అదె చూడరే మోహన రూపం
అదె చూడరే మోహన రూపం
పది కోట్లు గల భావజరూపం // పల్లవి //
వెలయగ పదారువేల మగువలను
అలమిన ఘన మోహనరూపం
వలచిన నందవ్రజము గొల్లెతల
కులుకు చూపులకు గురియగురూపం // అదె చూడరే //
ఇందిరా వనితనెప్పుడు తనవుర
మందు నిలిపిన మోహనరూపం
కందువ భూసతి కాగిట సొంపుల
విందులు మరిగిన వేడుకరూపం // అదె చూడరే //
త్రిపుర సతుల బోధించి రమించిన
అపురూపపు మోహనరూపం
కపురుల శ్రీ వేంకటపతియై ఇల
ఉపమించగ రాని వున్నతరూపం // అదె చూడరే //
Ade choodare mohana roopam
Padi kotlu gala bhaavajaroopam
Velayaga padaaruvela maguvalanu
Alamina ghana mohanaroopam
Valachina nandavrajamu golletala
Kuluku choopulaku guriyaguroopam
Indiraa vanitaneppudu tanavura
Mandu nilipina mohanaroopam
Kanduva bhoopati kaugita sompula
Vindulu marigina vedukaroopam
Tripura satula bhodhinchi raminchina
Apuroopapu mohanaroopam
Kavurula Sree venkatapatiyai ila
Upaminchaga raani vunnataroopam
బయటి లింకులు
మార్చు
సారాంశము:
మార్చుతిరుమల గిరులపై వెలసిన శ్రీ వేంకటపతి రూపం అత్యంత మనోహరమైనది॥ సమస్త విశ్వాన్ని మోహింపచేయునటువంటిది॥ ఆ రూపాన్ని చూస్తేనే ఆనందం కలుగుతుంది॥ ౧౬ వేలమంది మగువలు, నంద వ్రజములోని గొల్లెతలు కొలిచి ఆనందించింది ఈ రూపాన్నే॥ వక్ష్H స్థలంలో లక్ష్మిని నింపుకున్న మోహనరూపుడు శ్రీ వేంకటేశుడు॥ ఆయనతో సరిపోల్చు ఉపమానం ఈ విశ్వంలోనే లేదు॥
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|