అడిదము సూరకవి/ఐదవ ప్రకరణము
ఐదవ ప్రకరణము
సంస్థానాస్థాన కవి పదము
సూరకవి తన ప్రభువును విజయనగర సంస్థానాధీశుఁడు నగు చిన విజయరామ మహారాజు నాదరణమును బొందియా స్థానకవిగానుండెనని ప్రబలమగు నొక వాడుక కలదు గాని యితఁడు విజయనగరమునఁ గాపురముండి నట్టును నితరులగు నాస్థాన పండితులవలె నిత్యము రాజస్థానమునకుఁ బోవుచు వచ్చుచుండినట్టును జెప్పుటకు నాధారములంతగఁ గానరావు. ఇతఁడాకాలమున నాస్థానకవి పదమలంకరించి విజయనగరమునఁ గాఁపురముండక చీపురుపల్లె యందే నివసించుచుఁ దఱచు విజయనగరమునకు వచ్చి తన ప్రభువులను దర్శించుచు నియమితో ద్యోగమును నెజవేర్చు కోనుచునుండెడి వాడు.
సూరకవి ప్రజ్ఞావంతుఁడును విద్యాధికుఁడును నై యుండియుఁ దన స్వాముల యెడలఁ జూపనలసిన వినయమును జూపక యొక విధమగు స్వాతంత్యమును గనుపఱ చెడి వాఁడు. స్వతంత్రం ఈ బుద్ధి కలిగియుండుట ప్రశంసనీయమైననుఁ దన యేలికల పట్ల నవిధేయతను జూపునడనడి మాత్రము శ్లాఘాపాత్రము.
కానేరదు. ఇట్టి నడవడి యేకవికిఁ దఱచు గలుగుచు వచ్చిన దేవిడీ మాన్నాల "కుఁ గారణమని చెప్పుదురు. సూరకవి. సహజముగ నిట్టి స్వభావము కలవాఁడు కాకపోయినను నప్పటి దివానును రాజుగారి యగ్రజుఁడును నగు సీతారామరాజుగారు కవి యెడలఁ జూపుచువచ్చిన యనాదరణమును నీర్ష్యయుఁ గొంతవఱకుఁ గారణమై యుండవచ్చును. ఈ సీతారామరాజు గారిని గూర్చి కవికృతమగు రామలింగేశ శతకమును విమర్శించు సందర్భమున నికముందు వ్రాయుచున్నాను. కాన నిచట విడచితిని.
ఒకనాఁడు మహారాజు, పండితులు కవులు మొదలగు వారితో నిండుకొలువునఁ గూర్చుండియుండ నప్పటి సందర్భము ననుసరించి సూరకవి యాశుగా.
ఉ. పంతముననీకు జెల్లు నొక • పాటియమిరుఁడు నీకులక్ష్యమా
కుంతము కేలఁ బూని నిను • గొల్వనివాఁడు ధరిత్రిలోన భూ
కాంతుఁడొకండు లేఁడు కటకంబు మొదల్కొని గోలుకొండ ప
ర్యంతము నీ వెకా విజయ • రామనరేంద్ర వైభవా. "
అనియొక పద్యమునుఁ జెప్ప దానికి రాజును సభ్యులునుమిగులసంతసించి కవిని బహువిధముల శ్లాఘించిరి ; కాని సీతారా మరాజుగారు మాత్రమొక యద్భుతమగు నాక్షేపణము చేసిరి. ఎట్లనిన - మండలాధీశ్వరునిగూర్చి నీకుఁ జెల్లు; నీకు లక్ష్యమా?
అని యేకవచన ప్రయోగము చేయఁదగునా ? నీవు మహాకవివి
మైసను నితరులను మన్నించి నీవు మన్నన గొనవలెను " అని చెప్ప సూరకవి
* క. చిన్నప్పుడురతి కేళిని
సున్నప్పుడు కవితలోన యుద్ధములోనన్
వన్నె నుమీ 'రా' కొట్టుట
చెన్న గునో పూసపాటి • సీతారామా !.
