పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/74

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమస్య చెప్పేసి పారిపోతే ఏమి మర్యాదగా ఉంటుంది? పరిష్కారానికి దారి కూడ చూపుతాను. ఏ పుట్టలో ఏ పాము ఉందో?

అంచెలంచెల మీద లోతుకి తీసుకు వెళతాను. గణితంలో సంప్రదాయికంగా వాడే సంకేతాలతో పరిచయం ఒక మోతాదు, కలన గణితంతో పరిచయం ఒక మోతాదు, ఉత్సాహం ఒక మోతాదు ఉంటే నేను చెప్పేది అర్థం చేసుకుందుకి పెద్దగా పాండిత్యం అక్కరలేదు. సమస్య అర్థం అయిన తరువాత, దానిని పరిష్కరించి, మిలియను డాలర్లు కొట్టేయడానికి కొంచెం లోతుగానే పాండిత్యం ఉండాలి (బొమ్మ 10.1 చూడండి).

బొమ్మ 10.1 రీమాన్ వెలిబుచ్చిన శిష్టాభిప్రాయం యొక్క ప్రాముఖ్యతని గుర్తిస్తూ డేవిడ్ హిల్బర్ట్ ఉటంకించిన అభిప్రాయం. (రీమాన్ వాడిన 'హైపాథసిస్‌' అన్న మాట నేను వాడుతున్న 'కంజెక్చర్‌' అన్న మాట దరిదాపుగా సమానార్థకాలే)

10.1 చారిత్రక నేపథ్యం

రీమాన్ గురించి ఒక మాట. రీమాన్ (Georg Friedrich Bernhard Riemann, September 17, 1826 – July 20, 1866) తన 28 వ ఏట, అనగా 1854లో, చేసిన ప్రసంగాన్ని ఆధారంగా చేసుకుని అయిన్‌స్టయిన్ తన సార్వత్రిక సాపేక్ష సిద్ధాంతం (General Theory of Relativity) అనే మహా సౌధాన్ని లేవనెత్తేడు. గణితంలో రీమాన్ అంతటి దిట్ట. అదే