బుధాదేవి : లేదు - మీ ప్రత్యేక సమితి ఎంతవరకట్టి ప్రయత్నంలో కృతకృత్యత వహించింది.
అమాత్యుడు : ఈనాటి ఉదయముననే “యుర్ణముఖమున" శబ్దార్థము నిర్ణీతమైనది.
బుధాదేవి : "ఈ దేశ స్థితిని గురించి తెలుసుకోవలసిందంతా తెలిసిపోయింది. ఇక మీ దేశానికి వెళ్ళి పోతాను. రక్షకభటునితో ఈ మూకను దూరంగా నిలపమని ఆజ్ఞాపించండి.
అమాత్యుడు : రక్షకభటా
రక్షకభటుడు : చిత్తము
యుద్ధమొనర్చి గెలిచినవారు వాదమున గెలిచినట్లని తీర్మానమొనర్చెను”
(కథకుడు - నిష్క్రమిస్తాడు)
జయభేరీతో ఇరువురు భటులు
“అన్నా! చూడటానికి ఎంత చిత్రంగా ఉంది. యుద్ధభూమి దుమ్ము రవ్వంతైనా నేలమీద లేదు. అయితే ఆకాశపథంలో విహారం చేస్తున్నది. “మానసికులకు - శారీరులకు యుద్ధం ఎంత భయంకరంగా నున్నది.
(జన ఘోషలు) యుద్ధం ప్రారంభము జయభేరి మోగుతున్నది.
గొప్ప దెబ్బ వగైరా
భటుడు (జనాల్ని దూరంగా కొడుతూ ఉంటుంటే ఒక భిక్షుకుడు అతడి దెబ్బ లెక్క చేయడు)
బుధాదేవి : (రక్షక భటునితో ఆగక్కడ? ఎవరా మనిషి?
అమాత్యుడు : ఒక మలిన వస్త్రధారి. భిక్షువు మహారాజ్ఞీ?
బుధాదేవి : అమాత్యా! అతణ్ణి ఇక్కడికి పిలిపించు.
అమాత్యుడు : భటాధిపా! అతని కొరకొక భటశ్రేష్ఠుని నియమింప నాజ్ఞాపించుచున్నాను.
బుధాదేవి : అబ్బీ! ఇలారా!
498
వావిలాల సోమయాజులు సాహిత్యం-2