వేమన పద్యాలు/ద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 90:
 
=== దానములను జేయఁ దన చేతులాడక ===
<poem>దానములను జేయఁ దన చేతులాడక
బహుధనంబుఁగూర్చి పాతిపెట్టు
తుదను దండుగ నిడు మొదలు చేర్చునరుండు
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దానములలో నన్నదానము దొడ్డది ===
<poem>దానములలో నన్నదానము దొడ్డది
గానములను సామగాన మెచ్చు
ధ్యానములను శివునిధ్యానము శ్రేష్ఠము
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దీపంబు లేని యింటను ===
<poem>దీపంబు లేని యింటను
రూపంబును దెలియలేరు రూఢిగఁ దమలో
దీపమగు తెలివి గలిగియు
పాపంబుల మఱుగుత్రోవఁ బడుదురు వేమా!</poem>
 
=== దోపునిచ్చువాఁడు తులలేని నెఱదాత ===
<poem>దోపునిచ్చువాఁడు తులలేని నెఱదాత
దోఁచుకొన్నవాఁడు ద్రోహి యయ్యె
ప్రాపుఁ జూపువాఁడు పరమపుణ్యుం డయ్యె
ప్రాపుఁజెఱచువాఁడు పశువు వేమ!</poem>
 
=== దొమ్మరీనిలంజతోఁ గూడ దోషంబు ===
<poem>దొమ్మరీనిలంజతోఁ గూడ దోషంబు
పాపియైన మనసుఁ బట్టరాదు
వీడు గదలిపోవ వెళ్లుదు రెటులనో
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దర్శనంబులందు ధర షణ్మతములందు ===
<poem>దర్శనంబులందు ధర షణ్మతములందు
వర్ణకాశ్రమముల వదల కెపుడు
తిరుగుచున్నవాఁడు ధరలోన నధముండు
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== ద్రోహబుద్ధినైన దొంగఱికమునైన ===
<poem>ద్రోహబుద్ధినైన దొంగఱికమునైన
నటననైన సాహసముననైన
సంపదధికునుండి సాధించి ధనమును
బడుగు కిచ్చి బాగుపడును వేమ!</poem>
 
=== ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి ===
<poem>ద్రోహియైనవాడు సాహసంబున నెట్టి
Line 109 ⟶ 144:
 
=== ద్విజవరుండు చెడ్డ పిండంబు దినఁబోయె ===
<poem>ద్విజవరుండు చెడ్డ పిండంబు దినఁబోయె
పేరటాలు మురువు పెండ్లిమొనసె
కులము మొదలుఁ బోయెఁ గూలెఁబో మానంబు
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== ద్విజుల ఖేదబెట్టి తిట్ట దొడగువాడు ===
<poem>ద్విజుల ఖేదబెట్టి తిట్ట దొడగువాడు
Line 116 ⟶ 156:
 
=== దేవపూజ సేయ దివ్యభోగము గల్గు ===
<poem>దేవపూజ సేయ దివ్యభోగము గల్గు
తత్వ మెఱింగెనేని దైవసముఁడె
యేమిలేనినరున కేగతిలేదురా
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దేవభూములందు దేవాలయములందు ===
<poem>దేవభూములందు దేవాలయములందు
దేవుఁడంచుఁ జెప్పి తెరువుఁజూపె
తెలియ విశ్వమెల్ల దేవాది దేవుఁడౌ
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దైవమతుల నరులు తమవంటివా రని ===
<poem>దైవమతుల నరులు తమవంటివా రని
యరసి గూఢతత్వ మరయ లేరు
ఇల్లు మూయఁబడిన నెట్లు మర్మ మెఱుఁగు
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== ద్వార బంధమునను తనయులు సంపద ===
<poem>ద్వార బంధమునను తనయులు సంపద
బంధువర్గ మెల్ల ప్రహరిగోడ
మూఢులైన నరులు మొక్కలి కాండ్రయా
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దేవుఁడనఁగ వేఱు దేశమం దున్నాఁడె ===
<poem>దేవుఁడనఁగ వేఱు దేశమం దున్నాఁడె
దేహితోడ నెపుడు దేహమందె
వాహనముల నెక్కి వడిఁదోలు మన్నాఁడు
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దేశదేశములను దిరిగిగాసిలినొంద ===
<poem>దేశదేశములను దిరిగిగాసిలినొంద
నాత్మయందు ధ్యాన మంటుకొనునె
కాసులకును దిరుగఁ గలుగునా మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దశయనంగ మెండుధన ముండుటే యండ్రు ===
<poem>దశయనంగ మెండుధన ముండుటే యండ్రు
Line 134 ⟶ 204:
 
=== దేశవేషములను తేటసేయక దేవుఁ ===
<poem>దేశవేషములను తేటసేయక దేవుఁ
=== దోసకారియైన దూసరికాఁడైనఁ ===
డాత్మలోన నుండ ననగిపెనగి
 
వేషమరసిచూడ గ్రాసంబు కొఱకయా
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దోసకారియైన దూసరియైనను ===
Line 144 ⟶ 216:
 
=== దోసముల్లువంటి తుర్యమం దాత్మను ===
<poem>దోసముల్లువంటి తుర్యమం దాత్మను
జూచి యాసలనటుతోచివేసి
వాసనను దెలిసినవాఁడెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దేహ యాత్మరూపు తేట తెల్లము జేసి ===
<poem>దేహ యాత్మరూపు తేట తెల్లము జేసి
Line 151 ⟶ 228:
 
=== దేహ సంకటమును దెగితేరకాండ్రకు ===
<poem>దేహ సంకటమును దెగితేరకాండ్రకు
మోహదృష్టి విడిచి మూల మెఱిఁగి
వ్యూహ మొక్కటిపన్ని యుల్లంబు సంధించి
స్నేహ మెఱుఁగ యోగ సిద్ధి వేమ!</poem>
 
=== దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి ===
<poem>దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి
మోహమందుఁ జిక్కి మోసపోఁడు
ఇంద్రజాలకుండు నెందుకుఁ జిక్కురా
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దేహాభిమాన ముండఁగ ===
<poem>దేహాభిమాన ముండఁగ
మోహాదులు జననవార్ధిముంచును కలగా
నీహా విషయభావన
కూహాదులు పోవు మేలుకొన్నను వేమా!</poem>
 
=== దేహము లెస్సగ నుండిన ===
<poem>దేహము లెస్సగ నుండిన
పోషణ తత్వంబులన్ని పొందుగఁ దెలియు
దేహము బడలికఁ బడినను
పోషణ తత్వములు వచ్చి పొందవు వేమా!</poem>
 
=== దేహియు జ్ఞానానలమున ===
<poem>దేహియు జ్ఞానానలమున
దాహంబై దేహ మెల్లఁ దల్లడపడ నా
దేహములోఁ బొర్లాడుచు
మోహమడచి శివునిఁ జూడ ముక్తిర వేమా!</poem>
 
=== దుండగీడు కొడుకు కొండీడు చెలికాఁడు ===
<poem>దుండగీడు కొడుకు కొండీడు చెలికాఁడు
బండరాజునకును బడుగుమంత్రి
కొండముచ్చునకును గోఁతియు సరియౌను
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దుష్టజనులగూడి తుంటరిపనులను ===
<poem>దుష్టజనులగూడి తుంటరిపనులను
Line 163 ⟶ 270:
 
=== దూరదృష్టిఁ గనరు దుడుకుడువదలక ===
<poem>దూరదృష్టిఁ గనరు దుడుకుడువదలక
 
బారప ట్టెఱుగరు పడినదనుక
దండసాధ్యు లయిరి ధర్మసాధ్యులుగాక
భూమిజనులు వెఱ్ఱిబుద్ధి వేమ!</poem>
 
=== దూరదృష్టిగనరు తూగినదనుకను ===
Line 172 ⟶ 282:
 
=== దూలములనుబోలు దురవస్థలనునెల్ల ===
<poem>దూలములనుబోలు దురవస్థలనునెల్ల
రోసి యాసలన్ని గోసివేసి
వాసనను దెలిసినవాఁడెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!</poem>
 
=== దూలాలు టెంకినుండిన ===
<poem>దూలాలు టెంకినుండిన
 
వాలాయము చేటు వచ్చు వసుమతిలోన
లోలాక్ష విడిచిపెట్టిన
మేలిమిగా బ్రతుకవచ్చు మేదిని వేమా!</poem>
 
=== దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు ===
"https://te.wikisource.org/wiki/వేమన_పద్యాలు/ద" నుండి వెలికితీశారు