భిక్షువు : ఎవరు నేనా?
బుధాదేవి : అవును నీవే?
(భిక్షుకుడు దగ్గరికి రాగానే) నీవు బాగా పాడుతుంటావు కదూ! డబ్బు ఎంత సంపాదించావు -
భిక్షువు : నేను డబ్బుకోసం పాడటం లేదు - పాడకుండా నా కంఠం ఊరుకోలేదు. ఒకప్పుడు నాకు అపార ధనముండేది. అది నన్ను అన్ని విధాలా నా సంతోషాన్ని చెరిచిందని దాన్ని త్యజించాను.
బుధాదేవి : ఇప్పుడు నీవు సంతోషంగా ఉన్నావా?
భిక్షువు : సమస్త విధాలా?
బుధాదేవి : అయితే నీకు ఇప్పుడేమి కావాలి?
భిక్షువు : నాకేమీ అవసరం లేదు.
బుధాదేవి : నీ జీవనోపాధి
భిక్షువు : నేను దానిని గురించి విశేషంగా ఆలోచించకుండానే జరిగిపోతున్నది.
బుధాదేవి : అయితే నీవు గొప్ప బాధ్యతారహితుడవన్నమాట?
భిక్షుకుడు : లోకం నన్ను గురించి ఏమనుకున్నా, ఏమన్నా నాకవసరం లేదు.
బుధాదేవి : నీకు స్నేహితులూ, బంధువులూ, భార్యాబిడ్డలూ, ఎవరైనా ఉన్నారా?
భిక్షుకుడు : లేరు
బుధాదేవి : అయితే నీవు కేవలం స్వార్థపరుడవన్నమాట.
భిక్షుకుడు : మీ ఇష్టం వచ్చినట్లు భావించవచ్చు.
బుధాదేవి : అయితే నీకు రాజదర్శన మిప్పిస్తాను.
భిక్షుకుడు : నేను ఇక్కడినుంచే నా కుటీరానికి వెళ్ళిపోతాను.
బుధాదేవి : అయితే... నీవు సంతుష్ట స్వాంతుడవన్నమాట.
ఏకాంకికలు
499