అడిదము సూరకవి/పదియవ ప్రకరణము

పదియవ ప్రకరణము

గ్రంథరచన.

క. రవియెఱుఁగును భువితత్త్వము
భువిలో పలనుండు జనులఁ • బోషించుసదా
శివుఁ డెఱుఁగు నాట్యతత్త్వము
కవితాతత్త్వంబు సూర్య కవికే తెలియున్.

(శ్రవిసమకాలికులు)

పదునెనిమిదవ శతాబ్దియందుఁ బౌఢ ప్రబంథ రచనకుఁ ప్రసిద్ధిగాంచిన కవులలో నొకఁడనియు, లాక్షణికుఁడనియు సూరకవి విశేషప్రఖ్యాతి గాంచెను. ఇతఁడు రచించిన గ్రంథముల లో నాంధ్ర ప్రపంచమునకు లభ్యములై ప్రచారములో నున్నవి యాఱు గ్రంథములు మాత్రము గానవచ్చుచున్నవి. (1) చంద్ర మతీపరిణయమను నామాంతరము గల కవి జనరంజనము. (2) కవిసంశయ విచ్చేదమను లక్షణ గ్రంథము. (8) చంద్రాలోకము (భాషాంతరీకరణము ) (4) ఆంధ్రనామ శేషము (నిఘంటు వు) (5) 'రామలింగేశ శతకము. (6) శ్రీ రామదండకము. ఇతఁ : చురచించిన గ్రంథములలోఁ గవిసంశయ విచ్ఛేదమున వ్రాయఁబడిన మూఁదునాలుగు కృత్యాదివద్యములు తప్ప మఱి దేని యందును గృత్యాదివద్యములు గానరావు. ఆ కారణము చేత : .

నితని గ్రంథములను గూర్చిన సమాచారము స్పష్టముగఁ డెలిసి కొన నవకాశము 'లేక యున్నయది. ఇతనిగ్రంథములలో నెల్ల ముఖ్యమైనదియుఁ దనకు మిగులఁ బ్రఖ్యాతి దెచ్చినదియు నగు కవిజనరంజనము నందుఁగూడఁ గృత్యాదిపద్యములు లేవు. వంశ చరిత్రమును జెప్పు సందర్భమున నీవిషయమును గూర్చి ప్రథమ ప్రకరణమునందుఁ గొంతవఱకుఁ జర్చించి యున్న కారణముచేతఁ. జర్విత చర్వణమగునని యెంచి యాచర్చనిచటఁ దిరుగ వ్రాయ. మానితిని. సూరకవి గ్రంథరచనకుఁ బూని తొలుదొల్త కవిజనరం, జనమును రచించినట్టుగఁ గనఁబచుచున్నది. కవిసంశయవిచ్చే దములోని.


క. పుడమిఁగల రసికు లెల్లఁ బో
గడఁగవిజన రంజనకృతిఁ, గావించితినే
నడిదము సూరకవీంద్రుడ.
మృడపదపంకజరిరంను మృదుమాననుఁడన్

,

అను పద్యమును బట్టి యితఁడు కవిసంశయ విచ్చేదమును రచిం చుటకుఁ బూర్వము కవిజనరంజనము రచించెనని తెలియుచున్నది.


1. కవి జెనరంజనము:- ఇది మూఁడాశ్వాసముల శృంగారప్రబంథము. ఇందభివర్ణింప బడిన విషయము చంద్రమతీ , హరిశ్చంద్రుల వివాహము. తృతీయాశ్వాసొంతమున.

 "తే: గీ: సత్యమును దృఢవతంబుగా • సంగ్రహించి . . ,
రాజనూయాది వివిధాధ్వ రములొనర్చి
వరగుణోజ్జ్వలసంతాన • వంతుఁడైక
రమును సుఖముండెనాధరా , రమణమౌళి

అని చెప్పి హరిశ్చందనిపూర్వకథలోనే ప్రబంధమును ముగించినాఁడు. కథా విన్యాసమునఁ గల్పనా చాతుర్యమును జూపన వకాశమంతగాఁ జిక్కినది కాదు. ఇందలి కథను నొకటి రెండు వాక్యములలో నిట్లు చెప్పవచ్చును.

పూషవంశ భూషణుండగు త్రిశంకుభూపసుతుఁ డయో ధ్యానగరమును రాజధానిగాఁ జేసికొని భూమిని బరిపాలించు చుండఁ బుడమికిఁ దొడవగు విజయాస్పదపురమును దనకుఁ బ్రధాన నగరముగఁ గావించుకొని యుశీనరధరావరుఁడు రాజ్యపాలన మొనరించు చుండెను. ఆయుశీనరునకుఁ జంద్రమతి యను కుమారీ రత్నముజనించెను. ఆమెకు జవ్వనమంకురించిన పిదప హరిశ్చంద్రుని సుగుణసంపదను వినియును నతని మనోహరాకృతిని జిత్రపటమునఁ గనియును నతని యందే తన చిత్తమును హత్తించియుండ నాసమాచారము నామె చెలికత్తెల ముఖమున వినిన" వాఁడై యుశీ నరధరారమణుఁడు దృఢవ్రతుండను బ్రాహ్మణోత్త ముని హరిశ్చంద్రుని పాలికిఁబుత్తెంచెను. హరిశ్చంద్రుఁ డావిప్రుని వలనఁజంద్రమతి సుగుణసంపదయు, రూపలావణ్యాతిశయమును' విని తనకామె తగిన పత్నియనితలఁచి తనయంగీకారమునుదృఢ వ్రతునకుఁ జెప్పి పుచ్చ నతఁడాశుభవార్తనుజంధ్రమతి జనకునకుఁ దెలియఁజెప్పెను. పిదప విజయాస్పదపురమునఁ గడువై భవముతో వివాహసన్నాహంబులు జరుగ హరిశ్చంద్రుఁడ యోధ్యానగరమునుండి తర్లి వెడలీ విధ్యుక్తముగఁ జంద్రమతిని బాణి. గ్రహణము చేసికొని సంతోషపూరితహృదయాంతరంగుఁడై మామ, యొసఁగిన యరణములతోఁ జంద్రమతినిఁ జేకొని యయోధ్యానగరమునకు వచ్చి సుఖముగ రాజ్యపాలన మొనర్చు చుండెను. .


ఈ కథనే సూరకవి, మూఁడాశ్వాసములలో 260 వద్య ములతోఁ జెప్పెను. అందుఁబ్రథ మాశ్వాసము పురవర్ణనాదికముతోడను, చంద్రమతి జననసౌందర్యాభి వర్ణణముతోడను ముగియును. ద్వితీయాశ్వాసమున, వసంతము, చంద్రమతివిరహము, మలయపవ నాద్యు పాలంభము, దృఢవత సందేశమును ననునవి వర్ణింపఁ బడినవి. తృతీయాశ్వాసమున హరిశ్చంద్రుని , కళ్యాణయాత్ర, చంద్రమతీ హరిశ్చంద్రుల వివాహమా హెూత్సవము, నూతన వధూవరుల గృహప్రవేశము, సూర్యాస్తమయ ము, తమస్సు, తారలు, చంద్రోదయము,ప్రభాతము, కోడికూత, సూర్యోదయము, మొదలగునవి యభివర్ణింపఁ బడినవి.


ఈ ప్రబంథరచన యందు 'సూరకవి తనకుఁ బూర్వులగు శ్రీనాధాది మహాకవులను నెక్కు డుగ ననుసరించియున్నాఁడు. శైలియందును, గల్పనావిషయమునను నీకవిజనరంజనములోని పద్యములు పెక్కులు నైషధము, వసుచరిత్రము, కవికణ రసాయనము మొదలగుప్రసిద్ధాంధ్ర ప్రబంధము లలోని పద్యములకుఛాయగ నున్నవి. కవిత్రయము వారికవిత్వము నితఁడెంత శృద్ధాభక్తులతోఁ బఠించెనో యంతగా శ్రీనాధ మహాకవి గ్రంథములను, అందుముఖ్యముగ శృంగార నైషధమును వసుచరితమును, మనుచరితమును బఠించి నట్టుగ నిందలి పద్యములే ప్రబలమగు సాక్ష్యమునిచ్చు చున్నవి. ఈప్రబంధ మునందుఁ జేయఁబడిన పురవర్ణనాదులలోఁ గొన్ని మాత్ర: మిచటఁ జూపఁ బడుచున్నవి.


1. పురము.

క. నూపురము భూపురంద్రికి
గాపురము జయేందిరకును " గగనతలస్సృ
గోపురము భాసిలునయో
ధ్యాపురమిన వంశ భూధ • వాధారం బై.

మ. అమరద్వీపవతీ పయోవిహరణ • పొంచగ్సుర స్త్రీల వ . .
జుమయాభంకషమంటపాగ్రములని • చ్చల్ క్రీడఁ గావించు త
దమణీవారము వేట నేఱు పఱుప • న్రాదంచుఁగా దివ్యరా
జముభీపాళికిఁ దమ్మిచూలియని మే • షత్వంబు గావించుటల్ .


2. పూదోఁటలు.

'క. వలపులపాణింధమములు
మలయానిలముల విహార • మందిరములు
పూవిలుతుని యాయుధశాలలు -
చలువల జన్మస్థలము ల • చటిపూఁదోఁటల్

.

3. పద్మాకరములు.

గీ. అతుల దరచక మీన రే• ఖాంకములయి
యూర్మి కాకంకణద్వ్యతి • నొప్పుమీఱి
చారు పద్మాకరమ్ముల • చందమునను
రాజిలుచునుండు పద్మాక • రములువీట.

4. రాజు.

సీ. తనపృధుకీర్తిము • క్తాఛత్రమునకు స్వ
గ్లధరంబు కనకదం , డంబుగాఁగఁ
దనప్రతాపసమగ్ర - దావాగ్ని శిఖకు వ్యో
మంబుతంగ ధూ మంబు గాఁగఁ
దననిరర్గళ దాన • ధారాంబులహరికి
గైలాసశిఖరి సైకతముగాఁగఁ,
దనకటాక్షుస్యంది • మనకృపౌరసవృష్టి ,
కఖిలార్థి కోటి స • స్యంబు గాఁగ

గీ. మహిని వెలువొందె మతారి • మండ లేశ
మకుటమణిగణశాణాయ " మానచరణ
నఖరపాళి నిజాశ్రిత • నళిన హేళి
చారుకీర్తిహరిశ్చంద - చక్రవర్తి.

5. వసంతము.

చ. వలపులకున్ని దాస మలి. ఆ వారము కోరనికోర్కి జాతికిం
దలఁపని కీడు పౌంధసము • దాయము పాలిటి వేఱు విత్తు రో
కిలముల నోముపంట స్మర , కేవల శౌర్యహుతాశిధాయ్యరా
చిలుకలభాగధేయ మిలఁ • జెన్నల రారె వసంతమంతటన్

. - - -

12 6. విరహము.

1. సీ. ఎలనాగ పల్కుల , కెన గావటంచునో
చెవియొగ్గి -వినఁడయ్యెం జిలుక పల్కు
లింత నెమ్మోముతో - నీదు గాదంచునో
తళుకుటద్దముఁజూడఁ • డలఁపఁడయ్యెఁ
బూఁబోఁడి బాహులఁ • బోల లేవంచునో
పూవుదండలు మేనః • బూనఁడయ్యెం
బొలఁతి మై తావితో బురుడు గాదంచునో
మొనసి ఆ గంధంబు • ముట్టఁడయ్యె

గీ. బోటినిట్టూర్పు గాడ్పుతో సాటి గాద
టంచునొయుశీర తాలవృం • తానీలంబు
సొంపునకు నించు కేనిఁ గాం. • క్షింపఁడయ్యె
మదనసాయక ఖిన్నుఁడై - మనుజువిభుఁడు.

2. తే. గీ. అతను తాపంబుఁ గావింత • మనుచుఁగోరి
సఖులు శైత్యోపచారముల్ - సతికిఁజేయ
దైవ మొండొక యద్ధం బు , దాగ్ర హించి
యతను తాపంబుఁ గావించె • నజ్జముఖికి,

3. శా. శయ్యాదంభమునన్ మురాంతకుఁడు భూ షాకై తవస్పూరిచే
సయ్యా ర్యారమణుండుఁ దాల్చిరి భుజం • గాధీశులన్నీయ సా
హాయ్య ప్రస్ఫుటధాటికర్వోకనుచో •వజ్జాస్య లాయోర్చువా
రయ్యాగంధసమీర! పోవఁగదవ • య్యా! యీకురం గేక్షణన్


7. యాత.

శ. శ్వేతాతపత్రాళి, చీకట్లు దొలఁగించే -
రాజన్యభూషణ • రత్నరుచులు

తురగఖురోద్దూత | ధూళి వెంపడగించె
గరిపుష్కరోర్ఝిత కంకణములు
సింధురమద గృష్టి • సింధులనింకించే
సామంతమకుటక • క్షణరజంబు
సైన్యసమ్మర్దసం జనితోష్మఁ దొలఁగించె
సమితపతా కాంబ • రానిలంబు

సైన్యజని తావరోధంబు , సైన్యముననే
తొలఁగెనని సైనికాళి సం , తోషమండఁ
జనియె సైన్యంబు కతిపయ • దినములకును
రమ్య విజయాస్పదపురీవ • రంబుఁజేర.


8. పరిణయము.

మ. జలమ న్మైఁబులకాంకు రాళిదరహా • సొంకూరముల్కంగం
దొలఁక స్మశ్యపుట్టింట్లు గండయుగళిం • దూఁగంగనత్కకణం
బులు మోయన్భజమధ్య సీమ రతనం • పుం దాళితార్మాలు గా
దలఁబ్రాల్వో సెలతాఁగియాదలపయిన్ - ధాత్రీశుఁ డత్యాయకృతిన్ .

క. మంగళ తూర్యంబులు పు
ణ్యాంగనల శుభార్హ గీతి , కారావములు
ప్పొంగంగ హరిశ్చందుఁడు
మంగలసూత్రంబు చంద్ర • మతికింగట్టెస్


9. నయవిరచనము.

సీ. అనుఁగు బిడ్డల భంగి • నను జీవులను బ్రోవు
మిలువేలుపులఁ గొల్వు మేమఱంక
పతికిముం దనుభవిం • పకు మేపదార్థంబు
జవదాటకుము నిశ్వరుని మాట:

<మగఁడు గావించిన ఈ మన్ననగుబ్బకు
మదిఁగృశింపకు మవ • మానమునకు
నవనినురాభ్యాగ తార్థికోటుల నెల్ల
నా ప్త బంధువుల య • ట్లాడరింపు

గీ. కరుణగల్గుము బంధువ • ర్గముల కెల్ల
గురుజనంబుల సద్భక్తిఁ - గొలువు మెపుడు
దైవమన్నసు గురువన్న • థర్మమన్నఁ
బ్రౌణ సాధుండు సుమ్ముమా • యమ్మ కాస
.
10. చంద్రోదయము.

సీ. కుముదినీ జృంభణాం • కురమూలకందంబు
తోయజశ్రీ పళ్య తోహరుండు
సకలజీవంజీవ • సంజీవనౌషధి
చక్ర వాకీమన స్తాపకారి
తిమిరవారణఘుటా • సమడమృ గేంద్రంబు
చిత్తజమాండ్యవి లో చ్ఛేదనుండు
సఖిలది దృక్షుజ • 'నా సేచనకమూర్తి
బహుశౌషధీపియం • భావుకుండు,
సురలయాఁకటికూడు మ్రు - చ్చులకుఁగీడు
రిక్కలకు ఱేడు వెలుఁగుల • యిక్కజోఁడు
లచ్చి సైదోడు రేఁబోటి , వెచ్చకాఁడు
చంద్రుడల రా రెసత్కళా • సాందుఁడగుచు.

11. సూర్యోదయము.

చ, కలువలపూఁడుతమ్మి చెలి • కాఁడునిశా విభుజంట చుట్టుపు జులగమినోముపంటఖగ • ఘోటునకున్ వలచూపుమూఁడుమూ

ర్తులునొక టైనరూపుతొగ. రుంజినీరంగు వెలుంగు ప్రోవు ప్రా
బలుకుల తావు పూర్వగిరి • పైనపుడొప్పెది నేంద్రుడెంతయున్.

ఈకవి జనరంజనములోని పద్యములు కొన్ని నైషధము, వసుచరిత్రము మొదలగు ప్రసిద్ధాంధ్ర ప్రబంధముల యందలి పద్యముల ననుకరించియున్నవని చెప్పియుంటిని. అట్టి యనుసరణములఁ గొన్నింటి నీదిగువఁజూపు చున్నాఁడను.

నైషధపుఁబోలికలు.

1. సీ. భక్తి ప్రదక్షిణ •మంబులఁ జేసి
రాశుశుక్షణికిను , పాసనంబు
సంశుక గంధి క .ళ్యాణకియాచార
మాచరించిరిమంద • హాస మెసఁగ
నఱెత్తిచూచిరి , యాకాశమండలా
స్థానరత్నంబునౌ • త్తానపాదిఁ
ద్రైలోక్యపతి దేవ • తాఫాలతిలకంబు .
దివిరియ రుంధతీ • దేవిఁగనిరి

గీ. బాహ్మణోత్తమ పుణ్యపు • రంధి వర్గ
మంగళా శీర్వచోయుక్త • మహిమశోభ
నాక్షతారో పణంబుల • నాదరించి
రంబుజాక్షి యునిషధ దే | శాధిపతియు.

శృంగార నైషధము 6 ఆ 101 ప.)

సీ. కేలు మోడ్చిరి పద • క్షీణపూర్వకంబుగా
నాశుశుక్షణికి న • త్యాదరమునఁ
గాంచిరిగ్రహతార • కామండలో పతి
స్థానసంవాసినా త్తానపాది

బణతిఁ గావించిరి , భక్తి నరుంధతి
సీమంతినికిని వ • సిష్ఠునకును
జేసి రుత్సవమునఁ • జేలాంచలగింది
సముచితపరిణయా • చారనియతి

గీ. ద్విజవ రేణ్యులు బహుపురం • ద్రీ జనములు
ప్రీతి నాశీర్వదించి య • ర్పించుశోభ
నాకతలుగైకొని ధరించి రౌదలలను
జంచమతీయ హరిశ్చంద • చక్రవర్తి.

(కవిజనరంజనము 3 ell 48 ప)

2. ఉ. కంకణనిక్వణంబు మొగ కట్టఁగఁగౌనసియాడరత్నతా
టంక విభూషణంబులు వ • డంకఁ గుచంబులురాయిడింపఁగాఁ
బంకజ నేత గౌతముని • పంపున లాజలుదోయిలించి ధూ
మాయునియందు వేల్పెదర • హాసము అప్పలలోన దాఁచుచున్ .

శృంగార నైషధము 6 ఆil 102 ప)

చ. అలఁతిక వున్వడంకవల • యఢ ని నిర్మలబాహు మూలకాం
తులుగొనియాడ లేనగవు • తొంగలి అప్పల డాఁగ హారము
ల్మె లిగొన జిల్కు పయ్యెద చ • లింపఁగుచడ్వయిరాయిడింబడం
జెలిదలఁబ్రాలువోసె నృప , శేఖరునౌదల పైని దోయిటన్

(కవిజనరంజనము. 3 !!! 38 ప!)

క. వనితామణి పాదాబ్దము
తనహస్తాబ్దములఁబట్టి దరహాసరుచుల్క
కను ఱెప్పలలో , డాఁచుచు
సనికల్ దొక్కించె రాజు జవ్వని చేతన్

(కవిజనరంజవము 3 అ|| 45 ప॥) .

మ. గురువన్నన్ ధనమన్నఁ బుణ్యమనినన్ •గోతోదయంబన్న దే
వరయన్న న్మనమన్నఁ చుష్టియనివన్ • వాత్సల్యమన్నన్ని జే
శ్వరుఁడన్నం బరమోపకారమనినన్ • సర్వంబునన్నందలో
దరి నీరున్ నిషధాధినాధుఁడె నుమా | తథ్యంబుగాఁ జెప్పితిన్ .

సీ. పాటించికొలువుము • భవన దైవంబుల
సవతులఁగొనియాడు • సఖులఁబోలె
నారాధనము సేయు . మత్తమామల కెప్టు
సరిజనంబుల మీఁదఁ • గరుణగల్లి :
యలగకు కోపించి • నపుడు నాధునితోడ
మదిలోన నుబ్బకు మన్ననలకుఁ
దోడికోడండ్రతోఁ గూడియాడిచరింపు
దాసీజనముఁ బోవు • తల్లికరణి

తే, బాహ్మణులయందు గురులందు బంధులందు
భక్తి విశ్వాస సౌహార్ద్ర, పరత సెఱపు
భవ్య పతి దేవతాచార • పరఘపుణ్య
ధర్మ మేచురకుండు మా తల్లి కాన.

శృంగార నైషధము ఆll 7-8,9 పద్యం )

సీ. అనుఁగుబిడ్డలభంగీ • నను జీవులను బోవు
మిలువేలుపులఁ గొల్వు • మేమఱిలక
పతికిముందనుభవిం • పకు మేపదార్థంబు
జవదాటకుము నిజే శ్వరునిమాట
మగఁడు గావించిన మన్న నకుబ్బకు
మదిఁ గృశింపకు మవ • మానమునకు
నవనిసురాభ్యాగ , తార్టీకోటుల నెల్ల
నాప్త బంధువులయ ట్లాదరింపు


కరుణగల్గుము బంధువ •వర్గముల కెల్ల
గురుజనంబుల సద్భక్తిం • గొలువు మేపుడు
దైవమన్నను గురువన్న • ధర్మమన్న
బ్రాణ నాధుండు సుమ్మ మా యమ్మ కాన.

కవిజనరంజనము 3 ఆ|| 54 పద్యము.)

కవికర్ణ రసాయనపుఁ బోలికలు



ఉ. కన్నులఁజంచలత్వమును గౌగ్యమపాం గవిలోకనంబులం
జన్ను లఁగర్కశత్వముఁ గృ• శత్వముఁగౌనునమంద భావము
స్నెన్నడ వక తంగురుల • నెక్కొనఁజేయు నెట్టి చిత్రమో
కన్నియ జవ్వనంబుత్రిజ , గజ్జన సన్నుతమయ్యె నయ్యెడన్

(కవికర్ణరసాయనము 3 ఆll 20 పద్య ||)

ఉ. కన్ను లచంచలత్వమును గబ్బిచనుంగవ కర్క శత్వము
న్నెన్నడమాంద్యముంగురుల నెక్కొనువక్రత కౌసుకార్శ్యము
న్సన్ను తికెక్కె నొనచల • సంపదబోఁటిక ద్ధరించుట
స్వన్ని య కెక్క వేయవగు ణంబులు మిక్కిలికల్మియున్నెడన్

(కవిజనరంజనము 14|| 54. పద్యం )

సూరకవి పద్యములోని యర్థాంతరన్యాసము మీఁదిపద్యమునకును వన్నె దెచ్చెనని చెప్పనగును.

క. కరమర్థి నేన పెనుపం
బెరిగినశుక మోట లేక • ప్రేలుచుహృదయం
బెరియింపఁ దొణఁగెనింకం ..
బరభృతములు చెప్ప నేల , పంకజవదనా.

(కవికర్ణరసాయనము ఆళ్వా! 3. 104 పద్య) .

ఆ.కురభృతంబు గానం • బరికించి యొక వేళ ,
గోకిలంబు చేయఁ - గూడుఁగాక

కొంత నామధేయ • మెంతయుఁగైకొని
చిలుక నీకు వెట్ట • సేయఁదగునె.

(కవిజనరంజనము ఆశ్వా! 2. 50 ప)

సీ. మూర్థాభిషిక్తుల ముకుటరత్నద్యుతు
ల్కరదీపదీప్తులఁ - గలిపికొనఁగ
రత్న వేత్రపరం ప • రారుచుల్పురసతీ
నీరాజనాంశుతల • నిలిపికొనఁగ
స్మేరముఖాం బుజ • శ్రీపార్శ్వదోదూయ
మానచామరలక్ష్మి మాఱుకోనఁగ
వందిమాగధుల కై వారంబు రావంబు
శుభతూర్యరవములఁ • జూఱకొనఁగఁ

గీ. బసిడిరథ మెక్కి విపులపై - భవము మెఱయ
జూపరుల కెల్ల వ్రేకపుఁ * జోద్య మొదవ
సొంగ మైన చ్చు భాగధే, యంబువోలె
మామయింటికి వచ్చెజా మాతయపుడు.

(కవికర్ణరసాయనము 3 ఆళ్వా! 175 వ పద్యము .)

సీ. రాజన్యకోటీర • రత్న మరీచులు
గరదీపికాపదల్ గలసి మెలఁగ
నాభీలవటు భేరి • కాభూరిభాంకృతుల్
మత్తేభ ఘీంకృతుల్ • మైతి సలుప
సుర్వీసురవ్రజా , శీర్వాద నాదము
ల్విములవందిస్తుతు • ల్వియ్యమంద
వారాంగ నాదత్త • నీరాజనాంశువుల్
హైమవేత్రద్యుతు లల్లుకొనగ

13

భద్రకరి నెక్కి రూపనై , భవసమృద్ధి
దర్శసవ్యగ పౌరసం • తతికి నేత్ర
పర్వ మొనరించుచును సార్వ • భౌముఁడపుడు
భూతలాధిపుశుద్ధాంత మునకువచ్చె.

కవిజనరంజనము3 ఆ 20 ప)

వసుచరితపుఁబోలికలు. -

మ! జన నాధోత్తముఁడింతఁజూడ ననీ మే షత్వంబు గాంక్షించు న
య్యని మేషత్వము కాంతకాంతముఖ చం ద్రా సేవ నానంద వా
సనఁబాపించినఁ గోరునప్పుడని మే • షస్వామి భావంబుఁ గ
కొన నెండున్ నృపులు త్తరరోత్తరపదా • నూనస్పృహాచంచలుల్,

(వసుచరిత్రము 2 ఆ|| 84 పn)

శా. కాంతారత్న సమాగమందును నెద గ్గాంక్ష్ంచు నేతెంచుడుం
జెంతంజేరఁగఁగోరుఁ జేరుడుఁగుచా • శేషాప్తిఁ గాంక్షించుఁగా
నంతందత్క లంటగోరు ఫలతృ • పాత్మ త్వముర్వీవధూ
కాంతానర్హ మటంచుఁబల్కు స్మృతివా క్యస్ఫూర్తిస్వార్థంబుగన్
 
(కవిజనరంజనము 3 || 123 ప|) I



చ|| అలికుల వేణియిట్లు వల యాంక బిసాలకురపన్న గాళికిం
జలమరిచల్ల గాలికిని . జక్కెరఖాణపు లేజిఁదోలు పూ
విలుకువయాళికిం జిగురు ఈ విందుల నీలిగయాళికిన హలా
హలగుళికాపద్ముదము • నాభికి నాళికిలోఁగి యాత్మలోన్ .


(వసుచరిత్రము . 8 ఆ| 118 ప!)

క. అళుకొందెనప్పుడా తొ
య్యలి మధుకనికర శుక పి . కావలికిస్ జా

చీలికిన్ జిలిబిలివలికరు వలికి న్విరివిలుతు సెక్కు వ హళాహళికిన్.

{ కవిజనరంజవము 2 ఆl 19 ||)

III


సీ.నటదీశ హసన వి • స్ఫుటిత వేధోండ రే
ఖలఁదోచు వరణాంబు • కణికలనఁగఁ
బెల్లుబ్బునిన్ల పె • నెల్లి మెల్ల పదార్థ
ములుముగ్గఁ బొడము బు ద్భుదములనఁగ
రవికి మందేహ ని , ర్మధన సాధనములై
వచ్చిన ద్విజమంత్ర వర్ణములన
హరిపదంబును నీశు • శిరము నైన నభంబు
ననభోగతులు నించు . ననలనంగఁ

తే.రమగిరియను మరకాడు జలధిసరణిఁ
దరణిడించిన నతఁడు త • త్సలిలమగ్న
విమలముక్తాఫలం బులు • వెలికిఁ జొనిపె
ననఁగ నవ తారకా నికా • యంబులడరె.

(వనుచరితము 4 అ 15 <ప.)

సి. ధ్వాంతదంతాళో , త్కర పుష్కరోద్ధూత
గగనగంగాపయః కణములనఁగ
శర్వతాండన దిదృ క్షా సమాగత నిర్జ
రీ హార మౌకిక శ్రేణులనఁగ
వభ్ర కళింపజా హ్రదమున నిండార
విరిసిన తెలిగల్వ • విరులనంగ
భావి నిశాచండ్ర పరిణి మంబునకిడు
దిక్కుడ్యముల పిండి ఆ చుక్కలనఁ

గీ. గిక్కిఱి సెనొక్క మొగి నెల్ల దిక్కులందు
క్షీర మనసార పొటీర • తారహార
హీరపారద నారద ఈ శారదాభ్ర
గౌరరుచిమీఱ దారకా వారమపుడు.
(కవిజనరంజనము • ఆ!!. 88 ప)

I. IV




సీ!! తనయశో విశద ము • కాసౌధపౌళికి
నంబు దాయనము వా , తాయనముగఁ
దన శౌర్య శిఖిశిఖా • తతికి జాంబూనద
భూధరంబపరంజి • పూదెగాఁగఁ
దనబలోడ్డతరజో • దంభకుంభినికిఁ దా
రా గహంబులు గర్భ • రత్నములుగఁ
దన దానధారాఖ్య " వనధికి మిన్నేఱు
కల్లోలధుత వారి • కణముగాఁగఁ

తే. దన వినూతన సుగుణ సం లో తానవల్లి
సముదయంబున కంభోజ • సంభవాండ
ఖాండములఖండ ఫల పరం , పగలు గాఁగ
వరలు భవ్యవిళా విభా + వనుఁడు వనుఁడు.

(వసుచరితము 1 ఆ|| 116 ప)

సీ. తనపృధుకీర్తిన్ ము • క్తాఛతమునకు స్వ
ర్ణధరంబు కనకదం • డంబుగాఁగ .
తనప్రతా ససమగ్ర • దావాగ్ని శిఖకు వ్యో :
మంబు తదగ్రధూ ధామంబుగాఁగఁ
దననిరర్గళ దాన • ధారాంబు లహరికి


గైలాసశిఖరి సై కతము గాఁగఁ
దనకటాక్షస్యంది. • మనకృపొరసవృష్టి
కఖిలార్థి కోటి స • స్యంబు గాఁగ

గీ.మహిని జెలువొంది మత్తారి • మండలేశ
మకుట మణిగణ శాణాయ • నూన చరణ
సఖం పాళి నిజాళిత • నళిన హేళి
చారుకీతి హరిశ్చంద్ర చక్రవర్తిన్,

(కవిజనరంజనము 1 of 28-29)

చ. తఱులరనిక్కఁ బూత నెఱ • తావియచిక్క పొంగమాలికల్
మెఱుఁగులుగక్క నూరుపుల • మేలిమిఁ డెటులు చొక్క హారముల్
కుఱుచలు దొక్క ముంగురులు - గొం జెమటం బద నెక్క వేలుపుం
దెఱవయొక ర్తు చేదిజగ తీపతికిన్ శిరసం టె వేడుకన్ .

(వసుచరిత్రము 5 ఆll 75 ప!)

చ. జిలుఁగుపయంటదూల నునుఁ • జెక్కుల లేఁ జెమరంకురింప గు ,
బ్బలు నటియింపఁ దాళగతి • బంగరు గాజు అమోయ హారము
ల్మెలిట్గొన నూర్పులుప్పతిల , లేనడుమల్లలనాడ మెల్ల నే ,
యలీ కుల వేణియోతున్ శిర, సం టెను గెంజిగురాగ బోఁడికిన్.

(కవిజనరంజనము 8 ఆ|| 26 ప||)


ఇటులనే యింకను మనుచరిత్రము మొదలగు గ్రంథము లలోని పద్యములను బోలినపద్యము లిందు నక్కడక్కడనున్నవి. కాని గ్రంథవి స్తర భీతిచే వాని నిటఁ జేర్పమానితిని. ఇట్టి యను సృతులను దమకవితలోఁ జొప్పించుటయే గొప్పగా నెంచినయాకాలపుఁ గవితా పరిపాటి ననుసరించి సూరకవి వసుచరిత్రాది

ప్రబంధముల కవిత్వరీతులను గైకొని యన్వారాభిధాన మగు నీకవిజనరంజనమును జెప్పి యున్నాఁడు. ఈ యనుసరణములు కవియొక్క ప్రతిభకును గవితా సామర్థ్యమునకును గొఱతగా నెన్నఁబడరాదు గదా ? సరసకవితా సామ్రాజ్యపట్టభద్రుడగు పెద్దనార్యుడు మారన మార్కండేయ పురాణ మనుసరింప లేదా ! ఏదియెట్లున్నను సూరకవి మాతకృతిని మిగుల సరసముగను శ్లాఘనీయముగను గావించెనని చెప్పక తప్పదు.

సూరకవి కవిత్వమునందలి యర్థాలంకారములు.

అభ్యాలంకారము లనేకము లీకవి యీప్రబంథమునఁ బ్రయోగించియున్నాఁడు. అట్టియలంకారములుగల పద్యములు గొన్నింటి నీదిగువఁ జూపుచున్నాఁడను.

1. ఉపమ:

చ. పుర నిక టాంచితో పవన • పుష్పిత సాలములం గదల్చుచున్
సరనులఁ దేలుచున్ నుమర • జంపటలంబులఁ గొల్లలాడుచున్ సురుచిరకుంజపుంజములఁ • జొచ్చినటించుచు మంద గామలై
కరులవ లెంజరించుఁ జలి , గాడ్పులు షట్పదశృంఖలజ్జగన్ .

(కవిజనరంజనము 1 34 18 ప!)

2. క. కలశాబ్దిళంగి నిన్నెల
పొలిచెం దెలిదీపిలీవిఁ • బూర్ణసుధాంశుం
డల రె నచటనున్న రమా
లల నాధిపుభంగిఁ దత్కళంకంబొప్పెన్

(కవిజనరంజనము 8 ఆ: 83 ప!)


103 2. ఉత్ప్రేక్ష:(1)

 చ. అనుపమ హైమగడ్య ఘటి ఆ తాంచదనంత మణిప్రహాలిచే
ననయముఁ దత్పురీవర మ • హాగృహముల్ రెయిదోచండఁగా
నొనరుచు టంజుమీ గృహము , లొప్పె నిశాంత సమాహ్వయంబులన్
విసుతి యొనర్పఁగాఁ దరమె • వీటనుగల్గిన రత్నసంపదల్

(కవిజనరంజనము 1 ei 19 ప||) '

ఉ. యమునా తీవధూటి బిగి యారఁ గవుంగిటఁ జేర్చుటం దదం
"గా మలచందసలు మటు • నం టెననందెలుపయ్యె బింబమా ;
కోమలగాత్రి గబ్బిచను . గుబ్బలకస్తురి తొమ్ము సోకెనో
నామహిఁ దత్కళంకము గ • నంబడెఁ గల్వలఱేనిక య్యెడన్ .

(విజనరంజనము 3 ఆll 75 పm)

3. రూపకమం:--

1. గీ. చన్ను కొండల క్రేవల • సంభవించు
బాహులతలజనించిన • పల్లవములు "
పడఁతి కెంగేలు తత్కర • పల్లవముల
జనన మొందిన కళికలు • సకియగోళ్లు.

" (కవిజనరంజనము 1 on 57 ప)

సీ.చిగురాకు టెఱసంజ • జిగికిఁ బాండురకోర
కములు భానుర తార • కములుగా
బసవ రసాసార • పటిమంబుననురాలు
కనుమము ల్వడగండ్ల • గుంపు గాఁగఁ
బ్రవహించు మధుని ర్ఘములకుఁ బుప్పాళ్ళ
నెఱతిప్పలి నుక తి - న్నియలు గాగ.

మంజుతరనికుంజ • కుంజరంబులకు రో
లంబముల్ శృంఖలా, లతలు గాఁగఁ

తే. బసవకిసలయ ఫలరస • రసిక మధుక
ర పీక శుక నిక రారవా , క్రాంత దశ
ది గంతరాళము దనరె వసంతకాల
మఖిలభూజన రంజనం , బగుచునంత.

(కవిజనరంజనము 2 ఆ|| 5 ప!)


4. అతిశయోక్తి:

సీ. మేనుమించులఁ జేసి - వాని చాంచల్యం బు
వాలుగన్నుల యందుఁ - గీలుకొలిపి
శశి నెమ్మొగ మొనర్చి • చందు నందలి కప్పు
కుటిలాలకములందుఁ • గుదురుపఱిచి
కెంపువా తెఱఁజేసి , కెంపుకెంపుకాఠిన్యంబు
బటువు గుబ్బలయందుఁ - బాదుకొలిపి
విరులు గోళ్ళానరించి ఆ విరుల సౌరభ్యంబు :
నిట్టూర్పు గాడ్పుల • మట్టుపఱచి

తే. నలువఁ గావింపఁబోలు నీ చెలువనౌర
యనఁగఁ జెలువొందె నాచాన • హంసయాన
యమృత పుంబావి యరిదియం • దములదీవి -
యాణిముత్తెమ్ము వలరాజు • నలరుటమ్ము.

(కవిజనరంజనము 1 ఆll 70 ప) 2.

క. లోకాలోక మహీధర
మేకోట, కులాచలము లే కృతకారులు, కే.

ళాకూళులుజలరాసులు,
శ్రీకరధృతిసాందుడౌహరిశ్చంద్రునకున్.

(కవిజనరంజనము 1 ఆn-29 ప|}}'

5. ఉల్లేఖము:

1. చ. వలపులకున్ని దాన మలి - వారముకోరనికోర్కి జాతికిం'
దలఁపనికీడు పొంధ సము • దాయము పొలిటీ వేఱువిత్తుకో ,
కిలములనోముపంట స్మర, కేవల శౌర్యహుతాశిరాయ్యరా
చిలుకలభాగ ధేయమిలఁ , జెన్నలరారే వసంతమంతటన్ .

(కవిజనరంజనము 2 or 3 ప )

2. క. చిలుకల చదువులబడులయి
యలులకు బానీయశాల లయికోకిలమం
డలముల కామెతలయి వల
పులకుని దానంబులగుచుఁ • బొలిచెందరువుల్

(కవిజనరంజనము a ell: 7 ప) ,,

6. అర్థాంతరన్యాసము:

గీ. ఇంతి సౌందర్య రేఖాది • దృక్షు చేత
నెపుడు తెరవంతురను, వంచి" • నపుడు గోరు
నిమిష పరికల్పి తాంత రా " యమువిదిర్ప
భూమిపతులందు వాంఛాప్ర• పూతిఁ గలదె.


(కవిజనరంజనము 3 ell- 37 ప||)

గీ. విసముఁగంతం బునను దాల్చి • విసముకంటె .
నతి భయంకరమూర్తివీ , వని శశాంక !
యుత్తమాగంబునందు నిన్నుం చెహరుఁడు
వ్యర్థ మే శర్వసర్వజ్ఞ • వైభవంబు.

(కవిజనరంజనము. 2 అ 40 ప!) 7. ప్రతీపము:

1. క. పుడమింబొజియలు దూఱెడు
పిడుగులు నడవుల నెడాఁగు • బెబ్బిలిగుహలం
డడఁగెడు సింహముసరియే
వడిగలతనమునను రాచ • వారికి వీటన్.

2. సీ. ఎలనాగ పల్కుల , కెన గావటంచువో
చెవియొగ్గి వినఁడయ్యెఁ జిలుక పల్కు •
లింత నెమ్మోముతో , నీడు గొదంచునో
తళుకుటద్దముఁజూడఁ - దలఁవఁడయ్యె
బూఁబోఁడి భాహులం • బోల లేవంచునో
పూవుదండలు మేనఁ • బూనఁడయ్యెం
బొలఁతి మైతాలితోఁ - బురుడు గాదంచునో
మొనసి శ్రీగంధం బు • ముట్టఁడయ్యె

గీ. బోటి నిట్టూర్పు గాడ్పుతో , పాటి గాద
టంచునో యుశీరతాలవృం , తానిలంబు
సొంపునకు నించు కేనిఁగాం • క్షింపఁడయ్యె
మదనసాయక ఖిన్నుడై - మనుజవిభుఁడు.

(కవిజనరంజనము 2 || 18 ప)

8. 'పరిసంఖ్య:

సీ. బహుభాషణత్వంబు - పటుశాస్త్రసంవాద
చుంచువిద్వజ్జన • స్తోమమంద .
కూరభావంబత్యు • దారవిలాసవ --
చ్చంద్రాననాకటా • క్షములయంద
చంచల భావంబు • సముదగ్ర భద్రదం
తావళ రాజిహ • స్తములయంద

 వక్రభావంబు దు• ర్వారవిక్రమనము
ద్భటభటాధిజ్యచా • పములయంద
కాని పురమున జనులందుఁ గానఁబడద
నంగ నెంతయు నప్పట్ట • ణము చెలంగు
హీరమణిమయ సౌధాగ్ర, హేమకలళ ,
భాజితస్వర్ణ దీస్వర్ణ • పద్మమగుచు.

(కవిజనరంజనము 1. ఆl 25 ప!)

9. స హెూక్తి:-

సీ. తరుణపల్లవ లతాం తములతోఁ గూడ నె
వల రాజు శౌర్యకీ • ర్తులు నెలింగే
నంచితనుమమరం - దాసారములతోన
విరహిణీ బాష్పాంబు • వృష్టి గురి సెం
గమనీయ లతికాప్ర , కొండంబు తోడనే
శుక పిక మధుకరో • త్సుకతనిగి డె
మలయానిలాంకూర, ములతోనకాముక
సమితి వాంఛకంద •శములు ప్రబలె
భవ్యనవ్య ప్రభా పరం • పరలతోన
పరిమళంబులు దట్టమై • పర్వేదేశల
సకలఋతుసార్వభౌమ వ • సంత ఋతువు
త్రిభువనీ మోహనంబయి , తేజరిల్ల,

(కవిజనరంజనము . 2 el? - 21)

తే. తమమడ రెఁ బాంథజన మోహ తమముతోడ
వహ్ని వెలుఁగొందే మరుశౌర్య • వహ్నితోడఁ
దారకలు దెల్విఁగ నె నబి , సారికాప
రంపరలతోడ నెంతయుఁ జంపుమీఱి.

(కవిజనరంజనము & ఆ!! 84 ప4)

.

10. అనన్వయము:--
చ. వనితవిలాసభా గవయ • వంబులకుం బరికించి చూడఁగా
నెన మఱి లేవు వాని కవి • యే యెనయంచు మదిం దలంచికా
యనుపమతన్మనోజ్ఞకర • ఖాకృతిగా నొనరించె నూరువు
ల్వనజదళాయ తేక్షణకు• వారిజసంభవు నేరు పెట్టిదో.

11. శ్లేష:

సీ. పద్మాకరములౌట • భవనరాజంబులు
విష్ణుపదంబంటి • చినుతి కొక్క
రత్నాకరంబౌట • రమణీయవప్రంబు
గగన స్రవంతితో. • గలని మెనె
నుమనోభిరామత • శోభిల్లుటనుదోట
ఆతులాప్సరస్సము • న్వితములయ్యె
రాజవతంను , రాజిల్లుటను సృపు
లమలదుర్గాధి పత్యమునమనిరి
భోగులకు నాణ్యంబయి. • పొలుచుకతన
సన్ను తుకి నెక్కె నదిబలి • సద్మమసంగ
నిత్యకల్యాణ లక్ష్మిచే నెగడుకతన
నాపురంబొప్పు విబుధాల యంబనంగ.

(కవిజనరంజనము 1 ఆn 28 211)

మ, అమృతాంభో నిధి లక్ష్మితోడనుద • యంబై రాజనంబొల్చి తో
రముగా సత్ఫథవతి? నా నెగడి సర్వజ్ఞావతం నుండనై
కమనీయాఖిల సద్గుణంబులయికొన్న నిన్నే న్నడ
క్యమే యీయంత్ఫల, పత్రలో ఛన్నగృపం గాపాడురాకాశశి

(కవిజనరంజనము. a en 30 ప్ర||)

(కవిజనరంటే
తే. కొమ్మల గదల్చు నెప్పుడు • గమ్మ గాలి
విధుతనయుఁడు మనోజుఁడు • మధుఁడు జూతీ,
వైరిదోషాకరుం డుడు , వల్లభుండు
గలికి వీరికి సుగుణంబు • గలుగు టెట్లు.

(కవిజనరంజనము 2 ఆn 34 ప.}

12. భ్రాంతిమంతము:-
మ. అతులో త్సాహము లుప్పతిల్లనిక • టో ద్యానంబులం బొల్చుకే
కితతుల్వీటను జితనత్ర నకలా , కేలింవి జృంభించు భ
వ్యత రాభ్హ్రంకష రత్న సౌధపటలీ • వాతాయన వారతని
గతకాలాగరుధూపధూమ్యలు మొయి ల్గా నెంచి యెల్లప్పుడున్ -
రంజనము 1 ఆ॥ 21 ప)

మీఁదఁజూపిన యలంకారములు గాక యింకను మఱికొన్ని గలవు. కాని గంధవిస్తర భీతిని ఇంతటితో విరమించితిని.

సరసమగు నర్థము నే మిక్కిలిగ నపేక్షించిన కారణముచేత నీకవివరుఁడు - వాగాడంబరమున కోశించి శబ్దాలంకారములనంతగాఁ బాటింప లేదు. కాని యర్థ సందర్భమునకు భంగములేకుండయుచిత మైన శబ్దాలంకారములను గూడ నచ్చటచ్చటఁగవివాడి యున్నాడు:-
X
1. అనఁగఁజెలువొందినా చాను హంసయాను
యమృత వుంచావి. యరిది యండములదీవి
యాణిముత్తెమ్ము వలరాజు • నలగుటమ్ము,



• 2. సరసనిభమూ వినిహిత • నశ్రితాతిన్
సాధుకీర్తిన్ మాకిశ్చంద్ర చక్రవర్తి

సూరకవి కవిత్వము,

సూరకవికిఁ బిదపనో లేక యతఁడు జీవించియున్న కాలముననో యీ కవిజనరంజనము పండితుల యాదరణమునుబొందియాంధ్ర కవి ప్రపంచమున సబ్బయామాత్య కృతమగు కవిరాజుమనోరంజనము మొదలగు గ్రంథములతో పాటు పిల్లవసుచరిత్ర మను ప్రసిద్ధిగాంచినది. అట్టి ప్రసిద్ధిని పొందుటకు దీనియందలి వసుచరిత్ర పుఁబోలిక లొక కారణమయి యుండుటగ్రంథమునందలి వర్ణ నాంశముల పట్లఁగవి చూపిన ప్రేమ యు రసపోషణమును బ్రథాన హేతువులై యుండవచ్చునని తోచెడిని. కథా విన్యాసమునఁ గల్పనా కౌశలమును జూప నవకాశము లేక పోయినను గవి వర్ణ నాంశముల పట్లఁ దన ప్రౌఢిమను జూపి యాధునిక ప్రబంధకవీశ్వరులలో నుత్తమ స్థానము నధిష్ఠించెను.

ఈకవివరుసకు సంస్కృతాంధ్రముల యందుఁ జక్కనివైదుష్యము కలదు. ఇతఁడు సంస్కృతమున నాటకాలంకార సాహిత్యము కలవాడగుటయే గాక పాణినీయ వ్యాకరణ-జ్ఞుండుగూడనై యుండినట్టుగ నీతని గ్రంథములను బట్టి తెలియవచ్చెడిని. కవిసంశయ విచ్ఛేదములోని

A. ఆంధ్ర మర్మంబుఁ దెలియంగ , వసుపుపడు నె
ప్రకటసంస్కృత రచితసూత్రముల చేత

నవనిఁబాణిని ఘటితనూ తార్థసరణి తెనుఁగు టీకలచేత సాధింపనగునె.

అను నీపద్యమును బట్టియు, శ్రీ రామదండకములోనిసం స్కృతపద భూయిష్ఠమగు రచనను బట్టియు, కవిసంశయ విచ్ఛే దములో నితఁడు వాడిన "ల్యప్పు " మున్నగు వ్యాకరణపరి భాషను బట్టియు నితనికి సంస్కృత వ్యాకరణమునఁ జక్కని జ్ఞానముక లదని నూహింప వచ్చును.

సర్వవిధముల నుత్తమ కవిత్వమని చెప్ప నొప్పునది యెట్లుం డవలెనో సూరకవి, తనకవి సంశయ విచ్ఛేదములో నిట్లు చెప్పియున్నాఁడు.

  • సీ.యతి, యుక్త వాక్యాను • గతినంటవలయు వ

త్సంబు ధేనువు వెంటఁ • దవిలినట్లు
మెట్టు మీఁదను గాలు • పెట్టఁగై దండ యం
దిచ్చినట్టులు పాస • మెనయవలయ
సానఁబట్టిన మణి • చందానఁబదమర్థ
నారీశుభంగిబం • ధంబువలయు

  • సూరకవి యీయ భిప్రాయము నే తన యితర గ్రంథముల యందుఁ

గూడఁ దెలిపి యున్నాఁడు-

1. గీ. కవిత నేరుపుయతి గూర్చు • కరణి దెలుపు. (రామలింగేశ శతకము)

2.

క. యతీ దవలవలయు వాగసు
గతి ధేనువు వెంటనంటి • కదలెడు వత్సా
కృతి నదియె కవనచతురిమ
వితరణఖని ! పొణ్గుపాటి • వేంకటమంత్రీ.

(వేంకటమంత్రి శతకము.)

దివిబెలుంగు మెఱుంగుఁ • దీఁగెయటర్థంబు
తేట తెల్లంబు గాఁ • దెలియవలయు

గీ. నలఁతి తొలపడ్డ చంచమం • డలమువలన
జలజలను రాలునమృతంపు • జాల లీల
రసముతులకింప వలెనట్టి • రమ్యకవిత
రసికరసనా రిరంసచేఁ • బ్రబలకు న్నె.

ఇట్టి యాదర్శమును దనముందిడు కొనిన వాఁడగుట చేతనే సూరకవి యీప్రబంథమును గవిజనహృదయా వర్షకముగ నొనర్చి యన్వర్ణాభిధానముగఁ జేసి యున్నాడు. కథా సంవిధానమునఁ జెప్పఁబడిన చంద్రమతీ హరిశ్చం ద్రులయన్యోన్యా నుగాగ బీజము వారివారిచిత్రపటములను నొం డోరు లుపలక్షించుట చేతనే మొలకలెత్తిన వని చెప్పియు బ్రా హ్మణసం దేశమునుజొనిపియు" సంభావ్య విషయనిరూపణము గావించి, యిరువురు రాజ్యాధిపతులు వియ్యమందిన విధమునఁ జంద్రమతీ హరిశ్చంద్రుల వివాహమహోత్సవమును క్షత్రి యోచిత, మర్యాదల ననుసరించి మిగుల మనోహరముగ నభివర్ణిం చియున్నాడు. దృఢవ్రతుఁడను బాహ్మణుఁడు హరిశ్చం ద్రుని దరికి దూతగా వచ్చిన సందర్భమున... నాయతిథిని హరిశ్చం. ద్రుడు పూజించుటలో " వైదిక సంప్రదాయము ననుసరించి సం స్కృత భాషా మయముగ, నతిథి సత్కారవాక్యములనుగవియిట్లు

నడపియున్నాడు.

 
సీ. వరదనం తే: విప్ర పల్ల అగిమ సార్వ
భౌమ తుభ్యం సదా • భదమస్తు,
అతో పవిళ భవ , దాగమనం కుతో
విజయోస్పదపురాద్వి • వేకధుర్య
తవనామకిం ద్విజో.. త్తమ దృఢవత ఇతి
ప్రాహుర్మనీషిణః • పార్థి వేంద్ర
యుష్మ దాగమన ప • యోజనం కిం విప్ర
రహాసిన క్ష్యే ధరా రమణవర్య

గీ. యనుచు నన్యోన్య పరిభాష • లాడి పిదప
సముఖమందున్న యాశ్రిత • జనుల నెల్ల
వేఱక నేపంబుఁ గల్పించి వీడుకొల్పి
మంతనం బుండె వసుమతీ • కాంతుఁడపుడు.

.


బ్రాహ్మణ పూజయునందును నతిథిపూజయు యజ్ఞములే యనఁ జనును గాన (యజ్ =To worship) నట్టి యజ్ఞవిషయమున వికృతి భాష నుపయోగించుటకన్నఁ బవితమగు గీర్వాణభాష నుపయోగించిన నుచితతరముగా నుంచునని సకలాగమ సంప్రదాయాభిజ్ఞుండగు సూరకవి తలంచెనా యని యాలోచొంపవలసి యున్నది. వాగ్వోగవిద్దుషతి చాపశబ్దైరితి స్మృత్యనుమిత్య వమ్యమానోప సబ్దనిషేధోపి క్రతువిషయ ఏవ .................. ఆత ఏవ వ్యాకరణ మహా భాష్యేసర్వోప్యప శబ్దనిషేధఃక్రతు విషయ ఏవ నతు వ్యవహార విషయ ఇతి ప్రతిపాదితం. తత్తస్స్వదేశ భాషాభింజాన ధౌ రే స్మృత్యనుమిత్య వగమ్యమానోప శబ్దని షేధోపి క్రతువిషయ

. 114

యా:పండిత శశాంకాః నిశ్శంకాస్స్వదేశ భాషా కావ్య నిర్మాణే కేపిన ప్రవర్తంత ఏవ.

(ఆహోబిలపండితీయము. 89 పేజీ.)

అను నహాబల పండితుని ధోరణినిబట్టియు నాతం డుదాహరించిన మహాభాష్య ప్రమాణమును బట్టియు యజ్ఞ విషయముస దేశ భాషల నుపయోగించుట నిషిద్ధమని - తేలుచున్నది గదా ! ఇట్టి గంభీరమగు- సూరకవి యాశయమును బరిశీలించు వారికెల్లను .నాతనికి గల సంస్కృత వ్యాకరణ జ్ఞానమును నహో బలపండి తీభూదు లందలి పాండిత్యమును, వైదిక సంప్రదాయాభిజ్ఞతయు నుచితజ్ఞతయు విశదపడక మానవు.


ఇంక నితనికవితా విశేషములను గూర్చి కొంచెము చెప్ప వలసి యున్నది. సూరకవి కవిత్వము సంస్కృతపదభూ యిష్టమైమ్మ మృదుమధురమై ' యనర్గళ ధారకలదై 'కదళీపాకమున విరాజల్లుచు " కవితాత త్త్వంబు సూరకవికే తెలియు” అను నాతని సమ కాలికుల యభిప్రాయమును దృడీకరించు చున్నది. ఇతని కవితనుగూర్చి పండితులొసఁగిన యభిప్రాయముల నీదిగువఁబొందు ఱపచు చున్నాఁడను.

" అడిదము సూరన --ఇతఁడొక సుకుమారకవి.జనరంజనమను నొక చిన్న కాన్యమును రచియించిన వాడు.

దానిని పిల్లవసుచరిత్ర మని చెప్పుదురు. ఆడి తన పడసిన నామ ము సన్వథర్మము చేయుచున్నది. ”

--                             --                            --


బహుజనపల్లి సీతారామాచార్యులు వారు-(శబ్ధ రత్నాకరముపీఠిక .)

" ఇతఁడు. చేసిన గ్రంథములలో నెల్ల. జంద్రమతీపరిణయ మము నామాంతరము గల కవిజనరంజనము .మిక్కిలి మనోహర. మైనది. ఇది మూఁడాశ్వాసములు, గల చిన్న ప్రబంధమైనను, దీనియందలి .గుణసంపదను బట్టి పండితులు దీనిని. పిల్ల వసుచరిత్ర మని వాడుచున్నారు.

-- -- -- -- రావుబహదూరు కం. వీరేశ లింగము పంతులుగారు- (ఆంధ్రకవుల చరిత్రము 3 వ భాగము.).


« సరసకవిత్వవైభవ" అని యీకవి వ్రాసికొనిన బిరుదు సార్థకమలి యెన్ను చున్నారము • : ఇతఁడు రచించిన కవిజనరంజు నము చదివిన కొలఁది ధ్వనులీనుచు మాధుర్యముం ఇలికించు చున్నది. ఆ గ్రంథమన్ని విధముల వసుచరిత్రను బోలి కొన్ని చోట్ల మించి యెప్పుచుండుటచేతనే దాని కప్పటివారు పిల్లపసు చరిత్రమని పేరిడిరి. కవిత్వము హృద్యముగా నుండును. ధ్వనియే ప్రధానముగా సెంచి కావ్యగుణములకే భంగముఁ బొరలకుండ

గ్రంథములను రచించి , నలుగురౌనన - "బేరుబ్రతిష్ఠలఁ గాంచియీకవి మించెను. ఈతని కవిత్వమున నఱువది పాళ్ళు సంస్కృతమును నలువది పాళ్ళు తెనుఁగునుగలదు.


రాజా మంత్రిప్రగడ భుజంగ రావు బహద్దరు గారు-

(చంద్రాలోకమునకు ను పోద్ఘాతము.)

6. ఈతఁడనేక గ్రంథంబులు రచియించె. అందు జంద్రమతీపరిణయము లేక కవిజనరంజనమను నది ప్రబంధము. ఇదిప్రబంధమనఁదగి దాని రచియించిన కవి పేరు శాశ్వతమైభూమి యందుండు 'నల్గొన ర్చె. ”

గురజాడ శ్రీరామమూర్తివంతులుగారు-(కవిజీవితములు.)

".. - వసుచరిత్రములోని కల్పనములను గడపట్టులను ననుసరించి చెప్పిన వారిలో ముఖ్యుల గ్రంథములు పిల్ల వసుచరిత్రములని ప్రసిద్ధిని జెంది యున్నవి.అడిదము సూరకవి ప్రణీతమగు కవిజనరంజనములోనివర్ణణనములును సరసముగనే యున్నవి. కాని యిందుఁగథా భాగమేమియుఁ గానరాదు.


వజ్జల చినసీతారామస్వామి శాస్త్రి గారు - (వసుచరిత విమర్శనము .) కవిసంశయవిచ్ఛేదము:- ఇది మూఁడు : ప్రకరణముల లక్షణగంథము. ఇందలి ప్రకరణములకు దరంగములని పేరు.అందు మొదటి రెండు తరంగముల యందును గవి తనకుఁబూర్వముననున్న వ్యాకరణములలో లేని కొన్ని నూతనవిషయములను జేర్చి వానికి సూతములుగల్పించి లక్ష్యములను భారతాది గ్రంథముల నుండి చూపియున్నాడు. రెండవ "తరంగమునందు శకటరేషనిర్ణయమును గూర్చి కొంతవఱకును, మూఁడవ తరంగమునందుఁ దద్భవములు గలిగిన విధమును గూర్చి కొంతవిపులముగను వివరించి యున్నాడు. దీనియందుఁ దాను జేసిన నియమములను సూరకవి యిట్లు చెప్పియున్నాడు.


క. కవిజన సంజీవనిలోఁ
దవిలినపద్ధతులు మఱియి • తరలక్షణల
క్ష్యనిర్దిష్టగతులు చె
ప్పవలయునని వేఱయొక్క • పద్ధతి చేతన్ .

క. ప్రియమందఁగఁ గవులు కవి
త్రయనుకవిత్వాసరణి దప్పక కవిసం
శయవిచ్ఛేదంబను నా
హ్వయమిడి లకు ణ మొనర్తు • నార్యులు మెచ్చన్

,


భారతాదిగ్రంథముల యందు మహాకవులు ప్రయోగంచిన ప్రయోగములను సూరకవి లక్షణ. సమ్మతములుగా సాధింఛి యుదాహరించెను. అట్టివానిని గొన్నింటి నీదినువఁ జూపుచున్నాఁడను.

1. లక్షణము:-

గీ. ఇడఁగవచ్చును ల్యప్పుపై • నిత్వసంధి
మాత్ర మొక్కొక్కచోటను • మట్టుమీఱ
గొలుతు సమమడంపఁ • గోరిందు శేఖరు
నన్నయట్లు కవిజ • నామామతిని.

ప్రయోగము:--

1. క. ఇతఁడుమదీయ పురోహితుఁ డితనికిఁడగ నెల్ల పను లె • ఱింగించిపుడే,

(ఉద్యోగపర్వము ) 2. క. ....................... జమ్మి దెశంబ్రాకివిడిచి • చాపమునాకం రిమ్మనుడు. (విరాటపర్వము.)

3. సీ. దర్శించి యతనికేం •దగుదునో తగనొ య నించుకించుక సంళ • యింతురాత్మ. (నైషధము - శ్రీనాధుఁడు.).

4. చ. నిగి డిరువైపుల న్వెడల • నేటయినీటగు. వీటికోట. శుద్ధాంధ్ర రామాయణము. (అడిదము బాలభాన్కరుఁడు.)

ఇకారసంధి శ్రుతికటువుగా నుండునని ప్రాచీను లద్దాని సంగీకరింపరయిరి. అట్లయినను శృతికటువు కాని ఈ ఇకార సంధి దుష్టముకాదనియే వారి యాశయము. ".................................వా

రాతెలివెందునుం గలదె” (ఉద్యోగ పర్వము. 2 వరిశ్వాసము, 225 పద్యము) అని తిక్కయజ్వ ప్రయోగించి యున్నాఁడు. సామాన్యముగా ఇకారము నకుఁ దాలవ్యాచ్చు పరమగునపుడు సంధిశ్రుతి హితముగానే యుండును. . (ఇకార సంధి' దుష్టమను : నిబంధనమునకు, అకారాదిపర కే కార సంధియే దుష్టమనియెన్నఁ దగును. ఆలోచింపఁగా, క్వార్థ కేకార సంధీని షేధమునుదాలవ్య స్వర పరకస్థలముల యందుఁగాదని మహాకవు లభిప్రాయపడినట్లు స్ఫురించుచున్నది. ఇట్టి భాషాతత్త్వమును గను పెట్టియు -మహా కవుల ప్రయోగరహస్యములఁ గను పెట్టియు దానినే యనుసరిం చియున్న సమర్థుఁడగుసూరకవి క్త్వార్థక సంధివిషయమున నట్టి వ్యవస్థ నేర్పఱచి శృతిహితములును మహాకవి ప్రయుక్తములు నునగు నికారపరకక్యార్థక సంధులనే యుదాహరించియున్నాడు..

2. లక్షణము


గీ.కర్మధారయంబు గావించు చోటను
నూది పలకవచ్చు నొక్కచోట
స్ఫుటకృపా నిభూతిఁ బొలుచున్ శివుఁడుమాకు
సభిమతీర్థ మిచ్చు • నన్నయట్లు.

ప్రయోగము:-
శా. ..........................................................................చె
ల్వారున్రాముడు ప్రోచు గాతచిక తిమ్మాధీశుతిమ్మాధివున్న్.

(కవులవృష్టము. )

.

మన ఆంధ్రశబ్దచింతామణి యందలీ "నుమ్చోతః' అను సూ తమును బట్టి, యుదంత స్త్రీసమాదులకుఁ 'బరుషసరళములు పర మగునపుకు ద్రు తాగమము నిత్యముగా వచ్చునని తేలుచున్నది., ఈయభిప్రాయమునే ఈ బాలవ్యాకరణములో సంధిపరిచ్ఛేదము లోని యిరువదియైదవ 'సూత్రము విశదీకరించు చున్నది. కాని, ఉకారాంతములగు ధాతుజవిశేషణములు స్త్రీ సమములు కాకుం డటను. జేసి వానికీయాగమము రాదనియే ప్రాచీనా ధునాతనవై, యాకరణుల యభిప్రాయము. ఆ బాలవ్యాకరణము లోని సమా : సపరిచ్ఛేదమునందలి యేడవ సూతమున స్త్రీసమశబ్దమును జెప్పి, యు, మరల ధాతుజవిశేషణ పదమును గ్రహించుటయే, ధాతు, జవి శేషణములు : స్త్రీసమములు కానేరవన్న సిద్ధాంతమును వెల్ల డించుచున్నది. లోక వ్యవహారమునందును. మహాకవి వ్యవహార మునందును ధాతుజవి శేషణములకుఁ బరుషసరళములుపరముల గునపుకు దు తాగమము లేకుండుటయే తఱచు గానఁబడుచు న్నది. అట్లయినను కొన్ని చోట్ల మహాకవి ప్రయోగములలో ధాతుజవి శేషణములకుఁ బరుషసరళములు పరములగున పుడు ద్రు తాగమము వచ్చుట లేక పోలేదు.


  • సమాసంబుల నుదంతం బులగు స్త్రీ సమంబులకుం బుంపులకుం బరుష

సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు..

1 కర్మధారయంబు త్రిక, స్త్రీసమ, ముగంత, ధాతుజవిశేషణ పూర్వ పదంబయి యుండు..

,

 మ. పలుకుం దొయ్యలిమాళి, కాంతి కెనయా, బాగాలునయ్యింతి చె
క్కులఁ బోలు, దెల నాకులు ........................ . ,

పాండురంగ మాహాత్మ్య ము 1 అ|| తెనాలి రామకృష్ణకవి.)

అట్లు వచ్చినప్పుడట్టిచోట్ల, క్వాచిత్కముగా ద్రుతాగమ మువచ్చునని సూత్రించుట యే యుచితమై యుండును. " అని యిప్పటి వైయాకరణు లంగీకరింపక యట్టి స్థలముల యందలివి ధాతుజుని శేషణములు గావనియు నవి దేశ్యములగు స్త్రీసమళబ్ద ములయి వేఱుగానున్న వనియు సిద్ధాంతీకరించు చున్నారు. కాని సూరకవి మాత్ర మట్ల భిప్రాయపడక, సహజముగాఁ గొన్ని యె డల నట్లు ధాతుజవి శేషణములకు సహితము పరుషసరళేతరములు పరములగునపుడును, క్వాచిత్కముగా ద్రుతాగమము గలదని యుదాహరించి యున్నాడు.

3. లక్షణము;.

 గీ. ధరఋకారాంతశబ్దంబు • ద్వంద్వమైన '
రేఫయగుచుఁరవర్తిల్లు • దృఢముగాను
పత్రి వరహయ వాగ్వధూ - నేత ముఖసు
రాభి వందిత పాదాబ్జ • యన్నయట్లు.

ప్రయోగము.

 ఉ............. .........................................................రామమాం
ధాతృరఘడీ తీశులుము • డంబునఁ గాచి రె యే యుగంబునన్ ,

(ఆ. పర్వము .]

. 16 ఈయభిప్రాయమునే బాలవ్యాకరణములో సమాసపరి చ్చేదములోని యిరువదినాల్గవ సూత్రము (ద్వంద్వంబునందు ఋకారంబునకు 'రవణంబు విభాషనగు) విశదీకరించుచున్నది. : బాలవ్యాకరణ గుస్తార్థ ప్రకాశికలో సీసూత్రము క్రింది నీయఁ బడిన వ్యాఖ్యానములోని కొన్ని పంక్తుల నిచట నుదాహరించుచు న్నాఁడను.


మీఁది పద్యమునందు " మాంధాతృరఘు "తీశులు అనిన ద్వంద్వంబునందు మాంధాతృశబ్దంబు 'రేఫా దేశయు కర బై భారతంబునందున్నట్టు లెంచి యడిదము సూరకవి ( గీ. ధ' ఋకారాంత .............. .యన్నట్లు ” కవి సం—ప్రథమ. 28 ల. అను పద్య లక్షణమునకు లక్ష్యంబుగాఁ జూ పెను. అప్ప - కవిపయి పద్యచతుర్థ పాదంబునందు. మాంధాతృశబ్దంబు భారతరచనా సమయంబున ఋకారాంతముగానె రచియింపఁబడినదని యెంచి రేఫక్లిష్టమైన యకురంబులకు రేఫశ్లిష్టంబు గాని యక్షరంబు ప్రాసంబుగా నుండవచ్చునన్న దానికిఁ బయిపద్యం బుదా హరణం.. గా నిరూపించెను. కొన్ని ప్రాచీన భారత పుస్తకములయందు రేఫయు క్తంబుగాను, 'మణికొన్నిటి యందు రేఫవిరహి తంబుగాను మాంధాతృశబ్ద ముండవచ్చును. కావునఁ బూర్వో క్తకవులిద్దఱును నుభయవిధంబుగా నభిప్రాయపడిరి. శాస్త్రం బున మాంధాతృరఘుక్షితీశులు' అన్న ద్వ ద్వంబులో రఘుక్షితీశ శబ్దంబు నసూసచరనూవయవంబు (కడపటి పదంబు) కాన

దానికిఁ బూర్వంబునందున్న మాంధాతృశబ్దంబునకు రేఫాదేశంబురావచ్చును. ” (పేజీ -200.)

4. తదృవపదలక్షణము:

 గీ. ద్విశ్వవర్ణంబు లకును "మీదిదియ యొండె
గ్రిందిదియ యొండెఁ దొలఁగును • జెందుడుమువు
లొక్కకొన్ని పదంబుల • కుగగభూష
కలుగు బంధుత తటవర్గ • ములకు శర్వ.


క. ఋత్వమునకు నిత్వమునకు
నేత్వముసిద్దించు నోత్వ • మెనయును సుత్వం
ఔత్వమునకు నోత్వంబగు
నైత్వం బేత్వమగు నుమళ రాననమధనా

...


సూరకవి యేలకో లక్షణమును జెప్పుచు లక్షణ భాగమును దేటగీతిలోను లక్ష్యభాగమును ఆఁట నెలదిలోను నొకేపద్య మున వాసియున్నాడు. మీఁద నీయఁబడిన ( ఇడఁగవచ్చును ల్యప్పు పై నిత్వసంధి అను. పద్యమే దీనికి చార్కాణము.ఇ దెంతయు వింతగాఁ జూపట్టుచున్నది. " సూరకవియుఁ గూచిమంచి తిమ్మకవియు సమకాలికులు గాంగనఁబడు చున్నారు. ఆ కారణముచేతఁ గవిసంశయ విచ్చేదమును సర్వలక్షణ సారసంగ్రహమును ' నొకే కాలమునఁబుట్టిన లక్షణ గ్రంథములని చెప్పవ లెను. తిమ్మకవి గ్రంథము - సూరకవి గ్రంథముకంటె నిస్సంశయముగ విపులతరమగు గ్రంథమని చె ప్పవలసి యున్నది...... . . 3.చంద్రాలోకము:- ఇది యొకయలంకారశాస్త్రము. దీనిని బీయూషవర్ష బిరుదాంకితుఁడగు జయ దేవమహాకవిసంస్కృ తమున రచియించెను. ఇందలి భాగములకు మయూఖములని పేరు. అవిపది. అందు నైదవ మయూఖములోని యథాకాలం కారములను నూటిని దీసికొని సూరకవి తెనిఁగించెను. సంస్కృ తచంద్రాలోక కతౄత్వము నేలకో .సూరకవి కాళిదాసున కా రోపించుచు నిటొక పద్యమును జెప్పి యున్నాఁడు.

గీ. బాలురకు నైనఁ దెలియంగం • గాళిదాసు
షునురచించెఁ జందాలోక • మునుద్రిలింగ
భాషజేసితి నీకృప • భవ్యముగను
దీనిఁ గరుణించి కై కొమ్ము • దేవ దేవ,


ఈవిషయమున సూరకవి పొరపాటు పడెనని చెప్పకతప్ప దు. ఏలయనఁ జంద్రాలోకమను దానినిఁ గాళిదాసురచించినట్టు గానీ యట్టి ప్రచారమున నున్నట్టు గాని తెలియరాదయ్యెను. ఒకప్పుడు సూరకవికి దొరకిన సంస్కృతగ్రంధమున ( కాళిదా సకృత చంద్రాలోకమని ఆ యుండిన నుండవచ్చును. ఆ వ్రాత యందలి యథార్థమును బరిశీలింప నవసరము లేదనుకొని సూర కవి యీతీరునఁ బొరపడియుండిన నుండవచ్చును. ఈ రీతిగ భ్ర మపడిన వారింకొకరగపడు చున్నారు. వారు వురాణనామచంద్రికను వ్రాసిన యెనమండ్రం వేంకటరామయ్యగారు. ఆయన తమ గ్రంథములో నిట్లు వ్రాసి యున్నారు: --చంద్రాలోకము—ఒక యలంకార శాస్త్రము. ఇది కాళి దాసకృతము. (పు! నా!! చం| 67 వ పేజీ.)

ప్రకృతమున నీయాంధ్రచంద్రాలోకమునకు మాతృక యేదియో తేలవలసి యున్నది. పరిశీలించి చూడఁగా సూరకవి జయ దేవ కృతమగు చంద్రాలోకములోని ' యథార్థాలంకార , మయూఖమునే తెనిఁగించినట్టుగఁ గనఁబడుచున్నది. కానిశ్రీయుత అక్కిరాజు ఉమాకాంతముగారభిప్రాయ' 'పడిన ట్లప్పయ దీక్షి తుల వారి కువలయానందకారికలను . దెనిఁగింప లేదు. ఉమాకాంతముగారు తమ యాంధ్రచంద్రాలోక వీఠిక లో తన నాదరించిన వేంకటపతిరాయలను దీక్షితుఁడు శతాలంకారము లలోఁ జివరదియైన హేత్వలంకారము యొక్క లక్ష్యమునందు "స్మరించెను. ఆ లక్ష్యమిది. ( లక్ష్మీ విలాసావిదుపొం కటాయో వేంకటప్రభో! ” సూరకవి యీలక్యుమునే.

గీ. కార్య కారణములకు నై• క్యమగు నేని
గృతులఁగొందటు' హేత్వలం • కృతియయండ్రు
సత్కవులకున్ రమావిలా , సములువేంక
టేశ్వకకటాక్షములనంగ • నిందుమౌళి.


అని యాంధ్రీకరించెను. .కనుక సూరకవి కువలయానంద కారికలనే యాంధ్రీకరిం చెనని, శశవిషాణప్రాయమైన 'కాళిదాసకృత చంద్రాలోకమును గాని జయ దేవుని చంద్రాలోకమును గాని యాంధ్రీకరింప లేదని స్పష్టమయినది” అని వానిసి యున్నారు.

కాని యిందును బొరపాటులు గలవు. 'లక్ష్మీ విలాసా విదుషాం కటాక్షా వేంకట ప్రభో?! అనుదీనియందలి (వేంకట ప్రభో!' అను దాని బట్టి దీక్షితుల వారు తమ పోషకులను స్మరించిరనివ్రాసిరి కాని యియ్య ది జయ దేవ , కృతచంద్రాలోకముననే కాన వచ్చుచుండుట చేత సుమాకాంతముగారి యూహ సరికాదని చెప్పవలెను. ఇచ్చటి వేంకటప్రభు శబ్దమును- దైవపరముగాఁ దీసికొనవలెను. గాని ప్రభుపరముగా ముడి వేయరాదు. కాబట్టి సూరకవి యాంధ్రీకరణమునకు జయ దేవుని గ్రంథమే మూల మని తలఁపవలెను.

సూరకవి యాంధ్రీకరణము సంస్కృత చందాలోకము నకుఁ జూలవఱకు దగ్గఱగనే యున్నది. అప్పయ దీక్షితుల వారి గ్రంథసహాయము నితఁడ పేక్షింపక పోలేదు. అవసరమగు పట్లగువలయానందములోని విషయముల నితఁడు గ్రహించి వాడు కొనెను. మొత్తము మీఁద సురకవి యాంధ్రీకరణము సరసముగను, ఉపయోగ రముగను నున్నది. ఉదాహణము కయి కొన్ని శ్లోకములను, పద్యములను నిచటఁ జూపు చున్నాఁడను.


శ్లో ఈపమా యత సాదృశ్య | లక్ష్మీరుల్ల పతిద్వయోః |
హంసీవ కృష్ణతేకీర్తి | స్సవంగా మవ గాహ తే || :
వక్ష్యో సమాన ధర్మాణా | ముపమా వాచక స్యచ |
ఏకద్విత్యు " ను పాదానా ! ద్భిన్నా లుప్తోపమాష్టధా ||

గీ వర్ణ్యముపమాన ముపమాన వాచకము స
'మానధర్మము సంఘటిం • పనగునుపమ ;

 హంసిచందాన నీకీర్తి • యబ్జనాభ :
యభగంగా వ గాహనం • బాచరించు.

(మిది రెండు శ్లో: ములలోని లక్షణము లనుండి పూర్ణోపపమ
లక్షణమును గ్రహించి మూలములో నిలక్ష్యమునేయిచ్చినాడు.);


{3 శ్లో| చేద్బింబ ప్రతిబింబత్వం | దృష్టాంత సదలంకృతిః ||
త్య మేవ కీ ర్తిచూన్రాజ | న్విధు రేవహి కాంతిమాన్ ||


క.కృతి బిం ప్రతిబింబా
దగ దృష్టాంతమగుసు • నృపనీవసము
న్న : సమన్వితుఁడవు
సీతకి” " కాంతియుతుఁడు •క్షితినను పాల్కిన్.

(ఈ పద్యము మూలమునకు సరిగనున్నది.)


(3) శ్లో. ప్రశ్నోత్తరాంత రాభిన్న | ము స్తరం చిత్రముత్తరం!
కేదా రపోషణరతాః | కే ఫేటా కించలంవయః ||


క. షరగఁ గృతులం దుఁ బ్రశ్నో
త్తరమస గనలం. కియా వ • తం సముప్రశ్నో
త్తరములో కటయిన, నెద్దీ
శ రవాహన మః గసరస • సమ్మతమగుచున్

ఇచ్చట మూలములోని లక్షణమును మాత్రము గ్రహించి లక్ష్యము నాంధ్రీ కరించుట దుస్సాధ్యమగుటచేత 'వేఱొకటి పొందుపఱచెసు.

ఇట్టిరీతులనే దీనిని తెనిఁగించుటలో గవి యనుసరించెను.

4. శ్రీరామదండకము:-

సూరకవి యించుఁదనయుభయాభాషా పాండిత్యమును వెల్లడించుచు రామాయణ కథను సంక్షేప్తముగా వర్ణించి యున్నాడు. ఇందలి కవితాధోరణిని దెల్పుటకయి గొంతభాగము నిచట నుదాహరించు చున్నాఁడను.


". .....మాయాకురంగాకృతిన్ రావణ సేరితుండొచు మారీచుఁ డేతే ర సీతా ప్రయత్నంబునన్దజ్జి ఘృక్షాచురాయత్త చిత్తుండవై నీవు బోవ స్టశాన్యుం డు సీతాసతింగొందు లంకాపురింజేర నీవంత మారీచు దున్నాడి తత్పర్ణశాలా స మీపంబునంజానకిగాన కార్తి న్శరారు ల్తరణ్యంశు జూలాశరణ్యం బరణ్యం బగణ్యంబు లేవేళల న్వ్యాళ శార్దూలగుండాలముల్ హాతటిద్గాత్రి హా మానసొహ్లాదసంధాత్రి హా ప్రేయసి క్వాసి యచాయరణ్యాని నీవాధశణ్యాత్మజ ంవెన్కుచున్ రావణోత్కృత్త కాయు న్జటాయున్ని రీక్షించి నీచాక బంధున్బడంజెండి లోకై కబంధుండ వై పొల్చియిందింది గా జీవ రాజీవరాజీ వరామోదసంపాది పంపొసరనీ రదేశంబున నైతిలో మైతి గావించి వాలిన్మహా సత్వశాలి నముచ్చండ కొండా హతి ఎండవే చండ వేదండము వొండు పంచాస్యమన్బోలి నీకంతట న్భానుమత్సూనునిగేళ భదాసనాసీనుని వేసిన న్బాసటై భూనుతాన్వేషణార్థంబు శాఖామృగాధీశుల స్బంపు వేళ స్మహావేగవంతున్ హనూమంతు సర్దక్షిణాళాప్రదేశంబు వెన్క నియోగించినన్వాయుసూనుండు భూభృత్సదృక్కర, టాళీడులీఢాకి తాళంక షాదభవీ చీసమాచీనవారాన్నిధిజెంగున ఛాటి లంకాపురోద్యానమధ్యంబునన్దూర నక్తంచరీచంచరీకాలోపేర సీతన్నిరీక్షించి ప్రాంతారవింబోలి సీతారవిందాస్య చేతోరవిందంబు నానంద మొందించి యంతనృతోద్యాననిద్రావణుండౌచుక్షేశాకరాళననోగాహవాహంయు నక్తంర్ల్గొల్వ నక్షాదిరక్షోబలాధ్యక్షులే తెంచి యుద్వృత్తి మైహత్తిదండెత్తినన్బిండీపిండై సముత్తుంగ మాతంగములుగును గైతురంగంబులు ధైక్కు చెక్కై శతాంగం బులున్నుజ్జునుజ్జై భటాగంబులు న్నేలపై

గూల లీలఁ దత్సేన్య ముద్ధూత చైతన్యము వేసి యు ద్వేలకోలాహలాభీల హే లాసము ? సిమై యస్ ని ఎండు చెండాడి తైయకు వీజే శుశు క్షుణ్య పేక్షు కృ దుగా ఆ వాలాగ బద్ధాంశుక ప్రస్ఫుర ద్విస్ఫులింగచ్ఛటాభీలకీలా, కరాణాగ్ని లంకాపు రా గారము ల్భస్మ సా త్కారము ల్పేసి వేళంతమున్బోలె తానాసరస్వత తము నాటి నిన్గాంచి లం కాపురో ద్యాన మధ్య స్థితాం దానవీ సంవృతాం ల్వేద్వి యోగ వ్యధా క్లిష్ట గాతీం విదేహేందపుతీ మపశ్యం" రఘూత్తంస యంచు న్సుధామాధురీశ్రీ ధురీలో కుల న్విన్న వింపంగ .....


5. ఆంధ్రనామ శేషము: ఇది పద్యరూపమున నున్న యొక నిమంటువు. పైడిపాటి లక్ష్ముణకవి కృతమగు నాంధ్రనామ సంగ్హాహమునందు లేని పదములను జేర్చి. యోనిఘంటువును సూరకవి రచియించినాఁడు. ఆవిషయమునే 'యతడీ గ్రంధా రం భమున నిట్లు చెప్పి యున్నాఁడు.


గీ. ఆంధ్ర నామసంగ్ర హమునందు. జెప్పని
యన్ని తెనుఁగు మఱుఁగు లరసికూర్చి
యాంధ్ర నామ శేష మను పేరఁ జెప్పెద :
దీనిఁ జిత్తగింపు దేవ దేవ


ఆంధ్రపదజాలము నొకచోట, నేర్చి కూర్చి వివిధ వర్గులు గా విభాగించి గ్రంథముగాఁ జేయుటయేమిగులఁ గష్టమగుఫని. అట్టి ఘన కార్య మొక రొనర్చిన పిదప దానియందలి విశిష్ట భాగ ములఁ బూరించుట మఱియుఁ గష్టము. ఈ కార్యమును సూర కవి కడు శ్లాఘనీయముగ జేసి యాంధ్రుల కృతజ్ఞతకు బాత్రు 17

డయ్యెను. ఆంధ్రనామసంగ్రహము వలె.నీశేషముకూడఁ జాలనుపయోగకరమైన నిఘంటువుగాఁ బరిగణింపఁబడి, యాంధ్రులచేఁబరింపఁ బడుచున్నది. ఇట్టి గ్రంథములు ప్రాయికముగఁగవుల కవితాధోరణిని జూపనవకాశ మియ్య నట్టివి. అయినను సూరకవి కవితా ప్రవాహము మాత్రమట్లు మిక్కిలి పరిణామముమెందక దీనియందును, నిరాఘాటముగా వెలయుచు నే యుస్నదనుటకు నీ క్రింది రెండుపద్యములను బొందుపఱచు చున్నాఁడను.


తే, పెంపుఁ జెందెను, దామర • తంపరయ్యేం
బబలె, సెగ డెను,గొనసాగే • బలి సెఁ బెరిఁ?
ననఁగఁరేకేత్తె ననఁగఁచే ళ్ళయ్యేవృద్ధి
బొందెననుటకు శేషాహి " భూషి తాంగ.

తే, అగపడకపోయె,విచ్చు మొగ్గయ్యె, ననఁగఁ
గంటఁ బడఁడయ్యె: బంచబం • గాళమయ్యె
ననఁగ దృగగోచరంబయ్యె • ననుట పేళ్ళు
శయఘటితశూల ! నైయామ • చర్మ చేల !

రానులిం గేశ శతకము:-

సూరకవి గ్రంథములలో నెల్లమిగుల జనరంజకమైనదియు, నతనికాలమున నే పలువురచే నాదరింపఁబడినదియు నగు నీశతకము క్రీస్తుశకము 1770-1785 సం వత్సరముల మధ్య కాలమున రచింపఁబడినదని యూహించుట కుదగిన యాధారములున్నవి. శ్రీవిజయనగర - ప్రభువులును కవికి నాశ్రయులునునగు శ్రీచినవిజయ రామరామ గజపతి మహారాజు

లుంగారి రాజ్యకాలమున దివానుగా నుండిన సీతారామరాజు చండశాసనత్వమును, దద్వారమున దేశమునకుఁ గలిగిన ప్రజాపీడయు, నాఁటి సాంఘిక స్థితియు, రాజకీయ స్థితియు నిందు నన్యాపదేశముగ వెల్లడించుటయే కవి ముఖ్యాభిప్రాయమైనట్టు గ దీనిఁజదివిన వారికిఁ దప్పక స్ఫురింపక మానదు. సీతారామ రాజుగారు 'పెట్టిన బాధలే యీగంథము కవి వ్రాయుటకుఁగా రణమని యాంధ్ర కవుల చరిత్రమిట్లు నుడువుచున్నది.


సీతారామరాజు గారిట్లు పరరాజులను జయించుటయేకాక తురక దొరలు మసీదులకిచ్చిన భూములను, పూర్వ రాజులు బాహ్మణుల కిచ్చిన మాన్యములను గూడ లాగుకొని ప్రజలను సహితము క్షోభ పెట్ట నారంభించెను. ఈయన పెట్టుబాధలే సూ రకవిని రామలింగేశశతకముచేయునట్లు చేసినవి. ” ఈ యూహ సరియైనను గావచ్చును. - కొని ,యాకాలపు విజయనగర రాజ్య వ్యవస్థకును బాగుగ గమనించి చూచినచో సీతారామరాజుగారి చండశాసనత్వమును, పరిపాలనా ప్రావీణ్యమును, రాజనీతి వైదుష్యమును నీ పూసపాటి రాజ్యమును గొప్పయాన్నత్యము నకుఁ దెచ్చుటకుఁ గారణములయినవని చెప్పితీరవలెను. విజయ నగరము వారికిఁ బక్కలోని బల్లెములవలె నుండిన ప్రబలులగు గాజులను మన్నె రాజులను జయించి రాజ్యమును విస్తరింపఁజేసి నదీ సీతారామరాజుగారే. సులభముగ లొంగుపాటులోనికి రాని జమీదారులకు దమ చాకచక్యను. చేఁ బట్టి తెచ్చి విజయనగ గా రాగృహబద్ధులుగం జేసెడివారు. ఇప్పుడీ పట్టణమునఁ గోటను నెదుటనున్న '( బొంకులదిబ్బ.' ,యను బయలు 'నాఁడు రమునఁ గా “ బంకూల్, "-అనఁగా జైలుఖానా. యుండినస్థలమని యూహింపవచ్చును. బంకూల్' శబ్దవికారమే బొ.కులయినది. ఆకారాగారము శిధిల మైసశింప నాస్థలమును జనులు బంకూల్ దిబ్బయనెడివారు. అదియే రానురాను బొంకులదిబ్బయైనదని నిశ్చ యముగా మనము చెప్పవచ్చును.

పూసపాటి వారి కైఫీదు, డిస్ట్రిక్టుమ్యాన్యూల్, డిస్ట్రిక్టుగెజటీయరు మొదలగు గ్రంథముల యందు నీయఁబడిన యానాఁటి వృత్తాంతమును జూచినపుడు సీతారామరాజు గారి క్రౌర్య ము, నిరంకుశాధికారము మున్నగునవి వెల్లడియగును. కాని “యప్పటి యవసరమును బట్టి, యాతఁడా రీతిగఁ జేయపలసివచ్చె'నని దృఢముగఁ జెప్పవచ్చును.


నూతన రాజ్య నిర్మాణమునఁ గలుగు కష్టములను న్యాయబుద్ధితో సరయఁ బయత్నింపని వారలీ సీతారామరాజుగారి పరిపాలనా విధానములను నిందింపవచ్చును. ఇల్లు నేఁ జెప్పఁ బూనినను సీతారామరాజుగారి యందెట్టి లోపములును లేవనిచూప నేనుద్యమింప లేదు. సూరకవి బలవత్తరమగు నీ దూషణ గర్భ కావ్యము {Satire) నిహేతుకముగ వ్రా సెనని నాయభి ప్రాయమెంత మాత్రముగాదు. తగిన కారణములుండిన నుండ వచ్చును. ఏది. యెట్లున్నను నీశతకము పండిత పామర జనరంజకమై యాంధ్ర వాజ్మయమునఁ గల శతక రాజములలో నుత్తమ స్థానమధిష్టించి యున్నది. కవితా ధోరణిని తెలుపఁ గొన్ని పద్యములిచటఁ బొందుపంచు చున్నాఁడను.

 సీ. మాన్యంబు లీయ సమర్థుఁ డొక్కఁడు లేఁడు
మాన్యము , ల్చెక్కుప. సా. మంతులంద
ఱెండినయూళ్ళగో డెఱింగింపఁ డెవ్వఁడుఁ
బండినయూ ళ్ళెన్న బౌండులంద
తితఁడు పేద యటంచు , నెఱిఁగింపఁ డెవ్వఁడుఁ
గలవానిసిరి యెంచఁ గలగు చాలం
దనయాలి చీకటి , తప్పెన్న -డెవ్వఁడుఁ
బెఱకాంత ఱం కెన్నఁ బెద్దలంద


తే. ఱిట్టిదుష్టుల కధికార • మిచ్చినట్టి
రాజు నునివలేఁగాక ర్నయుల ననఁగ
నేమ సని యున్నయి.సత్కవీంద్రులకును
రామలింగేశ రామచం • ద్రపురవాస.


సీ. పదుగురుఁ గోతి వెం • బడి సంచరింపరే
వాహకు ల్లేరెశ • నంబునకును
గంగి రెద్దుకు లేనే మనతూర్యరావముల్
కలిమి గల్గదె ది వార కామినులకు
బులి. గోవుఁ జంపి ననక్కలను బోషింపదే
స్థూల కాయము లేదె దున్నలకును
పి, ఫుఁటికి లేదె • పుట్టంబుఁ జుట్టుట
వేణుధరుం డెద్దు వెంట రాడె


న్యాపద్దతి నడువని యవని పతికి
నెన్ని చిన్నెలు గలిగిన నెందుకొఱకు
సంతమున జు-డవలయు, నా యయ్య సుఖము
రామలింగేశ రామచం • ద్రపురవాస.

సీ. భయ మేల కొండంత , పగతుఁడు నాకున్న
మేరువు వంచిన మేటి గలుగ
నాకేల శోకసం తాపంబునను గుంద
శీతాంశుమాళి 'నా చెంత నిలవం
దస్కరభీతికిఁ • దల్లడిల్లఁగ నేల
ప్రమధులతో శూల • పాణినిలువ
నగ్ని భీతికి నాకు • నళుకుఁ జెందఁగ నేల
గంగాధరుండు నాకడ వసింప


తే. ననుచు నెంతటి కేంతటి • కలుకు లేక
నమ్మియుంటిని నీ ప్రాపు • నామనమున
జాగరూకుఁడవై నన్ను • సాకు మయ్య:
రామలింగేశ రామచంద్రపురవాస.

పరిసమాప్తి.


ఇంతదనుక" సూరకవి గ్రంథముల నొక్కొక్క దానిని బ్ర త్యేకముగఁ దీసికొని నాకుఁదోచిన విధమున విమర్శనముఁ గావించితిని. ఇక నొక్కయంశము చర్చింపవలసి యున్నది. తనకుఁ బూర్వులగు కవులనుసరించిన మార్గములనే యితఁడను సరించెనా, లేక కొత్తతోవల నవలంబించెనా యన్న సంగతి పరిశీలింప వలసియున్నది. ప్రథమాంధ్ర కవియు వాగనుశాస నుఁడును నగు నన్నయభట్టు మహాభారతమున :


ఉ. సారమతిం గవీంద్రులు ప్రసన్నకథా కవితార్థయు క్తితో
"నారసి మేలునా నితరు లక్షరరమ్యత నాదరింప".

అని వాసియున్నాడు. దీనినిబట్టి సారమతులగు కవీంద్రులు, అక్షర రమ్యతనాదరింపరని తేలుచున్నది. ఇంతియె గాక తాను "నానారుచిరార్థసూక్తినిధి"యని చెప్పుకొనియెను. కాఁబట్టి ప్రశంసనీయమగు కావ్యమునందుఁ బ్రసన్నమగు కథయు, ప్రసన్నమగు కవితయు, నర్థయుక్తియు నుండవలెనని యామహాకవి యభిప్రాయము. అంతియె గాని యాలంకారిక గ్రంథముల యందుఁజెప్పఁబడిన విశేషగుణముల నన్నింటిని బ్రధానముగఁ జెప్పలేదు. కవి బ్రహ్మయగు తిక్కన తన నిర్వచనోత్తరరామాయణమున

ఉ. భూరివివేక చిత్తులకుఁ ◆ బోలు ననం దలఁపన్ దళంబులన్
     సౌరభ మిచ్చుగంధవహు ◆ చందమునం బ్రకటంబుచేసి యిం
     పారెడుపల్కులం బడయ ◆ నప్పలుకు ల్సరిగ్రుచ్చునట్లుగాఁ
     జేరుప నేరఁగా వలయుఁ ◆ జేసెద నేఁ గృతి యన్నవారికిన్.

క. తెలుగుకవిత్వము చెప్పం
     దలఁచినకవి యర్థమునకుఁ ◆ దగియుండెడు మా
     టలు గొని వళులుం బ్రాసం
     బులు నిలువక యొగిని బులిమి ◆ పుచ్చుట చదురే.

యని వాసియున్నాడు. ఇందువలన, శబ్దములను జక్కగఁగూర్చుటయు, యతిప్రాసములకొర కర్థగౌరవమును జెఱుపకుండుటయు సత్కవీంద్రమార్గమని తెలియుచున్నది. మఱియుఁ దనకవిత్వము (సరసమధురవచోగుంభనసుప్రసాదసంబోధన గోచరబహువిధార్థతాత్పర్యము" కలిగి యుండునని కూడఁ జెప్పియున్నాడు. దీనం బట్టి చూడ నక్షరరమ్యతయు, నర్థగౌరవమును సత్కవీంద్రసమ్మతమనియే తేలుచున్నది. నన్నయకాలమున నక్షరరమ్యత కంతయాదరము లేక పోయినను దిక్కన

నాటికి గొంతవఱకుఁ గలిగినదని యూహింపవచ్చును. మొత్తము మీఁద నాంధ్రమహాభారత కవులు శబ్దాలంకారములకు - నంత గఁబ్రాముఖ్యము నిచ్చి యుండ లేదని వారి కవిత్వము వలస స్పష్టమగుచున్నది.


కొంతకాలమునకుఁ బిమ్మట నాంధ్ర భాగవత కృతికర్థ యగు బమ్మెర పోతనామాత్యుడు తన గ్రంధము, శబ్దాలం కారములను విరివిగా జొనిపి నట్టి కవితను సత్కవీంద్రనాదజరణీయ ముగఁ జేసినాడు. పిదపవచ్చిన యాంధ్ర కవితా పితామహుఁ డగు నల్లసాని పెద్దనార్యుడు తాను రచియించి సింహవనలో కనమను ” నుత్పలమాలిక యంచుఁ గవిత్వరీతులెట్లుండవలెనో చెప్పియున్నాఁడు. ఆపద్యమును. బూర్తిగ నిచట నుదాహరిం పనసకాశము లేక యందలి సౌంశమును జెప్పుచున్నాడను. కవిత్వము మెఱుగుగలిగి -రుచికరమయి, మనస్సు నాకాక్షించు శక్తిగలదియై, కిన్నెరస్వరము వలె -మనమును బర వశత్వమునొం దించి వింశలగు కోర్కెలను "బుట్టింప దగిన, గమకముతో రస మును విరజల్లుచుండ వలెను. ఇట్టియాదర్శమును బెద్దనార్యుం డు ప్రదర్శించినను, "పూలు మెంఱుంగులన్ " అనెడి మాలిక ను జూచినప్పుడుశ్రవణ సుఖమునకు నర్థగౌరవముతో సనూ నమగు ప్రాధాన్యము నతఁడం గీకరించి నట్లగపడును. అంతియే గాక యాతడు శ్రావ్యతకు బక్షపాతము చూపెసని కూడదోచును

పెద్దనామాత్యుడు శశాబ్ద ప్రారంభమునను నాంధ్రకవిత్వమునకొక విధమగు క్షీణ దశ


27


పొడసూప 'మొదలు పెట్టెను. ఆ సమయమున నే సూరకవి గ్రంథ రచన కారంభించెను. పెద్దనగారి యుత్పలమాలిక యందలి విష యముల నతఁడు చక్కగఁ బరిశీలించెనని మాకుటుంబమునందు నిలిచి యున్న సూరకవిగారి నాఁటి తాళపత గ్రంథములను బరీక్షించినఁ దెలియఁగలదు. నన్నయ తిక్కనాదుల కవిత్వమునం దాతనిఁకిగల గౌరవమత్యధికము, 'పెద్దనామాత్యుని శ్రావ్య తాపక్ష పాత మతము నతఁడవలబింపక నన్నయాదుల మార్గ మునే ప్రశస్తమని యెన్ని నట్టులు సూరకవిదియగు నీకిందిపద్య మువలన విశదమగుచున్నది.


<సీ. యతి, యుక్త వా • క్యానుగతి నంటవలయు వ
త్సంబు ధేనువు వెంటఁ • దవిలినట్లు
మెట్టుమీఁదను గాలు • పెట్టఁగై దండ యం
దిచ్చినట్టులు పాస • మెనయవలయు
సానఁబట్టినమణి • చందానఁబద మధ్య
నారీశుభంగి బం - థంబువలయు
దివి వెలుంగు మెఱుంగుఁ • దీఁగెయట్లర్థంబు
తేట తెల్లంబుగాఁ • తెలియ వలయు


గీ. నలఁతి తొలపడ్డచంద్రమం • డలమువలన
జలజలను రాలు నమృతంపు • జాలులీల
రసము తులకింపవలె నట్టి • రమ్యకవిత
రసిక రస నారిరంస చే • బ్రబలకు న్నె.


ఇట్టి యాదర్శమును దన ముందిడుకొని కవిత్వము చెప్పిన వాఁడగుటచేత . సూరకవి కవిత్వము సత్కవి సమాదరణీయమై కావ్యరచనా విషయమున నూతన మార్గమును జూపు రా మలింగేశ శతకమును వ్రాసి' వన్నె కెక్కెను. పూర్వ కవుల యెడలఁ దనకుఁగల గౌరవమును, తన బుద్ధి స్వాతంత్యమును నితడు, కవిత్వమర్యాదల యందు, కార్యనిర్మాణము నందును వెల్లడించియున్నాఁడు. సూరకవి సమకాలికులచేఁ జెప్పఁబడినది గా వాడుకలోనున్న యింక్రింది పద్యమున, నతనికి నాంధ్రసా రస్వతమునఁగల యున్న తస్థానమును నిరూపించుటకుఁగా నుదా హరించి ధన్యవాదములం జేయుచు నీ మహనీయుని పవిత్రచరి తమును నింతటితో ముగించు చున్నాఁడను.


ఉ. ఆధునికుల్ కవీంద్రులు స • హస్రము లుందురుగాక నీవలెన్ మాధురిగల్గు నేకవన • మార్గము తిక్కనసోమయాజి శ్రీ నాధుఁడు ముక్కు తిమ్మకవి • నాఁడు ప్రసిద్ధులుగాకిటీవలన్ గాధితమయ్యె నీవలనఁ • గాదె కవిత్వము సూరసత్కవీ.

సంపూర్ణము

COMPOSED BY V. JAGANNADHAN:-S. V. V. Press, VIZAINAGRAM.