అభినయదర్పణమ్/సంయుతహస్తములు

క్షత్త్రజాతౌ రక్తకాంతా పూర్ణనాభో నియుజ్యతే,

తా. తలగోకుకొనుట, దొంగతనము, నరసింహుఁడు, మృగముఖము, సింహము, కోఁతి, తాబేలు, కొండగోగు, స్తనము, భయము, క్షత్త్రియజాతి, ఎఱ్ఱవన్నె వీనియందు ఈహస్తము చెల్లును.

గ్రంథాంతరే బాణహస్తలక్షణమ్

తర్జన్యాద్యాస్త్రయశ్శ్లిష్టాః కిఞ్చిదఙ్గుష్ఠపీడితాః.

422


కనిష్ఠికాచ ప్రసృతా సబాణః కథితః కరః,
షట్సఙ్ఖ్యాయాం నాళనృత్యే బాణహస్తో నియుజ్యతే.

423

తా. చూపుడువ్రేలుమొదలు మూఁడువ్రేళ్ళను బొటనవ్రేలితో చేర్చి చిటికెనవ్రేలిని చాఁచిపట్టినయెడ బాణహస్త మవును. ఇది ఆఱు అని లెక్కపెట్టుటయందును నాళనృత్యమునందును వినియోగించును.

గ్రంథాంతరే అర్ధసూచికహస్తలక్షణమ్

కపిత్థ తర్జన్యాశ్చోర్ధ్వ సారణాదర్ధసూచికః,
ఆఙ్కురె పక్షిశాబాదౌ బృహత్కీటే నియుజ్యతే.

424

తా. కపిత్థహస్తపుచూపుడువ్రేలు పొడువుగా ఎత్తిపట్టఁబడినయెడ అర్ధసూచికహస్త మగును. ఇది మొలక, పక్షి పిల్ల మొదలగునది, పెద్దపురుగు వీనియందు వినియోగించును.

అథ చతుర్వింశతిసంయుతహస్తానిరూప్యంతే.

అంజలిశ్చ కపోతశ్చ కర్కటస్స్వస్తిక స్తథా,
డోలాహస్తః పుష్పపుటశ్చోత్సంగశ్శివలిఙ్గకః.

425

కటకావర్ధనశ్చైవ కర్తరీ స్వస్తికాభిధః,
శకటశ్శబ్ధచక్రౌచ సమ్పుటః పాశకీలకౌ.

426


మత్స్యకూర్మవరాహాశ్చ గరుడోనాగబన్ధకః,
ఖట్వాభేరుణ్డకాఖ్యశ్చ అవహిత్థస్తథైవచ.

427


చతుర్వింశతిసంఖ్యాకా స్సంయుతాః కథితాఃకరాః,

తా. అంజలి, కపోతము, కర్కటము, స్వస్తికము, డోల, పుష్పపుటము, ఉత్సంగము, శివలింగము, కటకావర్ధనము, కర్తరీస్వస్తీకము, శకటము, శంఖము, చక్రము, సంపుటము, పాశము, కీలకము, మత్స్యము, కూర్మము, వరాహము, గరుడము, నాగబంధము, ఖట్వ, భేరుండము, అవహిత్థము అనునీయిరువదినాలుగుహస్తములు సంయుతహస్తములు.

గ్రం౦థాంతరే

అసంయుతానాం సంయోగాత్సంయుతాఖ్యాభవంతితే.

428


తేషాముత్పత్తిరేవైషా యోజనీయా మతా బుధైః,
తథాపి ద్వన్ద్వతాభేదాదధిదేవః పృథక్పృథక్.

429

తా. అసంయుతహస్తములసంయోగమువలన సంయుతహస్తము లవును. అసంయుతహస్తముల ఉత్పత్తియే సంయుతములకును కాని అధిదేవతలు వేరు వేరు.

౧. అంజలిహస్తలక్షణమ్

పతాకతలయోర్యోగా దంజలిః కర ఈరితః,

తా. రెండుపతాకహస్తముల అరచేతులఁ జేర్చిన నది యంజలిహస్త మనఁబడును.

వినియోగము:—

దేవతాగురువిప్రాణాం నమస్కారే౽ప్యనుక్రమాత్.

430


కార్యశ్శిరోముఖోరస్సు వినియోజ్యో౽౦జలిః కరః,

తా. దేవతలకును, గురువులకును, బ్రాహ్మణులకును, నమస్కారము చేయఁటయందు ఈహస్తము చెల్లును. అందు దేవతలకు మ్రొక్కునపుడు శిరస్సునందును, గురువులకు మ్రొక్కునపుడు ముఖమునందును, బ్రాహ్మణులకు మ్రొక్కునపుడు రొమ్మునందును క్రమముగా నొప్పును.

గ్రంథాంతరస్థాంజలిహస్తలక్షణమ్

పతాకహస్త తలయోస్సంశ్లేషో యత్రజాయతే.

431


తమాహురంజలింహస్తం క్షేత్రపాలో౽ధిదేవతా,

తా. రెండుపతాకహస్తముల అరచేతులు చేర్చి పట్టఁబడునెడ అంజలిహస్ తమవును. దీనికి అధిదేవత క్షేత్రపాలుఁడు.

వినియోగము:—

ప్రణామే వినయేతాలఘాతేశమ్భునిరూపణే.

432


కిఙ్కరోమితి వదనేథ్యానేచా౽౦జలిరుచ్యతే,

తా. నమస్కరించుట, వినయముతో వంగుట, తాళము వేయుట, శివస్వరూపమును నిరూపించుట, కింకరుఁడ ననుట, ధ్యానము చేయుట వీనియందు ఈహస్తము చెల్లును.

2. కపోతహస్తలక్షణమ్

కపోత స్సకరోజ్ఞేయ శ్శ్లిష్టమూలాగ్రపార్శ్వతః.

433

తా. ముందు చెప్పిన అంజలిహస్తము మొదలుతుదలు పార్శ్వభాగములు చేరియుండునట్లు పట్టఁబడినయెడ కపోతహస్త మగును.

వినియోగము:—

ప్రమాణ గురుసమ్భాషా వినయాఙ్గీ కృతిష్వయమ్,

తా. ప్రమాణము, పెద్దలతో మాటలాడుట, వినయము ఒప్పుకొనుట వీనియందు ఈహస్తము వినియోగించును.

గ్రంథాంతరస్థకపోతహస్తలక్షణమ్

అంజలేరంతరం యత్ర జాయతే విరళీకృతమ్.

434


స భవేత కపోతాఖ్యశ్చిత్రసేనో౽ధిదేవతా,

తా. అంజలిహస్తముయొక్క అంతరము విరళముగా పట్టఁబడినయెడ కపోతహస్త మవును. దీనికి అధిదేవత చిత్రసేనుఁడు.

వినియోగము:—

అంగీకారే నారికేళ పూగహింతాళపాళిషు.

435


కదళీకుసుమే శీతే వినతే వస్తుసంగ్రహే,
సమ్పుటేమాతులుంగేచ కపోతో వినియుజ్యతే.

436

తా. అంగీకారము, టెంకాయ, పోక, హింతాళము, ఆరఁటిపూవు, చలి, వినయము, వస్తువులను సంగ్రహించుట, సంపుటము, మాదీఫలము వీనియందు ఈహస్తము వినియోగపడును.

3. కర్కటహస్తలక్షణమ్

అన్యోన్యస్యా౽న్తరే త్రా౽ఙ్గుళ్యోనిసృతహస్తయోః,
అంతర్బహిర్వావర్తంతే కర్కటస్సో౽భిధీయతే.

437

తా. ముందుచెప్పిన కపోతహస్తమందు వ్రేలివ్రేలిసందునను వ్రేళ్లు చొప్పించి వెలికిఁగాని లోపలికిఁగాని చాఁచిపట్టఁబడునెడల కర్కటహస్త మగును.

వినియోగము:—

సమూహ దర్శనేతుంద దర్శనే శఙ్ఖపూరణే,
అజ్ఞానాంమోటనేశాఖోన్నమనేచ నియుజ్యతే.

438

తా. గుంపును చూపుట, లావైనదానిని చూపుట, శంఖనాదము చేయుట, ఒడలువిరచుట, చెట్టుకొమ్మను వంచుట వీనియందు ఈహస్త ముపయోగించును.

గ్రంథాంతరస్థకర్కటహస్తలక్షణమ్

ఊర్ణనాభాంగుళీరంధ్రసంశ్లేషే కర్కటోభవేత్,
అస్యా౽ధిదైవతం విష్ణుమాదిదేవం విదుర్బుధాః.

439

తా. ఊర్ణనాభహస్తముయొక్క వ్రేళ్లసందులందు రెండవచేతివ్రేళ్లను చొప్పించిపట్టినయెడ కర్కటహస్త మగును. దీనికి విష్ణువు అధిదేవత.

వినియోగము:—

విలాపేజృమ్భణే ఘాతే కర్కటే శంఖపూరణే,
అంగుళీమోటనే స్త్రీణాం కర్కటో వినియుజ్యతే.

440

తా. దుఃఖము, ఆవులింత, కొట్టుట, ఎండ్రకాయ, శంఖమును ఊదుట, స్త్రీలు మెటికలు విరుచుట వీనియందు ఈహస్తము వినియోగించును.

4. స్వస్తికహస్తలక్షణమ్

పతాకయో స్సన్నియుక్త కరయోర్మణిబన్ధయోః,
సంయోగేన స్వస్తికాఖ్యో మకరార్థే నియుజ్యతే.

441

భయవాదే వివాదేచ కీర్తనే స్వస్తికోభవేత్,

తా. రెండుపతాకహస్తములందలి మణికట్టులను జేర్చిపట్టినయెడ స్వస్తికహస్త మగును. ఇది మొసలిని దెలుపుట, భయముతో మాటలాడుట, వాదాడుట, పొగడుట వీనియందు ఉపయోగించును.

5. డోలాహస్తలక్షణమ్

పతాకావూరుదేశస్థౌ డోలాహస్తో౽యముచ్యతే.

442


నాట్యారమ్భే ప్రయోక్తవ్య ఇతి నాట్యవిదోవిదుః,

తా. రెండుపతాకహస్తములను తొడమీఁదికి వ్రేలునట్లు పట్టినయెడ డోలాహస్త మగును. ఇది నాట్యారంభమందు వినియోగింపఁదగినది.

గ్రంథాంతరస్థడోలాహస్తలక్షణమ్

పతాకౌ పార్శ్వగౌ డోలా భారతీతస్య దేవతా.

443


మోహమూర్ఛా మదాలస్య విలాసాదిషుకీర్తితః,

తా. పతాకహస్తములు ఇరు పార్శ్వములందు వ్రేలునట్లు పట్టఁబడినయెడ డోలాహస్త మగును. దీనికి దేవత సరస్వతి. ఇది మోహము, మూర్ఛ, మదము, ఆలస్యము, విలాసము మొదలగువానియందు వినియోగించును.

6. పుష్పపుటహస్తలక్షణమ్

సంక్లిష్టౌ సర్పశీర్షౌ చేద్భవేత్పుష్పపుటఃకరః.

444

తా. రెండుసర్పశీర్షహస్తములను మనికట్టు మొదటిచిటికెనవ్రేలివరకుగల ఆరచేతి అంచులయందుఁ జేర్చిపట్టినయెడ పుష్పపుటహస్త మగును.

వినియోగము:—

నీరాజనవిధౌ బాలఫలాదిగ్రహణే తథా,

సంధ్యాయామర్ఘ్యదానే చ మంత్రపుష్పేచ నియోజయేత్.

445

తా. కర్పూరహారతి, బిడ్డలు పండ్లు మొదలైనవానిని దీసికొనుట, సంధ్యాకాలమందు అర్ఘ్యప్రదానము చేయుట, మంత్రపుష్ప మిచ్చుట వీనియందు ఈహస్త ముపయోగించును.

గ్రంథాంతరస్థపుష్పపుటలక్షణమ్

సర్పశీర్షస్య పార్శ్వేతు అపరఃసర్పశీర్షకః,
ధృతః పుష్పపుటాఖ్యస్స్యా దధీశః కిన్నరేశ్వరః.

446

వినియోగము:—

సుమధాన్యఫలాదీనా మర్పణే గ్రహణే తథా,
అర్ఘ్యదానే పుష్పపుటః కీర్తితోభావకోవిదైః.

447

తా. పువ్వులు ధాన్యము పండ్లు మొదలయినవానిని ఇచ్చుట, పుచ్చుకొనుట, అర్ఘ్యప్రదానము వీనియందు ఈహస్తము వినియోగించును.

7. ఉత్సంగహస్తలక్షణమ్

అన్యోన్యబాహుమూలస్థౌ మృగశీర్షకరౌ యది,
ఉత్సఙ్గనామాహస్తో౽యం కీర్తితో భరతాగమే.

448

తా. రెండు మృగశీర్షహస్తములను పరస్పరము మూపులకు సోకునట్లు పట్టునెడ ఉత్సంగహస్త మగును.

వినియోగము:—

ఆలిఙ్గనే చ లజ్జాయా మఙ్గదాదిప్రదర్శనే,

బాలానాం శిక్షణేచా౽యముత్సంగో యుజ్యతేకరః.

449

తా. కౌఁగిలింత, సిగ్గు, భుజకీర్తులు మొదలగువానిని జూపుట, బాలురను శిక్షించుట వీనియందు ఈహస్త ముపయోగించును.

గ్రంథాంతరస్థోత్సఙ్గహస్తలక్షణమ్

అరాళౌ స్వస్తికస్కంధా వుత్సఙ్గస్తదధీశ్వరః,
గౌతమో వినియోగస్తు లజ్జాయాం పరిరమ్భణే.

450


అఙ్గీకారే చ శీతే చ సాధ్వర్థే కుచగోపనే,
ఏవమాదిషుయుజ్యంతే ఉత్సంగకరభావనా.

451

తా. అరాళహస్తములను స్వస్తికాకారముగాఁ జేర్చి పట్టునెడ ఉత్సంగహస్త మగును. దీనికి అధిదేవత గౌతముఁడు. ఇది సిగ్గు, కౌఁగిలింత, అంగీకారము, చలి, మేలనుట, చన్నులను కప్పుకొనుట మొదలగువానియందు వినియోగించును.

8. శివలింగహస్తలక్షణమ్

వామే౽ర్ధచంద్రేవిన్యస్తః శిఖరశ్శివలింగకః,
వినియోగస్తుతస్యైవ శివలింగప్రదర్శనే.

452

తా. ఎడమచేతి యర్ధచంద్రహస్తమందు శిఖరహస్త ముంచఁబడెనేని శివలింగహస్త మగును. ఇది శివలింగమును జూపుటయందు వినియోగించును.

9. కటకావర్ధనహస్తలక్షణమ్

కటకాముఖయోః పాణ్యోస్స్వస్తికా న్మణిబంధయోః,
కటకా వర్ధనాఖ్యస్స్యాదితినాట్యవిదోవిదుః.

453

తా. కటకాముఖహస్తములయొక్క మనికట్లు స్వస్తికముగాఁ జేర్చి పట్టఁబడునేని కటకావర్ధనహస్త మగును.

వినియోగము:—

పట్టాభిషేకే పూజాయాం వివాహాశిషియుజ్యతే,

తా. పట్టాభిషేకము, పూజ, పెండ్లిదీవన వీనియందు ఈహస్తము వినియోగించును.

గ్రన్ధాంతరస్థకటకావర్ధనహస్తలక్షణమ్

కటకావర్ధనాఖ్యస్స్యా త్స్వస్తికౌ కటకాముఖౌ.

454


తస్య దేవో యక్షరాజో భావజ్ఞైశ్చ నిరూపితః,

తా. కటకాముఖహస్తములను స్వస్తికములుగఁ బట్టినయెడల కటకావర్ధనహస్త మగును. దాని కధిదేవత యక్షరాజు.

వినియోగము:—

వినియోగో విచారేచ శృఙ్ఞారే కోపసాంత్వనే.

455


జక్కిణీనటనే దండలాస్యేభవతి నిశ్చయే,

తా. విచారము, శృంగారము, కోపశాంతి, జక్కిణి అను ఆట, కోలాటము, నిశ్చయము వీనియందు ఈహస్తము వినియోగించును.

10. కర్తరీస్వస్తికహస్తలక్షణమ్

కర్తరీ స్వస్తికాకారః కర్తరీ స్వస్తికోభవేత్.

456
తా. కర్తరీముఖహస్తములను స్వస్తికాకారముగఁ బట్టినయెడ కర్తరీస్వస్తికహస్త మగును.

వినియోగము:—

శాఖాసు చా౽ద్రిశిఖరే వృక్షేషుచ నియుజ్యతే,

తా. చెట్టుకొమ్మలు, పర్వతశిఖరము, వృక్షములు వీనియందు ఈహస్తము ఉపయోగించును.

11. శకటహస్తలక్షణమ్

భ్రమరౌ మధ్యమాఙ్గుష్ఠ ప్రసారాచ్ఛ కటోభవేత్.

457


రాక్షసాభినయేచా౽యం నియోజ్యో భరతాదిభిః,

తా. రెండుభ్రమరహస్తములే బొటనవ్రేలిని నడిమివ్రేలిని చాఁచినయెడ శకటహస్త మగును. ఇది రాక్షసులు మొదలయినవారల యభినయమునందు చెల్లును.

12. శంఖహస్తలక్షణమ్

శిఖరాన్తర్గతాఙ్గుష్ఠ ఇతరాఙ్గుష్ఠసంగతః.

458


తర్జన్యాద్యాస్తతః శ్లిష్టాశ్శంఖహస్తః ప్రకీర్తితః,
శంఖాదిషు నియోజ్యో౽యమిత్యేనం భరతాదయః.

459

తా. శిఖరహస్తమునందలి యంగుష్ఠముతో రెండవచేతి యంగుష్ఠమును జేర్చి తక్కినవ్రేళ్ళను ఆశిఖరహస్తము పైకి చేర్చినయెడ శంఖహస్త మగును. ఇది శంఖము మొదలైనవానియందు వినియోగించును.

13. చక్రహస్తలక్షణమ్

యత్రార్ధచంద్రౌతిర్యఞ్చా వన్యోన్యతలసంస్పృశౌ,
చక్రహస్తస్స విజ్ఞేయశ్చక్రార్థే వినియుజ్యతే.

460

తా. అర్ధచంద్రహస్తములను అడ్డముగా రెండు అరచేతులను జేర్చి పట్టినయెడ చక్రహస్త మగును. ఇది చక్రమందు చెల్లును.

14. సమ్పుటహస్తలక్షణమ్

కుఞ్చితాఙ్గుళయశ్చక్రే సమ్పుటః కరఈరితః,

తా. ముందుచెప్పిన చక్రహస్తము వ్రేళ్ళను ముడిచిపట్టినయెడ సంపుటహస్త మగును.

వినియోగము:—

వస్త్వాచ్ఛాదే సమ్పుటేచ సమ్పుటః కరఈరితః.

461

తా. వస్తువులను దాఁచుటయందును, సంపుటమందును హస్తము చెల్లును.

15. పాశహస్తలక్షణమ్

సూచ్యానికుఞ్చితే శ్లిష్టే తర్జన్యౌపాశ ఈరితః,

తా. సూచీహస్తముల చూపుడువ్రేళ్ళను వంచి చేర్చిపట్టినయెడ పాశహస్త మగును.

వినియోగము:—

అన్యోన్యకలహేపాశే శృంఖలాయాం నియుజ్యతే.

462

తా. పరస్పరకలహమునందును, త్రాటియందును, సంకెలయందును ఈహస్తము చెల్లును.

16. కీలకహస్తలక్షణమ్

కనిష్ఠే కుఞ్చితే శ్లిష్టే మృగశీర్షే తు కీలకః,

తా. మృగశీర్షహస్తముల చిటికెనవ్రేళ్ళను వంచి చేర్చిపట్టినయెడ కీలకహస్త మగును.

వినియోగము:—

స్నేహే చనర్మాలాపేచ వినియోగో౽స్య సమ్మతః.

463

తా. స్నేహమునందును, ప్రియవచనమునందును ఈహస్తము చెల్లును.

17. మత్స్యహస్తలక్షణమ్

కరపృష్ఠోపరిన్యస్తో యత్రహస్తః పతాకికః,
కిఞ్చిత్ప్రసారితాఙ్గుష్ఠకనిష్ఠో మత్స్యనామకః.

464


ఏతస్య వినియోగస్తు మత్స్యార్థే సమతో భవేత్,

తా. పతాకహస్తములను ఒకటిమీఁద నొకటి చేర్చి చిటికెనవ్రేళ్లను బొటనవ్రేళ్లను కొంచెము పట్టినయెడ మత్స్యహస్త మగును. ఇది మత్స్యార్థమునందు చెల్లును.

18. కూర్మహస్తలక్షణమ్

కుఞ్చితాగ్రాంగుళిశ్చక్రేత్యక్తాంగుష్ఠకనిష్ఠకః.

465


కూర్మహస్తస్సవిజ్ఞేయః కూర్మార్థే వినియుజ్యతే,

తా. చక్రహస్తము మొనవ్రేళ్లను వంచి, చిటికెనవ్రేలిని బొటనవ్రేలిని జాఁచిపట్టినయెడ కూర్మహస్త మగును. ఇది తాఁబేటియందు ఉపయోగించును.

19. వరాహహస్తలక్షణమ్

మృగశీర్షేత్వన్యకరస్తేన శ్శ్లిష్టస్థితో యది.

466


కనిష్ఠాంగుష్ఠయోర్యోగాద్వరాహఃకరఈరితః,
ఏతస్య వినియోగస్తు వరాహార్థేతు యుజ్యతే.

467

తా. మృగశీర్షహస్తమును ఒకటిమీఁద నొకటి చేర్చి చిటికెనబొటన వ్రేళ్ల నుకూడఁబట్టిన యెడ వరాహహస్త మగును. ఇది పందియందు వినియోగించును.

20. గరుడహ్తసలక్షణమ్

తిర్యక్తలస్థితావర్ధచన్ద్రావంగుష్ఠయోగతః,
గరుడోగరుడార్థేచ యుజ్యతే భరతాగమే.

468

తా. అర్ధచంద్రహస్తములు రెండును అడ్డముగా బొటనవ్రేళ్లచేరికతో పట్టఁబడినయెడ గరుడహస్త మగును. ఇది గరుడునియందు ఉపయోగించును.

21. నాగబన్ధహస్తలక్షణమ్

సర్పశీర్షౌ స్వస్తికాచే న్నాగబంధ ఇతీరితః,

తా. రెండుసర్పశీర్షహ స్తములు స్వస్తికముగ పట్టఁబడినయెడ నాగబంధహస్త మగును.

వినియోగము:—

ఏతస్య వినియోగస్తు నాగబంధే నియుజ్యతే.

469


భుజంగదమ్పతీభావే నికుఞ్జానాంచ దర్శనే,
అథర్వణస్య మంత్రేషు యోజ్యోభరతకోవిదైః.

470

తా. పాముల పెనవంటి రతిబంధమందును, పాముల పెనయందును, పొదరిండ్ల జూపుటయందును, అథర్వణమంత్రమునందును ఈహస్తము చెల్లును.

22. ఖట్వాహ స్దలక్షణమ్

చతురే చతురం న్యస్య తర్జన్యంగుష్ఠమోక్షతః,
ఖట్వాహస్తో భవేదేషః ఖట్వాదిషు నియుజ్యతే.

471

తా. చతురహస్తముపై చతురహస్తము నుంచి చూపుడువ్రేలిని బొటనవ్రేలిని చాఁచిపెట్టినయెడ ఖట్వాహస్త మగును. ఇది మంచము మొదలైనవానియం దుపయోగించును.

23. భేరుండహస్తలక్షణమ్

మణిబన్ధకపిత్థాభ్యాం భేరుండకరఇష్యతే,
భేరుండపక్షిదమ్పత్యోర్భేరుండకరఈరితః.

472

తా. కపిత్థహస్తములు రెండును మనికట్టులతోఁ జేర్చి పట్టఁబడినయెడ భేరుండహస్త మగును. ఇది భేరుండపక్షిదంపతులయందు వినియోగించును.

24. అవహిత్థహస్తలక్షణమ్

సోలపద్మౌవక్షసిస్థావవహిత్థకరోమతః,

తా. రెండు సోలపద్మహస్తములు ఱొమ్మున కెదురుగాఁ బట్టఁబడినయెడ అవహిత్థహస్త మగును.

వినియోగము:—

శృఙ్గారనటనే చైవ లీలాకందుకధారణే.

473


కుచార్థేయుజ్యతీసో౽యమవహిత్థకరాభిధః,

తా. శృంగారనటనము, పుట్టచెండును పట్టుట, స్తనము వీనియందు ఈహస్తము వినియోగించును.

ఏవం సంయుతహస్తానాం నామలక్షణమీరితమ్.

474
తా. ఈవిధముగా సంయుతహస్తములయొక్క నామలక్షణములు చెప్పఁబడియెను.

గ్రంథాంతరస్థసంయుతహస్తాః

1. అవహిత్థహస్తలక్షణమ్

హృదయాభిముఖౌ యత్ర శుకతుణ్డావధోగతౌ,
సో౽వహిజ్ఞో భవేదస్య మార్కణ్డేయో౽ధిదేవతా.

475

తా. రెండుశుకతుండహస్తములు క్రిందుగ హృదయాభిముఖములుగఁ బట్టఁబడినయెడ అవహిత్థహస్త మగును. దీనికి అధిదేవత మార్కండేయుఁడు.

వినియోగము:—

దుర్బలత్వే దేహకార్శ్యే కౌతుకే చ కృశే మతః,

తా. బలహీనత, దేహము చిక్కియుండుట, సంతోషము, చిక్కినది వీనియందు ఈహస్తము చెల్లును.

2. గజదన్తహస్తలక్షణమ్

బాహుమధ్యగతౌ సర్పశీర్షౌ స్వస్తికతామితౌ.

476


యదిస్యాద్గజదంతో౽యం పరమాత్మా౽ధిదేవతా,

తా. సర్పశీర్షహస్తములు బాహుమధ్యమందు స్వస్తికముగఁ జేర్పఁబడినయెడ గజదంతహస్త మగును. దీనికి అధిదేవత పరమాత్మ.

వినియోగము:—

స్తమ్భగ్రహే శిలోత్పాటే భారగ్రాహే నియుజ్యతే.

477

తా. స్తంభమును గ్రహించుటయందును, రాతిని పెల్లగించుటయందును, భారమును వహించుటయందును ఈహస్తము చెల్లును.

3. చతురశ్రహస్తలక్షణమ్

చతురశ్రస్స్మృతోవక్షః పురోగౌ కటకాముఖౌ,
తస్యా౽ధిదైవం వారాహీ కీర్తితా భావకోవిదైః.

478

తా. రొమ్మున కెదురుగ కటకాముఖహస్తములను బట్టినయెడ చతురహస్త మగును. దీనికి అధిదేవత వారాహి.

వినియోగము:—

నియోగో దదిమన్థానే జక్కిణీ నటనే౽పిచ
ధారణే దోహనవిధౌ పటానామవకుంఠనే.

479


వహనే మౌక్తికాదీనాం రజ్జ్వాదీనాఞ్చకర్షణే,
నీవీబంధే చోళబంధే సుమాదీనాఞ్చధారణే.

480


వీజనే చామరాదీనాం చతురశ్రోనియుజ్యతే,

తా. పెరుగు చిలుకుట, జక్కిణియను ఆట, ధరించుట, పాలు పిదుకుట, వస్త్రములను కప్పుకొనుట, ముత్యములు మొదలగువానిని ధరించుట, త్రాడు మొదలగువానిని ఈడ్చుట, పోకముడి, రవికముడి, పువ్వులు మొదలగువానిని ధరించుట, వింజామరము మొదలగువానిని వీచుట వీనియందు ఈహస్తము వినియోగించును.

4. తలముఖహస్తలక్షణమ్

వక్షఃపురస్తాదుద్వృత్తౌ కరౌత్వభిముఖౌ యది.

481


నామ్నాతలముఖస్త్వస్య విఘ్నరాజో౽ధి దేవతా,

తా. రొమ్మున కెదురుగ పతాకహస్తములను మీఁది కెత్తిపట్టినయెడ తలముఖహస్త మగును. దీనికి అధిదేవత విఘ్నేశ్వరుఁడు.

వినియోగము:—

ఆలిఙ్గనే స్థూలవస్తౌ మహాస్తమ్భాదిభావనే.

482


బుధైరభిహితో మఞ్జుమర్దళే మధురస్వనే,

తా. ఆలింగనము, పెద్దవస్తువు, గొప్పస్తంభములను జూపుట, మనోజ్ఞమయిన ధ్వనిగలమద్దెల వీనియందు ఈహస్తము చెల్లును.

5. స్వస్తికాహస్తలక్షణమ్

త్రిపతాకౌ వామభాగే యది స్వస్తికతాం గతౌ.

483


స భవేత్స్వస్తికాహస్తో గుహస్తస్యా౽ధిదేవతా,

తా. త్రిపతాకములు ఎడమతట్టు స్వస్తికాకారముగాఁ బట్టఁబడినయెడ స్వస్తికహస్త మగును. వీనికి అధిదేవత గుహుఁడు.

వినియోగము:—

కల్పద్రుమేషు శైలేషు హస్తో౽యం వినియుజ్యతే.

484

తా. కల్పవృక్షములయందును పర్వతములయందును ఇది వినియోగించును.

6. ఆవిద్ధవక్రహస్తలక్షణమ్

పతాకహస్తౌవ్యావృత్తౌ సవిలాసం సకూర్పరమ్,
అసావావిద్ధవక్రస్స్యాత్తుమ్బురు స్త్వధిదేవతా.

485

తా. రెండుపతాకహస్తముల మోచేతులను విలాసముతోఁ గూడుకొనునట్లు విరివిగాఁ బట్టినయెడ ఆవిద్ధవక్రహస్త మగును. దీనికి అధిదేవత తుంబురుఁడు.

వినియోగము:—

మేఖలావహనే భేదే మధ్యకార్శ్యనిరూపణే,
దేశీయనాట్యనటనే వినియోగం తయోర్విదుః.

486
తా. మొలనూలు ధరియించుట, భేదము, నడుముయొక్క సన్నదనమును తెలుపుట, దేశీయనాట్యము వీనియందు ఈహస్తము చెల్లును.

7. రేచితహస్తలక్షణమ్

హంసపక్షౌ కృతోత్తాన తలావగ్రధృతౌయది,
రేచితస్సకరోజ్ఞేయో యక్షరాడధిదేవతా.

487

తా. రెండుహంసపక్షహస్తములను అరచేయి మీఁదుచేసి పట్టినయెడ రేచితహస్త మగును.

వినియోగము:—

శిశూనాం ధారణే చిత్రఫలకస్య నిరూపణే,
వినియోగో రేచితస్య ఏవమాదిషుయుజ్యతే.

488

తా. బిడ్డలను ఎత్తుకొనుట, చిత్తరువుపలకను చూపుట మొదలగువానియందు ఈహస్తము చెల్లును.

8. నితమ్బహస్తలక్షణమ్

ఉత్తానితావధోవక్త్రౌ పతాకా వంసదేశతః,
నితమ్బస్థౌ నితమ్బాఖ్యో అగస్త్యస్త్వస్యదేవతా.

489

తా. రెండుపతాకహస్తములను మూపులు మొదలుకొని క్రిందుమొగముగా పిరుఁదులు తాఁకునట్టు పట్టినయెడ నితంబహస్త మగును. దీనికి అధిదేవత అగస్త్యుఁడు.

వినియోగము:—

శ్రమే౽వతరణేచైవ విస్మయే వివశాయితే,
ఏవమాదిషు యుజ్యేత నితమ్బాఖ్యకరఃస్మృతః.

490
తా. బడలిక, దిగుట, ఆశ్చర్యము, పరవశత్వము మొదలగువానియందు ఈహస్తము చెల్లును.

9. లతాహస్తలక్షణమ్

పతాకౌ డోలికాకారౌ లతాఖ్య శ్శక్తిదేవతః,

తా. రెండుపతాకహస్తములను డోలాకారముగఁ బట్టినయెడల లతాహస్త మవును. దీనికి అధిదేవత శక్తి.

వినియోగము:—

ఏతస్య వినియోగశ్చ నిశ్చేష్టాయాం మదాలసే.

491


స్వభావనటనారమ్భే రేఖాయాం యోగభావనే,
ఏవమాదిషు యుజ్యేత లతాహస్త విభావనా.

492

తా. చేష్టలు లేకయుండుట, మదాలస్యము, స్వభావనటనము, రేఖ, యోగభావనము మొదలయినవానియందు ఈహస్తము చెల్లును.

10. పక్షవఞ్చితహస్తలక్షణమ్

వినస్యా౽గ్రే కటీశీర్షే త్రిపతాకకరౌ యది,
పక్షవఞ్చితనామానౌ అనయోర్దేవతా౽ర్జునః.

493

తా. రెండు త్రిపతాకహస్తములను ముందుగా నడుముమీఁదికి ఎగఁబట్టినయెడ పక్షవంచితహస్త మగును. దీనికి అధిదేవత అర్జునుఁడు.

వినియోగము:—

ఊర్వోరభినయేభేదే వినియోగో నియుజ్యతే,

తా. తొడలయభినయమందును భేదమందును ఈహస్తము చెల్లును.

11. పక్షప్రద్యోతహస్తలక్షణమ్

ఉత్తానితావిమౌ పక్షప్రద్యోతః సిద్ధదేవతః.

494

తా. ఈపక్షవంచితహస్తము మరికొంచెము ఎగఁబట్టఁబడినయెడ ప్రద్యోతహస్త మవును. దీనికి సిద్ధుఁడు అధిదేవత.

వినియోగము:—

నిరుత్సాహే బుద్ధిజాడ్యే విపరీతనిరూపణే,
మాయావరాహే కుండాభినయాదిషు భవేదసౌ.

495

తా. ఉత్సాహములేమి, బుద్ధిమాంద్యము, విపరీతమును నిరూపించుట, మాయావరాహము, కుండాభినయము మొదలగువానియందు ఈహస్తము చెల్లును.

