అడుగు దాటి కదల నియ్యను
[రామదాసు కీర్తనలు]] | రచయిత = రామదాసు
వరాళి రాగం త్రిపుట తాళం
ప: అడుగుదాటి కదల నియ్యను నా కభయ మియ్యక నిన్ను విడువను || అడుగు
అ.ప.: గడియ గడియకు తిరిగి తిరిగి యడిగితిని వేసార వచ్చెను గడువు తప్పిన నేను నిక బహు దుడుకుతనములు సేయుదును నిను||అడుగుll
చ1: కుదురుగా కూర్చుండనియ్యను కోపమొచ్చిన భయముచెందను మది నెరింగీ యుండుమిక మొగ మాట మేమియు లేదుగద నా హృదయకమలమునందు నీ మృదు పదములను బంధించివేతును|| అడుగు ||
చ2: రేపు మాపని జరిపితే నే
నపుజేసెడివాడగానుు ప్రాపు నీవని నమ్మి కొలిచిన పాపములల నెడబాపి దయతో తేప తేపకు నీదు మోమిటు జూపకుండిన నోర్వసుమ్మి|| అడుగు ||
చ3: పతితపావన బిరుదు లేదా
పాలనము నను సేయరాదా ప్రతి దినంబును దేవ నిను భూ పతి వటంచును వేడినను నీ హిత జనంబులు వచ్చి నను బ్రతి మాలినను విడబోను నిన్ను||అడుగు ||
చ4: రాక్షసాంతక భక్తవరదా
సారసాక్ష సుజనరక్షక
ఈ క్షణంబున దీనజనుడని
మోక్షమియ్యక యుంటివ నిను సాక్షిబెట్టియు నేడు నేనొక దీక్షచే సాధింతు నిన్ను || అడుగు ||
చ5: భూరి భద్రాచల నివాసా
భుజగశయనా భక్తపోష కూరిమిగ నిను విడిచిపెట్టిన ధరణిలో భద్రాద్రిరాఘవ రామదాసుం డనెడి నామము మారుపేరున పిలువు నన్ను||అడుగll