నట్టి వంగవోలు సీమ
అందు కందుకూరు సమీ
పాన ఉన్న "సర్వదేవ -
అగ్రహార" మందు నిరం
తరమును శ్రీ భగవత్సే
వా తత్పరు లయిన వావి
లాలవారు, తెలుగునాటి
వైదికాగ్రగణ్యులయిన
వారు వసిస్తుండేవారు.
ఆ వంశములోని 'సదా
శివశర్మ'ను వేదశాస్త్ర
కోవిదుండు, అగ్నిష్టో
మమ్ము చేసి సోమయాజి
అయినాడు. ఆయన తన
పత్ని వలన నొక తొమ్మిది
మంది పుత్రులను పొందుట
వలనను “నవపుత్ర సోమ
యాజి" యయ్యె. విఖ్యాతితో
ఆయన - వంశమ్ము నందు
యజ్ఞమ్ముల నాచరించి
సోమయాజులైనవారు
ఎంతమందో ఉన్నారు.
అట్టి వారిలొ ప్రసిద్ధు
డయిన కృష్ణసోమయాజి
మనుమడిగా పుట్టినాడ
బహు విద్యా దానయాజి!
సోమయాజి యైన నేను
పెట్టు సోమయాజి నేను.
—♦♦♦♦§§♦♦♦♦—
9 నవ్య మార్గ సంవాసా
ఓ నారాయణదాసా!!
సంస్కారము నొందిఉన్న
సజ్జనవంశమ్ము నందు
పుట్టినానె గాని నేను
రెండేండ్లకే నా తండ్రిని
ప్రజ్ఞాన్వితు కోలుపోతి.
తల్లి ఎపుడు వ్యధనొందుచు
అస్వస్థత నుంటచేత
ఆప్తబంధువుల ఇండ్లకు
అప్పుడప్పుడేగి అచట
శ్రద్ధాభక్తులు వహించి
జ్ఞానార్జన చేయుచుంటి
అట్టి నాదు బాల్యదశను
నాకు వయసు పన్నెండేండ్లు.
అభ్యర్థన స్వీకరించి
రాయల ప్రాంతాని కేగి
పరమేశ్వర విద్యా వై
దుష్యమ్మును మేళవించి
కథాకథన మొనరించుచు
ప్రజ్ఞాప్రౌఢీశుల దివ్య
గాంధర్వకళా వైభవ
సంపత్తిని పంచి ఇచ్చి
ఆనందామృతము త్రావ
నబ్బజేసి సంతృప్తితో
విజయనగర మరుగుచున్న
వేళను మా గర్తపురీ
భక్తజనుల అభ్యర్థన
నాదరించి మా నగరికి
_______________________________________________________________________________
800
వావిలాల సోమయాజులు సాహిత్యం-1