రోగియైనవాఁడు రోగి నెఱుంగునుసవరించు

రోగియైనవాఁడు రోగి నెఱుంగును
రోగి నరసిచూచి రూఢిగాను
రోగి కిడినవానిరాగి బంగా రౌను
విశ్వదాభిరామ వినర వేమ!

రేచకపూరక కుంభకసవరించు

రేచకపూరక కుంభక
సూచకములు రాజయోగి సుస్థిరమతియై
లోచూపుచూడనొల్లక
వాచాబ్రహ్మంబు పలుకవద్దుర వేమా!

రాజయోగి మహిమ రాజయోగికి గాకసవరించు

రాజయోగి మహిమ రాజయోగికి గాక
ఇతర జనులకెల్ల నేమిదెలియు
తాను దేవుఁడైన దైవముఁ గొలుచునా
విశ్వదాభిరామ వినర వేమ!

రాజయోగీంద్రుఁ డాతఁడై తేజరిల్లుసవరించు

నియమాది సంగుఁడై నిలిచినఁ దత్వంబు - తామసంబగుఁ నిద్రఁ దలఁగఁజేయు
నిద్ర తలంగిన నిర్భీతినొందించు - శమమున నానంద సమితి పుట్టు
నానందమున విశ్వమంతయుఁ దానగుఁ - దాను విశ్వంబయినఁ దత్వమగును
తత్వ మింద్రియ పంచతత్వంబునను - నిల్చుఁ దత్వంబు నిలిచినఁ దానయగును

రాజయోగీంద్రుఁ డాతఁడై తేజరిల్లు
వెలయ జగముల విహరించు విశ్రుతముగ
బాలు విధమున వృద్ధుని పగిదిసోకు
కరణివెంగలిక్రియ చూడ ఘనత వేమా!

రాజవరుల కెపుడు రణరంగముల చింతసవరించు

రాజవరుల కెపుడు రణరంగముల చింత
పరమ మునులకెల్ల పరముచింత
యల్పనరుల కెల్ల నతివలపై చింత
విశ్వదాభిరామ వినర వేమ!

రాజుమాటవలెను రసికుఁ డాడగవలెసవరించు

రాజుమాటవలెను రసికుఁ డాడగవలె
నెంతపనికి నుబికి యెగురరాదు
కదిసి యెగిరెనేని గ్రహసమానము గాదె
దొడ్డ కొంచె మేల దొరకు వేమ!

రాతిప్రతిమ దెచ్చి రాజసంబుననుంచిసవరించు

రాతిప్రతిమ దెచ్చి రాజసంబుననుంచి
పూజసేయు నరుఁడు బుద్ధిమాలి
భావమందుఁ బరము భావించ నేరఁడు
విశ్వదాభిరామ వినర వేమ!

రాతిబసవని గని రంగుగా మ్రొక్కుచుసవరించు

రాతిబసవని గని రంగుగా మ్రొక్కుచు
గునుకుబసవని గని గ్రుద్దుచుండ్రు
బసవభక్తులెల్ల పాపులె తలపోయ
విశ్వదాభిరామ వినర వేమ!

రతిలేక ముదియు నంగనసవరించు

రతిలేక ముదియు నంగన
రతి కలిగిన ముదియు నశ్వరత్నము ధరలో
సతతము భ్రాంతిని చేసెడు
తతిరతిచే ముదియు నరుఁడు తథ్యము వేమా!

రానిధనమునకును దానును కొడుకునుసవరించు

రానిధనమునకును దానును కొడుకును
వాంఛఁబడుటె కాని వట్టి భ్రమలు
భాగ్యహీనునకును ఫలము లభించునా
విశ్వదాభిరామ వినర వేమ!

రెప్పలు మూసియు మూయఁగఁసవరించు

రెప్పలు మూసియు మూయఁగఁ
దప్పక తనమనమునందుఁ దత్వము గూడున్‌
ఎప్పుడు చూచెడువానికిఁ
జొప్పెడు నెచ్చోట ముక్తి సులభము వేమా!

రమణి నవ్వుచుండు రమణుఁడు నేడ్చునుసవరించు

రమణి నవ్వుచుండు రమణుఁడు నేడ్చును
రమణ సేయుచుండు ఱంకుమీర
ఱంకు చూడఁగానె పరమైన తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ!

రామనామపఠన మహిమచే వాల్మీకిసవరించు

రామనామపఠన మహిమచే వాల్మీకి
పరఁగ బోయ యయ్యు బాపఁడయ్యె
కులము ఘనము గాదు గుణము ఘనంబురా
విశ్వదాభిరామ వినర వేమ!

రామవిభుఁడు పుట్టి రఘుకులం బలరించెసవరించు

రామవిభుఁడు పుట్టి రఘుకులం బలరించె
గురువిభుండు పుట్టి కులముచెఱచె
ఎవరి మంచిచెడ్డ లెంచిచూచినఁ దేట
విశ్వదాభిరామ వినర వేమ!

రాయియై యహల్య రాము పాదముసోకిసవరించు

రాయియై యహల్య రాము పాదముసోకి
యాడుదయ్యె నందు రవని జనులు
చేయు సుకృతములిట్లు శిలలైన దప్పవు
విశ్వదాభిరామ వినురవేమ!

రోయవచ్చుఁ బరము రూఢిగాఁ దెలిసినసవరించు

రోయవచ్చుఁ బరము రూఢిగాఁ దెలిసిన
గానవచ్చు గ్రుడ్డు కదలకున్న
రెప్పలార్పకున్న రెంటి సందుననుండి
విశ్వదాభిరామ వినర వేమ!

రుద్రరూపుఁ దాల్చి రుద్రుని నిందించిసవరించు

రుద్రరూపుఁ దాల్చి రుద్రుని నిందించి
భ్రష్టుత్రోవఁ దిరుగు భ్రష్టజనులు
ఱంకులకునుదిరుగు రమణులవలె నుండు
విశ్వదాభిరామ వినర వేమ!

రూఢిగాను భక్తి రూపించి చెప్పినసవరించు

రూఢిగాను భక్తి రూపించి చెప్పిన
వాడె పరమగురుడు వసుధలోన
వేడి పరము గనుటె వేదాంతవేద్యము
విశ్వదాభిరామ వినురవేమ!

రూపడఁగక జీవరూపంబుఁ గనరాదుసవరించు

రూపడఁగక జీవరూపంబుఁ గనరాదు
నట్టిరూప మడగ నలవిగాదు
బ్రహ్మ మడఁగకున్న బ్రహ్మంబుఁ గనఁరాదు
విశ్వదాభిరామ వినర వేమ!

రూపవతులు ముగ్గురు రూపవంతులు చూడసవరించు

రూపవతులు ముగ్గురు రూపవంతులు చూడ
వారి వారి నేల గారవింప
మొద లెఱుగకయున్న మోక్షంబు గలుగునా
విశ్వదాభిరామ వినర వేమ!

రూపు పేరు రెండు రూఢితోఁ గలిసినసవరించు

రూపు పేరు రెండు రూఢితోఁ గలిసిన
పేరు రూపిక్రియలు పెనగిఁయుండు
నామరూపమ్ములు నాశ మొందుటమేలు
విశ్వదాభిరామ వినర వేమ!

రూపు మాయ చూపు రూఢియై వెలుగొందుఁసవరించు

రూపు మాయ చూపు రూఢియై వెలుగొందుఁ
గాదుమాయమ్రానుఁ గల్పతరువు
చూపు గ్రుంగఁ జేసి చూచుట సుఖమురా
విశ్వదాభిరామ వినర వేమ!

రూపులేని వనితరూఢి పతివ్రతసవరించు

రూపులేని వనితరూఢి పతివ్రత
నీటు లేనివాఁడు బంటు కాఁడు
తెలుప వచ్చువాఁడు దేవరబంటురా
విశ్వదాభిరామ వినర వేమ!

రూపువంక పేరు రూఢిగా నిలుచునుసవరించు

రూపువంక పేరు రూఢిగా నిలుచును
పేరువంక క్రియలు పెనగుచుండు
నాశమౌను తుదకు నామరూప క్రియల్‌
విశ్వదాభిరామ వినురవేమ!వేమన పద్యాలు
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |