నీదు స్వయంలేఖనాన్ని
నేను నమ్ముతున్నాను.
శారదగానే భావన
చేసి మ్రొక్కుతున్నాను.
నీవు 'స్వయంలేఖ' నాన
[1]అబ్జయోని జాయ ననీ,
[2]నాభీకమలుని సతినని
స్వయంజ్యోతి పత్ని ననీ,
శ్రీ జ్ఞాన సరస్వతి నని
శారద నని, భారతి నని
మృదులోక్తుల, మధుశక్తుల
చిత్ర చిత్ర విలసనలతో
తెలియ జెప్పుకున్నావు
'స్వయంలేఖ' నమ్ము నందు
స్ఫురియింపగ జేసి నట్టి
అంశమ్మును విశ్వసించి
శారదవను నమ్మికతో
అర్పించితినయ్య నీకు
సాష్టాంగ నమస్కారము.
—♦♦♦♦§§♦♦♦♦—
7 నారాయణదాస! నీవు
శారదావతారమ వని
నమ్మువారు నమ్ముతారు!
నమ్మువారు వేనవేలు!
నమ్మనివారా నమ్మరు
వారు ఎందరో ఉందురు!
ప్రతియుగాన లోకంలో
పరమేశ్వరు నవతారా
లను నమ్మిన యట్టివారు
నమ్మజాల యట్టివారు.
ఉంటూనే ఉంటారు.
శ్రీ హరి అవతారాల్లో
పరిపూర్ణమ్ములు రెండు
శ్రీరాముని అవతారం,
శ్రీ కృష్ణుని అవతారం!
ఈ రెంటినె నమ్మినట్టి
వారు జగతి నెంతొమంది,
నమ్మనివా రెంతొమంది
తొలుత నమ్మనట్టివారు
పిదప నమ్మువా రెందరొ
వాగీశ్వరివే నీ వని
నారాయణదాసు శార
దావతార మనీ జగము
నమ్మటములో నైనా
ఇట్టి అంతరాలుంటవి
అయితె, మీరు "శారదావ
తారు" లనెడివారి దేను
లోకంలో మేలు చేయి,
—♦♦♦♦§§♦♦♦♦—
8 సిరుల కాటపట్టు విద్య
లెల్ల పట్టినట్టి యిల్లు
[3]కర్మఠుల నివాసభూమి
జ్ఞాను లయినవారి కాల
వాలమ్మును, భక్తజనుల
కునికిపట్టు ముసీ క్షీర
నదీ గుండ్లకమ్మలు ప్రవ
హింపంగా, తృణజలకా
ష్ఠాది సమృద్ధిని వహించి
- ↑ అబ్జాయోని = పద్మమునందు పుట్టినవాడు
- ↑ నాభీకమలుడు = శ్రీమహావిష్ణువు నాభీ పద్మమైనవాడు - బ్రహ్మ
- ↑ కర్మఠులు = కర్మలనాచరించువారు
________________________________________________________________________________
ఉపాయనలు
799