జంగమాఖ్య భక్తి సంధివేఱుగలేదుసవరించు

జంగమాఖ్య భక్తి సంధివేఱుగలేదు
సగుణభావ మదియ శాస్త్ర విధియు
నిర్గుణంబు వీడు నెఱినేదియెఱుఁగఁడు
విశ్వదాభిరామ వినర వేమ!

జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము బుద్ధిసవరించు

జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము బుద్ధి
రెంటినందు రిమ్మరేచునపుడు
రిమ్మ తెలిపెనేని రెండొక రూపురా
విశ్వదాభిరామ వినుర వేమ!

జ్ఞానముద్రచేతఁ గానవచ్చెడితళ్కుసవరించు

జ్ఞానముద్రచేతఁ గానవచ్చెడితళ్కు
నదియ మదికి శ్రేష్ఠ మనుచు మునులు
పలికి రదియుఁ దెలియఁ బరమార్థ మగునయా
విశ్వదాభిరామ వినర వేమ!

జ్ఞానవంతుఁ జూచి సహకర్మబుద్ధులుసవరించు

జ్ఞానవంతుఁ జూచి సహకర్మబుద్ధులు
వెఱ్ఱియండ్రు ప్రకృతి విడువలేరు
వెఱ్ఱి కవనిఁ బ్రకృతి వెదకినఁ గల్గునా
విశ్వదాభిరామ వినర వేమ!

జ్ఞానుల మని యెంచి చపలాత్ము లగువారుసవరించు

జ్ఞానుల మని యెంచి చపలాత్ము లగువారు
తెలివిలేక తమ్ముఁ దెలియలేరు
కష్టగహనమందు కాడ్పడియున్నారు
విశ్వదాభిరామ వినర వేమ!

జాణలనయట్టి చపలాయతాక్షులసవరించు

జాణలనయట్టి చపలాయతాక్షుల
వలపు లరసిచూచి బ్రమయకేల
బయలిరూపులరసి పరికింపగా నేల
విశ్వదాభిరామ వినర వేమ!

జాతిమతము విడిచి చని యోగిగా మేలుసవరించు

జాతిమతము విడిచి చని యోగిగా మేలు
జాతితోనెయుండె నీతులెల్ల
మతముఁబట్టి జాతి మానకుంట కొఱంత
విశ్వదాభిరామ వినర వేమ!

జాతివేఱు లేక జన్మక్రమంబునసవరించు

జాతివేఱు లేక జన్మక్రమంబున
నెమ్మదిని నభవుని నిల్పెనేని
అఖిలజనులకెల్ల నాతఁడె ఘనయోగి
విశ్వదాభిరామ వినర వేమ!

జాతసూతకములు సత్యమై యుండంగసవరించు

జాతసూతకములు సత్యమై యుండంగ
నంటిన గుణములు హతమ్ముగాక
యతియుఁగాగనేల నవనిలో జీవుఁడు
విశ్వదాభిరామ వినర వేమ!

జాతులందు నెట్టిజాతి ముఖ్యముచూడుసవరించు

జాతులందు నెట్టిజాతి ముఖ్యముచూడు
మెఱుఁగలేక దిరుగ నేమిగలదు
యెఱుక గలుగు మనుజుఁ డేజాతి గలవాఁడు
విశ్వదాభిరామ వినర వేమ!

జాతులందు మిగుల జాతియే దెక్కువోసవరించు

జాతులందు మిగుల జాతి యే దెక్కువో
యెఱుక లేక తిరుగు నేమిఫలము
ఎఱుక గలుగువాఁడె హెచ్చైన కులజుండు
విశ్వదాభిరామ వినర వేమ!

జదలుదాల్చు టెల్ల జగము ఛీయను టెల్లసవరించు

జదలుదాల్చు టెల్ల జగము ఛీయను టెల్ల
యొడలువిఱచుటెల్ల యోగ మెల్ల
ముక్తికాంతఁ బట్టి ముద్దాడుకొరకురా
విశ్వదాభిరామ వినర వేమ!

జననమరణములకు సంధ్య త్రాడునులేదుసవరించు

జననమరణములకు సంధ్యత్రాడును లేదు
సంధ్యత్రాడునులేదు జనని కెపుడు
తల్లి శూద్రురాలు దానెట్లు బాగురా
విశ్వదాభిరామ వినర వేమ!

జననమరణములకు సరి స్వతంత్రుఁడు గాఁడుసవరించు

జననమరణములకు సరి స్వతంత్రుఁడు గాఁడు
మొదట కర్తగాఁడు తుదను గాఁడు
నడుమకర్త ననుటనగుబాటు కాదొకో
విశ్వదాభిరామ వినర వేమ!


జనన మరణములన స్వప్న సుషుప్తులుసవరించు

జనన మరణములన స్వప్న సుషుప్తులు
జగములందు నెండ జగములుండు
నరుడు జగమునంట నడుబాటు కాదొకో
విశ్వదాభిరామ వినుర వేమ!

జన్మమరణ సుషుప్తుల జనము లెల్లసవరించు

జన్మమరణ సుషుప్తుల జనము లెల్ల
జరుగుచుండంగ నరుఁడు తా జంగమమను
నదియుఁ దెలియంగలేర నీయజ్ఞులైన
భూప్రజలు బుద్ధిలేకయు పొసఁగు వేమా!

జనుఁడు తెలివినొంద చంచలింపదు మదిసవరించు

జనుఁడు తెలివినొంద చంచలింపదు మది
దయయు దైవమొగిని దగులు బుద్ధి
తివురుభానుఁ జూచి తిమిరంబు నిలుచునా
విశ్వదాభిరామ వినర వేమ!

జాణలమని యంద్రు చపలాత్ములగువారుసవరించు

జాణలమని యంద్రు చపలాత్ములగువారు
తెలివిలేక తమ్ముతెలియలేరు
కష్టమైన యడవి గాసీలుచున్నారు
విశ్వదాభిరామ వినుర వేమ!

జాతి, మతము విడిచి చని యోగికామేలుసవరించు

జాతి, మతము విడిచి చని యోగికామేలు
జాతితో నెయున్న నీతివలదె
మతముబట్టి జాతి మానకుంట కొఱంత
విశ్వదాభిరామ వినుర వేమ!

జార పురుషుమీఁద సద్భక్తి నిలుపుచుసవరించు

జార పురుషుమీఁద సద్భక్తి నిలుపుచు
పతికి నిచ్చకంబు బడయుభంగి
పరముకొఱకు యోగి పాటించు దేహంబు
విశ్వదాభిరామ వినర వేమ!

జాలినొందరాదు జవదాటి కనరాదుసవరించు

జాలినొందరాదు జవదాటి కనరాదు
అది మూలమైన ఆత్మమఱుగు
పోరిచేరి పొంది పూర్ణము నందురా
విశ్వదాభిరామ వినుర వేమ!

జీవి జీవిఁ జంపి జీవికి వేయఁగాసవరించు

జీవి జీవిఁ జంపి జీవికి వేయఁగా
జీవి వలన నేమి చిక్కియుండె
జీవ హింసలకుఁ జిక్కునె మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ!

జీవి పోక ముందె జీవ వస్తువు లిచ్చిసవరించు

జీవి పోక ముందె జీవ వస్తువు లిచ్చి
జీవి నిలుప వలయు జీవనముగ
జీవి తొలఁగు వెనుక జీవ వస్తువు లేల?
విశ్వదాభిరామ వినర వేమ!

జీవిఁజంపుటెల్ల శివభక్తి తప్పుటసవరించు

జీవిఁజంపుటెల్ల శివభక్తి తప్పుట
జీవు నరసిచూడ శివుఁడు గాదె
జీవుఁడు శివుఁడగును సిద్ధంబు దెలియరో
విశ్వదాభిరామ వినర వేమ!

జీవగుణము గల్గుజీవుండు బ్రహ్మంబుసవరించు

జీవగుణము గల్గుజీవుండు బ్రహ్మంబు
సాటివచ్చునెట్లు సరవితోడ
నూరికుక్క సింగమొకటి జేయురా
విశ్వదాభిరామ వినర వేమ!

జీవభేద మెఱిగి చెడిపోనివారికిసవరించు

జీవభేద మెఱిగి చెడిపోనివారికి
భావిజనుల చెలిమి పట్టుపడదు
ఈశ్వరునినెఱిఁగిన నెఱుగఁడీ జగమును
విశ్వదాభిరామ వినర వేమ!

జీవభావ మెఱుగఁ జెడ దెన్నటికి మదిసవరించు

జీవభావ మెఱుగఁ జెడ దెన్నటికి మది
దైవమును నెఱుంగఁ దనరుబుద్ధి
తేజ ముదయమందఁ దిమిరంబు నిలువదు
విశ్వదాభిరామ వినర వేమ!

జీవమేడ నుండు భావమెక్కడ నుండుసవరించు

జీవమేడ నుండు భావమెక్కడ నుండు
కాఁపురంబు లేడఁ గదిసియుండుఁ
దనరుచున్న రెండిస్థల మేల తెలియరు
విశ్వదాభిరామ వినర వేమ!

జీవలింగపూజఁ జేసినవారికిసవరించు

జీవలింగపూజఁ జేసినవారికి
శిలలరూపమందుఁ జింతయేల
చెలఁగి మధువు గ్రోలఁజేదు రుచించునా
విశ్వదాభిరామ వినర వేమ!

జీవిలోననుండు సిద్ధునిగానకసవరించు

జీవిలోననుండు సిద్ధునిగానక
తిరుగు నస్థిరంబు వరుసనమ్మి
స్థిరము నస్థిరమును దెలియ జీవికిముక్తి
విశ్వదాభిరామ వినర వేమ!

జీవసంజ్ఞ గలుగు జీవుని తత్వంబసవరించు

జీవసంజ్ఞ గలుగు జీవుని తత్వంబ
జీవపరుని గురుని జెందఁజేసి
తన్ను నిల్పువాఁడు తానె తత్వజ్ఞుఁడౌ
విశ్వదాభిరామ వినర వేమ!

జీవుని దెలిసిన దనుకనుసవరించు

జీవుని దెలిసిన దనుకను
దేవుని భ్రమఁ బొదలు నరుఁడు దేవుఁడు దలఁప
జీవుండని వివరించిన
భావింపగ ముక్తి బట్టబయలుర వేమా!
వేమన పద్యాలు
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |