బాల నీతి/ముఖస్తుతి
77
బా ల నీ తి.
ము ఖ స్తు తి.
ముఖస్తుతియన నెదుట నిచ్చకపుముచ్చటలాడుట.ఈముఖస్తుతివలె మోహము జెందించున దింకొటి లేదు. ఈముఖస్తుతివలన ననేకకష్టములు బొందగలము. ముఖస్తుతినొనరించువార లితరస్దలము లయందు బ్రువ్వదిట్టుచుందురు. కాన వీరిని మనదరికి రానీయగూడదు. రానిచ్చినను వారియిచ్చకపు మాటలకు లొంగగూడదు. సామాన్యముగా నిటుల ముఖస్తుతిసేయువారలు తమకసాధ్యమగు నేదియో యొకగొప్పకార్యమును దలచుకొని వచ్చుచుందురు. ఆ కోరిక యీడేఱువఱకు నటుల నుతించు దుందురు. అటుతరువాత దూలనాడుటకుద్యమించు చుందురు. ముఖస్తుతిసేయువారలందఱు మోసగాండ్రన వచ్చును. కారణమేమన మనదగ్గఱ సకలజన మనోజ్ఞమగు నొకపదార్దమున్నదని యనుకొనుడు దానిని దాజేయు ముఖస్తుతివలన నపహరింప జూచుచుండును. మఱియు గొప్పవారలచే సత్కార మందుటకును ముఖస్తుతి సేయుచుందురు. లేక మోమాటమిచేతనైనను ముకస్తుతి సేయుచుందురు. ముకస్తుతి సేయువారలు, సామాన్య్లులగువారిని నింద్రినితో సమానమగుభోగముగ లవారినిగాను, లోభులగువారిని దానకర్ణులనుగాను, కురూపులను మరూపులుగాను, వేయేల? దుర్గుణములనన్నిటిని సుగుణములుగాను బరిగణించి స్తుతించుచు లేనిపోని గుణముల నన్నింటి నారోపించి ప్రోత్సాహము జే
బా ల నీ తి.
యు చుందురు. కడకు దామువచ్చినపనిని నివేదించి నెఱవేర్చుడని కోరుచుందురు. ఆసమయమున గొందఱు, వారోనరించిన ముఖస్తుతికుబ్బి తబ్బిబ్బుపడి వారిమాటకు మారుమాటాడనేరక వారుకోరిన పనిని దమసామర్ద్య మంతయు వినియోగించి కొనసాగునటుల జేయుచుందురు.
ఎటులైననేమి? పరొపకారము జేయుచుండిరికదా యని యనెదరేమో? కాని యటుల జేసినది సిష్ప్రయో జనమేయగును. కారణమేమన? ముఖస్తుతిజేయు వారలు సామాన్యముగా నుత్తములుగా నుండరు. కాన నిట్టివారల కుపకారమొనరించుట మంచిదికాదని చెప్పి యుంటినికదా.
ఎవరు మనయెదుట గైకోలుసేయుచు మనమాచరించని మంచిగొప్పపనులను మనము జేసినటుల నారొపించి ప్రియముగా సంభాషించు చుందురో వారావల మగుడ మనల నిర్లక్ష్యముగా జూచెదరు. కాని వీరిని శత్రువులుగా భావించుము. ఎవరు సద్భుద్దితో మనయెదుట మన మంచిగుణములదాచిపెట్టి దోషముల నెత్తిచూపించు చు వానికి బ్రతిక్రియల దెల్పుచు హితముపదేశించు చు మనల గొనియాడక కఠినముగా మాటలాడు చుండెదరో వారావల మనమంచిగుణముల బ్రకటించి మ్నమెక్కువ సత్కీర్తిజెందునటుల జేయుచుందురు. కాన వీరిని మిత్త్రులనుగా భావించుము.ఈయిద్దరిలోముఖస్తుతిజేయువానిపలుకులు మనకు జిలుకపలుకులుగా నుండును. కాని యటు తరువాత హీనదశ
79
బా ల నీ తి.
కు లొంగియుండవలసివచ్చును. ఇక ముఖస్తుతి సేయువారి పలుకులు మనకు ములుకులై పీడించు చున్నను తదుపరి నెక్కువనద్యశమొందునటుల జేయును. ఈముకస్తుతి నంగీకరించి ప్రవర్తించుచుంటి మేని మోసపొయి చెడకయుందుము. కాన నొకపరియైన నొకడువచ్చి మనముందట నిచ్చకపు మటలాడుచువచ్చిన వాని నావలకు దఱిమి "యిటుల నిక నాదగ్గఱ ముఖస్తుతిసల్పకు" మని హెతొపదేశము జేయవలెను.
ఇటుల ముఖస్తుతివలన మోసపోయి చెడినవారలు పూర్వులలో గొందఱు కలరు. వారిలో నొకరిని దార్కాణ ముగా జూపెద.మున్ను తారకాసురినివలన బాధలబదుచు దేవతలు హవిర్భాగములు లేకుండ నుండిరి. దీనిని దేవేంద్రుడుకాంచి తమకు వానిని నిర్జించుటకు శక్తిలేమిచే బ్రహ్మనురావించి తమబాధలు దెలియ పఱచి వానిని సంహరించుట కుపాయము చెప్పుడని వృచ్చించెను. అంత నాతమ్మిచూలి "ఇంద్రా! ఆతారకా సురుని జయించుట కీశ్వరునిపుత్త్రుడు తప్ప మన మెవ్వరముజాలము. కానాయీశ్వరునికి బుత్రోద్బవ మగునటుల నుపాయమాలొచింపు" మని యంతర్దానమాయెను. అంత నింద్రుడటులనె చిరికాల మాలోచించి తనభటునిచే విష్ణుకుమరుండగు మారుని రావించి ప్రత్య్లుత్దానపూర్వకంబుగ నుచితాసనంబిడి కుశలమును బరామర్శజెయుచు
బా ల నీ తి.
81
బా ల నీ తి.
పార్వతీదేవినిజేరి వాఱిద్దరినిగాంచెను. అంతదనవఖుడు చల్లనిగాలితోగూడికొనిన పుష్పపరిమళమెల్లెడ వ్యాప్తి జేయుచుండ దానాయీశ్వరునిపై నస్త్రముంబ్రయోగించు చుండ నది చేతినుండిజాఱెను. తిరిగి యాస్త్రము నతడు తీసికొని సమ్మోహనమను వస్త్రమును బ్రయోగించెను. వెంటనే యాయీశుడు "ఎవడిటులనాపై నస్త్రముం బ్రయోగించువాడు. నేనురుద్రుడనని యామదాంధునికి దెలియదుకాబోలు. నాతపము భంగముజెసె" నని రౌద్రముకలవాడై భ్రుకుటి ముడివడ మూడవనేత్రము ను విప్పి యాకసమున దేవతలందఱు "కోపముసంహరింపు డుపసంహరింపు" డను పలుకులు పలుకుచున్నంతలో నాయస్త్రమును బ్రయోగించిన మన్మధుని భస్మావశేషునిగా నొనరించెను.
చూచితిరా! ఆమన్మధు డటుల నాశనమగుటకు గారణమేమి? ఇంద్రుని ముఖస్తుతియేకదా? తనసఖీసఖులిరుగురు వద్దివద్దన్నను నాపని నొప్పుకొనుటకు గారణమేమి? ఇంద్రునిముఖస్తుతి యేకదా? కాబట్టి యెవరైన నిచ్చకపుముచ్చటల కిచ్చగింతురేని నిటులనే వారికి గీడులు మూడగలవు. కాన మనము ముఖస్తుతికి లొంగి యేపనిలోను బ్రవేశించకూడదు. ఆముఖస్తుతిసేయువానిపని మచిదా? లేక చెడ్డదా" యని విచారించి మంచిదైన యెడల సహాయముజేయవలయును. అంతియకాని ముఖస్తుతివలన లొంగి యె బా ల నీ తి.
క్కువగా నతడు చెప్పుదానియందున బ్రవేశించకూ డదు. ఈ విషయము జ్ఞాపకముంచుకొనుడు.
క.ఇచ్చకము భువిని వశ్యము
కుచ్చితమీలోకనింద♦కోవిదునకు నీ
తుచ్చమున హాని వచ్చును
మచ్చరమే తన్ను జెఱచు♦మహిలోనేమా!.
అ సూ య.
ఓర్వలేనితన మసూయ యనబడు.
మనుజున కీయసూయయుండిన నభివృద్దికి రానేరడు. జనసుతులైన నీయసూయనుగలిగి యున్నయెడల వారు నిందాపాత్రులు కాగలరు. తనతొసమానమైన వారల కొంచముచ్చదశకుబోయిన యెడల వారిని గాంచి లోలోపల గుందుచు సమయమునువేచి వంచింప జూచుచుందురు. ఇట్టి యసహనము కలిగినవారలన సహిష్టులని యనెదరు. ఒకడు మంచిని జేయుటయె లేక వాడు ప్రజలచే సంస్తుతినిబొందుచుండుటయొకాంచియశక్తి దుర్జనులై యింటిలోపల నొకమూలన గూర్చుండి పరితాపము జెందువారు కొందరసహిష్టులుకలరు. అటులవృద్ది బొందినవానిని బాహాటముగా నసహిష్టు తాలాపముల నాడుచుండెడివారు మఱికొందఱు గలరు.