అధిక్షేపశతకములు/పీఠిక
విస్తృతావకాశము కలడు. అధిక్షేప, చారిత్రక, కథాత్మక, శాస్త్ర, తత్త్వ, వర్ణనాత్మక అనువాద శతకము లను వర్గీకరణ ఇట్టిది. దీని యందును ఒక్కొక్క విభాగమున ఉపవిభాగములు చేర్చ శతకములను వర్గీక రింపవచ్చును. భక్తి శతకములలో సగుణ నిర్గుణోపాసనా భక్తి, నానాదేవతా భక్తి శతకములు, దేశ , గురు, రాజ, మంత్రి, అధికార, మహాపురుష, నాయక , స్తుతి పరములుగ రచింపబడిన శతకములు ! పత్యేకముగ పేర్కొనదగినవి. నీతి శతకములను సామాన్య నీతి, కుమారీ కుమార, నీతి, సాంఘిక, రాజనీతి, 'ఆదిగాగల అంశములుగా వర్గీక రించి పరిశీలింపవచ్చును. శాస్త్ర శతకములలో తత్త్వశాస్త్ర, జ్యోతిష, మంత్ర, వైద్య, ఆర్థిక, భాషాశాస్త్రాది శతకములు ప్రధానములైనవి.
భాష, రచనా విధానము, అలంకార రీతుల ననుసరించి వచన, అచ్చ తెనుగు, శ్లేష, వ్యాజో క్తి, దృష్టాంత, అన్యాపదేశ శతకములు వెలువడి ఈ శాఖను పరిపుష్ట మొనర్చినవి.
ఆరంభదశ నుండి నేటివరకును తెలుగు శతకములలో పండిత పానుర రంజకములై నిరంతరాదరాభిమానముల నొంది నిలిచియున్నవి భక్తి, నీతి, శృంగార శతకములే. జాతి సంస్కృతికి, మానవ జీవనవిధానమునకు, మానసిక దృక్పథమునకు ఈ శతకములే ప్రతిబింబములై నిలచినవి.
భక్తి శతకములను నిశితముగను, మరింత సూక్ష్మదృష్టితో పరిశీలించి నపుడు నీతి అను అంశము వీనిలో అంతస్సూత్రముగ నున్నట్లు స్పష్టమగు చున్నది. మానవ జీవనమును సారక మొనర్చుకొనుటకు, పునర్జన్మరాహిత్యము నకు భ క్తియే సాధనమని శతక కవులు భగవన్నామ గుణసంకీర్తనము, భగవ లీలాభివర్ణసముల నొనర్చిరి-కామక్రోధాది అరిషడ్వర్గములను జయిచుంట-హృద యమును నిష్కల్మషముగ నొసర్చుట, ఉన్నత గుణముల సలవరచుకొనుట , సద్భక్తి, సజ్జన లక్షణములు, మున్నగువాని మూలమున వారు నైతిక జీవన పథముకు నిర్దేశించిరి. నైతికాంశములకు ప్రత్యేకముగ వస్తువుగ గ్రహించి నీతి రకులు రచించుటకు ఇరిగే ప్రాతిపదిక యైనది, మూలపదార్థ మొకటై లా....చు నా నా విధములుగ నున్నట్లే నీతి బోధనకు మార్గములు కూడ పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/6 పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/7 పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/8 పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/9 పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/10 పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/11 పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/12 పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/13 పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/14 పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/15