అనగా స్వతంత్రమును పొందుటకు మనమవలంబించు పద్దతి మిగుల చౌక అయినది. సల్ల వారియభివృద్ధికై ఏర్పడిన జాతీయ సంఘమును పోషించుచున్న ద్రవ్యములో విశేషభాగము నల్లవారినుండియే వచ్చుచున్నందునకు భగవం తునికి వందనములర్పించుచున్నాను. ఇంక నెక్కువగా దవ్య సహాయము చేయుటకు నల్లవారు నేర్చుకొనవలసియున్నారు. ఈ సంఘము యొక్క శాఖలింక ననేకములు పెట్టి మస ఆదర్శములను మన యుద్దేశ్యములను నెరవేర్చు కుందుముగాక."

  1. * లాజపతిరాయి 152 పుట చూడుము.