అంటువ్యాధులు/పదునేడవ ప్రకరణము

పదునేడవ ప్రకరణము


ఇతర సంపర్కము వలన వ్వాపించు వ్యాదులు క్షయ ప్లేగు, కుష్ఠరోగము, కొరుకు, వచ్చ సెగ, తామర, గజ్జి మొదలగునవి.

క్షయ

(Tubercle)

ఈ వ్యాధిని కలిగించు సూక్ష్మ జీవులు క్షయ రోగులు ఉమ్మి వేయు కపము నుండు సాధారణముగా బయలు వెడలు. మన దేశము నందలి ప్రజలు అజాగ్రత్తగ వీదులలోను, ఇష్టము వచ్చిన చోట్ల నెల్ల ఉమ్మి వేయుచుందురు. ఇది ఎండి పొడియై గాలిలో నెగిరి పోవు చుండును. ఈ కఫము తడిగా నున్నప్పుడు ఈగలు దాని మీద వ్రాలి అక్కడ నుండి సూక్ష్మ జీవుల నెత్తుకొని పోయి మన ఆహార పదార్థముల మీదికి చేర బేయును. క్షయ వ్యాధి గల ఆవుల పాల గుండ ఈ వాధి వ్యాపించునను నమ్మకము అనేక వైద్యులకు కలదు. కాని మన దేశమందలి ప్రజలు పాల నెప్పుడు చక్కగ కాచి పుచ్చుకొను అభ్యాసము గల వారగుట చేత ఇక్కడ ఈ వ్యాధి పాల మూలమున అంతగా వ్వాపించు చున్నదని తోచదు. ఈ వ్యాధి వంశ పారంపర్యముగా వచ్చు చుండునను నమ్మకము గట్టిగ కలదు. 207

వాయు ప్రచారము చక్కగ లేని చీకటి ఇండ్లలో నివశించు వారలను, స్వతస్సిద్ధముగ గాని ఇతర వ్యాధులచే పీడింప బడుట చేత గాని బల హీన స్థితిలో ఉన్న వారలు ఈ వ్యాధి అధికముగ అంటు కొనును.

క్షయ వ్యాధి వ్యాపించుటకు రెండు విషయములు ముఖ్యముగ నున్నవి. 1. విత్తనము అనగా క్షయ సూక్ష్మ జీవి. 2. నేల అనగా బలహీన స్థితిలో ఉన్న మనుష్యుడు. వంశ పారంపర్యముగ కొందరు ఈ వ్యాధికి సులభముగ లోనగుదురు. ఇది యొక విధమైన బలహీనతగా నెంచ వలయును.

నివారించు మార్గములు

క్షయ వ్యాధి ఊపిరి తిత్తుల మార్గమున గాని అహారము గుండ గాని చర్మము ద్వారా గాని అక్కడక్కడ అరుదుగ జననేంద్రియముల మార్గమున గాని మన శరీరములలో ప్రవేశించును. క్షయ సూక్ష్మ జీవి చాల సేపు గాలిని గాని వెలుగురును గాని ఎండను గాని భరింప జాలక వెంటనే చచ్చి పోవును. రోగి యొక్క సమీప ప్రదేశములలో గాని ఇతర చోట్లల గాలిలో ఈ సూక్ష్మ జీవులను కనుగొనుట కష్టము. కాబట్టి ప్రతి క్షయ రోగిని తాను ఉమ్మివేయు కఫమునందలి సూక్ష్మ జీవులను నశింప జేయిట నేర్పిన యెడల ఈ వ్యాధి యొక్క వ్యాపకము వెంటనే తగ్గి పోవుటకు సందేహము లేదు. క్షయ అరోగుల కఫమును ఎండ నిచ్చి గాలిలో కలియనిచ్చినను, ఈగలు చీమలు మొదలగు

208

లగు జంతువులు ఈ కఫమును రోగి ప్రక్కనుండి చేరవేయనిచ్చినను గలుగు అపాయము ఇంతంత అని చెప్ప నలవికాదు. ఈగ లెట్లు మన ఆహార పదార్థముల మీదికి నిరంతరము ఇట్టి విష పదార్థములను తెచ్చి పెట్టుచున్న వో వెనుకనే నొక్కి చెప్పియున్నాము.

ఈగలు సామాన్యముగా ఒక్కొక్క కానుపునకు 120 మొదలు 150 వరకు గ్రుడ్ల నొక ముద్దగా పెట్టును. ఈ గ్రుడ్లు 40 వ. పటములో చూపిన ఆకారము గలిగి, తెల్లగ నిననిగ లాడుచు, జిగురు జిగురుగా నుండును. ఈగ తన గ్రుడ్ల నెప్పుడును పేడ కుప్పలు మొదలగు క్రుళ్ళు పదార్థములు గల చోట్ల బెట్టును. వీలయినప్పుడు మన శరీరము మీది పుండ్లలో కూడ ఇది గ్రుడ్లను పెట్టును. కొన్ని ఈగలు చిన్న పిల్లల ముక్కుల లోను చెవుల లోకూడ గ్రుడ్లు

పెట్టును. ఇవి యిక్కడ వేసవిలో 24 గంటలలోపలను శీత కాలములో రెండు మూడు దినముల లోపలను 41. వ. పటములో చూపినట్లు 12 కణుపులు గల తెల్లని పురుగులుగా పరిణమించును. ఈ పురుగులు తలవైపున సన్నముగను వెనుక వైపున లావుగను మొద్దుగను ఉండును. ముందు వైపున రెండు దట్టమైన పెదవులు గల ముట్టె యుండును. ఈ ముట్టె


209

41 . వ. పటము ఈగ పురుగు:

మిక్కిలి కఠినమైనదగుటచే నివి చరచర పుండ్లలోపలికి తొలిచి కొని పోగలవు. ఇవి యిట్లు 5 దినములుండిన పిదప 42 వ పటములో చూపినట్లు గూడు కట్టుకొను. ఇప్పుడు వీని తెల్లని

43.వ.పటము. రెక్కల ఈగ.

చర్మము నలుపెక్కి గట్టిపడి గుల్లగా నేర్పడును. ఈ గూటిలో ఇవి నిరాహారముగా మూడు దినములుండిన తరువాత 43. వ పటములో చూపిన ప్రకారము గూటిని పగల్చుకొని రెక్కలు గల ఈగలుగా వెలువడును. ఇట్లు గ్రుడ్ల నుండి ఈగ పుట్టుటను 210

సగటున 10 దినములు పట్టును. ఈ దేశములో సామాన్యముగా సంవత్సరము పొడుగున ఈగలు గ్రుడ్లు పెట్టు చుండును. మగ ఈగల కండ్లు రెండును దగ్గరా నుండును. ఆడు దాని కండ్ల నడుమ ఎడమ హెచ్చుగా నుండును.

ఇట్టి ఈగలను పట్టుటకు ప్రతి రోగి ప్రక్కన ఈగ కాగితము నొక దానిని పెట్టిన యెడల వీని యుపద్రవము కొంత వరకు తగ్గును. ప్రక్క నున్న 44 వ. పటమును జూడుము. ఈగ కాగితములు అణాకు ఒకటి చొప్పున అమ్మకమునకు లభించును. క్షయ వ్వాధి పీడితులగు రోగు లెల్లప్పుడును మందు నీళ్లు గల పాత్రలలో ఉమ్మి వేయ వలెను గాని చుట్టు ప్రక్కల నుండు గోడల మీదను, ఉమ్మివేయ కూడదు. సాధరణముగా ప్రజలను ఇండ్లలో తలచిన చోట్ల నెల్ల ఉమ్ము వేయనీయ కూడదు. రోగులకు జ్ఞాపకము చేయుటకై జన సంఘములు చేరు చోట్ల నెల్ల ఇక్కడ ఉమ్మి వేసిన వారలు శిక్షకు పాత్రు లగుదురు అని ప్రకటక పలకలు విరివిగా మూల మూలలకు గట్టవలయును. క్షయ దగ్గు గల రోగులు ఇతరుల ముఖము మీద దగ్గ కూడచు. విసురుగ దగ్గినపుడు సూక్ష్మ జీవులు గాలితో పాటు బయట పడి ఎదుట వారినంట వచ్చును. వీరు సభలకు పోవునప్పుడు తమతో కూడ చేతి రుమాళ్ళుగాని పాత గుడ్డలు గాని, ఇప్పుడు జపానునుండి వచ్చు చున్న కాగితపు జేబు రుమాళ్ళుగాని సంచులుగాని తీసికొని పోవలయును. దగ్గు వచ్చినపు డెల్లను క్రింద 211

ఉమ్మివేయక గుడ్డలో వేసి దానిని ఎప్పటికప్పుడు కాల్చి వేయ వలెను. వీరు ఉపయోగించిన బట్టలను ఇతరులు ఉపయోగింప రాదు. వాయు ప్రసారము అధికముగ గల స్థలములలోను, ఎండయు వెలుగురు నిరంతరము ప్రసరించు స్థలములలోను ఈ వ్యాధి యొక్క వ్యాపకము మిక్కిలి తక్కువగ నుండును. కావున ప్రజలందరును వెలుతురు లేని ఇండ్లలో క్రిక్కిరిసి నివసింపక సాధ్యమయినంత వరకు గ్రామములను విస్తరించి కట్టుకొనుచు జన సమ్మర్దమును తగ్గించు కొనవలయును. తేమ నేలలును పల్లపు ప్రదేశములును ఈ వ్యాధికి ప్రీతి యగుట చేత సాధ్యమైనంత వరకు ప్రజలు ఎత్తుగ నుండు ప్రదేశములలో ఇండ్లు కట్టుకొనుటకు ప్రయత్నింప వలయును. ఇండ్లలోనికి సాధ్యమయినంత వెలుగురు వచ్చు నట్లు కిటికీలను మండువాలను ఖాళీస్థలములను ఉంచు కొనవలయును. క్షయ రోగులులకు మిట్ట ప్రదేశములలో ప్రత్యేకాశ్రమములను అనగా శానిటేరియన్ కట్టించి వారలను అక్కడ విశాలముగ నివసింప జేయ వలెను. ఆవు పాల మూలమునను మాంసాదుల మూలమునను ఈ వ్యాధి వ్యాపింప వచ్చును కావున ఏయాహారమును గాని చక్కగ ఉడకకుండ తినరాదు.

ప్లేగు (Plague)

ఈ వ్యాధిని కలిగించు సూక్ష్మ జీవి గాలిలో ఎగురుచు ఎంత చిన్న గాయము గుండా నైనను రక్తము లోనికి ప్రవేశింప వచ్చును. ఆహారము గుండ గాని ఊపిరి గాలి గుండ గాని ప్రవే 212

శించినను ప్రవేశింప వచ్చును. మనము తినిన ఆహారము కడుపు లోనికి పోయి నప్పుడు అక్కడ నేదైన, స్వల్పముగ నైన, గాయముండిన గాని ఈ సూక్ష్మ జీవులు రక్తములోనికి చేరలేవని కొందరి అభిప్రాయము. ప్లేగు సంపర్కముగల ఆహారము తినినపుడు దాని యందలి, సూక్ష్మ జీవులు పెదవుల యందును చేతుల యందును నుండు చిన్న చిన్న గాయముల గుండా కూడ ప్రవేశిచునని నిదర్శనములు గలవు. దురదచే గోకి కొనుట వలన గాని దోమ కాటు వలన గాని పుట్టిన అతి స్వల్పమైన గాయముల మూలమున కూడ ప్లేగు సూక్ష్మ జీవి ప్రవేశింప గలదు. ప్లేగు వ్యాధి నీటి మూలమున ప్రవేశింప దనియు చక్కని ప్రచారము గల వాయువు మూలమున కూడ అంట దనియు చెప్ప వచ్చును. జన సమ్మర్దము అధికముగ కలిగి నట్టి చీకటి ఇండ్లలో ఈ వ్యాధి ప్రవేశించిన మిక్కిలి తీవ్రముగా నాశనము చేయునని నిశ్చయముగా చెప్పవచ్చును. ప్లేగు వ్యాధి కలిగిన యింటిలోని ఎలుకలు కుప్పలు కుప్పలుగ జచ్చును. ఒకానొకప్పుడు గ్రామములో ప్లేగు ప్రవేశింపగనే కొన్ని ఇండ్లలోని మనుష్యులకు ఏవిధమయిన వ్వాధియు సోకక మునుపే ఇంటిలోని ఎలుకలు మిక్కుటముగ చచ్చి పడును. ఈ ఎలుకల శరీరము మీద నివసించు బ్రతుకు చుండు గోమారులు మానవులను కుట్టినపుడు ప్లేగు వ్యాధి ఎలుకల నుండి మానవులకు చేరునని శాస్త్రవేత్తల అభిప్రాయము. ఈ గోమారులు 213

