అభినయ దర్పణము/హస్తానామష్టావింశతి విధనామ నిరూపణమ్‌

1. పతాకహస్తలక్షణమ్

అఙ్గుళ్యః కుఞ్చతాఙ్గుష్ఠా
స్సంక్లిష్టాః ప్రసృతా యది.

207


సపతాకకరః ప్రోక్తో
నృత్యకర్మవిశార దైః,

తా. అన్ని వ్రేళ్లను చేర్చి చాఁచి బొటనవ్రేలిని వంచిపట్టునది పతాకహస్తమని నృత్యశాస్త్రవిశారదులు చెప్పుదురు.

వినియోగము—

నాట్యారమ్భే వారివా హే వనే వస్తునిషేధనే.

208


కుచస్థలే నిశాయాంచ నద్యామమరమణ్డలే,
తురగే ఖండనే వాయౌ శయనే గమనోదితే.

209


ప్రతాపేచ ప్రసాదేచ చంద్రికాయాం ఘనాతపే,
కవాటపాటనే సప్తవిభక్త్యర్థే తరఙ్గకే.

210


వీథీప్రవేశభావే౽పి సమత్వేచా౽ఙ్గరాగకే,
ఆత్మార్థే శపథేచా౽పి తూష్ణీం భావస్య దర్శనే.

211


ఆశీర్వాదక్రియాయాం చ నృపశ్రేష్ఠస్య భావనే,
తాళపత్రేచ పేటేచ ద్రవ్యాది స్పర్శనే తథా.

212


తత్రతత్రేతి వచనే సింధౌతు సుకృతిక్రమే,
సంబుద్ధాతు పురోగే౽పి ఖడ్గరూపస్యధారణే.

213


మానే సంవత్సరే వర్షే దినే సమ్మార్జనే తథా,
ఏవమర్థేషు యుజ్యన్తే పతాకా హస్తభావనాః.

214

తా. నాట్యారంభము, మేఘము, వనము, వస్తువులను నిషేధించుట, కుచస్థలము, రాత్రి, నది, దేవసమూహము, ఆశ్వము, ఖండించుట, వాయువు, శయనము, గమనము, ప్రతాపము, ప్రసాదము, చంద్రిక, మిక్కిలియెండ, తలుపుతట్టుట, ఏడువిభక్తులు, అల, వీథిలో ప్రవేశించుట, సమముగా నుండుట, గందము పూయుట, తాననుట, పంతము, ఊరకుండుట, ఆశీర్వదించుట, గొప్పరాజును జూపించుట, తాటాకు, చెంపపెట్టు, పదార్థమును స్పృశించుట, అక్కడనే యక్కడనే యనుట, సముద్రము, సుకృతిక్రమము, సంబోధనము, ముందుగాఁ బోవువాఁడనుట, కత్తియాకృతిని జూపుట, మాసము, సంవత్సరము, వర్షము, దినము, సమ్మార్జనము, (అనఁగా తుడుచుట) ఈఅర్థములయందు ఈహస్తము వినియోగపడును.

గ్రన్థాంతరస్థపతాకలక్షణమ్

సంలగ్నః తర్జనీమూలే యత్రా౽ఙ్గుష్ఠో నికుఞ్చితః,
ప్రసారితతలాఙ్గుళ్యః పతాకః ప్రభవేత్కరః.

215


ఏకాకినాపురాధాత్రా పరబ్రహ్మ సమాగమే,
జయేతి స్తుతివేళాయాం పతాకస్యా౽౽కృతిః కరః.

216


యతో భేజే తతో లోకే పతాక ఇతి విశ్రుతః,
అతఏవ సమస్తానాం హస్తానా మయమాదిమః.

217


పతాకో బ్రహ్మణోజాతః శ్వేతవర్ణో ఋషిశ్శివః,
బ్రహ్మజాతి ర్భవేత్తస్య పరబ్రహ్మా౽ధిదైవతమ్.

218

తా. తర్జనీమూలమందుఁ జేర్చి వంచఁబడిన బొటనవేలును, చాఁచఁబడిన అరచేయియు, వేళ్లునుగలది పతాకహస్త మనఁబడును. ముందు బ్రహ్మ యొంటరిగా పరబ్రహ్మను చేరఁబోయినప్పుడు పతాకాకృతిగా చేయి చాఁచి ‘జయవిజయీభవ’యని స్తోత్రము చేసెను. ఆకారణముచేత అట్లు పట్టఁబడిన చేయి నాఁటినుండి లోకమునందు పతాకమని ప్రసిద్ధినొందెను. కనుక ఇది యెల్లహస్తములకును మొదటిదాయెను. ఈపతాకహస్తము బ్రహ్మవలనఁ బుట్టినది. దీనిజాతి బ్రాహ్మణజాతి. వర్ణము తెలుపు. ఋషి శివుఁడు. అధిదేవత బ్రహ్మము.

వినియోగము:—

జయేతి వచనే మేఘే నిషేధే విపినే నిశి,
యాహీతి వచనే యానే వా హేమరుతివక్షసి.

219


పురఃపుణ్యేచా౽తిశయే ప్రవాహే విబుధాలయే,
హాహాకారే చంద్రికాయా మాతవే సురమణ్డలే.

220


అర్గళాపుటనేకుడ్యే ఖణ్డనే పరితోషణే,
కపోలే చన్దనా లేపే కృపాణే వారివారణే.

221


సమూహే సైన్య సన్నాహే సమయే భయవారణే,
అపాశ్రయే అపచయే పిథానే శయనే భువి.

222


జ్వాలాసు వర్షధారాసు తరఙ్గే పక్షిపక్షకే,
-ప్రభువిజ్ఞాన నేత్రేతి వాక్యే యాదృశితాదృశి.

223


చపేటే వస్తు సంస్పర్శే సరస్యామఙ్గమర్దనే,
వ్యాజస్తుతో ప్రతాపేచ దేవతానాం నివేదనే.

224


పార్శ్వాశ్లేషేపతాకాయాం ప్రవాతే వసనాఞ్చలే,
శైత్యేతాపే ధాళధళ్యే ఛాయాయాం వత్సరే ఋతౌ.

225


అయనే వాసరే పక్షే మానే స్వచ్ఛే మహాకులే,
సమాసన్నే పాలయేతి లాలయేతిచ భాషణే.

226


బ్రహ్మజాతౌ శుభ్రవర్ణే పతాకో౽యం నియుజ్యతే,

తా. జయజయయనుట, మేఘము,నిషేణము, అడవి, రాత్రి, పొమ్మనుట, నడచుట, గుఱ్ఱము, గాలి, రొమ్ము, ఎదురు, పుణ్యము, అతిశయము, .ప్రవాహము, దేవలోకము, హాహాకారము, వెన్నెల, ఎండ, దేవతాసమూహము, గడియ తీయుట, గోడ, నరకుట, సంతోషము, చెక్కిలి, గంధము పూయుట, కత్తి, నీటికి కట్టవేయుట, గుంపు, దండుయొక్క ఆయత్తము, సమయము, వెరపుతీర్చుట, ఆశ్రయములేమి, క్షయము, కప్పుట, పానుపు, భూమి, నిప్పుకుంట, వానధార, అల, పక్షిరెక్క, ప్రభువుతో మనవి చేయుట, ఇక్కడననుట, ఎట్టిది అట్టిది యనుట, చెంపపెట్టు, వస్తువులను అంటుట, కొలను, ఒడలు పిసుకుట, వ్యాజస్తుతి, ప్రతాపము, దేవతానివేదనము, ప్రక్కకౌఁగిలింత, టెక్కెము, పెద్దగాలి, కొంగు, చలి, ఉక్క, తళతళ, నీడ, సంవత్సరము, ఋతువు, అయనము, దినము, పక్షము, మాసము, తేట, గొప్పవంశము, సమీపించుట, పాలింపుము లాలింపుము అనుట, బ్రాహ్మణజాతి, శుభ్రవర్ణము వీనియందు ఈ హస్తము వినియోగించును.

2. త్రిపతాకహస్తలక్షణమ్

సఏవ త్రిపతాకస్స్యా
ద్వక్రితా నామికాంగుళిః,

తా. ముందు చెప్పిన పతాకహస్తమందలి యనామిక (అనఁగా చిటికినవ్రేలికి ముందువ్రేలు) వంచఁబడెనేని యది త్రిపతాకహస్త మగును.

వినియోగము:—

మకుటే వృక్షభావేచ వజ్రేతద్ధరవాసవే.

227


కేతకీ కుసుమే దీపే వహ్నిజ్వాలా విజృమ్భణే,

కపోలేపత్రలేఖాయాం బాణార్థే పరివర్తనే.

228


స్త్రీపుంసయోస్సమాయోగే యుజ్యతే త్రిపతాకకః,

తా. కిరీటము, వృక్షము, వజ్రాయుధము, ఇంద్రుఁడు, మొగలిపువ్వు, దీపము, అగ్నిజ్వాల పైకిలేచుట, చెక్కిలి, మకరికాపత్రరేఖ, బాణము, మార్పు, స్త్రీపురుషులచేరిక వీనియందు ఈ హస్తము వినియోగించును.

గ్రంథాంతరే త్రిపతాకహస్తలక్షణమ్

పతాకే౽నామికావక్రాత్రిపతాకకరోభవేత్.

229


శక్రేణా౽౽దౌ యతోవజ్రం పస్పర్శే౽నామికాంవినా,
పతాకస్య త్రిభాగేన త్రిపతాక ఇతిస్మృతః.

230


వాసవాత్త్రిపతాకో౽యం జజ్ఞే తస్య ఋషిర్గుహః,
రక్తవర్ణో క్షత్రజాతిరధిదేవో మహేశ్వరః.

231

తా. క్రింద చెప్పఁబడిన పతాకహస్తమందు అనామిక (ఉంగరపువ్రేలు) వంచఁబడెనేని యది త్రిపతాకహస్త మగును. ఆదికాలమందు దేవేంద్రుఁడు వజ్రాయుధము నెత్తుకొనునపుడు అనామికను వదలి పతాకముయొక్క మూఁడుభాగములచేత గ్రహించుటచే నేర్పడినది కనుక ఇది త్రిపతాకము అనఁబడెను. ఇది ఇంద్రునివలన పుట్టినది, ఎఱ్ఱవన్నె గలది, క్షత్త్రియజాతి, దీనికి ఋషి గుహుఁడు, అధిదేవత శివుఁడు.

వినియోగము:—

ఆవాహనే౽వతరణే వదనోన్నమనే నతౌ,
స్పర్శేశుభానాం ద్రవ్యాణామఙ్కనే౽నాదరేఖలే.

232


సన్దేహే మకుటే వృక్షే వాసవే కులిశాయుధే,

అలకాపనయేదీపే తిలకోష్ఠీషధారణే.

233


కటుగన్ధరవాలాపైః నాసాకర్ణస్యసంవృతౌ,
అశ్వసమ్మార్జనే బాణే కేతక్యాం పత్రలేఖనే.

234


పాతేఖగవిశేషాణాం కీలికీలా విజృమ్భణే,
క్షత్త్రజాతౌ రక్తవర్ణే త్రిపతాకో నియుజ్యతే.

235

తా. ఆవాహనము, దిగుట, మొగమెత్తుట, వంచుట, మంగళవస్తువులనుముట్టుట, గురుతిడుట, నమ్మకములేమి, దుర్జనుఁడు, సందేహము, కిరీటము, వృక్షము, ఇంద్రుఁడు, వజ్రాయుధము, ముంగురుల నెగదువ్వుట, దీపము, బొట్టు పెట్టుకొనుట, పాగా పెట్టుకొనుట, కారైనవాసనవలనను కఠోరశబ్దమువలనను ముక్కుచెవులను మూసికొనుట, గుఱ్ఱమును తోముట, బాణము, మొగలిపువ్వు, మకరికాపత్రములను వ్రాయుట, కొన్నిపక్షులయొక్క పాటు, నిప్పుమంటలు లేచుట, క్షత్త్రియజాతి, ఎరుపువన్నె వీనియందు ఈహస్తము వినియోగించును.

3. అర్ధపతాకహస్తలక్షణమ్

త్రిపతా కేక నిష్ఠాచే
ద్వక్రితార్ధ పతాకకః,

తా. త్రిపతాకహస్తమందు చిటికెనవ్రేలు వంపఁబడునేని యది అర్ధపతాకహస్త మనఁబడును.

వినియోగము:—

పల్లవేఫలకేతీరే౽ప్యుభయో రితి వాచకే.

236


క్రకచేచ్ఛురికాయాంచ ధ్వజే గోపురశృఙ్గయోః,

యుజ్యతే౽ర్ధపతాకో౽యం తత్తత్కర్మప్రయోగతః.

237

తా. చిగురు, పలక, గట్టు, ఇద్దరని చెప్పుట, నూరుకత్తి, రంపము, ధ్వజము, గోపురము, కొమ్మ వీనియందు ఈ హస్తము వినియోగించును.

4. కర్తరీముఖహస్తలక్షణమ్

అస్యైవచా౽పి హస్తస్య
తర్జనీచ కనిష్ఠికా,
బహిః ప్రసారితే ద్వే చే
త్సకరః కర్తరీముఖః.

238

తా. అర్ధపతాకహస్తమందలి చిటికెనవ్రేలును చూపుడువ్రేలును బైటికి చాఁపఁబడునేని కర్తరీముఖహస్త మగును.

వినియోగము:—

శ్రీపుంసయోస్తు విశ్లేషే వివర్యాసపదే౽పి చ,
లుంఠనే నయనాన్తేచ మరణే భేదభావనే.

239


విద్యుదర్థేప్యేకశయ్యా విరహే పతనే తథా,
లతాయాం చైవయోజ్యోయం కర్తరీ ముఖఇష్యతే.

240

తా. స్త్రీ పురుషులయెడబాటు, వ్యత్యస్తస్థానము, దొంగిలించుట, కడకన్ను, చావు, భేదించుట, మెరపు, ఏకశయ్యావిరహము, క్రిందపడుట, వీనియందు ఈహస్తము వినియోగించును.

గ్రన్థాన్తరే

త్రిపతాకే బహిర్యాతా తర్జనీ యదికర్తరీ,

శశాఙ్కశేఖరః పూర్వం జటాధర వధమ్ప్రతి.

241


చక్రం లిలేఖ తర్జన్యా నిక్షిప్య భువి మధ్యమామ్,
తదా ప్రభృతికర్తర్త్యుత్పన్నేతి మునిభిస్స్మృతా.

242


కర్తరిశ్శంకరాజ్జాతః ఋషిః పర్జన్యదేవతా,
క్షత్త్రజాతిస్తామ్రవర్ణశ్చక్రపాణిరధీశ్వరః.

243

తా. త్రిపతాకహస్తమందు తర్జని బయటకు చాచఁబడెనేని కర్తరీహస్త మగును. పూర్వకాలమునందు శివుఁడు జటాధరాసురసంహారముకొఱకు భూమిలోమధ్యమనుంచి తర్జనిచే చక్రమును వ్రాసెను. అది మొదలుకొని కర్తరి గలిగెనని ఋషులు చెప్పుచున్నారు. కర్తరిహస్తము శివునివలనఁ బుట్టినది. ఇది క్షత్త్రియజాతి. ఋషి పర్జన్యుఁడు. రక్తవర్ణము. అధిదేవత చక్రపాణి.

వినియోగము:—

పాదాలక్తకనిర్మాణే పతనేలేఖ్యవాచకే,
దమృత్యోర్విరహేచైవ విపర్యాసేరమాధవే.

244


చపలాయా మేకశయ్యా వియోగే మహిషేమృగే,
చామరే శైలశృఙ్గేచ వారణే వృషభే గవి.

245


కేశపాశస్య శోధిన్యాం క్షత్త్రియే తామ్రపర్ణకే,
కర్తర్యాం గోపురేసో౽యం కర్తరీ వినియుజ్యతే.

246
తా. కాళ్లకు లత్తుక పెట్టుట, వ్రాయుట, దంపతులవిరహము, వ్యత్యాసము, విష్ణువు, మెరపు, ఏకశయ్యావియోగము, మహిషము, మృగము, చామరము, కొండశిఖరము, ఏనుఁగు, వృషభము, ఆవు, దువ్వెన, క్షత్త్రియుఁడు, రక్తవర్ణము, కత్తెర, గోపురము వీనియందు ఈహస్తము వినియోగపడును.

5. మయూరహస్తలక్షణమ్

అస్మిన్ననామికా౽౦గుష్ఠే
శ్లిష్టేచా౽న్యే ప్రసారితాః,
మయూరహస్తః కథితః
కరటీకా విచక్షణైః

247

తా. కర్తరీముఖహస్తమందు అనామికను అంగుష్ఠతోఁజేర్చి తక్కినవ్రేళ్లను చాఁచిపట్టినయెడ మయూరహస్త మగును.

వినియోగము:—

మయూరాస్యే లతాయాంచ శకునే వమనేతథా,
అలకస్యా౽పనయనే లలాటే తిలకేషుచ.

248


నేత్రస్యోదకవిక్షేపే శాస్త్రవాదే ప్రసిద్ధకే,
ఏవమర్థేషు యుజ్యన్తే మయూరకరభావనాః.

249

తా. నెమిలిముఖము, తీఁగె, పక్షి, క్రక్కుట, ముంగురులు దిద్దుట, నొసలు, తిలకము, కన్నీరు ఎగజిమ్ముట, శాస్త్రమును వ్యవహరించుట, ప్రసిద్ధి వీనియందు ఈహస్తము వినియోగించును.

6. అర్ధచంద్రహస్తలక్షణమ్

అర్ధచన్ద్ర కరస్సో౽యం
పతాకే౽ఙ్గుష్ఠసారణాత్,

తా. పతాకహస్తమందు అంగుష్టము చాఁచఁబడినయెడల అర్ధచంద్రహస్త మగును.

వినియోగము:—

చన్ద్రే కృష్ణాష్టమీభాజి గళహస్తాదికే౽పిచ.

250


భల్లాయుధే దేవతానా మభిషేచన కర్మణి,
భుక్పాత్రేచోద్భవేకట్యాం చిన్తాయా మాత్మవాచకే.

251


ధ్యానేచ ప్రార్థనేచా౽పి అఙ్గసంస్పర్శనే తథా,
ప్రాకృతానాం నమస్కారే౽ప్యర్ధచన్ద్రో నియుజ్యతే.

252

తా. కృష్ణాష్టమీచంద్రుఁడు, మెడపట్టి గెంటుట, భల్లాయుధము, దేవాభిషేకము, కంచము, పుట్టుక, మొల, చింత, తన్ను దాను చెప్పుకొనుట, ధ్యానము, ప్రార్థించుట, అవయవములను అంటుట, సలాము చేయుట వీనియందు ఈహస్తము వినియోగించును.

గ్రంథాన్తరస్థార్థచంద్రహస్తలక్షణమ్

పతాకే విరళాంగుష్ఠే సో౽ర్ధచంద్రకరోభవేత్,
భూషణేచ్ఛావతశ్శమ్భోరతసీముకుళాకృతి.

253


జాతశ్చంద్రాదర్ధచన్ద్రో ఋషిరస్యా౽త్రిరుచ్యతే,
వైశ్యజాతిర్గౌరవర్ణో మహాదేవో౽ధిదేవతా.

254

తా. పతాకహస్తము చాఁచఁబడిన బొటనవ్రేలు గలదగునేని అర్థచంద్రహస్త మగును. ఇది అవిసెమొగ్గవలె నుండును. ఇది భూషణేచ్ఛగల శివునినిమిత్తమై చంద్రునినుండి పుట్టినది. ఇది వైశ్యజాతి, దీనికి ఋషి అత్రి, వర్ణము గౌరము, అధిదేవత మహాదేవుఁడు.

వినియోగము:—

వలయే మణిబంధేచ దర్పణస్య నిరూపణే,
ఆశ్చర్యేచ ప్రయాసేచా౽ప్యమితే నిఖిలేషుచ.

255

తాళమానే మౌళిబంధనిర్మాణే బాలపాదపే,
భేదాత్కపోలవహనే గజకర్ణనిరూపణే.

256


యువార్థే చ సమర్థే చ శశాజ్కేప్రాకృతానతౌ,
అభిషేకే భ్రూలతాయామంశుకే కార్ముకే౽ధికే.

257


కటిపట్టదృఢీకారే కలశారచనే౽ఙ్గకే,
చరణాభినయే బాలవహనే పశ్చిమాఙ్గకే.

258


గౌరవర్ణే వైశ్యజాతా వర్ధచంద్రో నియుజ్యతే,

తా. ముంజేతికడియము, మనికట్టు, అద్దమును జూచుట, ఆశ్చర్యము, ప్రయాసము, మేరలేమి, సకలము, తాళమానము, సిగముడి వేయుట, లేఁత చెట్టు, దుఃఖమువలన చెక్కిట చెయి చేర్చుట, ఏనుఁగు చెవులను చూపుట, తప్పు చేసినవారిని వెడలఁగొట్టుట, నొసటిచెమట తుడుచుట, యౌవనవంతుఁడు, సమర్థుఁడు, చంద్రుఁడు, ప్రాకృతులకు నమస్కరించుట, అభిషేకము, కనుబొమ్మ, వస్త్రము, ధనుస్సు, మిక్కిలి యనుట, నడుముకట్టు బిగించుట, కుండలు చేయుట, అంగము కాళ్ల ను చూపుట, బిడ్డ నెత్తుకొనుట, వీఁపు, తెలుపు, వైశ్యజాతి వీనియందు ఈహస్తము వినియోగపడును.

7. అరాళహస్తలక్షణమ్

పతాకే తర్జనీ వక్రా
నామ్నాసో౽యమరాళకః.

259
తా. పతాకహస్తమందు చూపుడువ్రేలు వంచఁబడినయెడ అరాళహస్త మగును.

వినియోగము:—

విషామృతాదిపానేషు ప్రచండ పవనే౽పిచ,
యుజ్యతే౽రాళహస్తో౽యం భరతాగమకోవిదైః.

260

తా. విషము అమృతము మొదలగువానిని త్రాగుటయందును, ప్రచండమయిన గాలియందును ఈ హస్తము ఉపయోగింపఁబడును.

గ్రన్థాంతరస్థారాళహస్తలక్షణమ్

పతాకాఙ్గుష్ఠతర్జన్యౌ వక్రితౌస్యాదరాళకః,
సప్తానాం జలధీనాంయ ఆపోశనకృతేపురా.

261


అరాళః కుమ్భజాజ్జాతః సఏవ ఋషిరుచ్యతే,
పాటలాంశుర్మిశ్రజాతిర్వాసుదేవో౽ధిదేవతా.

262


ఏవమేతస్యా౽నుపూర్వీం వదంతిభరతాదయః,

తా. పతాకహస్తమున అంగుష్ఠతర్జనులు వంచఁబడినయెడ అరాళహస్త మగును. ఇది పూర్వకాలమునందు అగస్త్యమహామునివలన సప్తసముద్రములను ఆపోశనము చేయునపుడు పుట్టెను. ఇది మిశ్రజాతి. దీనికి అగస్త్యుఁడు ఋషి. పాటలవర్ణము. వాసుదేవుఁడు అధిదేవత. దీని అనుపూర్వి ఇటువంటిదని భరతాదులు చెప్పిరి.

వినియోగము:—

ఆపోశనే బ్రాహణానామాశీర్వచనకర్మణి.

263


విటానాం ప్రియవై ముఖ్యే కేశానాంచ విశీర్ణకే,
ఆయాహి శీఘ్రమిత్యుక్తా సంధ్యాకర్మప్రదక్షిణే.

264


లలాటస్వేదహరణే కజ్జలాలేపనే దృశోః,
ఏవమాదిషుయుజ్యంతే అరాళకరభావనాః.

265

తా. బ్రాహ్మణులయొక్క ఆపోశనము, ఆశీర్వాదము చేయుట, విటుల ప్రియవైముఖ్యము, వెండ్రుకలు చిక్కుదీయుట, వేగము రమ్మనుట, సంధ్యాకర్మమునందలి ప్రదక్షిణము, నొసటిచెమ్మట తుడుచుట, కన్నులకు కాటుక పెట్టుట మొదలగువానియందు ఈ హస్తము చెల్లును.

8. శుకతుణ్ణహస్తలక్షణమ్

అస్మిన్ననామికావక్రా
శుకతుండకరోభవేత్,

తా. ముందు చెప్పిన అరాళహస్తమందు అనామిక వంచఁబడెనేని శుకతుణ్డహస్త మగును.

వినియోగము:—

బాణప్రయోగే కుంతార్థేమర్మోక్తావుగ్రభావనే.

266


శుకతుండకరోజ్ఞేయో భరతాగమవేదిభిః,

తా. బాణ ప్రయోగము, ఈటె, మర్మమైన మాట, తీక్ష్ణభావము వీనియం దీహస్త ముపయోగింపఁబడును.

గ్రథాన్తరస్థశుకతుణ్డహస్తలక్షణమ్

వక్రేపతాకతర్జన్యనామికౌ శుకతుండకః.

267


నటయిత్వాప్రేమకోపంనాథమ్ప్రతిసదాశివమ్,
దుర్గాయాః శుకతుండాభ్యో దుర్వాసాఋషిరుచ్యతే.

268


ద్విజాన్వయశ్శోణవర్ణో దేవతా౽స్య మరీచికః,

తా. పతాకహస్తమందు తర్జన్యనామికలు వంచఁబడెనేని శుకతుండహస్త మగును. ఇది సదాశివునిపై పార్వతీదేవికి ప్రణయకలహము గలిగినప్పుడు పార్వతీదేవియందు పుట్టెను. ఇది బ్రాహ్మణజాతి. ఋషి దుర్వాసుఁడు. రక్తవర్ణము. మరీచి అధిదేవత.

వినియోగము:—

బ్రహ్మాస్త్రేస్యాన్ముఖాగ్రేచ కౌటిల్యే పరివర్తనే.

269


భిణ్డిపాలేచ భావ్యర్థే క్రమణే కలహే౽పిచ,
అనాదరే ప్రేమ కోపే ఆశయేచ విసర్జనే.

270


ద్యూతాక్ష పాతే కున్తార్థే శుకశారినిరూపణే,
ఉగ్రభావేచ మర్మోక్తౌ తామ్రే బ్రాహ్మణజాతిజః.

271


శుకతుండకరోభావనేతృభిః పరికీర్తితః,

తా. బ్రహ్మాస్త్రము, మొగముతుద (ముక్కు), వంకర, మార్పు, భిండిపాలమను ఆయుధము, నడవఁబోవువిషయము, దాఁటుట, కలహము, ప్రీతిలేమి, ప్రణయకలహము, అభిప్రాయము, విడుపు, జూదపుపాచికలు వేయుట, ఈటె, చిలుకగోరువంకలను జూపుట, ఉగ్రభావము, మర్మోక్తి, తామ్రవర్ణము వీనియందు బ్రాహ్మణజాతిదైన ఈహస్తము చెల్లును.

9. ముష్టిహస్తలక్షణమ్

మేళనాదఙ్గుళీనాఞ్చ
కుఞ్చితానాంతలాన్తరే.

272


అఙ్గుష్ఠేనోపరియుతో
ముష్టిహస్తో౽యముచ్యతే,

తా. నాలుగు వ్రేళ్లను జేర్చి యరచేతిలోనికి వంచి యంగుష్ఠమును మీఁదఁ జేర్చునెడ ముష్టిహస్త మగును.

వినియోగము:—

స్థిరేకచక్రహేదార్థ్యేవస్త్వాదీనాంచ ధారణే.

273


మల్లానాంయుద్ధభావేచ ముష్టిహస్తో౽యముచ్యతే,

తా. స్థిరమనుట, సిగబట్టుట, దృఢత్వము, పదార్థములఁ బట్టుకొనుట, జెట్టీలజగడము వీనియందు ఈముష్టిహస్తము వినియోగింపఁబడును.

గ్రంథాంతరస్థముష్టిహస్తలక్షణమ్

మధ్యోపరికృతాంగుష్ఠో ముష్టిర్ముష్ట్యాకృతిఃకరః.

274


మధుకైటభయోర్యుద్ధేజాతోవిష్ణోరయంకరః,
అమరేంద్రోఋషిర్నీలశ్శూద్రశ్చంద్రో౽ధిదేవతా.

275

తా. నడిమివ్రేలిమీఁద అంగుష్ఠమును మడిచి పిడికిలి పట్టఁబడెనేని యది ముష్టిహస్త మగును. అది విష్ణువు మధుకైటభులతో యుద్ధము చేయుకాలమందు విష్ణువువలన పుట్టెను. ఇది శూద్రజాతి. దీనికి ఋషి అమరేంద్రుఁడు. వర్ణము నీలము. చంద్రుఁడు అధిదేవత.

ఆలమ్బనేమధ్యభావే ఫలే సఙ్కేతభావనే,
భద్రార్థే బలిదానేచ ప్రణామే ప్రాకృతైఃకృతే.

276


ఊరుసంవహనే ఘంటాగ్రహణే౽తి ప్రధావనే,
లాఘవే మల్లయుద్ధేచ ఖేటకాదిగ్రహేస్థిరే.

277


కచాకర్షే ముష్టిఘాతే గదాకున్తాదిధారణే,
నీలవర్ణే శూద్రజాతౌ ముష్టిహస్తో౽యముచ్యతే.

278

తా. పట్టు, నడుము, ప్రయోజనము, సంకేతము, క్షేమము, బలి యిచ్చుట, ప్రాకృతజనుల నమస్కారము, గట్టిపట్టు, గంటను పట్టుట, వడిగా పరుగెత్తుట, తేలిక, జెట్టిపోట్లాట, కేడెము మొదలయినవానిని పట్టుట, నిలుకడ, తలవెండ్రుకలు పట్టుట, పిడికిటిపోటు, గద యీటె మొదలయిన ఆయుధములను పట్టుట, నీలవర్ణము, శూద్రజాతి వీనియందు ఈహస్తము వినియోగింపఁబడును.

10. శిఖరహస్తలక్షణమ్

చేన్ముష్టిరున్నతాంగుష్ఠ
స్సఏవ శిఖరః కరః,

తా. ముందు చెప్పిన ముష్టిహస్తమందు అంగుష్ఠమును పొడవుగా నెత్తినయెడ శిఖరహస్త మగును.

వినియోగము:—

మదనే కార్ముకే స్తమ్భే నిశ్శబ్దే పితృతర్పణే.

279


ఓష్ఠే నాథేచ రదనే ప్రవిష్టే ప్రశ్నభావనే,
అఙ్గేనా౽స్తీతి వచనే స్మరణే౽భినయాంతరే.

280


కటిబంధాకర్షణే చ పరిరమ్భవిధౌధవే,
శక్తితోమరయోర్మోక్షో ఘణ్టానాదే చపేషణే.

281


శిఖరోయుజ్యతేసో౽యం భరతాగమవేదిభిః,

తా. మన్మథుఁడు, ధనుస్సు, స్తంభము, శబ్దములేమి, పితృతర్పణము, పెదవి, పెనిమిటి, దంతము, ప్రవేశించుట, ప్రశ్న చేయుట, అవయవము, లేదనుట, తలఁచుట, ఇతరాభినయము, నడుముకట్టు నీడ్చుట, కౌఁగిలింత, ప్రియుఁడు, శక్త్యాయుధ తోమరాయుధములను ప్రయోగించుట, ఘంటానాదము, పేషణము వీనియందు ఈ హస్తము ఉపయోగింపఁబడును.

గ్రంథాంతరస్థశిఖరహస్తలక్షణమ్

ముష్టిరూర్ధ్వాకృతాంగుష్ఠః సఏవ శిఖరః కరః.

282


సుమేరుం కార్ముకీకృత్య తన్మధ్యే చంద్రశేఖరః,
హస్తేన యేన జగ్రాహసో౽భవచ్ఛిఖరఃకరః.

283


శిఖరో మేరుధనుషో జాతస్తస్య ఋషిర్జినః,
గంధర్వజాతిశ్శ్యామాంశురధీశో రతివల్లభః.

284

తా. ముష్టిహస్తము పైకెత్తఁబడిన బొటనవ్రేలు గలదయ్యెనేని శిఖరహస్త మగును. ఇది పూర్వకాలమందు శివుఁడు త్రిపురాసురులతో యుద్ధము చేయుటకు మేరుపర్వతమును విల్లుగా చేసి దాని నడిమిభాగమును పట్టునపుడు శివునివలనఁ బుట్టెను. ఇది గంధర్వజాతి. దీనికి ఋషి జినుఁడు. వన్నె చామన. అధిదేవత మన్మథుఁడు.

పితౄణాం తర్పణేస్థైర్యే కుటుమ్బస్థాపనే౽పిచ,
నాయకే శిఖరే మిత్రే తిర్యక్చే దంతధావనే.

285


వ్యజనేతాలవృంతస్య భేదే కిమితి భాషణే,
శృంగారపయసోపానే చతుస్సంఖ్యా విభావనే.

286


శక్తితోమరయోర్మోక్షే ఫలాంశక పరిగ్రహే,
విలాసినీనమ్రభావే లజ్జాయాం కార్ముకేస్మరే.

287


పురుషే నిశ్చయే స్తమ్భే ఘంటానాదేచ నర్తనే,
నా౽స్తీతి వచనే దానే స్థాయిభావే వినాయకే.

288

మహిషాసురమర్దన్యాం వీరాంశే హయవల్గనే,
అర్ధచంద్రాదితిలకే కబరీచిహ్నధారణే.

289


ఇంద్రనీలే గాఢభావే శిఖరస్సత్ప్రయుజ్యతే,

తా. పితృతర్పణము, కుటుంబమును నిలుపుట, నాయకుఁడు, శిఖరము, స్నేహితుఁడు, అడ్డముగఁ బట్టినయెడ పండ్లు తోముకొనుట, వింజామరము, విసనకఱ్ఱ, ఏమని యడుగుట, గిండిచెంబు, నీళ్లు త్రాగుట, నాలుగని లెక్కపెట్టుట, శక్తి అను ఆయుధమును వైచుట, ఈటెను విసురుట, ఫలాంశమును గ్రహించుట, ఆఁడువారియడఁకువ, సిగ్గు, విల్లు, మన్మథుఁడు, మగఁడు, నిశ్చయము, స్తంభము, గంటవాయించుట, బోగమాట, లేడనుట, ఈవి, నిలుకడ గలిగియుండుట, పిళ్ళారి, మహిషాసురమర్దని, వీరుఁడు, గుఱ్ఱమును దాఁటించుట, అర్ధచంద్రతిలకము మొదలగునవి, కొప్పుగురుతును పూనుట, ఇంద్రనీలము, దృఢత్వము వీనియందు ఈ హస్తము ఉపయోగింపఁబడును.

11. కపిత్థహస్తలక్షణమ్

అంగుష్ఠమూర్ధ్ని శిఖ రే
వక్రితా యది తర్జనీ.

290


కపిత్థాఖ్యకరస్సో౽యం
తన్నిరూపణముచ్యతే,

తా. ముందు చెప్పిన శిఖరహస్తము అంగుష్ఠముపై చూపుడువ్రేలు వంచఁబడెనేని కపిత్థహస్త మగును.

వినియోగము:—

లక్ష్మ్యాంచైవ సరస్వత్యాం వేష్టనే తాళధారణే.

291


గోదోహనేచా౽౦జనేచ లీలాత్త సుమధారణే,

చేలాఞ్చలాది గ్రహణే పటస్యైవా ౽వకుణ్ఠనే.

292


ధూపదీపార్చనేచాపి కపిత్థ స్సంప్రయుజ్యతే,

తా. లక్ష్మీదేవి, సరస్వతి, చుట్టుట, తాళమును పట్టుట, పాలు పిదుకుట, కాటుక పెట్టుకొనుట, వినోదముగా పూలచెండ్లు ధరించుట, కొంగు మొదలగువానిని పట్టుకొనుట, గుడ్డ ముసుఁగు వేసికొనుట, ధూపదీపార్చనము వీనియందు ఈ హస్తము వినియోగింపఁబడును.

గ్రంథాంతరస్థకపిద్ధహస్తలక్షణమ్

శిఖరాంగుష్ఠ తర్జన్యౌ లగ్నౌచే త్సకపిత్థకః.

293


సముద్రమథనేపూర్వం మందరాకర్షణోచితః,
జాతః కపిత్థః శ్రీవిష్ణోర్నారదో ఋషిరుచ్యతే.

294


ఋషిజాతి గౌరవర్ణః పద్మగర్భో౽ధిదేవతా,

తా. శిఖరహస్తమునందలి బొటనవ్రేలును చూపుడువ్రేలును చేర్పఁబడునెడ కపిత్థహస్త మగును. పూర్వకాలమునందు సముద్రమును చిలుకుటకు అనుకూలముగా మందరపర్వతమును పట్టునపుడు ఈకపిత్థహస్తము విష్ణువువలనఁబుట్టెను. ఇది ఋషిజాతి. దీనికి ఋషి నారదుఁడు. వర్ణము తెలుపు. అధిదేవత పద్మగర్భుఁడు.

వినియోగము:—

మంథానాకర్షణేలక్ష్మ్యాం ధూపదీపనివేదనే.

295


వరాటకానాం విక్షేపే వహనే౽ఙ్కుశవజ్రయోః,
క్షేపణగ్రహణే తాళధారణే నాట్యదర్శనే.

296


లీలాబ్జధారణేవాణ్యాం జపదామ నిరూపణే,

పేషణే యావకా దీనాం చేలాఞ్చల సమాహృతౌ.

297


ఋషిజాతౌ గౌరవర్ణే కపిత్థో౽యం నియుజ్యతే,

తా. కవ్వమును బట్టి చిలుకుట, లక్ష్మి, ధూపదీపములను నివేదించుట, గవ్వలను ఎగఁజిమ్ముట, అంకుశవజ్రాయుధములను పట్టుట, ఒడిసెల త్రిప్పుట, తాళము పట్టుట, నాట్యమును జూపుట, వినోదముగా తామరపువ్వు చేతపట్టుకొనుట, సరస్వతిజపమాలికను ధరించుట, లత్తుక మొదలగువానిని మెదుపుట, కొంగును లాగుట, ఋషిజాతి, గౌరవర్ణము వీనియందు ఈహస్తము వినియోగించును.

12. కటకాముఖహస్తలక్షణమ్

కపిత్థ తర్జనీచోర్ధ్వం
మిశ్రితాంగుష్ఠమధ్యమా.

298


కటకాముఖహస్తో౽యం
కీర్తితో భరతాదిభిః,

తా. ముందు చెప్పిన కపిత్థహ్తసమందు చూపుడువ్రేలు నడిమివ్రేలితోను బొటనవ్రేలితోను జేర్చి పట్టఁబడునేని కటకాముఖహస్త మగును.

వినియోగము:—

కుసుమాపచయేముక్తాప్రజాందామ్నాంచధారణే.

299


శరమందాకర్షణేచ నాగవల్లీప్రదానకే,
కస్తూరికాదివస్తూనాం పేషణే గంధవాసనే.

300


వచనేదృష్టిభావేచ కటకాముఖఇష్యతే,

తా. పువ్వులుకోయుట, ముత్యాలదండ పూలదండలు ధరించుట, బాణ మెల్లగా ఆకర్షించుట, ఆకుమడుపు లిచ్చుట, కస్తూరి మొదలగు ద్రవ్యం కలుపుట, వాసన ద్రవ్యములు చేర్చుట, మాట, చూపు వీనియందు ఈహస్త ముపయోగింపఁబడును.

గ్రంథాంతరస్థ కటకాముఖలక్షణమ్

ప్రత్యంగుష్ఠయుతఃక్షిప్తః కపిత్థః కటకాముఖః.

301


అభ్యస్యతోధనుర్విద్యాం గుహాదీశ్వరసన్నిధౌ,
కటకాముఖహస్తో౽భూద్భార్గవోఋషిరుచ్యతే.

302


దేవజాతి స్వర్ణవర్ణో రఘురామో౽స్య దేవతా,

తా. కపిత్థహస్తముయొక్క బొటనవ్రేలు ఎత్తి పట్టఁబడునేని కటకాముఖహస్త మగును. శివునియొద్ద కుమారస్వామి విలువిద్య నేర్చునపుడు ఈ ముఖహస్తము పుట్టెను. ఇది దేవజాతి. దీనికి ఋషి భార్గవుఁడు. స్వర్ణవర్ణం. అధిదేవత రఘురాముఁడు.

వినియోగము:—

ముక్తాస్రజాంపుష్పదామ్నాం చామరాణాంచ ధారణే.

303


ఆకర్షణే శరాదీనాం దర్పణాభిముఖగ్రహే,
లీనవహనే వృంతభేదనే దంతధావనే.

304


కుసుమాపచయే నాగవల్లీదళపరిగ్రహే,
కస్తూరికాదినిష్పేషే వారస్త్రీణాం నిగూహనే.

305


ధనురాకర్షణే చక్రధారణే వ్యజనగ్రహే,
స్వర్ణవర్ణే దేవజాత్యాం యుజ్యతే కటకాముఖః.

306

తా. ముత్యాలసరము, పూలదండ, వింజామరము వీనిని ధరించుట; బాణము మొదలైనవానిని ఆకర్షించుట, అద్దము నెదుటికి తెచ్చుట, కళ్లెము పట్టుట, తొడిమను త్రుంచుట, పండ్లు తోముట, పువ్వులు కోయుట, ఆకుమడు పు లిచ్చుట, కస్తూరి మొదలగువస్తువులను మెదుపుట, బోగమువారి కౌఁగిలింత, వింటీని తిగుచుట, చక్రాయుధమును ధరించుట, విసనకఱ్ఱపట్టుట, బంగారువన్నె, దేవజాతి వీనియందు ఈహస్తము వినియోగించును.

13. సూచీహస్తలక్షణమ్

ఊర్ధ్వం ప్రసారితా యత్ర
కటకాముఖతర్జనీ,
భవేత్సూచీకరస్సో౽యం
కీర్తితో భరతాగమే.

307

తా. ముందు చెప్పిన కటకాముఖహస్తమునందలి చూపుడువ్రేలు పొడుగుగా చాఁచఁబడిన యెడ సూచీహస్త మగును.

వినియోగము:—

ఏకార్థే౽పి పరబ్రహ్మ భావనాయాం శతే౽పిచ,
రవౌ నగర్యాం లోకార్థే తథేతి వచనే౽పి చ.

308


యచ్ఛబ్దే౽పిచ తచ్ఛబ్దే వ్యజనార్థే౽పితర్జనే,
కార్శ్యేశలాకావపుషోరాశ్చర్యే వేణిభావనే.

309


ఛత్రే సమర్థేకోణేచ రోమాళ్యాంభేరిభేదనే,
కులాలచక్రభ్రమణే రథాంగే మండలే తథా.

310


వివేచనేదినాం తేచ సూచీహస్తః ప్రకీర్తితః,

తా. ఒకటి అనుట, పరబ్రహ్మనిరూపణము, నూరు అనుట, సూర్యుఁడు, నగరము, లోకము అనుట, అట్లు అనుట, ఎవఁడు ఎవతె ఏది యనుట, వాఁడు ఆమె అది యనుట, విసనకఱ్ఱ, వెరపించుట, కృశించుట, సలాక, దేహము, ఆశ్చర్యపడుట, జడచూపుట, గొడుగు, నేర్పరితనము, మూల అనుట, నూగారు, భేరి వాయించుట, కుమ్మరవాని చక్రము తిరుగుట, బండిచక్రము, సమూహము, వివరించుట, సాయంకాలము వీనియందు ఈ హస్తము వినియోగించును.

గ్రన్థాన్తరస్థసూచీముఖహస్తలక్షణమ్

సూచీముఖో భవేదూర్ధ్వం కటకాముఖతర్జనీ.

311


అహమేక ఇతి బ్రహ్మా నిర్దేశమకరోద్యతః,
తస్మాద్విరించినో జాతః సూచిరస్య ఋషీరవిః.

312


దేవజాతి శ్శ్వేతవర్ణా విశ్వకర్మా౽ధిదేవతా,

తా. కటకాముఖహస్తముయొక్క చూపుడువ్రేలు పైకెత్తఁబడెనేని సూచీముఖహస్త మగును. పూర్వకాలమునందు బ్రహ్మ నేనొకఁడనే యని నిర్దేశించునపుడు ఆ బ్రహ్మవలన ఈ సూచీహస్తము పుట్టెను. ఇది దేవజాతి. దీనికి ఋషి సూర్యుఁడు, వర్ణము శ్వేతము. అధిదేవత విశ్వకర్మ.

వినియోగము:—

శ్లాఘాయాం సత్యవచనే దూరదేశనిరూపణే.

313


ప్రాణార్థే చ పురోగే౽పి ఏకసఙ్ఖ్యానిరూపణే,
సంధ్యాయాం విజనే నాళే సాధువాదే నిరీక్షణే.

314


తథేతి వచనే లోకే పరబ్రహ్మనిరూపణే,
ఏకార్థే౽పిశలాకాయాం రథాఙ్గ భ్రమణేరవౌ.

315


ఉదయాస్తమయేబాణే గూఢనాయక దర్శనే,
శిలీముఖే చ యచ్ఛబ్దే తచ్ఛబ్దేలోహ నాళయోః.

316

తర్జనే నీచసంబుద్ధౌ శ్రవణే విరహేస్మృతౌ,
ఘ్రాణే చఞ్చ్వాం శ్వేతవర్ణే దర్శనే సూచికః కరః.

317

తా. శ్లాఘించుట, నిజము, దూరమును జూపుట, ప్రాణమనుట, ముందుగఁబోవువానిఁ జూపుట, ఒకటి అనుట, సంధ్యాకాలము, ఏకాంతప్రదేశము, తూడు, బాగనుట, చూపు, అట్లే యనుట, లోకము, పరబ్రహ్మనిరూపణము, ఒకటే యనునర్థము, సలాక, చక్రమును త్రిప్పుట, సూర్యుఁడు, ఉదయాస్తసమయములు, ఋణము, రహస్యముగ నాయకుని జూపుట, అలుగు గలబాణము, ఏది అది అనుట, ఇనుము, కమ్మి, జెదరించుట, నీచుని పిలుచుట, వినుట, విరహము, తలఁచుట, ముక్కు, పక్షిముక్కు, తెలుపు, చూచుట వీనియందు ఈహస్తము వినియోగపడును.

14. చన్ద్రకలాహస్తలక్షణమ్

వినియోగము:—

సూచ్యామఙ్గుష్ఠమోక్షేతు
భవేచ్చన్ద్రకలాకరః,
ఏషాచన్ద్రకలాచన్ద్ర
కలాయామేవయుజ్యతే.

318
తా. ముందు చెప్పిన సూచీహస్తమునందు బొటనవ్రేలిని విడిచినయెడ చంద్రకలాహస్త మగును. ఈ చంద్రకలాహస్తము కలామాత్రచంద్రునియందు వినియోగింపఁబడును.

15. పద్మకోశహస్తలక్షణమ్

అఙ్గుళ్యో విరళాః కిఞ్చిత్
కుఞ్చితా స్లనిమ్నగాః,
పద్మకోశాభిధో హస్త
స్తన్నిరూపణముచ్యతే.

319

తా. అయిదువ్రేళ్లను ఎడముగా చాఁచి కొంచెము వంచి అరచేయి పల్లమగునట్టు పట్టఁబడునెడ పద్మకోశహస్త మగును.

వినియోగము

ఫలేబిల్వకపిత్థాదౌ స్త్రీణాంచ కుచకుమ్భయోః,
వర్తులే కందుకే స్వల్పభోజనే పుష్పకోశకే.

320


సహకారఫలే పుష్పవర్షేమంజరికాదిషు,
జపాకుసుమభావే౽పిఘంటారూపవిధానకే.

321


వల్మీకే కుముదే౽ప్యండే పద్మకోశో౽భిధీయతే,

తా. మారేడుపండు, వెలగపండు, స్తనములు, వట్రువ, చెండు, అల్పాహారము, పూమొగ్గ, మామిడిపండు, పూలవాన, పూగుత్తి మొదలగునది, మంకెనపువ్వు, ఖంటారూపమును జూపుట, పాములపుట్ట, నల్లకలువ, గుడ్లు వీనియందు ఈహస్తము ఉపయోగించును.

గ్రంథాంతరస్థపద్మకోశహస్తలక్షణమ్

వరశ్వేతామ్బుజాకారః పద్మకోశో౽భిధీయతే.

322


చక్రార్థే పద్మనికరైశ్శమ్భుపూజాం వితన్వతః,
నారాయణా త్పద్మకోశో జాతః పద్మధరోఋషిః.

323

యక్షాన్వయః కిన్నరాంశో అధిదేవో౽స్య భార్గవః,

తా. శ్రేష్ఠమయిన తెల్లదామర యాకృతిగా పట్టఁబడునది పద్మకోశహస్త మనఁబడును. పూర్వకాలమునందు చక్రాయుధముకొఱకు పద్మములచేత శివపూజఁ జేయుచున్న విష్ణుదేవునివలన ఈపద్మకోశహస్తము గలిగెను. ఇది యక్షజాతి, కిన్నరాంశము. దీనికి పద్మధరుఁడు ఋషి. భార్గవుఁడు అధిదేవత.

వినియోగము:—

శుండాయాం థాళథళ్యేచ హేమరౌ ప్యాదిభాజనే.

324


ధమ్మిల్లే చ మితార్థే చ లావణ్యే సాధువాదనే,
ఘంటాయాం కందుకే పద్మేవల్మీకే వర్తులే స్తనే.

325


నారికేళే చూతఫలే కర్ణికారేచదర్పణే,
శాఖానతౌపుష్పవర్షేకబళే౽౦డవికాసనే.

326


బిల్వేకపిత్థే యుజ్యేత పద్మకోశాహ్వయః కరః,

తా. ఏనుఁగుతొండము, ధళథళయనుకాంతి, బంగారు వెండి మొదలగువాని పాత్రము, కొప్పు, కొలఁది యనుట, అందము, బాగు అనుట, ఘంట, పుట్ట చెండు, తామర, పుట్ట, గుండ్రన, కుచము, టెంకాయ, మామిడిపండు, కొండగోగు, అద్దము, కొమ్మ వంగుట, పూలవాన, కబళము, గ్రుడ్లు పగులుట, మారేడుపండు, వెలగపండు వీనియందు ఈ హస్తము వినియోగించును.

16. సర్పశీర్షహస్తలక్షణమ్

పతాకతల నిమ్నత్వా
త్సర్పశీర్షకరోభవేత్.

327
తా. పతాకహస్తముయొక్క అరచెయ్యి కొంచెము పల్లముగ వంచఁబడినయెడ సర్పశీర్షహస్త మగును.

వినియోగము—:

చన్దనే భుజగే మందే ప్రోక్షణే పోషణాదిషు,
దేవర్షుదకదానేషుహ్యా౽౽స్ఫాలే గజకుమ్భయోః.

328


భుజాస్ఫాలే తు మల్లానాం యుజ్యతే సర్పశీర్షకః,

తా. గందము, పాము, మెల్లగాననుట, నీళ్ళు చిలుకరించుట, ప్రోచుట మొదలగునవి, దేవర్షి తర్పణములు, ఏనుఁగు కుంభస్థలములను చరచుట, జెట్టిలు భుజము చరచుట వీనియందు ఈహస్తము ఉపయోగపడును.

గ్రంథాంతరస్థసర్వశీర్షహస్తలక్షణమ్

పతాకే నిమ్నమధ్యత్వం సర్పశీర్ష ఇతిస్మృతః.

329


నిరీక్ష్యనిర్జరాన్భీతాన్కరవిన్యాసపూర్వకమ్,
బలింవఞ్చయితుంఖర్వో భవేయమితిభాషతః.

330


వామనాత్సర్పశీర్షో౽యం వాసవో ఋషిరుచ్యతే,
హరిద్వర్ణో దేవజాతిః కాలకంఠో౽ధిదేవతా.

331

తా. పతాకహస్తమునందలి అరచేయి పల్లముగా పట్టఁబడునేని సర్పశీర్షహస్త మగును. పూర్వకాలమునందు బలిచక్రవర్తికి వెరచి తన్ను శరణుచొచ్చిన దేవతలనుగూర్చి విష్ణుదేవుఁడు 'వామనావతార మెత్తి బలిని వంచించి మిమ్ము కాపాడెద' నని చేయి చాఁచి చెప్పునపుడు ఆవామనునివలన ఈసర్పశీర్షహస్తము పుట్టెను. ఇది దేవజాతి. దీనికి ఇంద్రుఁడు ఋషి. పసుపు వర్ణము. శివుఁడు అధిదేవత.

వినియోగము:—

కుఙ్కుమే పఙ్కభావే౽పి ప్రాణాయామనిరూపణే,
ముఖప్రక్షాళనవిధౌ దానవేళావివేచనే.

332

చందనేచ గజే ఖర్వే మల్లాస్ఫాలేచ లాలనే,
క్షీరే నీరేచ కాశ్మీరే లజ్జాయాం గోప్యకేశిశౌ.

333


ప్రతిమాయాం పయఃపానే లీనే సత్పరిభాషణే,
దేవజాతౌ హరిద్వర్ణే యుక్తమిత్యుత్తరీకృతా.

334


పటవాసపరిక్షేపే చన్దనాదివిలేపనే,
కుచాదిగ్రహణే స్త్రీణాం సర్పశీర్షో నియుజ్యతే.

335

తా. కుంకుమము, అడుసు, ప్రాణాయామమును జూపుట, మొగము కడుగుకొనుట, దానకాలమును నిరూపించుట, గందము, ఏనుఁగు, పొట్టివాఁడు, జెట్టిలు భుజము చరచుట, బుజ్జగించుట, పాలు, నీరు, కుంకుమపువ్వు,సిగ్గు, దాఁచఁదగినవస్తువు, పసిబిడ్డ, బొమ్మ, నీళ్ళు త్రాగుట, ఐక్యము, మంచి దనుట, దేవజాతి, పసుపువన్నె, తగుననుట, గంధపుపొడి చల్లుట, గందము మొదలగువానిపూఁత, స్తనము మొదలగువానిని పట్టుకొనుట వీనియందు ఈహస్తము వినియోగించును.

17. మృగశీర్షహస్తలక్షణమ్

అస్మిన్ కనిష్ఠికాఙ్గుష్ఠే
ప్రసృతే మృగశీర్షకః,

తా. ముందు చెప్పిన సర్పశీర్షహస్తమందలి చిటికెనవ్రేలును బొటనవ్రేలును చాఁచఁబడునేని మృగశీర్షహస్త మగును.

వినియోగము:

స్త్రీణామర్థేకపోలేచ క్రమ మర్యాదయోరపి.

336


భీతేవివాదే నైపథ్యే౽ప్యావానేచ త్రిపుండ్రకే,

ముఖాముఖేరంగవల్యాం పాదసంవాహనే౽పిచ.

337


సర్వసమ్మేళనేకార్యే మందిరే ఛత్రధారణే,
సోపానేపదవిన్యాసే ప్రియాహ్వానే తదైవచ.

338


సఞ్చారేచ ప్రయుజ్యేత భరతాగమకోవిదైః,

తా. స్త్రీవిషయము, చెక్కిలి, క్రమము, మర్యాద, వెరపు, వాదు, అలంకారము, ఉనికిపట్టు, త్రిపుండ్రము పెట్టుకొనుట, ఎదురెదురు, ముగ్గు, కాళ్ళు పిసుకుట, అన్నిటిని కూర్చుట, ఇల్లు, గొడుగు బట్టుకొనుట, మెట్టు, అడుగుపెట్టుట, ప్రియులను బిలుచుట, తిరుగుట వీనియందు ఈహస్తము వినియోగించురు.

గ్రంథాంతరస్థమృగశీర్షహస్తలక్షణమ్

ఊర్ధ్వగశ్చతురాంగుష్ఠో మృగశీర్షకరః స్మృతః.

339


శివం ప్రతితపః కర్తుం ధారయిత్వా త్రిపుణ్డ్రకమ్,
మృగశీర్షో౽భవద్గౌర్యాః ఋషిరస్య మృకండుజః.

340


ఋషిజాతి శ్శుభ్రవర్ణో౽ధిదేవస్తు మహేశ్వరః,

తా. చతురహస్తాంగుష్ఠము వెలుపలి కెత్తఁబడెనేని మృగశీర్షహస్త మౌను. మహేశ్వరునిగూర్చి తపస్సు చేయుటకు పార్వతీదేవి త్రిపుండ్రమును ధరింపఁగా ఈహస్తము పుట్టెను. ఇది ఋషిజాతి. దీనికి ఋషి మార్కండేయుఁడు. వర్ణము తెలుపు. అధిదేవత మహేశ్వరుఁడు.

వినియోగము:—

భిత్తావిచారే సమయే ఆవాసే ఛత్రధారణే.

341


పద్మిన్యామపిశంఖిన్యాం హస్తిన్యాం మందవాచకే,
లేపనే చందనాదీనాం స్త్రీణామభినయక్రమే.

342

తిరస్కరిణ్యాం సోపానే సాక్షాత్కారే౽పిచక్రమే,
త్రిపుండ్రధారణేచైవ వితర్కేచ మృగాననే.

343


అస్మదర్థే శరీరేచ సంజ్ఞాపూర్వసమాహృతౌ,
ఋషిజాతౌ శుభ్రవర్ణే మృగశీర్షకరః స్మృతః.

344

తా. గోడ, విచారము, సమయము, నివాసస్థానము, గొడుగుపట్టుట, పద్మినీ శంఖినీ హస్తినీజాతి స్త్రీలు, మెల్లగాననుట, గందము మొదలగువాని పూఁత, స్త్రీల అభినయము, త్రిపుండ్రధారణము, వితర్కము, మృగముయొక్క మొగము, నేను అనుట, దేహము, సైగచే గ్రహించుట, ఋషిజాతి, తెల్లవన్నె వీనియందు ఈహస్తము ఉపయోగించును.

18. సింహముఖహస్తలక్షణమ్

మధ్యమానామికాగ్రాభ్యా
మఙ్గుష్ఠో మిశ్రితో యది,
శేషౌ ప్రసారితౌ యత్ర
స సింహముఖ ఈరితః.

345

తా. నడిమివ్రేలు ఉంగరపువ్రేలు ఈరెంటికొనలను బొటనవ్రేలితోఁ జేర్చి తక్కినవ్రేళ్ళను జాఁచిపట్టినయెడ సింహముఖహస్త మగును.

వినియోగము:—

విద్రుమే మౌక్తికేచైవ సుగన్ధే౽లకస్పర్శనే,
ఆకర్ణనేచ పృషతి మోక్షార్థే హృదిసంస్థితః.

346


హోమే శశే గజే దర్భచలనే పద్మదామని,
సింహాననే వైద్యపాకశోధనే సింహవక్త్రకః.

347

తా. పగడము, ముత్యము, మంచివాసన, ముంగురుల దిద్దుట, వినుట, నీటిబొట్టు, (రొమ్మున నిలిపినయెడ) మోక్షవిషయము, హోమము, కుందేలు, ఏనుఁగు, దర్భనువిదలించుట, తామర పూలదండ, సింహముయొక్క మొగము, వైద్యుఁడు, మందు, వంటను శోధించుట వీనియందు ఈహస్తము వినియోగించును.

19. లాఙ్గూలహస్తలక్షణమ్

పద్మకోశే౽నామికాచే
న్నమ్రాలాఙ్గూలకో భవేత్,

తా. పద్మకోశహస్తమందు ఉంగరపువ్రేలు వంచిపట్టినయెడ లాంగూలహస్త మగును.

వినియోగము:—

లికుచస్యఫలే బాలాకుచే కల్హారకే తథా.

348


చకోరే క్రముకే బాలకిఙ్కిణ్యాం ఘుటికాదికే,
చాతకే యుజ్యతేచా౽యం లాఙ్గూలకరనామకః.

349

తా. గజనిమ్మపండు, పడుచులచన్నులు, వాసనగల ఎఱ్ఱకలువ, చకోరము, పోక, చిరుగజ్జెలు, రసగుండు మొదలగునవి, చాతకపక్షి వీనియందు ఈహస్తము వినియోగించును.

గ్రంథాంతరస్థ లాఙ్గూలహ స్తలక్షణమ్

మధ్యమాఙ్గుష్ఠ తర్జన్యః నారికేళాక్షవత్కృతాః,
లాఙ్గూలో౽నామికావక్రా ప్రోన్నతాచ కనిష్ఠికా.

350

క్షీరోధిజః కాలకూటః గుళి కాకృతికఃపురా,
లాఙ్గూలో హరసఞ్జాతో ఋషిః క్రౌఞ్చవిదారణః.

351


సిద్ధజాతి స్వర్ణవర్ణః పద్మా తస్యా౽ధిదేవతా,

తా. నడిమివ్రేలు, బొటనవ్రేలు, చూపుడువ్రేలు దీనిని టెంకాయకన్నులతీరున నిలిపి ఉంగరపువ్రేలిని వంచి, చిటికెనవ్రేలిని పైకెత్తిపట్టిన లాంగూలహస్త మగును. ఈహస్తము పూర్వకాలమునందు పాలసముద్రమునందుఁ బుట్టిన కాలకూటవిషమును మ్రింగుటకై శివుఁడు గుళికగాఁ జేసిన పట్టినపుడు శివునివలనఁ బుట్టినది. దీనికి ఋషి కుమారస్వామి. సిద్ధజాతి. బంగారువన్నె. అధిదేవత లక్ష్మి.

వినియోగము:—

ద్రాక్షాఫలేచ రుద్రాక్షే చుబుకగ్రహణే౽పిచ.

352


కుచప్రరోహే క్రముకే కిఙ్కిణ్యాముత్పలే ఫలే,
విద్రుమేచ మితగ్రాసే నక్షత్రే బదరీఫలే.

353


వర్తులాయాం మల్లికాదౌ చకోరే ఛాతకే౽ల్పకే,
కరకాయాం సిద్ధజాతౌ హరీతక్యాం సువర్ణకే.

354


ఏవమాదిషుయుజ్యేత హస్తోలాఙ్గూలసంజ్ఞకః,

తా.. ద్రాక్షపండు, రుద్రాక్ష, గడ్డము పట్టుకొనుట, మొలకచన్ను, పోక, చిరుగజ్జెలు, కలువ, పండు, పగడము, కొద్దిపాటికబళము, నక్షత్రము, రేగుపండ్లు, వట్రువ, మల్లెపువ్వు, చకోరపక్షి, చాతకపక్షి, ఆల్పవస్తువు, వడగల్లు, సిద్ధజాతి, కరకకాయ, బంగారు ఇవి మొదలగువానియందు ఈహస్తము వినియోగించును.

20. సోలపద్మహస్తలక్షణమ్

కనిష్ఠాద్యా వర్తితాశ్చే
ద్విరళా స్సోలపద్మకః.

355

తా. చిటికెనవ్రేలు మొదలగు వ్రేళ్లు సందులు గలవిగా త్రిప్పి పట్టఁబడినయెడ సోలపద్మహస్త మగును.

వినియోగము:—

వికచాబ్జే కపిత్థాదిఫలే౽ప్యావర్తకే కుచే,
విరహే ముకురే పూర్ణచంద్రే సౌందర్యభాజనే.

356


ధమ్మిల్లే చంద్రశాలాయాం గ్రామే౽ప్యుద్ధతకోపయోః,
తటాకే శకటే చక్రవాకే కలకలారవే.

357


శ్లాఘనే సోలపద్మశ్చ కీర్తితో భరతాగమే,

తా. విరిసినతామర, వెలగ మొదలగు పండు, తిరుగుడు, చన్ను, ఎడబాటు, అద్దము, పూర్ణచంద్రుఁడు, సౌందర్యపాత్రము, కొప్పు, మేడమీఁదియిల్లు, ఊరు, ఎత్తు, కోపము, చెరువు, బండి, చక్రవాకపక్షి, కలకలధ్వని, మెప్పు వీనియందు ఈహస్తము వినియోగించును.

గ్రంథాంతరస్థసోలపద్మహస్తలక్షణమ్

వ్యావృత్తికరణం యత్ర సభవేదలపల్లవః.

358


వ్యావృత్తహస్తః కలశనవనీతముషఃపురా,
జజ్ఞే౽లపల్లవః కృష్ణాత్ వసంతోఋషిరుచ్యతే.

359


గంధర్వజాతి శ్శ్యామాంశురధీశో౽స్య దినేశ్వరః,

తా. వ్రేళ్ళను విరళముగఁ ద్రిప్పినయెడ అలపల్లవహస్త మవును. ఈయలపల్లవహస్తము పూర్వము పాలు వెన్నలు దొంగిలించిన కృష్ణునివలనఁ బుట్టెను. ఇది గంధర్వజాతి. దీనికి వసంతుఁడు ఋషి. శ్యామమువర్ణము. సూర్యుఁడు అధిదేవత.

వినియోగము:—

హైయంగవీనే విరహే మౌళౌమోదకభావనే.

360


ఫుల్లపద్మేచ మంజర్యాం కిరీటే వర్తులే౽పిచ,
శ్లాఘాయాం రూపసౌందర్యే నర్తనే దుర్గసౌధయోః.

361


ధమ్మిల్లే చంద్రశాలాయాం మాధుర్యే సాధువాదనే,
నియుజ్యతే తాళఫలే హస్తో౽యమలపల్లవః.

362

తా. అప్పుడు కాఁచిన నెయ్యి, విరహము, తల, కుడుమును జూపుట, వికసించిన తామరపువ్వు, పూగుత్తి, కిరీటము, వర్తులము, శ్లాఘించుట, ఆకృతి, చక్కదనము, నర్తనము, కోట, మేడ, కొప్పు, మేడమీఁదియిల్లు, మాధుర్యము, బాగు బాగు అనుట, తాటిపండు వీనియందు ఈహస్తము వినియోగించును.

21. చతురహస్తలక్షణమ్

తర్జన్యాద్యాస్త్ర యశ్శ్లిష్టాః
కనిష్ఠా ప్రసృతా యది,
అంగుష్ఠో౽నామికా మూలే
తిర్యక్చే చ్చతురఃకరః.

363
తా. తర్జని మొదలైన మూఁడువ్రేళ్ళను జేర్చి చిటికెనవేలును చాఁచి అంగుష్ఠమును అనామికమూలమం దడ్డముగ నుంచిపట్టిన చతురహస్త మగును.

వినియోగము:—

కస్తూర్యాం కిఞ్చిదప్యర్థే స్వర్ణతామ్రాదిలోహకే,
ఆర్ద్రేఖేదేరసాస్వాదే లోచనే వర్ణభేదకే.

364


ప్రమాణే సరసే మందగమనే శకలీకృతే,
ఆసనే ఘృతతైలాదౌ యుజ్యతే చతురఃకరః.

365

తా. కస్తూరి, కొంచె మనుట, బంగారు రాగి మొదలగులోహములు, తడి, భేదము, రసాస్వాదము, కన్ను, వర్ణభేదము, ప్రమాణము, సారస్యము, మెల్లగ నడచుట, తునుక, ఎత్తుపీఁట, నేయి నూనె మొదలగుద్రవ్యవస్తువులు వీనియందు ఈహస్తము వినియోగించును.

గ్రంథాంతరస్థచతురహస్తలక్షణమ్

యత్రా౽౦గుష్ఠః పతాకస్య మధ్యమామధ్యపర్వగః,
కనిష్ఠికా బహిర్యాతా చతురంతం కరంవిదుః.

366


అమృతం హర్తుమనసమాత్మాను మతికాంక్షిణమ్,
సుధాంహ రేతి హ స్తేనగరుడమ్ప్రతిజల్పతః.

367


కాశ్యపాచ్చతురోజాతః వాలఖిల్యో మహాఋషిః,
చిత్రవర్ణో మిశ్రజాతిః వైనతేయశ్చ దేవతా.

368
తా. పతాకహస్తమునందలి అంగుష్ఠమును నడిమివ్రేలి నడిమిగణుపునందు పొందించి చిటికెనవ్రేలిని బయట చాఁచిపట్టఁబడినది చతురహస్త మనఁబడును. ఇది పూర్వకాలమునందు అమృతమును హరించుటకై తనయభిమతము నపేక్షించు గరుత్మంతునికి సుధను హరింపుమని హస్తముచేత జాడ చూపిన కశ్యపునివలనఁ బుట్టెను. ఇది మిశ్రజాతి. దీనికి వాలఖిల్యుఁడు ఋషి . చిత్రవర్ణము. వైనతేయుఁడు దేవత.

వినియోగము:—

గోరోచనాయాంధూళ్యాంచ సరసే౽లక్తకే౽పిచ,
చిత్తావధానే కర్పూరే లోచనే చుబుకే తథా.

369


తాటఙ్కేవదనేఫాలే కటాక్షేచ ప్రియేనయే,
కస్తూర్యాం శర్కరాయాంచ తైలే మధునిసర్పిషి.

370


చాతుర్యేదర్పణేస్వర్ణే వజ్రేమరతకే౽పిచ,
ఇయత్తాయామీషదర్థేవస్తూనాం మితదర్శనే.

371


నీలశ్వేతాదివర్ణేషు మిశ్రజాతౌచ శాద్వలే,
గండస్థలే పాలికాయాం ద్రష్టవ్యశ్చతురఃకరః.

372

తా. గోరోచనము, దుమ్ము, సరసము, లత్తుక, మనసును నిలుపుట, కర్పూరము, కన్ను, గడ్డము, కమ్మ, ముఖము, నొసలు, కడకంటిచూపు, ప్రియవస్తువు, నయము, కస్తూరి, చక్కెర, నూనె, తేనె, నెయ్యి, నేర్పు, ఆద్దము, బంగారు, రవ, పచ్చ, ఇంత అనుట, కొంచె మనుట, వస్తువులను మితముగాఁ జూచుట, నలుపు తెలుపు మొదలగు వన్నెలు, మిశ్రజాతి, పచ్చికనేల, చెక్కిలి, పాలిక వీనియందు ఈహస్తము చెల్లును.

22. భ్రమరహస్తలక్షణమ్

మధ్యమాఙ్గుష్ఠసంస్పర్శే
తర్జనీ వక్రితా యది,
శేషౌ ప్రసారితౌ యత్ర
భ్రమరాభీధహస్తకః.

373

తా. నడిమివ్రేలిచేత బొటనవ్రేలిని తాఁకి చూపుడువ్రేలిని వంచి తక్కినవ్రేళ్లను చాఁచిపట్టినయెడ భ్రమరహస్త మగును.

వినియోగము:—

భ్రమరేచశుకేయోగే సారసే కోకిలాదిషు,
భ్రమరాభిధహస్తో౽యం కీర్తితో భరతాగమే.

374

తా. తుమ్మెద, చిలుక, యోగాభ్యాసము, బెగ్గురుపక్షి, కోయిల మొదలైనపక్షులు వీనియందు ఈహస్తము వినియోగించును.

గ్రంథాంతరస్థభ్రమరహస్తలక్షణమ్

హంసాస్యతర్జనీనమ్రాయదిస్యాద్భ్రమరఃకరః,
కర్ణపూరంరచయతో దేవమాతుః కదాచన.

375


కశ్యపాద్భ్రమరోజాతః కపిలో ఋషిరుచ్యతే,
మేచకఃఖచరోజాతిః పక్షిరాజో౽ధిదేవతా.

376

తా. హంసాస్యహస్తమునందలి చూపుడువ్రేలు వంచిపట్టునెడ భ్రమరహస్త మగును. ఇది పూర్వమందు కశ్యపబ్రహ్మ అదితిదేవికి కమ్మలు చేయునపుడు ఆయనవలనఁ బుట్టినది. ఇది గంధర్వజాతి. దీనికి ఋషి కపిలుఁడు. చామనచాయ. పక్షిరాజు అధిదేవత.

వినియోగము:—

యోగే మౌనవ్రతే శృంగేగజదస్తనిరూపణే,
దీర్ఘనాళప్రసూనానాం గ్రహణే భ్రమరే౽పిచ.

377


కర్ణమంత్రస్యరచనే కంకోటద్ధరణే౽పిచ,
నీవీమోక్షేద్వ్యక్షరాణామవ్యయానాం నిరూపణే.

378


ఖేచరేమేచకేవర్ణే భ్రమరో౽యం నియుజ్యతే,

తా. యోగాభ్యాసము, మౌనవ్రతము, కొన, ఏనుఁగుదంతమును జూపుట, నిడుకాడగలపువ్వులను పట్టుకొనుట, కర్ణమంత్రము చెప్పుట, ముల్లు తీయుట, పోకముడి విప్పుట, రెండక్షరముల అవ్యములను నిరూపించుట, ఆకాశమునందు తిరిగెడి ప్రాణి, చామనచాయ వీనియందు ఈహస్తము వినియోగించును.

23. హంసాస్యహస్తలక్షణమ్

మధ్యమాద్యాస్త్రయో౽౦గుళ్యః
ప్రసృతా విరళా యది.
తర్జన్యంగుష్ఠసంయోగే
హంసాస్యకరఈరితః.

379

తా. నడిమివ్రేలుమొదలు మూఁడువ్రేళ్లను ఎడముగలవిగా చాఁచి అంగుష్ఠమును చూపుడువ్రేలితోఁ జేర్చిపట్టినయెడ హంసాస్యహ్త మగును.

వినియోగము:—

మాఙ్గళ్యసూత్రబంధేచా౽ప్యుపదేశే వినిశ్చయే.

380


రోమాఞ్చేమౌక్తికాదౌచ చిత్రసంలేఖనేతథా,
దంశేతుజలబిందౌచ దీపవర్తిప్రసారణే.

381


నికషేశోధనేమల్లికాదౌరేఖావిలేఖనే,
మాలా యావహనేసో౽హం భావనాయాంచరూపకే.

382


నాస్తీతివచనేచాపి నికషాణాంచ భావనే,
కృతకృత్యే౽పిహంసాస్యః ఈరితోభరతాగమే.

383

తా. బొట్టుకట్టుట, ఉపదేశము, నిశ్చయము, గగుర్పాటు, ముత్యము మొదలైనవి, చిత్రము వ్రాయుట, అడవియీగ, నీటిబొట్టు, దీపపువత్తి నెగఁద్రోయుట, ఒరయుట, శోధించుట, మల్లెమొగ్గలు మొదలైనవి, గీఁత గీయుట, పూలదండ పట్టుకొనుట, నేనే బ్రహ్మ మనుట, రూపించుట, లేదనుట, ఒరసి చూడఁదగినవస్తువులను భావించుట, కృతకృత్యము వీనియందు ఈహస్తము వినియోగించును.

గ్రంథాంతరస్థహంసాస్యహస్తలక్షణమ్

శ్లిష్టాగ్రమధ్యమాఙ్గుష్ఠ తర్జన్యో యత్రసారితౌ,
అనామికా కనీయాంసౌ సహంసాస్య కరోభవేత్.

334


న్యగ్రోధమూలమాశ్రిత్య మునీనాం తత్త్వదర్శనే,
హంసాస్యో దక్షిణామూర్తేరాసీదస్య ఋషిశ్శుకః.

385


శుభ్రవర్ణి విప్రజాతిరధీశ శ్చతురాననః,

తా. బొటనవ్రేలిని చూపుడు నడిమివ్రేళ్ళను చేర్చి, ఉంగరపువ్రేలిని చిటికెనవ్రేలిని చాఁచిపట్టినయెడ హంసాస్యహస్త మవును. ఇది మఱ్ఱిమానిక్రింద మునులకు జ్ఞానోపదేశము చేయునప్పుడు దక్షిణామూర్తివలనఁ బుట్టెను. ఇది విప్రజాతి. దీనికి శుకుఁడు ఋషి, వర్ణము తెలుపు. బ్రహ్మ అధిదేవత.

వినియోగము:—

జ్ఞానోపదేశే పూజాయాం నిర్ణయేచతిలాహుతౌ.

386


భాషణేషఠనే గానే ధ్యానేభావనిరూపణే,
రచనేయావకాదీనాం పులకేమౌక్తికేమణౌ.

387


వేణునాదే సంయుతశ్చేద్వాసనాయాం నిజాత్మని,

జలబిందౌ లక్ష్యభావే ముద్రికాయాంచ చుమ్బనే.

388


విప్రజాతౌ శుభ్రవర్ణే హంసాస్యః పరికీర్తితః,

తా. జ్ఞానోపదేశము, పూజ చేయుట, నిర్ణయించుట, తిలాహుతి, మాటలాడుట, చదువుట, పాడుట, ధ్యానము చేయుట, భావములను నిరూపించుట, లత్తుక మొదలైనవానిని పెట్టుట, గగుర్పాటు, ముత్యము, రత్నము, పిల్లనగ్రోవి యూదుట, వాసన చూచుట, మనస్సు, నీటిబొట్టు, గురి పెట్టుట, ముద్దుటుంగరము, ముద్దు పెట్టుట, బ్రాహ్మణజాతి, తెల్లవన్నె వీనియందు ఈహస్తము వినియోగించును.

24. హంసపక్షహస్తలక్షణమ్

సర్పశీర్షకరే సమ్య
క్కనిష్ఠా ప్రసృతా యది.

389


హంసపక్షకరస్సో౽యం
తన్నిరూపణ ముచ్యతే,

తా. సర్పశీర్షహస్తమునందలి చిటికెనవ్రేలిని బాగుగా చాఁచిపట్టినయెడ హంసపక్షహస్త మగును.

వినియోగము:—

షట్సంజ్ఞాయాం సేతుబంధే నఖరేఖాఙ్కనే తథా.

390


విధానేహంసపక్షో౽యం కీర్తితో భరతాగమే,

తా. ఆరు అనెడి లెక్క, కట్టకట్టుట, గోటినొక్కుగురుతు, ఏదేనొకపని చేయుట వీనియందు ఈహస్తము వినియోగించును.

గ్రంథాంతరస్థహంసపక్షహస్తలక్షణమ్

కనిష్ఠా సర్పశీర్షేసా సారితా హంసపక్షకః.

391


తాండవాభ్యసనేహంసపక్షాకారః కరః స్మృతః,
తండోర్జాతో హంసపక్షః భరతో ఋషిరుచ్యతే.

392


నీలవర్లో౽ప్పరోజాతి రధీశః పఞ్చసాయకః,

తా. సర్పశీర్షహస్తమునందలి చిటికెనవ్రేలిని చాఁచిపట్టినయెడ హంసపక్షహస్త మగును. శివునిసన్నిధియందు తండువు తాండవము నభ్యసించునపుడు హంసరెక్కవలె చేతిని పట్టెను గనుక ఆతండువువలన హంసపక్షహస్తము పుట్టెను. ఇది అప్సరోజాతి. దీనికి ఋషి భరతుఁడు. వర్ణము నీలము. మన్మథుఁడు అధిదేవత.

వినియోగము:—

శుభనాట్యే సేతుబంధే వీణావాదే సమాహృతౌ.

393


నియంత్రణే పక్షిపక్షే పర్యాప్తౌ రూపలేఖనే,
శ్యామవర్ణే౽ప్సరోజాతౌ హంసపక్షో నియుజ్యతే.

394

తా. శుభనాట్యము, నీళ్ళకు అడ్డకట్ట కట్టుట, వీణ వాయించుట, సంగ్రహించుట, కట్టుట, పక్షిరెక్క, ముగియుట, చిత్తరువు వ్రాయుట, నలుపువన్నె, అప్సరోజాతి వీనియందు ఈహస్తము వినియోగించును.

25. సందంశహస్తలక్షణమ్

పునఃపునః పద్మకోశే
సంశ్లిష్టా ప్రసృతా యది,
సందంశాభిధహస్తో౽యం
కీర్తితో భరతాగమే.

395

తా. ముందు చెప్పిన పద్మకోశహస్తము వ్రేళ్ళను మాటిమాటికి చేర్చి విడిచిపెట్టుచుండినయెడ సందంశహస్త మగును.

వినియోగము:—

ఉదారే బలిదానేచ వ్రణే కీటె మనోభయే,
అర్చనే పఞ్చనక్తవ్యే సందంశాఖ్యో౽భిధీయతే.

396

తా. త్యాగము, బలియిచ్చుట, పుండు, పురుగు, మనస్సునందలి భయము, అర్చించుట, అయిదు అనుట వీనియందు ఈహస్తము వినియోచును.

గ్రంథాంతరస్థ సందంశహ సలక్షణమ్.

హంసాస్య మధ్యయా బాహ్యా యది సందంశకో భవేత్,
యేనా౽క్షమాలావాగ్దేవ్యాదధ్రేహస్తాద్యతస్తతః.

397


సందంశోభారతేర్జాతో ఋషిర్విశ్వావసుః స్మృతః,
విద్యాధరాన్వయోగౌరః వాల్మీకిరధిదేవతా.

398

తా. హంసాస్యహస్తమందలి నడిమివ్రేలు చాఁచిపట్టినయెడ సందంశహస్త మవును. సరస్వతీదేవి అక్షమాల ధరింపఁగా నామెవలన ఈ సందంశహస్తము పుట్టెను. ఇది విద్యాధరజాతి. దీనికి ఋషి విశ్వావసుఁడు. వర్ణము గౌరము. అధిదేవత వాల్మీకి.

వినియోగము:—

రదనేసూక్ష్మముకుళేసఙ్గీతేలాస్యనర్తనే,
టీకాయాంజ్ఞానముద్రాయాం తులాయాంరదనవ్రణే.

399


యజ్ఞోపవీతే రేఖాయాంశోధనే చిత్రలేఖనే,
సత్యేనాస్తీతివచనే కిఞ్చిదర్థేక్షణేశ్రుతౌ.

400


నికషేకనకాదీనాంశితేలక్ష్యేనఖే౽ఙ్కురే,

గుఞ్జాయామష్టసంఖ్యాయామింద్రగోపేవిషేతృణే.

401


పిపీలికాయాం మశకే గ్రహణే మౌక్తికస్రజామ్,
మత్కుణే మక్షికే మాల్యే రోమావళ్యాంచ సూచనే.

402


విజనే స్పర్శనే వేదే తుహినే భాషణేచ్యుతే,
క్షతే నఖక్షతే రత్నే యాచకే తిలకే౽౦జనే.

403


విద్యాధరాన్వయే గౌరే మందే సందంశఈరితః,

తా. పల్లు, సన్ననిమొగ్గ, పాట, లాస్యము, టీక (పదములయొక్క అర్థము వివరణము), జ్ఞానముద్ర, త్రాసు పట్టుట, దంతక్షతము, జందెము, గీర, శోధించుట, చిత్రము వ్రాయుట, నిజము, లేదనుట, ఇంచుక యనుట, క్షణకాల మనుట, వినుట, బంగారు మొదలైన వానిని ఒరయుట, గురి, గోరు, మొలక, గురిగింజ, ఎనిమిదింటి లెక్క, పట్టుపురుగు, విషము, గడ్డిపోచ, చీమ, దోమ, ముత్యాలపేరు నెత్తుట, నల్లి, ఈగ, పూలదండ, నూగారు, జాడ, ఏకాంతము, తాఁకుట, వేదము, మంచు, మాటలాడుట, జారుట, గాయము, నఖక్షతము, రత్నము, యాచకుఁడు, బొట్టు, కాటుక, విద్యాధరవంశము, గౌరవర్ణము, మెల్లనిది వీనియందు ఈహస్తము ఉపయోగించును.

26. ముకుళహస్తలక్షణమ్

అంగుళీపఞ్చకంచైవ
మిళిత్వా౽గ్రే ప్రదర్శనే.

404


ముకుళాభిధహస్తో౽యం
కీర్తితో భరతాగమే,

తా. అయిదు వ్రేళ్ళను చేర్చి పట్టఁబడునది ముకుళహస్త మనఁబడును.

వినియోగము:—

కుముదే భోజనే పఞ్చబాణే ముద్రాదిధారణే.

405


నాభౌచ కదలీపుష్పే యుజ్యతే ముకుళఃకరః,

తా. కలువపువ్వు, భోజనము చేయుట, మన్మథుఁడు, ముద్రలు ధరించుట, బొడ్డు, అరఁటిపువ్వు వీనియందు ఈహస్తము వినియోగించును.

గ్రంథాంతరస్థముకుళహస్తలక్షణమ్

క్లిష్టాంగుళిః పద్మకోశో యదిస్యాన్ముకుళఃకరః.

406


భానుం ప్రగృహ్ణతః పూర్వం బిమ్బమేవేతిశఙ్కయా,
మారు తేర్ముకుళోజాతః ఋషి స్తస్యవిశాఖలః.

407


సఙ్కీర్ణజాతిః కపిలవర్ణ శ్చంద్రో౽ధిదేవతా,

తా. పద్మకోశహస్తముయొక్క వ్రేళ్ళను చేర్చి పట్టినయెడ ముకుళహస్త మవును. పూర్వము ఆంజనేయుఁడు దొండపండనెడి శంకచేత సూర్యుని పట్టఁబోయినపుడు అతనివలన ఈముకుళహస్తము పుట్టెను. ఇది సంకీర్ణజాతి. దీనికి విశాఖలుఁడు ఋషి. కపిలవర్ణము, చంద్రుఁడు అధిదేవత.

వినియోగము:—

దానే జపే దీనవాక్యే భోజనే పద్మకోశకే.

408


ఆత్మనిప్రాణనిర్దేశే పఞ్చసఙ్ఖ్యానిరూపణే,
కాముకోచ్చరితే బాలచుమ్బనే దేవపూజనే.

409


ఛత్రాదీనాంచ ముకుళే ఫలగ్రహనిరూపణే,
సఙ్కీర్ణజాత్యాం కపిలే ముకుళఃకరఈరితః.

410

తా. దానము, జపము, దీనవాక్యము, భోజనము, తామరమొగ్గ, ఆత్మ, ప్రాణములను నిర్దేశించుట, అయిదనుట, కాముకునిమాట, బిడ్డలను ముద్దు పెట్టుకొనుట, దేవపూజ, గొడుగు మొదలగువానియొక్క ముడుగు, ఫలములను గ్రహించుట, సంకీర్ణజాతి, కపిలవర్ణము వీనియందు ఈహస్తము వినియోగించును.

27. తామ్రచూడహస్తలక్షణమ్

ముకుళేతామ్రచూడస్స్యా
త్తర్జనీ వక్రితా యది,

తా. ముకుళహస్తమునందలి తర్జనిని వంచిపట్టినయెడ తామ్రచూడహస్త మగును.

వినియోగము:—

కుక్కుటాదౌ బకే కాకే౽ప్యుష్ట్రేవత్సేచ లేఖనే.

411


తామ్రచూడకరాఖ్యోఽసౌ కీర్తితో భరతాగమే,

తా. కోడి మొదలైనది, కొంగ, కాకి, ఒంటె, దూడ, వ్రాయుట వీనియందు ఈహస్తము వినియోగించును.

గ్రంథాంతరస్థతామ్రచూడహస్తలక్షణమ్

పతాకస్య కనిష్ఠాయాం యత్రా౽౦గుష్ఠు నిపీడనమ్.

412


తమేవతామ్రచూడాఖ్యం వదంతి భరతాదయః,

తా. పతాకహస్తమునందలి చిటికెనవ్రేలిని బొట్టనవ్రేలు తాఁకినయెడ తామ్రచూడహస్త మగును.

తేషాం మూర్తిత్రయీభావః ఋగ్యజుస్సామభిఃపురా.

413


యేన హస్తేనా౽భినీతో విధేరగ్రే యతస్తతః,
తామ్రచూడః త్రయీజాతః తస్యవజ్రాయుధో ఋషిః.

414


శఙ్ఖవర్ణో దేవజాతిరధిదేవో బృహస్పతిః,

తా. ఇది పూర్వము ఆకృతులను ధరించిన మూఁడువేదములు బ్రహ్మయెదుట నిలిచి తమ యభిప్రాయమును తెలుపునపుడు వానివలనఁ బుట్టెను. ఇది దేవజాతి. దీనికి దేవేంద్రుఁడు ఋషి. శంఖవర్ణము. బృహస్పతి అధిదేవత.

వినియోగము:—

లోకత్రయే త్రిశూలేచ త్రిసఙ్ఖ్యా గణనే౽పిచ.

415


అశ్రుసమ్మార్జనే వేదత్రయే బిల్వదళే౽పిచ
దేవజాతౌ శుభ్రవర్లే తామ్రచూడో నియుజ్యతే.

416

తా. మూఁడులోకములు, శూలాయుధము, మూఁడని లెక్కపెట్టుట, కన్నీరు తుడుచుట, మూఁడువేదములు, మారేడుపత్రి, దేవజాతి, తెల్లవన్నె వీనియందు ఈహస్తము వినియోగించును.

28. త్రిశూలహస్తలక్షణమ్

నికుఞ్చయిత్వా౽ఙ్గుష్ఠంతు
కనిష్ఠఞ్చ త్రిశూలకః,

తా. బొటనవ్రేలిని చిటికెనవ్రేలిని వంచి తక్కినవ్రేళ్లను చాఁచిపట్టినది త్రిశూలహస్త మనఁబడును.

వినియోగము:—

బిల్వపత్రే త్రిత్వయుక్తే త్రిశూలః కరఈరితః.

417

తా. మారేడుపత్రి, మూఁటికూడిక వీనియందు ఈహస్తము వినియోగించును.

ఇత్యష్టావింశతిః ప్రోక్తా అసంయుతకరాః క్రమాత్,
యావదర్థాః ప్రయోగాణాం తావద్భేదాః కరాః స్మృతాః.

418

తా. ఈ చెప్పఁబడిన యిరువదియెనిమిదిహస్తములును అసంయుతహస్తము లనఁబడును. ఈహస్తముల ప్రయోగార్థములు ఎన్ని కలవో అన్నిహస్థభేదములును గలవని చెప్పుదురు.

గ్రంథాంతరే ఊర్ణనాభహస్తలక్షణమ్

పద్మకోశాఙ్గుళీనాంచ కుఞ్చనాదూర్ణనాభకః,
హస్తాభ్యాం కుర్వతః పూర్వం దైత్యవక్షో విదారణమ్.

419


నృసింహాదూర్ణనాభశ్చ జాతశ్శార్దూలకోఋషిః,
క్షత్త్రాన్వయోరక్తకాంతి రాదికూర్మో౽ధిదేవతా.

420

తా. పద్మకోశహస్తము వ్రేళ్ళను వంచిపట్టినయెడ ఊర్ణనాభహస్త మవును. ఇది పూర్వము నృసింహస్వామి హిరణ్యకశిపునిరొమ్మును నఖములచేత చీల్చునపుడు నృసింహస్వామివలనఁ బుట్టెను. ఇది క్షత్త్రియజాతి. దీనికి శార్దూలకుఁడు ఋషి. రక్తవర్ణము. ఆదికూర్మము అధిదేవత.

వినియోగము:—

శిరః కండూయనే చౌర్యే నరసింహే మృగాననే,
హర్యక్షే వానరే కూర్మే కర్ణికారే కుచే భయే.

421

క్షత్త్రజాతౌ రక్తకాంతా పూర్ణనాభో నియుజ్యతే,

తా. తలగోకుకొనుట, దొంగతనము, నరసింహుఁడు, మృగముఖము, సింహము, కోఁతి, తాబేలు, కొండగోగు, స్తనము, భయము, క్షత్త్రియజాతి, ఎఱ్ఱవన్నె వీనియందు ఈహస్తము చెల్లును.

గ్రంథాంతరే బాణహస్తలక్షణమ్

తర్జన్యాద్యాస్త్రయశ్శ్లిష్టాః కిఞ్చిదఙ్గుష్ఠపీడితాః.

422


కనిష్ఠికాచ ప్రసృతా సబాణః కథితః కరః,
షట్సఙ్ఖ్యాయాం నాళనృత్యే బాణహస్తో నియుజ్యతే.

423

తా. చూపుడువ్రేలుమొదలు మూఁడువ్రేళ్ళను బొటనవ్రేలితో చేర్చి చిటికెనవ్రేలిని చాఁచిపట్టినయెడ బాణహస్త మవును. ఇది ఆఱు అని లెక్కపెట్టుటయందును నాళనృత్యమునందును వినియోగించును.

గ్రంథాంతరే అర్ధసూచికహస్తలక్షణమ్

కపిత్థ తర్జన్యాశ్చోర్ధ్వ సారణాదర్ధసూచికః,
ఆఙ్కురె పక్షిశాబాదౌ బృహత్కీటే నియుజ్యతే.

424

తా. కపిత్థహస్తపుచూపుడువ్రేలు పొడువుగా ఎత్తిపట్టఁబడినయెడ అర్ధసూచికహస్త మగును. ఇది మొలక, పక్షి పిల్ల మొదలగునది, పెద్దపురుగు వీనియందు వినియోగించును.

అథ చతుర్వింశతిసంయుతహస్తానిరూప్యంతే.

అంజలిశ్చ కపోతశ్చ కర్కటస్స్వస్తిక స్తథా,
డోలాహస్తః పుష్పపుటశ్చోత్సంగశ్శివలిఙ్గకః.

425

కటకావర్ధనశ్చైవ కర్తరీ స్వస్తికాభిధః,
శకటశ్శబ్ధచక్రౌచ సమ్పుటః పాశకీలకౌ.

426


మత్స్యకూర్మవరాహాశ్చ గరుడోనాగబన్ధకః,
ఖట్వాభేరుణ్డకాఖ్యశ్చ అవహిత్థస్తథైవచ.

427


చతుర్వింశతిసంఖ్యాకా స్సంయుతాః కథితాఃకరాః,

తా. అంజలి, కపోతము, కర్కటము, స్వస్తికము, డోల, పుష్పపుటము, ఉత్సంగము, శివలింగము, కటకావర్ధనము, కర్తరీస్వస్తీకము, శకటము, శంఖము, చక్రము, సంపుటము, పాశము, కీలకము, మత్స్యము, కూర్మము, వరాహము, గరుడము, నాగబంధము, ఖట్వ, భేరుండము, అవహిత్థము అనునీయిరువదినాలుగుహస్తములు సంయుతహస్తములు.

గ్రం౦థాంతరే

అసంయుతానాం సంయోగాత్సంయుతాఖ్యాభవంతితే.

428


తేషాముత్పత్తిరేవైషా యోజనీయా మతా బుధైః,
తథాపి ద్వన్ద్వతాభేదాదధిదేవః పృథక్పృథక్.

429

తా. అసంయుతహస్తములసంయోగమువలన సంయుతహస్తము లవును. అసంయుతహస్తముల ఉత్పత్తియే సంయుతములకును కాని అధిదేవతలు వేరు వేరు.

౧. అంజలిహస్తలక్షణమ్

పతాకతలయోర్యోగా దంజలిః కర ఈరితః,

తా. రెండుపతాకహస్తముల అరచేతులఁ జేర్చిన నది యంజలిహస్త మనఁబడును.