12. గరుడపక్షహస్తలక్షణమ్

అర్ధచంద్రౌ కటీపార్శ్వేన్యస్యోర్ధ్వంసారితౌయది,
స్యాతాం గరుడపక్షాఖ్యౌ తయోరీశస్సనన్దనః.

496

తా. రెండు అర్ధచంద్రహస్తములు నడుముప్రక్కలను ఎగఁబట్టఁబడినయెడ గరుడపక్షహస్త మగును. దీనికి అధిదేవత సనందనుఁడు.

వినియోగము:—

కటిసూత్రే౽ధికేచైవ ఏవమాదిషుయుజ్యతే,

తా. మొలనూలు, అధికము మొదలైనవానియందు ఈహస్తము చెల్లును.

13. నిషేధహస్తలక్షణమ్

కపిత్థాఖ్యేన హస్తేన వేష్టితో ముకుళో యది.

497


నిషేధోనామచభవేత్తుమ్బురుస్త్వధిదేవతా,

తా. కపిత్థహస్తముచేత ముకుళహస్తము చుట్టఁబడినయెడ నిషేధహస్త మౌను. దీనికి అధిదేవత తుంబురుఁడు.

వినియోగము:—

సిద్ధాన్తస్థాపనే సత్యే నూనమిత్యభిభాషణే.

498


చూచుకగ్రహణే లిఙ్గపూజాయాం వినియుజ్యతే,

తా. సిద్ధాంతస్థాపనము, నిజము, నిశ్చయము చేయుట, చనుమొనలను అంటుట, లింగపూజ వీనియందు ఇది వినియోగించును.

14. మకరహస్తలక్షణమ్

యత్రా౽న్యోన్యం పరిగతావర్ధచంద్రావధోముఖౌ.

499


చలాఙ్గుష్ఠేనమకరో మహేంద్రస్తస్య దేవతా,

తా. రెండు అర్ధచంద్రహస్తములను జేర్చి దిగుమొగముగా బొటనవ్రేళ్లను కదలించిపట్టినయెడ మకరహస్త మవును. దీనికి అధిదేవత ఇంద్రుఁడు.

వినియోగము:—

కూలంకషే నదీపూరే సింహే దైత్యే మృగాననే.

500


కల్యాణే నిబిడే మఞ్చే నక్రేచా౽యం నియుజ్యతే,

తా. గట్టునొరయు, ఏటివెల్లువ, సింహము, అసురుఁడు, మృగముయొక్క మొగము, బంగారు లేక పెండ్లి, నిండినది, మంచె, మొసలి వీనియందు ఈహస్తము వినియోగించును.

15. వర్ధమానహస్తలక్షణమ్

అధోముఖౌ హంసపక్షౌ యస్మిన్నన్యోన్యమున్ముఖౌ.

501


సవర్ధమానో భవతి వాసుకి స్తస్య దేవతా,
అసౌ నృసింహే తద్దీప్తౌ రక్షోవక్షోవిదారణే.

502

తా. అధోముఖములయిన హంసపక్షహస్తములను పరస్పర మభిముఖ ములుగాఁ బట్టినయెడ వర్ధమానహస్త మవును. దీనికి అధిదేవత వాసుకి. ఇది నృసింహస్వామి. అతని తేజస్సు, హిరణ్యకశిపుని రొమ్మును చీల్చుట వీనియందు చెల్లును.

19. ఉద్వృత్తహస్తలక్షణమ్

అధరోత్తరయో రేక సమయే హంసపక్షయోః,
ఉద్వృత్త ఇతివిఖ్యాతో వాసిష్ఠో౽స్యా౽ధిదేవతా.

503

తా. ఒకేసమయమందు క్రిందుమీఁదులుగ హంసపక్షహస్తములు పట్టఁబడినయెడ ఉద్వృత్తహస్త మవును. దీనికి అధిదేవత వాసిష్ఠమహర్షి.

వినియోగము:—

లజ్జాయాముపమార్థేచ సంతాపే కంటకాదిషు,
భేదే భయే విచారేచ ఉద్వృత్తకరఈరితః.

504

తా. సిగ్గు, సాదృశ్యము, సంతాపము, ముల్లు మొదలయినది, భేదము, భయము, చింత వీనియందు ఈహస్తము వినియోగించును.

17. విప్రకీర్ణహస్తలక్షణమ్

స్వస్తికః శీఘ్రవిశ్లేషాత్ విప్రకీర్ణస్స ఉచ్యతే,
దక్షిణామూర్తిరేతస్య అధిదేవః ప్రకీర్తితః.

505


చేలాఞ్చలస్యవిస్రంసే సయుజ్యేత విధూననే,

తా. ముందు చెప్పినస్వస్తిహస్తమును వడిగా వదలినచో విప్రకీర్ణహస్త మవును. దీనికి అధిదేవత దక్షిణామూర్తి. ఇది కొంగు తొలఁగించుటయందును, వదలించుటయందును చెల్లును.

18. అరాళకటకాముఖహస్తలక్షణమ్

అరాళకటకౌ హస్తౌ అరాళ కటకాముఖః.
ప్రాపితౌ చేత్ స్వస్తికతామధివో౽స్యవామనః.

506

తా. అరాళహస్త కటకాముఖహస్తములను స్వస్తికాకారముగఁ బట్టినయెడ అరాళకటకాముఖహస్త మవును. దీనికి అధిదేవత వామనుఁడు.

తాంబూలదళ ఖండానాం దానే చింతావిషాదయోః.

507


వినియోజ్యఇతిప్రోక్తః అరాళకటకాముఖః,

తా. ఆకుమడుపులు వక్కపలుకులు నిచ్చుట, చింత, విషాదము వీనియందు ఈహస్తము చెల్లును.

19. సూచ్యాస్యహస్తలక్షణమ్

సూచీముఖౌ పురోదేశాద్యుగపత్పార్శ్వగామినౌ.

508


సూచ్యాస్య ఇతివిజ్ఞేయః అధిదేవో౽స్యనారదః,

తా. సూచీహస్తములను ఎదుటనుండి పార్శ్వములకు ఒకటిగా చేరఁబట్టినయెడ సూచ్యాస్యహస్త మగును. దీనికి అధిదేవత నారదుఁడు.

వినియోగము:—

కింకరోమీతి వచనే విరహే సకలార్థకే.

509


విలోకయేతి వాక్యేచ సూచ్యాస్యాభినయంవిదుః,

తా. ఏమి చేయుదు ననుట, విరహము, సమస్త మనుట, చూడు మనుట వీనియందు ఈహస్తము చెల్లును.

20. అర్ధరేచితహస్తలక్షణమ్

ఏకాంత్వధోముఖం ధృత్వా తౌ హస్తావథరేచితే.

510

అర్ధరేచితనామానౌ నందికేశో౽ధిదేవతా,

తా. రేచితహస్తమందలి యొకహంసపక్షహస్తమును అధోముఖముగఁ బట్టినయెడ అర్ధరేచితహస్త మవును. దీనికి అధిదేవత నందికేశుఁడు.

వినియోగము:—

ఆవాహేచోపదాదీనాం కార్యగుప్తా విమౌ మతౌ.

511

తా. ఆవాహనము కానుక మొదలగునది, కార్యమును మరుగుచేయుట వీనియందు ఈహస్తము చెల్లును.

21. కేశబద్ధహస్తలక్షణమ్

పతాకౌస్యాత్కేశబంధః తస్యదుర్గా౽ధిదేవతా,
రత్నస్తమ్భే కేశబంధే కపోలాదిషుయుజ్యతే.

512

తా. రెండు పతాకహస్తములు కేశబంధహస్త మగును. దీనికి అధిదేవత దుర్గ . ఇది రత్నస్తంభము, కొప్పు, చెక్కిళ్లు మొదలయినవానియందు వినియోగించును.

22. ముష్టిస్వస్తికహస్తలక్షణమ్

ముష్టిహస్తౌ స్వస్తికతాం కుక్షి స్థానే గతౌ యది,
ముష్టిస్వస్తికహస్తస్స్యాత్ దేవః కింపురుషఃస్మృతః.

518

తా. కడుపుమీఁదుగా ముష్టిహస్తములను స్వస్తికములుగఁ బట్టినయెడ ముష్టిస్వస్తికహస్త మగును. దీనికి అధిదేవత కింపురుషుఁడు.

వినియోగము:—

క్రీడాకందుకసంధానే ద్వంద్వయుద్ధ నిరూపణే,
వ్రీడాభరే నీవిబంధే వినియోగో౽స్యసంమతః.

514

తా, చెండాడుట, ద్వంద్వయుద్ధము, మిక్కిలి సిగ్గు, పోకముడి వీనియందు ఈహస్తము వినియోగించును.

23. నళినీపదకోశహస్తలక్షణమ్

వ్యావర్తితౌ పద్మకోశౌ యది స్వస్తికతాం గతౌ,
నళినీపద్మకోశాఖ్యో భవేత్ శేషో౽ధిదేవతా.

515

తా. పద్మకోశహస్తములను వెనుకకు త్రిప్పి స్వస్తికములుగఁ బట్టినయెడ నళినీపద్మకోశహస్త మగును. దీనికి అధిదేవత ఆదిశేషుఁడు.

వినియోగము:—

నాగబంధే చ ముకుళే సమయోర్దానకర్మణి,
స్తబకేదశసంఖ్యాయాం గణ్డభేరుణ్డకేమతః.

516

తా. నాగబంధము, మొగ్గ, సమముగ నిచ్చుట, పూవుగుత్తి, పది యనుట, గండభేరుండపక్షి వీనియందు ఈహస్తము వినియోగించును.

24. ఉద్వేష్టితాలపద్మహస్తలక్షణమ్

ఉద్వేష్టిత క్రియావంతౌ వక్షసో౽ గ్రే౽లపల్లవౌ,
ఉద్వేష్టితాలపద్మాఖ్య శ్శక్తిరస్యా౽ధిదేవతా.

517

తా. అలపల్లవహస్తములను చుట్టుకోఁబడినవి అగునట్లు రొమ్మున కెదురుగాఁ బట్టినయెడ ఉద్వేష్టితాలపద్మహస్త మగును. దీనికి అధిదేవత శక్తి.

వినియోగము:—

ప్రాణేశే దీనవచనే స్తనయోర్వికచాంబుజే,
మోహితా౽స్మీతి వాక్యేచ ప్రలాపస్య నిరూపణే.

518

కామితార్థ ప్రకరణే ఏతేషు వినియుజ్యతే,

తా. ప్రాణనాథుఁడు, దీనవచనము, స్తనములు, వికసించినకమలము, మోహితురాల నైతి ననుట, ప్రలాపమును నిరూపించుట, కోరినను తెలియఁజేయుట మొదలైనవానియందు ఈహస్తము వినియోగించును.

25. ఉల్బణహస్తలక్షణమ్

తౌ నేత్ర దేశగాపుల్బణాభ్యో విఘ్నేశ దేవతః.

519


స్తబకేషు విశాలేషు నేత్రేషు చ నిరూపితః,

తా. ఆయలపద్మహస్తములే కంటికెదురుగఁ బట్టఁబడినయెడ ఉల్బణహస్త మౌను. దీనికి అధిదేవత విఘ్నేశుఁడు. ఇది పూగుత్తులయందును, విశాలములైన కన్నులందును వినియోగించును.

26. లాలితహస్తలక్షణమ్

స్వస్తికాకరణావేతౌ శిరోదేశే౽లపల్లవౌ.

520


లాలితో గదితావేతౌ దేవతా వైష్ణవీ మతా,
ఏతస్య వినియోగస్తు సాలే దుర్గే మహీధరే.

521

తా. అలపల్లవహస్తములను తలమీఁద స్వస్తికాకారముగ పట్టినయెడ లాలితహస్త మౌను. దీనికి అధిదేవత వైష్ణవి. ఇది మద్ది, మ్రాను, శత్రువులకు చొరరానికోట, కొండ వీనియందు వినియోగించును.

గ్రంథాంతరే

1. విప్రకీర్ణహస్తలక్షణమ్

హస్తౌ తు త్రిపతాకాఖ్యౌ తిర్యక్కూర్పరసంయుతౌ,
కథ్యతే విప్రకీర్ణో౽యం హస్తోనాట్యవిశారదైః.

522

తా. రెండు త్రిపతాకహస్తముల మోచేతులను అడ్డముగాఁ గూడఁబట్టినయెడ విప్రకీర్ణహస్త మగును.

వినియోగము:—

కవచేచ కరన్యాసే మంత్రావాహే క్షమాగుణే,
విచారేచ ప్రయోక్తవ్యో విప్రకీర్ణ ఇతీరితః.

523

తా. కవచము, కరన్యాసము, మంత్రావాహనము, క్షమాగుణము, విచారము వీనియందు ఈహస్తము వినియోగించును.

2. గజదంతహస్తలక్షణమ్

కరాభ్యాం శిఖరౌ ధృత్వా కనిష్టే ప్రసృతే యది,
గజదంతకరః ఖ్యాతః కరోభరతవేదిభిః.

524

తా. రెండుశిఖరహస్తములును చిటికెనవ్రేళ్లు చాఁచిపట్టఁబడినయెడ గజదంతహస్త మవును.

వినియోగము:—

జలావగాహే ద్విరదదంతయోర్భూమిమానయోః,
శఙ్కుస్థాపనభావేషు గజదంతో నియుజ్యతే.

525

తా. నీళ్లయందు మునుఁగుట, ఏనుఁగుకొమ్ములు, భూమిమానము, శంకుస్థాపనము చేయుట వీనియందు ఈహస్తము వినియోగించును.

3. తాలముఖహస్తలక్షణమ్

కరౌ పతాకనామానౌ అన్యోన్యాభిముఖీకృతౌ,
చలితౌ చేత్తాలముఖః ప్రోక్తో భరతవేదిభిః.

526
తా. రెండుపతాకహస్తములను ఎదురెదురుగాఁ బట్టి చలింపఁజేయునెడ తాలముఖహస్త మగును.

వినియోగము:—

భుజఙ్గసూక్ష్మనాట్యేచ ముఖనాట్యేచ మేళనే,
గ్రహే స్థూలపదార్థేచ తాలవక్త్రో౽భిధీయతే.

527

తా. భుజంగనాట్యము, ముఖనాట్యము, కూడిక, గ్రహించుట, లావైనపదార్థము వీనియందు ఈహస్తము చెల్లును.

4. సూచీవిద్ధహస్తలక్షణమ్

అన్యోన్యమభిసంస్పృష్టా సూచీవక్త్రాభిధౌ కరౌ,
సూచీవిద్ధకరస్సో౽యం నృత్తహస్తానుసారిభిః.

528

తా. రెండు సూచీముఖహస్తములు ఎదురెదురుగ జేరఁబట్టఁబడునెడ సూచీవిద్ధహస్త మగును.

వినియోగము:—

హల్లీసలీనాభినయే లగ్నార్థే మేళనేదృఢే,
శాఖాద్వయస్య సంయోగే సూచీవిద్ధకరోభవేత్.

529

౫. పల్లవ తా. కోలాటమునందలికలగలుపు, చేరిక, గట్టిది, రెండుకొమ్మలచేరిక వీనియందు ఈహస్తము చెల్లును.

5. పల్లవహస్తలక్షణమ్

పతాకౌ మణిబంధేతు చలితా చేదధోముఖౌ,
కరఃపల్లవనామా౽యం యుజ్యతే నాట్యవేదిభిః.

530
తా. పతాకహస్తములు క్రిందుమొగముగ మనికట్లు కదలునట్లు పట్టఁబడినయెడ పల్లవహస్త మవును.

వినియోగము:—

ఫలపుష్పాతిభారేణ నమ్రశాఖానులమ్బనే,
నమ్రతార్థే నియోక్తవ్యః పల్లవస్సో౽భిధీయతే.

531

తా. పుష్పఫలాదులచే వంగినకొమ్మల వ్రేలాడుట, వంగుట వీనియందు ఈహస్తము చెల్లును.

6. నితమ్బహస్తలక్షణమ్

అంసదేశం సమారభ్య నితమ్బానధిచాలితౌ,
పార్శ్వయోస్తు పతాకౌ ద్వౌ నితమ్బకరఉచ్యతే.

532

తా. రెండు పతాకహస్తములు మూపులు మొదలుకొని పిరుఁదులదాఁక ప్రక్కలలో కదలుచుండునట్లు బట్టఁబడినయెడ నితంబహస్త మవును.

వినియోగము:—

పరివేషేచ సూర్యేన్ద్వో రఙ్గ లావణ్యదర్శనే,
ప్రాకారాదేవతానాంచ నైపథ్యే భ్రమణే౽పిచ.

533


పార్శ్వసౌందర్యభావేచ నితమ్బాఖ్య కరోభవేత్,

తా. సూర్యచంద్రుల పరివేషము, చక్కదనము, ప్రాకారము, దేవతాదుల వేషము, భ్రమించుట, ప్రక్కల చక్కదనము వీనియందు ఈహస్తము చెల్లును.

7. కేశబంధహస్తలక్షణమ్

ఏతావేవ నితమ్బాది కేశపర్యంతచాలితౌ.

534


యదీస్యాత్కేశబంధాఖ్య కరస్సమ్యఙ్నిరూప్యతే,

తా. ముందు చెప్పిన పతాకహస్తములే పిరుఁదులు మొదలు తల వెండ్రుకలదాఁక చలింపఁజేయుచు పట్టఁబడినయెడ కేశబంధహస్త మగును.

వినియోగము:—

వృక్షద్వయే౽ధికేమేరో రర్ధేబహు విభావనే.

535


ఉత్తిష్టేతివచోభావే యుజ్యతే కేశబంధకః,

తా. రెండువృక్షములు, అధికము, మేరుపర్వతము, చాలా అనుట, లెమ్ము అనుట వీనియందు ఈహస్తము చెల్లును.

8. లతాహస్తలక్షణమ్

అలపద్మావగ్రభాగ ప్రశ్రితౌ చలితౌ యది.

536


లతాహస్తస్సవిజ్ఞేయః ప్రోక్తో నాట్యవిశారదైః,

తా. రెండు అలపద్మహస్తములు ఎదురెదురుగ చలించునట్లు పట్టఁబడినయెడ లతాహస్త మౌను.

వినియోగము:—

భ్రమరాభిధనాట్యేచ వాయోశ్చలితకోరకే.

537


లతాయాం పుష్పితాయాంచ స్తబకాచలనే౽పిచ,
లీలాకందుకభావేచ లతాహస్తో నియుజ్యతే.

538

తా. భ్రమరనాట్యము, గాలిచేఁగదలెడిమొగ్గ, పూదీఁగ, పూగుత్తుల కదలిక, చెండు వీనియందు ఈ హస్తము చెల్లును.

9. ద్విరదహస్తలక్షణమ్

పతాకనామ్నాహస్తేన స్కంధదేశే నివేశ్యచ,
పద్మకోశమధోవక్త్రం దక్షిణే హస్తకే యది.

539


సమౌ ధృతౌ చేద్ద్విరదహస్తో౽యం పరికీర్తితః,

తా. ఎడమచేత పతాకహస్తమును, కుడిచేత అధోముఖముగ పద్మకోశహస్తమును సమముగఁ బట్టఁబడినయెడ ద్విరదహస్త మవును.

వినియోగము:—

గజస్య శుండాభినయే గజవక్త్రప్రదర్శనే.

540


యుజ్యతే కరిహస్తో౽సౌ నరహస్తానుసారతః,

తా. ఏనుఁగుతొండమునందును, విఘ్నేశ్వరుని జూపుటయందును, ఈహస్తము చెల్లును.

10. ఉద్ధృతహస్తలక్షణమ్

ఊరసోగ్రే హంసపక్షావన్యోన్యాభిముఖీకృతౌ.

541


భవేదుద్ధృతహస్తో౽యం వినియోగో౽స్యకథ్యతే,

తా.రొమ్మున కెదురుగ హంసపక్షహస్తములను ఎదురెదురుగఁ జేర్చిపట్టినయెడ ఉద్ధృతహస్త మవును.

వినియోగము:—

ఆవర్తేత్వవ్యథాత్యర్ధే భావనాయాం స్వరూపకే.

542


స్ధిరోభవేతి వచనే డోలాయాం స్థూలకే౽పిచ,
గృహే౽ప్యుద్ధృతహస్తోయం ప్రకృతార్థే నియుజ్యతే.

543

తా. నీటిసుడి, అధికము, తలఁపు, స్వరూపము, స్థిరుడవు అగుమనుట, ఉయ్యాల, పెద్దది, ఇల్లు, ప్రకృతార్థము వీనియందు ఈహస్తము చెల్లును.

11. సంయమహస్తలక్షణమ్

తర్జనీ మధ్యమౌ హస్తతలేనమ్రీకృతౌ యది.

544


ఇతరౌ ప్రసృతౌసో౽యం కరస్సంయమనామకః,

తా. చూపుడువ్రేలిని నడిమివేలిని అరచేతితట్టు వంచి తక్కినవ్రేళ్ళను చాఁచిపట్టినయెడ సంయమహస్త మవును.

వినియోగము:—

ప్రాణాయామే మహాయోగే యుజ్యతేచా౽ర్యభావనే.

545

తా. ప్రాణాయామము, యోగాభ్యాసము, పూజ్యలు అనుట వీనియందు హస్తము చెల్లును.

12. ముద్రాహస్తలక్షణమ్

కరయోర్మధ్యమాఙ్గుష్టే యోగాన్ముద్రా కరోభవేత్,

తా. రెండుచేతుల నడిమివ్రేళ్ళను బొటనవ్రేళ్ళను జేర్చిపట్టినయెడ ముద్రాహస్త మవును.

వినియోగము:—

అణౌ తృణే గోముఖేచ త్రోటీపుట నిదర్శనే.

546


ముద్రాహస్తోయుజ్యతే౽సౌ భరతాగమకోవిదైః,

తా. అణువు, గడ్డిపోచ, ఆవు మోర, పక్షి ముక్కు వీనిని జూపుటయందు ఈహస్తము చెల్లును.

13. అజాముఖహస్తలక్షణమ్

సింహాననాభిధకరే తర్జనీచ కనిష్ఠికా.

547


మధ్యమానామికాపృష్టే యోగాద్భూయాదజాముఖః,

తా. సింహముఖహస్తముయొక్క చూపుడు చిటికెనవ్రేళ్ళను, నడిమివ్రేళ్ళకును ఉంగరపువ్రేళ్ళకును మీఁదుగాఁ జేర్చిపట్టినయెడ అజాముఖహస్త మగును.

వినియోగము:—

అజాదికానాం వక్త్రేషు నిర్విషాణ ముఖేషుచ.

548


గజకుంభే మల్లయుద్ధే అజావక్త్రో నియుజ్యతే,

తా. మేఁక మొదలైన జంతువులమోరలందును, కొమ్ములు లేనిజంతువుల ముఖములందును, ఏనుఁగు కుంభస్థలమునందును, జెట్టిపోట్లాటయందును ఈహస్తము చెల్లును.

14. ఆర్ధముకుళహస్తలక్షణమ్

లాఙ్గూలాఖ్యకరే సమ్యక్కనిష్ఠా వక్రితా యది.

549


ప్రోక్తో౽ర్ధ ముకుళాఖ్యో౽సౌ భరతాగమవేదిభిః,

తా. లాంగూలహస్తపుచిటికెనవ్రేలు బాగుగ వంపఁబడినయెడ అర్ధముకుళహస్త మగును.

వినియోగము:—

లికుచేశీలభావేచా ౽ప్యుచితే౽పి కుచే౽పిచ.

550


లోభే ముకుళపద్మే చ కరణే వినియుజ్యతే,

తా. గజనిమ్మపండు, మంచిస్వభావము, ఉచితము, కుచము, లోభము, తామరమొగ్గ, ఉపకరణము వీనియందు ఈహస్తము వినియోగించును.

15. రేచితహస్తలక్షణమ్

అలపద్మకరౌ యత్ర శ్లిష్టౌ పార్శ్వప్రసారితౌ.

551


తత్తత్ప్రయోగకుశలైః రేచితో౽యం నిరూప్యతే,

తా. అలపద్మహస్తములను చేర్చి, పార్శ్వమందు చాఁచిపట్టినయెడ రేచితహస్త మగును.

వినియోగము:—

చారీయే పార్శ్వనటనే నారికేళే ప్రలాపకే.

552


సర్వనాట్యేషు వేళాయాం యుజ్యతే రేచితఃకరః,

తా. చారీనాట్యమునందును, పార్శ్వనాట్యమునందును, టెంకాయయందును, ప్రలాపమునందును, ఎల్లనాట్యసమయములయందును ఈహస్తము చెల్లును.

16. కుశలహస్తలక్షణమ్

అన్యోన్యాభిముఖావర్ధచంద్రౌ కుశలసంజ్ఞకః.

553


భూచారే నయనే పూర్ణవస్తునిర్దేశభావనే,
జలావగాహే పద్మేచ యుజ్యతే కుశలఃకరః.

554

తా. అర్ధచంద్రహస్తములను ఎదురెదురుగ పట్టినయెడ కుశలహస్త మౌను. ఇది భూసంచారము, నేత్రము, పూర్ణవస్తువులు నిర్దేశించుట, నీటిలో మునుఁగుట, తామరపూవు వీనియందు చెల్లును.

17. పక్షవఞ్చితహస్తలక్షణమ్

కటిదేశగతావేతౌ పక్షవఞ్చితకో భవేత్,
పక్షీణాం పక్షభావేతు రశనాయాం నితమ్బకే.

555


పక్షవఞ్చితహస్తో౽యం యుజ్యతే౽త్ర పురాతనైః,

తా. ఈ కుశలహస్తమునందలి అర్ధచంద్రహస్తములను కటిప్రదేశమున నుంచినయెడ పక్షవంచితహస్త మవును. ఇది పక్షుల రెక్కలు, మొలనూలు, కటిపశ్చాద్భాగము వీనియం దుపయోగించును.

18. తిలకహస్తలక్షణమ్

త్రిపతాకాభిధౌహస్తా లలాటే హృదయే స్థితౌ.

556


తిలకాభిధహస్తో౽యం కీర్తితో భావవేదిభిః,
దేవపుష్పాంజలౌగన్ధవస్త్యాది తిలకేషుచ.

557


తిలకాభిధహస్తో౽యం కీర్తితో భావవేదిభిః,

తా. త్రిపతాకహస్తములను నొసటను రొమ్మునందును నుంచినయెడ తిలకహస్త మౌను. ఇది దేవపుష్పాంజలి, వాసనగలవస్తువు మొదలైనది, తిలకభేదములు వీనియందు వినియోగించును.

19. ఉత్థానవఞ్చితహస్తలక్షణమ్

త్రిపతాకావంసదేశ గతా వుత్థానవఞ్చితః.

558


విష్ణోరభినయే స్తమ్భభావనాయాం బుధోదితః,
ఉత్థానవఞ్చితాభిఖ్య స్సర్వనాట్యేషుకీర్తితః.

559

త్రిపతాకహస్తములను భుజమూలములకు సమీపమునఁ జేర్చిపట్టినయెడ ఉత్థానవంచితహస్త మౌను. ఇది మహావిష్ణువును అభినయించుట, స్తంభములను జూపుట వీనియందు చెల్లును.

20. వర్ధమానహస్తలక్షణమ్

ఊర్ధ్వభాగోన్ముఖౌ హస్తౌ శిఖరౌ వర్ధమానకః,
సర్వదేతి వచోభావే దత్తమిత్యర్థకే౽పిచ.

560


కింకిమిత్యుక్తి సమయే కదాచి దితిభాషణే,
వర్ధమానకరః ప్రోక్తః భరతాగమవేదిభిః.

561

తా. శిఖరహస్తములను మీఁది కెత్తిపట్టినయెడ వర్ధమానహస్త మౌను. ఇది ఎల్లప్పుడని చెప్పుట, ఇయ్యఁబడినది యనుట, ఏమి యేమి యనెడి సమయము, ఒకానొకప్పు డనుట వీనియందు చెల్లును.

21. జ్ఞానహస్తలక్షణమ్

ఆదౌపతాకౌ ధృత్వాతు అంసాదూర్ధ్వముఖౌవహేత్,
భవేద్జ్ఞానాభిధకరః కథితం నృత్తకోవిదైః.

562


గ్రహేచ హృదయే ధ్యానే జ్ఞానహస్తో విధీయతే,

తా. మొదట పతాకహస్తములను బట్టి భుజమూలముల కెదురుగ నిక్కించినయెడ జ్ఞానహస్త మౌను. ఇది గ్రహము, హృదయము, ధ్యానము వీనియందు వినియోగించును.

22. రేఖాహస్తలక్షణమ్

అఙ్గుష్ఠఃకుఞ్చితో భూయాన్మధ్యమా౽నామికా తథా.

563


కుఞ్చితా స్యాత్కనిష్ఠా చ తర్జనీ ప్రసృతాయది,
రేఖాభిధకరస్సో౽యం ముద్రాయాం సమ్ప్రయుజ్యతే.

564

తా. అంగుష్ఠమును మధ్యమ అనామిక కనిష్ఠలను వంచి చూఁపుడువ్రేలిని చాఁచినయెడ రేఖాహస్త మౌను. ఇది ముద్రయం దుపయోగింపఁబడును.

23. వైష్ణవహస్తలక్షణమ్

ఊర్ధ్వగౌ త్రిపతాకౌచే ద్వైష్ణవః కరఈరితః,
విష్ణోరభినయేయోజ్య ఇతిభావ విదోవిదుః.

565

తా. త్రిపతాకహస్తములను ఎగుమొగములుగఁ బట్టినయెడ వైష్ణవహస్త మౌను. ఇది మహావిష్ణువునందు చెల్లును.

24. బ్రహ్మోక్తశుకతుణ్డహస్తలక్షణమ్

కపిత్థేఙ్గుష్ఠతర్జన్యౌ సమానాగ్రౌ ధృతౌ యది,
బ్రహ్మోక్తశుకతుణ్డస్స్యా ద్గరుడార్థేె నియుజ్యతే.

566

తా. కపిత్థహస్తముయొక్క బొటనవ్రేలును చూపుడువ్రేలును సమాగ్రములుగఁ బట్టఁబడినయెడ బ్రహ్మోక్త మౌను. ఇది గరుత్మంతునియందు చెల్లును.

25. ఖణ్డచతురహస్తలక్షణమ్

చతురే తర్జనీ త్యక్తా కనిష్ఠా మిశ్రితా యది,
నామ్నా౽యం ఖణ్డచతురః కీర్తితో భరతాగమే.

567

తా. చతురహస్తమునందు చూపుడువ్రేలిని విడిచి చిటికెనవ్రేలిని జేర్చిపట్టినయెడ ఖండచతురహస్త మవును.

వినియోగము:—

రుధిరాదిద్రవేచా౽పి కర్ణామృతమితీరితే,
ఖణ్డాదిషు ప్రయోక్తవ్యః ఖణ్డాఖ్యచతురఃకరః.

568

తా. రక్తము మొదలైనద్రవవస్తువులయందు ఈహస్తము చెల్లును.

26. అర్ధచతురహస్తలక్షణమ్

అస్మిన్కనిష్ఠికౌత్యక్తౌ యద్యర్ధచతురోభవేత్,
మధురాది రసాస్వాదే వినియోగో౽స్యకీర్తితః.

569

తా. ఈఖండచతురహస్తమందు చిటికెనవ్రేళ్ళను విడిచినయెడ అర్ధచతురహస్త మౌను. ఇది మధురాదిరసములను ఆస్వాదించుటయందు చెల్లును.

27. లీనముద్రాహస్తలక్షణమ్

ముద్రాఖ్యే తర్జనీనమ్రాలీనముద్రాకరోభవేత్,

తా. ముద్రాహస్తమందు చూపుడువ్రేలిని వంచిపట్టినయెడ లీనముద్రాహస్త మవును.

అథైకాదశబాన్ధవ్యాస్తేషాం లక్షణముచ్యతే.

370

తా. ఇఁక పదునొకండు బాంధవ్యహస్తములయొక్క లక్షణములు చెప్పఁబడును.

1. దమ్పతీహస్తలక్షణమ్

వామేతు శిఖరం ధృత్వా దక్షిణే మృగశీర్షకమ్,
ధృతస్స్త్రీపుంసయోర్హస్తః ఖ్యాతో భరతకోవిదైః.

571

తా. ఎడమచేత శిఖరహస్తమును, కుడిచేత మృగశీర్షహస్తమును పట్టఁబడినయెడ దంపతీహస్తమగును. ఇది భార్యాభర్తలయం దుపయోగించును.

2. మాతృహస్తలక్షణమ్

హస్తేవామే౽ర్ధచంద్రశ్చ సందంశో దక్షిణేకరే,
ఆవర్తయిత్వా జఠరే వామహస్తే తతఃపరమ్.

572


స్త్రియఃకరో ధృతోమాతృహస్తఇత్యుచ్యతే బుధైః,
జనన్యాంచ కుమార్యాంచ మాతృహస్తో నియుజ్యతే.

573
తా. ఎడమచేత అర్ధచంద్రహస్తమును, కుడిచేత సందంశహస్తమును పట్టి పిమ్మట వామహ స్తమును నాభికెదురుగా పట్టి స్త్రీహస్తమును బట్టినయెడ మాతృహస్తమగును. ఇది తల్లియందును, కొమార్తెయందును చెల్లును.

3. పితృహస్తలక్షణమ్

ఏతస్మిన్ మాతృహస్తేతు శిఖరో దక్షిణే న తు,
ధృతశ్చేన్నాట్యశాస్త్రజ్ఞైః పితృహస్తో౽యముచ్యతే.

574


అయం హస్తస్తు జనకే జామాతరి నియుజ్యతే,

తా. ముందు చెప్పిన మాతృహస్తము కుడిచేయి శిఖరహస్తముగాఁ బట్టఁబడినయెడ పితృహస్త మగును. ఇది తండ్రియందును, అల్లునియందును వినియోగించును.

4. శ్వశ్రూహస్తలక్షణమ్

విన్యస్యకణ్ఠేహంసాస్యం సందంశం దక్షిణేకరే.

575


ఉదరేచ పరావృత్య వామహస్తే తతఃపరమ్,
స్త్రియఃకరో ధృతఃశ్వశ్రూ హస్తస్తస్యాం నియుజ్యతే.

576

తా. కంఠమందు హంసాస్యహస్తము నుంచి కుడిచేతఁ బట్టఁబడిన సందంశహస్తమును నాభికెదురుగాఁ ద్రిప్పి ఎడమచేత స్త్రీహస్తమును పట్టినయెడ శ్వశ్రూహస్త మగును. ఇది అత్తయం దుపయోగించును,

5. శ్వశురహస్తలక్షణమ్

ఏతస్యా౽౦తే తు హస్తస్య శిఖరో దక్షిణే యది,
ధృతశ్శ్వశురహస్తస్స్యా త్తస్మిన్నేవనియుజ్యతే.

577

తా. ముందు చెప్పఁబడిన శ్వశ్రూహస్తము కుడితట్టు శిఖరహస్తమును పట్టినయెడ శ్వశురహస్త మగును. ఇది మామయందు చెల్లును.

భర్తృభ్రాతృహస్తలక్షణమ్

వామేతు శిఖరం ధృత్వా పార్శ్వయోః కర్తరీముఖమ్,

ధృతో దక్షిణహస్తేన భర్తృభ్రాతృకరిస్స్మృతః.

578

తా. ఎడమచేత శిఖరహస్తమును బట్టి రెండుపార్శ్వములయందును కుడిచేత కర్తరీముఖహస్తమును పట్టిన భర్తృభ్రాతృహస్త మగును. ఇది పెనిమిటి తోడఁబుట్టినవారియందు వినియోగించును.

7. ననాందృహస్తలక్షణమ్

భర్తృభ్రాతృకరస్యా౽౦తే స్త్రీహస్తో దక్షిణేకరే,
ధృతోననాందృ హస్తస్స్యాత్తస్యామేవనియుజ్యతే.

579

తా. ముందు చెప్పఁబడిన భర్తృభ్రాతృహస్తమును పట్టినపిదప స్త్రీహస్తము దక్షిణహస్తమందు పట్టఁబడెనేని ననాందృహస్త మగును. ఇది ఆడుబిడ్డయందు ఉపయోగించును.

8. జ్యేష్ఠకనిష్ఠభ్రాతృహస్తలక్షణమ్

మయూరహస్తః పురతః పశ్చాద్భాగేచ దర్శితః,
జ్యేష్ఠభ్రాతుః కనిష్ఠస్యా౽ప్యయంహస్తః ప్రకీర్తితః.

580

తా. మయూరహస్తము ముందుప్రక్కను వెనుకప్రక్కను పట్టఁబడినయెడ జ్యేష్ఠభ్రాతృకనిష్ఠభ్రాతృహస్తమగును. ఇది అన్నదమ్ములయందు ఉపయోగించును.

9. స్నుషాహస్తలక్షణమ్

ఏతస్యా౽౦తే దక్షిణే తు స్త్రీహస్తశ్చ ధృతో యది,
స్నుషాహస్త ఇతిఖ్యాతః భరతాగమవేదిభిః.

581

తా. ముందు చెప్పిన జ్యేష్ఠకనిష్ఠభ్రాతృహస్తమును పట్టి పిమ్మట కుడి చేత స్త్రీహస్తమును పట్టినయెడ స్నుషాహస్త మగును. ఇది కోడలియం దుపయోగించును.

10. భర్తృహస్తలక్షణమ్

విన్యస్య కంఠే హంసాస్యౌ శిఖరో దక్షిణేకరే,
భర్తృహస్త ఇతిఖ్యాత స్తస్మిన్నేవ నియుజ్యతే.

582

తా. కంఠమందు హంసాస్యహస్తముల నుంచి కుడిచేత శిఖరహస్తమును పట్టినయెడ భర్తృహస్తమగును. ఇది మగనియం దుపయోగించును.

11. సపత్నీహస్తలక్షణమ్

దర్శయిత్వా పాశహస్తం కరాభ్యాం స్త్రీకరావుభౌ,
ధృతౌసపత్న్యా హస్తస్స్యాత్తస్యామేవ నియుజ్యతే.

583

తా. పాశహస్తమును చూపి రెండుచేతులయందును స్త్రీహస్తములను పట్టినయెడ సపత్నీహస్త మగును. ఇది సవతియం దుపయోగించును.

ఇత్యేకాదశ బాంధవ్యహస్తాస్సందర్శితాః క్రమాత్,
అనుక్తానాంతు బంధూనాం జ్ఞేయాః కర్మానుసారతః.

584

తా. ఈరీతిగా పదునొకండు బాంధవ్యహస్తములు చెప్పఁబడినవి. ఇందు చెప్పఁబడనిబంధువులకు వారివారికి క్రియలను అనుసరించి హస్తములను తెలిసికోవలయును.

అథ బ్రహ్మాదిదేవానాం భావనాభినయక్రమాత్,
మూర్తిభేదేనయే హస్తాస్తేషాం లక్షణముచ్యతే.

585
తా. ఇంక బ్రహ్మ మొదలగు దేవతలయొక్క మూర్తిభేదముల ననుసరించి హస్తములకు లక్షణములు చెప్పఁబడును.

1. బ్రహ్మహస్తలక్షణమ్

బ్రహ్మణశ్చతురో వామే హంసాస్యో దక్షిణేకరే,

తా. ఎడమచేత చతురహస్తమును, కుడిచేత హంసాస్యహస్తమును బట్టఁబడునెడ బ్రహ్మహస్త మగును.

2. శమ్భుహస్తలక్షణమ్

శమ్భోర్వామే మృగశిర స్త్రిపతాకశ్చ దక్షిణే.

586

తా. ఎడమచేత మృగశీర్షహస్తమును, కుడిచేత త్రిపతాకహస్తమును పట్టఁబడినయెడ శంభుహస్త మగును.

3. విష్ణుహస్తలక్షణమ్

హస్తాభ్యాం త్రిపతాకాభ్యాం విష్ణుహస్తః ప్రకీర్తితః,

తా. రెండుచేతులను త్రిపతాకహస్తములు పట్టఁబడినయెడ విష్ణుహస్త మగును.

4. సరస్వతీహస్తలక్షణమ్

సూచీకృతే దక్షిణే౽ర్ధచంద్రే వామకరే తథా.

587


సరస్వత్యాః కరః ప్రోక్తః భరతాగమవేదిభిః,

తా. కుడిచేత సూచీహస్తమును, ఎడమచేత అర్ధచంద్రహస్తమును పట్టఁబడినయెడ సరస్వతీహస్త మగును.

5. పార్వతీహస్తలక్షణమ్

ఊర్ధ్వాధః ప్రసృతావర్ధ చంద్రాఖ్యౌ వామదక్షిణే.

588


అభయో వరదశ్చైవ పార్వత్యాః కరఈరితః,

తా. కుడియెడమచేతులకు క్రిందుమీఁదు చేసి అర్ధచంద్రహస్తము పట్టినయెడ అభయవరదహస్తము లగును. అవియే పార్వతీహస్తములు.

6. లక్ష్మీహ స్తలక్షణమ్

అంసోపకంఠే హస్తాభ్యాం కపిత్థాభ్యాం శ్రియఃకరః.

589

తా. బాహుమూలమందు రెండుకపిత్థహస్తములు పట్టఁబడినయెడ లక్ష్మీహస్త మగును.

7. విఘ్నేశ్వరహస్తలక్షణమ్

పురోగాభ్యాం కపిత్థాభ్యాం కరాభ్యాం విఘ్నరాట్కర,

తా. ఎదురుగా రెండు కపిత్థహస్తములు పట్టఁబడినయెడ విఘ్నేశ్వరహస్త మగును.

8. షణ్ముఖహస్తలక్షణమ్

వామేకరే త్రిశూలంచ శిఖరం దక్షిణేకరే.

590


ఊర్ధ్వంగతే షణ్ముఖస్య కరఇత్యుచ్యతే బుధైః,

తా. ఎడమచేతియందు త్రిశూలహస్తమును కుడిచేతియందు శిఖరహస్తమును ఎత్తుగా పట్టఁబడినయెడ షణ్ముఖహస్త మగును.

9. మన్మథహస్తలక్షణమ్

వామేకరేతు శిఖరం దక్షిణే కటకాముఖః.

591


మన్మథస్య కరః ప్రోక్తో నాట్యశాస్త్రవిశారదైః,

తా. ఎడమచేతియందు శిఖరహస్తమును కుడిచేతియందు కటకాముఖహస్తమును పట్టఁబడినయెడ మన్మథహస్త మగును.

10. ఇంద్రహస్తలక్షణమ్

త్రిపతాకౌ స్వస్తికౌచే దింద్రహస్తః ప్రకీర్తితః.

592

తా. రెండుత్రిపతాకహస్తముల మణికట్టులను చేర్చిపట్టునెడ ఇంద్రహస్త మగును.

11. అగ్నిహస్తలక్షణమ్

త్రిపతాకో దక్షిణే తు వామే లాంగూలహస్తకః,
అగ్నిహస్తస్సవిజ్ఞేయో నాట్యశాస్త్రవిశారదైః.

593

తా. కుడిచేతియందు త్రిపతాకహస్తమును, ఎడమచేతియందు లాంగూలహస్తమును పట్టఁబడినయెడ అగ్నిహస్త మగును.

12. యమహస్తలక్షణమ్

వామే పాశః దక్షిణే తు సూచీయమకరస్మృతః,

తా. ఎడమచేతియందు పాశహస్తమును, కుడిచేతియందు సూచీహస్తమును పట్టఁబడినయెడ యమహస్త మగును.

13. నైరృతిహస్తలక్షణమ్

ఖట్వాచ శకటశ్చైవ కీర్తితో నైరృతేః కరః.

594

తా. ఖట్వాహస్తమును శకటహస్తమును బట్టినయెడ నైరృతిహస్త మగును.

14. వరుణహస్తలక్షణమ్

పతాకో దక్షిణే వామే శిఖరం వారుణః కరః,

తా. కుడిచేతియందు పతాకహస్తమును, ఎడమచేతియందు శిఖరహస్తమును పట్టఁబడినయెడ వరుణహస్త మగును.

15. వాయుహస్తలక్షణమ్

అరాళో దక్షిణే వామే హస్తేచా౽ర్ధపతాకకః.

595


ధృతౌ చే ద్వాయుదేవస్య హస్తఇత్యభిధీయతే,

తా. కుడిచేతియందు అరాళహస్తమును, ఎడమచేతియందు అర్ధపతాకహస్తమును పట్టఁబడినయెడ వాయుహస్త మగును.

16. కుబేరహస్తలక్షణమ్

వామే పద్మం దక్షిణేతు గదా యక్షపతేః కరః.

596

తా. ఎడమచేతియందు పద్మహస్తమును, కుడిచేతియందు గదాహస్తమును పట్టఁబడినయెడ కుబేరహస్త మగును.

అథ నవగ్రహహస్తా నిరూప్యంతే.

1. సూర్యహస్తలక్షణమ్

అంసోపకణ్ఠే హస్తాభ్యాం సోలపద్మ కపిత్థకౌ,
ధృతౌ యది భవేదేష దివాకరకరస్స్మృతః.

597

తా. భుజశిరస్సులసమీపములందు రెండుచేతులచే సోలపద్మ కపిత్థహస్తములు పట్టఁబడినయెడ సూర్యహస్త మగును.

2. చంద్రహస్తలక్షణమ్

సోలపద్మం వామకరే దక్షిణేచ పతాకకః,
నిశాకరకరఃప్రోక్తో భరతాగమకోవిదైః.

598
తా. ఎడమచేతియందు సోలపద్మహస్తమును, కుడిచేతియందు పతాకహస్తమును పట్టఁబడినయెడ చంద్రహస్త మగును.

3. అఙ్గారకహస్తలక్షణమ్

వామే కరేతు సూచీస్యా ద్దక్షిణే ముష్టిహస్తకః,
కృతశ్చేన్నాట్యశాస్త్రజ్ఞై రఙ్గారకకరస్స్మృతః.

599

తా. ఎడమచేత సూచీహస్తమును, కుడిచేత ముష్టిహస్తమును పట్టఁబడినయెడ అంగారకహస్త మగును.

4. బుధహస్తలక్షణమ్

తిర్యగ్వామే ముష్టిహస్తః దక్షిణేచ పతాకకః,
బుధగ్రహకరః ప్రోక్తో భరతాగమవేదిభిః.

600

తా. ఎడమచేత నడ్డముగా ముష్టిహస్తమును, కుడిచేత పతాకహస్తమును పట్టఁబడినయెడ బుధహస్త మగును.

5. బృహస్పతిహస్తలక్షణమ్

హస్తాభ్యాం శిఖరం ధృత్వా యజ్ఞసూత్ర ప్రదర్శనే,
ఋషి బ్రాహ్మణ హస్తో౽యం గురోశ్చ పరికీర్తితః.

601

తా. రెండుహస్తములచే శిఖరహస్తమును, యజ్ఞసూత్రప్రదర్శనమందువలె పట్టినయెడ బృహస్పతిహస్త మగును. ఇది ఋషులయందును, బ్రాహ్మణులయందును చెల్లును.

6. శుక్రహస్తలక్షణమ్

వామోర్ధ్వభాగే ముష్టిస్స్యా దధస్తా ద్ధక్షిణేన చ,
శుక్రగ్రహకరఃప్రోక్తో భరతాగమవేదిభిః.

602
తా. ఎడమప్రక్క మీఁదుగాను, కుడిప్రక్క క్రిందుగాను ముష్టిహస్తము పట్టఁబడినయెడ శుక్రునిహస్త మగును.

7. శనైశ్చరహసలక్షణమ్

వామేకరేతు శిఖరం త్రిశూలం దక్షిణేకరే,
శనైశ్చరకరః ప్రోక్తో భరతాగమవేదిభిః.

603

తా. ఎడమచేత శిఖరహస్తమును, కుడిచేత త్రిశూలహస్తమును పట్టఁబడినయెడ శనైశ్చరహస్త మగును.

8. రాహుహస్తలక్షణమ్

సర్పశీర్షం వామకరే సూచీస్యా ద్దక్షిణేకరే,
రాహుగ్రహకరః ప్రోక్తో భరతాగమవేదిభిః.

604

తా. ఎడమచేత సర్పశీర్షహస్తమును, కుడిచేత సూచీహస్తమును పట్టఁబడినయెడ రాహుహస్త మగును.

9. కేతుహస్తలక్షణమ్

వామే కరేతు సూచీస్యా ద్దక్షిణే౽ర్ధపతాకకః,
కేతుగ్రహకరఃప్రోక్తో భరతాగమవేదిభిః.

605

తా. ఎడమచేత సూచీహస్తమును, కుడిచేత అర్థపతాకహస్తమును పట్టఁబడినయెడ కేతుహస్త మగును.

అథ దశావతారహస్తానిరూప్యంతే.

మత్స్యావతారహస్తలక్షణమ్

మత్స్యహస్తం దర్శయిత్వా తతస్స్కంధ సమా కరౌ,
త్రిపతాకౌ యది ధృతౌ యుజ్యతే మత్స్యజన్మని.

606


ధృతౌ మత్స్యావతారస్య హసఇత్యుచ్యతే బుధైః,

తా. మత్స్యహస్తమును జూపి రెండుత్రిపతాకహస్తములను భుజశిరస్సులకు సమముగాఁ బట్టినయెడ మత్స్యావతారహస్త మగును. ఇది మత్స్యావతారమం దుపయోగించును.

2. కూర్మావతారహస్తలక్షణమ్

కూర్మహస్తం దర్శయిత్వా తతస్స్కంధసమౌకరౌ.

607


త్రిపతాకౌ యది ధృతౌ యుజ్యతే కూర్మజన్మని,
ధృతౌ కూర్మావతారస్య హస్తఇత్యుచ్యతేబుధైః.

608

తా. కూర్మహస్తమును జూపి భుజశిరస్సులకు సమముగా త్రిపతాకహసములు పట్టినయెడ కూర్మావతారహస్త మగును. ఇది కూర్మావతారమందు చెల్లును.

3. వరాహావతారహస్తలక్షణమ్

దర్శయిత్వా వరాహం తు కటిపార్శ్వసమౌ కరౌ,
ధృతౌ వరాహదేవస్య హస్త ఇత్యభిధీయతే.

609

తా. వరాహహస్తమును జూపి పిరుదులయందు హస్తముల నుంచునెడ వరాహావతారహస్త మగును.

4. నృసింహావతారహస్తలక్షణమ్

వామే సింహముఖం ధృత్వా దక్షిణే త్రిపతాకకః,
నరసింహావతారస్య హస్త ఇత్యభిధీయతే.

610
తా. ఎడమచేత సింహముఖహస్తమును, కుడిచేత త్రిపతాకహస్తమును బట్టినయెడ నృసింహావతారహస్త మగును.

5. వామనావతారహస్తలక్షణమ్

ఊర్ధ్వాధో ధృతముష్టిఖ్యాం సవ్యాన్యాభ్యాం యది స్థితః,
సవామనావతారస్య హస్త ఇత్యభిధీయతే.

611

తా. మీఁదుగాను క్రిందుగాను ఎడమకుడిచేతులచే రెండుముష్టిహస్త ములు పట్టఁబడినయెడ వామనావతారహస్త మగును.

6. పరశురామావతారహస్తలక్షణమ్

వామం కటితటే న్యస్య దక్షిణే౽ర్ధపతాకకః,
ధృతః పరశురామస్య హస్త ఇత్యభిధీయతే.

612

తా. ఎడమచేతిని నడుమునం దుంచి కుడిచేత అర్థపతాకహస్తమును బట్టునెడ పరశురామావతారహస్త మగును.

7. రఘురామావతారహస్తలక్షణమ్

కపిత్థం దక్షిణే హస్తే వామే తు శిఖరఃకరః,
అధరోత్తరభాగేతు రామచంద్ర కరఃస్మృతః.

613

తా. కుడిచేత కపిత్థహస్తమును, ఎడమచేత శిఖరహస్తమును క్రిందుమీఁదులుగా పట్టఁబడినయెడ రామచంద్రావతారహస్త మగును .

8. బలరామావతారహస్తలక్షణమ్

పతాకో దక్షిణే హస్తే ముష్టి ర్వామకరే తథా,
బలరామావతారస్య హస్త ఇత్యభిధీయతే.

614
తా. కుడిచేత పతాకహస్తమును, ఎడమచేత ముష్టిహస్తమును పట్టఁబడినయెడ బలరామావతారహస్త మగును.

9. కృష్ణావతారహస్తలక్షణమ్

మృగశీర్షేతు హస్తాభ్యా మన్యోన్యాభిముఖీకృతే,
అంసోపకంఠే కృష్ణస్య హస్త ఇత్యభిధీయతే.

615

తా. రెండుమృగశీర్షహస్తములు భుజశిరస్సులసమీపమున ఎదురెదురుగా పట్టఁబడినయెడ కృష్ణావతారహస్త మగును.

10. కల్క్యవతారహస్తలక్షణమ్

పతాకో దక్షిణే వామే త్రిపతాక కరో ధృతః,
హస్తః కల్క్యవతారస్య ఇతినాట్యవిదోవిదుః.

616

తా. కుడిచేత పతాకహస్తమును ఎడమచేత త్రిపతాకహస్తమును పట్టఁబడినయెడ కల్క్యవతారహస్త మగును.

11. రాక్షసహస్తలక్షణమ్

ముఖేకరాభ్యాం శకటో రాక్షసానాం కరస్స్మృతః,

తా. రెండుచేతులచే ముఖమునందు శకటహస్తము పట్టఁబడెనేని రాక్షసహస్త మగును.

అథ చతుర్వర్ణహస్తా నిరూప్యంతే.

బ్రాహ్మణహస్తలక్షణమ్

కరాభ్యాం శిఖరం ధృత్వా యజ్ఞసూత్ర ప్రదర్శనే.

617


దక్షిణేన కృతే తిర్యగ్ర్బాహ్మణానాం కరస్స్మృతః,

తా. రెండు శిఖరహస్తములను బట్టి కుడిచేత అడ్డముగా జన్నిదమును జూపునెడ బ్రాహ్మణహస్త మగును.

క్షత్రియహస్తలక్షణమ్

వామేన శిఖరం తిర్యగ్ధృత్వా౽న్యేనపతాకకః.

618


ధృతో యది క్షత్త్రియాణాం హస్త ఇత్యభిధీయతే,

తా. ఎడమచేత శిఖరహస్తమును అడ్డముగాఁ బట్టి కుడిచేత పతాకహస్తమును పట్టునెడ క్షత్రియహస్త మగును.

వైశ్యహస్తలక్షణమ్

వామే కరే తు హంసాస్య దక్షిణే కటకాముఖః.

619


వైశ్యహస్తో౽యమాఖ్యాతో భరతాగమవేదిభిః,

తా. ఎడమచేత హంసాస్యహస్తమును, కుడిచేత కటకాముఖహస్తమును పట్టఁబడినయెడ వైశ్యహస్త మగును.

శూద్రహస్తలక్షణమ్

వామేతు శిఖరం సూచీ దక్షిణే శూద్రహస్తకః.

620

తా. ఎడమచేత శిఖరహస్తమును, కుడిచేత సూచీహస్తమును పట్టఁబడినయెడ శూద్రహస్త మగును.

అష్టాదశానాం జాతీనాం కర్మాధీనాః కరాస్స్మృతాః,

తా. పదునెనిమిదిజాతులకును వారివారిక్రియలకు తగినట్టు హస్తములు చెప్పఁబడును.

తతద్దేశజనానాంచ ఏవ మూహ్యం బుధోత్తమైః.

621

తా. ఆయాదేశముల జనులకును ఈరీతిగానే హస్తము లూహింపవలసినది.

యావదర్థాః ప్రయోగాణాం తావద్భేదాఃకరాస్స్మృతాః,
అర్థాత్ప్రకరణాల్లిఙ్గాదౌచిత్యాదర్థనిర్ణయః.

622

తా. ప్రయోగముల కెన్నివిధముల యర్థములు గలవో అన్నివిధముల హస్తములును గలవు. అర్థము, ప్రకరణము, లింగము, ఔచిత్యము అను వీనివలన అర్థము నిర్ణయము చేయవలయును.

తత్తత్సమ్యక్సమాలోక్య సఙ్గృహ్యోక్త మిదం మయా,
సమాలోచ్య ప్రయోక్తవ్యం భావజ్ఞైరిహశాస్త్రతః.

623

తా. ఈవిషయమునంతయు బాగుగా విమర్శించి సంగ్రహముగా భావజ్ఞు లీశాస్త్రరీతిని చక్కగా నాలోచించి తత్తద్విషయానుగుణముగ ప్రయోగములు చేయవలెను.

గ్రంథాంతరస్థప్రసిద్ధరాజహస్తానిరూప్యంతే.

శుకతుండో హరిశ్చంద్రే మయూరో నళభూపతౌ,
పురుకుత్సే౽ల పద్మాఖ్యో ముష్టిహస్తః పురూరవే.

624


అలపద్మశ్శిరస్థాయీ సగరార్థే నియుజ్యతే,
దిలీపాఖ్యే పతాకస్స్యాదమ్బరీషేతు కర్తరీ.

625


శిబిరాజ్ఞి కపిత్థస్స్యాత్పురోభాగే ప్రచాలితః,
ఉభౌ పతాకౌ భుజయో రంతే దేవవిభావనే.

626


కథితౌ కార్తవీర్యేతు విరళాఙ్గుష్ఠరంధ్రకౌ,
ఏతౌవహేత్పుంఖతౌ చేద్రావణార్థే ప్రకీర్తితౌ.

627


భుజదేశే ప్రచలితః సూచిస్స్యాద్ధర్మరాజకే,
త్రిపతాకః పురోభాగే చాలితశ్చపునఃపునః.

628

అర్జునార్థే నాట్యభేదే యుజ్యతే నాట్యవేదిభిః,
భీమే ముష్టిః పురోభాగే చలితో యది కల్ప్యతే.

629


ఉక్తఃశైబ్యేసూచిరేవ కిఞ్చిదుద్వేష్టితాఙ్గుళః,
కటకో నకులార్థేచ శిఖర స్సహదేవకే.

630


నహుషేచలహస్తస్స్యాద్య యాతౌ తామ్రచూడకః,
అర్ధచంద్ర కరస్సో౽యం త్రిపతాకాకృతిర్భవేత్.

631


భగీరథార్థేయోజృస్స్యాద్రాహుగ్రస్తేన్దుమణ్డలే,

తా. శుకతుండహస్తము హరిశ్చంద్రునియందును, మయూరహస్తము నలునియందును, అలపద్మహస్తము పురుకుత్సుతునియందును, ముష్టిహస్తము పురూరవునియందును, శిరస్సునందు జేర్చిన యలపద్మహస్తము సగరునియందును, పతాకహస్తము దిలీపునియందును, కర్తరీముఖహస్తము అంబరీషునియందును, ఎదురుగా చలింపఁజేయఁబడిన కపిత్థహస్తము శిబియందును, ఎడముగాఁ జేయఁబడి భుజములకొనలయందు దేవభావనగా పట్టఁబడిన రెండుపతాకహస్తములు కార్తవీర్యునియందును, ఆపతాకహస్తములే ముందువెనుకలుగా గూర్చి పట్టినయెడ రావణునియందును, భుజప్రదేశమందు చలింపఁజేయఁబడిన సూచీహస్తము ధర్మరాజునందును, త్రిపతాకహస్తము ఎదురుగ మాటిమాటికి చలింపఁజేయఁబడెనేని అర్జునునియందును, ముష్టిహ స్తము ఎదురుగ చలింపఁజేయఁబడెనేని భీమసేనునియందును, ఉద్వేష్టితాంగుళమగు సూచీహస్తము శైబ్యునియందును, కటకాముఖహస్తము నకులునియందును, శిఖరహస్తము సహదేవునియందును, చలపతాకహస్తము నహుషునియందును, తామ్రచూడహస్తము యయాతియందును, అర్ధచంద్రహస్తమును త్రిపతాకాకృతిగఁ బట్టినయెడ భగీరథునియందును, రాహుగ్రస్తమైన చంద్రమండలమందును చెల్లును.

మాంధాతాగ్రిమభూపాలే మరుత్వానితిభూభుజి.

632


నిరూపణార్థే ముకుళ సూచీముష్టికరో౽పిచ,
కరో౽ప్వర్ధపతాకస్స్యాదుద్వేష్టిత తనుమ్భజన్.

633


ఏతే చతుర్విధా హస్తాః ప్రయోజ్యంతే యథాక్రమాత్,
రఘూవజ మహీపాలే దక్షిణేతరభాగతః.

634


క్రమేణ పరియోజ్యేతే పూర్వోక్తార్ధపతాకకౌ,
అలపద్మస్స్వస్తికశ్పేద్యోజ్యో దశరథే నృపే.

635


రామే శిఖరహస్తో౽సౌ విశేషాచ్పాపపాణిషు,
యోజ్యః శాస్త్రప్రయోగేషు పూర్వధర్మవిశారదైః.

636


శిఖరో౽యం దక్షిణాంసగామీచే ద్భరతే భవేత్,
అయంవా మాంసగామిచే ల్లక్షణార్థే నియుజ్యతే.

637


అయం లలాటగావిూచే చ్ఛత్రుఘ్నార్థే నియుజ్యతే,
సోమవంశేజనిజుషామేతే వామాంసయోజనాత్.

638


కల్పితా నాట్యకుశలైః యుక్తధర్త ప్రయోగతః,

తా. మాంధాతయనెడి రాజశ్రేష్టునియందును, మరుత్తు అనెడి మహారాజునందును, ముకుళహస్తము సూచీహస్తము ముష్టిహస్తము ఉద్వేష్టితార్ధపతాకహస్తము ఈనాలుగుహస్తములును క్రమముగ చెల్లును. రఘుమహారాజు, ఆజమహారాజు వీరియందు అర్ధపతాకహస్తములు కుడియెడమలుగా చెల్లును. దశరథమహరాజునందు, స్వస్తికాలపద్మహస్తము చెల్లును. శిఖరహస్తము రామునియందును, చాపపాణులైన రాజులయందును చెల్లును. శిఖరహస్తము కుడిమూపునందుఁ జేర్చిపట్టఁబడినయెడ భరతునియందును, ఎడమమూపునందుఁ జేర్చిపట్టినయెడ లక్ష్మణునియందును, నొసటికి సరిగా పట్టబడినయెడ శత్రుఘ్నునియందును చెల్లును. ఇట్లు ఈహస్తములు క్రమముగా సూర్యవంశపురాజుల విషయమందు చెప్పఁబడెను. ఈహస్తములే యెడమప్రక్కగా పట్టఁబడునెడ చంద్రవంశపురాజుల విషయమునందు వినియోగించునని నాట్యశాస్త్రజ్ఞులచేత జెప్పఁబడుచున్నది.

సప్తసముద్రహస్తా నిరూప్యంతే.

లవణేక్షుసురాసర్పిర్దధిక్షీరజలార్ణవాః.

639


ఏ తేషాం హస్తకలనా విశేషాత్ప్రతిపాద్యతే,

తా. లవణము, ఇక్షువు, సుర, సర్పి, దధి, క్షీరము, జలము అని సముద్రములు ఏడు. వీనియందు హస్తసందర్భములు విశేషముగాఁ జెప్పఁబడును.

1. లవణసముద్రహస్తలక్షణమ్

ముకుళాఖ్యౌకరౌచైవ వృతౌతా చా౽పవేష్టితౌ.

640


ప్రయోజ్యౌ లవణామ్బోధౌ ధిషణస్య మతాంతరే,

తా. విరివిగా త్రిప్పబడిన ముకుళహస్తములను అధోముఖములుగఁ బట్టినయెడల లవణసముద్రమందు చెల్లును అని బృహస్పతి మతము.

2. ఇక్షుసముద్రహస్తలక్షణమ్

అలపద్మస్తథాభూత ఇక్ష్వబ్ధౌ సమ్ప్రయుజ్యతే.

641

తా. అలపద్మహస్తమును క్రింద చెప్పినప్రకారమే పట్టినయెడ ఇక్షుసముద్రమందు చెల్లును.

3. సురాసముద్రహస్తలక్షణమ్

సఙ్కీర్ణాఖ్య పతాకౌచ తథైవ గుణమాశ్రితౌ,
సురామ్బుధౌ ప్రయోక్తవ్యౌ శుక్రాచార్య మతాంతరే.

642

తా. సంకీర్తపతాకములను అదేరీతిని విరివిగా త్రిప్పి దిగుమొగములుగాఁ బట్టినయెడ సురాసముద్రమందు చెల్లును. అని శుక్రాచార్యుల మతము.

4. సర్పిస్సముద్రహస్తలక్షణమ్

సర్పిరబ్ధేస్తు చతురో వాయుసూనుమతాంతరే,

తా. సర్పి(నేతి)స్సముద్రమందు చతురహస్తము చెల్లును. అని హనుమంతుని మతము.

5. దధిసముద్రహస్తలక్షణమ్.

త్రిపతాకాభిధౌహస్తా పూర్వవద్గుణమాశ్రితా.

643


దధ్యర్ణవేప్రయోక్తవ్యౌ దత్తిలాచార్యసమ్మతౌ,

తా. త్రిపతాకహస్తములను ముందు చెప్పినరీతిన బట్టినయెడ దధిసముద్రమందు చెల్లును. అని దత్తిలాచార్యమతము.

6. క్షీరసముద్రహస్తలక్షణమ్

సర్పశీర్షాహ్వయౌ హస్తౌ యథాపూర్వగుణాశ్రయా.

644


క్షీరసాగరరూపార్థే నారదాభిమతౌస్మృతౌ,

తా. సర్పశీర్షహస్తములను మునుపటివలెనే పట్టినయెడ క్షీరసముద్రమందు చెల్లును. అని నారదమహాముని మతము.

7. శుద్దోదకసముద్రహస్తలక్షణమ్

పతాకగుణసంయుక్తే పూర్వవన్మిళితాకృతౌ.

645


జలార్ణవే ప్రయోక్తవ్యౌ కోహళాచార్యసమ్మతౌ,

తా. పతాకహస్తములను మునుపటివలెనే విరివిగాఁ ద్రిప్పి క్రిందు ముఖముగఁ బట్టినయెడ శుద్ధోదకసముద్రమందు చెల్లును. అని కోహళాచార్యమతము.

ప్రసిద్ధనదీనాం హస్తానిరూప్యంతే.

గంగాదీనాం నిర్ణయేతు వ్యావృత్తశ్చా౽పవేష్టితః.

646


నదీనామపి సర్వాసాం పతాకస్సముదాహృతః,
గంగాదీనాం విశేషేణ తద్గుణాద్యనువర్ణనాత్.

647


హస్తానాం భేదకలనా గురుణా పూర్వమీరితా,
తత్స్వరూపం ప్రవక్ష్యామి నాట్యాభినయయోగతః.

648

తా. గంగ మొదలైననదులను నిర్ణయించుటయందు ముందరికి చాఁచి క్రిందుగాఁ బట్టఁబడిన పతాకహస్తము వినియోగించును. ఆగంగాదినదులకు వానివానివిశేషగుణాదులను బట్టి వర్ణించుటవలన నాట్యాభినయమునందు కొన్నిహస్తములు వినియోగింపఁబడును గనుక వాని స్వరూపము లిచ్చట చెప్పఁబడుచున్నవి.

గంగాదినదీహస్తలక్షణాని

గంగాయాం తామ్రచూడస్స్యాత్సూర్యజాయాస్తు రేఖికః
కృష్ణవేణ్యాం సింహముఖః కావేర్యాం చతురఃకరః.

649


పతాకచతురౌహస్తౌ సరస్వత్యాం ప్రకీర్తితౌ,
నర్మదాయాం విధేయస్స్యాత్కరోహ్యర్ధపతాకికః.

650


హంసాస్యస్తుఙ్గభద్రాయాం శరావత్యాంతు బాణకః,
సూచీహస్తో వేత్రవత్యాం చంద్రభాగార్థకేచలః.

651


సరయ్వామలపద్మాఖ్యో భీమరథ్యామరాళకః,
సువర్ణముఖనద్యాంచ కరో౽ర్ధచతురోమతః.

652

శుకతుణ్ణః పాపనాశ్యాం యుజ్యతే భావవేదిభిః,
అనుక్తానాం నదీనాంచ పతాకస్సమ్ప్రయుజ్యతే.

653

తా. తామ్రచూడహస్తము గంగానదియందును, రేఖాహస్తము యమునానదియందును, సింహముఖహస్తము కృష్ణవేణీనదియందును, చతురహస్తము కావేరినదియందును, పతాకచతురహస్తములు సరస్వతీనదియందును, అర్ధపతాకహస్తము నర్మదానదియందును, హంసాస్యహస్తము తుంగభద్రానదియందును, బాణహస్తము శరావతీనదియందును, వేత్రవతియందు సూచీహస్తమును, చంద్రభాగయందు చలపతాకహస్తమును, అలపద్మహస్తము సరయూనదియందును, అరాళహస్తము భీమరథీనదియందును, అర్ధచతురహస్తము స్వర్ణముఖినదియందును, శుకతుండహస్తము పాపనాశనీనదియందును చెల్లును. ఇవిగాక తక్కిననదులయందు పతాకహస్తము చెల్లును.

1. ఊర్ధ్వలోకహస్తలక్షణమ్

భూలోకశ్చ భువర్లోక స్స్వర్గలోక స్తతః పరః,
జనోలోక స్తపోలోక స్సత్యలోకాభిధ స్తతః.

654


మహర్లోకశ్చ సస్తైతే లోకాశ్చోర్ధ్వం సమాశ్రితాః,
ఉద్వేష్టితఃపతాకస్తు ఏతేషు వినియుజ్యతే.

655

తా. భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము, మహర్లోకము ఇవి యేడు మీఁదిలోకములు. వీనియందు ఉద్వేష్టితపతాకహస్తము వినియోగించును.

2. అధోలోకహస్తలక్షణమ్

అతలో వితలశ్చైవ సుతలశ్చ తలాతలః,
మహాతల ఇతిఖ్యాతో రసాతల ఇతీరితః.

656

పాతాళశ్చైవ సప్తైతే హ్యధోలోకాః ప్రకీర్తితాః,
అధోలోకేషు యుజ్యేత పతాకశ్చాపవేష్టితః.

657

తా. అతలము, వితలము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము, పాతాళము ఈయేడు క్రిందిలోకములు. వీనియందు అపవేష్టితపతాకహస్తము వినియోగించును.

అథ వృక్షభేదానాం హస్తానిరూప్యంతే.

అశ్వత్థవృక్షహస్తః

అలపద్మౌ రేచితౌ చే దశ్వత్థే సమ్ప్రయుజ్యతే,

తా. రెండు అలపద్మహస్తములను చలింపఁజేసినయెడ అశ్వత్థవృక్షమందు చెల్లును.

కదళీవృక్షహస్తః

కదళ్యాం శ్లిష్టముకుళో రేచితో ద్వేష్టితోభవేత్.

658

తా. శ్లిష్టముకుళహస్తమును పొడువుగ కదలించి పట్టినయెడ కదళీవృక్షమందు చెల్లును.

నారఙ్గలికుచవృక్షహస్తౌ

నారఙ్గే పద్మకోశస్స్యా ద్భ్రమరోలికుచే భవేత్,

తా. నారింజచెట్టునందు పద్మకోశహస్తమును, గజనిమ్మచెట్టునందు భ్రమరహస్తమును చెల్లును.

పనసబిల్వవృక్షహస్తౌ

పనసే చతురః ప్రోక్తో బిల్వార్థే చతురోభవేత్.

659
తా. పనసబిల్వవృక్షములయందు చతురహస్తము చెల్లును.

పున్నాగవృక్షహస్తః

పతాక చతురౌ ప్రోక్తౌ పున్నాగతరునిర్ణయే,

తా. పతాకచతురహస్తములు పొన్నమ్రానియందు చెల్లును.

మందారవకుళవృక్షహస్తౌ

మందారే ఖండచతురః సందంశోవకుళే భవేత్.

660

తా. ఖండచతురహస్తము మందారవృక్షమందును, సందంశహస్తము వకుళవృక్షమందును చెల్లును.

వటార్జునవృక్షహస్తౌ

పతాకో వటవృక్షేస్యా దర్జునే సింహవక్త్రకః,

తా. మఱ్ఱిమ్రానియందు పతాకహస్తమును, ఏరుమద్దిమ్రానియందు సింహముఖహస్తమును చెల్లును.

పాటలీహింతాలవృక్షహస్తౌ

పాటల్యాం శుకతుండస్స్యాత్ హింతాలే కర్తరీముఖః.

661

తా. పాదిరిచెట్టునందు శుకతుండహస్తమును, ఈ దాటిచెట్టునందు కర్తరీముఖహస్తమును చెల్లును.

పూగవృక్షహస్తః

పద్మకోశౌ స్వస్తికౌ స్తః పూగవృక్షనిరూపణే,

తా. రెండుపద్మకోశహస్తములు స్వస్తికములుగఁ బట్టఁబడినయెడ పోకమ్రానియందు చెల్లును.

చమ్పకవృక్షహస్తః

చమ్పకే పూర్వశాస్త్రజ్ఞై రథోలాంగూలమిష్యతే.

662

తా. సంపెగమ్రానియందు అధోలాంగూలహస్తమును వినియోగింపవలెనని పూర్వశాస్త్రజ్ఞులచే చెప్పఁబడెను.

ఖదిరవృక్షహస్తః

అధోనతస్తామ్రచూడః కరః ఖదిరవర్ణనే,

తా. తామ్రచూడహస్తమును మిక్కిలి క్రిందుమొగముగ వంచి పట్టునెడు నల్లతుమ్మచెట్టునందు చెల్లును.

శమీవృక్షహస్తః

శమీవృక్షే సమాఖ్యాతః కరోయ శ్శ్లిష్టకర్తరీ.

663

తా. శ్లిష్టకర్తరీహస్తము జమ్మిచెట్టునందు చెల్లును.

అశోకవృక్షహస్తః

పతాకౌ మణిబంధస్థౌ సమ్యక్తిర్యక్కృతౌ యది,
పతాకస్వస్తికోహస్తః కథితో భరతాదిభిః.

664


పతాకస్వస్తికోహస్తః అశోకాభినయేస్మృతః,

తా. పతాకహస్తములు మనికట్టులందు చేర్చి యడ్డముగాఁ బట్టఁబడినయెడ పతాకస్వస్తికహస్త మగును. ఇది ఆశోకవృక్షమునందు చెల్లును.

సిందువారవృక్షహస్తః

సిందువారతరౌ యోజ్యః కరశ్శ్లిష్టమయూరకః.

665

తా. వావిలిచెట్టునందు శ్లిష్టమయారహస్తము చెల్లును.

ఆమలకవృక్షహస్తః

తర్జనీ మధ్యమా హస్త త లే సమ్మిశ్రితే యది,
ఇతరే ప్రసృతాస్సో౽యం కరః సంయమనామకః.

666


సంయమాభిధహస్తో౽యం భవేదామలకేద్రుమే,

తా. తర్జనీమధ్యమలను అరచేతిలో జేర్చి తక్కినవ్రేళ్ళను చాఁచిపట్టిన నది సంయమహస్త మౌను. ఈహస్తము ఉసిరికచెట్టునందు చెల్లును.

కురవకవృక్షహస్తః

కర్తరీత్రిపతాకౌచ జ్ఞేయౌకురవకద్రుమే.

667

తా. కర్తరీత్రిపతాకహ స్తములు ఎఱ్ఱపువ్వులగోరంటచెట్టునందు చెల్లును.

కపిత్థవృక్షహస్తః

అలపద్మే స్వస్తికౌ చేత్కపిత్థార్థేనియుజ్యతే,

తా. అలపద్మహస్తములను స్వస్తికములుగఁ బట్టినయెడ వెలగమ్రానియందు చెల్లును.

కేతకీవృక్షహస్తః

పతాక చతురాభిఖ్యౌ స్వస్తికౌ మణిబద్ధయోః.

668


కేతకీవృక్షభేదే౽పి యుజ్యేతే దేవమంత్రిణి,

తా. పతాకచతురహస్తములను మణిబంధములందు స్వస్తికములుగఁ బట్టినయెడ పచ్చమొగలిచెట్టునందును దేవమంత్రియందును చెల్లును.

శింశపావృక్షహస్తః

అర్ధచంద్రౌ స్వస్తికౌ చేత్ప్రయోజ్యౌ శింశపాతరౌ.

669

తా. అర్ధచంద్రహస్తములను స్వస్తికములుగఁ బట్టిన ఇరుగుడుమ్రానియందు చెల్లును.

నిమ్బసాలవృక్షహస్తౌ

శుకతుండౌ స్వస్తికౌచే న్నిమ్బేసాలేనిరూపితౌ,

తా. శుకతుణ్డహస్తములను స్వస్తికములుగఁ బట్టినయెడ వేఁపమ్రానియందును, సాలవృక్షమందును చెల్లును.

పారిజాతవృక్షహస్తః

.

వామే పతాకకోహ స్త స్తత్రసవ్యేపతాకికః.

670


ఉద్వేష్టితకృతోహస్తః త్రిజ్ఞానః పరికీర్తితః,
త్రిజ్ఞానః పారిజాతస్య క్రోడే యది ధృతఃకరః.

671

తా. ఎడమచేతను కుడిచేతను పతాకహస్తమును పైకి త్రిప్పి పట్టినయెడ త్రిజ్ఞానహస్తమాను. ఈహస్తము రొమ్మున కెదురుగఁ బట్టినయెడ పారిజాతవృక్షమందు చెల్లును.

తింత్రిణీజమ్బూవృక్షహస్తౌ

తింత్రిణ్యామపిలాఙ్గూలో జమ్బ్వామర్ధపతాకకః,

తా. చింతచెట్టునందు లాంగూలహస్తమును, నేరేడుచెట్టునందు అర్ధపతాకహస్తమును చెల్లును.

పాలాశరసాలవృక్షహస్తౌ

పాలాశేచా౽ర్ధచన్ద్రశ్చ రసాలే త్రిపతాకికః.

672

తా. మోదుగుచెట్టునందు అర్ధచంద్రహస్తమును, తియ్యమామిడిచెట్టునందు త్రిపతాకహస్తమును చెల్లును.

అథ సింహాదిమృగానాం హస్తానిరూప్యన్తే.

1. సింహహస్తలక్షణమ్

దక్షిణే సింహవక్త్రస్స్యా త్తత్పృష్ఠే వామహస్తతః,
పతాకహస్తమాశ్రిత్యచలత్ప్రవిరళాఙ్గుళిమ్.

673


శ్లిష్టసింహముఖస్సోయం సింహార్థే వినియుజ్యతే,

తా. కుడిచేత సింహముఖహస్తమును బట్టి దాని వెనుకతట్టు పతాకహస్తమును ఎడమైన వ్రేళ్లు గలుగఁబట్టినది శ్లిష్టసింహముఖహస్త మనఁబడును. ఈహస్తము సింహమునందు చెల్లును.

2. వ్యాఘ్రహస్తలక్షణమ్

అర్ధచంద్రో౽ధోముఖశ్చే ద్వాఘ్రార్థే సమ్ప్రయుజ్యతే.

674

తా. అర్ధచంద్రహస్తమును ఆధోముఖముగఁ బట్టినయెడ పెద్దపులియందు చెల్లును.

3. సూకరహస్తలక్షణమ్

పూర్వోక్తమత్స్యహస్తేతు దక్షిణః కుఞ్చితశ్చలః,
అస్యా౽౦గుళ్యః ప్రవిరళాః పఞ్చసఙ్ఖ్యాయథాక్రమమ్.

675


యుజ్యతే స్తబ్ధరోమార్థే సఙ్కీర్ణమకరః కరః,

తా. ముందు చెప్పిన మత్స్యహస్తమందు దక్షిణహస్తమును వంచి కదలించుచు వ్రేళ్ల నైదింటిని విరళముగఁ బట్టిన నది సంకీర్ణమకరహస్త మనఁబడును. ఈహస్తము పందియందు వినియోగించును.

4. కపిహస్తలక్షణమ్

పూర్వోక్తముష్టిహస్తస్తు మధ్యమాంగుష్ఠయోగతః.

676


నామ్నా౽ధోముష్టిముకుళః కపేరర్థే నిరూప్యతే,

తా. ముందు చెప్పిన ముష్టిహస్తము మధ్యమాంగుష్ఠముల చేరికవలన అధోముష్టిముకుళహస్త మనఁబడును. ఈహస్తము కోఁతియందు వినియోగించును.

5. భల్లూకహస్తలక్షణమ్

వామహస్తే పద్మకోశో౽ధోముఖత్వ ముపాశ్రితః.

677


దక్షిణేతు పతాకాఖ్యస్తస్యపృష్ఠతలశ్రితః,
భల్లూకార్థే ప్రయోజ్యస్స్యా త్పద్మకోశపతాకకః.

678

తా. ఎడమచేత దిగుమొగముగా పద్మకోశహస్తమును బట్టి కుడిచేత పట్టఁబడిన పతాకహస్తమును దానిపై నుంచినయెడ పద్మకోశపతాకహస్త మౌను. ఇది ఎలుగుగొడ్డునందు వినియోగించును.

6. మార్జారహస్తలక్షణమ్

పూర్వోక్తముష్టిహస్తస్యా౽నామికాఙ్గుష్ఠయోగతః,
నామ్నా౽యమర్ధముకుళో మార్జారే సత్ప్రయుజ్యతే.

679

తా. ముందు చెప్పఁబడిన ముష్టిహస్తముయొక్క అనామికాంగుష్ఠములను జేర్చిపట్టినది అర్ధముకుళహస్త మవును. ఈహస్తము పిల్లియందు చెల్లును.

7. చమరీమృగహస్తలక్షణమ్

వామే ముష్టి ర్దక్షిణే వా మణిబంధేన మిశ్రితా,
ముద్రికా౽ధోముఖా ముష్టిముద్రా హస్తో౽యమీరితః.

580


ముష్టిముద్రాకరశ్చాపి చమర్యాం సమ్ప్రయుజ్యతే,

తా. ఎడమచేత ముష్టిహస్తమును కుడిచేత ముద్రాహస్తమును మనికట్టుతోఁ జేర్చి క్రిందుమొగముగాఁ బట్టినయెడ ముష్టిముద్రాహస్త మౌను. ఇది చమరీమృగమునందు వినియోగించును.

8. గోధాహస్తలక్షణమ్

ఊర్ధ్వే కనిష్ఠికాఙ్గుష్ఠౌ పతాకే కిఞ్చిదీరితౌ.

681

నామ్నాతలపతాకో౽యం గోధాయాం పుఞ్జితోభవేత్,

తా. పతాకహస్తమందు కనిష్ఠికాంగుష్ఠములను కొంచెము మీఁదికి ఎత్తిపట్టినయెడ తలపతాకహస్త మగును. ఈహస్తము ఉడుమునందు చెల్లును.

9. శల్యమృగహస్తలక్షణమ్

పూర్వోక్తమృగశీర్షస్య తర్జన్యూర్ధ్వప్రసారితా.

682


నామ్నాచంద్రమృగోహస్త శ్శల్యార్థే సమ్ప్రయుజ్యతే,

తా. మునుపుచెప్పిన మృగశీర్షహస్తమందు చూపుడువ్రేలు పైకెత్తబడినయెడ చంద్రమృగహస్త మగును. ఇది శల్యమృగమందు వినియోగించును.

10. కురంగహస్తలక్షణమ్

కురఙ్గేచ ప్రయోక్తవ్యో మృగశీర్షకనామకః.

683

తా. మృగశీర్షహస్తము జింకయందు చెల్లును.

11. కృష్ణసారహస్తలక్షణమ్

పూర్వోక్తముష్టిహస్తేతు కనిష్ఠాంగుష్ఠసారణాత్,
నామ్నామృష్టిమృగోహస్తః కృష్ణసారే ప్రయుజ్యతే.

684

తా. మునుపు చెప్పిన ముష్టిహస్తమందు కనిష్ఠాంగుష్ఠములను చాచిపట్టినయెడ ముష్టిమృగహస్త మౌను. ఇది నల్లజింకయందు చెల్లును.

12. గోకర్ణహస్తలక్షణమ్

ధేనుకర్ణే నాగబంధౌ రేచితౌ యది యోజితౌ,

తా. నాగబంధహస్తములను మీఁదికి చలింపఁజేయుచు పట్టినయెడ గోకర్ణమృగమునందు చెల్లును.

13. మూషికహస్తలక్షణమ్

పూర్వోక్తముకుళేహస్తే తర్జనీ సమ్ప్రసారితా.

685


నామ్నా౽యంఖణ్డముకుళో మూషికార్థే నియుజ్యతే,

తా. మునుపు చెప్పిన ముకుళహస్తమందు చూపుడువ్రేలిని బాగుగ చాఁచిపట్టినయెడల ఖండముకుళహస్త మగును. ఈహస్తము ఎలుకయందు చెల్లును.

14. గిరికాహస్తలక్షణమ్

పూర్వోక్తముకుళే భూయస్తర్జనీ కుఞ్చితా యది.

686

తిర్యక్ప్రసారితః ఖడ్గముకుళో గిరికార్థకే,

తా. మునుపుచెప్పిన ముకుళహస్తమందు చూపుడువ్రేలిని వంచి అడ్డముగ చాఁచిపట్టినయెడ ఖడ్గముకుళహస్త మాను. ఇది చిట్టెలుకయందు చెల్లును.

15. శశహస్తలక్షణమ్

హస్తస్తలపతాకాఖ్యశ్శశకేతిర్యగాశ్రయః.

687

తా. తలపతాకహస్తము ఆడ్డముగ త్రిప్పఁబడినయెడ కుందేటియందు చెల్లును.

16. వృశ్చికహస్తలక్షణమ్

అధోముఖో రేచితశ్చేత్కర్కటో వృశ్చికేభవేత్,

తా. కర్కటహస్తమును అధోముఖముగ చలింపఁజేయుచు పట్టినయెడ తేలునందు చెల్లును.

17. శునకహస్తలక్షణమ్

పతాకాభిధహస్తేతు కుఞ్చితాచేత్కనిష్ఠికా.

688


నామ్నామధ్యపతాకో౽యం శునకార్థే ప్రయుజ్యతే,

తా. పతాకహస్తమందు చిటికెనవ్రేలు ముడువఁబడెనేని మధ్యపతాకహస్త మాను. ఇది కుక్కయందు చెల్లును.

18. ఉష్ట్రహస్తలక్షణమ్

పూర్వోదితాంజలికరేచా౽౦గుష్ఠౌ కుఞ్చితాయుతౌ.

689


ప్రసారితావూర్ధ్వభాగే చలితౌ చాప్యధోముఖౌ,
నామ్నాఖణ్డాంజలిరయం ఉష్ట్రార్థే సమయుజ్యతే.

690
తా. మునుపుచెప్పిన అంజలిహస్తమందు అంగుష్ఠములను వంచి చేర్చి పొడుగుగఁ జాఁచి అధోముఖముగ చలింపఁజేయుచు పట్టినయెడ ఖండాంజలిహస్త మగును. ఇది ఒంటెయందు చెల్లును.

19. అజహస్తలక్షణమ్

శిఖరౌ శ్లిష్టవదనౌ మేషార్థే సమయుజ్యతే,

తా. శిఖరహస్తములను ముఖభాగము చేరఁబట్టినయెడ మేఁకయందు వినియోగించును.

20. గార్ధభహస్తలక్షణమ్

పూర్వఖణ్డాజ్జలౌమిశ్రే కుఞ్చితేతర్జనీద్వయే.

691


భిన్నాంజలిరయంనామ్నా గార్దభార్థే నియుజ్యతే,

తా. మునుపుచెప్పిన ఖండాంజలిహస్తమందు తర్జనీద్వయమును జేర్చి వంచిపట్టినయెడ భిన్నాంజలిహస్త మవును. ఇది గాడిదయందు చెల్లును.

21. వృషభహస్తలక్షణమ్

మధ్యమానామికే కిఞ్చిత్కుఞ్చితే తలమాశ్రితే.

692


అంగుష్టే నోపరియుతే శేషే ద్వేచ ప్రసారితే,
తలసింహకరస్సో౽య మృషభార్థే నియుజ్యతే.

693

తా. మధ్యమానామికలను కొంచెము అరచేతితట్టునకు వంచి వానిమీఁద అంగుష్టమును జేర్చి తక్కినరెండువ్రేళ్లను చాఁచిపట్టినయెడ తలసింహహస్త మౌను. ఇది వృషభార్థమందు వినియోగించును.

22. ధేనుహస్తలక్షణమ్

మధ్యమావక్రితాయత్ర శేషాస్సర్వేప్రసారితాః,
ధేనౌయోజ్యోయస్త్రభేదే భవేత్సఙ్కీర్ణముద్రకః.

694
తా. నడిమివ్రేలిని వంచి తక్కినవ్రేళ్ళను చాఁచిపట్టినయెడ సంకీర్ణముద్రహస్త మౌను. ఇది ఆవునందును, యంత్రభేదమునందును చెల్లును.

అథ పక్షిహస్తానిరూప్యంతే.

1. పారావతహస్తలక్షణమ్

పారావతే కపోతాఖ్యకరస్స్యాత్పుఙ్ఖితాకృతిః,

తా. కపోతహస్తమును పుంఖితాకారముగఁ బట్టినయెడ పావురాయియందు వినియోగించును.

2. కపోతహస్తలక్షణమ్

కపోతస్తిర్యగాకారః కపోతే వినియుజ్యతే.

695

తా. కపోతహస్తమును అడ్డముగాఁ బట్టినయెడ అడవిపావురాయియందు వినియోగించును.

3. శశాదనహస్తలక్షణమ్

బ్రహ్మోక్తశుకతుండస్స్యాచ్ఛశాదననిరూపణే,

తా. బ్రహ్మోక్తశుకతుండహస్తము డేగయందు వినియోగించును.

4. ఉలూకహస్తలక్షణమ్

గజదంతౌ శ్లిష్టముఖౌ సఙ్కీర్ణగజదన్తకః.

696


సజ్కీర్ణ గజదన్తో౽య ములూకార్థే నియుజ్యతే,

తా. గజదంతహస్తముల మొనలను జేర్చిపట్టినయెడ సంకీర్ణగజదంతహస్త మవును. ఇది గుడ్లగూబయందు చెల్లును.

5. గండభేరుండహస్తలక్షణమ్

మణిబంధే సమాశ్లిష్టా వర్ధచన్ద్రావధోముఖౌ.

697


సర్వాఙ్గుళ్యస్తు విరళా నామ్నా స్వస్తికచన్ద్రకః,
గండభేరుండకాఖ్యే౽స్య వినియోగః ప్రకీర్తితః.

698

తా. అర్ధచంద్రహస్తములను అధోముఖములుగ మనికట్లు చేరఁబట్టి వ్రేళ్లను విరళములుగాఁ జేసినయెడ స్వస్తికచంద్రహస్త మగును. ఇది గండభేరుండపక్షియందు వినియోగింపఁబడును.

6. చాతకహస్తలక్షణమ్

లాఙ్గూలశ్చాతకేభూయా త్పుఙ్ఖితత్వముపాశ్రితః,

తా. లాంగూలహస్తమును పుంఖితముగఁ బట్టినయెడ చాతకపక్షియందు చెల్లును.

7. కుక్కుటహస్తలక్షణమ్

పూర్వోక్తభ్రమరోభూయాత్తామ్రచూడనిరూపణే.

699

తా. మునుపు చెప్పఁబడిన భ్రమరహస్తమే కోడియందు వినియోగించును.

8. కోకిలహస్తలక్షణమ్

అరాళః పుఙ్ఖితాకారః కోకిలార్థే నియుజ్యతే,

తా. అరాళహస్తమును పుంఖితముగఁ బట్టినయెడ కోకిలయందు చెల్లును.

9. వాయసహస్తలక్షణమ్

భరతార్ణవసంప్రోక్తభమరాంగుష్ఠక స్తథా.

700


అగ్రభాగేన తర్జన్యాః మిళితో యది పుఙ్ఖితః,
సందంశముకుళో భూయా ద్వాయసార్థే నియుజ్యతే.

701
తా. భరతార్ణవమందు చెప్పఁబడియుండెడి భ్రమరహస్తాంగుష్ఠమును చూపుడువ్రేలికొనతోఁ జేర్చి పుంఖితముగఁ బట్టబడినయెడ సందంశముకుళహస్త మగును. ఇది కాకియందు వినియోగించును.

10. కురరహస్తలక్షణమ్

కురరాఖ్యే౽పవిద్ధాఖ్యోసూచిరేవ ప్రయుజ్యతే,

తా. సూచిహస్తము అపవిద్ధముగఁ బట్టఁబడినయెడ కురరపక్షియందు చెల్లును.

11. శుకహస్తలక్షణమ్

శుకతుండః ప్రయోక్తవ్యః శుకార్థే పుఙ్ఖితాకృతిః.

702

తా. శుకతుండహస్తమును పుంఖితాకారముగఁ బట్టినయెడ చిలుకయందు వినియోగించును.

12. సారసహస్తలక్షణమ్

ముకుళేతు కనిష్ఠాపి కిఞ్సిద్వక్రితభావతః,
నామ్నాప్రదేశముకుళో యోజ్యో౽యం సారసార్థకే.

703

తా. ముకుళహస్తమునందలి చిటికెనవేలు కొంచెము వంకరగా పట్టబడినయెడ ప్రదేశముకుళహస్త మౌను. ఇది సారసపక్షియందు వినియోగించును.

13. బకహస్తలక్షణమ్

తర్జన్యంగుష్ఠసంయోగే మధ్యమా౽నామికాపిచ,
ప్రసారితే కనిష్ఠాచేద్వక్రితాతలమాశ్రితా.

704


నామ్నాసఙ్కీర్ణహంసో౽యం శుక్రాచార్యమతోదితః,
బకార్థే మంత్రభేదేషు యోజ్యస్సఙ్కీర్ణహంసకః.

705

తా. తర్జన్యంగుష్ఠములను జేర్చి మధ్యమానామికలను చాఁచి కనిష్ఠను అరచేతిలో మడిచిపెట్టినయెడ సంకీర్ణహంసహస్త మగును. ఇది శుక్రాచార్యునిమతము. ఈహస్తము కొంగయందును మంత్రభేదమునందును చెల్లును.

14. క్రౌఞ్చపక్షిహస్తలక్షణమ్

పూర్వాలపద్మహస్తేతు కనిష్ఠాతలకుఞ్చితా,

లీనాలపద్మహస్తో౽యం క్రౌఞ్చార్థే సమయుజ్యతే.

706

తా. ముందు చెప్పిన అలపద్మహస్తమందు చిటికెనవ్రేలు అరచేతిలో వంచఁబడినయెడ లీనాలపద్మహస్త మగును. ఇది క్రౌంచపక్షి (గ్రుడ్డికొంగ)యందు వినియోగించును.

15. ఖద్యోతహస్తలక్షణమ్

అంగుష్టో మధ్యమాయాస్స్యాదగ్రపర్వనిపీడితః,
ముఖహంస కరస్సో౽యం ఖద్యోతార్థే పవిద్ధకః.

707

తా. బొటనవ్రేలిచే నడిమివ్రేలికొనగనుపు ఒరయునట్లు అపవిద్ధముగఁ బట్టినయెడ ముఖహంసహస్త మవును. ఇది మిడుగురుపురుగునందు వినియోగించును.

16. భ్రమరహస్తలక్షణమ్

ప్రయోజ్యో భ్రమరోహస్తో భృంగార్థే యది పుంఖితః,

తా. భ్రమరహస్తమును పుంఖితముగఁ బట్టినయెడ తుమ్మెదయందు వినియోగించును.

17. మయూరహస్తలక్షణమ్

మయూరార్థే ప్రయోజ్యస్స్యాన్మయూరోపుంఖతోయది.

708

తా. మయూరహస్తమును పుంఖితాకారముగఁ బట్టినయెడ నెమలియందు వినియోగించును.

18. హంసహస్తలక్షణమ్

హంసాస్యో౽పి ప్రయోజ్యస్స్యాత్ హంసార్థే నృత్తకోవిదైః,

తా. మునుపుచెప్పిన హంసాస్యహస్తము హంసపక్షియందు వినియోగించును.

19. చక్రవాకహస్తలక్షణమ్

అలపద్మౌ పుఙ్ఖితౌ చేచ్చక్రవాకే నియుజ్యతే.

709

తా. అలపద్మహస్తములను పుంఖితములుగఁ బట్టినయెడ చక్రవాకపక్షియందు వినియోగించును.

20. కోయష్టికహస్తలక్షణమ్

అరాళో దక్షిణే వామే పతాకేన విమిశ్రితః,
నామ్నా౽రాళపతాకో౽యం కోయష్టికనిరూపణే.

710

తా. కుడిచేతి అరాళహస్తమును ఎడమచేతి పతాకహస్తముతో జేర్చి పట్టినయెడ అరాళపతాకహస్త మగును. ఇది కోయష్టికమనెడి పక్షియందు వినియోగించును.

21. వ్యాళీహస్తలక్షణమ్

తర్జనీమధ్యమేచాగ్రేచాపవద్వక్రితేయుతే,
అనామికా౽ఙ్గుష్ఠసంధౌ వక్రితాసు ప్రతిష్ఠితా.

711


కనిష్ఠవక్రితాచా౽యం వ్యాళీవ్యాళ్యాం నియుజ్యతే,

తా. తర్జనీమధ్యమలను జేర్చి ధనుస్సువలె వంచి అనామికను అంగుష్ఠసంధియం దుంచి కనిష్ఠను వంచిపట్టిన నది వ్యాళీహస్త మనఁబడును. ఇది వ్యాళి యనెడిపక్షియందు వినియోగించును.

అథ జలజన్తుహస్తానిరూప్యంతే.

1. భేకహస్తలక్షణమ్

చక్రాఙ్గుష్ఠౌచ తర్జన్యౌ హస్తయోరంతరఙ్గతౌ.

712


మధ్యమేమిశ్రితేదీర్ఘేకుఞ్చితేచా౽ప్యనామికే,
ప్రసారితే కనిష్ఠేచ శ్లిష్టచక్రో౽యమిష్యతే.

713


ఏతస్య వినియోగస్తు భేకార్థే సమ్ప్రయుజ్యతే,

తా. చక్రహస్తములయొక్క అంగుష్ఠతర్జనులను చేతిలోపలికి మడిచి మధ్యమలను జేర్చి అనామికలను వంచి కనిష్ఠులను చాఁచిపట్టిన నది శ్లిష్టచక్రహస్త మనఁబడును. ఈహస్తము భేకార్థమందు చెల్లును.

2. కుళీరహస్తలక్షణమ్

దక్షిణః కర్కటోభూయాదపవేష్టితరూపకః.

714


వామహస్తో పరిస్థాయీ శ్లిష్టశ్చా౽స్యాంగుళిఃక్రమాత్,
లీనకర్కటకస్సో౽యం కుళీరే సమ్ప్రయుజ్యతే.

715

తా. కుడికర్కటహస్తమును అపవేష్టితముగ ఎడమచేతిమీఁదికి చాఁచిపట్టి వేళ్లను జేర్చిన నది లీనకర్కటహస్త మౌను. ఇది కుళీరార్థమందు వినియోగించును.

3. రక్తపాయిహస్తలక్షణమ్

రక్తపాయినిసూచీస్యాద్రేచితాతిర్యగేవచ,

తా. సూచీహస్తమును కదలించుచు అడ్డముగఁ బట్టిన జలగయందు చెల్లును.

4. నక్రహస్తలక్షణమ్

పతాక స్వస్తికోహస్తోమిళితశ్చ విసర్జితః.

716


నక్రార్థే పేటికార్థేచ యోజితః పూర్వసూరిభిః,

తా. పతాకహస్తమును స్వస్తికముగఁ బట్టి విడిచిన నది మొసలియందును, పెట్టెయందును వినియోగించును.

5. డుణ్డుభహస్తలక్షణమ్

దక్షిణః కర్తరీభూతః కరస్యోర్ధ్వముఖో యది.

717


అన్యప్రకోష్ఠీ వామస్స్యాత్కటకాముఖరూపతః,
కర్తరీదండహస్తో౽యం డుణ్ణుభార్థే ప్రయుజ్యతే.

718

తా. కుడిచేతియందు కర్తరీముఖహస్తమును ఊర్ధ్వముఖముగాఁ బట్టి అన్యప్రకోష్ఠమందు కటకాముఖహస్తమును బట్టిన నది కర్తరీదండహస్త మౌను. ఇది యిరుదలలపామునందు వినియోగించును.

సరసాభినయాదీనా మాపాదన సుధీ జుషా,
వేంకటాచార్యవర్యేణ్య నీడామంగలవాసినా,
భరతాగమగ్రంథాది భావశాస్త్రేష్వనేకశః,
సంగృహ్యవిషయాన్సమ్యక్పూర్వకైస్సముదాహృతాన్,
గ్రథితో౽యం సమాలోచ్య నిరతాం విదుషాంముదే,
ఏవమాలోక్యసుధియస్తుష్యేయురితిసాదరమ్,
దర్పణాఖ్యేనగ్రంథేనముద్రితో౽సౌయథామతి.

తా. సరసాభినయాదులను జెప్పుటయందు సమర్థుఁడైన నీడామంగలం తిరువేంకటాచార్యులచే భరతశాస్త్రాదులవలననుండి అనేకవిషయములు సంగ్రహింపఁబడి అభిజ్ఞుల సంతోషముకొఱకు అభినయదర్పణము అను గ్రంథముతోఁ జేర్చి అచ్చువేయింపఁబడెను.

ఇతి అభినయదర్పణాఖ్యోగ్రన్థః.
గ్రన్థాంతరస్థశిరోభేదాదిసహితః సమాప్తః.