ప్లేగు సూక్ష్మ జీవులను ఎలుకల నుండి తామే చేర వేయునది నిజమైనను కాక పోయినను, మన శరీరము మీద అదివరకే పడి యున్న సూక్ష్మ జీవులు గోమారు కాటు వలన గలిగిన గాయము గుండా మన రక్తములో ప్రవేశించి వ్యాధి కలుగ జేయ వచ్చును. గోమారుల వలన కాక పోయినను ప్లేగు అంటిన ఎలుకలు ఇంటి యందు విచ్చల విడిగ సంచరించుట చేతను వాని మూత్రపురీషాదుల ఇండ్లలో నలు ప్రక్కల పడి యుండుటకు అవకాశము కల్గి యుండుట చేతను ఎలుకలు ప్లేగు యొక్క వ్యాపకమునకు ఎక్కువగ సహాకారులగునని చెప్ప వచ్చును. మానవుల రాక పోకలచే గాని బట్టల చేగాని ఇతర జంతువుల చేత గాని ఒక చోటు నుండి మరియొక చోటికి ప్లేగు వ్యాధి వ్యాపింవ వచ్చును. బెంగళూరు మొదలగు ప్రదేశములలో రైలు నుండి దిగుమతి యగు సామాగ్రుల తో పాటు ఎలుకలు కూడ దిగుమతియయి వాని మూలముననే తరచుగ ప్లేగు వ్యాపించు చున్నట్లు నిదర్శనములు గలవు.

నివారించు పద్ధతులు

ఒక దేశము లోనికి ప్లేగు సంబంధమైన అంటు వ్యాపింప కుండ రహదారీ స్థలముల యందును రైలు స్టేషనుల యందును, ఓడ రేవుల యందును తగినంత మంది ఉద్యోగస్థులను కాపలా యుంచ వలయును. ఒక వేళ వ్యాధి ప్రవేశించిన యెడల రోగులను ప్రత్యేక పరచి వ్యాధి వ్యాపింప కుండ పండ్రెండు 214

పదమూడవ ప్రకరణములో చెప్పిన ప్రకారము జాగ్రత్త పుచ్చు కొనవలయును. అనుమాన స్పదమగు ప్రదేశములలోని జనులకందరకు ప్లేగు టీకాలు వేయ వలెను.

కుష్ఠరోగము

(Leprosy)

ఇప్పటికి 3400 ల సంవత్సరల క్రిందటనే కుష్ట వ్యాధి మనదేశమున ఉన్నట్లు నిదర్శనములు గలవు. ఈ వ్యాధిని గలిగించు సూక్ష్మ జీవులు ఒక రోగి నుండి మరియొకరికి వంశ పారం పర్యముగ వచ్చునని కొందరును, రోగిని ఇతరులు తాకుటచే అంటుకొనునని కొందరును ఊహించు చున్నారు. కుష్టరోగుల యొక్క శరీరము లందు ఈ సూక్ష్మ జీవులు కనబడు చుండుట చేతను, కుష్టరోగము లేని జనులందెన్నడును ఈ సూక్ష్మ జీవులు కనబడక పోవుట చేతను, ఈ వ్యాధికిని ఈ సూక్ష్మజీవులకును తప్పక సంబంధమున్నదని చెప్పవచ్చును. కాని ఒక అరోగి నుండి ఎత్తిన సూక్ష్మ జీవులను వేరొకని శరీరమునందు బలవంతముగ ఎక్కించి వానికి ఈ వ్యాధి అంటు కొనునా లేదా అని శోధించుటకు వీలుగాక పోవుట చేత ఈ సూక్ష్మ జీవులే ఈ వ్యాధికి కారణమను అంశము కొంచెము సందిద్గముగ నున్నను, ఇతర అంటు వ్యాధులకును దీనికి గల పోలికలను బట్టియు, ఇది యొకరి నుండి మరియొకరికి అంటు మార్గములను బట్టియు చూడగా సూక్ష్మ జీవులే మూల కారణములని స్పష్టమగు చున్నది. 218

వంశ పారంపర్యముగ ఈ వ్యాధి అంటు కొను ననుటకు కొన్ని హేతువులు కనిపించు చున్నను ఈ వాదము సరికాదని ఈ క్రింది నిదర్శనముల వలన తెలియ గలదు. నార్వే దేశమున నుండి నూట యిరువది మంది కుష్ఠరోగులు అమెరికా దేసమునకు పోయి అక్కడ విశాలమయిన స్థలములలో జన సమ్మర్దమును కల్మషమును లేని చోట్ల కాపురము ఉండిరి. వారి సంతానము నందు గాని మనుమల యందు గాని ఈ వ్యాధి బొత్తిగ అగుపడక పోవుట ఈ వాదమును ఖండించు చున్నది. ఇక సంపర్క వాదము. ఐర్లండు దేశమును ఎన్నడనును విడిచి యుండని ఒకానొకడు అమెరికా దేశమునకు పోయి కుష్ఠ వ్యాది నంటించుకొని వచ్చిన తన తమ్ముని పడక మీద కొన్ని దినములు పరుండిన కారణము చేత వానికీవ్యాధి అంటు కొనెను. కాబట్టి ఒక మానవుని నుండి మరియొక మానవునకు ఈ వ్యాధి అంటు కొనుననియు, అట్లంటు కొనుటకు అన్యోన్య సంపర్కము అవశ్యకమనియు తోచు చున్నది. ఇట్లధిక సంపర్కము గలిగి యుండుట చేతనే ఒక వంశము నందనేకులకు ఈ వ్యాధి వచ్చుచు వంశ పారంపర్యముగ వచ్చుచున్నట్లు తోచ వచ్చును.

