భోగంబుల కాశింపకసవరించు

భోగంబుల కాశింపక
రాగద్వేషంబు రంగుడదమలో
వేగమె మోక్ష పదంబును
రాగను నాతండు యోగిరాయుడు వేమా!

భాగ్యవంతురాలు పరులయాఁకలి దప్పిసవరించు

భాగ్యవంతురాలు పరులయాఁకలి దప్పి
దెలిసి పెట్టనేర్చుఁ దీర్ప నేర్చు
తర దుష్టురాలు తన యాఁకలినె గాని
పరులయాఁక లెఱుంగ దరయ వేమ!

భాగ్యహీనులకును వరుసవేది దొరుకసవరించు

భాగ్యహీనులకును వరుసవేది దొరుక
నదియు నిల్వదపుడు వదలుఁగాక
వానతోడ వచ్చువడగండ్లు నిలుచునా
విశ్వదాభిరామ వినర వేమ!

భాతవతులమనుచు పరగంగనెవ్వరుసవరించు

భాతవతులమనుచు పరగంగనెవ్వరు
వారినెరుగలేరు పరుసతోడ
ఆడుపాడువారలరయ భాగవతులా!
విశ్వదాభిరామ వినురవేమ!

భేదాభేదంబులకునుసవరించు

భేదాభేదంబులకును
వాదంబై జనముచూడ వర్తించును నా
భేదాభేదము లుడిగిన
వేదాంత ధ్యాని యగుచు వెలుఁగుర వేమా!

భయమంతయు దేహముదేసవరించు

భయమంతయు దేహముదే
భయ ముడిగిన నిశ్చయంబు పరమాత్మునిదే
లయమంతయు దేహముదే
జయమంతయు జీవుఁడనుచుఁ జాటర వేమా!

భయముసుమీ యజ్ఞానముసవరించు

భయముసుమీ యజ్ఞానము
భయముడిగిన నిశ్చయంబు పరమార్థంబౌ
లయముసుమీ యీ దేహము
జయముసుమీ జీవుఁడనుచుఁ జాటర వేమా!


భవము సాగరంబు భార్యయౌ మకరంబుసవరించు

భవము సాగరంబు భార్యయౌ మకరంబు
చేప జలగ లగును శిశువులెల్ల
భవహరు తలపక పారమందగ లేరు
విశ్వదాభిరామ వినురవేమ!

భూతి దేహమందుఁ బూసిన నాయెనాసవరించు

భూతి దేహమందుఁ బూసిన నాయెనా
నిష్ఠ శివునియందె నిలుపవలయుఁ
గాని భస్మమందు గాడిదె పొర్లదా
విశ్వదాభిరామ వినర వేమ!

భూపతి కృప నమ్మి భూమి జెఱుచు వాఁడుసవరించు

భూపతి కృప నమ్మి భూమి జెఱుచు వాఁడు
ప్రజల యుసురు దాకి పడును పిదప
యెగర వేయ బంతి యెందాక నిల్చురా
విశ్వదాభిరామ వినర వేమ!

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వుసవరించు

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుఁ జూచి ధనము నవ్వు
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ!

భూమిలోనఁ బుట్టు భూభార మెల్లనుసవరించు

భూమిలోనఁ బుట్టు భూభార మెల్లను
తనువులోనఁ బుట్టు దత్వమెల్ల
శ్రమములోనఁ బుట్టు సర్వంబుఁ దానౌను
విశ్వదాభిరామ వినర వేమ!

భూమిలోనఁ బుణ్యపురుషులు లేకున్నసవరించు

భూమిలోనఁ బుణ్యపురుషులు లేకున్న
జగములేలనిల్చు సమయుఁగాక
నంత దఱచుదొరక రాడ నాడనెగాని
విశ్వదాభిరామ వినర వేమ!వేమన పద్యాలు
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |