పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/187

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్షీరసాగరము

సంగ్రహ ఆంధ్ర

బడినవి. నిజముగ ఇవి మాసికలుకావు. వీటియందును కొంత పదార్థమున్నది. అదియొక నల్లని మేఘముగా నేర్పడి, దాని వెనుకనున్న నక్షత్రముల కాంతి మనవద్దకు రాకుండ అడ్డుపడుచున్నది. అది నల్లగానుండి, కాంతి నిరోధకముగా నుండుటకు కారణము అచ్చటనుండు పదార్థములో దుమ్మువంటి పదార్థము కొంత కలిసియుండు టయే. ఇట్టి ధూళిపదార్థము క్షీరసాగరములోని ఇతర ప్రాంతములయందును ఉన్నదని నమ్ముటకు కొన్ని ప్రబల కారణములున్నవి. అచ్చటనుండు కాంతిని విశ్లేషించినచో ఇది స్పష్టమగును. ఇది కాక, నక్షత్రమునకును నక్షత్రము

చిత్రము - 37

క్షీరసాగరము

నకును నడుమనుండు ప్రదేశములో (Inter Stellar space) కొంత కాల్షియమ్, కొంత సోడియమ్ ఉన్నట్లు రుజువగును. అయితే, దీని సాంద్రత మన మూహించలేనంత స్వల్పముగ నుండును.

పైన వివరించినవిధముగా, చుక్కల గుత్తులు, నభోలములు, విడిచుక్కలు, బొగ్గుపంచులు మున్నగునవన్నియు చేరి, ఈ పెద్ద క్షీరసాగరముగా నేర్పడినది. ఇదియొక పెద్ద బండిచక్రమువలె నుండునని మొదటనే తెలుపబడినది. దీనిని అడ్డముగా అంచుమీదినుండి చూచినచో, ఈ పై చిత్రములోని విధముగ కన్పించును.

బండిచక్రమునకు నడుమ కుండ ఉన్నట్లుగానే, దీనికిని మధ్యభాగమున నక్షత్రములును, నక్షత్రగుచ్ఛములును ఎక్కువగనుండి, మధ్యప్రదేశమున మంద మెక్కువగ నుండును. పైపటములో చుక్కలుగా గుర్తుపెట్టబడినవి ఈ క్షీరసాగరములో నుండు కొన్ని చుక్కలగుత్తులే. ఇట్టి చుక్కలగుత్తి యొకటి X అను గుర్తుగలచోటనున్నది. సూర్యుడు ఈ గుచ్ఛములోనివాడే. ఇతడు పటములో చూపబడినట్లు ఈ గొప్ప చక్రమునకు కేంద్రమున నుండక, ఒక ప్రక్కకు తప్పుకొని యున్నాడు. సూర్యుని దూరము దీని కేంద్రమునుండి సుమారు 30 వేల కాంతి సంవత్సరములు. మనకు కనిపించు ముఖ్య నక్షత్రముల దూరములను దీనితో పోల్చినచో ఇవి యన్నియు ఒక గుచ్ఛముగా నున్నవనుట స్పష్టమగును. క్షీరసాగరముయొక్క వ్యాసము సుమారు 1 లక్ష 20 వేల కాంతి సంవత్సరములు. మందము 20 వేల కాంతి సంవత్సరములు, దీనికేంద్ర మెచ్చటనున్నదో చూడవలె నన్న, X గుర్తుపెట్టిన చోటినుండి 'ఇ' అను గుర్తుదిశలో చూడవలెనుగదా ! ఇతరదిశలో కంటె ఈ దిశలో చూచినచో, ఎక్కువ సంఖ్యగల నక్షత్రములు దృష్టిపథమునకు వచ్చుననుట విశదము. కావున ఆకాశమున ఈ క్షీరసాగర కేంద్రము ఏదిక్కుననున్నదో చూడవలెననిన, వీటిలోని నక్షత్రములు అతిసాంద్రముగ ఏ దిక్కున నుండునో ఆ దిశలోనే దీనికేంద్రము ఉండవలెననుట స్పష్టము. ధనుస్సు రాశిలోని క్షీరసాగరము సాంద్ర

144