అంకితం
ఆత్మీయులు మేడపాటి సత్యనారాయణరెడ్డికి

సాధారణ వ్యక్తిగా కనిపించే అసాధారణ మానవతావాది.
కార్మిక శ్రేయోభిలాషిగా తన న్యాయవాద వృత్తిని వినియోగించిన తీరు గమనార్హం.
స్నేహపాత్రులు, అశేష మిత్రబృందాల అభిమానులు.
జననం 7 అగష్టు 1928, ఏలేటిపాడు, పశ్చిమగోదావరి జిల్లా,ఆంధ్రప్రదేశ్.
తండ్రి: చిన్న సుబ్బారెడ్డి తల్లి:సీతమ్మ
భార్య: సూర్యకాంతం పిల్లలు: ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు


జీవిత విశేషాలు

1937 - బర్మా రాజధాని రంగూన్ లో ప్రాథమిక విద్య ఆరంభం

1940 నుండి - మార్టూర్ లో స్కూలు విద్య

1945 ఏప్రిల్ - ఎస్.ఎస్.ఎల్.సి.

1946 - నౌకాదళంలో పని

1950-1959 - ఇంటర్,బి.కాం., ఎల్.ఎల్.బి. పూర్తి చేశారు

1947 నుండి - హైదరాబాద్ లో ఉద్యోగ జీవితం

1966 వరకు వివిధ వృత్తులు చేసి న్యాయవాదిగా స్థిరపడ్డారు.

1966 నుండి - ట్రేడ్ యూనియన్ లో కృషి. రవాణా కార్మికుల సేవలు.

న్యాయవాదిగా సేవలు,ప్రజాసేవలు

2001 - ఉప్పల్, హైదరాబాద్ లో కంటి ఆస్పత్రి నెలకొల్పారు.

2004 - ఉప్పల్, హైదరాబాద్ లో వృద్ధాశ్రమం ప్రారంభించారు.

అమెరికా, బ్రిటన్ మరియూ యూరోపియన్ దేశాలు పర్యటించారు.