సమయోచితమగు నీ ప్రత్యుత్తరము సభ్యులకు మోదకరమయ్యును సీతారామరాజుగారికి మాత్రము ఖేదకారియయ్యె . ఇట్టి కారణ పరంపరచే నానాఁటికి సూరకవి పై సీతారామరాజు గారికి ననాదగణము హెచ్చు కాఁజొచ్చెను. కవి పెక్కుచోట్లఁదన రామలింగేశ్వర శతకములో సీతారామరాజు గారి చండశాస నత్వమును సూచించుచునే వచ్చెను. మొత్తము మీఁద సూరకవియొక్క యాస్థానకవి పదము జయప్రదముగను సుఖదాయక ముగను వెళ్ళుట లేదు.
శ్లో, బాల్యేనుతానాం నుర తేంగనానాం !
న్తుతోకవీనాం సమ రేభటానాం |
త్వం కారనాదాహిగిరః పశస్తాః |
కస్తేప్రభో మోహతరస్స్మరత్వమ్ |
అను నీశ్లోకమును మనమునందుంచుకొని మీఁది పద్యమును జెప్పినట్టు గ' నూహింపవచ్చును,
పూర్వోదాహృతమైన రాజుకళంకమూర్తి" అను పద్యమును ( పెద్దాపురమునఁదు' సూరకవి చెప్పినప్పుడు మహా రాజును మంత్రి మొదలగు నితరోన్నతో ద్యోగస్థులును, పద్య ముయొక్క. సొగసున కెంతయు మెచ్చి కవికిఁ గనకాభి షేకము చేయించిరఁట ; అట్టి యపూర్వ గౌరవమునకు సూరకవి మిక్కిలిగ సంతసించి తనకృతజ్ఞతను ప్రభువునకును, మంత్రియుఁదన బందుగుఁడు నగు బుఱ్ఱ బుచ్చనామాత్యునకును ననేకవిధముల వెల్లడించెను. అభిషేకము చేయఁబడిన బంగారు నాణెము లను గవి తప్పక పరిగ్రహించునని మహారాజు లోనగువారు తలంచిరి. కాని సూరకవి మాత్రము వానిని ముట్టఁడయ్యెను. • పరిగ్రహింపుఁడ'ని చెప్పినపుడు సూరకవి " మహాప్రభూ! ఏలి నవారి కటాక్షముచే నింతదనుక స్నానము చేసిన యుదకమును బానము చేయ లేద ”ని చెప్ప మహారాజు లోనగువారు సూరకవి నిర్లక్ష్య భానమున కెంతయు నాశ్చర్యపడిరి. విజయరామమహా రాజు సూరకవి చెప్పిన సమాధాన మెంతయు యుక్తియు క్తముగ నున్నదని సంతసించి, యతనికి వేఱుగ బహునూన మొసఁగి గౌరవించెను. తాను సుఖముగ జీవయాత్ర గడపఁదగిన యుప వృత్తిలేని వాఁడయ్యు ' ద్రవ్య విషయమున నిట్టి నిర్లిప్తతను జూపుట యతని స్వతంతబుద్ధిని భావదారిద్ర్యమును వెల్లడిచే యుచున్నది.
సీతారామరాజుగారి వలెఁగాక చిన విజయరామ మహా రాజుగారు సూరకవి పజఞాది విశేషములను బాగుగగు నెఱిఁగియతని నుచిత రీతిని గౌరవించుచు వచ్చిరి. మహారాజుదయకుఁ బాత్రుడై సన్నిధిపతి యై మెలఁగుచుండిన పతివాడ పైడన్నయను పేరుగల 'దారూగా' యొక సమయమున సూరకవి యెడల నగౌరవమును జూపెనఁట. దానికి మిగులఁ గుపితుఁడయ్యు సూరన గోరంత వాఁడై నఁ గొండంత వాఁడైనఁ బగ కనర్హుఁకు నృపపార్శ్వవతిః ” (రామలిం గేశ శతకము) అను న్యాయము ననుసరించి దాని కేమియుఁ జేయ లేక యూరకుండెను. కాని నాఁడు. తాను రాజస్థానమునకుఁ బోయినపుడేది యోసందర్భమున "కః ఇత్తడిపుత్తడి యగునా ! తొత్తుకు నగలెన్నియున్న దొరసానగునా | యు త్తమకులుఁడౌ నాదౌ ! లత్తెం తలభించినను గులాము గులా మే ! ” అను పద్యమును రాజు సన్నిధిని జదివి యూరకొనెను. సరసుఁడగు నీవిజయరామన్న పాలుఁను మీఁది సమాచారమును నెటులో తెలిసికొని సూతకవి, మీఁది పద్యమును దన సన్నిధిని జదువుట కది కారణముణముగాఁ దలంచి 'దారూగా' యగుపతివాడ "పై డన్నకు దేవిడీ మన్నాయను శిక్షను విధించెను. నాఁడు బుద్ధినెఱిఁగి తన యపరాధమును సూరకవికీ నివేదించి క్షమింపుఁడని వేడుకొనఁగ సతఁడీకింది పద్యమునుచెప్పెనని వాడుక గలదు.
