అపుడు గొంతెత్తి యేడ్చినాను

అపుడు గొంతెత్తి యేడ్చినాను; అపుడు నన్ను

కాంచగా నోపగా లేక కన్ను లట్టె

యార్చికొనినవి తారకలు; అపుడు మొగిళు

లల్లనల్లన నలనల్లనై భరమ్ము

లైన నిట్టూర్పుదొంతర లైనవి; అపుడు

కుంచుకొని కుంచుకొని కుహూకుహరవాటి

నను తొలగి దవ్వు దవ్వులు చని శిరాలు

వాల్చికొనినవి తిమిరాలు భయవశాన;

అపుడు బ్రతు కొక్కటే యేడు పైన గాలి

రిచ్చవడి వట్టి పసిపాపలీల మౌన

యానమున బారి సుప్తపత్రాళి నొదిగి

పొంచి చూచుచు చలియించి పోయినాడు;

అప్పు డీ విశ్వమే నిత్యయాత్ర నాగి

శ్రవణములు మూసికొనినది; రాక రాక

నా గళతమఃపథ్మ్ముల రేగి రేగి

రోద నోచ్చలి తోచ్చగీతా దురంత

దుస్సహార్చులు వెడలి రాగా ...