కొన్ని దేశములలో ఈ వ్యాధి సముద్రపు ఒడ్డున మాత్రము వ్వాపించి యుండుట చేత చేపల మూలమున ఇది వచ్చునని కొందరు అభిప్రాయ పడి యుండిరి. కాని బొత్తిగ చేపలను తినని బ్రాహ్మణ కుటుంబములలో కూడ ఈ వ్యాధి వ్యాపించి 216

యుండుట చేత ఈ సిద్ధాంతము నిలువ జాలదు. నల్లుల మూలమున గాని మన ఇండ్లలో నుండు ఎవో ఇతర జంతువుల మూలమునగాని ఈ వ్యాధి వ్యాపించు చున్న దేమో యను సందేహము కలదు. ఈ విషయమును కని పెట్టుటకు అనేకులు శోధనలు చేయు చున్నారు.

నివారించు పద్ధతులు

కుష్ఠ వ్వాధిగల రోగులను వేరు పరచి ప్రత్యేక స్థలములలో నివసింప జేయవలయు ననుటకు సందేహము లేదు. ఇంగ్లండు దేశమునందు క్రీ.శ. 1200 ల సంవత్సర ప్రాంతమునందు ఈ వ్యాధి మిక్కిలి ఉధృతముగ వ్యాపించి యుండి ప్రత్యేకము కుష్ఠ రోగుల నిమిత్తమై 95 వైద్య శాలలు ఏర్పడి యుండెను. ఇట్లు రోగులను ప్రత్యేక పరచి 1800 వ సంతత్సరము నాటికి లెక్క కొక్క డైనను కుష్ట రోగి లేకుండు నట్లు ఆ దేశము వారు చేసికొన గలిగిరి. కాబట్టి ఈ వ్యాధి నిర్మూలనము చేయ వలెననిన రోగుల యొక్క సంపర్కము లేకుండ జేసి కొనుటయో సాధనము. ఈ దేశమునందు కుష్ఠ వ్యాధి గల వారిలో సగము మందికిది కాళ్ళలో ప్రారంభించుట చేత కుష్ఠ రోగులు తిరుగు చున్న చోట్ల నేల యందీ సూక్ష్మ జీవులు రాలి యుండి పాదరక్షలు లేకుండ నడచు వారికి ముఖ్యముగ అంటునని తోచుచున్నది. కుష్ఠ రోగుల బజారులో ఎవస్తువులను అమ్మరాదు. వీరి ఉమ్మి యందును చీమిడి యందును స్త్రీ పురు 217

షాంగముల నుండి స్రవించు ద్రవముల యందును చనుబాల యందును సూక్ష్మ జీవులుండును. ఒక కుష్ఠ రోగి రెండు నిముషములు బిగ్గరగ మాట్లాడినంతలో నలబై వేలు మొదలు 185 వేల సూక్ష్మ జీవుల వరకు గజము దూరము దాక వెదజిమ్మునని యెక శాస్త్ర కారుడు లెక్కించి యున్నాడు. ఈ రోగులు ముక్కులందు 110 లో 92 మందికి పుండు ఉండునని శోధకులు వ్రాసి యున్నారు. కాబట్టి కుష్ఠ రోగులుల నెన్నటీకిని దరి జేర దీయ కూడదు. కుష్ఠ రోగులు వివాహ మాడ కూడదని నిర్బందములు ఏర్పడవలయును. వారలకు తగు ఆశ్రమములు నిర్మించి అక్కడనే వారి సౌఖ్యములకు తగిన ఏర్పాట్లు జేసి యావజ్జీవము గడుపు నట్లు చేయ వలయిను. లేని చో మన దేశమున ఈ మహా వ్యాధి ఎన్నడును విడువదని చెప్ప వచ్చును. కుష్ఠ రోగులను తాక వలసి వచ్చిన వారెల్లరును ఎప్పటి కప్పుడు తమ చేతులను మిక్కిలి శ్రద్ధగా మందు నీళ్లల్తో కడికి కొనవలయును. వ్యాధిని దాచ కుండుట, తగిన అధికారులు ఇంటింటిని శోధించి వ్యాధి గ్రస్తుల గూర్చి ప్రకటన చేయుట, రోగులను ప్రత్యేక పరచుట, పరి శుభ్రతను వృద్ధి పరచు ఆచారముల నవలంబించుట, ఇవియే కుష్ఠ వ్యాధిని నిర్మూలము చేయుటకు ముఖ్య సాధనములు.

పచ్చసెగ-కొరుకు-అడ్డగర్రలు

(Gonorrhea-Syphilis-Bubo)

ఇవి వ్యభిచరించు స్త్రీ పురుషులకు మిక్కిలి తరచుగ అంటు వ్వాధులు. వీనినే సుఖ వ్యాధులు అందురు. ఇందు మొదటి 220

అపరిశుద్ధమైన సంయోగము చేతనే కలుగును గాని తానంతట తాను రాదు. ఈ పుండునకును కొరుకు వ్యాధి కలిగించు పుండు నకును గల భేదమును తెలిసి కొన నగును.

అడ్డగర్రపుండు

1. సంయోగమయిన కొన్ని గంటలు మొదలు కొద్ది దినములలో బయలు పడును.

2. మెత్తగ నుండిన వెంటనే చీము పట్టి గొయ్యి వలె నుండు పుండుగా ఏర్పడును.

3. ఒక పుండు లోని చీము మరియొక చోట నంటి నప్పుడు అక్కడ మరియొక పుండు ఏర్పడును. కావున అనేక పుండ్లు ఒకటే సారి అంగము మీద నున్న యెడల ఆపుండు అడ్డ గర్రలు పుట్టించు పుండని చెప్పవచ్చును.

4. ఈ పుండు విషము గజ్జల లోనికి ఎక్కి అక్కడ బిళ్లలు ఉబ్బి చీము పట్టి అడ్డగర్రలుగా ఏర్పడును.

కొరుకుపుండు

1. సంయోగమైన కొద్ది దినముల వరకు గాని బయల్పడదు.

2. మొట్టమొదట నొక పొక్కుగ యబలు దేరి ఆనప గింజ వలె గట్టిగ నుండి దిమ్మగా నేర్పడి ఒకానొకప్పుడు చీము పట్టకనే కరిగి పోవును. ఒకానొకప్పుడు దీని మీదగాని, చుట్టు ప్రక్కల గాని అడ్డగర్ర పుండు కూడ అంటి యున్న యెడల వ్యాధి ఏది? అయినదియు తెలిసి కొనుట కష్టము. 221

3. ఈ పుండు ఒంటిగ నుండును గాని ఒక చోట నుండి మరియొక చోట నంటదు.

4. దీని విషము గజ్జలలోని కెక్కినప్పుడు అక్కడ బిళ్లలు కొంచెము ఉబ్బి గట్టిగ నుండును గాని దానిలో చీము పట్టదు.

ఈ వ్వాధులు మానవులకు మాత్రము అంటును. ఇతర జంతువులకు మనము బలవంతముగ ఏ విధమున అంటించినను అంటవు. ఇవి వ్యాధి గలిగిన మానవుల నుండియే ఎతర మానవులకు అంటును గాని తమంతటవి ఎవ్వరికిని వ్యాధిగ్రస్తుల సంపర్కము లేదిదే పుట్టవు. ఇవి సామాన్యముగ స్త్రీ పురుష సంయోగముచే వ్వాధి గల స్త్రీల నుండి పురుషులకును, ఈ పురుషుల నుండి తిరిగి ఇతర స్త్రీలకును అంటును. స్త్రీల అవయవముల నుండి ఎప్పటికప్పుడు చీము మొదలగునవి బయటకు పోవుటకు తగినంత అవకాశముండుట చేత ఒక్కొకప్పుడు వీరలను పచ్చ సెగయు, అడ్డ గర్రలను మగ వారలను బాధించి నంతగా బాధింపవు గాని కొరుకు వ్వాధి స్త్రీల యెడల పక్ష పాతమును సామాన్యముగా జూపదు.

నివారించు పద్ధతులు

1. యుక్త వయస్సు వచ్చిన మగ వానికి అయిదారు సంవత్సరముల పిల్లను కట్టి పెట్టినప్పుడు మనస్సు పట్టాజాలని వారలు తప్పుదారుల నడుచుట వలన ఈ వ్వాధులు మన దేశమున 222

నందు హెచ్చుగ వ్యాపించు చున్నవి. ఇట్టి మగ వారలీ వ్యాధులను ఏ పాపమెరుగని తమ భార్యలకు పిట్ట పిడుగున మొట్ట మొదటి సంభోగముననే అంటించి వారలను కూడ తమతో పాటు అపారములగు కష్ట సముద్రముల ముంచు చున్నారు. స్త్రీ పురుషులకు తగిన వయస్సు లందు వివాహములు చేసిన వారలకు యన్యోన్య ప్రేమ హెచ్చు నట్లు జేయుట ఈ వ్యాధుల నివారించుటకు మొదటి సాధనము.

2. వ్యభిచారము హెచ్చుగ నుండు ప్రదేశములలో ఈ వ్యాధులు హెచ్చుగ వ్యాపించు చుండుననుట నిస్సందేహము. పల్లెలలో కంటె పట్టణములలో హెచ్చుగ నుండుటకు ఇదియే కారణము. వ్యభిచారమును తగ్గించుటకు ఇరోపా ఖండమునందు ఒక్కొక్క దేశమందొక్కొక్క కాలమునందు అనేక పద్ధతుల నవలంబించిరి.

(అ) వ్యభిచారము వలన జీవించుట స్త్రీలకు లైసెన్సులనిచ్చి వారు తప్ప ఇతరులు వ్వభిచరించిన యెడల శిక్షకు పాత్రులగుదురని నిర్బందించిరి.

(ఇ) లైసెన్సు గల స్త్ర్తీలను వారమునకు ఒకటి రెండు పర్యాయములు డాక్టర్లు పరీక్షించి వారలకే వ్వాధియంటినను తక్షణమే వైద్య శాలలకు పంపి కుదుర్చుచు, వ్వాధి గల దినములలో వారలితరులకీ వ్యాధుల నంటింప కుండ కాపాడు చుండిరి. 223

(ఉ) తార్పు కత్తెలకును, వ్యభిచారమును రహస్యముగ ప్రోత్సాహ పరచు వారలకును కఠిన శిక్షలు విధించు చుండిరి.

(ఋ) వ్యభిచార స్త్రీలు అన్ని వీధులలో విచ్చల విడిగా తిరుగ కుండ నిర్భంధము లేర్పరచి వీరు నివశించుటకు పట్టణములందలి కొన్ని మారు మూల వీధులను నిరూపించి ఆయా వీధులం యందు తప్ప ఇతర చోట్ల వారి యాటలు సాగకుండ జాగ్రత్త్త పడు చుండిరి. నాటకముల లోనూ, సభలలోను ఉన్నత తరగతుల వారితో వీరు కూర్చుండరాదని నిర్బందించిరి.

ఇట్టి నిర్బంధములు హెచ్చుగ పెట్టుచు వచ్చిన కొలదిని రహస్యముగ వ్వభిచారుము హెచ్చగుచుండెను. విచ్చల విడిగ సంచ రింప వచ్చిన చోట్ల బహిరంగముగనే హెచ్చు చుండెను.

విద్య యొక్క అభివృద్ధిని బట్టి వ్యభిచారము తగ్గ వలసి యున్నది. కాని మిక్కిలి ఐశ్వర్యము ననుభవించు ఐరోపా ఖండమునందు అనేక దేశములలో కూడ వ్యభిచారము హెచ్చగు చుండుట శోచనీయము. ఇది యిట్లుండ మన దేశమునందు మిక్కిలి పూజనీయములగు దేవస్థలములలోను వివాహమహోత్సవములలోను సయితము వ్యభిచరించు స్త్రీలను గౌరవింప కుండ మనకు జరుగ దాయెను. కుత్తి గంటులోని నల్ల పూసలను బోగముదే గ్రుచ్చవలెనట. ఇంత కంటెను మనకు అవమానము గలదా? వ్వభిచారము గర్హ్యముగా నెంచకుండు టట్లుండగా వారలకు తగు వసతులేర్పరచి వంశ పారంపర్యముగ నిదే 224

వృత్తి సలుపు చుండుడని ప్రోత్సాహము చేయుట ఎంతయు శోచనీయము. ఎట్లయినను దేశాభి వృద్ధి గోరు ప్రతి మానవుడును వ్యభి చారమును తగ్గించుటకు తన యావశ్చక్తిని ప్రయత్నములు చేయుట ఈ సుఖ వ్వాధుల వ్వాపకమును తగ్గించుటకు రెండవ సాధనం.

3. సందేహాస్పదమైన సంభోగము చేసిన వారందరును సంభోగానంతరము సంయోగావయములను మిక్కిలి పరిశుభ్రముగ మందు నీళ్లలో కడిగి కొని, వెంటనే మూత్రము విసర్జించు నెడల ఈ వ్యాధులు బహుశః అంటక పోవచ్చును. వ్యాధి యంటి నప్పుడు దానిని దాచి పెట్టక వైద్యుని వద్దకు పోయి వెంటనే చికిత్స చేసి కొనిన యెడల వీని నుండి ఇతరులకంటు అవకాశములు తగ్గి యుండును.

4. కట్టు బట్టలు, చేతి గుడ్డలు, పరుపులు, మంచి నీళ్ళ చెంబులు మంగలి కత్తులు మొదలగు వాని మూలమున చిన్న పిల్లలకు కూడ ఈ వ్యాధులు అంట వచ్చును. కాబట్టి ఒకరు ఉపయోగించిన వస్తువులను చక్కగ శుద్ధి చేయకుండ ఇతరులు ఉపయోగింప రాదు. చంటి పిల్లలకు పాలిచ్చు దాదులకీ వ్యాధులు లేకుండ చూసుకొనవలెను.

5. వ్యభి చారము వలనను, ఈ క్రూర వ్వాధుల వలనను గలుగు అసంఖ్యాకములును అగు దురవస్థలను గూర్చి పిల్లలకు యుక్త వయస్సు రాక పూర్వమే తగిన తరుణమున 225

వివరముగ బోధించు పాఠములను పాఠశాలలో తప్పక భోదింప వలెను. ఈ పద్ధతి వలన పటాలములలో ఈ వ్యాధులు కొంత వరకు లొంగు బాటునకు వచ్చుచున్నవి.

తామర

ఇది 13. వ పటములో చూప బడిన బూజు జాతి సూక్ష్మ జీవిచే కలుగు చున్నది. ఇందనేక జాతులు కలవు. తల వెండ్రుకలలో వచ్చున దొక జాతి. గజ్జలు మొదలగు స్థలములలో శరీర మందు వచ్చున దొక జాతి. గోళ్లలో వచ్చున దొక జాతి. ఇట్లనేక జాతులు గలవు. గోళ్లలో వచ్చు తామరకే పుప్పి గోళ్లని చెప్పుదురు.

ఇది వ్వాపించు విధము

ఇది కుంటుంబములోను బడులలోను ఒకరి బట్టలొకరు కట్టు కొనుట చేతను ఒకరి దువ్వెనలు మంగల కత్తులు టోపీలు తువాళ్లు మొదలగు వని మరియొకరు ఉపయోగించుట చేతను వచ్చును.

నివారించు పద్ధతులు

కొంచెము జాగ్రత్తగ మనము ప్రయత్నించిన ఈ వ్వాధి వ్వాపింప కుండ చేయ వచ్చును. ప్యారిస్ పట్టణములో తారమ యంటిన పిల్లకు ప్రత్యేకమైన స్కూళ్ళు గలవు. మన దేసములో అంత వరకు మనము పోలేక పోయినను సామాన్యముగ మనము చూపగలిగిన శ్రద్ధను చూపి వ్యాధి గల పిల్లలను తరగతిలో వేరుగ కూర్చుండ బెట్ట వలెను. పిల్లలంద 226

ఒకచో నివసించ పలసి వచ్చినపుడు ఒకరి వస్తువుల నొకరు ఉపయోగ పరచ కుండ చేసిన చాలును. మంగలి వాడు తన కత్తులను మిక్కిలి శుభ్రముగ జేసి కొను నట్లుగా చూచి కొన వలెను. అనుమానము గల చోట్ల నెల్ల కత్తిని సల సల క్రాగు నీళ్లలో ముంచి సబ్బుతో శుభ్రముగ కడుగ వలయును. బడికి పోవు పిల్లలను అందు కొరకేర్పరుప బడిన డాక్టర్లు అపుడపుడు సోధించుచు మిక్కిలి వ్వాధిగల పిల్లలను బడికి రాకుండ ఉత్తరువులు చేయ వలెను. అట్టి వారలను వ్వాధి పూర్ణముగా కుదిరినట్లు డాక్టరు సర్టిపికేటు లేనిదే తిరిగి బడిలో చేర్చుకొనకూడదు.

శోభి

ఇదియు తామర వలెనే బూజు జాతిలో చేరిన ఒకానొక సూక్ష్మ జీవిచే అంటు చున్నది. ఇది సామాన్యముగా వయసు వచ్చిన వారికి అంటును గాని 8 సంవత్సరముల పిల్ల వానికి కూడ కాన వచ్చినది. క్షయ జాతి వ్యాధులు గల వార్ల శరీరము మీదను, చెమట పోయు స్వభావము గల ఇతరుల ఇతరుల శరీరము మీదను ఇది ఎక్కువగా కనపడునని తోచు చున్నది. ఇదియు ఒకరి నుండి మరియొకరికి అంటు కొని నదే గాని, భార్య భర్తలలో ఒకరి నుండి మరియొకరికి అంటుట లేదు గావున అంత గా అంటు స్వభావము గలదని చెప్పుటకు వీలు లేదు. దీని నివారించు పద్దతులకు తామర నివారణ పద్ధతులను చూడుము. 227

గజ్జి

ఇది అందరకును తెలిసిన వ్యాధియే. గజ్జి పుండ్లలో 22.వ. పటము లో చూపబడిన పరాన్న భుక్కు, జాతిలోని ఒక చిన్న జంతువుండును. దీని చరిత్రము మిక్కిలి విచిత్రమైనది. తప్పక చదువదగినది. పురుగులకు సామాన్యముగా ఆరు కాళ్ళుండును. దీని కెనిమిది కాళ్ళుండుటచేతే ఇది నిజముగపురుగు జాతిలో చేరినదిని చెప్పుటకు వీలు లేదు. కువురుపులు గల యొకని చేతిని మనము జాగ్రత్త పరీక్షించిన యెడల అందులో ఎక్కడనో ఒక భాగములో తెల్లని గుండ్రని చిన్ననలుసులు వంటి పదార్థములు కనబడును. అవి వట్టికంటికి కనుబడి కనుబడనంతపరిమాణము గలిగి యుండును . కొంచెము హెచ్చు అకారముతో చూపు భూత అద్దముతో ఈనలుసును పరీక్షించిన యెడల ముందు రెండు జతలును, వెనుక రెండు జతలును కాళ్ళు గలిగి తాబేలు వంటి ఆకారము గలిగిన జంవువు కనుపట్టును. ఇదియే ఆడు గజ్జి పురుగు ఇది పొక్కులున్న చోట చీములో నుండక ప్రక్క నెక్కడనో ప్రత్యే కముగ వంకర టింకరగ నుండు నొక సన్న రేఖ యొక్క కొన యందుండును. ఈ రేకలు సామాన్యముగా అర అంగుళము పొడవుగ నుండి స్వచ్యముగనుండు వారి శరీరములో తెల్లగను ఇతరుల శరీరములో కొంచెమించుమించు నల్లగను కనపడును. తల వద్ద నుండి రెండు జతల కాళ్ళకు ముట్టెలుండును. వెన్ముక వైపున నుండు 228

రెండు జతల కాళ్ళకు చేప పొలుసుల వంటి ముండ్లుండును. ఇది చర్మము లోపలకు తొలుచుకొని పోవునపుడు దీని ముందరి కాళ్లు యందుండు ముట్టెలు సహాయము చేయును. ఆడుదాని కడుపులో ఒకటి గాని హెచ్చుగ గాని గ్రుడ్లుంను.

మగది సామాన్యముగా ఆడుదానిని పోలి యున్నను ఆడుదాని కంటె చిన్నది. వెనుక భాగమందుండు కాళ్ళలో చివర జతయందు ముండ్లుకు బదులుగా ముట్టెలుండును. ఈ ముట్టెలు సంయోగ సమయమున సహాయ పడును. వీపు మీద వెనుక భాగమున మధ్య రేఖలో గుర్రపు లాడము వంటి ఆకారముగల ఒక నిర్మాణములో వురుషాంగముండును. ఆడుది అంగుళములో 75 వంతు పొడుగును అంగుళములో 100 వ వంతు వెడల్పును గలిగి యుండును . మగది అంగుణలులో 125 వంతు పంతు పొడుగును 150 వంతు వెడల్పును గలిగి యుండును.

ఆడు గజ్జి పురుగు కడుపుతో నున్నప్పుడు చర్మములోపల కొక మార్గమును తొలుచుకొని పోవుచు తాను పోవు మార్గము యొక్క వెనుక భాగమున గ్రుడ్లను, మలమును యొకానొక విధమైన విషమును విడుచు కొనుచు పోవును. కాని దానికి కావలసిన గాలి నిమిత్తమై ప్రతి దినము చర్మము పైకొకసారి రంద్రము చేసికొని వచ్చి పీల్చుకొని పోవును. దీనికి మన వలె ముక్కును ఊపిరి గొట్టమును లేవు. దీని శరీర మంతట ఉండు సన్నని రంద్రముల గుండా ఇది గాలిని పీల్చు కొనును 229

కొంత గాలిని నోటితో మ్రింగును. ఒక్కొక ఆడుది సామాన్యముగా 15 మొదలు 50 గ్రుడ్లవరకు పెట్టును. ఇంతటితో దాని జీవిత పరమార్థము తీరి అక్కడనే చచ్చును. ఈ గ్రుడ్లు ఐదు మొదలు 15 దినములలో పెద్దవై తల్లి పోయిన మార్గము యొక్క పై గోడను తొలుచుకొని చరీరము పైకి వచ్చును. ఇది ఇట్లు బయటికి వచ్చు నప్పటికి దాని కారుకాళ్లే యుండును. ఇది అనేక విధముల రూప పరిణామము చెంది తుదకు ఎనిమిది కాళ్లు గలిగి ఆడుదిగనో మగదిగనో ఏర్పడును. ఇందు గర్భిణులైన ఆడువి మాత్రమే శరీరములోనికి తొలుచుకొని పోవును. మిగిలిన ఆడువియు మగనియు కూడ శరీరముపై స్వేచ్చగా తిరుగు చుండును. ఇవి రాత్రి మాత్రమే ఆహారమును తినును. తమ పనులను చేసికొనును. అందు చేతనే దురద పోటు మొదలగునవి రాత్రుల యందధికముగా నుండును. రొట్టెలు మొదలగునవి కాల్చు రాత్రి యంతయు మేలుకొని యుండు వారలకు తెల్లవారు జామున 4 గంటలకు బాధ ప్రారంభమగునని కొందరు శోధకులు వ్రాసి యున్నారు. మరి కొందరు రోగులకు రాత్రి 10 మొదలు 12 గంటల వరకు బాధ యధికమగును. ఈ బాధ పురుగు యొక్క చలనము వలననే గాక ఉమ్మి మూలమునను కూడ పుట్టునని తోచు చున్నది. హార్డి అను నతడు 8 గజ్జి పురుగులను ఒక నీటి బొట్టుతో నూరి దానిని తన చేతి వెనుక భాగమున టీకావేసి 230

కొని నట్లుగా గుచ్చి వేసికొనెను. ఇక్కడ అధికమైన దురద పుట్టెను. దీని తలను నోటిని మిక్కిలి శ్రద్ధతో శోధించిన మరియొక వైద్యుడు ఈ ప్రకారము వ్రాయుచున్నాడు: తన దౌడల యొక్క కరుకైన కొనలతో ఇది తన కెరయగువాని శరీరము లోపలకు పొడిచి దాని నుండి ద్రవమును నెత్తురు కణములని పిండు కొని తాను భుజించును.

గజ్జి పురుగు ప్రపంచము నందన్ని భాగముల యందును గలదు. ప్రతి దేశమునందు బీద వార్లను హెచ్చుగను భాగ్య వంతుల నరుదుగను ఇది ఆశ్రయించి యుండును. ఈ వ్వాధి వీరి నుండి మరియొకరి కంటుటకు మొదటి వారి శరీరము లోనుండి రెండవారి శరీరములోనికి గర్భిణితో నున్న ఆడు గజ్జి పురుగొకటి ప్రవేశింపలయును. ఇట్టిది సంభవించుటకు పూర్వము ఒక పడక మీద పరుంటుట గాని లేక అంతటి సంపర్కము కలిగించు ఇతర సంయోగము గాని కావలయును. ఒకరి చేతి నొకరు పట్టు కొనినంత మాత్రమున అంటునని తోచదు. గజ్జి వచ్చిన కుదిరిన వారలు అదియున్నపుడు కట్టిన బట్టలను చక్కగ శుద్ధి చేయ కుండ తిరిగి కట్టు కొనిన యెడల తిరిగి అంట వచ్చును. భాగ్య వంతు లకు నౌకర్ల మూలమున గాని చాకలి వాని మూలమున గాని అంటు కొనవచ్చును. దీనికి పిల్లలు, పెద్దలును, భాగ్వవంతులు, బీదవారును అందరు నొక్కటియే. సోమరులును, దేహమును శుభ్రముగ నుంచు కొనని వారును, దీనికి మిత్రులు. ప్రతి దినము 231

చక్కగ స్నానము చేయు వారి శరీరము మీద నిది పడిన యెడల ఇది లోపల ప్రవేశింపక మునుపే మరియొక చోటు వెదకి కొనవలసి వచ్చును.

నివారించు పద్దతులు

స్నానము చేయునప్పుడు రోగులు ఉపయోగించిన బట్టలను ఇతరులు ఉపయోగింప రాదు. రోగి కట్టుకొను బట్టలను చక్కగ ఉడక బెట్టి ఎండ వేయవలెను. లేని యెడల తన వ్యాధి తకనే ఒక చోట నుండి మరియొ చోటి కంటుకొను చుండును. ఒక ఇంటిలో అనేక మందికీ వ్యాధి అంటి యున్నపుడు అందరకు ఒక్కటే సారి వైద్యము చేయ వలెను. లేని యెడల వీరిని విడిచి వారికి, వారిని విడిచి వీరికి అంటు కొనుచు ఎన్ని దినములు వైద్యము చేసినను వ్యాధి ఆ ఇంటిని విడువక పోవచ్చును. సంపర్కము గల వారలెల్లరు శరీరముల మిక్కిలి శుభ్రముగ తోము కొనుచు దినదినము స్నానము చేయ వలెను.

సమాప్తము

ఇంత వరకు మాకు ముఖ్యమని తోచిన కొన్ని అంటు వ్వాధుల వ్వాపకమును గూర్చియు వాని వ్వాపకమును నివారించు మార్గమును గూర్చియు మాశక్తి కొలది సులభ మైన మాటలతో చర్చించియుంటిమి. ఈ గ్రంధము వైద్యుల కొరకు గాని వైద్యులు కాబోవు వారి కొరకు గాని వ్రాసినది కాదు. దీనిని ముఖ్యముగ ప్రజల కొరకై వ్రాసియుంటిమి ఇందు అనేక వ్యాధులు 232

వ్యాపించు విధమును తెలిసి కొనిన యెడల అవి తమకంట కుండ చేసికొనుటకు మిక్కిలి సులభము. ఈ వ్యాధుల చికిత్సను గూర్చి వ్రాయదలచిన యెడల ఆయా వ్యాధుల లక్షణములను గూర్చి ముందు వ్రాయ వలెను. ఒక్కొక్క వ్యాధిని గూర్చి ప్రత్యేకముగ నొక్కొక్క గ్రంధము వ్రాయ వలసి వచ్చును. అట్లు వ్రాసినను రోగి తనకు తాను తెలిసి, తెలియకుండ చికిత్స చేసికొని వ్యాధిని ముదర బెట్టు కొనక పూర్వమే తగువైధ్యుని సలహాను పుచ్చుకొనుట ఎల్లప్పుడు మంచిది. అర్థజ్ఞాన మెప్పుడును అపాయకరమే. కనుక ఎదో కొంత వరకు చికిత్స చేయుటయు ప్రయత్నించుట కంటే చికిత్సను వైధ్యునకే విడిచి వ్యాధి రాకుండ చేసికొనుటకు ప్రయత్నించుట మాత్రము ప్రజల పని అని యెంచి వారికి సహాయ పడు నిమిత్తము ఈ గ్రంధము నిట్లు ముగించితిని.


.......................................................................................................... (ఈ గ్రంథమును ఆంద్ర విజ్ఞానసర్వస్వములో అంటు వ్వాధులు అను వ్యాసమునుండి పెంచి వ్రాసియున్నాము.)

(ఆంద్రవిజ్ఞాన సర్వస్వము ఆరు సంచికలకు రు. 5.0.0. పోస్టేజి. 0.8. వలయు వారు ఆధ్ర విజ్ఞాన సర్వస్వము ఆఫీసు చింతాద్రి పేట, మదరాసు. అను విలాసమునకు వ్రాయవలయును.)