అబలా సచ్చరిత్ర రత్నమాల/హఠీ విద్యాలంకార్

హఠీ విద్యాలంకార్

ఈమె హఠాజాతి బ్రాహ్మణులబిడ్డ; ఈమె న్యాయము స్మృతులు మొదలైన శాస్త్రములన్నియు నేర్చిన విద్వాంసురాలు. ఈ పండితకాశీలో నొక సంస్కృత పాఠశాల స్థాపించెను. ఆ కాలమునందు హిందూస్థానమునందలి విద్యార్థు లనేకు లాపాఠశాలలో విద్యనభ్యసింప వచ్చుచుండిరి. హఠి మిగుల నేర్పుతో విద్యార్థులకు శాస్త్రములను నేర్పుచుండెను. అసామాన్య శాస్త్రాభిజ్ఞత్వము వలన నామెను పండితులు విశేషముగా మన్నింపుచుండిరి. న్యాయనిర్ణయము చేయు సభలకును సమారంభములకును నీమెను మిగుల గౌరవముతో బిలుచు చుండిరి. ఆమెయు వారి యామంత్రణమును వృథపుచ్చక సభలకుబోయి యచట శాస్త్రీయ విషయములపైని వాదము చేయుచుండెను.

________