పంకజాక్షిఁ గన్న బంగరు పొడగన్నసవరించు

పంకజాక్షిఁ గన్న బంగరు పొడగన్న
దిమ్ముబట్టియుండు తెలివి కెల్ల
మనుజులకును తత్వమహి మెట్టు గల్గురా
విశ్వదాభిరామ వినర వేమ!

పొంకములకు మనసుఁ బోనీక సర్వేశుసవరించు

పొంకములకు మనసుఁ బోనీక సర్వేశు
వంక నిలుపువాఁడు వంశపరుఁడు
వంక నిల్పకున్న వచ్చునా పదవులు
విశ్వదాభిరామ వినర వేమ!

పంచాక్షరి పూజలచేసవరించు

పంచాక్షరి పూజలచే
సంచితముగ నెఱుఁగు నాతఁ డఖిలజ్ఞుండై
వంచన మెఱుఁగక కువలయ
సంచారము సేయు నతఁడు శంభుఁడు వేమా!

పంచవర్ణు నెఱుఁగఁ బరము నెఱుంగునుసవరించు

పంచవర్ణు నెఱుఁగఁ బరము నెఱుంగును
పరము నెఱుగ నిచ్ఛ ప్రజ్వరిల్లు
ప్రజ్వరిల్లునాఁడు పరముతా నౌనయా
విశ్వదాభిరామ వినర వేమ!

పంచశత్రుఁ దెగడి పంచబాణుని గెల్చిసవరించు

పంచశత్రుఁ దెగడి పంచబాణుని గెల్చి
పంచవర్ణములను పఠనఁ జేసి
పంచముఖములు గల భవసంజ్ఞ గలవాని
పంచఁ జేరువాఁడు పరుఁడు వేమా!

పిండములను జేసి పితరులఁదలపోసిసవరించు

పిండములను జేసి పితరులఁదలపోసి
కాకులకును బెట్టు గాడ్దెలార
పెంటఁదినెడు కాకి పితరుఁ డెట్లాయెనో
విశ్వదాభిరామ వినర వేమ!

పండువలనఁ బుట్టె పరఁగ ప్రపంచంబుసవరించు

పండువలనఁ బుట్టె పరఁగ ప్రపంచంబు
పండువలనఁ బుట్టె పరము నిహము
పండు కాసపడిరి బ్రహ్మాది సురలెల్ల
విశ్వదాభిరామ వినర వేమ!

పంద నధికుఁ జేసి బవరంబునకుఁ బంపఁసవరించు

పంద నధికుఁ జేసి బవరంబునకుఁ బంపఁ
బాఱిపోవుఁ గార్యభంగమౌను
పాఱునట్టిబంటు పనికిరాఁ డెందును
విశ్వదాభిరామ వినర వేమ!

పంది పిల్ల లీనుఁ బదియు నైదింటినిసవరించు

పంది పిల్ల లీనుఁ బదియు నైదింటిని
కుంజరంబు యీను కొదమ నొకటి
యుత్తమ పురుషుండు నొక్కఁడు జాలడా
విశ్వదాభిరామ వినర వేమ!

పెక్కుజనులఁ జంపి పేదల వధియించిసవరించు

పెక్కుజనులఁ జంపి పేదల వధియించి
డొక్కకొరకు నూళ్లు దొంగలించి
యెక్కడికిని బోవ నెఱిఁగి యముఁడు చంపు
విశ్వదాభిరామ వినర వేమ!

పికము వనములోన విలసిల్ల పలికినసవరించు

పికము వనములోన విలసిల్ల పలికిన
భంగి ప్రాజ్ఞుడనుల పలుకుకులుకు
కాకికూతఁ బోలుఁ గర్మబంధులకూఁత
విశ్వదాభిరామ వినర వేమ!

పాగ పచ్చడంబు పైకిఁ గూసంబునుసవరించు

పాగ పచ్చడంబు పైకిఁ గూసంబును
పోగు లుంగరములు బొజ్జకడుపు
గలిగినట్టివానిఁ గందురు చుట్టముల్‌
విశ్వదాభిరామ వినర వేమ!

పగయుడుగుఁ గోప ముడిగినఁసవరించు

పగయుడుగుఁ గోప ముడిగినఁ
బగ యుడుగ గోర్కులుడుగు పరజన్మముల
దగు లుడుగు భేద ముడిగినఁ
ద్రిగుణము లుడుగంగ ముక్తి స్థిరమగు వేమా!

పగలురేయి మరచి భావంబు లోపలఁసవరించు

పగలురేయి మరచి భావంబు లోపలఁ
దాను నేను ననెడు తలఁపు మఱచి
యున్నయట్టి యతఁడు నుత్తమ యోగిరా
విశ్వదాభిరామ వినర వేమ!

పచ్చఁజూచువారు పచ్చ మెచ్చెడివారుసవరించు

పచ్చఁజూచువారు పచ్చ మెచ్చెడివారు
పచ్చబడెడువారు చెడ్డవారు
పచ్చ విడుచువాని ప్రభువుఁగా జూతురు
విశ్వదాభిరామ వినర వేమ!

పచ్చవిల్తుచేత గ్రచ్చఱ జను లెల్లసవరించు

పచ్చవిల్తుచేత గ్రచ్చఱ జను లెల్ల
తచ్చవాడఁ బడిరి ధరణిలోన
కులజుఁ డెవ్వఁ డిందుఁ గులహీనుఁ డెవ్వడు
విశ్వదాభిరామ వినర వేమ!

పెట్టి పోయ లేని వట్టి నరులు భూమిసవరించు

పెట్టి పోయ లేని వట్టి నరులు భూమి
పుట్ట నేమి? వారు గిట్ట నేమి?
పుట్టలోనఁ జెదలు పుట్టదా గిట్టదా?
విశ్వదాభిరామ వినర వేమ!

పెట్టినంత ఫలము పెక్కండ్ర కుపహతిఁసవరించు

పెట్టినంత ఫలము పెక్కండ్ర కుపహతిఁ
జేయకున్నఁ దాను జెఱుపకున్న
పెండ్లిసేయునట్టి పెద్దఫలంబురా
విశ్వదాభిరామ వినర వేమ!

పట్టనేర్చు పాము పడగ నోరఁగఁజేయుసవరించు

పట్టనేర్చు పాము పడగ నోరఁగఁజేయు
చెఱుపఁజూచువాఁడు చెలిమిఁజేయు
చంపఁ దలఁచురాజుచనువిచ్చు చూడరా
విశ్వదాభిరామ వినర వేమ!

పెట్టిపోయ నొగిని విరుగుఁడు సౌఖ్యంబుసవరించు

పెట్టిపోయ నొగిని విరుగుఁడు సౌఖ్యంబు
బలుచచ్చినగతి యదియుగాక
నుండు నాశివుండు నొగివానియందున
విశ్వదాభిరామ వినర వేమ!

పొట్టివాఁడు కీడు పొదిలపురుగు కీడుసవరించు

పొట్టివాఁడు కీడు పొదిలపురుగు కీడు
వట్టియాస కీడు వరడు కీడు
పొట్టిచేయికాలు పొసగుట కీడురా
విశ్వదాభిరామ వినర వేమ!

పట్టుకొమ్మ లేక బలుపాట్ల బడువారుసవరించు

పట్టుకొమ్మ లేక బలుపాట్ల బడువారు
పెట్టిపోయ లేక తిట్టువారు
ముట్టిశివునిపూజ మొదలు సేయరు వారు
విశ్వదాభిరామ వినర వేమ!

పట్టుకొమ్ము వదలి పలవింప నేటికిసవరించు

పట్టుకొమ్ము వదలి పలవింప నేటికి
ఇట్టె గురుని వేడి గుట్టునెరిగి
నిట్టనిలువుగాంచి నిర్గుణ మందరా
విశ్వదాభిరామ వినురవేమ!

పట్టుచీరఁ గట్టి పట్టె తిరుమణి నిడిసవరించు

పట్టుచీరఁ గట్టి పట్టె తిరుమణి నిడి
సృష్టివైష్ణవంబు శిఖలు మించె
చిన్నెలన్ని చేసి చేర వైష్ణవ మిట్లు
విశ్వదాభిరామ వినర వేమ!

పట్టుపాగఁ జుట్టి పట్టుదోవతిఁ గట్టిసవరించు

పట్టుపాగఁ జుట్టి పట్టుదోవతిఁ గట్టి
వట్టి వైష్ణవుండు మిట్టిపడును
చిన్నె లింతెకాని శ్రీవైష్ణవమతంబు
విశ్వదాభిరామ వినర వేమ!

పెట్టువార లెవరు పెట్టకుందు రెవరుసవరించు

పెట్టువార లెవరు పెట్టకుందు రెవరు
పెట్టిపుట్టినట్టిదిట్ట లెవరు
పట్టుదప్పకుండ భావించి చూడరా
విశ్వదాభిరామ వినర వేమ!

పట్టువస్త్రములను పరఁగ భూషణములుసవరించు

పట్టువస్త్రములను పరఁగ భూషణములు
కుదువ లిడుటలెల్ల గొదువవద్దు
లనుభవింపఁగూడఁ డతఁడెంతవాఁడైన
విశ్వదాభిరామ వినర వేమ!

పొట్లకాయ రాయి పొడవు త్రాటను గట్టసవరించు

పొట్లకాయ రాయి పొడవు త్రాటను గట్ట
లీలతోడ వంక లేక పెరుఁగు
కుక్కతోఁక గట్టఁ జక్కఁగా వచ్చునా
విశ్వదాభిరామ వినర వేమ!

పాడిగాదు జగతి పంచాంగములు సెప్పిసవరించు

పాడిగాదు జగతి పంచాంగములు సెప్పి
కొంచమైన బుద్ధి నొందలేక
బ్రహ్మ మెరుగ కిట్లు పౌరోహితముచేయ
విశ్వదాభిరామ వినురవేమ!

పడిపడి మ్రొక్కఁగ నేటికిసవరించు

పడిపడి మ్రొక్కఁగ నేటికి
గుడిలోపలి కఠినశిలల గుణములు చెడునా
గుడి దేహ మాత్మదేవుఁడు
చెడురాళ్ళకు వట్టిపూజ సేయకు వేమా!

పిడుగును నరచేతఁ బిగఁబట్టి యందులోఁసవరించు

పిడుగును నరచేతఁ బిగఁబట్టి యందులోఁ
గల్మషంబునెల్ల కడకఁదీసి
కడమచేతి చేత కలియుగమును బ్రోచు
కర్మ కర్మ నెఱుగఁ గదర వేమా!

పడుచు పక్వమెన్నఁ బసివాఁ డెఱుంగునాసవరించు

పడుచు పక్వమెన్నఁ బసివాఁ డెఱుంగునా
యెఱుక దివ్యయోగి యెఱుఁగుఁగాక
మోహగుణ మెఱింగి మోహంబు విడనాఁడు
విశ్వదాభిరామ వినర వేమ!

పతికి మాఱుపల్కు పడతియే శునకంబుసవరించు

పతికి మాఱుపల్కు పడతియే శునకంబు
మీఱుసతిని గవయ మిగులు వగలు
పంది పంది కూడి పడదొకో రొంపిలో
విశ్వదాభిరామ వినర వేమ!

పతిని విడువరాదు పదివేలకైననుసవరించు

పతిని విడువరాదు పదివేలకైనను
పెట్టి చెప్పరాదు పేదకైన
పతిని దిట్టరాదు పతి రూపవతియైన
విశ్వదాభిరామ వినర వేమ!

పతియొప్పిన సతి యొప్పునుసవరించు

పతియొప్పిన సతి యొప్పును
సతిపతు లొకటైనఁ బరమపావన మందూ
స్సతిపతిన్యాయమె మోక్షం
బతులితపరమాత్మ నైక్య మగురా వేమ!

పెద్దల వచనములఁ బ్రేమతోఁ జూచి తాసవరించు

పెద్దల వచనములఁ బ్రేమతోఁ జూచి తా
నటుల నడవఁబోవ ననువుపడదు
పులిని చూచి నక్క పూతఁపూసిన యట్లు
విశ్వదాభిరామ వినర వేమ!

పేదరిక మంతదోషముసవరించు

పేదరిక మంతదోషము
లేదే యీ జగతిలోన నీశ్వరుఁ డెఱుఁగ
పేదను పొడఁగనువాడు
గాదము విధమునను జూచుఁ గదరా వేమా!

పేదవాని బాధ పెనుభూతమై యుండుసవరించు

పేదవాని బాధ పెనుభూతమై యుండు
చూడ నట్టిబాధ జాడ కనదు
కలుగువాని బాధ కనులఁ జూడఁగ రామి
కేమి చెప్పవచ్చు నింక వేమా!

పదుగు రాడుమాట పాటియై ధరఁజెల్లుసవరించు

పదుగు రాడుమాట పాటియై ధరఁజెల్లు
నొక్కఁడాడుమాట యెక్కదెందు
నూరకాడుకాని కూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినర వేమ!

పనితొడవులు వేఱు బంగార మొక్కటిసవరించు

పనితొడవులు వేఱు బంగార మొక్కటి
పరగ ఘటము వేఱు ప్రాణమొకటి
అరయఁ దిండ్లు వేఱు ఆఁకలి యొక్కటి
విశ్వదాభిరామ వినర వేమ!

పనసతొనలకన్నఁ బంచదారలకన్నసవరించు

పనసతొనలకన్నఁ బంచదారలకన్న
జుంటితేనెకన్న జున్నుకన్నఁ
జెఱకురసముకన్నఁ జెలిమాట తీపురా
విశ్వదాభిరామ వినర వేమ!

పాప మనఁగ వేఱె పరదేశమున లేదుసవరించు

పాప మనఁగ వేఱె పరదేశమున లేదు
తనదు కర్మములను దగిలియుండు
కర్మ తంత్రిగాక, గనుకని యుంటొప్పు
విశ్వదాభిరామ వినర వేమ!

పాపపుణ్యములును పసిమిగా పెఱిగినాసవరించు

పాపపుణ్యములును పసిమిగా పెఱిగినా
ధరను నరయ యోగి యెఱుగుఁగాక
లోనిపొందికఁగని లోహముల్‌ గూర్పరో
విశ్వదాభిరామ వినర వేమ!

పప్పులేని కూడు పరుల కసహ్యమౌసవరించు

పప్పులేని కూడు పరుల కసహ్యమౌ
నప్పులేనివాఁడె యధిక బలుఁడు
ముప్పులేనివాఁడు మొదల సుజ్ఞానుఁడు
విశ్వదాభిరామ వినర వేమ!

పాముకన్న లేదు పాపిష్టిజీవముసవరించు

పాముకన్న లేదు పాపిష్టిజీవము
అట్టిపాము చెప్పినట్టు వినును
ఇలను మూర్ఖుఁ దెలుప నెవ్వరి వశమౌ
విశ్వదాభిరామ వినర వేమ!

పరఁగ జలకమాడి పట్టెనామముదీర్చిసవరించు

పరఁగ జలకమాడి పట్టెనామముదీర్చి
నీరుకావిపంచె నెగడఁగట్టి
వారకాంతఁజూచి వ్రతమెల్ల మఱచురా
విశ్వదాభిరామ వినర వేమ!

పరఁగ బొమ్మగుడ్డు పరికించి చూచినసవరించు

పరఁగ బొమ్మగుడ్డు పరికించి చూచిన
కులముల నిలయందుఁ గూడఁబెట్టు
నందఱొకటఁ గలియ నన్నదమ్ములె కదా
విశ్వదాభిరామ వినర వేమ!

పరఁగ ముందఱ తమ బ్రతుకుతె ర్వెఱుఁగకసవరించు

పరఁగ ముందఱ తమ బ్రతుకుతె ర్వెఱుఁగక
సకల సంపదలును సతము లనుచు
జలముఁ బాయు చేఁపచంద మేర్పడి తుద
గతియువేఱెలేక గలుగు వేమా!

పరఁగ రాజకులు పాతిన ధనమెల్లసవరించు

పరఁగ రాజకులు పాతిన ధనమెల్ల
భటులపాలు కవులపాలు తలఁప
నొనర హీనజనుని ధనము దాయాదుల
పాలు జారకాంత పాలు వేమా!

పరఁగ లేమిచేత బంధువుల్‌ పగవారుసవరించు

పరఁగ లేమిచేత బంధువుల్‌ పగవారు
పరఁగ లేమిచేతఁ బరము తప్పు
పరఁగ లేమిచేతఁ బరపతి దప్పురా
విశ్వదాభిరామ వినర వేమ!

పరఁగఁదానొసఁగక పరులు చెప్పినదైనసవరించు

పరఁగఁదానొసఁగక పరులు చెప్పినదైన
నియ్యజాలకవిధి నెసఁగువాఁడు
పొట్టుఁదినెడులండి బువ్వలు పెట్టునా
విశ్వదాభిరామ వినర వేమ!

ప్రాఁతచేసిన నర్తనల్‌ పదటఁగలిపిసవరించు

ప్రాఁతచేసిన నర్తనల్‌ పదటఁగలిపి
క్రొత్తనర్తనఁ జేతురు కోడెకాండ్రు
కన్నతల్లిని విడనాడి కష్టపెట్టి
యన్యకాంతలఁ బోషించునట్లు వేమ!

ప్రాకటమున నిట్టిలోకములోఁ గుంటిసవరించు

ప్రాకటమున నిట్టిలోకములోఁ గుంటి
పల్లెముత్తఁ డెన్న పరమగురుడు
అన్నదానమునను హరిపూజచేతను
హరుని లోనఁగలసె నరయ వేమా!

పరగ చెట్టుఁబెట్టి పాలింప కుండెనాసవరించు

పరగ చెట్టుఁబెట్టి పాలింప కుండెనా
వెలుగుదాటి వీధి వెళ్ళిరాఱు
ఆడువారి చిత్త మటువలె నుండురా
విశ్వదాభిరామ వినర వేమ!

పరగ నీవఱకును పడినపా ట్లెఱుగకసవరించు

పరగ నీవఱకును పడినపా ట్లెఱుగక
ఘనుఁడుగాగ మనుజుఁ డనఁగఁ బుట్టి
కీడు మే లెఱుఁగక క్రిందాయెఁ జూడరా
విశ్వదాభిరామ వినర వేమ!

పరగ రాతిగుండు పగులఁగొట్టఁగ వచ్చుఁసవరించు

పరగ రాతిగుండు పగులఁగొట్టఁగ వచ్చుఁ
గొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరగింప రాదయా
విశ్వదాభిరామ వినర వేమ!

పరగనింతవరకు పడినపాటెరుగరుసవరించు

పరగనింతవరకు పడినపాటెరుగరు
ఘనతనొప్పు మనుజుడనగ బుట్టి
కీడు మేలెరుగుక క్రిందాయె జూడరా
విశ్వదాభిరామ వినురవేమ!

పరగనిలను ముందు బ్రతుకుతీరెరుగకసవరించు

పరగనిలను ముందు బ్రతుకుతీరెరుగక
సకల సంపదలను సతములనుచు
కర్మ మర్మములను కనలేరు మూర్ఖులు
విశ్వదాభిరామ వినురవేమ!

ప్రజ యొనర్చుచెడ్డ ప్రభువుకు వచ్చునుసవరించు

ప్రజ యొనర్చుచెడ్డ ప్రభువుకు వచ్చును
ప్రభువు మంచికొరత ప్రజలకు సగము
ప్రభు వొనర్చు చెడ్డ ప్రజల కేలరాదురా
విశ్వదాభిరామ వినర వేమ!

ప్రజ లెఱుంగ బ్రదుకుఁ బట్టభద్రుఁడు గాఁడుసవరించు

ప్రజ లెఱుంగ బ్రదుకుఁ బట్టభద్రుఁడు గాఁడు
పైఁగిరీటముండు బ్రహ్మగాఁడు
ఓగుఁ దెలిసి పలుకు యోగీశ్వరుఁడు గాఁడు
అట్టివానిఁ దెలియ నగును వేమ!

ప్రాణ లింగ మెన్నఁ బ్రార్థించి కీర్తించిసవరించు

ప్రాణ లింగ మెన్నఁ బ్రార్థించి కీర్తించి
కట్టివేయ నేమి కల్గఁజేసె
నఖిలజనులకెల్ల నానందమే సాక్షి
విశ్వదాభిరామ వినర వేమ!

ప్రణవ మరయలేక భక్తుఁడు గాలేఁడుసవరించు

ప్రణవ మరయలేక భక్తుఁడు గాలేఁడు
జ్యోతి నరయలేక జోగికాఁడు
నిత్య మరయలేక నిర్వాణికాఁడయా
విశ్వదాభిరామ వినర వేమ!

ప్రణవ మెఱుఁగఁ బోఁడు భక్తుఁ డెప్పుడు గాఁడుసవరించు

ప్రణవ మెఱుఁగఁ బోఁడు భక్తుఁ డెప్పుడు గాఁడు
జ్యోతియెఱుఁగఁ బోడు యోగిగాఁడు
నిత్య మెఱుఁగ వాఁడు నిర్వాణిగాఁడయా
విశ్వదాభిరామ వినర వేమ!

ప్రణవమంత్రమహిమ భావింప లింగంబుసవరించు

ప్రణవమంత్రమహిమ భావింప లింగంబు
మూడుమూర్తులందు మొనసియుండు
నతని నెఱిఁగి కొలువ నన్యుల వశమా
విశ్వదాభిరామ వినర వేమ!

ప్రేతయన్న మనుచుఁ బ్రీతితోఁ బిలిపించిసవరించు

ప్రేతయన్న మనుచుఁ బ్రీతితోఁ బిలిపించి
కాకులకును బెట్టు కర్ములార
కాకులందు నేమి ఘనులకుఁ బెట్టుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ!

పరధనమ్ములకును బారుగా చెయిపట్టిసవరించు

పరధనమ్ములకును బారుగా చెయిపట్టి
సత్యమింతలేక చారుఁడయ్యె
ద్విజుఁ డనుకొనుఁదాదు తేజమింతయు లేక
విశ్వదాభిరామ వినర వేమ!

పరధనములను చెయిపట్టెను మిక్కిలిసవరించు

పరధనములను చెయిపట్టెను మిక్కిలి
స్వంతమింతలేక జారుడయ్యె
ద్విజుడనుకొను తాను తేజమింతయులేక
విశ్వదాభిరామ వినురవేమ!

పరనారీ దూరగుడైసవరించు

పరనారీ దూరగుడై
పరధనముల కాసపడక పరహితదారై
పరులలిగిన దానలుగక
పరులెన్నగ బ్రతుకువాఁడు ప్రాజ్ఞుఁడు వేమా!

పరిపక్వ మొప్ప శిష్యునిసవరించు

పరిపక్వ మొప్ప శిష్యుని
కురమందలి బయలుచూపి యుద్ధతిమీఱన్
పరిపూర్ణమందచేసెడు
గురుడు పరబ్రహ్మమైన గుణనిధి వేమా!

పరబలంబుఁజూచి ప్రాణరక్షణమునసవరించు

పరబలంబుఁజూచి ప్రాణరక్షణమున
కుఱికి పాఱిపోవు పిఱికినరుఁడు
యముఁడు కుపితుఁడైన నడ్డ మెవ్వండయా
విశ్వదాభిరామ వినర వేమ!

ప్రభుని కిచ్చునట్లు పేదలకియ్యరుసవరించు

ప్రభుని కిచ్చునట్లు పేదలకియ్యరు
వనిత కిచ్చునట్లు వడుగు కీరు
సురకు నిచ్చునట్లు సుమతుల కియ్యరు
మనసు పదిలపడదు మహిని వేమా!

ప్రభువు కోఁతియైనఁ బ్రగ్గడ పందియౌసవరించు

ప్రభువు కోఁతియైనఁ బ్రగ్గడ పందియౌ
సైనికుండు పక్కి సేన పసులు
ఏనుఁగు లశ్వము లెలుకలు పిల్లులు
విశ్వదాభిరామ వినర వేమ!

పరమహంస ననుచు వరవఁ గట్టుక భూమిసవరించు

పరమహంస ననుచు వరవఁ గట్టుక భూమి
పరధనముల కాసపఁడెను వాఁడు
పరమహంస గాఁడు పరమహింసుఁ డటండ్రు
విశ్వదాభిరామ వినర వేమ!

ప్రియము సత్యమెప్డు పృథివిఁ బల్కెడువానిసవరించు

ప్రియము సత్యమెప్డు పృథివిఁ బల్కెడువాని
నోరె యమృతవాపి మారులేదు
అనుదినంబుచూడ ననృతమాడెడినోరు
నోరె కాదు క్రింది నోరు వేమ!

ప్రియములేని విందు పిండివంటలచేటుసవరించు

ప్రియములేని విందు పిండివంటలచేటు
భక్తిలేని పూజ పత్రిచేటు
పాత్ర మెఱుఁగ నీవి బంగారు చేటురా
విశ్వదాభిరామ వినర వేమ!

పరయువతిరతంబు పాటించి కోరినసవరించు

పరయువతిరతంబు పాటించి కోరిన
కోటిపూజలెల్లఁ గొల్లఁబోవు
సెగకు పొంతనున్న చెడదె తాపముచేత
విశ్వదాభిరామ వినర వేమ!

ప్రళయకాలమందు ప్రమధులచేతనుసవరించు

ప్రళయకాలమందు ప్రమధులచేతను
నష్టమైరిగాదె నాటిజనులు
తెలియనేరరైరి దేవుని ద్విజులెల్ల
విశ్వదాభిరామ వినర వేమ!

పర్వత వనవాసి పరిణామ వర్తనసవరించు

పర్వత వనవాసి పరిణామ వర్తన
కూపవాసి కెట్టు గుఱుతుపడును
బ్రహ్మవిష్ణువెంటఁ బ్రాకృతుఁ డరుగునా
విశ్వదాభిరామ వినర వేమ!

ప్రస్తుతించువేళ బద్యంబుఁ జదివినఁసవరించు

ప్రస్తుతించువేళ బద్యంబుఁ జదివినఁ
దప్పుదగిలియున్న నొప్పియుండు
వెలఁది సురతవేళ బిత్తరై యొప్పదా
విశ్వదాభిరామ వినర వేమ!

పేరు సోమయాజి పెనుసింహబలుఁడయాసవరించు

పేరు సోమయాజి పెనుసింహబలుఁడయా
మేఁకపోతుఁబట్టి మెడలువిఱవఁ
గానిక్రతువువంకఁ గలుగునా మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ!

పరుల కుపకరించి పరుసొమ్ము పరునకుసవరించు

పరుల కుపకరించి పరుసొమ్ము పరునకు
పరఁగ నిచ్చె నేని పరము గల్గు
పరముకన్న నేమి పావనమా సొమ్ము
విశ్వదాభిరామ వినర వేమ!

పరుల కుపకరింప పాపక్షయంబగుసవరించు

పరుల కుపకరింప పాపక్షయంబగు
పరుల కుపకరింపఁ బట్టుకొమ్మ
పరుల కుపకరింపఁ బరలోక సిద్ధియు
పరుల కుపకరింప బలిమి వేమ!

పరుల నిందఁజేసి పరులు నావారనిసవరించు

పరుల నిందఁజేసి పరులు నావారని
స్థిరము నస్థిరము తెలియలేక
పరఁగ దన్నుఁ జేతఁబట్టుక పెట్టిన
పెట్టుగాదు కట్టిపెట్టు వేమా!

పరుల మోసపుచ్చి పరధన మార్జించిసవరించు

పరుల మోసపుచ్చి పరధన మార్జించి
కడుపునింపుకొనుట కానిపద్దు
ఋణముసేయు మనుజుఁ డెక్కువ కెక్కునా
విశ్వదాభిరామ వినర వేమ!

పరులదత్త మిట్లు పాలనఁ జేసినసవరించు

పరులదత్త మిట్లు పాలనఁ జేసిన
నిల స్వదత్తమునకు నినుమడియగు
నవని పరులదత్త మపహరించిన స్వద
త్తంబు నిష్ఫలంబు ధరణి వేమ!

పరుస మినుముసోకి బంగారమైనట్లుసవరించు

పరుస మినుముసోకి బంగారమైనట్లు
కప్పురంబు జ్యోతిఁ గలసినట్లు
పుష్పమందు దావి పొసఁగినట్లగు ముక్తి
విశ్వదాభిరామ వినర వేమ!

పాల నీడిగింటఁ గ్రోలుచు నుండెనాసవరించు

పాల నీడిగింటఁ గ్రోలుచు నుండెనా
మనుజు లెల్లగూడి మద్యమండ్రు
నిలువఁదగనిచోట నిలువ నిందలు వచ్చు
విశ్వదాభిరామ వినర వేమ!

పాలఁగలయు నీరు పాలెయై రాజిల్లుసవరించు

పాలఁగలయు నీరు పాలెయై రాజిల్లు
నదియు పానయోగ్య మయినయట్లు
సాధుసజ్జనముల సాంగత్యములచేత
మూఢజనుఁడు ముక్తి మొనయు వేమ!

పిలిచినఁ బల్కకుండు మరి పిల్చిన నేమనకూరకుండుఁ దసవరించు

పిలిచినఁ బల్కకుండు మరి పిల్చిన నేమనకూరకుండుఁ ద
దలఁచిన నెవ్వ రేమనినఁ దన్నునుగాదని నవ్వుచుండు నా
త్మలఁ దలపోయుచుండు నెఱ తత్వము నిత్యము దానయై సదా
తెలిసినయోగి వేమనగతి శివరూపుఁడు నెల్లతావుల

పాలనీరుక్రమము పరమహంస యెఱుంగుసవరించు

పాలనీరుక్రమము పరమహంస యెఱుంగు
నీరుపాలక్రమము నెమలి కేల
అజ్ఞుఁడయినవాఁడు నలశివు నెఱుఁగునా
విశ్వదాభిరామ వినర వేమ!

పాలపిట్ట శకున ఫలమిచ్చునందురుసవరించు

పాలపిట్ట శకున ఫలమిచ్చునందురు
పాలపిట్ట కేమి ఫలము తెలియు
తనదు మేలుకీళ్ళు తనతోడనుండగ
విశ్వదాభిరామ వినురవేమ!

పిల్లి యెలుకబట్టఁ బ్రియమున నుండగసవరించు

పిల్లి యెలుకబట్టఁ బ్రియమున నుండగ
నదియు కోడిఁబట్ట ననుగమించు
మమత విడువకున్న మానునా మోహంబు
విశ్వదాభిరామ వినర వేమ!

పాలలోన బులుసు లీలతోఁ గలిసినసవరించు

పాలలోన బులుసు లీలతోఁ గలిసిన
విఱిసి తునుక లగును విరివిగాను
తెలివి మనసులోన దివ్యతత్వ్తము తేట
విశ్వదాభిరామ వినర వేమ!

పాలు పంచదార పాపరపండ్లలోసవరించు

పాలు పంచదార పాపరపండ్లలో
చాలఁబోసి పండ్లఁ జవికిరావు
కుటిలమానవులకు గుణ మేల కలుగురా
విశ్వదాభిరామ వినర వేమ!

పాలు పెరుగు వెన్న పాయసాన్నము నెయ్యిసవరించు

పాలు పెరుగు వెన్న పాయసాన్నము నెయ్యి
జున్ను లెన్నియైనఁ జూడ పాలె
పొలవంటికులము బ్రహ్మంబు కానరో
విశ్వదాభిరామ వినర వేమ!

పలుకుమన్న నేల పలుకక యున్నావుసవరించు

పలుకుమన్న నేల పలుకక యున్నావు
పలుకుమయ్య నాతో ప్రబలముగను
పలుకుమయ్య! నీదు పలుకు నేనెఱిఁగెద
విశ్వదాభిరామ వినర వేమ!

పలుగురాళ్ళఁ దెచ్చి పరఁగగుడులు కట్టిసవరించు

పలుగురాళ్ళఁ దెచ్చి పరఁగగుడులు కట్టి
చెలఁగిశిలలసేవఁ జేయనేల
శిలలసేవఁ జేయ ఫలమేమి గల్గురా
విశ్వదాభిరామ వినర వేమ!

పలుగువాని కేల పరసమృద్ధి దలంపసవరించు

పలుగువాని కేల పరసమృద్ధి దలంప
పలుగువాని కేల భక్తిపదము
పలుగువాని కేల పరమార్థ తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ!

పలుగువానికేల పదనమృద్ధి దలంపసవరించు

పలుగువానికేల పదనమృద్ధి దలంప
పలుగువరుస వానిబలిమి దప్ప
చలమువాని కేల సాత్వికధర్మంబు
ఏమి యొకటి ఘనము నిలను వేమా

పిసిని వాని యింట పీనుఁగు వెడలినసవరించు

పిసిని వాని యింట పీనుఁగు వెడలిన
కట్ట కోలలకును కాసు లిచ్చి
వెచ్చ మాయె నంచు వెక్కి వెక్కేడ్చురా
విశ్వదాభిరామ వినర వేమ!

పసులవన్నె వేఱు పాలెల్లనొక్కటిసవరించు

పసులవన్నె వేఱు పాలెల్లనొక్కటి
పుష్పజాతి వేఱు పూజయొకటి
దర్శనంబు వేఱు దైవంబ యొక్కటి
విశ్వదాభిరామ వినర వేమ!

పుట్టలోన తేనె పుట్టినరీతినిసవరించు

పుట్టలోన తేనె పుట్టినరీతిని
గుట్టమీఁద మణియు పుట్టువిధము
కట్టెలోన నగ్ని పుట్టినవిధమున
పుట్టి పెట్టవలెను భువిని వేమా!

పుట్టు బిత్తలి వలె పోవు బిత్తలి వలె;సవరించు

పుట్టు బిత్తలి వలె పోవు బిత్తలి వలె;
తిరుగు బిత్తలి వలె, దేహి ధరణి
యున్న నాటి కైన నుపకారి గాలేఁడు
విశ్వదాభిరామ వినర వేమ!

పుట్టుదుఃఖమునను పొరలుదుఃఖముననుసవరించు

పుట్టుదుఃఖమునను పొరలుదుఃఖమునను
గిట్టుదుఃఖమునను క్రిం దగుదురు
మనుజదుఃఖమువలె మఱిలేదు దుఃఖంబు
విశ్వదాభిరామ వినర వేమ!

పుట్టువార లెవరు పుట్టకుందు రెవరుసవరించు

పుట్టువార లెవరు పుట్టకుందు రెవరు
పుట్టిగిట్టినట్టి పురుషు లెవరు
పుట్టిపుట్టనియట్లు బోధించి చూడరా
విశ్వదాభిరామ వినర వేమ!

పుట్టుశక్తు లైదు పుడమి నటింపగసవరించు

పుట్టుశక్తు లైదు పుడమి నటింపగ
వ్రిపులెల్ల వేదవేత్తలండ్రు
శక్తిపుత్రుకులము జగతిలో నెఱుగరో
విశ్వదాభిరామ వినర వేమ!

పుడమి నుప్పరంబుఁ బురిగొల్పి జగములసవరించు

పుడమి నుప్పరంబుఁ బురిగొల్పి జగముల
రక్ష సేయగల్గు రాజు లెవరు
మహిసతి యనుపేర మనుజున కేడదో
విశ్వదాభిరామ వినర వేమ!

పుత్తడిగలవాని పుష్ట్రంబు పుండైనసవరించు

పుత్తడిగలవాని పుష్ట్రంబు పుండైన
వసుధలోన చాల వార్త కెక్కు
పేదవానియింట పెండ్లయిన నెఱుఁగరు
విశ్వదాభిరామ వినర వేమ!

పురహరునకు నేఁతపరువు తానేసినసవరించు

పురహరునకు నేఁతపరువు తానేసిన
స్థిరముగల్గు జ్ఞానజీవ మయ్యె
నేత కేమివచ్చె నిజభక్తి హేతువు
విశ్వదాభిరామ వినర వేమ!

పురుషుఁ డెఱుఁగఁ జంపు భూపతి వినఁజేటుసవరించు

పురుషుఁ డెఱుఁగఁ జంపు భూపతి వినఁజేటు
నఖిలనిందలకును నాలయంబు
పరపురుష గమనము ప్రత్యక్ష నరకము
విశ్వదాభిరామ వినర వేమ!

పురుషుఁడెన్నిగతులఁబుట్టువు మొదలుగఁసవరించు

పురుషుఁడెన్నిగతులఁబుట్టువు మొదలుగఁ
బాపచింతఁజేయు జాపలమున
మహిని కుంటినక్క మాంసముదిన్నట్లు
విశ్వదాభిరామ వినర వేమ!

పురుషులరసి కొన్ని పుణ్యభూములటండ్రుసవరించు

పురుషులరసి కొన్ని పుణ్యభూములటండ్రు
బుద్ధిలేదు యిదియు భూమికాదో
పుణ్యమనగనేమి? పురుషుని కర్మమే?
విశ్వదాభిరామ వినురవేమ!

పుస్తకములు జడలు పులితోలు బెత్తంబుసవరించు

పుస్తకములు జడలు పులితోలు బెత్తంబు
కక్షపాలలు పది లక్షలైన
మోత చేటు గాని మోక్షంబు లేదయా
విశ్వదాభిరామ వినర వేమ!

పూజకన్న నెంచ బుద్ధి నిధానంబుసవరించు

పూజకన్న నెంచ బుద్ధి నిధానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణమే ప్రధానంబు
విశ్వదాభిరామ వినర వేమ!

పూర్ణమైన తనదు భుజబల్మిఁ జూడకసవరించు

పూర్ణమైన తనదు భుజబల్మిఁ జూడక
భువిని చెడుగుతోడ పోరరాదు
పాలకుండ కింత పొలసినా సారాయి
విశ్వదాభిరామ వినర వేమ!

పూర్వ జన్మమందుఁ బుణ్యంబు సేయనిసవరించు

పూర్వ జన్మమందుఁ బుణ్యంబు సేయని
పాపి ధనము కాశ పడుట యెల్ల
విత్త మఱచి కోయ వెదకిన చందంబు
విశ్వదాభిరామ వినర వేమ!

పూర్వ వాసనగల పుణ్యాత్ము లెప్పుడుసవరించు

పూర్వ వాసనగల పుణ్యాత్ము లెప్పుడు
నూటచెలమరీతి నూరునెప్పు
డెందఱికి నొసంగ నెప్పటి యట్లుండు
విశ్వదాభిరామ వినర వేమ!

పూలగడ్డి కేల పుట్టించెనాపదసవరించు

పూలగడ్డి కేల పుట్టించెనాపద
కనకము తనకేమి కలుగజేసె
బ్రహ్మచేతలెల్ల - పాడైన చేతలే
విశ్వదాభిరామ వినురవేమ!

పూసపోగు బెట్టిపురుషునిభుజ మెక్కిసవరించు

పూసపోగు బెట్టిపురుషునిభుజ మెక్కి
కన్నులార్ప వారకాంత గాదు
తనకు లొంగువారిఁ దడయక చంపురా
విశ్వదాభిరామ వినర వేమ!

పూసపోగుపైడి పుట్టంబు విడియంబుసవరించు

పూసపోగుపైడి పుట్టంబు విడియంబు
కాయపుష్టిమిగులఁ గలిగియున్న
హీనజాతి నైన నిందురమ్మందురు
విశ్వదాభిరామ వినర వేమ!

పృథివి కుదక మేగె పృథివిపై మొలకెత్తెసవరించు

పృథివి కుదక మేగె పృథివిపై మొలకెత్తె
మగుడ పృథివి కేగె మగఁడె సుతుఁడు
ధరణి జనులకెల్ల తల్లియ పెండ్లాము
విశ్వదాభిరామ వినర వేమ!

పగలుడుగ నాసలుడుగునుసవరించు

పగలుడుగ నాసలుడుగును
వగపుడుగం గోర్కెలుడుగు వడి జన్మంబుల్‌
తగులుడుగు భోగముడిగిన
త్రిగుణంబును నడుగ ముక్తి తెరువగు వేమా!

పరధనంబులకును ప్రాణములిచ్చునుసవరించు

పరధనంబులకును ప్రాణములిచ్చును
సత్యమంతలేక జారడగును
ద్విజులమంచు నింత్రుతేజమించుకలేదు
విశ్వదాభిరామ వినుర వేమ!

పరుల విత్తమందు భ్రాంతి వాసినయట్టిసవరించు

పరుల విత్తమందు భ్రాంతి వాసినయట్టి
పురుషుడవనిలోన పుణ్యమూర్తి
పరుల విత్తమరయ పాపసంచితమగు
విశ్వదాభిరామ వినుర వేమ!

పాల నీటి కలత పరమహంస మెఱుగునుసవరించు

పాల నీటి కలత పరమహంస మెఱుగును
నీరు పాలు నెట్లు నేర్చునెమలి
లజ్ఞుడైన హీనుడల శివు నెఱుగునా?
విశ్వదాభిరామ వినుర వేమ!

పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్లసవరించు

పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల
పుట్టి గిట్టలేదె పూర్వులెవరు
పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాంతులు సుమీ,
విశ్వదాభిరామ వినుర వేమ!

పెట్టిపోయలేని వట్టి దేబెలు భూమిసవరించు

పెట్టిపోయలేని వట్టి దేబెలు భూమి
బుట్టిరేమి వారు గిట్టరేమి
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా!
విశ్వదాభిరామ వినుర వేమ!

పంచ ముఖములందు బంచాక్షరి జనించెసవరించు

పంచ ముఖములందు బంచాక్షరి జనించె
పంచ వర్ణములను ప్రబలె జగము
పంచముఖుని మీరు ప్రస్తుతి చేయుండీ
విశ్వదాభిరామ వినురవేమ !

పండువలన బుట్టె బరగ ప్రపంచముసవరించు

పండువలన బుట్టె బరగ ప్రపంచము
పండువలన బుట్టె పరము నిహము
పండు మేలెఱింగె బ్రహ్లాదుడిలలోన
విశ్వదాభిరామ వినురవేమ !వేమన పద్యాలు
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |