ఘంటారావము మదిలోసవరించు

ఘంటారావము మదిలో
వింటిన్నే కంటఁగంటి విమలపుకాంతి
వెంటాడక బ్రహ్మంబును
గంటిని వగ కాదు నన్నుఁ గనుగొన వేమా!

ఘటము జలములందు గగనంబు కనఁబడుసవరించు

ఘటము జలములందు గగనంబు కనఁబడు
ఘటము జలము లేమి గగనమేది
ఘటములోన జ్యోతిఁ గ్రమమునఁ దెలియుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ!

ఘటముఁగాన్గఁజేసి కామ మెద్దుగఁజేసిసవరించు

ఘటముఁగాన్గఁజేసి కామ మెద్దుగఁజేసి
తెలిసి కర్మములను తిలలుఁ జేసి
తెలిసి గాను గాఁడు తిలకార కాత్మయు
విశ్వదాభిరామ వినర వేమ!వేమన పద్యాలు
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |