పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/9

ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి కర్ణం: 22 + 17 + 89 + 11 = 139

రెండవ కర్ణం: 87 + 9 + 24 + 19 = 139

“అబ్బే! ఇందులో వింతేముంది? ఈ రకం చదరాలు ఇంతకు ముందు చూసేం” అని మీరు పెదవి విరచే లోగా మరికొన్ని విషయాలు చూడండి.

ఇప్పుడు నాలుగు మూలలో ఉన్న సంఖ్యలని కూడండి.

మూలలు: 22 + 89 + 19 + 11 = 139

ఇంకా కావాలా? ఏ ఉపచదరంలో సంఖ్యలని కూడినా 139 వస్తుంది.

మధ్య ఉపచదరం: 17 + 9 + 24 + 89 = 139

ఈశాన్య ఉపచదరం: 18 + 87 + 9 + 25 = 139

నైరుతి ఉపచదరం: 10 + 24 + 19 + 86 = 139

ఆగ్నేయ ఉపచదరం: 89 + 16 + 23 + 11 = 139

వాయవ్య ఉపచదరం: 22 + 12 + 88 + 17 = 139

మరి రెండు చదరాలు మిగిలిపొయాయి. అవేమిటో గుర్తుపట్టి చెప్పగలరా? ఈ చదరం ఉన్న కాగితాన్ని అడ్డుగా చుట్ట చుడితే పైనున్న రెండు గదులు, కిందనున్న రెండు గదులు కలిసి -