అక్షరశిల్పులు/అబ్దుల్ అజీజ్ ముహమ్మద్
సాహిత్య-సాంస్కతిక కార్యక్రమాల ఏర్పాటు పట్ల ఆసక్తి. మతసామరస్యం ప్రధాన ప్రాతిపదికగా సర్వమత సమ్మేళనాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ. ప్రస్తుతం ప్రజాశక్తి దినపత్రికకు విలేఖరిగా పనిచేస్తున్న ఆయనకు సామాజిక, రాజకీయాంశాల మీద రచనలు చేయడం ఇష్టం. చిరునామా: పఠాన్ అబ్దుల్ ఆజాద్ ఖాన్, రాచర్ల గ్రామం, రాచర్ల మండలం, ప్రకాశంజిల్లా, 523368, దూరవాణి:08405-247414, సంచారవాణి: 93916 74562.
'ఖబర్దార్' కవిత పలు జాతీయ భాషల్లో తర్జుమా అయ్యింది. అవార్డులు- పురస్కారాలు: సాహితీ సరస్వతి (విశాఖ ప ట్నం), వచన కవితా సురబి (మచిలీపట్నం). ఆధ్యాత్మిక ప్రసం గాలు చేయడం , శ్రీమద్రామాయణం, శ్రీమద్భాగవతం, హరికథలు చెప్పడంలో దిట్ట. రచనలు: హరి:ఓమ్ (1997) తదితర కవితా సంపుటాలు. లక్ష్యం: త్యాగరాజు, అన్నమా చార్యులు, రామదాసు కీర్తనల ఆలాపన, పరిశోధన, ప్రసంగాల నిర్వహణ. రచనల ద్వారా ఆధ్యాత్మిక ప్రచారం సాగించాలని, పరమత సహనం, మతసామరస్యం, ప్రగతిశీలత సాధించాలన్నది ప్రధాన లక్ష్యం చిరునామా: ముహమ్మద్ అబ్దుల్ అజీజ్, 15-7-12, సంతోషిమాత కోవెల వీధి, నిదానందొడ్డి, అనకాపల్లి -531002, విశాఖపట్నం జిల్లా, సంచారవాణి: 92963 58324.
అబ్దుల్ బాసిత్ షేక్: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం రుద్రాంపూర్‌లో 1968
30 అక్షరశిల్పులు
జూన్ 5న జన్మించారు. తల్లితండ్రులు: షేక్ మొహినుద్దీన్, మీర్ హాజరా బేగం. చదువు: సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా. వృత్తి: విద్యాబోధన. 2000 నుండి రచనా వ్యాసంగం ఆరంభమై సుమారు పలు వ్యాసాలు, కథలు వివిధపత్రికలలో చోటుచేసుకున్నాయి. 'గీటురాయి' వారపత్రికలో 2005లో రాసిన
ఉర్దూ గ్రంథాన్ని 'ఖుర్‌ఆన్ నాలుగు ముఖ్య విషయాల మీద విశ్లేషణ' (2010) పేరుతో తెలుగులోకి అనుదించారు. హిందీలో రాసి నపలలు వ్యాసాలు, క వి త లు'కాంతి' (డిల్లీ) హిందీ మాసపత్రికలో ప్రచురితం. లక్ష్యం: ఇస్లాం సందేశ ప్రచారం. చిరునామా: షేక్ అబ్డుల్ బాసిత్, ఇం.నం. 3-84, రుద్రాంపూర్ -507119, కొత్తగూడెం మండలం, ఖమ్మం జిల్లా, సంచారవాణి: 92471 72968.
అబ్దుల్ గఫూర్ ముహమ్మద్ మౌల్వీ: ప్రకాశం జిల్లా కంభం జన్మస్థలం. చదువు: మున్షీ, ఫాజిల్. ఉర్దూ పండితులు. ఉర్దూ, అరబిక్, తెలుగు భాషల్లో మంచి ప్రవేశం. అరబ్బీ నుండి తెలుగులోకి ఖుర్ ఆన్ గ్రంథాన్ని అనువదించారు. ఈ అనువాదం 1949లో రెండు భాగాలుగా వెలువడింది. రచనలు : జగత్ప్రవక్త, మిఫ్‌కాతెఫరీష్ (రెండు సంపుాలు), 'ముస్లిం ప్రభువులు'.
అబ్దుల్ హకీం జానీ షేక్: గుంటూరు జిల్లా తెనాలిలో 1963 జనవరి ఒకటిన జననం. తల్లితండ్రులు: షేక్ మహబూబ్‌బీ, షేక్ ఫరీద్ సాహెబ్. చదువు: బి.ఏ., బిఎడ్. ఉద్యోగం: తెలుగు ఉపాధ్యాయులు. 1976లో విద్యార్థిగా 'కన్నందుకు శిక్ష నాటిక రాయడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభించి 1991 నుండి 2009 వరకు తెలుగు పత్రికలలో వివిధాంశాల మీద సుమారు 12 వందల వ్యాసాలు, కవితలు ప్రచురితం. బాల సాహిత్యం పట్ల ప్రత్యేక ఆసక్తితో ఆరు పుస్తకాలు
వెలువరించారు. మరో 20 గ్రంథాలు త్వరలో, వెలువడనున్నాయి.వయోజనుల కోసం రాసిన 18 గ్రంథాలు ప్రచురితం అయ్యాయి. ఆకాశవాణి ద్వారా కవితలు, కధానికలు, ప్రసారం. అవార్డులు -పురస్కారాలు: సమతారావు బాల సాహితీ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, విశ్వదాత అవార్డు (2007), ఆంధ్ర సారస్వత సమితి పురస్కారం (2009). లక్ష్యం మానవీయ సంస్క ృతీ-సంప్రదాయల పట్ల అవగాహన కల్పిస్తూ, బాలబాలికల అభ్యున్నతికి ఉత్తమ సాహిత్య సృష్టి చేయటం. చిరునామా: షేక్ అబ్దుల్ హకీం జానీ, ఇంటి నం.
31
1