పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/500

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భిక్షుకుడు : అవునని నేననుకుంటున్నాను.

బుధాదేవి : రక్షకభటా! ఇతణ్ణి వెంటనే రాజుగారి దగ్గరికి తీసుకోపద.

అమాత్యుడు : రక్షకభటా! రక్షకభటా!

(ప్రవేశిస్తాడు వేగంగా)

రక్షకభటుడు : (అసహ్యంతో) ఏయ్ అబ్బీ ఇలారా!

అమాత్యుడు : (గంభీర కంఠస్వరంతో) జాగ్రత్త - అతడొక్కడే నిక్కువముగ సంతోషస్వాంతుడుగ జీవితం సాగిస్తున్నాడు. కావున నతని నతిగౌరవముతో దేవరవారి సన్నిధికిం జేర్పవలయును -

(జనం - నవ్వుతారు - తెర)

కథకుడు : సంతోష స్వాంతుడు దొరకినాడు. ప్రతి స్వల్ప విషయమున నొక పండుగగుట ఆ దేశాచారము. రాజుగారికా భిక్షుకుని కేశములతో తాయెత్తు కట్టించుట యొక పండుగైనది. 'ప్రత్యేక సమితి'యును నట్టి సభకేతించినది - కాని యెవరి మొఖముననూ సంతోషమన్నది లేదు. చక్రవర్తి ముఖమున నవ్వు తొలకాడితే గాని యితరు లెవ్వరును నవ్వరాదు.)

5

సభ - రాజు రాణి సింహాసనము

అమాత్యుడు : (లేచి) మహాప్రభువు వారినీ సమయమున అత్యధిక సంతోష స్వాంతునితో పరిచయము చేసుకొనవలయునని దేశము అమాత్య ముఖమున కోరుచున్నది.

చక్రవర్తి - సంతోషము.

(భిక్షువును రాజభటులు ప్రవేశపెడతారు)

చక్రవర్తి : (భిక్షుకునితో) నీవు సంతోష స్వాంతుడవన్నమాట

భిక్షుకుడు : మానవుడెంత వరకు సంతోష మనుభవించటానికి వీలున్నదో అంతవరకు నేను సంతోష స్వాంతుడనే.


500

వావిలాల సోమయాజులు సాహిత్యం-2