పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/215

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖగోళశాస్త్రము (ప్రాచీన భారతీయుల కృషి)

సంగ్రహ ఆంధ్ర

కల సంధికాల ముండుననియు, అందుచేతకల్పమనగా, వేయి మహాయుగములనగా 432 కోట్ల సంవత్సరముల ప్రమాణము కలది యని సైద్ధాంతిక మతము. కల్పాది యందు సృష్ట్యారంభము, కల్పాంతమందు ప్రళయము కల్గునని అభిప్రాయము. కల్పారంభమున గ్రహములు వాటి కక్ష్యలయొక్క పాత మందోచ్చ లను బిందువులన్నియు, అశ్వినీ నక్షత్రాది బిందువులో నున్నవని అప్పటి నుండి అవి వేరువేరు గతులలో పరిభ్రమించుచు. భిన్న కాలములందు భిన్న స్థానములలో నున్నవనియు సిద్ధాంతమతము. ప్రతి గ్రహమునకు కల్పములో ఇన్ని భగణములు అనగా (Revolutions) అని సిద్ధాంతములు చెప్పినవి. ఈ భగణసంఖ్యచేత ఆయా గ్రహముల యొక్క దినగతి చెప్పబడిన దన్నమాట. కల్పాదియందు వాటి స్థానము మనకు తెలియును కావున వాటి దినగతిని పురస్కరించుకొని కల్పాదినుండి నేటివరకు గతించిన దినసంఖ్య తెలిసికొని తద్వారా నేటి గ్రహముల స్థానము గణితముచేత తెలిసికొనవచ్చును. ఈ గణితమునే అహర్గణముచేత గ్రహసాధనమందురు. సిద్ధాంతములప్రకారము కల్పాదినుండి యిప్పటివరకు 6 మన్వంతరములు గతించి 7 వది యగు వైవస్వత మన్వంతరములో 27 మహాయుగములు గతించి 28వ మహాయుగములో కృతత్రేతా ద్వాపర యుగములు గతించగా నేటికి కలియుగములో ప్రథమపాదములో 5062 సంవత్సరములు గతించినవి. కల్పాదియందు గ్రహములేకాక వాటి కక్ష్యలయొక్క పాతమందోచ్చలన్నియు మేషాదియందు తుల్యత్వము నొందెననియు, అట్లే మహాయుగాదియందు, యుగాది యందు గ్రహములన్నియు మేషాదియందు తుల్యత్వము పొందుననియు సిద్ధాంతాభిప్రాయము. అనగా కలియుగ ప్రమాణమగు 4,32,000 సంవత్సరములు గ్రహముల యొక్క భ్రమణ కాలములనగా భగణ కాలములయొక్క “కనిష్ట సామాన్య గుణిజము" (L. C. M.) అని మనము తెలిసికొనవచ్చును. అనగా 4,32,000 సంవత్సరములలో గ్రహములన్నియు సంపూర్ణ భ్రమణములు (An Integral number of Revolutions) చేయునన్నమాట . ప్రభవాది సంవత్సరములు 60 అను వ్యవస్థకూడ నిట్టిదే. ఈ 60 సంవత్సరములలో రవి, బుధ, శుక్ర, చంద్ర, గురు, శని, కుజ, గ్రహములు, సంపూర్ణ భ్రమణము లించు మించుగా చేయును గావున ఈ వ్యవస్థ చేయబడినదని మన మూహింపవచ్చును.

నేటి ప్రజానీకములో కొన్ని ప్రాచీనాభిప్రాయములు కలవు. మహావిద్వాంసులు కూడ ఆ అభిప్రాయములు కలిగియున్నారు. ఈ అభిప్రాయములు సిద్ధాంతశాస్త్రమునకు విరుద్ధమైనవి. ప్రాచీన సిద్ధాంతములన్నియు ఏక కంఠముగా దృక్సిద్ధి కావలయునని, కోరినవి. దాని కుదాహరణము పైన చెప్పబడిన 'అమావాస్యాయాం యద హశ్చంద్రమసం నపశ్యంతి తదహః పిండ పితృయజ్ఞం కురుతే' యను వాక్య మొకటి పిండ పితృయజ్ఞమును నష్టేందువగు కుహూరమావాస్యయందు జేయవలసి యుండగా, దృష్టేందువగు 'సినీవాలి' అమావాస్యయందు చేయనగునా? కుహూస్సినీవాలి అమావాస్యలు దృక్సిద్ధములు కానిచో కర్మ చెడిపోవునుగదా! కావున కర్మఠులకు తప్పక పంచాంగశోధన మావశ్యక మైనది.

సూర్య సిద్ధాంతమున స్పష్టముగా 'గోళం బద్ధ్వా పరీక్షేత' అని చెప్పుటచేత మీ మీ కాలములందు దృక్సిద్ధి చేసికొనుడు. అని కవి హృదయము. శాస్త్ర మాద్యం తదే వేదం యత్పూర్వం ప్రాహభాస్కరః యుగానాం పరివర్తనే కాలభేదోత్ర కేవలః' అనుటచేత కాల భేదకృత సంస్కారము చేసికొనినగాని పంచాంగములు దృక్సిద్ధి కానేరవు. భాస్కరాచార్యుడు స్పష్టముగా 'దృక్సిద్ధి మానే వాగమః ప్రమాణం' అనుటచేత దృక్సిద్ధితోకూడిన శాస్త్రమే ప్రమాణము, సూర్య సిద్ధాంతముగూడ దృక్సిద్ధి సంపాదకములే కాకపోయిన విసర్జనీయమే యని చెప్పినాడు. లేనిచో సూర్యసిద్ధాంత ముండగా తిరిగి భాస్కరాదులు గ్రంథముల నెందుకు వ్రాయవలసి వచ్చినది? దక్షిణదేశమున మహాసిద్ధాంత మను పేరుతో, ద్వితీయార్య భటీయము, ఆంధ్రదేశమున సూర్య సిద్ధాంతము, ఉ త్తర దేశములో సిద్ధాంతశిరోమణి మొదలగు మతములు రూఢమై నేడు దృక్సిద్ధ మేదియో తెలియక దేశము భిన్న భిన్నములుగా విభజింపబడియున్నది.

ఇక మనము చారిత్రక కాల మని వ్యవహరింపబడు కాలమునుండి బయల్వెడలిన ఆర్యభటాదిగ్రంథములలో ఎట్టి గణితాంశములు కలవో విమర్శించెదము. ఆర్యభటా

172