గీ. మోటముండకొడుకు మాట చేల్లిన నాడు
నన్ను లక్ష్య పెట్టి నాఁడుకాఁడు;
తెలిసియిపుడ: నన్ను * * దీవింపుమనిపల్కు
బడ్డ, ........... . బ్రాహ్మపశ మె.
ఒకానొకప్పుడు *సత్య వరముజమీదారుల యాస్థానము డితుఁడునుఁ గవియును నగు రేకపల్లి సోమప్పకవి రాజు సమ్మానమును బోందఁగోరే తనప్రభువుల సిఫార్సుగైకొని విజయనగఁ మునకు వచ్చి యచ్చటఁ గొన్ని మాసములు నివసించి యుండి ప్రతిదినము నాస్థాన పండితులతో బాటు మహారాజు సన్నిధికి వచ్చుచుఁ బోవుచుండెడి వాఁడు. సోమప్పకవి విజయనగరమున " నున్న దినములలో సూరన, రాజును దర్శింప సస్థానమునకుఁ బోగా మహారాజును, దివానగు సీతారామరాజుగారును సోమప్పకతో మన కవికిఁ బరిచయము కలుగఁ జేసి, యాపండితుని ప్రజాఞ వి శేషములను వర్ణించి వానికిఁ జెస్సిరి. "యాచకోయ చితుశ్శతు ' అను లోకోక్తి సార్థకమగునట్లుగఁ బ్రథమదర్శన ముననే సూరకవి సోమకవులను నొండొరులపై నొకవిధమగు కక్ష్యజనించెను. ఈ పండితుని మూలమున నెట్లయినను సూతకవిని బరాభవింప సీతారామరాజుగా రుత్సాహ పడుచుండి.. తమ యుత్సాహ, స్వకల్పము"లు వెల్లడియగునట్లుగ సీతారామ రాజుగారు సోమసుకవి జగదేక పండితుడనియు, నతని ప్రజ్నాది
- పా॥ దీవించమంటాడు. " - ఇవి విశాఖపట్టణము జిల్లాలోని అనకాపల్లీ సమీముననున్నది. "
- -warm . విశేషము లమోఘములనియు, సూరనయెదుటఁ బొగడుటయే గాక యతఁడొక మహాకవీశ్వరుఁడని కూడఁ జెప్పుచు వచ్చెను.అంతసూరకవి, సోమప్పకవిని, సీతారామరాజు గారినిగూడఁబరా భూతులుగఁ జేయనెంచి సోమప్పకవి పై నీపద్యములను జెప్పెను.
గీ. దేవు నానమున్ను • దేశానకొక కవి.
యిప్పుడూరనూర • నింటనింట
నేగురార్డు రెడ్లు • రెనమండ్రు తొమ్మండ్రు
పదుగు రేసికవులు • భవ్యచరిత.
క. ఏమేమోశాస్త్రంబులు .
తామిక్కిలి పతి కెనఁటస , తకనీ కవితా
సొమర్ధ్యమెఱుఁగ నేరని
సోమునిజృంభణము గలదె • సూరునియెదుటన్
అంత సోమప్పకవి, ప్రత్యుత్తర మియ్యనిచోఁ దనయ శక్తి వ్యక్తమగునని యెంచి యాశుగా నీకింది పద్యమును జెప్పెను.
గీ. సోమశబ్దార్థ మెఱుఁగని • శుంఠవగుట
వదరితివి గాని సూరుని రదనపాళి .
రాలదన్నిన సోముని , లీలఁ దెలియ -
వైతి, నీ గుట్టుబఁయలగు • ననుచుఁ గుకవి.
అంతసూరకవి యూరకొనక సోమప్పకవి సుద్దేశించి రెండు పధ్యములు చెప్పెను. ________________
క. తెలుఁగున్ గబ్బపురీతులు క
ల నెఱుఁగని శుష్కతర్క కర్కశమతికిస్
డెలిసెనొక యించుకించుక
వెలివలి గౌతన్నకృపఁగ • విత్వపుజాడల్.
క. చెన్నగు నియోగి కపనపు
మిన్నా వైదికుని కబ్బి • మిందును జెపుఁడా
వెన్న మిసి జున్నుకబ్బునె
తన్ను కచచ్చినను గాని • ధరలో నసృపా
వీనికిఁ బ్రత్యుత్తరముగ.
గీ. తర్క కర్కశ బుద్దులై , తగినవారి
కేమసాధ్య ? మటంచు నూ , హింపరాదె
తెలుఁగుమాటలు నాల్గయిదు. తెలిసి తాము
కవులమనుకొన్న వెఱిపాడ • గట్టుమదిని ?
అను నీపద్వమును జెప్పి గడుసరియగు సూరకవిని వాగ్వుద్దమున జయించుట తనక సాధ్యమని ఖిన్ను డై సోమప్పకవి సరస్వతినిగూర్చి యిట్లు పలికెను.
క. జిలిబిలి పలుకుల వెలఁదీ !
పంగాకినకారగుళ్ళ పాలైతిగదే
యిలలో వైదిక విద్య
త్తిలకంబుల కేదిదిక్కు • తెల్పితివమ్మా.
అంత సూరకవి దీనికిఁ బ్రతరముగ నీకింది పద్యములను ఱెప్పెనని వాడుక. వానిలో నొకదాని యభిప్రాయము
మాత్రచట వాయుచున్నాను. (పద్యమింత వరకును నాకు లభింప లేదు).
1." నీ పురస్థలము తాళ్ళపాలెము, నీ చుట్టములు కల్లూరి వారు, నీయింటి పేరు "రేకపల్లి వారు, నీవు సోమాహ్వ యుఁడవు. ఇట్టి నీవాక్యములెంత వఱకు యుక్తియుక్తములో సభ్యు లెఱుంగుదురు గాక."
2. సీ. తట్టెఁడంతవిభూతిఁ • బెట్టి తాతలనాఁటి
కుండనాల్వీనులఁ • గునిసియాడ
మైలగ్రక్కెడు శాలం , మడతలు నెరసిన
బోడిబుఱ్ఱలమీఁద • బోసగఁజుట్టి
ప్రాంతనీరుంగావి • పంచెలుము.........ల్
గనుపింపఁగాడొల్లు • కచ్చగట్టి
యంగవ స్త్రంబుల • నతికి కుట్టినయట్టి
దుప్పట్లు పైఁగప్పి • తుదలుచినిఁగి
నట్టి పుస్తకముల • కట్టలుచంకలోఁ
బెట్టివిషం బులు • విదులుకొనుచుఁ
బలుగాకిముండ బి • డ్డలుశిష్యులనికొంద
ఱువచారము ల్సేయు • చుండఁగా స్వ
యంపాక. నిష్టుల • మనివంటసాగించి ,
పదిదినం బుల కొక్క • పట్టుఁబట్టి
సంగీత సాహిత్య • సరసవిద్యలవారి
పాలిటిభూతాల • పగిదిఁదనరి
యెంతచక్కని శ్లోక • మేనిఁబద్యం బేని
రస మెఱుంగక ముష్క, రతవహించి
యితఁడుపండితుఁడుగాఁ • డితఁడు తార్కికుఁడుగా
డితఁడుశాబ్దికుఁడుగా , డితఁడు సత్క్రి
యారసజ్ఞుండు గాఁ • డనిచుల్క నాడుచు
ఘనవిత్తహరణ దు • ష్కర్ములగుచుఁ
బర గుదుష్పండిత • బ్రహ్మ రాక్షసుల చేఁ
గవితారసజ్ఞత , గట్టు వడియెఁ
గాన నేరీతిఁజూచేదో కరుణమాదృ
శులకవిత్వ మేరీతిని సూటిఁజేసి ,
రక్షఁజేసెదొ నీ నేమా - రక్షకుఁడవు
జానకీరామదేవతా , సొర్వ భౌమ.
ఈరీతిగ వీరిరువురకును జనించిన పరస్పరనిరము వీరి యామరణాంత ముండెను. తనకు సూరకవిఫై గల వైషమ్యమును ప్రతిబింబింపఁ జేయునట్టి పద్యములను సోమప్పకవి తన ప్రబంథమగు "రుక్మసతీపరిణయమునం” గృత్యాది పద్యము లలోఁగుకవి నిందా సందర్భమున వాసి యున్నాడు. ఆపద్య ములిందుఁబొందు పఱుపఁబడినవి.
<poem>మ, కనవృత్తుల్ గుణముల్ గణింపక యలం • కారంబులున్ రీతులున్" "
ఘనవాక్యాః సదార్ధ సంగతు లెఱుం • గన్నేరకే యూరకం
పునఁబొబంధి , బైరి కొందఱుకవుల్ • • పుణ్యైర్యశో లభ్యతే "
యను వాక్యంబు ప్రమాణముయ్యె నిపు • డాస చిత్రమిద్ధారుణిన్.
చ, వరకవులంచుఁ గొందఱఁట • వారలు సాహితీ లేక యే కవీ
శ్వరులఁట వాడరీకలన • చాలఁగఁ గద్దఁట చిత్రమయ్యెడిన్
వరములొసంగు దైవములు • వాగ్దదినిచ్చుచు శాస్త్రసంగతిన్
వరమిడ లేరె సిగ్గెడలు • వాదులు గాక కవిత్వరీతులే.
సూరకవి కాశ్రయులైన చినవిజయరామ మహారాజు గారు సరసులనియుఁ బండి తావలంబకులనియుఁ గవిపోషకులనియు మీఁదఁజూపియుంటిని. వీరుభయభాషల యందునుజక్కని పొండిత్యము గలిగి రెండింటియందును సరసమగు కవిత్వము చెప్పుసామర్థ్యము గలవారై యుండిరి. 'పెద్దాపుర సంస్థానాధిపతులపయి వీరు చెప్పిన సంస్కృతశ్లోకము నిందుఁ దార్కాణముగ జూపుచున్నాఁడను. ..
శ్లో|| అంభోజంకలయన్ సదృక్షమవ నే సాహిత్యరీత్యాం దృశో |
ర్మాం తారమపారసంపది మహాభాపే యశో రాశిషు |
శత్రూణాం పుగ భంజు నే ధృతి గుణేకించోర గేంద్రంమతి |
ప్రాగల్భ్యేలేఖ్య ప్రతిభాతి తిమ్మనృపతిః పాకాహిత ప్రాభవః |
ఈ విజయరామ నృపాలుని గూర్చి ప్రశంసించుచుఁ గీర్తి శేషులగు గురజాడ శ్రీ రామూర్తి పంతులు గారు తమకవి . జీవితములలో నిట్లు వాసియున్నారు. « ఈరాజశిఖామణి యుద్దమందు మడసిన వానికి వీరస్వర్గమున్నదా యని పలికిన వారిం గూర్చి చెప్పిన యొక పద్యము.
ఉ. ఇంచుక సూచివేదన సహిం • చినమాతనృపొంగ నాకు
చోదంచిత సౌఖ్య కేళి సత • తంబునుగంచుకి గాంచు నెట్లుదు
ర్వంచిత తీవ్రబాణనిక • రక్షతబాహుల కబ్బ వేమరు
చ్చంచలలోచనాఘనకు • చ స్తబక వ్యతిషంగ సౌఖ్యముల్.
ఈపద్యంబుచే నీ విజయరామమూర్తి కవియనియు సర సుండనియు నెంచందగియున్నది. ”
శ్రీరామూర్తి పంతులుగారు మీఁది పద్యము విజయ రామనృపాలుని దని భ్రమపడిరి. కాని యియ్యది జక్కన కవి ప్రణీతమగు విక్రమార్క చరితమునఁ జతుర్థాశ్వాసము సందున్నది. సందర్భానుసారముగ మహా రాజీపద్యమును సభయందుఁ జదివి యుండవచ్చును. ఉదాహరించుటకుఁ బద్యములు లభ్యము కాలేదు గాని యీమహారాజునకుఁ గవిత్వము చెప్పు సామర్థ్యముండెనని ప్రబలనుగు వాడుకమాత్రము కలదు. .