ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

పంచమాధ్యాయము

199


రామములోని పద్య ముదాహరింపఁబడినది. అళియ రామరాజు సదాశివరాయని కాలములో కర్ణాట రాజ్యమును బౌలించుచుండెను. సదాశివరాయలు క్రీ శ.1540 పాంతమువాఁడు సోమభూపాలువకు సోమరామ రాజునకు మూఁడు తరము లంతగ ముందుటచే శ్రీధరునకును భూపాలుకును క్రీ. శ. 1465 ప్రాంతము వారగుదురు. శ్రీధరునకుఁ బూర్వపువాఁడగుటచే కవి క్రీ. శ. 1450 సంవత్సర ప్రాంతమున నుండియుండును. కవి తండ్రియగు తిష్పనయుఁ బ్రథమ హరిహర రాయల యాస్థానమునందుండ నొప్పు."

ఈ పై వాక్యములు తమ వ్యాసములోఁ బీఠిక భాగమున రాఘవాచార్యులుగారు పొందుపజిచి యున్నారు. ఇయ్యవి వీరు నిజముగా చరిత్ర మెఱీగి వ్రాసిన వాక్యములు గావు. మీదుమిక్కిలి కర్ణాట రాజ్యచారిత్ర పరిశోధకు లిట్లు ప్రాసినారని వ్రాయుచున్నారు. నే నెఱిగినంతవఱకి ట్లెవ్వరును వ్రాసి యుండ లేదు.

విజయనగర రాజుల సరియైన ప్రభుత్వ కాలము

మొదటి హరిహరరాయలు క్రీ.శ. 1336, మొదలుకొని, 1355 వఱకు వీరబుక్కరాయలు " 1355 " 1377 " రెండవహరిహరరాయలు 1377 " 1406 " మొదటి దేవరాయలు 1406 " 1422 " విజయబుక్క రాయలు 1422 " 1423 " రెండవ దేవరాయలు లేక ప్రౌడదేవరాయలు 1423 " 1447 "


మనకవి వల్లభరాయఁడు ప్రౌఢ దేవరాయల కాలములోనున్నవాడు. వీనితండ్రి మొదటి దేవరాయల కాలములో నున్నవాడు. ఈ పై విజయనగర రాజుల నామములు సరియైనవనియు, వీరి పరిపాలనాకాల