అతడే పరబ్రహ్మం (రాగం: కాపి ) (తాళం : మిశ్రచాపు)

ప. అతడే పరబ్రహ్మం అతడే లోకనాయకుడు
అతనికంటే మరి అధికులు లేరయ్యా

చ|| కమలవాసిని లక్ష్మి కలదా యెవ్వరికైనా?
కమలనాభునికి ఒక్కనికే కాక
కమలజుడైన బ్రహ్మ కలడా యెవ్వని నాభిన్
అమర వంద్యుడు మాహరికే కాక

చ|| అందరునుండెది భూమి అన్యులకు కలదా
అందపు గోవిందునికే ఆలాయగాక
చెందిన శ్రీభాగీరథి శ్రీపాదాల గలదా
మంధరధరుడైన మాధవునికే(కి) గాక

చ|| నిచ్చలు అభయమిచ్చే నేరుపు యెందుగలదా
అచ్చుగా నారాయణునియందే గాక
రచ్చల శరణాగతరక్షణమెందు గలదా
తచ్చిన శ్రీవేంకటాద్రి దైవానికేగాక


ataDE parabraHmaM (Raagam: Kaapi) (Taalam: Mishrachapu)

ataDE parabraHmaM ataDE lOkanAyakuDu
atanikaMTE mari adhikulu lErayyA

kamalavAsini lakshmi kaladA yevvarikainA?
kamalanAbhuniki okkanikE kAka
kamalajuDaina brahma kalaDA yevvani nAbhin
amara vaMdyuDu mAharikE kAka

aMdarunuMDedi bhUmi anyulaku kaladA
aMdapu gOviMdunikE AlAyagAka
cheMdina SrIbhAgIrathi SrIpAdAla galadA
maMdharadharuDaina mAdhavunikE(ki) gAka

nichchalu abhayamichchE nErupu yeMdugaladA
achcugA nArAyaNuniyaMdE gAka
rachchala SaraNAgatarakshaNameMdu galadA
tachchina SrIvEMkaTAdri daivAnikEgAka


తాత్పర్యము

మార్చు

కమలమును తన నాభియందుగల శ్రీహరికి మాత్రమే కమలమందు పుట్టిన శ్రీమహాలక్ష్మి భార్య కాగలిగినది. ఆ శ్రీహరి నాభి కమలమున మాత్రమే బ్రహ్మ దేవుడంతటివాడు జన్మించాడు. అఖండమైన కాలగతిలో అనంత జలరాశికి నెలవైన భూదేవి అందమైన ఈ గోవిందునికి మాత్రమే భార్యయైనది. పరమ పవిత్రమైన గంగ మంధరగిరి భారాన్ని భరించిన మాధవుని చరణ కమలాల వద్ద జన్మించి పావని అయినది. సకల లోకాలకూ అభయమిచ్చి నిరంతర స్థితి కార్యాన్ని నిర్వహించే నేర్పు ఆ శ్రీమన్నారాయనికి మాత్రమే యున్నది.

ఆ శ్రీమన్నారాయణుడే శ్రీ వేంకటాద్రి మీద వెలసి అనాదిగా శరణాగతులకు మోక్షమిచ్చి కాపాడుతున్నాడు. ఆ శ్రీ వేంకటేశ్వరుడే పరబ్రహ్మ స్వరూపుడు, సకల లోకనాయకుడు. అతనిని మించిన దైవం మరెవ్వరూ లేరు.

బయటి లింకులు

మార్చు




అన్నమయ్య పాటలు  
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |