దొంగతనము ఱంకు దొరసియుండుర జగతిసవరించు

దొంగతనము ఱంకు దొరసియుండుర జగతి
ఱంకులాడికింత శంకపుట్టు
దొంగకన్న ఱేవెలుం గొప్పకానట్లు
విశ్వదాభిరామ వినర వేమ!

దొంగతనమువలన ద్రోహమెంతయుచేసిసవరించు

దొంగతనమువలన ద్రోహమెంతయుచేసి
ఎవ్వరెరుగకుండ నిముడుకున్న
తాఙూచేయుపనుల తగులకోకుందురా
విశ్వదాభిరామ వినురవేమ!

దొంగతెలివిచేత దొరకునా మోక్షంబుసవరించు

దొంగతెలివిచేత దొరకునా మోక్షంబు
చేతఁగానిపనులఁ జేయరాదు
గ్రుడ్డనంగ వలదు గుణహీనుఁడనవలె
విశ్వదాభిరామ వినర వేమ!

దొంగమాటలాడ దొరుకునె మోక్షంబుసవరించు

దొంగమాటలాడ దొరుకునె మోక్షంబు
చేతగానికూత చెల్ల దెపుడు
గురువుపద్దు గాదు గుణహీన మగుఁగాక
విశ్వదాభిరామ వినర వేమ!

దెందమందు దలచు తెప్పరమెప్పుడుసవరించు

దెందమందు దలచు తెప్పరమెప్పుడు
నోర్వలేని హీను నరునికంటె
తనకుమూడుసుమ్మి తప్పదెప్పటికైన
విశ్వదాభిరామ వినురవేమ!

దిక్కులేనిరోఁత దీనతఁ బాపినసవరించు

దిక్కులేనిరోఁత దీనతఁ బాపిన
పురుషుఁడిహమునందు పూజ్యుఁడగును
పరమునందు వాని భాగ్య మేమనవచ్చు
విశ్వదాభిరామ వినర వేమ!

దొడ్డవాండ్రమనుచుఁ ద్రోవడొంకలు బెట్టిసవరించు

దొడ్డవాండ్రమనుచుఁ ద్రోవడొంకలు బెట్టి
యడ్డమైన జనులనంటఁగట్టి
దోఁచుకున్న నట్టి దోష మెక్కడఁబోవు
విశ్వదాభిరామ వినర వేమ!

దొడ్డవాడననుచు దొరలదగ్గర చేరిసవరించు

దొడ్డవాడననుచు దొరలదగ్గర చేరి
చాడిచెప్పు పాపజాతినరుడు
చాడిచెప్పువాడు సాయుజ్యమొందునా?
విశ్వదాభిరామ వినురవేమ!

దాత లేని కొంప దయ్యాల పెనువాడసవరించు

దాత లేని కొంప దయ్యాల పెనువాడ
నీతిగాని పాట వాతిచేటు
ప్రీతిలేని లంజ ఫూతియై తోఁచురా
విశ్వదాభిరామ వినర వేమ!

దాతగానివాని తఱచుగా వేఁడినసవరించు

దాతగానివాని తఱచుగా వేఁడిన
వాడుఁ దాతయగునె వసుధలోన
అవురు దర్భ యౌనె యబ్ధిలో ముంచిన
విశ్వదాభిరామ వినర వేమ!

దాన మమరఁజేసి దరిఁజేరు నొకవంకసవరించు

దాన మమరఁజేసి దరిఁజేరు నొకవంక
మనము నమ్మెనేని మాయ గల్గు
జ్ఞానకలిక నమ్మఁ జంపును వైరుల
విశ్వదాభిరామ వినర వేమ!

దాన మొసఁగుకన్నఁ దేజంబు మఱిహెచ్చుసవరించు

దాన మొసఁగుకన్నఁ దేజంబు మఱిహెచ్చు
తేజ మొసఁగుకన్నఁ దెలివి హెచ్చు
తెలివికన్న నాసఁ దెగ వేయునది హెచ్చు
విశ్వదాభిరామ వినర వేమ!

దానధర్మములను తెగ రేపు నేఁడనిసవరించు

దానధర్మములను తెగ రేపు నేఁడని
కాలవ్యయముఁ జేయు కష్టజనుఁడు
తానునేమి యౌనొ తనబ్రతు కేమౌనొ
మాయఁదెలియ లేదు మహిని వేమా!

దానధర్మములును దయయు సత్యము నీతిసవరించు

దానధర్మములును దయయు సత్యము నీతి
వినయ ధైర్య శౌర్య వితరణములు
రాజుపాలిటి కివి రాజయోగంబులు
విశ్వదాభిరామ వినర వేమ!

దానమడుగువాఁడు ధరలోన నధముండుసవరించు

దానమడుగువాఁడు ధరలోన నధముండు
దానమడుగఁడేని దైవసముఁడు
దానమీనివాఁడు ధన్యుండు కాఁడయా
విశ్వదాభిరామ వినర వేమ!

దానములను జేయఁ దన చేతులాడకసవరించు

దానములను జేయఁ దన చేతులాడక
బహుధనంబుఁగూర్చి పాతిపెట్టు
తుదను దండుగ నిడు మొదలు చేర్చునరుండు
విశ్వదాభిరామ వినర వేమ!

దానములలో నన్నదానము దొడ్డదిసవరించు

దానములలో నన్నదానము దొడ్డది
గానములను సామగాన మెచ్చు
ధ్యానములను శివునిధ్యానము శ్రేష్ఠము
విశ్వదాభిరామ వినర వేమ!

దీపంబు లేని యింటనుసవరించు

దీపంబు లేని యింటను
రూపంబును దెలియలేరు రూఢిగఁ దమలో
దీపమగు తెలివి గలిగియు
పాపంబుల మఱుగుత్రోవఁ బడుదురు వేమా!

దోపునిచ్చువాఁడు తులలేని నెఱదాతసవరించు

దోపునిచ్చువాఁడు తులలేని నెఱదాత
దోఁచుకొన్నవాఁడు ద్రోహి యయ్యె
ప్రాపుఁ జూపువాఁడు పరమపుణ్యుం డయ్యె
ప్రాపుఁజెఱచువాఁడు పశువు వేమ!

దొమ్మరీనిలంజతోఁ గూడ దోషంబుసవరించు

దొమ్మరీనిలంజతోఁ గూడ దోషంబు
పాపియైన మనసుఁ బట్టరాదు
వీడు గదలిపోవ వెళ్లుదు రెటులనో
విశ్వదాభిరామ వినర వేమ!

దర్శనంబులందు ధర షణ్మతములందుసవరించు

దర్శనంబులందు ధర షణ్మతములందు
వర్ణకాశ్రమముల వదల కెపుడు
తిరుగుచున్నవాఁడు ధరలోన నధముండు
విశ్వదాభిరామ వినర వేమ!

ద్రోహబుద్ధినైన దొంగఱికమునైనసవరించు

ద్రోహబుద్ధినైన దొంగఱికమునైన
నటననైన సాహసముననైన
సంపదధికునుండి సాధించి ధనమును
బడుగు కిచ్చి బాగుపడును వేమ!

ద్రోహియైనవాడు సాహసంబున నెట్టిసవరించు

ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి
స్నేహితునికినైనఁ జెరపుచేయు
నూహకలిగియుండు నోగుబాగులులేక
విశ్వదాభిరామ వినురవేమ!

ద్విజకులంబునందు తేజరిల్లుచు బుట్టిసవరించు

ద్విజకులంబునందు తేజరిల్లుచు బుట్టి
తా తరించి యెరుల దాట జేయ
లేని యాత డున్న లేకున్న నొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ!

ద్విజవరుండు చెడ్డ పిండంబు దినఁబోయెసవరించు

ద్విజవరుండు చెడ్డ పిండంబు దినఁబోయె
పేరటాలు మురువు పెండ్లిమొనసె
కులము మొదలుఁ బోయెఁ గూలెఁబో మానంబు
విశ్వదాభిరామ వినర వేమ!

ద్విజుల ఖేదబెట్టి తిట్ట దొడగువాడుసవరించు

ద్విజుల ఖేదబెట్టి తిట్ట దొడగువాడు
మృతిని బొంది తాను వెతల బడగ
కాలు దరిని చేరు గడతేర లేడయా
విశ్వదాభిరామ వినురవేమ!

దేవపూజ సేయ దివ్యభోగము గల్గుసవరించు

దేవపూజ సేయ దివ్యభోగము గల్గు
తత్వ మెఱింగెనేని దైవసముఁడె
యేమిలేనినరున కేగతిలేదురా
విశ్వదాభిరామ వినర వేమ!

దేవభూములందు దేవాలయములందుసవరించు

దేవభూములందు దేవాలయములందు
దేవుఁడంచుఁ జెప్పి తెరువుఁజూపె
తెలియ విశ్వమెల్ల దేవాది దేవుఁడౌ
విశ్వదాభిరామ వినర వేమ!

దైవమతుల నరులు తమవంటివా రనిసవరించు

దైవమతుల నరులు తమవంటివా రని
యరసి గూఢతత్వ మరయ లేరు
ఇల్లు మూయఁబడిన నెట్లు మర్మ మెఱుఁగు
విశ్వదాభిరామ వినర వేమ!

ద్వార బంధమునను తనయులు సంపదసవరించు

ద్వార బంధమునను తనయులు సంపద
బంధువర్గ మెల్ల ప్రహరిగోడ
మూఢులైన నరులు మొక్కలి కాండ్రయా
విశ్వదాభిరామ వినర వేమ!

దేవుఁడనఁగ వేఱు దేశమం దున్నాఁడెసవరించు

దేవుఁడనఁగ వేఱు దేశమం దున్నాఁడె
దేహితోడ నెపుడు దేహమందె
వాహనముల నెక్కి వడిఁదోలు మన్నాఁడు
విశ్వదాభిరామ వినర వేమ!

దేశదేశములను దిరిగిగాసిలినొందసవరించు

దేశదేశములను దిరిగిగాసిలినొంద
నాత్మయందు ధ్యాన మంటుకొనునె
కాసులకును దిరుగఁ గలుగునా మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ!

దశయనంగ మెండుధన ముండుటే యండ్రుసవరించు

దశయనంగ మెండుధన ముండుటే యండ్రు
కూడు నిద్రలేక కుందుటయెకద!
రాగముంషబోవ బాగుగ నేడ్పించు
విశ్వదాభిరామ వినురవేమ!

దశరధుడు రామధరణీశు పట్టంబుసవరించు

దశరధుడు రామధరణీశు పట్టంబు
కట్టచేయదలప, గట్టెజడలు
తలపు మనదిగాని దైవిక మది వేరు
విశ్వదాభిరామ వినురవేమ!

దేశవేషములను తేటసేయక దేవుఁసవరించు

దేశవేషములను తేటసేయక దేవుఁ
డాత్మలోన నుండ ననగిపెనగి
వేషమరసిచూడ గ్రాసంబు కొఱకయా
విశ్వదాభిరామ వినర వేమ!

దోసకారియైన దూసరియైననుసవరించు

దోసకారియైన దూసరియైనను
పగతుడైన వేదబాహ్యుడైన
వట్టిలేని పేదవాని కీదగు నీవి
విశ్వదాభిరామ వినురవేమ!

దోసముల్లువంటి తుర్యమం దాత్మనుసవరించు

దోసముల్లువంటి తుర్యమం దాత్మను
జూచి యాసలనటుతోచివేసి
వాసనను దెలిసినవాఁడెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!

దేహ యాత్మరూపు తేట తెల్లము జేసిసవరించు

దేహ యాత్మరూపు తేట తెల్లము జేసి
ఆవలి చూపుచూచు నతడె గురువు
భ్రమరము తనరూపు క్రిముల కిచ్చినరీతి
విశ్వదాభిరామ వినురవేమ!

దేహ సంకటమును దెగితేరకాండ్రకుసవరించు

దేహ సంకటమును దెగితేరకాండ్రకు
మోహదృష్టి విడిచి మూల మెఱిఁగి
వ్యూహ మొక్కటిపన్ని యుల్లంబు సంధించి
స్నేహ మెఱుఁగ యోగ సిద్ధి వేమ!

దేహగుణము లెల్ల దెలిసిన శివయోగిసవరించు

దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి
మోహమందుఁ జిక్కి మోసపోఁడు
ఇంద్రజాలకుండు నెందుకుఁ జిక్కురా
విశ్వదాభిరామ వినర వేమ!

దేహాభిమాన ముండఁగసవరించు

దేహాభిమాన ముండఁగ
మోహాదులు జననవార్ధిముంచును కలగా
నీహా విషయభావన
కూహాదులు పోవు మేలుకొన్నను వేమా!

దేహము లెస్సగ నుండినసవరించు

దేహము లెస్సగ నుండిన
పోషణ తత్వంబులన్ని పొందుగఁ దెలియు
దేహము బడలికఁ బడినను
పోషణ తత్వములు వచ్చి పొందవు వేమా!

దేహియు జ్ఞానానలమునసవరించు

దేహియు జ్ఞానానలమున
దాహంబై దేహ మెల్లఁ దల్లడపడ నా
దేహములోఁ బొర్లాడుచు
మోహమడచి శివునిఁ జూడ ముక్తిర వేమా!

దుండగీడు కొడుకు కొండీడు చెలికాఁడుసవరించు

దుండగీడు కొడుకు కొండీడు చెలికాఁడు
బండరాజునకును బడుగుమంత్రి
కొండముచ్చునకును గోఁతియు సరియౌను
విశ్వదాభిరామ వినర వేమ!

దుష్టజనులగూడి తుంటరిపనులనుసవరించు

దుష్టజనులగూడి తుంటరిపనులను
శిష్టకార్యములుగ చేయుచుంద్రు
కూడదనెడివారిగూడ నిందింతురు!
విశ్వదాభిరామ వినురవేమ!

దూరదృష్టిఁ గనరు దుడుకుడువదలకసవరించు

దూరదృష్టిఁ గనరు దుడుకుడువదలక
బారప ట్టెఱుగరు పడినదనుక
దండసాధ్యు లయిరి ధర్మసాధ్యులుగాక
భూమిజనులు వెఱ్ఱిబుద్ధి వేమ!

దూరదృష్టిగనరు తూగినదనుకనుసవరించు

దూరదృష్టిగనరు తూగినదనుకను
పారుపట్టెరుగరు పడినదనుక
దండసాధ్యులరయ ధర్మసాధ్యులుకారు!
విశ్వదాభిరామ వినురవేమ!

దూలములనుబోలు దురవస్థలనునెల్లసవరించు

దూలములనుబోలు దురవస్థలనునెల్ల
రోసి యాసలన్ని గోసివేసి
వాసనను దెలిసినవాఁడెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!

దూలాలు టెంకినుండినసవరించు

దూలాలు టెంకినుండిన
వాలాయము చేటు వచ్చు వసుమతిలోన
లోలాక్ష విడిచిపెట్టిన
మేలిమిగా బ్రతుకవచ్చు మేదిని వేమా!

దశగలారినెల్ల దమ బంధువు లటండ్రుసవరించు

దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు
దశయలేమి నెంత్రు తక్కువగను
దశయన గమ ధన దశమొక్కటే దశ
విశ్వదాభిరామ వినుర వేమ!

ద్వారంబంధమునకు దలుపులు గడియలుసవరించు

ద్వారంబంధమునకు దలుపులు గడియలు
వలెనె నోటికొప్పుగల నియతులు
ధర్మమెరిగి పలుక ధన్యుండౌ భువిలోన
విశ్వదాభిరామ వినురవేమ !వేమన పద్యాలు
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |