పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/841

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సంభాషణ సామర్థ్యా
నికి మౌన మలంకారము
అంగబలం లేనివారి
అర్ధబలం వ్యర్థముగద!
ఆలస్యం అయితే అమృ
తము సైతము విషమౌను
ఆత్మస్తుతి, పరనిందల
అవసరాల విడువరాదు
విత్త మనర్థపు హేతువు
అద్ది సుఖప్రదము కాదు
దిగ్విజయమ్మునకు నాత్మ
విశ్వాసమ్మే మూలము
జ్ఞానము, ప్రేమల కలయిక
యే పూర్ణత, ఆనందం
మన మనస్సె చిందరవం
దరగఉంటె మనము ఎలా
బైట శాంతి కాపాడగ
గల మన్నది పెనుసమస్య
ఏ సమస్యలను యుద్ధం
పరిష్కరింపగా జాలదు
ఆవేశం జలధివోలె
అతి చెవిటిది? అగ్నిలాగు
చురుకుగ వ్యాపించేది
గురువు అనుగ్రహము వల్ల
శిష్యులోని అజ్ఞాన
మ్మను చీకటి వేగంగా
పటాపంచ లవుతుంది.
ఆశయమ్ము మంచిది అయి
నప్పుడే అది ఆచరణము
లోనికి విచ్చేయటాన్ని
ఎవ్వరునూ ఆపలేరు.
తప్పు రెండు వైపులందు
ఉన్నపుడు ఘర్షణమ్ము
కడు ఘనముగ సాగుతుంది.
క్షమాగుణము అనునది బల
హీనుల కౌనట్టి బలము
బలవంతుల కాభరణం.
ఆవేశంతో కాక
ఆలోచనలతోటి వ్యవహ
రించువాడు దేవుడితో
తుల్యుండని పేరు పొందు.
అవివేకుల మతులలోని
అధికారం, కామోద్రే
కులచేతుల లోని ప్రేమ,
పిచ్చివాడి చేతిరాయి.

—♦♦♦♦§§♦♦♦♦—

48  ఓనారాయణదాస!
జ్ఞానదాన! మహాగాన!!
భగవంతుడు మన నిర్వుర
రక్షించుత! పోషించుత!
మన నిరువుర! ఇరువురమును
శక్తివంతులముగా నై
శ్రమియింతము గాత మనము
మన అధ్యయనము తేజో
వంత మ్మగుగాక! ఎపుడు
ద్వేషము లేకుండా ఇరు
వురమును మనియెదముగాక!
పాఠప్రవచనము చేసి

________________________________________________________________________________

ఉపాయనలు

841