అంతయు నీవే హరి
(రాగమ్: ) (తాలమ్: )
పల్లవి - అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ
చరణం1 - కులమును నీవే గోవిందుడా నా
కలిమియు నీవే కరుణానిధి
తలపును నీవే ధరణీధర నా
నెలవును నీవే నీరజనాభ
2- తనువును నీవే దామోదర నా
మనికియు నీవే మధుసూదన
వినికియు నీవే విట్ఠలుడా నా
వెనకముందు నీవే విష్ణు దేవుడా
3- పుట్టుగు నీవే పురుషోత్తమ
కొన నట్టనడుము నీవే నారాయణ
ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు
నెట్టన గతి ఇంక నీవే నీవే
బయటి లింకులు
మార్చుఅంతయు నీవే హరి http://balantrapuvariblog.blogspot.com/2010/12/annamayya-samkirtanalutatwamulu_11.html
అంతయు నీవె ....ప్రియాసిస్టర్స్
అన్నమయ్య పాటలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|