విషయ సూచిక

నే నెఁవడను తలపెట్టఁగసవరించు

నే నెఁవడను తలపెట్టఁగ
మానసమునఁ దలపకున్న మనుజుని కకటా
కానఁబడు పడకముందే
మానుగఁ గనుగొనఁగవలయు మహిలో వేమా!

నే నెవ్వండని వలపడుసవరించు

నే నెవ్వండని వలపడు
మానసమునఁ బుడమిలోని మనుజుండటరా
కానడు తనశవమును దా
మానుగఁ గనుగొనుట యెట్లు మహిలో వేమా!

నీ వాడిన నే నాడుదుసవరించు

నీ వాడిన నే నాడుదు
నీవుండిన నేను నుందు నిర్విణ్ణుఁడనై
నీవు తలంచినఁదలఁపుదు
నీవు నగిన నేను నగుదు నిజముగ వేమా!

నక్క వినయములను నయగారములఁ బల్కిసవరించు

నక్క వినయములను నయగారములఁ బల్కి
కుడువకెల్ల ధనము కూడఁ బెట్టు
కుక్క బోను వాతఁ గూడు చల్లిన రీతి
విశ్వదాభిరామ వినర వేమ!

నిక్కమైన మంచి నీల మొక్కటి చాలుసవరించు

నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్లు తట్టె డేల?
చదువఁ బద్య మరయఁ జాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినర వేమ!

నిఖిలాకారుం డాతఁడుసవరించు

నిఖిలాకారుం డాతఁడు
నిఖిలాత్ముఁడు సర్వసాక్షి నిజముగఁ దానై
నిఖిలంబు నిందుజూఁడగ
నిఖిలంబై యుండు నిచ్చ నిజముగ వేమా!

నీచుల వినుతులు సేయుచుసవరించు

నీచుల వినుతులు సేయుచు
యాచకమున తిరిగి తిరిగి యలయుటకంటె
వీచిన నింద్రియపశువులఁ
గాచినవాఁ డిందు నందు ఘనుఁ డగు వేమా!

నిజము కల్ల నెఱిఁగి నిత్యుండు గాఁడాయెసవరించు

నిజము కల్ల నెఱిఁగి నిత్యుండు గాఁడాయె
పలుకులోన బిందు పదిలపఱచి
వేడుకైన బిందు వెదఁబెట్టకుండదు
విశ్వదాభిరామ వినర వేమ!

నిజము వరుస నెఱిఁగి నిత్యుండు గావలెసవరించు

నిజము వరుస నెఱిఁగి నిత్యుండు గావలె
పలుకులోనిపలుకు పదిలపఱపు
పలుకుఁజూడ నెవరొ పరికించి చూడరా
విశ్వదాభిరామ వినర వేమ!

నిజములాడువాని నిందించు జగమెల్లసవరించు

నిజములాడువాని నిందించు జగమెల్ల
నిజము లాడరాదు నీచుతోడ
నిజమహాత్ముఁగూడ నిజమాడవలయురా
విశ్వదాభిరామ వినర వేమ!

నోటి పుప్పి కెల్ల నొప్పిలేకుంటకుసవరించు

నోటి పుప్పి కెల్ల నొప్పిలేకుంటకు
నాకు పోకసున్న మౌషధముగ
పెట్ట కుండెనేని పెనురోఁత వేయురా
విశ్వదాభిరామ వినర వేమ!

నీటిలోన వ్రాఁత నిలువకయున్నట్లుసవరించు

నీటిలోన వ్రాఁత నిలువకయున్నట్లు
పాటిజగతిలేదు పరములేదు
మాటమాటకెల్ల మనసు కోరుచునుండు
విశ్వదాభిరామ వినర వేమ!

నాణెమైన చెడిప నయ మెఱింగి తిరుగుసవరించు

నాణెమైన చెడిప నయ మెఱింగి తిరుగు
విటుని కుస్తరించు వివర మెఱుఁగు
బానిసైనతొత్తు పాటింపరాదయా
విశ్వదాభిరామ వినర వేమ!

నీతి వైరాగ్యభక్తిని నీచులకునుసవరించు

నీతి వైరాగ్యభక్తిని నీచులకును
ఫూతకులు కాని జ్ఞానసంకలితులకును
వ్రాల కందని పద్యముల్‌ వేల సంఖ్య
చేత నందుగ భువినిదాఁ జెప్పె వేమ!

నిత్యంబు కానియొడలికిసవరించు

నిత్యంబు కానియొడలికి
నిత్యము దుఃఖమునఁబడును నిరతము ధరలో
నిత్యానందపు పదవికి
నిత్యంబును దుఃఖపడఁగ నేరదు వేమా!

నది నుదకంబులు చనుక్రియసవరించు

నది నుదకంబులు చనుక్రియ
మది నొదవెడు తత్వబుద్ధిమగ్నత లెల్లం
దుది పదవి గలయ ఘనుఁడగు
మదధిఁ బ్రవేశించి గంగ యొప్పున వేమా!

నాదబిందుకళల నయమొంది యాత్మసవరించు

నాదబిందుకళల నయమొంది యాత్మ
యం దంటి చపలచిత్త మమర నిల్పి
బ్రహ్మరంధ్రమునను బ్రబలిన యోగిరా
విశ్వదాభిరామ వినర వేమ!

నిద్రలోనినిద్ర నిజముగాఁ దెలిసినసవరించు

నిద్రలోనినిద్ర నిజముగాఁ దెలిసిన
భద్రమౌను విద్య బ్రహ్మవిద్య
నిద్రదెలియువాఁడు నిర్మలయోగిరా
విశ్వదాభిరామ వినర వేమ!

నిన్నుఁ జూచె నేని తన్నుఁ దా మఱచునుసవరించు

నిన్నుఁ జూచె నేని తన్నుఁ దా మఱచును
తన్నుఁ జూచె నేని నిన్ను మఱచు;
నే విధమున జనుఁడు నెఱుగు, నిన్నును దన్ను?
విశ్వదాభిరామ వినర వేమ!

నిన్నుఁజూచుచుండ నిండును దత్వంబుసవరించు

నిన్నుఁజూచుచుండ నిండును దత్వంబు
తన్నుఁ జూచుచుండఁ దగులు మాయ
నిన్ను నెఱిఁగినపుడె తన్నుఁదా నెఱుఁగును
విశ్వదాభిరామ వినర వేమ!

నమశివ యనవచ్చు నారాయ ణనవచ్చుసవరించు

నమశివ యనవచ్చు నారాయ ణనవచ్చు
మేలువారి నమ్మి మెచ్చవచ్చు
కొంగుకాసు విడిచి గొబ్బున నీరాదు
విశ్వదాభిరామ వినర వేమ!

నెయ్యి లేనికూడు నీయాన కసవదిసవరించు

నెయ్యి లేనికూడు నీయాన కసవది
కూరలేని తిండి కుక్కతిండి
ప్రియములేనికూడు పిండపుఁ గూడురా
విశ్వదాభిరామ వినర వేమ!

నర జన్మము తానెత్తియుసవరించు

నర జన్మము తానెత్తియు
పరమాత్మ నెరుంగలేక పాపాత్ముఁడై
కొరగాని పనులొనర్చిన
తిరిగి యధోగతికి నేగు దిరముగ వేమా!

నరకులమునఁ దాఁబుట్టియుసవరించు

నరకులమునఁ దాఁబుట్టియు
నరకులమునఁ దాని బెరిగి నరుఁడయ్యును దా
నరకులమును ఛీ ఛీ యని
హరకులమునఁ దిరిగెనేని హరుఁడగు వేమా!

నేర్చి నడుతునన్న నేరమి తా వచ్చుసవరించు

నేర్చి నడుతునన్న నేరమి తా వచ్చు
నోర్చి నడతునన్న నోర్పురాదు
కూర్చి నడతునన్నఁ గూడంగ నీయదు
విశ్వదాభిరామ వినర వేమ!

నిరతం బెడతెగ కుండకసవరించు

నిరతం బెడతెగ కుండక
బరిపూర్ణ బ్రహ్మ మాత్మపదమున నుండ
నిరవద్యమయిన యడవిని
జరియించును జగమెఱుంగ సత్యము వేమా!

నేరనిజనులకును నేర్పు నేరము లెల్లఁసవరించు

నేరనిజనులకును నేర్పు నేరము లెల్లఁ
జక్కఁజేయరిల నసాధుజనము
లొప్పుదుర్జనులను తప్పుగనెంతురు
విశ్వదాభిరామ వినర వేమ!

నేరనన్నవాఁడు నెరజాణ మహిలోనసవరించు

నేరనన్నవాఁడు నెరజాణ మహిలోన
నేర్తునన్నవాఁడు వార్తకాఁడు
ఊరకున్నవాఁడె యుత్తమోత్తముఁ డెందు
విశ్వదాభిరామ వినర వేమ!

నోరెఱిఁగి తాము నేమియుసవరించు

నోరెఱిఁగి తాము నేమియు
నేరజంతువులఁ జంపి నెమ్మదిఁ దినునా
క్రూరపు సంకర జాతుల
మారణ మేమందు నింక మహిలో వేమా!

నీరు కార మాయె కారంబు నీరాయెసవరించు

నీరు కార మాయె కారంబు నీరాయె
కారమైన నీరుకార మాయె
కారమందు నీరు కడురమ్యమైయుండు
విశ్వదాభిరామ వినర వేమ!

నరుఁడటు పరమాత్మ గురుని జేరునపుడుసవరించు

నరుఁడటు పరమాత్మ గురుని జేరునపుడు
హస్తమందె మోక్ష మపుడె చూపు
విఱివిసంపదలను విఱ్ఱవీగినజీవి
పర మెఱుఁగక యమునిపాలు వేమ!

నరుడయినను లేక నారాయణుండైనసవరించు

నరుడయినను లేక నారాయణుండైన
తత్వబద్ధుడైన ధరణిమీద
కర్మభావములను ఘనతనొప్పగవలె
విశ్వదాభిరామ వినురవేమ!

నరుడెయైన లేక నారాయణుండైనసవరించు

నరుడెయైన లేక నారాయణుండైన
తత్త్వబద్ధుడైన దరణి నరయ
మరణమున్నదనుచు మదిని నమ్మగవలె
విశ్వదాభిరామ వినుర వేమ!

నిరుపేదల రక్షించెడుసవరించు

నిరుపేదల రక్షించెడు
సరసుఁడు నెఱవాతగాక సంపన్నులఁ దా
భరియించువాఁడు దాతయె
మెరమెచ్చులదాత యతఁడు మేదిని వేమా!

నల్లబోడితలలు తెల్లనిగొంగళ్లుసవరించు

నల్లబోడితలలు తెల్లనిగొంగళ్లు
ఒడల బూడ్దెపూత యొంటిరోఁత
యిట్టివేషములును పొట్టకోసము సుమీ
విశ్వదాభిరామ వినర వేమ!

నీళ్లమీద బుగ్గ నిలచిన యప్పుడుసవరించు

నీళ్లమీద బుగ్గ నిలచిన యప్పుడు
తళ్లువేగవచ్చి తాకుఁ గాక
విడెడుకుండకింత విభ్రాంతి పడుదురు
విశ్వదాభిరామ వినర వేమ!

నీళ్లలోన నోడ నిగిడి తిన్నగఁ బ్రాకుసవరించు

నీళ్లలోన నోడ నిగిడి తిన్నగఁ బ్రాకు
బైట మూరెడైనఁ బ్రాక లేదు
నెలవు దప్పు చోట నేర్పరి కొఱ గాడు!
విశ్వదాభిరామ వినర వేమ!

నీళ్లలోనిచేప నెఱమాంస మాశకుసవరించు

నీళ్లలోనిచేప నెఱమాంస మాశకు
గాలమందుఁజిక్కి కూలినట్లు
ఆశపుట్టి మనుజుఁ డారీతి జెడిపోవు
విశ్వదాభిరామ వినర వేమ!

నీళ్ళ మునుఁగనేల నిధుల మెట్టఁగనేలసవరించు

నీళ్ళ మునుఁగనేల నిధుల మెట్టఁగనేల
మొనసి వేల్పులకును మ్రొక్కనేల
కపటకల్మషములు కడుపులో నుండఁగా
విశ్వదాభిరామ వినర వేమ!

నీళ్ళ లోన మొసలి నిగిడి యేనుఁగుఁ బట్టుసవరించు

నీళ్ళ లోన మొసలి నిగిడి యేనుఁగుఁ బట్టు
బైట కుక్క చేత భంగ పడును
స్థాన బలిమి గాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ వినర వేమ!

నీళ్ళఁబోసి కడిగి నిత్యంబు శోధించిసవరించు

నీళ్ళఁబోసి కడిగి నిత్యంబు శోధించి
కూఁడుబెట్టి మీఁద కోకగట్టి
యేమి పాట్లఁబడుదు రీ దేహమున కిల
విశ్వదాభిరామ వినర వేమ!

నీళ్ళమీఁదజూడు నెఱయ నోడలబల్మిసవరించు

నీళ్ళమీఁదజూడు నెఱయ నోడలబల్మి
బట్టబయలఁ జూడు బండిబలిమి
ఆఁడుదాని బలిమి నాడనే చూడరా
విశ్వదాభిరామ వినర వేమ!

నీళ్ళమీదఁ జూడు నెరయ నోడలపర్వుసవరించు

నీళ్ళమీదఁ జూడు నెరయ నోడలపర్వు
బయలుమీఁదఁ జూడు పక్షిపర్వు
నాఁడువారిగమన మీలాగు నుండురా
విశ్వదాభిరామ వినర వేమ!

నవ్వును చదువును పాడునుసవరించు

నవ్వును చదువును పాడును
నొవ్వక తానిట్లు మెచ్చు నుడువును మఱచు
నివ్వటిలియుండు ముదిమియు
నివ్విధమునఁ జూడఁజూడ నెవ్వడు వేమా!

నీవు నిలిచియుండు నిఖిలంబు నిలువదుసవరించు

నీవు నిలిచియుండు నిఖిలంబు నిలువదు
నిలిచియుండు నెండు నీరువలెను
నీవు నిశ్చయంబు నిఖిలంబు మాయయౌ
విశ్వదాభిరామ వినర వేమ!

నీవుగలుగుచోటు నెళువు దెలియువాఁడుసవరించు

నీవుగలుగుచోటు నెళువు దెలియువాఁడు
వసుధయందు త్రోవ వదలఁ డెందుఁ
కాలు కదలనీక గ్రక్కునఁ జేరురా
విశ్వదాభిరామ వినర వేమ!

నాసికంబునడుమ ననుఁజూచు యోగికిసవరించు

నాసికంబునడుమ ననుఁజూచు యోగికి
వాసి వన్నె లేదు వసుధలోన
కాశినాథునైనఁ గనఁగలఁ డాయోగి
విశ్వదాభిరామ వినర వేమ!

నొసలు బత్తుఁడయ్యె నోరు తోడే లయ్యెసవరించు

నొసలు బత్తుఁడయ్యె నోరు తోడే లయ్యె
మనసు భూతమువలె మలయఁగాను
శివునిఁ గనియె నన్నసిగ్గెట్లు గాదొకొ
విశ్వదాభిరామ వినర వేమ!

నూఱుపలుకవచ్చు నొకటి వ్రాయఁగరాదుసవరించు

నూఱుపలుకవచ్చు నొకటి వ్రాయఁగరాదు
వ్రాఁతకన్న సాక్షి వలవ దెన్న
పరగవ్రాతలేని పక్షానికప్పుడు
సుద్దిసాక్షి తగనిబుద్ధి వేమా

నడుచునిచ్చు నతని బత్తెమిచ్చిన వానిసవరించు

నడుచునిచ్చు నతని బత్తెమిచ్చిన వాని
కడుపు చల్లజేసి ఘనత విడుచు
నడుప నేర నేర నతడు నాలి ముచ్చేగదా
విశ్వదాభిరామ వినురవేమ!

నలుగురు కల చోటను దాసవరించు

నలుగురు కల చోటను దా
దల చూపుచు మెలగుచుండి ధన్యాత గనగా
దలచెడి యాతడు నిచ్చలు
గల మాటలే పలుకుచుండగా దగు వేమా!

నిజమాకల్ల రెండు నీలకంఠుడెఱుంగుసవరించు

నిజమాకల్ల రెండు నీలకంఠుడెఱుంగు
నిజములాడకున్న నీతిదప్పు
నిజములాడునపుడు నీ రూపమనవచ్చు
విశ్వదాభిరామ వినుర వేమ!


నిజము తెలిసియున్న సుజినుడానిజమునెసవరించు

నిజము తెలిసియున్న సుజినుడానిజమునె
పలుకవలయుగాని పరులకొరకు
చావకూడ దింక నోపదవ్యం పల్క
విశ్వదాభిరామ వినురవేమ!

నిమిషమైనను మది నిల్చి నిర్మలముగసవరించు

నిమిషమైనను మది నిల్చి నిర్మలముగ
లింగ జీవావేశులను గాంచి భంగపడక
పూజ మదియందు జేరుట పూర్ణపదవి
పరము గోరిన నిదిచేయ బాగు వేమా !

నీవనినను నేననిననుసవరించు

నీవనినను నేననినను
భావమ్మున నెఱుకయొక్క పద్ధతియగునా
భావంబు దెలిసి మదిని
ర్భావముగా నిన్ను గనుట పరమగు వేమా

నీళ్ల మునుగునేల? నిధుల మెట్టగనేలసవరించు

నీళ్ల మునుగునేల? నిధుల మెట్టగనేల
మొనసి వేల్పులకును మ్రొక్కనేల
కపట కల్మషములు కడుపులో నుండగా
విశ్వదాభిరామ వినుర వేమ!

నేయి వెన్న కాచి నీడనే యుంచినసవరించు

నేయి వెన్న కాచి నీడనే యుంచిన
బేరి గట్టిపడును పెరుగురీతి
పోరిపోరి మదిని పోనీక పట్టుము
విశ్వదాభిరామ వినురవేమ !



వేమన పద్యాలు
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |