తండ్రికన సుగుణి తనయుఁడు గల్గెనాసవరించు

తండ్రికన సుగుణి తనయుఁడు గల్గెనా
పిన్న తనము లెన్నఁదగదు
వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా
విశ్వదాభిరామ వినుర వేమ!

తండ్రిసొమ్మునైన దాయాదిసొమ్మైనఁసవరించు

తండ్రిసొమ్మునైన దాయాదిసొమ్మైనఁ
బరులసొమ్మునయినఁ బ్రాప్తధనము
దయను దీనులకును దాన మిచ్చినవాఁడె
బహుళపుణ్యజనుఁడు పరఁగ వేమ!

తంత్రవాదు లెన్న తఱచుగా నుందురుసవరించు

తంత్రవాదు లెన్న తఱచుగా నుందురు
మంత్రవాదు లెన్న మహిని లేరు
జంత్రగాని బొమ్మ చందంబు లాయెరా
విశ్వదాభిరామ వినర వేమ!

తగినకులజుఁడైన తలయెత్తు ధనమైనసవరించు

తగినకులజుఁడైన తలయెత్తు ధనమైన
భాగ్యపురుషునేల పట్టనెంచు
పరమసాధ్వి చూడ పరులనంటదు సుమీ
విశ్వదాభిరామ వినర వేమ!

తగులుసతిని గూడి బిగువుగా రమియింపసవరించు

తగులుసతిని గూడి బిగువుగా రమియింప
కడుబలుండు పుట్టు గట్టిగాను
పురుషుఁ డబలుఁడైనఁ బుత్రు లబలులురా
విశ్వదాభిరామ వినర వేమ!

తా నొకటి దెలియునన్నదిసవరించు

తా నొకటి దెలియునన్నది
తానట్టిది లేక యెల్లతావులు దానై
తానేగి పరిణమించిన
మానవునకు ముక్తి గలదు మహిలో వేమా!

తా నగుట యెఱిఁగి సర్వముఁసవరించు

తా నగుట యెఱిఁగి సర్వముఁ
దా నగుటయుఁ దెలిసి యెల్లతత్వముదానై
తానెఱిఁగి పరిణమించిన
మానవులకు శక్తిలేదు మహిలో వేమా!

తాతఁ గన్నతల్లి తనతండ్రిఁ గనుతల్లిసవరించు

తాతఁ గన్నతల్లి తనతండ్రిఁ గనుతల్లి
తన్నుఁగన్న తల్లి తల్లితల్లి
తల్లి శూద్రురాలు తానెట్లు బాపఁడో
విశ్వదాభిరామ వినర వేమ!

తాతజనించెఁ గన్యకకు తండ్రులు తామును కుండగోళకుల్‌సవరించు

తాతజనించెఁ గన్యకకు తండ్రులు తామును కుండగోళకుల్‌
మాతపరానుకూలి మరి యెక్కువ ద్రౌపతి భర్తలేవురు
నీతులు చెప్ప పాండవులనీమము లిట్టి వటంచు నెన్నుచు
భూతలమందు మిక్కిలిగఁ బూజలఁ జేసిరి వెఱ్ఱి వేమనా!

తిట్టికొట్టిరేని తిరిగి మాటాడకసవరించు

తిట్టికొట్టిరేని తిరిగి మాటాడక
యడరుఁజూచి యదరింపకనీవు
తన్నుఁ గాదని నట్లు కాతఱపడకున్న
నట్టివాఁడు బ్రహ్మ మౌను వేమా!

తిట్టికొట్టిరేని తిరిగి మాఱాడకసవరించు

తిట్టికొట్టిరేని తిరిగి మాఱాడక
యూరకున్నఁ జూడనుర్విమీద
వాఁడగు పరమాత్మ వర్ణింప శక్యమా
విశ్వదాభిరామ వినర వేమ!

తిట్టెనేని మొట్టు మొట్టినఁ గొట్టునుసవరించు

తిట్టెనేని మొట్టు మొట్టినఁ గొట్టును
కొట్టెనేని యముఁడు కొద్దిపఱచుఁ
గోప మెంచ చెడ్డపాపము నరహత్య
విశ్వదాభిరామ వినర వేమ!

తొడలమెఱుపుసొంపు తోరంపుకుచములుసవరించు

తొడలమెఱుపుసొంపు తోరంపుకుచములు
వారకొప్పుగలుగు వనితఁజూచి
విటుఁడు నిలుచుటెట్లు విరహాగ్ని కొగ్గును
విశ్వదాభిరామ వినర వేమ!

తొత్తు తొత్తెగాని దొరసాని గాఁబోదుసవరించు

తొత్తు తొత్తెగాని దొరసాని గాఁబోదు
అడఁచుటింతె దానికైన గుణము
మిత్తికూళ్ళ దొంగ మేలెఱుఁగ నేర్చునా
విశ్వదాభిరామ వినర వేమ!

తొత్తుతోడి పొందు దోషంబు దోషంబుసవరించు

తొత్తుతోడి పొందు దోషంబు దోషంబు
లంజతోడిపొందు లజ్జ చెడును
జారతోటిపొందు చావుకుమూలమౌ
విశ్వదాభిరామ వినర వేమ!

తొత్తుతోడిపొందు తొఱ్ఱిపెసలమూటసవరించు

తొత్తుతోడిపొందు తొఱ్ఱిపెసలమూట
ముచ్చుతోడిపొందు తెచ్చునింద
తలవరింటిపొందు తలతోటిదీరురా
విశ్వదాభిరామ వినర వేమ!

తత్వ మింద్రియముల దరిఁజూచి గెలుచునుసవరించు

నేమమునను నుండ నిల్చును చిత్తంబు - తామసమున నుండ దలఁగిపోవు
నిలిచిన చిత్తము నిర్భీతి నొందించు - నిర్భీతి సఖ్యంబు నీరసించు
సఖ్యదూరగుణము సమమును బొందించు - సమగుణమునఁ జూడ సమతపుట్టు
నట్టి సమత విశ్వమంతయుఁ దానగుఁ - దానె విశ్వంబయిన తత్వమగును

తత్వ మింద్రియముల దరిఁజూచి గెలుచును
దత్వవేత్తయైనఁ దానె మిగిలి
రాజయోగి యనుచుఁ దేజంబుచేతను
దెలిసియుండు జగతి వినర వేమ!

తత్వ మెఱుఁగువాడు దైవంబు నెఱుఁగునుసవరించు

తత్వ మెఱుఁగువాడు దైవంబు నెఱుఁగును
సర్వసారములను జావఁ జేయు
కదళిమ్రింగునట్లు గరళంబు మ్రింగునా
విశ్వదాభిరామ వినర వేమ!

తత్వము తిరమైన తావుల వెదకుచుఁసవరించు

తత్వము తిరమైన తావుల వెదకుచుఁ
దాను తత్వమగును తత్వ్తయోగి
తలఁపులన్ని యుడుగఁ దానెపో తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ!

తత్వహీను లుండ్రు తఱుచుగా భువిలోనసవరించు

తత్వహీను లుండ్రు తఱుచుగా భువిలోన
తత్వ్త మెఱుగువారు తఱుచులేరు
కలిగిలేనివారు కనిపింపరారయా
విశ్వదాభిరామ వినర వేమ!

తన కేనాఁడు సుభిక్షముసవరించు

తన కేనాఁడు సుభిక్షము
తన కేనాఁడును భంగంబు తనకుఁదనుజుఁడు
తానున్నయట్టి దశకును
మనసున నిల చివుకుచుండు మనుజుఁడు వేమా!

తన గుణము తనకు నుండఁగసవరించు

తన గుణము తనకు నుండఁగ
నెనయంగా నొరునిగుణము నెంచును మదిలో
తన గుణముఁదాను దెలియక
పనరి యొరుని ననెడువాఁడు భ్రష్టుఁడు వేమా!

తానె తత్వమనుచు తన్నెఱుంగక లేకసవరించు

తానె తత్వమనుచు తన్నెఱుంగక లేక
మాయతత్వమనుచు మఱుగుచుండు
ధర్మకర్మములను తగరోయ దత్వమౌ
విశ్వదాభిరామ వినర వేమ!

తన నిజరూపముఁ జూడఁగసవరించు

తన నిజరూపముఁ జూడఁగ
తన మాయను సిద్ధులయినఁ దపముల మాయన్‌
తానెంతటి ఘనుఁడయినను
తనిసినవాఁడైన జూడ ధరలో వేమా!

తానే నేర్పరియయినంసవరించు

తానే నేర్పరియయినం
తారకములఁ దానెతన్ను దప్పించుకొను
దానెన్ని విధము లడరిన
తానే పరమాత్మ యనుచుఁ దలఁచర వేమా!

తేనె పంచదార తియ్యమామిడిపండుసవరించు

తేనె పంచదార తియ్యమామిడిపండు
తిన్నఁగాని తీపు తెలియగరాదు
కన్న నింపు పుట్టుఁ గామినియధరంబు
విశ్వదాభిరామ వినర వేమ!

తన మదిఁ గపటము గలిగినసవరించు

తన మదిఁ గపటము గలిగిన
తనవలెనే కపట ముండు, తగ జీవులకు
తన మది కపటము విడిచినఁ
దన కెవ్వడు కపటి లేఁడు ధరలో వేమా!

తనకు ప్రాప్తిలేక దానమియ్యరటంచుసవరించు

తనకు ప్రాప్తిలేక దానమియ్యరటంచు
దోషబుద్ధిచేత దూరుటెల్ల
ముక్కువంకఁ జూచి ముక్కఱదూరుట
విశ్వదాభిరామ వినర వేమ!

తనకు ప్రాప్తిలేక దాత ఈలేదంచుసవరించు

తనకు ప్రాప్తిలేక దాత ఈలేదంచు
ఒరులదూరుటెల్ల ఓగుబుద్ధి
కలిమిలేమికతన కష్టమ్ముతోచురా!
విశ్వదాభిరామ వినురవేమ!

తనకు బ్రాప్తిలేక దానము చిక్కదుసవరించు

తనకు బ్రాప్తిలేక దానము చిక్కదు
దైవనింద వెర్రితనముగాదె!
కర్మజీవులేల కర్మంబు దెలియరు
విశ్వదాభిరామ వినురవేమ!

తనకు లేనివాఁడు దైవముందూఱునుసవరించు

తనకు లేనివాఁడు దైవముందూఱును
తనకుఁ గలిగెనేని దైవ మేల
తనకు దైవమునకుఁ దగులాటమేశాంతి
విశ్వదాభిరామ వినర వేమ!

తనకుఁ జేయుమేలుఁ దాఁ దెలియగ నేర్చుసవరించు

తనకుఁ జేయుమేలుఁ దాఁ దెలియగ నేర్చు
నెలమితోడకుక్క యెఱుఁగు భువిని
తనకుఁ జేయుమేలు దాఁదెలియగలేని
మనుజుఁ డెంతఖలుఁడు మహిని వేమా!

తేనెతెరలజాడ తేనెటీఁగ యెఱుంగుసవరించు

తేనెతెరలజాడ తేనెటీఁగ యెఱుంగు
సుమరసంబుజాడ భ్రమర మెఱుఁగు
పరమయోగి జాడభక్తుం డెఱుంగును
విశ్వదాభిరామ వినర వేమ!

తనదు తల్లి లంజె తనయాలు మాదిగసవరించు

తనదు తల్లి లంజె తనయాలు మాదిగ
శ్రీపతికి గురువసిష్ఠుఁ డరయ
తపముచేత ద్విజుఁడు తర్కింప కులమెట్లు
విశ్వదాభిరామ వినర వేమ!

తనదు కర్మచేత తాను లోకములోనసవరించు

తనదు కర్మచేత తాను లోకములోన
తనదు తల్లి గర్భమునను బుట్టె
తనదు కర్మమరచి తగనివి చేయునా
విశ్వదాభిరామ వినురవేమ!

తనదు దేహమందు తనకున్న పరివారసవరించు

తనదు దేహమందు తనకున్న పరివార
మందఱం బిగించి హర్ష మెసఁగ
నెల్లచావు లెఱిఁగి యిందందు నెఱిఁగియు
నడవ నేర్చుమేటి నరుఁడు వేమ!

తనదుదత్తము పరదత్త మొకటిగాగఁసవరించు

తనదుదత్తము పరదత్త మొకటిగాగఁ
జాడ కనుభవింపఁజోద్య మిలను
తొడగి యాలు నమ్మితొత్తును గొన్నట్టు
విశ్వదాభిరామ వినర వేమ!

తనదుదాన మవనిఁ దనకూఁతు సమమగుసవరించు

తనదుదాన మవనిఁ దనకూఁతు సమమగు
తండ్రిదాన మెల్లఁ దనకుఁ దోడు
అన్యు లిచ్చుదాన మది తనవంటిది
విశ్వదాభిరామ వినర వేమ!

తనదునీడ శిశువు దాఁజూచుకొన్నట్టుసవరించు

తనదునీడ శిశువు దాఁజూచుకొన్నట్టు
తనదునీడఁ జూచి తన్ను మఱచి
పతిని ననుమ నుడువు భ్రాంతుల నేమందు
విశ్వదాభిరామ వినర వేమ!

తనదునృపతితోడఁ దనయాయుధముతోడసవరించు

తనదునృపతితోడఁ దనయాయుధముతోడ
నగ్నితోడఁ బరులయాలితోడ
హాస్యమాడుటెల్ల హాని ప్రాణమునకు
విశ్వదాభిరామ వినర వేమ!

తనదుభ్రాత లెల్ల దానంబు సేయంగసవరించు

తనదుభ్రాత లెల్ల దానంబు సేయంగ
తనకు ఫలమటంచుఁ దలఁచరాదు
తనదుకాలు కోయఁ దన తమ్ముఁడేడ్చునా
విశ్వదాభిరామ వినర వేమ!

తనదుమనసుచేతఁ దర్శించి జ్యోతిషసవరించు

తనదుమనసుచేతఁ దర్శించి జ్యోతిష
మెంతచేసెననుచు నెంచిచూడఁ
దనయదృష్ట మెల్ల దైవమ్ము తెలియురా
విశ్వదాభిరామ వినర వేమ!

తనదుసొమ్ముఁజూడ దాన మియ్యగవచ్చుసవరించు

తనదుసొమ్ముఁజూడ దాన మియ్యగవచ్చు
నవని దొడ్డగాద దెవరికైన
నదురు బెదురు లేక యన్యులసొమ్ముల
దానమిచ్చువాఁడు దాత వేమ!

తాననంగ నెవరు తనవారన నెవరుసవరించు

తాననంగ నెవరు తనవారన నెవరు
తెలిసి తెలియలేరు తిక్క నరులు
అరయ పిసినికాయ పురుగు పద్ధతికాగ
విశ్వదాభిరామ వినర వేమ!

తన్నెఱుఁగనివాఁడు తానె తానై యుండుఁసవరించు

తన్నెఱుఁగనివాఁడు తానె తానై యుండుఁ
దన్నెఱుంగువాఁడు తానె తాను
తనువులేనివాఁడు తానె తానౌనయా
విశ్వదాభిరామ వినర వేమ!

తన్ను వెదకిచూడఁ దానెపో జీవుండుసవరించు

తన్ను వెదకిచూడఁ దానెపో జీవుండు
తత్వ మరసిచూడఁ దానె యాత్మ
మన్ను మిన్ను లేదు మాయరా లేదయా
విశ్వదాభిరామ వినర వేమ!

తన్నుఁ దానెఱుఁగఁడు తా నెవ్వరికి నేర్పుసవరించు

తన్నుఁ దానెఱుఁగఁడు తా నెవ్వరికి నేర్పు
ప్రాలుమాలితిరుగు పశువుకొడుకు
కాసులకొఱకైన కర్మముల్‌ గట్టురా
విశ్వదాభిరామ వినర వేమ!

తన్నుఁ దెలియకున్న తగ వేదములు వెఱ్ఱిసవరించు

తన్నుఁ దెలియకున్న తగ వేదములు వెఱ్ఱి
సర్వ సంపదకు ముసాబు వెఱ్ఱి
యాఱు శాస్త్రములును నా పురాణములును
జబ్బు లనుచు జగతిఁ జాటు వేమా!

తన్నుఁ దెలియువారు దైవజ్ఞు లెంతయుసవరించు

తన్నుఁ దెలియువారు దైవజ్ఞు లెంతయు
నిన్నుఁ దెలియరేని నిలువరైరి
మాయఁ దెలియకుండ మంటపాలైరయా
విశ్వదాభిరామ వినర వేమ!

తన్నుఁజూచి యొరులు దగ మెచ్చవలెననిసవరించు

తన్నుఁజూచి యొరులు దగ మెచ్చవలెనని
సొమ్ము లెలమిఁ బెట్టు నెమ్మిమీఱ
నొరులకొఱకుఁ దాన యుబ్బుచు నుండును
తన్ను దెలియ లేఁడు ధరణి వేమ!

తన్నువలె నవియును ధరఁబుట్టినవి గావొసవరించు

తన్నువలె నవియును ధరఁబుట్టినవి గావొ
పరఁగఁదమ్మువంటి బ్రతుకు గాదొ
జ్ఞాని జ్ఞానిఁ జంపిఁ గారణమేమిరా
విశ్వదాభిరామ వినర వేమ!

తనలో సర్వంబుండఁగసవరించు

తనలో సర్వంబుండఁగ
తనలోపల వెదుకలేక ధరవెదకెడు నీ
తనువుల మోసెడి యెద్దుల
మనములఁ దెల్పఁగ వశమె మహిలో వేమా!

తనలోననె సకలంబునుసవరించు

తనలోననె సకలంబును
తనరందా నగుటయెఱిఁగి తారకమాత్మన్‌
దనువనుచుఁ బరిణమించిన
మనుజునకును ముక్తికలదు మహిలో వేమా!

తాను గుడువలేఁడు, తగ వేది యాప్తులసవరించు

తాను గుడువలేఁడు, తగ వేది యాప్తుల
జేర నివ్వఁడ ట్టి చెనటి గోవు
చేని లోన బొమ్మఁ జేసి కట్టిన యట్లు
విశ్వదాభిరామ వినర వేమ!

తాను తనువు యనుచు ద్వయమును బలుకుచుసవరించు

తాను తనువు యనుచు ద్వయమును బలుకుచు
మోహవారిరాశి మునిఁగియున్న
జనుల కెట్లు మోక్ష సంగతి సిద్ధించు
విశ్వదాభిరామ వినర వేమ!

తాను దానె యనెడి తత్వాల లోపలసవరించు

తాను దానె యనెడి తత్వాల లోపల
నన్య మెఱుఁగకుండు నబ్బతోడు
తానెతానునయిన దల్లడం బేలరా
విశ్వదాభిరామ వినర వేమ!

తాను దినక యటుల ధర్మము సేయకసవరించు

తాను దినక యటుల ధర్మము సేయక
కొడుకుల కనిధనము కూడఁబెట్టి
తెలియఁజెప్పలేక తీఱిపోయినవెన్క
సొమ్ము పరులనందుఁ జూడు వేమ!

తాను దప్పకుండ తనమనంబు నిల్పిసవరించు

తాను దప్పకుండ తనమనంబు నిల్పి
తావుఁ జేరునట్ల తంత్రపఱచి
తాను తావుఁ జేరి తావుఁదానేకమై
తాను దాన యగుచుఁడనరు వేమా!

తాను నేననియెడు తత్వభేదంబునుసవరించు

తాను నేననియెడు తత్వభేదంబును
మాని కడువివేక మహిమఁ దనరి
యూరకున్నవాఁడు నుత్తమోత్తముఁడురా
విశ్వదాభిరామ వినర వేమ!

తాను పుట్టుచోటు తాఁజూచి పలికెనాసవరించు

తాను పుట్టుచోటు తాఁజూచి పలికెనా
తాను బుద్ధిదిరుగు ధరణిలోన
తాను బుట్టుచోటు తత్వంబు తలపోయ
విశ్వదాభిరామ వినర వేమ!

తాను విమలుఁడైనఁ దనగుణ మంతయుసవరించు

తాను విమలుఁడైనఁ దనగుణ మంతయు
శివుని కీనిగురువు చెడుగురుండు
గ్రుడ్డిగుఱ్ఱ మెక్కి గుడి దిరిగినటుల
విశ్వదాభిరామ వినర వేమ!

తను వలచినఁదా వలచునుసవరించు

తను వలచినఁదా వలచును
దను వలవక యున్నఁదన్ను దా వలవడిల
దనదు పటాటోపంబులు
తనమాయలు పనికిరావు ధరలో వేమా!

తాను సకలమైనఁ దనలోన సకలంబుసవరించు

తాను సకలమైనఁ దనలోన సకలంబు
తనదులోని వెలుఁగు తానెఱింగి
యున్నమానవునకు నొనరంగ ముక్తిరా
విశ్వదాభిరామ వినర వేమ!

తనుఁదాఁ దెలియుట తత్వ్తముసవరించు

తనుఁదాఁ దెలియుట తత్వ్తము
తన కన్యులు బోధసేయ ధరలోఁ గలరే
తనుఁదాఁ దెలియక యుండినఁ
దన కెవరుం దెలుపలేరు తథ్యము వేమ!

తానును సమస్తభువనముసవరించు

తానును సమస్తభువనము
లోనసువుల యంగఁదెలిసి లోనను వెలయు
దానై వెలుఁగఁగ నేర్చిన
మానవునకు ముక్తి గలుగు మహిలో వేమా!

తనువ దెవరిసొమ్ము తనదని పోషింపసవరించు

తనువ దెవరిసొమ్ము తనదని పోషింప
ధనమదెవరిసొమ్ము దాచుకొనఁగ
ప్రాణ మెవరిసొమ్ము పాయకుండఁగ నిల్ప
విశ్వదాభిరామ వినర వేమ!

తనువు లస్థిరములు ధర్మము నిత్యముసవరించు

తనువు లస్థిరములు ధర్మము నిత్యము
చేయుధర్మమెల్ల చెడని పదవి
కనివిని మఱి తెలియఁ గానరు నరపశుల్‌
విశ్వదాభిరామ వినర వేమ!

తనువు విడిచి తాను తరలిపోయెడివేళసవరించు

తనువు విడిచి తాను తరలిపోయెడివేళ
తనదు భార్య సుతులు దగినవార
లొక్కరైన నేగ రుసురు మాత్రమె కాని
తనదుమంచి తోడు తనకు వేమ!

తనువు శోధఁజేసి దైవమ్ము మొనఁజేసిసవరించు

తనువు శోధఁజేసి దైవమ్ము మొనఁజేసి
ముందు కర్మములను మూలఁద్రోసి
మనము నిజముఁజేసి మమతలన్నియు రోసి
మొనసి నిల్చువాఁడు మోక్షి వేమా!

తనువుఁ దా ననుకొనుఁ దనకుఁదా ననఁదగిసవరించు

తనువుఁ దా ననుకొనుఁ దనకుఁదా ననఁదగి
జనన మరణములను జిక్కిచిక్కి
పొలుపుపొం దెఱుఁగక పొర్లాడుచుండెడి
భ్రాంతిజీవి కేటిపరము వేమా!

తనువునందు నగ్ని దఱికొని కాల్పంగసవరించు

తనువునందు నగ్ని దఱికొని కాల్పంగ
కాల్చుకొనుట యేమి కర్మమునకు
కాల్చుకొన్న యంత ఘనుఁడు తానాయెనా
విశ్వదాభిరామ వినర వేమ!

తనువులోన జీవతత్వ మెఱుంగకసవరించు

తనువులోన జీవతత్వ మెఱుంగక
వేఱె కలదటంచు వెదుకనేల
భానుడుండ దివ్వెఁబట్టి వెదుకు రీతి
విశ్వదాభిరామ వినర వేమ!

తనుసంరక్షణ కొఱకయిసవరించు

తనుసంరక్షణ కొఱకయి
మనమున కార్యములు మానుమను తత్వముచే
దినదినము తిరిగి తిరిగియు
తనువునఁ గనుగొన్న నాత్మ తత్వము వేమా!

తప్పు లెన్నువారు తండోపతండముసవరించు

తప్పు లెన్నువారు తండోపతండము
లుర్వి జనులకెల్ల నుండుఁ దప్పు
తప్పు లెన్నువారు తమతప్పు నెఱుఁగరు
విశ్వదాభిరామ వినర వేమ!

తప్పురూపు గట్టి ధరలోనఁ దిరిగెడుసవరించు

తప్పురూపు గట్టి ధరలోనఁ దిరిగెడు
సేఁతలెల్ల మిత్తిఁజేరుకొఱకె
కడుపునిండ నింత కష్టంబు లేలరా
విశ్వదాభిరామ వినర వేమ!

తపముజపములెన్నొ ధాత్రిజనుల కెల్లసవరించు

తపముజపములెన్నొ ధాత్రిజనుల కెల్ల
నొనర శివునిఁజూడ నుపమగలదు
మనసుఁజెదరనీక మదిలోనఁజూడరో
విశ్వదాభిరామ వినర వేమ!

తీపులోన తీపు తెలియంగఁ బ్రాణంబుసవరించు

తీపులోన తీపు తెలియంగఁ బ్రాణంబు
ప్రాణవితతికన్నఁ బసిడి తీపు
పసిడికన్న మిగులఁ బడతిమాటలు తీపు
విశ్వదాభిరామ వినర వేమ!

తొమ్మిది క్రంతపత్తికిసవరించు

తొమ్మిది క్రంతపత్తికి
నిమ్మగు సొమ్ములును గులము నేటికిఁ జెపుమా
నమ్మకు దేహము నాదని
నెమ్మది బ్రహ్మంబు దెలియునే నని వేమా!

తామరపాకున నీర్వలెసవరించు

తామరపాకున నీర్వలె
వేమన చరియించుచుండు వెదకుచు శివుని
నీమాయ నమ్మరాఁగా
దీమనమునఁ దెలియరాదు నీశుని వేమా!

తామసించి సేయఁదగ దెట్టి కార్యంబుసవరించు

తామసించి సేయఁదగ దెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమ మగును
పచ్చి కాయ దెచ్చి పడవేయ ఫలమౌనె?
విశ్వదాభిరామ వినర వేమ!

తామసేంద్రియములఁ దనర జయించినసవరించు

తామసేంద్రియములఁ దనర జయించిన
తత్వ మరసి చూడఁ దాన యగును
రాజయోగి యిట్లు తేజరిల్లుచు నుండు
విశ్వదాభిరామ వినర వేమ!

తాము గడనసేయు ధనము తమదియనిసవరించు

తాము గడనసేయు ధనము తమదియని
నమ్మియుండ్రు వెఱ్ఱి నరులు భువిని
తాము నొకరి కిచ్చుధన మింతియేకాక
కడమది తనకేల గలుగు వేమ!

తాము గన్న వారు తముఁ గన్న వారునుసవరించు

తాము గన్న వారు తముఁ గన్న వారును
చచ్చు టెల్ల, తమకు సాక్షి గాదె?
బ్రతుకు టెల్ల తమకు బ్రహ్మ కల్పంబులా?
విశ్వదాభిరామ వినర వేమ!

తాము నిలుచుచోట దైవములేదనిసవరించు

తాము నిలుచుచోట దైవములేదని
పామర జనులు తిరుపతులు దిరిగి
జోకవీడి చేతిసొమ్మెలఁ బోఁజేసి
చెడిగృహంబు తాను జేరు వేమ!

తాము బలిమిఁబెట్ట తమకు తామే కల్గుసవరించు

తాము బలిమిఁబెట్ట తమకు తామే కల్గు
నడుగనిడినఁ దాము నడుగఁగలుగు
విందునీనివాని కెందునులేదయా
విశ్వదాభిరామ వినర వేమ!

తారకంబుఁ జూచుదారి వేఱుగఁగల్గుసవరించు

తారకంబుఁ జూచుదారి వేఱుగఁగల్గు
సమముగాను జూడఁ జక్కఁబడును
వెఱ్ఱిగాను జూడ వెలుగెల్ల బాఱురా
విశ్వదాభిరామ వినర వేమ!

తిరిగి తిరిగి నరుఁడు మరులుకొనుటేగాకసవరించు

తిరిగి తిరిగి నరుఁడు మరులుకొనుటేగాక
అందువలన నేమి యాసలేదు
అంతరాత్మ నిలుపునతఁడెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!

త్రాడు మెడనువేసి తనదు శూద్రత్వంబుసవరించు

త్రాడు మెడనువేసి తనదు శూద్రత్వంబు
పోయె ననెడి దెల్ల బుద్ధి కొదువ
మనసులకును త్రాడు మఱివన్నెఁ దెచ్చునా
విశ్వదాభిరామ వినర వేమ!

త్రాడుపామతంచుఁ దాఁజూచి భయపడిసవరించు

త్రాడుపామతంచుఁ దాఁజూచి భయపడి
తెలిసి త్రాడటన్నఁ దీఱు భయము
భయము దీఱినపుడె బ్రహ్మంబు నంగురా
విశ్వదాభిరామ వినర వేమ!

తీర్ప నార్ప లేని తీర్పరితన మేల?సవరించు

తీర్ప నార్ప లేని తీర్పరితన మేల?
కూర్ప విప్ప లేని నేర్ప దేల?
పెట్టి పొయ్య లేని వట్టి బీరము లేల?
విశ్వదాభిరామ వినర వేమ!

తిరిపెగాఁ డయినను దిరిపెమెత్తిన యట్టిసవరించు

తిరిపెగాఁ డయినను దిరిపెమెత్తిన యట్టి
తిరిపెమందుఁ దాను దిరిపె మిడినఁ
దిరిపెము తిరిపమున దిగఁబడిపోవురా
విశ్వదాభిరామ వినర వేమ!

తిరిపెగాని మిగుల దీపించఁ గనరాదుసవరించు

తిరిపెగాని మిగుల దీపించఁ గనరాదు
వెఱ్ఱివానిమాట వినఁగ రాదు
వెఱ్ఱికుక్కఁ బట్టి వేటాడ వచ్చునా
విశ్వదాభిరామ వినర వేమ!

త్రాసును పడియును లంజయుసవరించు

త్రాసును పడియును లంజయు
భాసురగతి నొక్కరూపు పరికింపంగా
వీసంబధికంబిచ్చిన
వాసరమున నొక్కవంక వారలు వేమా!

తరుణి సొగసుఁగన్న తనయుని గన్ననుసవరించు

తరుణి సొగసుఁగన్న తనయుని గన్నను
మరునికళల మించి మనము పాఱు
పాపజాతి మనము పట్టంగ రాదయా
విశ్వదాభిరామ వినర వేమ!

తిరుమలకును బోవఁ దుఱక దాసరి గాఁడుసవరించు

తిరుమలకును బోవఁ దుఱక దాసరి గాఁడు
కాశిబోవ లంజ గరిత గాదు
గుక్క సింహ మగునె గోదావరికిఁ బోవ
విశ్వదాభిరామ వినర వేమ!

తరువఁ దరువఁ బుట్టు దరువున ననలంబుసవరించు

తరువఁ దరువఁ బుట్టు దరువున ననలంబు
తరువఁ దరువఁ బుట్టు దధిని ఘృతము
తలఁప దలపఁ బుట్టు తనువునఁ దత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ!

తరువున నెడియింటఁ దనశత్రుమిత్రులఁసవరించు

తరువున నెడియింటఁ దనశత్రుమిత్రులఁ
దెలియ లేనివాని తెలివదేల
తెలిసిన మనుజునకు దివ్యామృతమ్మురా
విశ్వదాభిరామ వినర వేమ!

తలఁచిన దత్వంబగునాసవరించు

తలఁచిన దత్వంబగునా
తలఁపక తా నూరకున్నఁ దత్వంబగునా
తలఁచుట తలఁపమి రెండును
దలఁపక తానుండెనేని దత్వము వేమా!

తలఁచినను శూన్యతత్వముసవరించు

తలఁచినను శూన్యతత్వము
తలఁపక యుండినను శూన్యతత్వం బదియౌ
తలఁచిన తలఁపీడేఱును
దలఁచకయుండినను దానె తత్వము వేమా!

తలఁప వశముగాదు తత్వంబు బ్రహ్మంబుసవరించు

తలఁప వశముగాదు తత్వంబు బ్రహ్మంబు తెలియలేఁడు బ్రహ్మదేవుఁడైన ఇసుక బావి త్రవ్వ నెవ్వరి వశమయా విశ్వదాభిరామ వినర వేమ!

తలఁపుచేతఁగల్గు తారక బ్రహ్మంబుసవరించు

తలఁపుచేతఁగల్గు తారక బ్రహ్మంబు
తలచిఁచూడఁదానె తత్వమగును
తలఁపులోనె తలఁపు తానె తానెఱిఁగిన
విశ్వదాభిరామ వినర వేమ!

తలను పాగ పైని తగుపచ్చడము బొజ్జసవరించు

తలను పాగ పైని తగుపచ్చడము బొజ్జ
చెవులపోగు లరసి చేరు నర్థి
శుద్ధపశువు లౌట బుద్ధిలో నెఱుగురా
విశ్వదాభిరామ వినర వేమ!

తలను వ్రేలవేసి తాలిమి నిలుచుకసవరించు

తలను వ్రేలవేసి తాలిమి నిలుచుక
మూసి తెఱచు గన్ను మూగి యగును
జ్ఞాన మదియుఁగాదు కష్టము శేషంబు
విశ్వదాభిరామ వినర వేమ!

తలపఁగ మూలమందు పరతత్వ్తము దెల్పఁగ పాటుగాదు లోసవరించు

తలపఁగ మూలమందు పరతత్వ్తము దెల్పఁగ పాటుగాదు లో బలిమిని నాత్మగుట్టు మది భావననెంచగ బ్రహ్మకల్పము గలుగును ముక్తి జీవులకుఁ గావున నాత్మవిధానదృశ్య మీ సలలిత శక్తిరూపు నిను సన్నుతి వేమన చేసె కల్పమున్‌!

తలపులోని తలఁపు దలఁపోసి తెలియకాసవరించు

తలపులోని తలఁపు దలఁపోసి తెలియకా
తలఁపులెల్ల విడిచి తగినభంగి
తలఁపులోనితలఁపె తత్వంబు నాత్మరా
విశ్వదాభిరామ వినర వేమ!

తల్లి కెదురుకొనుట తండ్రి కెదురుకొనుటసవరించు

తల్లి కెదురుకొనుట తండ్రి కెదురుకొనుట
యన్న కెదురుకొనుట యనఁగ మూఁడు
పాతకముల నెఱిఁగి వర్తింపఁగావలె
విశ్వదాభిరామ వినర వేమ!

తల్లి గర్భమందుఁ దాఁబుట్టి నప్పుడుసవరించు

తల్లి గర్భమందుఁ దాఁబుట్టి నప్పుడు
మొదల బట్ట లేదు తుదను లేదు
నడుమ బట్టగట్ట నగుఁబాటు గాదటో
విశ్వదాభిరామ వినర వేమ!

తల్లి గౌరి తనకు దండ్రియే శంభుండుసవరించు

తల్లి గౌరి తనకు దండ్రియే శంభుండు
ప్రమథగణము లఖిలబాంధవులు
తనకుఁ బుట్టినిల్లు తనరుఁ గైలాసంబు
విశ్వదాభిరామ వినర వేమ!

తల్లిగర్భమందు తాను వెడలువేళసవరించు

తల్లిగర్భమందు తాను వెడలువేళ
నఱుత లింగముండ దరసిచూడ
నడుమ లింగమూన నగుఁబాటు గాదటో
విశ్వదాభిరామ వినర వేమ!

తల్లిదండ్రి చావఁ దనయుఁడు తానేడ్చుసవరించు

తల్లిదండ్రి చావఁ దనయుఁడు తానేడ్చు
మగఁడు చావ నాలు వగచుచుండు
కార్యవశము గాని కలుగదు మోహంబు
విశ్వదాభిరామ వినర వేమ!

తల్లిదండ్రిమీద దయలేని పుత్రుండుసవరించు

తల్లిదండ్రిమీద దయలేని పుత్రుండు
పుట్టనేమివాఁడు గిట్టనేమి
పుట్టలోనఁ జెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినర వేమ!

తల్లిదండ్రులందు దారిద్య్రయుతులందుసవరించు

తల్లిదండ్రులందు దారిద్య్రయుతులందు
నమ్మని నిరుపేద నరులయందు
ప్రభువులందుఁ జూడ భయభక్తు లమరిన
నిహముఫలము కల్గు నెసఁగు వేమ!

తల్లిదండ్రులనెడి తత్వంబు నెఱుఁగరుసవరించు

తల్లిదండ్రులనెడి తత్వంబు నెఱుఁగరు
యోనిలింగములను నుద్భవించి
విష్ణువరయఁదల్లి వెలయరుద్రుఁడె తండ్రి
విశ్వదాభిరామ వినర వేమ!

తల్లిదండ్రులెన్నఁ దనతొలి గురులుసవరించు

తల్లిదండ్రులెన్నఁ దనతొలి గురులు
పార్వతీభవులును పరమగురువులు
కూలివాండ్ర జగతి గురు లన ద్రోహంబు
విశ్వదాభిరామ వినర వేమ!

తఱచు చదువు చదువఁ దర్కవాదమె కానిసవరించు

తఱచు చదువు చదువఁ దర్కవాదమె కాని
దివ్యజ్ఞాన మన్న తేటపడదు
పసిరికాయపురుగు పగిదిని చెడిపోవు
విశ్వదాభిరామ వినర వేమ!

తఱచుచీఁకటి విడి తఱితోడఁ దనుమఱచిసవరించు

తఱచుచీఁకటి విడి తఱితోడఁ దనుమఱచి
పరమునందు మనసుఁ బదిలపఱచి
గరిమయున్నయట్టి ఘనుఁడెందు లేదురా
విశ్వదాభిరామ వినర వేమ!

తెలివియైనలేక తిరమును తెలియకసవరించు

తెలివియైనలేక తిరమును తెలియక
తిరుగునస్థిరుఁ డయి దేహి జగతి
తిరుగ నేల యనుచుఁ దెలియఁడా యజ్ఞాని
విశ్వదాభిరామ వినర వేమ!

తోలుకడుపులోన దొడ్డవాఁ డుండఁగసవరించు

తోలుకడుపులోన దొడ్డవాఁ డుండఁగ
రాతిగుళ్ళలోన రాశిఁబోయ
రాళ్లుదేవుఁడైన రాసుల మ్రింగవా
విశ్వదాభిరామ వినర వేమ!

తెలుపు మాపుచేసి దిట్టతనంబునఁసవరించు

తెలుపు మాపుచేసి దిట్టతనంబునఁ
దెలుపు భస్మముగను దేటపఱుచు
విధముకన్నఁ బరుసవేదియు లేదురా
విశ్వదాభిరామ వినర వేమ!

తవిటి కరయఁ బోఁవ దండులంబుల గంపసవరించు

తవిటి కరయఁ బోఁవ దండులంబుల గంప
శ్వానమాశ్రయించు సామ్యమునకు
కోమటింటి సొమ్ము క్రూరులపా లౌను
విశ్వదాభిరామ వినర వేమ!

తివిరి లేమియుంట తిరిపెకాఁ డెఱుగునెసవరించు

తివిరి లేమియుంట తిరిపెకాఁ డెఱుగునె
మొఱ్ఱబెట్టి నెత్తి మొత్తుఁగాని
పతిస ధర్మ మెన్నపడుచు కత్తెఱుఁగునా
విశ్వదాభిరామ వినర వేమ!

తావసించుచోటఁ దగనల్గు డాయెనాసవరించు

తావసించుచోటఁ దగనల్గు డాయెనా
సౌఖ్యభూమి కపుడు జరుగవలయు
కొలఁకు లింకెనేని కొంగ లందుండునా
విశ్వదాభిరామ వినర వేమ!

తావులేనిచోట తాను తానె యుండుసవరించు

తావులేనిచోట తాను తానె యుండు
తావు కలుగుచోట తానులేఁడు
తావు తానెయైన తత్వంబుఁ దెలియుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ!

తుంటవింటివాని తూపుల ఫూతకుసవరించు

తుంటవింటివాని తూపుల ఫూతకు
మింటి మంట నడుమ మిడుకఁ దరమె
యింటియాలి విడిచి యెట్లుండవచ్చురా
విశ్వదాభిరామ వినర వేమ!

తుమ్మచెట్ల ముండ్లు తోడనెపుట్టునుసవరించు

తుమ్మచెట్ల ముండ్లు తోడనెపుట్టును
విత్తులోననుండి వెడలినట్లు
మూర్ఖునకును బుద్ధి ముందుగాఁ బుట్టును
విశ్వదాభిరామ వినర వేమ!

తల్లిరంకు తెలుప తద్దినములుసవరించు

తల్లిరంకు తెలుప తద్దినములు
కాని తెరువు కర్మకాండ కల్పితమాయె
ఆలివంకవార లాత్మబంధువులైరి
విశ్వదాభిరామ వినురవేమ!

తల్లివంకవారు తగనిపాటిసవరించు

తల్లివంకవారు తగనిపాటి
తండ్రివంకవారు దాయాదిశతకమౌ
ఆలు పతిసౌఖ్యమునకిల
విశ్వదాభిరామ వినురవేమ!

తనకేనాడు సుభిక్షముసవరించు

తనకేనాడు సుభిక్షము
తనకేనాడును భగంబు తనరవయునం
చును తన దశకై యెల్లెడ
మనసందున జివుకుచుండు మహిలో వేమా!

తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కిసవరించు

తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి
మిగిలి వెడలవేక మిణుకుచున్న
నరుడి కేడముక్తి వరలెడి చెప్పడీ
విశ్వదాభిరామ వినుర వేమ!

తనదు మనసుచేత దర్కించి జ్యోతిషసవరించు

తనదు మనసుచేత దర్కించి జ్యోతిష
మెంత చేసే ననుచు నెంచి చూచు,
తన యదృష్టమంత దైవ మెఱుంగడా?
విశ్వదాభిరామ వినుర వేమ!

తనగుణము తనకు నుండగసవరించు

తనగుణము తనకు నుండగ
నెనయంగా నోరుని గుణము నెంచును మదిలో
దన గుణము తెలియ కన్యుని
బనిగొని దూషించువాడు వ్యర్థుడు వేమ!

తను వలచిన దావలచును తనుసవరించు

తను వలచిన దావలచును తను
వలవక యున్ననెనడు తావలవ డిలన్‌
తనదు పటాటోపంబులు తన
మాయలు పనికిరావు ధరలోన వేమా!

తపమువేల? యరయ ధాత్రిజనులకెల్లసవరించు

తపమువేల? యరయ ధాత్రిజనులకెల్ల
నొనర శివుని జూడ నుపమ గలదు
మనసు చదరనీక మహిలోన జూడరా
విశ్వదాభిరామ వినుర వేమ!

తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దుసవరించు

తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు
తలచి చూడనతకు తత్వమగును
వూఱకుండ నేర్వునుత్తమ యోగిరా
విశ్వదాభిరామ వినుర వేమ!

తల్లిదండ్రులెన్నదగు తొలి గురువులుసవరించు

తల్లిదండ్రులెన్నదగు తొలి గురువులు
పార్వతీభవు లిలబరమగురులు
కూలివాండ్ర జగతి గురులన ద్రోహము
విశ్వదాభిరామ వినుర వేమ!

తల్లిబిడ్డలకును తగవు పుట్టించెడిసవరించు

తల్లిబిడ్డలకును తగవు పుట్టించెడి
ధనము సుఖము గూర్చునని గడింత్రు
కాని యెల్లయెడల ఘన దుఃఖన్‌దమది
విశ్వదాభిరామ వినుర వేమ!


తామసించి చేయదగ దెట్టి కార్యంబుసవరించు

తామసించి చేయదగ దెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమగును
పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనే
విశ్వదాభిరామ వినుర వేమ!

తామును జనులేమను కొనసవరించు

తామును జనులేమను కొన
బూనుదురో దాని సరసి పొందిన జడనీ,
రాని పధంబున నడిచిన
దాననె ధర్మాత్ముడండ్రు తన్నిట వేమా!

తిరిగి వచ్చువేళ మరలిపోయెడి వేళసవరించు

తిరిగి వచ్చువేళ మరలిపోయెడి వేళ
వెంట దేరు ధనము వంటబోరు
తొనెటకు జనునొ ధనమెందు బోవునో
విశ్వదాభిరామ వినుర వేమ!

తండ్రిమాటలువిని తల్లిని తెగటార్చిసవరించు

తండ్రిమాటలువిని తల్లిని తెగటార్చి
పరశురాముడేమి ఫలముగనెను
నిలువనీడలేక కులగిరిచేరడా!
విశ్వదాభిరామ వినురవేమ!

తగవు తీర్చువేళ ధర్మంబుదప్పినసవరించు

తగవు తీర్చువేళ ధర్మంబుదప్పిన
మానవుండు ముక్తి మానియుండు
ధర్మమునె పలికిన దైవంబు తోడగున్
విశ్వదాభిరామ వినురవేమ!

తోటకూరకైన దొగ్గలికైననుసవరించు

తోటకూరకైన దొగ్గలికైనను
తవిటికుడుముకైన తవిటికైన
కావ్యమ్మునను చెప్ప కవుల కర్మమ్మురా!
విశ్వదాభిరామ వినురవేమ!

తిత్తిలోన శివుని స్థిరముగా తెలియకసవరించు

తిత్తిలోన శివుని స్థిరముగా తెలియక
తిక్కపట్టి నరుడు తిరుగుచుండు
దిక్కదీర్ప గురుడు యొక్కడే దిక్కురా
విశ్వదాభిరామ వినురవేమ!

తనకు భాగ్యమున్నఁ దక్కువ లేకుండసవరించు

తనకు భాగ్యమున్నఁ దక్కువ లేకుండ
కలుగు భాగ్యమెల్ల కల్లయనుచు
నమ్మకముగఁజూచు నరుడగు యోగిరా
విశ్వదాభిరామ వినురవేమ!

తనివితీర గురుని ధ్యానించి మదిలోనిసవరించు

తనివితీర గురుని ధ్యానించి మదిలోని
తనువు మరచి గురుని తాకినపుడె
తనరుచుండు బ్రహ్మతత్త్వం మందురు దాని
విశ్వదాభిరామ వినురవేమ!

తమ్ముడొనరచేయు దానమ్ములనుజూచిసవరించు

తమ్ముడొనరచేయు దానమ్ములనుజూచి
తనకు ఫలమటంచు మిణుకరాదు
తనదు కాలు గోయ దనతమ్ము డేడ్చునా?
విశ్వదాభిరామ వినురవేమ!


వేమన పద్యాలు
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |