సుందరి యౌ నామె జూచి
ఆక్రమించి, లేపనాల,
స్వీకరించి ఆమె పాద
ములపై తన పాదమ్ముల
మోపి లేవనెత్తి కృష్ణు
డామె వంకరలను దిద్ది,
ప్రేమను జనియింపజేసి
సంయోగము నొంది ఉప
శ్లోకు డనెడి బిడ్డ నిచ్చి
సంతృప్తిని కలుగజేసె.
తపముచేసి బ్రహ్మలోక
మును పొందిన ఒకబ్రాహ్మణి,
బాలవితంతువును, రుచీ
కను సుందుని, ఉపసుందుని
సంహరింపవలసినపుడు
బ్రహ్మ తిలోత్తమగ సృష్టి
గావించెను. వారిరువురు
తమలొ తాము కలహముగా
వించుకొంటు మృతినొందే
టట్లు చేయమంచు వారి
కడకు నామె నంపినాడు.
తన విలాసవిభ్రమాల
కార్యసాధన మ్మొనర్చి
తిరిగి వచ్చినది ఆయమ.
సంతసించి పితామహుండు.
అతిలోత్తమకు సూర్యుని
రథముపైన స్థాన మిచ్చె
రవిరథశిల్పాల యందు
కనుపించే రమ్యమూర్తి
ఈ తిలోత్తమేను, కనుడు.
నవవిధభక్తులు ఇయ్యవి
పరీక్షిత్తు శ్రవణమ్మును
వైయాసిక[1] " కీర్తించుట,
ప్రహ్లాదుడు స్మరియించుట,
లక్ష్మిదేవి సంవాహన,[2]
పృథువు మహాపూజనమ్ము,
అక్రూరుడు అభినందన,
హనుమంతుడు దాస్యమ్మును
అర్జునుండు సఖ్యమ్మును
ఆత్మనివేదన మా బలి.
ఘంటాకర్ణుండు ధూప
మర్పిస్తే హరిహరరూ
పాన శివుడు ప్రత్యక్ష
మ్మైన, అతడు కేవలశివ
భక్తుడౌట హర్యర్ధ
మ్మయిన నాసికను మూయుట
లో రహస్య మెరుగదగును.
విద్యా సౌభాగ్య ధాన్య
ధన విరాళ కరుణా సం
తాన మహాలక్ష్ము లనెడి
వా రష్ట మహాలక్ష్ములు'
ఒక్కసారి సూర్యసుతుడు
రేవంతుడు ఉచ్ఛైశ్రవ
మెక్కిచేరె వైకుంఠము,
లక్ష్మికి సహజన్ము డౌట
ఆమె తదేకంగా ఉ
చ్ఛైశ్రవము చూస్తు ఉండి
పోయింది విష్ణువు ఆ
_________________________________________________________________________________
ఉపాయనలు
849