పుట:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf/60

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్నతనంలోనే వికసించి పరిమళించేరు. ఒక గౌస్ అనండి, ఒక గేల్వా అనండి, ఒక రామానుజన్ అనండి, ఒక మంజుల్ భార్గవ అనండి – వీరంతా పాతికేళ్లు నిండే లోపునే ప్రపంచ ప్రఖ్యాతి పొందేరు. ఉదాహరణగా 1985 లో తీసిన ఈ దిగువ ఫొటోలో (బొమ్మ 8.1 చూడండి) కొమ్ములు తిరిగిన పాల్ ఎర్డిష్ (Paul Erdős) కేవలం 10 ఏళ్ల టెరెన్స్ టావ్ (Terrance Tao) తో గణితంలో ఎదురయే ఒక సూక్ష్మాన్ని చర్చిస్తూన్న దృశ్యం చూడండి. దరిమిలా, 2007 లో, టావ్ కి, అతను సంఖ్యాశాస్త్రంలో చేసిన పనికి గుర్తింపుగా, ప్రతిష్ఠాత్మకమైన ఫీల్డ్స్ మెడల్ (Fields Medal) వచ్చింది. ఈ బాల మేధావి ఇప్పుడు కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం, లాస్ ఏంజిలిస్ లో, ఆచార్య పదవి అలంకరించి ఉన్నాడు.

బొమ్మ 9.1 ఎర్దిష్ తో దీర్ఘ చర్చలో ఉన్న బాల టెరన్స్ టావ్