బాల నీతి/సహవాసము
డిన గ్రమక్రమముగా జక్కగా బట్టువడును. కాని పెద్ద వారమైనతరువాత వినయమభ్యసింపవలననిన నంతగా బట్టుపడదు. "చెట్టైయొంగనిది మ్రానై యొంగునా?" కాన మనమీబాల్యదశనుండియే వినయ మభ్యసించుదము. అటుల నభ్యాసమొనర్చినయెడల సకలసంపదలు మనల జేరనపేక్షించుచుండును.
క. వినయమె కీరితినిచ్చుచు
వినయమె పృధులాభములను♦వేగమె కూర్చున్
వినయమెజగమున నన్నుతి
గనుగొనగాజేయుగాన♦గె
సహవాసము.
సహవాసమనగా గూడియుండుట. అనగా నొకని తో నొకడు కలిసియుండుటయే.
ఈసహవాసమువలన గీర్తియు, నపకీర్తియు, లాభము, నష్టము, మంచి, చెడు, కష్టము, గౌరవము, పరిభవము. మొదలగునవన్నియు సంప్రాప్తించు. మనమెటువంటివారలతో సహవాసము జేసిన నట్టిగుణము లలవడును. అనగా మనము దుర్జనులతో సహవాసముజేసినయెడల నపకీర్తియు, నష్టము, గష్టము, నవమానములోనగు చెడుగుణ ములు కలుగును. ఇక సజ్జనులతో సహవాసమొనర్చిన గీర్తియు లాభము, దు:ఖము, గౌరవము, మున్నగువానిని బొరయగలము. మనమితరునితో స్నేహమొనరించ దలచినయెడల ముందుగా వానికడవడి, బుద్ధి, వీనిని గమనించి యవి మంచివైమనకన్ననెక్కువసుగుణము లున్న, వానితోడ దప్పక చెలిమిచేయదగును. సమాన ముగానున్నను జేయవచ్చు తక్కువవానితో మాత్రము స్నేహము సేయగూడదు. జలము చవిటినేలలోబడిన నుప్పునీరగునటుల జెలిమిదుష్టులతో జేసిన దుర్గుణములుకలుగును. ఉదకము మంచిరేవడినేలలో బడిన మంచినీరగునట్లు చెలిమిశిష్టులతో జేసిన సద్గుణములు కలుగును.
మిక్కిలి బొక్కసముగలవాడు బీదవానితో జెలిమి జేయడు. అటులనె విద్యావంతుడు విద్యావిహీనునితో, రనశూరుడు భీరువుతో, మదారుడు లుబ్దునితో సహ వాసము జేయడు. ఇది లోకస్వాభావికము. మంచినీరు గలిగినమహానదులు నిందార్హమగు క్షారజలమునుగలిగిన సముద్రమున గలియుటవలన గదా యవికూడా క్షారజలముకలవియైనవి. అటులనే సత్పురుషులు దుర్జనులతో సహవాసము జేసిన కొలది దినముల కాకుమతులగుణములు వీరికిగూడ బట్టుబడును. కాన దుర్జనసహవాసము గర్హ్యము.
ఇక మనుజునకుసజ్జనుమిత్రత్వముతో సమాన మైనది వేఱొకటిమంచిదికానంబడదు. మఱియు దానితొసాటిగా నపశయముజేయునదియు లేదు. చూడుడు, మనము పాప కర్మముల నెక్కువగాజేయుచుండిన నాసమయమునం దీసజ్జనమిత్రుడు వారిదరిజేరి వారిమనమునకు బలు తెఱగుల బోధజేసి యాపాపపుబనులనుండి విముఖులనుగా జేయుచుండును. పుణ్యకార్యముల జేయ బ్రోత్సాహమొనరించుచుండును. వారిక్షేమము నకై యనేకవిధముల నాలోచించు చుండును. తపులనుదాచి యొప్పులను బ్రకటించుచుండును. వారెక్కువగా నుత్తలపాట్లుపొందుచున్నప్పుడీ సన్మిత్రుడు తన మిత్రులతోవచ్చి తనకుజేతనై నంతసహాయముజేసి మిత్త్రులచే జేయించి వారిని సుఖభాగులుగా జేయుచుండును. తమ మిత్త్రులకెట్టి విపత్తులువచ్చినను వానికిభయపడి సహవాసము జాలించుకొనక సహాయముజేయువాడే సన్మిత్త్రుడు. సుజనమైత్రి మొదట గొలదిగానుండి క్రమముగా వృద్ది జెందును. సుజనులుతాము ధనవంతులైనను విద్యా వంతులైనను సుగుణములనేప్రదానములుగా జేసికొని బీదవారలతోనైనను సహవాసమొనర్చ గలరు. వీరుసహవాసమొనరించినపిదప క్షీరనీరన్యాయముగా గలిసియుందురు. సుజనులు తమమిత్రులు మొదట నుచ్చదశలోనుండి దైవవశ మున నైచ్యపుదశకు వచ్చినను దానిని సరకుసేయక వారిని గౌరచించుచుందురు. కాబట్టియె "చెడి స్నేహితునింటికి బొమ్మను లోకోక్తి నేడు పుట్టినదికాదు.
ఇటుల దమమిత్త్రులు తక్కువవారై తలపక వారి సుగుణములనే ముఖ్యముగాజేకొని గౌరవించినవారు పూర్వులలో గొందఱు సుజనులుకలరు. వారిలో నొకని జెప్పెద.
కుచేలుడనునొకబ్రాహ్మణు డుండెను. ఈతడు బాల్యమున గాశిలో సాందీపులవారివద్ద శ్రీబలరామకృష్ణులతోడ విద్యాభ్యాసమొనరించెను. తదుపరి గొప్పవిద్వాంసుడాయెను. ఆసాందీపులవారి సమీపమున జదివికొనినదినముల నీబలరామకృష్ణకుచేలు రన్యోన్యమిత్త్రత్వముతో నుండిరి. అంతట వారివారి గృహములకుజనిరి. ఈకుచేలుడు మిక్కిలి పేదయైనను ధనాశచే యాచనకైతిరిగెడివాడు కాడు. భగద్భక్తుడు. తనకున్నదానితో సంతొషమందెడి వాడు. సగ్గుణంకులుకలవాడు. ఈతడొకసతీమణిని వివాహమాడెను. ఆమెవలన గ్రమముగా సంతాన మెక్కువగా గనెను. కాని యాకుచేలు డీసంసారమునం దంతప్రీతిగానుండెడివాడుకాదు. అందువలన నింటి సమాచారముల విచారించకుండ నుండెడివాడు. అట్లు తన పెనిమిటి యుందుటజూచి యాపిల్లలనూఱడించుచు దానన్నముజాలించుకొని యైనను నాబిడ్డలకు బెట్టుచుండెడిది. ఇటుల గొలది కాలమైనతరువాత నాపిల్లలు తమతల్లిని మంచిమంచి దుస్త్గులను, రుచ్యములగునాహారపదార్దములను దెచ్చియిమ్మని పలుతెఱగుల బాధింపజొచ్చిరి. అంతట నామె తనపిల్లలపోటుబడజాలక తపమును జేసికొను భర్తసమీపమునకరిగి యిటుల బలికెను. "నాధా! మీరాతపమునుజేసికొనుచు నింటిచిగిలి నంటించుకొనక పోతిరి. పిల్లలా ఇతరులబిడ్డలజూచి వారివలె మాకునుజేయు డని నన్నుదంటాలు పెట్టుచుండిరి. దారిద్ర్యమా యమితముగానుండె. నేనామీకుజెప్పునంతదానను గాకపోతిని. చెలిమియా మీకు శ్రీకృష్ణునితోడనయ్యె, కాన నార్తజనవత్సలుడగు నాకృష్ణునియనుగ్రహమున మనదారిద్ర్యమును బోగొట్టినన్నీభాధలనుండి తప్పింపు "డని దీనముగా బ్రార్దించెను. అంతట నాకుచేలుడు తనసతియొక్క దీనస్వరమునువిని తపముచాలించి "దారిద్ర్యముబాపుకొనుటకై భగవదవతారమును, నాబాల్యస్నేహితుడును నగు నాశ్రీకృష్ణుని సందర్శించి వచ్చెదను. రిక్తహస్తములతో నేగగూడదు. కాన పండో, పూవో, నీరో, యేదియోపుచ్చుకొనదగిన యొక వస్తువు ను దెచ్చి యి"మ్మని యడిగెను. అంత నామె సంతసమందుచు నటుకులనాతనిచినిగినయుత్తరీ యపు గొంగునగట్టి ముడివేసెను. అంతట నతడట నుండి బైలుదేఱి యాశ్రీకృష్ణమూర్తి యింటిబహిద్వార మును బ్రవేశించెను. అచటనుండి కావలివాండ్రందఱు చినిగిన బట్టలగట్టి సన్నగానుండిన యీకుచేలునిజూచి పకపక నవ్వుచుండిరి. అత్తఱి లోన శ్రీకృష్ణుడు తనప్రియు రాండ్రతో సరస సల్లాపములాడుచు దూగటుయ్యలపై నూగుచు సుఖంబుగానుండెడిసమయమున యాదృచ్చికముగా దనబాల్యస్నేహితుడగుకుచేలుని జూచెను.అంతటనుయ్యెలనుండి దిగి యెదురేగి యాతనిని గౌగిలించుకొని చేయిపట్టుకొని తీసికొని వచ్చి యాయుయ్యెలపై గూర్చుండ బెట్టి కుశలప్రశ్నములజేసెను. అత నాకుచేలుడు తన మనమున స్నేహితుడొనరించిన సపర్యకు సంతొషించి యానందబాష్పములవిడిచెను. అంత నిద్దఱు తాము గురునిసమీపమునజరిగిన సంగగులు జెప్పికొనుచు గాలముగడుపుచుండిరి. అంతగృష్ణుడు తనస్నేహితుడు తనసమీపమున కెందులకువచ్చినది తెలిసికొని "యాతనిమనొరధము సంపూర్ణముగా నెఱవేఱుగాక" యని స్నేహవత్సల్యమున "మిత్త్రమా! నెచ్చెలినని నాకేమైన కానుకదెచ్చితివా? యని యడుగుచు నతనియుత్తరీయమును బులుకుచు నొక కొంగున నటుకులుండుట జూచి ప్రీతితో దానందు గొంచెముతీసికొని మిగిలనవి తనసతులకిచ్చెను. అంతట నాకుచేలునికభ్యంగనస్నానంబుజేయించి మృష్టాన్నమిడి మంచిబట్టలనొసంగి యాతనిని బహుమానపూర్వకముగా వీడ్కొలిపెను.
పరికించితిరా! ఆశ్రీకృష్ణుడు సజ్జనుడగుటవలననె కదా యాకుచేలుడు బీదవాడనియు దనతో సమానుడుకాడనియు దలచక యెప్పుడో బాల్యమున జేసినస్నేహమునుమాత్రమే పురస్కరించుకొని యట్లాతనిని గౌరవించినది. ఆకుచేలుని నెంతసంతోషపెట్టేనో చూచితిరికదా? ఇటులనతడాకుచేలుసంతోషపెట్టుటకు గారనమేమి? బాల్యస్నేహమేకదా. కాబట్టి స్నేహముతో సమానమైన దింకొకటి మంచిది లేదని చెప్పవచ్చును. అందున సజ్జనసహవాసము ముఖ్యమూదుర్జనసహవాసము త్యాజ్యము. కావున మనము దుర్జనసహ వాసమువిడనాడి సజ్జనసహవాసముజేసి సుఖముల గూంచుచుండుము.
క. సత్యక్షమాదమంబులు
నిత్యపదంబునకు నెక్కు♦నిచ్చెన లవి సం
గత్యనుగతములు నత్సాం
గత్యం బమెగాన ముఖ్య♦కార్యముసుండీ.
(భారతము)
భూతదయ.
ప్రాబలయందు గనికరముగానుండుట. లేక వానిని బాధ బెట్టకుండ నుండుటయే భూతదయ యనబడు.
పైవిధమున నుండినవారలు కీర్తనీయులు. తదిత రులు నిర్దయులు. కాన దూషణీయులు. కావున నీలోకమున నుండుప్రతిపూరుషుడును దయదాల్చి యుండవలెను. "అహింసాపరమోధర్మ:" అనగా "నరుడితగుల బాధపెట్టకుండ నుండిటయే సర్వోత్కృష్టధర్మ మని నయశాస్త్రము నొక్కి చెప్పు చున్నది. ఇటుల జెప్పుచుండినను దీనిని లక్ష్యము చేయక కొందఱు దుర్మార్గు లితరుల బలు తెఱంగుల హింసించుచునే యున్నారు. నిర్దయ యనునది దుష్ట చిత్తునే వరించుచున్నది. నిర్దయగలిగిన యీకుమతి యితరులను హింసించు