అపుడేమనె (రాగం: ) (తాళం : )

అపుడేమనె నేమనుమనెను
తపమే విరహపు తాపమనె

పవనజ యేమనె పడతిమరేమనె
అవనిజ నిను నేమను మనెను
రవికులేంద్ర భారము ప్రాణంబనె
ఇవల నెట్ల ధరియించే ననె

యింకా నేమనె యింతి మరేమనె
కొంకక యేమని కొసరుమనె
బొంకుల దేహము పోదిది వేగనె
చింక వేట ఇటు చేసెననె

నను నేమనె ప్రాణము మన కొకటనె
తనకు నా వలెనె తాపమనె
మను కులేశ ప్రేమపు మనకూటమి
ఘనవేంకటగిరి గంటిననె


apuDEmane (Raagam: ) (Taalam: )

apuDEmane nEmanumanenu
tapamE virahapu taapamane

pavanaja yEmane paDatimarEmane
avanija ninu nEmanu manenu
ravikulEMdra bhaaramu praaNambane
ivala neTla dhariyiMchEnane

yiMkaa nEmane yiMti marEmane
koMkaka yEmani kosarumane
boMkula dEhamu pOdidi vEgane
chiMka vETa iTu chEsenane

nanu nEmane praaNamu mana kokaTane
tanaku nii valene taapamane
manukulESa prEmapu manakUTami
ghanavEMkaTagiri gaMTinane


బయటి లింకులు

మార్చు




అన్నమయ్య పాటలు  
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


"https://te.wikisource.org/w/index.php?title=అపుడేమనె&oldid=20326" నుండి వెలికితీశారు