106

బా ల నీ తి.

       చూచితిరా? ఆశ్రీకృష్ణు డాయుద్ధవుడు వచించిన రీతిగా నడచుట బట్టియేకదా తనపనుల రెంటిని నేక కాలమున సాధించుకొనుగలిగెను. తనయన్నపలికిన విధముననే చేసినయెడల దనపనుల నేకకాలమందిటు ల గొనసాగించుకొనగలడా? గించుకొనలేడు. కాబట్టియె, యిప్పటికాయుద్ధవుని "విమర్శక చూడామణి" యనియు, మహాపరాక్రమశాలియగు నా బలరాముని "సాహసికు" డనియు వచించుచున్నారుకదా. కాన మనము విమర్శనజ్ఞానము కలిగి యుండుదము. మనకు దెలియని విశేషసంగతులను సద్విమర్శకుల నడిగి వారు వచించినపగిది మనము నడచు కొందము. మనము విమర్శనగ్రంధముల గావించి లోకోపకారుల మగుదము.

క. మిత్త్రత్వము శత్రుత్వము
    బాత్రతయు నపాత్రతయు♦బరికించుచా
    రిత్రుడు చిరతరగణనా
    సూత్రికముగ దాననెల్ల♦శుభముల నొందున్

(భారతము)

వి వే క ము.

దేహమును నాత్మయును విభాగించు జ్ఞానమును, సుగుణ దుర్గుణములను విచారించుటయును వివేకమనబడు.

107

బా ల నీ తి.

     ఈవివేకము, స్వకీయములగు తప్పులను నగుపఱచి వానిని దిద్దుకొనునటుల జేయుచుండును. మఱియుబరకీయుల తప్పులగూడ సవరణజేయ బాటుపడుచుండును. ఇదియె యసాధ్యమగు నాపదనుండి రక్షించును. ఇదియెన్యాయాన్యాయ విచారణ జేయుచుండును. యిదియే యింద్రియ నిగ్రహత్వము సంపాదింపజేయును. ఈవివేకమె నీచ మార్గగతముల గుమనములను ద్రిప్పి వానిని సన్మార్గ యుతములుగా జేయును. ఇదియెసుఖదు:ఖసమదర్శి ఇదియె సచ్చిదానందమసర్గదర్శి. కాన మానవులకిది యాచరణీయంబు.
     ఈవివేకంబుకలిగినవారలను వివేకులనియనియె దరు. వీరు ప్రారంబించినపని యంతరాయములులేక చక్కగా నెఱవేఱును. వీరుపట్టినదియ బంగారమగు చుండును. అప్పట్టున వీరు గర్వించరు. మఱియు వినయముగా నుండుదురు. కాబట్టి వీరు జగజ్జన వంధ్యులు.
అనర్ఘంబగు నీవివేకము లేనివారలు విద్వదాదరణీయులు కానేరరు. ఎందువలననన? ఈ వివేకరహితులు దురాశాకులొంగుచుందురు. గర్వము ఖస్తుతులకు బాల్పడుచుందురు. తాము పట్టిన కుందేటికి మూడేకాళ్ళని వితండవాదము జేయు చుందురు. కయ్యమునకు గాలుద్రువ్వుచుందురు. యుక్తాయుక్త విచారణశూన్యులగుచుందురు. ఇవి యవియననేల? ఈవివేకశూన్యులు దుర్గునముల కెల్ల దల్లియిల్లువలె నుందురు. కాన వీరు జగన్నింద్యులు.
109

బా ల నీ తి.

     వివేకులు స్వయముగా బ్రతిచిషయమును జక్కగా బరిశీలిచి గ్రహించు చుందురు. దాన విశేషలాభములు కలవుగదా. ఇక వివేకదూరులన్ననో యటుల నొనరించుటకుపేక్షించుచుందురు. ఉపేక్ష జేయుట బహ్వనర్దదాయకముకదా. కాబట్టి మనము వివేకముకలిగియుండుదము, ఇది భావిభావుకసూచ కము. ఇది పూలనమ్మినయంగడినె కట్టెలనమ్మ నీయదు. ఈవివేకమువలన ననేకసుగుణములు పట్టువడును. మనమావివేకము కలిగియున్నయెడల దు;ఖములను బొందము. మనమొకవేళ హానిని బొందినను దీనిచేత దానినవలీలగా బోగొట్టుకొనగలము.  మనముదీనినలవరించుకొనుటకు సుజనసహవాస మొనరింపవలెను. వివేకము కల్గియున్నవారలు విశేష సౌఖ్యముల జెందగలరు.
    ఇటుల వివేకమున విశేషసౌఖ్యము జెందినవారలలో నొకనిని జూపుచున్నాను.
తొల్లి ధర్మరాజు నగుగురుతమ్ములతో గొండొక కారణంబున నరణ్యవాసము జేయుచుండెను. ఇటులుండ నొకసమయమున దననలుగురు తమ్ములకు దాహమాయెను. అంత ధర్మరాజు జలమునుదీసికొనివచ్చుటకై మొదట నకులుని బంపెను. అంత నానకులు డొకచెఱువుజొచ్చి నీరు ద్రాగుటతోడనే యచటనే పడిపోయెను. అంతట ధర్మరాజు "నకులుడుదకముదీసికొనియింకను రాకపోయెను. ఇది యరణ్యముకదా" యని భయ మందుచు నింకొకతమ్మునిబంపె

109

బా ల నీ తి.

ను. వాడటులనె రాకపోయెను. మరల మఱియొక తమ్ముని బంపెను. వాడటులనె రాకఫోయెను. మఱియు నింకొక్కతమ్ముని బంపించెను. వాడటులనె రాకఫోయెను. ఇట్లునలుగురుతమ్ములెంతసేపటికి సలిలమును దీసికొనిరాకఫోవుటాగాంచి ధర్మరాజుగూడ బయలుదేఱి యాచెఱువుదరి జేరెను. అచ్చట దన తమ్ములందఱు నిర్జీవులై పడియుండుటజూచి యధికముగా దు:ఖించుచు గారణమారయుచుండెను. ఇంతలో నాకసమునుండి "ఇచటబడియున్న వారందఱు చెఱువునకు నాయకుడనగు నాయనుజ్ఞ లేనిదే ప్రవేశించి యీవిధమున నైరి. కాన నీవైనను నేనడిగిన ప్రశ్నములకు సదుత్తరములనిచ్చి యిందు బ్రవేశించు" మను మాటలు కొన్ని శ్రవణగోచరము లయ్యెను. అంతట ధర్మరాజు మగుడ "సరే" యని యుత్తరమొసగెను. అంత దత్తటాకనాయకుడు ముప్పది రెండు ప్రశ్నముల నాధర్మనందను నడిగెను. వానికి దగిన యుత్తరముల ధర్మరాజు వచించెను. అంత నాచెఱువున కధిపతియగుయక్షు డాతని యుత్తరములకు మెచ్చి "ధర్మజ్ఞా! నీవు నీరుద్రాగుము. మఱియు నిచట బెద్దనిద్దురజెంది యున్న యీనలుగురిలో నొకనిని బ్రతికించగలను. కాన నీకిష్టుడెవదో చూచింఛు" మని యడిగెను. అంత ధర్మరాజు, నకులుని నాకిష్టుడని చూచించెను. అంత నాయక్షుడు బలవంతులగు భీమార్జునులను గోరక నకులుని గొరుటకు గతమే" మని యడిగెను. అంత ధర్మరాజు "మహాత్మా! కుంతీపుత్త్రు
110

బా ల నీ తి.

లమగు మామూపురలో నేనొకడనుంటిని. మీరు వచించిన పగిదిగోరిన మాద్రీపుత్త్రులలో నొకరుగూడ గన్పడరుకదా. అటులజేయుట వివేకిలక్షణమా?" యని చెప్పెను. అంత నాయక్షు డీతనివివేకమునకు మెచ్చి యతడుకోరకపోయినను నతనినలుగురు తమ్ములను బునర్జీవితులను చేసెను.

    కంటిరా! ఆధర్మరాజాయక్షుని బలవంతులగు  భీమార్జునులలో నొకరినిగోరక  సామాన్యుడగు నకులుని గోరినదేల? వివేకిలక్షణము కాబట్టియేకదా. ఆవివేకమునకే కదా మెచ్చి యాయక్షు డాధర్మరాజు కోరకపోయినను నతని నలుగురు తమ్ములను బ్రతికించినది. కాబట్టి యెవరైనను గష్టమువచ్చినను సుఖమువచ్చినను వివేకమును విడువకుండిరేని వారికి సకలసౌఖ్య్హములు చేకూరును. కాన మనము వివేకమునువిడువక కార్యాకార్యములను వివేకించు కొనుచు సుఖముగా నుండుదము.

ఆ.వె. విను వివేకమనెడి ♦ వింతగొడ్దలిచేత
       నల యవిద్య యనెడు ♦ నడవినఱికి
       తెలివియనెడుగొప్ప ♦ దీపంబుజేబట్టి
       ము కి జూడవచ్చు ♦ మొనసివేమ.