ఈ దేహ మన్నిభంగులఁసవరించు

ఈ దేహ మన్నిభంగులఁ
బ్రోచియు నొనరంగ నేలపోవుట కాదె
మీఁదెఱిగి మురికి గడుగను
భేదంబులు మాన ముక్తి బెరయుర వేమా!

ఈఁకె లండఁజేసి తోఁక లండలఁజేసిసవరించు

ఈఁకె లండఁజేసి తోఁక లండలఁజేసి
కోక లండఁజేసి కొఱఁతమాపె
నాకు లండఁజేసి నఖిల జంతువులకు
విశ్వదాభిరామ వినర వేమ!

ఈఁతకంటె లోతు నెంచంగఁ బనిలేదుసవరించు

ఈఁతకంటె లోతు నెంచంగఁ బనిలేదు
చావుకంటెఁ గీడు జగతిలేదు
గోచిపాతకంటె కొంచెంబు మఱిలేదు
విశ్వదాభిరామ వినర వేమ!

ఈకపట నాటకంబునుసవరించు

ఈకపట నాటకంబును
ఈకపటపుఁ జదువులన్ని యింపు దలిర్ప
ఏకపటాత్ముఁడు సేసెనొ
యాకపటాత్మునకు మ్రొక్కి యలరుము వేమా!

ఈతనువునందుఁ జూచినసవరించు

ఈతనువునందుఁ జూచిన
నేతనువుల కింతె యనుచు నెఱిగియుఁ దన్నుఁ
జూతురు నాలోఁ జూపున
నాతురమునఁ దపసులెల్ల నమరఁగ వేమా!

ఈదవచ్చు వేరుబాధ లేకుండనేసవరించు

ఈదవచ్చు వేరుబాధ లేకుండనే
యాది గురువులేక యందరాదు
సోదిచెప్పుటేల చొక్కిన మదిచూడు
విశ్వదాభిరామ వినురవేమ!

ఈశ్వరుని దలంప నేడుపాళ్లుగఁ జేసిసవరించు

ఈశ్వరుని దలంప నేడుపాళ్లుగఁ జేసి
తనదుమూర్తినెల్ల ధారఁబోసి
నిత్యకర్మములను నిలుచురా నెఱయోగి
విశ్వదాభిరామ వినర వేమ!

ఈషణత్రయంబు నెడపంగ నేరకసవరించు

ఈషణత్రయంబు నెడపంగ నేరక
మోహనరాశిలోన మునిఁగియుండు
జనుల కెట్టు మోక్షసౌఖ్యంబు గల్గును
విశ్వదాభిరామ వినర వేమ!



వేమన పద్యాలు
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |