పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/422

ఈ పుటను అచ్చుదిద్దలేదు

(తాంత్రిక స్వీకృత మతశాఖలవారిలో శైవులలోని సౌరపాత్రులు అయిన కౌలము, కాపాలికము, నాథము, శాక్తము, శాఖలు వైష్ణవులలోని కుమితి సోమసిద్ధాంతులు, పాంచరాత్రులు, సహజయానులు, ప్రముఖులు.

వామాచార తాంత్రికశాఖలలో కౌలము ప్రధానమైనది. దీనిని అనుసరించేవారు కౌలికులని Tais Cult అందరూ వ్యక్తీకరింప బడతారు. దత్తరీయగోత్రులయిన కౌలులకు కాశ్మీరము దీని అతిప్రముఖ వపము. 'కౌలము' అనే పారిభాషిక పదానికి మూలం అనిశ్చితంగా గోచరిస్తున్నది. "కుండలిని”కి, దాని ఉత్థాపనకు సబంధించిన కౌలినీ దేవతతోను, దానిలో ప్రవీణులయిన వీరులుగా వ్యవహరింపబడే కాలి, కౌలీనులను తెలిపే కులంతోను, తంత్రంమీద మతశాఖకు చెందిన విశ్వాసా వేమన (సమ్మఏముల సారె) మీద వ్యవహరించే తంతువాయుని వ్యక్తం చేసే కౌలికతోను, అనేక కౌల సిద్దాంతాల బీజాలను పొంది ఉన్న కౌలోపనిషత్తును అనుసరించేవారైన కౌలోపనిషదుల తోను ఉన్న కౌల సిద్ధాంతాలు కులార్ణవతంత్రంలో అధికంగా వివరింపబడ్డవి.

తాంత్రిక వేల (స్రోతస్సు) మహాశక్తిమంతమైనది. మహాయాన బౌద్ధం సైతం దీని ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయింది. తాంత్రిక ధర్మసంప్రదాయంలోని వామాచార పద్ధతికి కాలచక్రయానం, కామవజ్రయానం అన్న రెండు శాఖలున్నవి. యోగాచార విధానానికి క్రీ.శ. 4, 5 శతాబ్దాలలో పెషావరులో వర్ధిల్లిన అసంగ, వసుబంధులనే సోదరులు ఇద్దరూ ద్రష్టలు. వేలకొద్దీ ఆధార గ్రంథాలు Orthodox హిందువుల చేత, మహమ్మదీయుల చేత అగ్ని దగ్ధలు గావింపబడ్డప్పటికీ, వామాచారం అత్యధిక సాహిత్యాన్ని వహించి ఉన్నది. ఏ కారణం చేత అయితేనేమి, దానిలో అధికభాగం ఇంకా అనువదితం కాలేదు. తాంత్రిక ధర్మానికి చెందిన ఆధారగ్రంథాలలో కొన్ని అత్యధిక గూడార్థోపేతాలు. కృతప్రవేశులకు (విద్యోపక్రములకు) పరమ గహనాలు. మూల ప్రవచనాలన్నిటినీ మౌఖికంగా బోధించటము, ప్రవచనాల్లో ఒక భాగం మాత్రం గుహ్యభాషలో లిఖించటము, ఇందుకు ముఖ్య హేతువు. తంత్రగ్రంథాలన్నీ ఇతర గ్రంథ రచనలతో పోలిస్తే, ఆలస్యంగా లిఖింపబడ్డవి. అతిపురాతన తంత్రగ్రంథం క్రీ.శ. 5వ శతాబ్ది నాటిది.

అసంగుడివే అయిన గుహ్య సమాజ తంత్రము, ఉత్తర తంత్రము రెండు ప్రాచీనాలైన గ్రంథాలకు మూలాధారగ్రంథము క్రీ.శ. 750 నాటి మంజుశ్రీ మూలకల్పము. పరమ ప్రమాణాలైన మూలాధారగ్రంథములు క్రీ.శ. 9 మొదలు.

422 వావిలాల సోమయాజులు సాహిత్యం-4