మంచి రుచులగోరు మంచి స్త్రీలనుగోరుసవరించు

మంచిరుచులను గోరు మంచిస్త్రీలను గోరు
మనుజుఁ డెంత చెడ్డమనసు చూడ
నించుకైన నేలని విడువఁడు
విశ్వదాభిరామ వినర వేమ!

మంచిగంథముగన మనసురంజిల్లునుసవరించు

మంచిగంథముగన మనసురంజిల్లును
ఎంతో వాసననుచు నెన్ను చుంద్రు
తామెరంగలేరు తమ పూర్వ వాసన
విశ్వదాభిరామ వినురవేమ!

మంచివారు లేరు మహిమీఁద వెదకినఁసవరించు

మంచివారు లేరు మహిమీఁద వెదకినఁ
గష్టు లెందరైనఁ గలరు భువిని
పసిఁడి లేదె గాని సదడెంత లేదయా
విశ్వదాభిరామ వినర వేమ!

మంచిశకునము లని యెంచి పెండ్లియాడుసవరించు

మంచిశకునము లని యెంచి పెండ్లియాడు
వార లొకరు లేరు వసుధలోన
జనులకర్మములను శకునము ల్నిల్చునా
విశ్వదాభిరామ వినర వేమ!

మంటికుండవంటి మాయ శరీరంబుసవరించు

మంటికుండవంటి మాయ శరీరంబు
చచ్చునెన్నడైన, చావదాత్మ
ఘటములెన్నియైన గగనమొక్కటేగదా,
విశ్వదాభిరామ వినుర వేమ!

మంటలోహమందు మ్రాకులు శిలలందుసవరించు

మంటలోహమందు మ్రాకులు శిలలందు
పటము గోడలందుఁ బ్రతిమలందు
తన్నుఁ దెలియుకొఱకు తగులదా పరమాత్మ
విశ్వదాభిరామ వినర వేమ!

మంటలోహమునలు మ్రాను చీలలయందుసవరించు

మంటలోహమునలు మ్రాను చీలలయందు
పటముగోడలందుఁ బరగ నిసుక
బెట్టనంటునట్ల పెనఁగు దేహముజీవి
విశ్వదాభిరామ వినర వేమ!

మొండివాని కేల ముంజేతి కడియాలుసవరించు

మొండివాని కేల ముంజేతి కడియాలు
తొఱ్ఱివాని కేల కఱ్ఱపండ్లు
గాడిదలకు నేల గడ్డముల్‌ మీసముల్‌
విశ్వదాభిరామ వినర వేమ!

మంత్రమెల్ల మఱచి మధురాధరముఁగోరుసవరించు

మంత్రమెల్ల మఱచి మధురాధరముఁగోరు
నేవిధమున భక్తుఁ డెఱుఁగు నిన్ను
యోనిఁ జూచి పరమయోగంబు మఱచురా
విశ్వదాభిరామ వినర వేమ!

మంత్రమొకటి చెప్పి మఱి దేవతార్చనసవరించు

మంత్రమొకటి చెప్పి మఱి దేవతార్చన
చేసి తమకుగరుణచెందినదని
వేదపఠన చేసి వెఱ్ఱులై పోదురు,
విశ్వదాభిరామ వినుర వేమ!

మందుదినఁ బోటు మానునుసవరించు

మందుదినఁ బోటు మానును
మందు దినగ జేయఁ బొలఁతి మహిలో వలచు
మందుదిన కుదురు రోగము
మందుదినం గలదు పుష్టి మహిలో వేమా!

మేకఁ జంకఁబెట్టి మెలఁగుచు మందలోసవరించు

మేకఁ జంకఁబెట్టి మెలఁగుచు మందలో
బ్రమసి తిరుగు గొల్లపగిది గాక
దైవ మెఱుఁగక పరదైవముల్‌ దలఁచును
విశ్వదాభిరామ వినర వేమ!

మగఁడు మదనుఁడైన మంచికాఁపురమైనసవరించు

మగఁడు మదనుఁడైన మంచికాఁపురమైన
సహజ మేల మాను జారకాంత
పాలుద్రావు కుక్క బడిబడి పోవదా
విశ్వదాభిరామ వినర వేమ!

మగనికాలమందు మగువ కష్టించినసవరించు

మగనికాలమందు మగువ కష్టించిన
సుతుల కాలమందు సుఖముఁ బొందు
కలిమి లేములెందుఁ గలవెంతవారికి
బలిమి పుత్రబలిమె బలిమి వేమ!

మొగముఁ జూచినపుడె మోహంబు ఘన మౌనుసవరించు

మొగముఁ జూచినపుడె మోహంబు ఘన మౌను
ధనముఁ జూచినపుడె తగులు మనసు
కూలినప్పు డరయకుసులెల్ల విఱుగును
విశ్వదాభిరామ వినర వేమ!

మేఘ మడ్డమయిన మిహిరుని జెఱచునుసవరించు

మేఘ మడ్డమయిన మిహిరుని జెఱచును
జిత్తమడ్డమయిన స్థిరముఁ జెఱచు
పఱుపు లడ్డమైన మఱిముక్తి జెఱచురా
విశ్వదాభిరామ వినర వేమ!

మాట దిద్దవచ్చు మఱియెగ్గు లేకుండసవరించు

మాట దిద్దవచ్చు మఱియెగ్గు లేకుండ
దిద్దవచ్చు ఱాతిఁదిన్నగాను
మనసు దిద్దరాదు మహి నెంతవారికి
విశ్వదాభిరామ వినర వేమ!

మాట లెల్ల కల్ల, మన సెల్ల దొంగకెసవరించు

మాట లెల్ల కల్ల, మన సెల్ల దొంగకె
నేటి ప్రాణ మింక నేటి బ్రతుకు?
మాట సత్యమైన మఱి శతాయుష్యంబు
విశ్వదాభిరామ వినర వేమ!

మాట లుడుగకున్న మంత్రంబు దొరకదుసవరించు

మాట లుడుగకున్న మంత్రంబు దొరకదు
మంత్ర ముడుగకున్న మనసు నిలదు
మనసు నిలుపకున్న మఱి ముక్తి లేదయా
విశ్వదాభిరామ వినర వేమ!

మాటచెఱపు మూట మర్మము కర్మముసవరించు

మాటచెఱపు మూట మర్మము కర్మము
ఆశయ కడగట్టు అప్పుముప్పు
బాస దోస మెన్నఁ బలుకులు ములుకులు
లేశమయినఁ దెలియలేరు వేమా!

మాటనిలుపలేని మనుజుండు చండాలుఁసవరించు

మాటనిలుపలేని మనుజుండు చండాలుఁ
డాజ్ఞ లేనిరాజు ఆఁడుముండ
మహిమలేని వేల్పుమంటిఁ జేసినపులి
విశ్వదాభిరామ వినర వేమ!

మాటలాడ నేర్చి మనసు కరుఁగఁజేసిసవరించు

మాటలాడ నేర్చి మనసు కరుఁగఁజేసి
పరఁగ ప్రియముపుట్టఁ బలుకకున్న
నొకరిచేత సొమ్ము లూరకవచ్చునా
విశ్వదాభిరామ వినర వేమ!

మాటలాడవచ్చు మనసు నిల్పగరాదుసవరించు

మాటలాడవచ్చు మనసు నిల్పగరాదు
తెలుపవచ్చు దన్నుఁ దెలియరాదు
సురియఁబట్టబచ్చు శూరుండు కారాదు
విశ్వదాభిరామ వినర వేమ!

మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదుసవరించు

మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదు
తెలుపవచ్చు దన్ను తెలియలేదు
సురియబట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమ !

మాటలాడవేఱె మనసుకొలఁదియువేఱెసవరించు

మాటలాడవేఱె మనసుకొలఁదియువేఱె
యొడలగుణమువేఱె యోజనవేఱె
యెట్లుగల్గు ముక్తి యేలాగు తనలాగు
విశ్వదాభిరామ వినర వేమ!

మాటలోనివాని మహిమఁ దాఁ దెలియకసవరించు

మాటలోనివాని మహిమఁ దాఁ దెలియక
మాటబయలె లేక మమతఁ జిక్కె
మాట దెలిసెనేని మఱియాత్మ యోగిరా
విశ్వదాభిరామ వినర వేమ!

మాటవిననియాలు మగనికి మృత్యువుసవరించు

మాటవిననియాలు మగనికి మృత్యువు
యోటిపడవ సర్ప మొంటిగృహము
తనకుఁగానియాలు దానవురాలయా
విశ్వదాభిరామ వినర వేమ!

మఠములోన యోగి మాయలన్నియు గోసిసవరించు

మఠములోన యోగి మాయలన్నియు గోసి
ఘటములోననున్న ఘనుని దెలిసి
మాటమాటకు గురు మరువక తలచురా
విశ్వదాభిరామ వినురవేమ!

మేడిపండు చూడ మేలిమైయుండునుసవరించు

మేడిపండు చూడ మేలిమైయుండును
పొట్టవిచ్చి చూడఁ బురుగులుండుఁ
పిరికివాని మదిని బింక మీలాగురా
విశ్వదాభిరామ వినర వేమ!

మతము లెన్నియైన సతముగా నుండవుసవరించు

మతము లెన్నియైన సతముగా నుండవు
సతము కర్మముండు జగతి నొకటి
ఆమతముల విడిచి యా బ్రహ్మమరయుము
విశ్వదాభిరామ వినర వేమ!

మతముదారి యగుచు మధురాధరముఁ జూచిసవరించు

మతముదారి యగుచు మధురాధరముఁ జూచి
మగువరూపుఁ జూచి మనసు మఱచు
యోనిఁజూచి సర్వయోగముల్‌ మఱచురా
విశ్వదాభిరామ వినర వేమ!

మత్సరంబు మదము మమకార మనియెడిసవరించు

మత్సరంబు మదము మమకార మనియెడి
వ్యసనములను దగిలి మసలఁబోక
పరుల కుపకరించి పరము నమ్మిక నుండ
నొనరుచుండు రాజయోగి వేమ!

మాదిగ చెవులను మనసులోఁ బెట్టుకసవరించు

మాదిగ చెవులను మనసులోఁ బెట్టుక
మాదిగలను దెగడు మాదిగపుడు
మంచిగుణములేక మఱిద్విజుఁ డెట్లగు
విశ్వదాభిరామ వినర వేమ!

మాదిగయనవద్దు మీదిగుణమొనరింపసవరించు

మాదిగయనవద్దు మీదిగుణమొనరింప
మాదిగది వసిష్టు మగువలేదె
మాదిగె గుణమున్న మరి ద్విజుడగునయా!
విశ్వదాభిరామ వినురవేమ!

మాదిగయనవద్దు మఱిగుణ మొనసినసవరించు

మాదిగయనవద్దు మఱిగుణ మొనసిన
మాదిగది వసిష్ఠుమగువ చేడె
మాదిగ గుణమున్న మఱి ద్విజుఁడగునయా
విశ్వదాభిరామ వినర వేమ!

మొదట నతఁడు జ్ఞాన ముద్రాంకితుఁడు గాకసవరించు

మొదట నతఁడు జ్ఞాన ముద్రాంకితుఁడు గాక
యావిధమును దెలియ సజ్ఞుఁ డగును
నడుమ జ్ఞాన మొదవ నగుఁబాటు గాదయా
విశ్వదాభిరామ వినర వేమ!

మొదట నాశపెట్టి తుదిలేదు పొమ్మనుసవరించు

మొదట నాశపెట్టి తుదిలేదు పొమ్మను
పరమలోభులైన పాపులకును
వారి యుసురుదాకి వగచెడిపోవరా
విశ్వదాభిరామ వినురవేమ!

మొదటఁ బోయునీవు మొగిబీజముల కెక్కిసవరించు

మొదటఁ బోయునీవు మొగిబీజముల కెక్కి
మొదటి కుఱుకువేగ మొలక లెత్తు
మొలక పృథివిఁ బెరిగి వెలయును వృక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ!

మొదటను మతమును వదలకసవరించు

మొదటను మతమును వదలక
తుద నెవ్వరిమతమునైన దూషింపకయు
పదిలుఁడయి కోర్కెఁగోరక
ముదమునఁ జరియించువాఁడె ముఖ్యుఁడు వేమా!

మదిని గానవలెను మఱిబ్రహ్మమూర్తినిసవరించు

మదిని గానవలెను మఱిబ్రహ్మమూర్తిని
మదినిగన్నవారు మహినిలేరు
వెదకి తనువులోన వేడ్కతో నెఱిఁగిన
యతఁడె యోగివరుఁడు నగును వేమా!

మదినెఱిఁగినవాని మహిఁగాన నెందునుసవరించు

మదినెఱిఁగినవాని మహిఁగాన నెందును
మది నెఱుంగువాఁడు మహిని నరుఁడు
వెదకి తనువులోన వేడ్కతో నినుఁజూచు
విశ్వదాభిరామ వినర వేమ!

మోదమునను గురుని ముఖ్యకరుణచేతఁసవరించు

మోదమునను గురుని ముఖ్యకరుణచేతఁ
దొమ్మిదిస్థలముల దొడ్డు పాయ
సర్వజీవుఁడాయె సర్వమ్ముఁ దానాయె
విశ్వదాభిరామ వినర వేమ!

మదమువలన కలుగు మాటను మరి పల్కిసవరించు

మదమువలన కలుగు మాటను మరి పల్కి
మ్రుచ్చు సిద్ధుల నొగి మోసపుచ్చి
కాసురాబెనగెడు కష్టుండు గురుడౌనె?
విశ్వదాభిరామ వినురవేమ!

మద్యమాంసరుచిని మాదిగె దైవాలసవరించు

మద్యమాంసరుచిని మాదిగె దైవాల
యెంగిలిదినువారి దెట్టికులము
భక్తిని హరిఁగొల్చి భవ్యులుగారైరి
విశ్వదాభిరామ వినర వేమ!

మొదల క్రియను దప్పి మోసంబుచేసియుసవరించు

మొదల క్రియను దప్పి మోసంబుచేసియు
పొట్టకొఱకు మనసుఁ బొందుపఱచి
బీద కుక్కరీతి పెరుగును మనుజుండు
విశ్వదాభిరామ వినర వేమ!

మొదలమ్రాను నగును తుద పక్షియును గాదుసవరించు

మొదలమ్రాను నగును తుద పక్షియును గాదు
నోరు లేదు పండ్లు నాఱు గలుగు
జీవమొకటిలేదు జీవులఁజంపురా
విశ్వదాభిరామ వినర వేమ!

మొదలు చూచిచూచి తుదిఁ జూడకుండెనాసవరించు

మొదలు చూచిచూచి తుదిఁ జూడకుండెనా
చూపు తప్పినపుడె సొరగవలెను
సొరగకున్నవానిఁ జులకగాఁ జూతురు
విశ్వదాభిరామ వినర వేమ!

మధురసములు గోరి మక్షికంబులు చేరిసవరించు

మధురసములు గోరి మక్షికంబులు చేరి
చొచ్చి వెడలలేక చచ్చున్నట్లు
మునిగిఁ వెడల లేఁడు మోహంబు రాశిలో
విశ్వదాభిరామ వినర వేమ!

మానినీమనోజమంది రానందైకసవరించు

మానినీమనోజమంది రానందైక
లోలురెల్ల రూర్వ్ధలోకసుఖము
మాలవాడకుక్క మధురాన్న మెఱుఁగునా
విశ్వదాభిరామ వినర వేమ!

మన్ను మిన్ను నంటి మహిమీఁద నొకకోటసవరించు

మన్ను మిన్ను నంటి మహిమీఁద నొకకోట
కొమ్మ లమరియుండు కొనలుసాగి
దివ్వెలేని వెలుఁగు తేజరిల్లుచు నుండు
విశ్వదాభిరామ వినర వేమ!

మన్నును దినమన్న మండేరు జనులారసవరించు

మన్నును దినమన్న మండేరు జనులార
మంటిలోనిమేలు మఱువనేల
నీళ్లలోనిమేలు నిఖిలమై యుండురా
విశ్వదాభిరామ వినర వేమ!

మన్నుమెత్తి కడిగి మఱిరూపు గావించిసవరించు

మన్నుమెత్తి కడిగి మఱిరూపు గావించి
గుంతనిండఁ బూడ్చి గుఱుతు నిల్పి
మనుజులెల్లఁ గూడి మఱిదేవుఁ డందురు
విశ్వదాభిరామ వినర వేమ!

మనములోనఁ బుట్టు మఱికోర్కులన్నియుసవరించు

మనములోనఁ బుట్టు మఱికోర్కులన్నియు
కోర్కులందు ముక్తి కుదురుపడదు
మనము బ్రహ్మమనుచు మదినెఱుంగఁగ లేరు
విశ్వదాభిరామ వినర వేమ!

మొనసి యింద్రియముల మొదట నిల్పఁగలేకసవరించు

మొనసి యింద్రియముల మొదట నిల్పఁగలేక
సమసిపోవు వేళ సన్యసించు
ఆత్మశుద్ధిలేక యంటునా మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ!

మానసంపురక్తి మసలక యాత్మలోసవరించు

మానసంపురక్తి మసలక యాత్మలో
బోడితలల సొంపు పొల్పుమీఱ
కడుపుకొఱకుఁ దిరుగు కష్టంపుమతితోడ
విశ్వదాభిరామ వినర వేమ!

మానసంబు మంచిమల్లెపూవులచవికెసవరించు

మానసంబు మంచిమల్లెపూవులచవికె
బావితోఁటచేసి బాలఁగూడి
భోగినయ్యెద ననఁ బోయెపో కాలంబు
విశ్వదాభిరామ వినర వేమ!

మనసనలము రెంటికినిలసవరించు

మనసనలము రెంటికినిల
ఘనమును కొంచెంబుఁ దెలియఁగావలె సుమ్మీ
కనుమూసి తెరచినంతనె
ఘనమై విహరించుమనసుఁగానరు వేమా!

మనసు గెలచి పూని మన్నసుజ్ఞానులుసవరించు

మనసు గెలచి పూని మన్నసుజ్ఞానులు
కడఁక మోక్షపదముఁ గనుచునుండ్రు
చెట్టుఁబెట్ట ఫలము చేకూర కుండునా
విశ్వదాభిరామ వినర వేమ!

మనసు నిల్పినట్టి మర్మజ్ఞులగువారుసవరించు

మనసు నిల్పినట్టి మర్మజ్ఞులగువారు
గరిమ మోక్షపదముఁ గన్నవారు
చెట్టుఁబెట్ట ఫలము చేకొనఁడాతాను
విశ్వదాభిరామ వినర వేమ!

మనసు నిల్పలేని మాయావిరక్తులుసవరించు

మనసు నిల్పలేని మాయావిరక్తులు
మనసుపడుదు రొక్క మగువమీదఁ
నిట్టివ్యర్థజన్మ మీ బ్రతుకేటికి
విశ్వదాభిరామ వినర వేమ!

మనసు ముక్తియనుచు మది నెఱుంగఁగలేరుసవరించు

మనసు ముక్తియనుచు మది నెఱుంగఁగలేరు
మనసుచేతఁ దగిలి మాయమైరి
మనసు తానయైన మర్మజ్ఞుడగు యోగి
విశ్వదాభిరామ వినర వేమ!

మనసు హక్కు కర్మ మదియేమి లేకయసవరించు

మనసు వాక్కు కర్మ మరి యేమి లేకయు
రాకపోకలేని రాజవీధి
పరగ హాని గలదె పరతత్వయోగికి
విశ్వదాభిరామ వినర వేమ!

మనసుఁ బాఱవీడి మనసుఁ దా మగుడించిసవరించు

మనసుఁ బాఱవీడి మనసుఁ దా మగుడించి
మనసులోనఁగలుగు మర్మమెఱిగి
మనసు తాను నిల్ప మఱియుఁదా బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!

మనసున నెఱుకను మరుపునఁసవరించు

మనసున నెఱుకను మరుపునఁ
గని విని చూడంగలేరు కదిసినపిదప
పెనగొని పట్టినచోనది
మనచోటను మాయమౌను మహిలో వేమా!

మనసునందు ముక్తిమలయుచు నుండంగసవరించు

మనసునందు ముక్తిమలయుచు నుండంగ
మనసు లెఱుఁగలేక మనుజులెల్ల
మనసు నంటలేక మాయమై పోదురు
విశ్వదాభిరామ వినర వేమ!

మనసులోన నున్న మమత లన్నియుఁ గోసిసవరించు

మనసులోన నున్న మమత లన్నియుఁ గోసి
దృఢముఁ జేసి మనసు తేటఁబఱచి
ఘటము నిల్పువాఁడు ఘనతరయోగిరా
విశ్వదాభిరామ వినర వేమ!

మనసులోని ముక్తి మఱియొక్క చోటనుసవరించు

మనసులోని ముక్తి మఱియొక్క చోటను
వెదుకఁబోవువాఁడు వెఱ్ఱివాఁడు
గొఱ్ఱెఁ జింకఁ బెట్టి గొల్ల వెదుకురీతి
విశ్వదాభిరామ వినర వేమ!

మనసులోని శివుని మానుగాఁ దెలిసినసవరించు

మనసులోని శివుని మానుగాఁ దెలిసిన
యోగియండ్రు వాని యుర్విజనులు
జీవునిన్నెఱుఁగ నీవెపో శివుఁడవు
విశ్వదాభిరామ వినర వేమ!

మనసులోనఁ దెలిసి మనసులోనే కలిసిసవరించు

మనసులోనఁ దెలిసి మనసులోనే కలిసి
మనసులోనివాని మరలఁదిగిచి
మనసునిల్పువాఁడు మర్మజ్ఞుఁడగు యోగి
విశ్వదాభిరామ వినర వేమ!

మనసులోనివాని మానుగాఁ దెలిసినసవరించు

మనసులోనివాని మానుగాఁ దెలిసిన
నుర్విజనులువాని యోగి యండ్రు
నీవె నిన్నెఱుంగ నీవెపో శివుఁడవు
విశ్వదాభిరామ వినర వేమ!

మనసుసూచి గెల్చి మనసులో సుఖియించిసవరించు

మనసుసూచి గెల్చి మనసులో సుఖియించి
కడకు మోక్షపదము గనునువాఁడు
చెట్టుఁబెట్టు ఫలము చేకూర కుండునా
విశ్వదాభిరామ వినర వేమ!

మాయ జగమటంచు మనుజులు చెప్పేరుసవరించు

మాయ జగమటంచు మనుజులు చెప్పేరు
మాయగాదు కర్మ మయముగాని
మాయమైన జగము మరియేడ నున్నదో
విశ్వదాభిరామ వినురవేమ!

మాయ నరకమనుచు మాయ రోయకసాటిసవరించు

మాయ నరకమనుచు మాయ రోయకసాటి
సమముగ నరదేవసభలయందు
నందఱు ఘనులయిన హరునకుఁ దావేది
విశ్వదాభిరామ వినర వేమ!

మాయను చెఱసాల మనమను గొలుసునుసవరించు

మాయను చెఱసాల మనమను గొలుసును
భేదమనెడుబొండ బెరసియుండు
ఇట్టిబద్ధజీవి కెన్నడు మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ!

మాయరూపు రూపు మాయ తాఁజేసియుసవరించు

మాయరూపు రూపు మాయ తాఁజేసియు
మాయరూపులఁ బెనుమాయఁజేసి
మాయలోని మాయమహిమ నెఱుంగురా
విశ్వదాభిరామ వినర వేమ!

మాయల సంసారమునకుసవరించు

మాయల సంసారమునకు
మాయలనే తిరుగుచుండు మనుజుఁడులోనై
మాయలఁ దెలిసిన యంతట
మాయలనే ముక్తి గలుగు మహిలో వేమా!

మాయలోక మన్న మర్మంబు దెలియకసవరించు

మాయలోక మన్న మర్మంబు దెలియక
మాయఁజిక్కి యంత మాయఁబడిరి
మాయ దెలియ దివ్వె మాయదా జన్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!

మాయలోనఁ బుట్టి మాయలోననె పెరిగిసవరించు

మాయలోనఁ బుట్టి మాయలోననె పెరిగి
మాయఁ దెలియలేని మనుజుఁడేల
మాయఁ దెలియువాఁడు మహిమీఁద ధన్యుండు
విశ్వదాభిరామ వినర వేమ!

మ్రాకున ననలము పుట్టునుసవరించు

మ్రాకున ననలము పుట్టును
మ్రాకెదుగును ననలమునకు మనుజునిలోన
మ్రాకుననలముల క్రియఁ జీ
జా కుడి నయోగి నెవరు గానరు వేమా!

మ్రానుఁ గాలవేసి మహిమీఁద నొకజాణసవరించు

మ్రానుఁ గాలవేసి మహిమీఁద నొకజాణ
పూని తిరుగుచుండుఁ బొందుగాను
కాలవేయు మ్రాను కడురమ్యమైయుండు
విశ్వదాభిరామ వినర వేమ!

మ్రానులోన నగ్ని మఱియుండఁగా వచ్చుసవరించు

మ్రానులోన నగ్ని మఱియుండఁగా వచ్చు
నగ్ని నుండ మ్రాను కలవిగాదు
మ్రానులోనియగ్ని మర్యాద సంసారి
విశ్వదాభిరామ వినర వేమ!

మర్మ మెఱుఁగలేక మతములఁ గల్పించిసవరించు

మర్మ మెఱుఁగలేక మతములఁ గల్పించి
యుర్విదుఃఖు లగుదు రొకరి కొకరు
గాజువంటిఁ గుక్క కళవళపడురీతి
విశ్వదాభిరామ వినర వేమ!

మర్మమంతగొనకు మనసైన్యమేగానసవరించు

మర్మమంతగొనకు మనసైన్యమేగాన
పరరహస్య మంత బయలుపడదు
పడినమనస దెన్న బయలుపడినరీతి
విశ్వదాభిరామ వినర వేమ!

మ్రుచ్చు తీర్థమేగి ముల్లె విడుచును గానిసవరించు

మ్రుచ్చు తీర్థమేగి ముల్లె విడుచును గాని
మ్రొక్కఁబ్రొద్దు లేదు మొనసి యెపుడు
కుక్క యిల్లుచొచ్చి కుండలు వెతుకదా
విశ్వదాభిరామ వినర వేమ!

మిఱపగింజఁ జూడ మీఁద నల్లగనుండుఁసవరించు

పర్వత వనవాసి పరిణామ వర్తన
కూపవాసి కెట్టు గుఱుతుపడును
బ్రహ్మవిష్ణువెంటఁ బ్రాకృతుఁ డరుగునా
విశ్వదాభిరామ వినర వేమ!

మఱవవలె భావసంగతిసవరించు

మఱవవలె భావసంగతి
మఱవంగావలెను దురము మఱి విశ్వములో
మఱవవలెఁ బరులనేరము
మఱవంగా వలదు మేలు మహిలో వేమా!

మాల మాలకాడు మహిమీద నేప్రొద్దుసవరించు

మాల మాలకాడు మహిమీద నేప్రొద్దు
మాటతిరుగువాఁడు మాలగాక
వాని మాలయన్నవాఁడెపో పెనుమాల
విశ్వదాభిరామ వినర వేమ!

మాల మేలుగుణము మంచిది కల్గినసవరించు

మాల మేలుగుణము మంచిది కల్గిన
మాలకూడుగుడుచు మనుజుకంటె
గుణము మేలుగాని, కులమేమి మేలురా!
విశ్వదాభిరామ వినురవేమ!

మొలక చనులనాఁడు మూఁడు కోటులు చేయుసవరించు

మొలక చనులనాఁడు మూఁడు కోటులు చేయు
కులుకు చనులనాఁడు కోటిసేయు
తటుకుచనులనాఁడు దమ్మిడి చేయదో
విశ్వదాభిరామ వినర వేమ!

మెలత నడవినుంచి మృగమువెంటనె పోయెసవరించు

మెలత నడవినుంచి మృగమువెంటనె పోయె
రామచంద్రుకన్న రసికుఁడేడి
చేటుకాలమునకు చెడుబుద్ధి పుట్టును
విశ్వదాభిరామ వినర వేమ!

మాలవాఁడయినను మఱియాత్మమీఁదనుసవరించు

మాలవాఁడయినను మఱియాత్మమీఁదను
మనసు నిల్పెనేని మాలగాఁడు
మనసు నిల్పకున్న మహిమీఁద మాలఁడు
విశ్వదాభిరామ వినర వేమ!

మాలవాని నంటి మఱినీళ్ళ మునిగేరుసవరించు

మాలవాని నంటి మఱినీళ్ళ మునిగేరు
మనుజకర్మచేత మాలఁడయ్యె
నేలతెలియలేరో యీ నరపశువులు
విశ్వదాభిరామ వినర వేమ!

మాలవానినేల మరి మరి నిందింపసవరించు

మాలవానినేల మరి మరి నిందింప
నొడల రక్తమాంస మొకటెగాదె
వానిలోన మెలఁగువాని కులంబేది
విశ్వదాభిరామ వినర వేమ!

మాలవానిఁ జూచి యేల నిందింపఁగసవరించు

మాలవానిఁ జూచి యేల నిందింపఁగ
పాటిలేనిమాట పలుకు టొకటె
వానిలోనఁ బల్కు వానికులం బేది
విశ్వదాభిరామ వినర వేమ!

మాసిన తలతోడ మలినవస్త్రముతోడసవరించు

మాసిన తలతోడ మలినవస్త్రముతోడ
నొడల జడ్డుతోడ నుండెనేని
యగ్రజన్ముఁడయిన నట్టెపొమ్మందురు
విశ్వదాభిరామ వినర వేమ!

మహిని దధిని ఘృతము మ్రానులం దనలంబుసవరించు

మహిని దధిని ఘృతము మ్రానులం దనలంబు
సౌరుసుమములందు సౌరభంబు
తిలలఁ దైలమట్ల తేజరిల్లుఁ జిదాత్మ
విశ్వదాభిరామ వినర వేమ!

మోహము తీఱక యుండినసవరించు

మోహము తీఱక యుండిన
దాహంబై దేహమంత దల్లడపడ నీ
గేహములోఁ బోరాడక
దేహమునం దున్న శివునిఁ దెలియర వేమా!

ముండమోపితోడ మునుఁగుచుఁ దేలుచుసవరించు

ముండమోపితోడ మునుఁగుచుఁ దేలుచు
నుండఁగానె మోహ ముండెఁ గాక
అండఁబాయు వెనుక నాయాసలే లేవు
విశ్వదాభిరామ వినర వేమ!

ముందరి పోటుల మాన్పనుసవరించు

ముందరి పోటుల మాన్పను మందెందును గలదుగాని మహిలోపల నే నిందల పోటులు మాన్పెడు మందెచ్చట నైనఁ గలదె మహిలో వేమా!

ముక్కు గోరును సద్గంధములను జెలఁగిసవరించు

చెవులు గోరును మంచి జిలిబిలిపాటలఁ - దియ్యని మాటల తెఱఁగు వినఁగ
జన్మంబు గోఱును సరవితోడుత శీత - పృథుల సంస్పర్శ సంపదల నెపుడు
కన్నులు గోరును గమలయవర్ణంబు - లయినట్టి రూపంబు లనువుతోడ
నాలుక గోరును నయముతోడ తీపు - నొగరు కారమ్ము చేదుప్పు పులుసు

ముక్కు గోరును సద్గంధములను జెలఁగి
చెవులు చర్మంబు కన్నులు జిహ్వ ముక్కు
నిన్నియుం చాడినటువంటి యిల్లురోసి
తన్ను గనుగొని సుఖియింపఁ దగును వేమ!

ముక్కుత్రాళ్ళ గ్రుచ్చి ముఱికిపోవఁగఁ దోమిసవరించు

ముక్కుత్రాళ్ళ గ్రుచ్చి ముఱికిపోవఁగఁ దోమి
కచ్చనీరు నించి కడిగి కడిగి
డొక్క దోమినంత దొరకునా తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ!

ముక్కుతుదను దృష్టి ముదముతోడుత నిల్పిసవరించు

ముక్కుతుదను దృష్టి ముదముతోడుత నిల్పి
హృదయమందుఁజూడ నొసగుముక్తి
పదవులెరుగకున్న పరమాత్మ యోగియౌ
విశ్వదాభిరామ వినర వేమ!

ముక్తి యెవరిసొమ్ము ముక్కుమీదుగ జూడ!సవరించు

ముక్తి యెవరిసొమ్ము ముక్కుమీదుగ జూడ!
భక్తి యెవరిసొమ్ము భజనసేయ
శక్తి యెవరిసొమ్ము యుక్తిచే సాధింప
విశ్వదాభిరామ వినురవేమ!

ముగ్గురి నెఱుఁగునట్టి మూలంబు నెఱిఁగియుసవరించు

ముగ్గురి నెఱుఁగునట్టి మూలంబు నెఱిఁగియు
ముగ్గురిమీఁద నొకటి మునుపు తెలిసి
పరగఁజిహ్వచేతఁ బ్రస్తుతి చేయరా
విశ్వదాభిరామ వినర వేమ!

ముగ్గురిలోన హెచ్చు ముందుగా కనలేకసవరించు

ముగ్గురిలోన హెచ్చు ముందుగా కనలేక
నరకమునకుఁ బోవు నరులు గలరు
ముగ్గురికిందనట్టి మూలమూర్తి యొకండు
విశ్వదాభిరామ వినర వేమ!

ముట్టుముట్టనుచును ముట్టరా దందురుసవరించు

ముట్టుముట్టనుచును ముట్టరా దందురు
ముట్టుకు దరి యేమి మూలమేమి
నవబిలములముఱికి నరుల కందఱకును
విశ్వదాభిరామ వినర వేమ!

మునిఁగి బ్రాహ్మణుండు ముందుఁగానకపోయెసవరించు

మునిఁగి బ్రాహ్మణుండు ముందుఁగానకపోయె
తిరిగి తిరిగి యతఁడు ద్రిమ్మ రాయె
కూసికూసితుదకు కుక్కయై పోయెరా
విశ్వదాభిరామ వినర వేమ!

మునిఁగి మునిఁగి మునిఁగి ముద్దయై ముద్దయైసవరించు

మునిఁగి మునిఁగి మునిఁగి ముద్దయై ముద్దయై
వనరి వనరి వనరి వక్కి వక్కి
తిరిగి తిరిగి తిరిగి దిమ్మరై యుండును
విశ్వదాభిరామ వినర వేమ!

మునిజనములు కలఁగ మునిఁగి వెళ్ళిన బావిసవరించు

మునిజనములు కలఁగ మునిఁగి వెళ్ళిన బావి
బ్రహ్మకుఁ దలయెత్తరాని బావి
మొలల బంటిగానుముంచు నెవ్వరినైన
విశ్వదాభిరామ వినర వేమ!

మురియు వాఁ డెవఁడు? మురియని దెవ్వఁడు?సవరించు

మురియు వాఁ డెవఁడు? మురియని దెవ్వఁడు?
పాటు జేసి చూడ బట్ట బయలు;
సొరిది జల ఘటమున సూర్యుని చందంబు
విశ్వదాభిరామ వినర వేమ!

ముఱికికొంపలోన నిఱికించి జీవునిసవరించు

ముఱికికొంపలోన నిఱికించి జీవుని
కర్మపాశములను గట్టివేసి
నిట్టికర్మజీవి కెట్లొకో మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ!

ముఱికిలోనఁ బుట్టి ముఱికిలోనఁ బెరిగిసవరించు

ముఱికిలోనఁ బుట్టి ముఱికిలోనఁ బెరిగి
ముఱికితనువు కింత మురిప మేల
ముఱికి తెలియు నరుఁడు ముఱుగునఁ బుట్టునా
విశ్వదాభిరామ వినర వేమ!

ముష్టి వేపచెట్టు మొదలుగా ప్రజలకుసవరించు

ముష్టి వేపచెట్టు మొదలుగా ప్రజలకు
పరఁగ మూలికలకు పనికివచ్చు
నిర్దయాత్మకుండు నీచుఁడెందునకును
పనికిరాఁడు గదర పరఁగ వేమ!

మూఁడులోకములను మొనసి యొక్కటిఁజేసిసవరించు

మూఁడులోకములను మొనసి యొక్కటిఁజేసి
యారులోకములను నట్లగూర్చి
స్థిరముగాను నుండు శివమూర్తి గురుఁడయా
విశ్వదాభిరామ వినర వేమ!

మూఁడువేళలందు ముదముతో శివు నాత్మఁసవరించు

మూఁడువేళలందు ముదముతో శివు నాత్మఁ
బూజచేయువాఁడు పుణ్యమూర్తి
పూజలేక మోక్షభోగంబు దొరకునా
విశ్వదాభిరామ వినర వేమ!

మూఢ భక్తిచేత ముక్కంటి బూజింపసవరించు

మూఢ భక్తిచేత ముక్కంటి బూజింప
మున్ను బోయవరుడు ముక్తుడాయె
పూజలేమి? తనదు బుద్ధిప్రధానము
విశ్వదాభిరామ వినురవేమ!

మూఢకోపములను మోహలాభంబులుసవరించు

మూఢకోపములను మోహలాభంబులు
నక్కజంపు క్రూర మధిక మయ్యె
కక్కసంబుచేతఁ గాలునిచేతను
మొక్కఁబోదురు తుది మొనసి వేమ!

మూల మెవ్వ రనుచు ముగ్గురిలోపలసవరించు

మూల మెవ్వ రనుచు ముగ్గురిలోపల
మూల మెఱుఁగలేరు మూఢజనులు
మూలమందఱకును ముఖ్యమౌఁ గర్మము
విశ్వదాభిరామ వినర వేమ!

మూల విద్యయందు ముఖ్యతేజములోనసవరించు

మూల విద్యయందు ముఖ్యతేజములోన
మెలగు చిత్పరుండు మిహిరు పగిది
కాలకర్మములకు కాలుండె సాక్షిరా
విశ్వదాభిరామ వినురవేమ!

మూలచక్ర మట్టె మొనసి గట్టిఁగ బట్టిసవరించు

మూలచక్ర మట్టె మొనసి గట్టిఁగ బట్టి
శోధఁజేసి శక్తి చొరవ దెలిసి
భేదపరచి మనసు బాధించి మోక్షము
సాధ్యమైన యోగి సరణి వేమా!


మృగములను, నరులకు మేలుగా పశువులుసవరించు

మృగములను, నరులకు మేలుగా పశువులు
తినగ, దున్న, పాలుకొనగ బుట్టి
కష్టపడును గాని కర్మ మీడేరదే!
విశ్వదాభిరామ వినురవేమ!

మఠములోనియోగి మాయలన్నియుగోసిసవరించు

మఠములోనియోగి మాయలన్నియుగోసి
ఘటములోన నున్న ఘనునిదెలిసి
మాట మాటకుగురు మరువక తెలుపురా,
విశ్వదాభిరామ వినుర వేమ!

మదము వలన గలుగు మాటలు మఱిపల్కిసవరించు

మదము వలన గలుగు మాటలు మఱిపల్కి
మ్రుచ్చు సద్దులనొగి మోసపుచ్చి
కాసురాబెనగెడు కష్ఠుండు గురుడౌనే?
విశ్వదాభిరామ వినుర వేమ!

మది గలిగిన పూజ మదనారి మెచ్చునుసవరించు

మది గలిగిన పూజ మదనారి మెచ్చును
మనసు నిల్సినంత మహితుడగును
మనసులేని పూజ మట్టి సమానము
విశ్వదాభిరామ వినుర వేమ!

మనసే మాయా మృగమౌసవరించు

మనసే మాయా మృగమౌ
మననేమిటి పైకిగానీ మణిపోనీకా
మనసున మనసును జంపిన
మనందే ముక్తిగలదు మహిలో వేమా!

మంట లోహమందు మ్రాకుల శిలలందుసవరించు

మంట లోహమందు మ్రాకుల శిలలందు
పటములందు గోడప్రతిమలందు
తన్నుదెలియు కొఱకుదగులదా పరమాత్మ
విశ్వదాభిరామ వినుర వేమ!
వేమన పద్యాలు
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |