పీఠిక.


నే నీగ్రంధము కొన్ని సంవత్సరముల కిందట నారంభించి మూఁడు. " నాలుగు ప్రకరణములు మాత్రము వాసి "రణాంతరములచే నసంపూర్తిగవిడిచి పెట్టితిని. కాని నా మితులగు మ| రా|| రా|| గాదె నేరసింగరావు పంతులు బి. ఏ. గారి ప్రోత్సాహమున దీనియందలి యొక ప్రకరణము చెఱువుమీఁది పద్యములు. విమర్శనము) ప్రత్యేకముగ నొక చిన్న పుస్తకరూపమునం బ్రచురించితిని. ఆ విమర్శనము నాయదృష్ట పశమునఁ బలువుర విద్యాధికుల యాదరమును బొందినది.

ఇది యిండ, గతసంవత్సగ మాపురమున నీ "యాంధ్ర పారిజాతము" భాషాభిమానులను 'నామిత్రులునునగు మ|| 'రా!! రా॥ శ్రీ వేమూరి వేంకట కృష్ణయ్య పంతులు గారిచే , నెలకొల్పఁబడినది. వ్యయప్ర యాసములకు వెనుదీయక యి'ట్టి కాకితపుఁ గరవు దినములలో నీమహోద్యమము లేవ నెత్తిన మా వేంకట కృష్ణయ్య గారి యుత్సాహమును నౌదార్యమును భాషాభిమానమును నెంతయుఁబ్రశంసనీయములు. వీరును, సాహితులకు మ!! రా! రా|| శ్రీ బుర్రా శేష 'గిరిరావు పంతులు (M. A.) గారుసు, భోగరాజు నారాయణమూ ర్తిపంతులు గారును, నన్ను హెచ్చరింప నీగ్రంథమును మొన్నటి. వేసవికాలపుదినముల లోఁ బూర్తి చేసి, యీపారిజాతముసకునిచ్చితిని.

ఈ గ్రంధభాగములను జాలవఱకు వినియును, వలయుచోట్ల దగిన సల హాలనిచ్చియును, నన్నుఁ బ్రోత్సాహపఱచి 'నాయెడల సోదరభావమును సుజూపిన నామిత్రు లు శ్రీ వజ్ఝల చిన సీతారామ స్వామిశాస్త్రి గారికిని, కాన్యకంఠ శ్రీ గొర్తి సూర్య నారాయణశాస్త్రి గారికిని నా కృతజ్ఞతాపూర్వక నమస్కారములనునర్పించు చున్నాఁడను. అచ్చుచిత్తులు దిద్దుటయందును నింక నితర .విషయముల యందుకు నాకు సాయపడిన శ్రీ దువ్వూరి వెంకటరమణశాస్త్రి గారికి నెంత యుఁగృతజ్ఞుడను.


మహా రాజు పేట, . . విజయ నగరము. ఇట్లు బుధవి ధేయఁడు, . 8 జ వెవరు. 1919 ). అడిదము. రామారావు,